శ్రీశైలం నుంచి నీటి విడుదల
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్‌కు విద్యుత్ ఉత్పాదన అనంతరం 34063 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 10.157 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 6.090 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. లోడ్ డిశ్పాచ్ ఆదేశాల మేరకు రెండో పవర్‌హౌస్‌లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. హంద్రీనీవా సుజల స్రవంతికి, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం జలా«శయంలో 57.3866 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 836.90 అడుగులుగా నమోదైంది.