eatala rajender
-
కాంగ్రెస్ ప్రభుత్వంపై గవర్నర్ కు కంప్లైంట్ చేసిన ఈటల రాజేందర్
-
ప్రభుత్వమే పేదలకు ఇచ్చిన ఇండ్లు అక్రమం ఎలా అవుతాయి
-
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఊహాజనితం
సాక్షి, హైదరాబాద్: ‘బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఊహాజనితం, అది జరగదు’అని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. ‘ఇది కాంగ్రెస్ విషప్రచారం. బీజేపీలో అలాంటి చర్చ లేదు. దీనిపై పార్టీలో ఎలాంటి ప్రస్తావన లేదు’అని తెలిపారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈటల స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రుణమాఫీ పూర్తిగా జరిగిందని ప్రభుత్వం ప్రకటించడం బక్వాస్, బుకాయిస్తున్నారు’అని మండిపడ్డారు. ‘అబద్ధపు ప్రచారంతో రుణమాఫీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు.రుణమాఫీ పూర్తిగా కాలేదని దమ్ముంటే ఒప్పుకోవాలి. బ్యాంకర్ల లెక్కల ప్రకారం రూ.72 వేల కోట్ల వరకుÆ రుణమాఫీ చేయాల్సి ఉండగా.. ఎన్నికల ముందు రేవంత్ రూ.63 వేల కోట్లు అని హామీఇచ్చారు. విధివిధానాల పేరుతో ఆ మొత్తాన్ని రూ.34 వేల కోట్లకు కుదించారు. ఇప్పుడు 22 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసి, పూర్తి చేశామని చెప్పుకుంటున్నారు. ఒక్క ఘట్కేసర్ సొసైటీలోనే 1,200 మంది రైతులకు రూ.9 కోట్ల రుణాలలో ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు.కానీ వందలకోట్ల ప్రజాధనంతో కేసీఆర్ తరహాలోనే ప్రచారాలు చేసుకుంటున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’అని ఈటల ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం, ఉన్నతాధికారులు హంగామా చేస్తున్నారని ఆయన విమర్శించారు. ‘హైడ్రా పేరుతో జరుగుతున్న డ్రామా ఆపాలి. ఎఫ్టీఎల్లో ఉన్న పట్టాభూముల్లో నిర్మాణాలు కూల్చవద్దు. నీళ్లు రాకుండా ఏర్పాటు చేయాలి. చిత్తశుద్ధి ఉంటే ఇకపై నిర్మాణాలు జరగకుండా చూడాలి. అక్రమకట్టడాల విషయంలో కఠినంగా ఉంటాం అని చెప్పుకుంటున్నారు. వాళ్లు ఏమి చేస్తున్నారో ఆ చిట్టా మా వద్ద ఉంది. డ్రామాలు ఆపితే మంచిది’అని ఈటల రాజేందర్ హెచ్చరించారు.రక్షాబంధన్ కార్యక్రమానికి గవర్నర్‌కు ఆహ్వానం: ఈనెల 18న ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు ఉప్పల్ భగాయత్‌లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న రక్షాబంధన్ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఈటల రాజేందర్ ఆహ్వానించారు. -
TS: ‘జేపీఎస్‌ల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైంది’
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నారు. ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 29 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు వెంటనే విధుల్లో చేరాలని లేనిపక్షంలో ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తప్పిస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. దీంతో, వారికి మంగళవారం సాయంత్రం 5గంటలలోపు విధుల్లోకి చేరాలని గడువు ఇచ్చింది. ఈ క్రమంలో జూనియర్ సెక్రటరీలకు ప్రతిపక్ష నేతలు మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు. తాజాగా జేపీఎస్‌ల సమ్మెకు కరీంనగర్లో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘డిమాండ్ సాధన కోసం సమ్మె చేస్తే నోటీసులివ్వడం దుర్మార్గం. ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న కేసీఆర్ వేతనాలు ఎందుకు పెంచడం లేదు. వెంటనే జేపీఎస్‌ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి’ అని సీరియస్ అయ్యారు. మరోవైపు, జేపీఎస్‌ల సమ్మెపై టీపీసీసీ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులర్ చేయాలని లేఖలో పేర్కొన్నారు. జేపీఎస్‌ల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైందన్నారు. జేపీఎస్‌లతో గొడ్డు చాకిరీ చేయించుకుని వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇది కూడా చదవండి: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి! -
మరి బండి సంజయ్‌కు ఆత్మసాక్షి లేదా?.. కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వేదికగా మరోసారి పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్‌పై కాంగ్రెస్ నేత మల్లు రవి సీరియస్ కామెంట్స్ చేశారు. ఈటల రాజేందర్ మాట్లాడిన తీరు అభ్యంతరకరమని ఆయన అన్నారు. కాగా, మల్లు రవి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని రాజకీయ వేదిక చేసి గుడి చుట్టూ రాజకీయాలు నడిపింది బీజేపీ కాదా?. యాదగిరిగుట్టలో తడిబట్టలతో ప్రమాణం చేసినప్పుడు బండి సంజయ్‌కు ఆత్మసాక్షి లేదా?. కాంగ్రెస్‌పై చేసే ఆరోపణలకు ఆధారాలు ఉండవు. రాజకీయం కోసం అబద్ధాలతో గడుపుతున్నారు. బీజేపీ నేతలు చేసే ప్రతీ ప్రకటన అబద్ధాలతో కూడుకున్నది. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు గత పదేళ్లుగా నడుస్తున్నవే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా, అంతకు ముందు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. ఈటల మాట్లాడుతూ.. ధీరుడు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోడని సెటైర్లు వేశారు. అసలు రేవంత్‌తో తనకు పోలికేంటి అని వ్యాఖ్యానించారు. ఓటు నోటు కేసులో మీరు జైలుకెళ్లారు.. మీతో నాకు పోలికా? ప్రజల కోసం రేవంత్ ఎప్పుడూ జైలుకెళ్లలేదు. నేను విద్యార్థి దశ నుంచే ఎన్నో పోరాటాలు చేశాను. రేవంత్ ప్రమాణం చేస్తే ఎవరూ నమ్మరు.' అని ఈటల ఫైర్ అయ్యారు. కాగా, మునుగోడు ఉపఎన్నికలకో కాంగ్రెస్‌కు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని ఈటల ఆరోపించిన విషయం తెలిసిందే. -
