
హుజూరాబాద్: ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలకు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని కోరితే సమాధానం చెప్ప కుండా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖం చాటేస్తున్నా రని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. బుధవారం హుజూరాబాద్‌లోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హుజూరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరినా ఈటల స్పందించకపోవడం తన తప్పును అంగీకరించినట్లేనని స్పష్టం చేశారు.
5న హుజూ రాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద నియోజకవర్గ ప్రజల మధ్యే అభివృద్ధిపై చర్చ పెట్టుకుందామన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జెడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment