
హుజురాబాద్: టీఆర్‌ఎస్ నేత కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్‌కు రేవంత్ ప్యాకేజీ ఇచ్చారని కౌశిక్ విమర్షించారు. ఎన్నికల తర్వాత ఈటల కాంగ్రెస్ గూటికి వెళ్తారంటూ కౌశిక్ రెడ్డి జోస్యం చెప్పారు.
సీఎంకు ఈటల అంటే ఏంటో అర్థమైంది: ఈటల
హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలకు కేసీఆర్ ఎన్ని ఇస్తున్నా.. వారు తన వెంట ఉన్నారని దీంతో సీఎంకు ఈటల అంటే ఏంటో అర్థమైందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్ మండలం రాంపూర్‌లోని వడ్డెర కాలనీ వాసులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో పేదిరకం, కన్నీళ్లు ఇంకా పోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 18ఏళ్లు కేసీఆర్ అడుగు జాడల్లో నడిచినప్పుడు తమ్ముడు అని చెప్పి.. ఇప్పుడు దెయ్యం ఎలా అయ్యాడని ప్రశ్నించారు. అనంతరం పలువురు యువకులు బీజేపీలో చేరగా పార్టీ కండువా కప్పి ఈటల ఆహ్వానించారు.
చదవండి: వరంగల్ కుటుంబం హత్య: చావాలనుకున్నాడు.. చంపాడు!
Comments
Please login to add a commentAdd a comment