‘ఓటుకు నోటు వ్యవహారంపై రేవంత్ ప్రమాణం చేస్తారా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటున్నారు. కాగా, మునుగోడు ఎన్నికల్లో సీఎం కేసీఆర్.. కాంగ్రెస్‌కు రూ. 25కోట్లు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపణలు చేశారు. దీంతో, ఈటల తన ఆరోపణలు నిరూపించుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద ప్రమాణానికి రేవంత్ సిద్దమయ్యారు. కాగా, భాగ్యలక్ష్మి ఆలయానికి ఈటల రావాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత డీకే అరుణ స్పందించారు. తాజాగా డీకే అరుణ మాట్లాడుతూ.. ఓటుకు నోటు వ్యవహారంపై రేవంత్ ప్రమాణం చేస్తారా?. ఈటల రాజేందర్ చెప్పింది నూటికి నూరు శాతం నిజం. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ సహకరించింది. దుబ్బాక ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటైన మాజ నిజం కాదా? వాస్తవం చెబితే రేవంత్‌కు ఎందకంత ఉలికిపాటు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్.. భాగ్యలక్ష్మి గుడికి రావొద్దని ఫైర్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ గత చరిత్ర ప్రజలందరికీ తెలిసిందే. పబ్లిక్‌లో రేవంత్‌కు బ్లాక్ మెయిలర్ అనే పేరుంది. రాజకీయాల్లోకి వచ్చాక పదవులను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు దోచుకున్న రేవంత్ ఇప్పుడు భాగ్యలక్ష్మి గుడి వద్ద ప్రమాణాలంటే నమ్మేదెవరు?. లెక్కలేనన్ని తప్పుడు పనులు చేస్తున్న రేవంత్ భాగ్యలక్షి గుడిలో అడుగు పెడితే, ఆ దేవాలయం అపవిత్రం అవుతుందనేది భక్తుల భావన. ఈటల రాజేందర్, నేను ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారామే కానీ నీ మాదిరిగా ఒక పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవితో మరో పార్టీలో చేరలేదని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలకు డబ్బులు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుకున్నాడు. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితతో కలిసి వ్యాపార లావాదేవీలు చేసింది వాస్తవం కాదా?. ఆమెతో నీకు వ్యాపార భాగస్వామ్యం లేదా, ఓటుకు నోటు కేసులో లక్షల రూపాయల నోట్ల కట్టలతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికి జైలుకు వెళ్లిన చరిత్ర రేవంత్‌ది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, బీజేపీ నేతల ఆరోపణలపై కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి స్పందించారు. తాజాగా స్రవంతి మాట్లాడుతూ.. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ రూ.25 కోట్లు ఇస్తే ఏం చేస్తున్నారు?. బీజేపీలోకి చేరికలు లేకపోవడంతో ఈటల రాజేందర్ ఆవేదనలో ఉన్నారు అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. -
సింగరేణిపై చర్చకు రెడీ.. దమ్ముంటే రండి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి విషయంలో ఏ వేదికపై అయినా చర్చకు తాము సిద్ధమని, బీఆర్ఎస్ నేతలకు నిజాయతీ ఉంటే ముందుకు రావాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ చేశారు. ప్రధాని మోదీ రూ.11 వేలకోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర పర్యటనకు వస్తుంటే.. సింగరేణిపై బీఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారానికి దిగారని ఆరోపించారు. ప్రధాని పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునివ్వడాన్ని తప్పుపట్టారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, విజయశాంతి, ఏనుగు రవీందర్‌రెడ్డి, అశ్వత్థామరెడ్డి, ఎన్వీ సుభాష్ తదితరులతో కలసి ఈటల మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేతకానితనాన్ని పక్కవారిపైకి నెట్టడం అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రధాని స్పష్టత ఇచ్చినా అదే తీరా? రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించిన సందర్భంగా సింగరేణి విషయంలో ప్రధాని మోదీ స్పష్టతనిచ్చారని ఈటల చెప్పారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువగా 51 శాతం వాటా, కేంద్రానికి తక్కువగా 49 శాతం వాటానే ఉన్నప్పుడు.. కేంద్రం ఎలా నిర్ణయం తీసుకోగలుగుతుందని మోదీ ప్రశ్నించారని గుర్తు చేశారు. అయినా బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారానికి దిగుతున్నారని మండిపడ్డారు. గనుల పాలసీకి బీఆర్ఎస్ మద్దతిచ్చి కూడా.. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం గనుల కేటాయింపుతో రూ.లక్షా 86 వేల కోట్ల నష్టం జరిగిందని కాగ్ రిపోర్ట్ ఇవ్వడం.. 216 గనుల కేటాయింపులను రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతోనే మోదీ సర్కారు 2015లో గనుల చట్టాన్ని సవరించిందని ఈటల గుర్తు చేశారు. దానికి అప్పుడు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. కొత్త చట్టం ప్రకారమే దేశంలో బొగ్గుగనుల కేటాయింపులు చేస్తున్నా కేంద్రాన్ని తప్పుపట్టడం ఏమిటని ప్రశ్నించారు. అసలు తెలంగాణలోని నాలుగు గనుల కోసం సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా అడగలేదని.. 2019 తర్వాత సింగరేణి గనుల వేలంలో పాల్గొననే లేదని వివరించారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలన్నారు. కాగా.. బీజేపీ నేతల పట్ల బీఆర్ఎస్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి మండిపడ్డారు. సింగరేణిపై ప్రధాని మోదీ గతంలోనే క్లారిటీ ఇచ్చినా.. కేసీఆర్ మళ్లీ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఎవరో వాట్సాప్ చేస్తే.. నాకు నోటీసులా: ఈటల పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడాన్ని ఈటల రాజేందర్ తప్పుపట్టారు. తాను టెక్నాలజీకి అప్డేట్ కాలేదని, మెసేజీలకు రిప్లై కూడా ఇవ్వనని చెప్పారు. ‘‘ఎవరో ఒక వ్యక్తి నాకు వాట్సాప్ చేస్తే.. అది నేను చూడకపోయినా నోటీసులు ఇచ్చారు. ఈ కేసుతో నాకు సంబంధం లేకున్నా నోటీసు ఇవ్వడాన్ని ఖండిస్తున్నా. నాకు చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి.. నోటీసులకు వివరణ ఇస్తా..’’ అని ఈటల వివరించారు. బీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు తాను భయపడబోనని వ్యాఖ్యానించారు. -
TS: బీజేపీ కోర్ కమిటీ భేటీ.. చర్చలోని అంశాలివే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పొలిటికల్ వాతావరణం మరోసార వేడెక్కింది. పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు.. రేపు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను స్థానిక బీజేపీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కోర్ కమిటీ సమావేశమైంది. కాగా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలో కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సందర్బంగా ప్రధాని మోదీ సభను విజయవంతం చేయడంపై చర్చ జరగుతోంది. అలాగే, బండి సంజయ్ అరెస్ట్ తర్వాత పరిణామాలపై డిస్కషన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై కోర్ కమిటీ చర్చిస్తున్నది. ఈ సమావేశంలో డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, జితేందర్ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బండి సంజయ్ అరెస్ట్.. బొమ్మలరామారం పీఎస్ వద్ద హైటెన్షన్!
సాక్షి, బొమ్మలరామారం: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు మంగళవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, తన అరెస్ట్‌కు కారణం చెప్పాలని, వారెంట్ చూపించాలని బండి సంజయ్.. పోలీసులను ప్రశ్నించడంతో వారి మధ్య వాగ్వాదం పెరిగింది. అనంతరం, జరిగిన పరిణామాలతో సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, టెన్త్ పేపర్ల లీకేజీకి సంబంధించి ప్రెస్‌మీట్ పెట్టనున్న నేపథ్యంలో సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీఆర్పీసీ 151 కింద బండి సంజయ్‌ను ముందస్తుగా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం, సంజయ్‌ను బొమ్మలరామారం పీఎస్‌కు తరలించారు. ఇక, బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో పీఎస్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పీఎస్‌కు బీజేపీ నాయకులు, శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. దీంతో, పీఎస్ ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. కాగా, బీజేపీ శ్రేణులు స్టేషన్ లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పీఎస్ ఎదుట కర్రలు వేసి బీజేపీ కార్యకర్తలు దగ్దం చేశారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, బండి సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ జాతీయ నాయకత్వం, స్థానిక నేతలు ఖండించారు. - ఈ నేపథ్యంలో బీఎల్ సంతోష్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. రాజకీయంగా బీఆర్ఎస్ సమాధి అయ్యే రోజులు దగ్గరపడ్డాయి. కేసీఆర్‌కు పాలన చేతగాక సంజయ్‌ను అరెస్ట్ చేయించారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని ఘాటు కామెంట్స్ చేశారు. - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సంజయ్ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. కారణం లేకుండా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. తెలంగాణలో అరాచక పాలన నడుస్తోంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు. - డీకే అరుణ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లింది. ప్రజలు తర్వలోనే బీఆర్ఎస్ను బొందపెడతారు. అకారణంగా సంజయ్‌ను అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన చర్య. బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలి. - ఈటల రాజేందర్ స్పందిస్తూ.. కారణం చెప్పకుండా సంజయ్‌ను అరెస్ట్ చేయడం దారుణం. కేసీఆర్ చెప్పినట్టు వింటూ పోలీసులు వెన్నముక లేకుండా వ్యవహరిస్తున్నారు. బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలి. - బీజేపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. బండి సంజయ్ అరెస్ట్‌ను ఖండిస్తున్నాను. అరెస్ట్‌లకు సంజయ్ భయపడరు. ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపినందుకే అరెస్ట్ చేశారు. ఆయన్ను జైలులో పెడితే ప్రభుత్వ తప్పులు బయటకిరావు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. - బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.. బండి సంజయ్‌ను కలిసేందుకు బొమ్మలరామారం పీఎస్ వెళ్లారు. దీంతో, ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం, రఘునందన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అక్కడి నుంచి నేతలందరూ వెళ్లిపోవాలని పోలీసులు చెబుతున్నారు. -
తెలంగాణ బడ్జెట్‌పై ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్ కేటాయింపులపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. బడ్జెట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘బడ్జెట్లో చెప్పేదానికి వాస్తవానికి పొంతన లేదు. విద్యా, వైద్య రంగానికి సరైన కేటాయింపులు లేవు. విద్యావాలంటీర్లకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉంది. మన ఊరు-మన బడి రంగుల కల. ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించలేమని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆరోగ్యశ్రీ డబ్బులను ఆసుపత్రులకు ప్రభుత్వం ఇవ్వడంలేదు. కాంట్రాక్టర్లకు రెండు, మూడేళ్లైనా డబ్బులు రావడంలేదు. తెలంగాణలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 10వేల కోట్ల నుంచి 45వేల కోట్లకు పెరిగింది’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఈటలకు విజయశాంతి కౌంటర్.. అలా మాట్లాడితే సరిపోదు కదా?
సాక్షి, హైదరాబాద్: ఇటీవల అన్ని రాజకీయ పార్టీల్లో సీఎం కేసీఆర్‌కు కోవర్టులు ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో, తెలంగాణ బీజేపీ నేతలు ఈటల వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీలో ఇద్దరు జాతీయ కార్యవర్గ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నట్టు సమాచారం. తాజాగా ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయశాంతి కౌంటర్ అటాక్ చేశారు. కోవర్టులను పేర్లతో సహా బయటపెట్టండి అంటూ కామెంట్స్ చేశారు. నిజంగా కోవర్టులు ఉంటే కేంద్రం కూడా వారిపై చర్యలు తీసుకుంటుంది. వారి గురించి నిజాలు బయటపెట్టండి. దీంతో, పార్టీకి మీరు మేలు చేసిన వారు అవుతారు అని ఈటలను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఊరికే కోవర్టులు ఉన్నారని చెప్పి తప్పించుకోవడం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక దొంగతనం జరిగినప్పుడు దొంగను పట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. వారిని పోలీసులను అప్పగించాలి కదా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పరోక్షంగా ఈటలకు విజయశాంతి కౌంటర్ ఇచ్చినట్టు అయ్యింది. మరోవైపు.. ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీలో కోవర్టులు ఉండరు. బీజేపీ సిద్దాంతం కలిగిన పార్టీ అంటూ కామెంట్స్ చేశారు. -
కేసీఆర్‌ను గద్దె దించడమే నా టార్గెట్: ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ టార్గెట్‌గా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీలో చాలా మంది బాహుబలులు ఉన్నారని అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే నా టార్గెట్ అంటూ ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మా పార్టీలో అధ్యక్షులు ఎప్పటికప్పుడు మారుతుంటారు. కేసీఆర్‌లాగా ఒక్కరే జీవితాంతం అధ్యక్షుడిగా ఉండరు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నయం బీజీపీ అనే ప్రజలు నమ్ముతున్నారు. ఏ పార్టీకి చేరికల కమిటీ అనేది ఉండదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేసీఆర్ వైఫల్యాలే మా ఎజెండా. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ ప్రజాదరణను తెలంగాణలో కూడా అందిపుచ్చుకుంటాము. మళ్లీ మోదీనే ప్రధాని అవుతారు. రైతుబంధు ఇచ్చి మిగిలిన పథకాలన్నీ కేసీఆర్ రద్దు చేశాడు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఎక్కడపోయాయి. కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్‌లో ఉంది. కేసీఆర్‌ను గద్దె దించడమే నా టార్గెట్. బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా జీవిత లక్ష్యం. 20 ఏళ్ల పాటు కేసీఆర్ వద్ద ఉన్న నన్ను.. పార్టీ నుంచి వెళ్లగొట్టారు. మా పార్టీలో ముందుగానే ఎమ్మెల్యే టికెట్ హామీ ఇవ్వరు. చాలా మంది నేతలు, ద్వితియ శ్రేణి నాయకులు బీజేపీలో చేరుతున్నారు అని అన్నారు. -
అన్ని పార్టీల్లో కేసీఆర్‌కు కోవర్టులున్నారు.. ఈటల షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందే రాష్ట్రంలో ఎన్నికల హీట్ మొదలైంది. అధికార పార్టీ నేతలతో సహా ప్రతిపక్ష పార్టీల నేతలు సంచలన వ్యాఖ్యలు, విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. కాగా, ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. "అన్ని పార్టీల్లోనూ కేసీఆర్ కోవర్టులు ఉన్నారు. 2018 ఎన్నికల్లో నాతో సహా 20 మందిని ఓడించేందుకు ప్రత్యర్థులకు కేసీఆర్ డబ్బులు ఇచ్చారు. ప్రపంచంలో ఏ పార్టీకి జాయినింగ్ కమిటీ లేదు. బీజేపీలో జాయినింగ్ కమిటీ పెట్టడం వల్ల పార్టీలో చేరే వారి పేర్లు లీక్ అవుతున్నాయి. అందుకే బీజేపీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు" అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే, ఈటల కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నారు. రానున్న కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈటల వ్యాఖ్యలు పొలిటికల్ పార్టీలను టెన్షన్‌కు గురిచేస్తున్నారు. కాగా, కేసీఆర్‌కు చెక్ పెట్టాలని బీజేపీ ప్లాన్స్ చేస్తున్న తరుణంలో కోవర్టుల విషయం బయటకు రావడం కలకలం సృష్టిస్తున్నది. ఇంతకీ బీజేపీలో ఉన్న కోవర్టులెవరు? పార్టీ అంతర్గత సమాచారాన్ని, కీలక అంశాలను కెసిఆర్ కు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నదెవరు? టీఆర్ ఎస్ పార్టీలో సుదీర్ఘంగా ఉండి బీజేపీలోకి వచ్చిన ఈటలకు కోవర్టులెవరన్న దానిపై స్పష్టత ఉందా? ఈటల లాంటి సీనియర్ ఎవరిని లక్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు? పార్టీలో ఈటలకు ఎవరెవరితో పొసగడం లేదు? ఇప్పుడీ అంశాలన్నీ బీజేపీలో చర్చనీయాంశమవుతున్నాయి. -
కాషాయ పార్టీలో కోల్డ్‌వార్!.. ఈటల, వివేక్ మధ్య విభేదాలకు కారణం?
తెలంగాణలో జెండా పాతేస్తామని కమలం పెద్దలు చెబుతున్నారు. ఇక్కడేమో పార్టీ నాయకులు గ్రూప్‌లుగా విడిపోయి రచ్చకెక్కుతున్నారు. వ్యక్తిగత వైరాలతో పార్టీ పరువు బజారుకీడుస్తున్నారని టాక్. నేతల మధ్య విభేదాలు కొంప ముంచుతాయని కేడర్ ఆందోళన చెందుతోంది. ఇంతకీ తెలంగాణలో రచ్చకెక్కిన ఆ ఇద్దరు ఎవరు? అసలు వారి మధ్య గొడవకు కారణం ఏంటి..? తెలంగాణలో అధికారమే లక్ష్యమని కమలం పార్టీ అధినాయకత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. రాష్ట్రానికి ఎవరు వచ్చినా వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాలను ఒక కుదుపు కుదుపుతామని..అమిత్ షా ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నారని ప్రచారం చేస్తున్నారు. కానీ, రాష్ట్రంలోని ముఖ్య నాయకులు గ్రూపులు కడుతూ కేడర్‌ను అయోమయానికి గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు నాయకుల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని బీజేపీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ఇద్దరూ కరీంనగర్ నేతలే.. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ గడ్డం వివేక్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోందని బీజేపీ ఆఫీస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే. హుజురాబాద్ ఎన్నికల సమయంలో కలిసి మెలిసి తిరిగిన ఈటల, వివేక్ మధ్య.. ఆ తర్వాత ఎక్కడో వ్యవహారం బెడిసి కొట్టింది. వివేక్ కాల్ చేసినా ఈటల రాజేందర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదని ప్రచారం నడుస్తోంది. దీంతో, పంచాయితీ కాస్తా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ మెంబర్ లక్ష్మణ్ ముందుకు వెళ్ళినట్టు సమాచారం. కారణాలపై పార్టీ పెద్దల ఆరా.. ఇక, సీనియర్ నాయకులతో మాట్లాడుకుంటూనే.. ఈటల రాజేందర్, వివేక్ పరస్పరం అరుచుకున్నట్లు సమాచారం. అయితే, అప్పుడే అనుకోకుండా అక్కడికి తెలంగాణ మంత్రి ఒకరు రావడంతో నేతల పంచాయితీ మధ్యలో ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఇంతగా రచ్చ కెక్కడానికి కారణాలేంటో పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఎప్పటికప్పుడు కేంద్ర పెద్దలు రాష్ట్ర నాయలకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అప్పుడే అధికారంలోకి వచ్చేసినట్లుగా కొందరు నేతలు ఫీలవుతున్నారని.. అందుకే పార్టీలో గ్రూప్‌లో తయారవుతున్నాయని కేడర్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఢిల్లీ పెద్దల దగ్గర ప్రాధాన్యం పెరగడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో ఈటల, వివేక్ మధ్య విభేదాలు బయటికొచ్చాయి. అయితే, ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యం నిర్దేశించుకున్న సమయంలో నాయకుల మధ్య ఇలాంటి గొడవలు ఏమాత్రం మంచిది కాదని హైకమాండ్ గట్టిగా క్లాస్ పీకినట్లు సమాచారం. హైకమాండ్ చొరవతో అయినా ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుందా? లేదో వేచి చూడాల్సిందే. -
లిక్కర్ స్కాంలో కవిత పేరు.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా లిక్కర్ కేసు రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవితతోపాటు మరికొందరి పేర్లను ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్(ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో, మరోసారి రాష్ట్రంలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాగా, లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు చేర్చడంతో తెలంగాణ బీజేపీ నేతలు టీఆర్ఎస్ సర్కార్‌పై సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్సే ఈటల రాజేందర్ స్పందించారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందో లేదో దర్యాప్తులో తేలుతుంది. స్కాంలో ఉన్న వారికి శిక్ష తప్పదు. ఇక్కడ దోపిడీ చాలదన్నట్టు ఢిల్లీకి వెళ్లి దోచుకుంటున్నారు. ఎమ్మెల్యేలను కొనే సంస్కృతికి తెర తీసింది కేసీఆరే’ అంటూ కామెంట్స్ చేశారు. ఇక, కవిత అంశంపై బీజేపీ నేత డీకే అరుణ స్పందించారు. తాజాగా డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. ‘తప్పులు బయటపడతాయనే బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారు. సానుభూతి పొందేందుకు కల్వకుంట్ల కుటుంబం ప్రయత్నిస్తోంది. తప్పు చేయకపోతే ఈడీ, సీబీఐ అంటే భయమెందుకు?. కవిత జైలుకు వెళ్తే అవినీతి వల్లే పోతుంది. ప్రజల కోసమే జైలుకు వెళ్తానని మాట్లాడటం విడ్దూరంగా ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. లిక్కర్ స్కాంలో తన పేరు చేర్చడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీ, ప్రధాని మోదీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ఎనిమిదేళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టి అడ్డదారిలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్నాయని, అందుకే మోదీ కంటే ముందు ఈడీ వచ్చిందని విమర్శించారు. తనతోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు పెట్టించారని మండిపడ్డారు. తమపై కేసులు పెట్టడం నీచమైన రాజకీయ ఎత్తుగడ అని విమర్శించారు. సీబీఐ, ఈడీతో భయపెట్టించి గెలవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. కేసులు పెడతామంటే పెట్టుకోండి.. అరెస్టులు చేసుకోండి.. దేనికైనా భయపడేది లేదు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటాం. జైళ్లో పెడతామంటే పెట్టుకోండి.. అంతకంటే ఏం చేయగలరు? అని కవిత ఫైర్ అయ్యారు. -
బీజేపీ సభను అడ్డుకునేందుకే కేసీఆర్ సభ
సాక్షి, హైదరాబాద్: మునుగోడులో ఈనెల 21న జరిగే బీజేపీ బహిరంగ సభను అడ్డుకునే కుట్రతోనే ఆగమేఘాల మీద ఒక రోజు ముందు 21న సీఎం కేసీఆర్ సభ ఏర్పాటు చేశారని బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. 21న అమిత్‌షా సభ కోసం బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వేచ్ఛగా గ్రామాల్లో తిరిగి జనసమీకరణ జరపకుండా ప్రతి గ్రామంలో ఎమ్మెల్యేలు పోలీస్ ఎస్కార్ట్‌తో తిరుగుతూ భయాందోళనలకు గురిచేస్తున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డితో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మునుగోడులో ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించిన కేసీఆర్ బీజేపీని అడ్డుకునేందుకు కాళ్లల్లో కట్టె పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే ప్రక్రియ మొదలైందని, ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేస్తూనే, సొంతపార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను సైతం వెల కడుతున్నారని అన్నారు. మునుగోడులో హుజూరాబాద్ లాంటి తీర్పు ఇవ్వాలనే పట్టుదలతో జనం ఉన్నారని తెలిసి కేసీఆర్ కుట్రలకు దిగుతున్నారని విమర్శించారు. 21న బీజేపీ సభకు వెళ్లవద్దని దిగజారి ప్రచారం చేయడం జుగుప్సగా ఉందన్నారు. బీజేపీలో చేరేందుకు వచ్చే టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తున్నారన్నారు. తమ ఫోన్లు టాప్ చేస్తూ, తమతో మాట్లాడిన టీఆర్ఎస్ నాయకుల ఇళ్లకు వెళ్లి బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. డీజీపీ, పోలీసులు కేసీఆర్‌కు బానిసలుగా పనిచేస్తున్నట్లుగా ఉందని, బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. కాళేశ్వరానికి వెళ్లకుండా ఎందుకు ఆపుతున్నారు..? కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని కేసీఆర్ చెబుతు న్నారని.. వాస్తవం ఏంటో మంచిర్యాల ప్రజలను అడిగితే చెబుతారని ఈటల ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను బ్యారేజీల వద్దకు ఎందుకు పోనివ్వడం లేదని ప్రశ్నించారు. చదవండి: కాంగ్రెస్‌లోకి కొత్తకోట దంపతులు? -
కేసీఆర్‌కు కర్రు కాల్చి వాతపెట్టే రోజులొచ్చాయి: ఈటల ఫైర్
సుందరయ్య విజ్ఞానకేంద్రం(హైదరాబాద్): బర్లు, గొర్లు కాసే వారికి కూడా కేసీఆర్ గురించి తెలిసిందని, ఆయన భాషలో చెప్పాలంటే కర్రు కాల్చి వాతలు పెట్టే రోజులొచ్చాయని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రెవెన్యూ మాస పత్రిక ఆధ్వర్యంలో ‘రెవెన్యూ ఉద్యోగుల మనోధైర్యం.. భవిష్యత్ కార్యాచ రణ’అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. భూమికి రక్షణగా ఉండే రెవెన్యూ శాఖ అన్ని శాఖలను సమన్వయం చేస్తుందని, అలాంటి శాఖను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. వృత్తిపరమైన సంఘాలకు సచివాలయం లేదని, వారి సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. పాలనలో రెవెన్యూ వ్యవస్థ కీలకమైందని, అలాంటి వ్యవస్థపైన కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. బీఆర్వోల సర్వీస్ రూల్స్‌కు తూట్లు పొడిచారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. సర్వీస్‌ను అంతం చేయటం అంటే వారి అస్థిత్వాన్ని దెబ్బతీయటమేనని అన్నారు. తెలంగాణ రెవెన్యూ మాస పత్రిక ఎడిటర్ వి.లచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు లక్ష్మయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఇందిరా శోభన్, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కె.గోవర్ధన్, బీఎస్పీ నాయకులు దయాకర్ రావు, హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: కేటీఆర్ విషయంలో సీఎం కేసీఆర్ ఆందోళనలో ఉన్నారు -
చర్చకు రమ్మంటే ముఖం చాటేస్తున్న ఈటల: ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్: ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలకు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని కోరితే సమాధానం చెప్ప కుండా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖం చాటేస్తున్నా రని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. బుధవారం హుజూరాబాద్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హుజూరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరినా ఈటల స్పందించకపోవడం తన తప్పును అంగీకరించినట్లేనని స్పష్టం చేశారు. 5న హుజూ రాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద నియోజకవర్గ ప్రజల మధ్యే అభివృద్ధిపై చర్చ పెట్టుకుందామన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక పాల్గొన్నారు. -
తెలంగాణలో జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు: ఈటల రాజేందర్
సాక్షి, సూర్యాపేట: జిల్లాలోని హుజూర్ నగర్లో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8 ఏళ్ల ప్రజా సంక్షేమ పాలనా సదస్సు బహిరంగ సభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్ వచ్చిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు బీజేపీ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇక, సభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు తెలంగాణ అవుతుందేమోనని ఆశతో ఎంతో మంది ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సంపాదించుకున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగింది. రాజకీయాల కోసం ఎంతో మందిని హుజురాబాద్ పంపించి ఎలాగైనా నన్ను ఓడించాలనే ప్రయత్నం చేసినా.. అక్కడ ప్రజలెవరూ నమ్మక కర్రు కాల్చి వాత పెట్టారు. దళితులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేసి కంటితుడుపు చర్యగా దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుంది అంటూ ప్రగల్భాలు పలుకుతూ బీఆర్ఎస్ అంటూ కొత్తగా మరో నాటకానికి తెరలేపారు. అడుగడుగునా అన్ని వర్గాల ప్రజలను అణగ తొక్కుతూ సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారు. తెలంగాణలో జీతాలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. మధ్యాహ్న భోజనం కింద నగదును సమకూర్చే పరిస్థితి లేదు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్ల అప్పుల పాలైంది. పరిపాలనలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు. విశ్వ నగరంగా పేరుగాంచిన హైదరాబాద్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. అన్ని ఆధారాలు చూపించినా.. వారిపై చర్యలు తీసుకునే సాహసం లేదు అంటూ విమర్శించారు. ఇది కూడా చదవండి: కేసీఆర్‌కు బీజేపీని ఎదిరించే దమ్ముంది -
జమునా హేచరీస్.. 70.33 ఎకరాలు కబ్జా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి, మెదక్ జోన్: మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబీకులకు సంబంధించిన జమునా హేచరీస్ సంస్థ భూఆక్రమణలకు పాల్పడటం వాస్తవమేనని మెదక్ జిల్లా అధికార యంత్రాంగం మరోమారు నిర్ధారించింది. మొత్తం 70 ఎకరాల 33 గుంటల అసైన్డ్, సీలింగ్ భూములను ఆ సంస్థ కబ్జా చేసినట్లు రీ సర్వేలో తేలిందని మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అసైన్డ్ భూముల బదిలీ నిషేధిత చట్టం ప్రకారం జమునా హేచరీస్‌పై సివిల్, క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు. మొత్తం 56 మంది లబ్ధిదారులకు చెందిన 61 ఎకరాల 13.5 గుంటల అసైన్డ్ భూములతోపాటు 9 ఎకరాల 19.5 గుంటల ప్రభుత్వ భూమిని జమునా హేచరీస్ ఆక్రమించిందన్నారు. అచ్చంపేట గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 77, 78, 79, 80, 82, 130లతోపాటు హకీంపేట పరిధిలోని 97 సర్వే నంబర్లోని అసైన్డ్ భూముల్లో రోడ్లు వేసి రైతులను భూముల్లోకి వెళ్లకుండా సంస్థ యాజమాన్యం అడ్డుకుంటోందని చెప్పారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు.. జమునా హేచరీస్ స్థానిక గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా మూడు నిర్మాణాలు చేపట్టిందని తేలినట్లు కలెక్టర్ హరీశ్ వివరించారు. ఫౌల్ట్రీ ఫీడ్ నిల్వ చేసేందుకు హకీంపేట్ గ్రామ పరిధిలో గాదెలను, అచ్చంపేట్ గ్రామ పరిధిలో ఫౌల్ట్రీ షెడ్లను నిర్మించిందని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనలకు విరుద్ధంగా జమునా హేచరీస్ డంప్ చేస్తున్న కోళ్ల వ్యర్థాల వల్ల సమీపంలోని హల్దీ వాగుకు అనుసంధానంగా ఉన్న ఎల్క చెరువులో నీరు కలుషితమవుతోందని, స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నారని ప్రభుత్వానికి పంపిన నివేదికలో కలెక్టర్ పేర్కొన్నారు. అందువల్ల ఆ సంస్థ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అసైనీలకు భూములు తిరిగిస్తాం... జమునా హేచరీస్ కబ్జా చేసిన భూములపై తిరిగి తమకు హక్కులు కల్పించాలని అసైన్డ్ భూముల లబ్ధిదారులు కోరుతున్నారని కలెక్టర్ హరీశ్ వివరించారు. ఈ భూముల్లో రోడ్ల నిర్మాణాలను తొలగించి స్వాధీనం చేసుకొని వాటిని అసైనీలకు అప్పగించాల్సి ఉందన్నారు. అలాగే అచ్చంపేట గ్రామ సర్వే నంబర్ 81, 130లలోని అసైన్డ్, సీలింగ్ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ జమునా హేచరీస్ రిజిస్ట్రేషన్లు చేసుకుందనే విషయం తమ దృష్టికి వచ్చిందని, ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కోరినట్లు చెప్పారు. -
మామ మెప్పు కోసం హరీశ్ ఆరాటం
ఇల్లందకుంట(హుజూరాబాద్): ‘నాతో 18 సంవత్సరాల అనుబంధాన్ని మరిచిపోయి.. మంత్రి హరీశ్‌రావు తన మామ కేసీఆర్ మెప్పు పొందడానికి ఆరాటపడుతున్నారు’అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. పచ్చి అబద్ధాలు మాట్లాడడంలో హరీశ్‌రావు మామ కేసీఆర్‌ను మించిపోయారని ఎద్దేవా చేశారు. గురువారం ఈటల కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హరీశ్‌రావు ఎంత ఆరాటపడ్డా కేసీఆర్ నమ్మరని పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో తనతోపాటు మరో 11 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓడించడానికి కేసీఆర్ డబ్బులు పంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆర్థిక శాఖకు మంత్రిగా ఉన్న తాను.. తన శాఖ నుంచే ముఖ్యమంత్రికి జీతం ఇచ్చానని.. అలాంటి తాను నియోజకవర్గ అభివృద్ధిని ఎలా విస్మరిస్తానని ఆవేదన వ్యక్తం చేశారు. మూడుసార్లు మంత్రులతో కలసి ప్రగతి భవన్‌కు వెళ్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానపరిచారని పేర్కొన్నారు. 2003లో తనకున్న ఆస్తులెన్ని.. ఇప్పుడున్న ఆస్తులెన్నో తేల్చేందుకు సీబీఐతో విచారణకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. అదే సమయంలో ‘మీ ఆస్తులపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేందుకు సిద్ధమా’అని నిలదీశారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కాకుండా మిగతా ఎక్కడా 2 వేలకు పైగా డబుల్ బెడ్రూం ఇళ్లు లేవని, అవి కూడా ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు తీసుకున్న వారు పూర్తి చేశారని తెలిపారు. అబద్ధాలు మాట్లాడితే దుబ్బాకలో ప్రజలు ఏ విధంగా కర్రు కాల్చి వాతపెట్టారో.. హుజూరాబాద్‌లో కూడా అలాగే చేస్తారని హెచ్చరించారు. సంక్షేమ పథకాలకు తాను వ్యతిరేకం కాదని, ఆ ఫలాలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే చేరాలని చెప్పానని వెల్లడించారు. హుజూరాబాద్, జమ్మికుంటలను అద్దంలా మార్చాలని రూ.25 కోట్ల చొప్పున జీవో తెస్తే, కేటీఆర్ నిధులు ఆపారని పేర్కొన్నారు. అది ప్రగతి భవన్ కాదు.. బానిసలకు నిలయమని రాసుకోమని ఎంపీ సంతోష్‌కుమార్‌కు చెప్పానని, రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఈటల అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాజీ మంత్రి ఈటలకు తీవ్ర అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రజాదీవెన పాదయాత్రకు బ్రేక్ పడింది. జ్వరంతో పాటు ఆక్సిజన్ స్థాయి, బీపీ తగ్గడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యా రు. ప్రత్యేక వైద్యుల పరీక్షల తర్వాత హుజూరాబాద్‌లోని కార్యాలయానికి తరలించారు. ఈటల కోలుకునే వరకు యాత్రకు విరామం ప్రకటిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రకటించారు. ప్రజాదీవెన యాత్రలో భాగంగా వీణవంక మండ లం పోతిరెడ్డిపల్లికి శుక్రవారం చేరుకున్నారు. అక్కడి నుంచి కొండపాక చేరకుని సభలో మాట్లాడిన అనంతరం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. అక్కడే ఉన్న ప్రత్యేక బస్సులో వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ 90/60, షుగర్ 265 ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆక్సిజన్ స్థాయి లు 94లోపు ఉండటంతో ప్రాథమిక వైద్యం అందించారు. ర్యాపిడ్ టెస్టు చేయగా కరోనా నెగటివ్ వచ్చింది. మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించగా, జ్వరం తగ్గింది. ముందుగా హైదరాబాద్ నిమ్స్‌కు ఈటలను తరలిస్తారని ప్రకటించగా, అందుకు ఆయన ఒప్పుకోలేదని తెలిసింది. దీంతో రాత్రి 7.30 గంటలకు హుజూరాబాద్‌లోని తన కార్యాలయానికి తరలించారు. ఈ నెల 19న కమలాపూర్ మండలంలో యాత్ర ప్రారంభించగా, 222 కిలోమీటర్లు యాత్ర కొనసాగింది. హిమ్మత్‌నగర్ వరకు కొనసాగించిన జమున.. కొండపాకలో నిలిచిన పాదయాత్రను ఈటల సతీమణి జమునారెడ్డి హిమ్మత్‌నగర్ వరకు కొనసాగించారు. ప్రజలు ఈటల కోసం ఎదురు చూస్తున్నారనే ఉద్దేశంతో ఆమె యాత్రను చేపట్టారు. కాగా, అస్వస్థతకు గురైన ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫోన్లో పరామర్శించారు. -
తెలంగాణలో ఆత్మగౌరవం ప్రశ్నార్థకం: ఈటల
సాక్షి, కరీంనగర్: పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మగౌరవం ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్‌లో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు గొప్పవని చెప్పుకునే పరిస్థితి మాత్రమే ఉందని.. ప్రజలు హక్కుదారులు కాదు.. బిచ్చగాళ్లుగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. తమ హక్కుల్ని భంగం కలిగించే ప్రయత్నం చేస్తే దేనినైనా ధ్వంసం చేయడానికి వెనుకాడమన్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాముల దూరినట్లు తనపై ఓ మంత్రి మాట్లాడటం వాళ్ల సంస్కారానికి నిదర్శనమన్నారు. కులం, మతంతో తనకు సంబంధం లేదు, పార్టీ కార్యకర్తలు వారి ఆలోచనతో సంబంధం ఉంటుందని ఈటల రాజేందర్ అన్నారు. ప్రతి పైసా కేంద్రం ఇచ్చినవే: బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి నిధులు, సంక్షేమ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వానివేనన్నారు. కోవిడ్ సమయంలో రాష్ట్రంలో ఖర్చు చేసిన ప్రతి పైసా కేంద్రం ఇచ్చినవేనన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ వాటా లేకుండా ఎన్ని నిధులు కేటాయించారో, కేంద్ర వాటా లేని సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేస్తున్నారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘‘నమ్ముకున్న సిద్ధాంతం కోసం పని చేసే పార్టీ బీజేపీ. తెలంగాణ అధికారం చేపట్టే దిశగా ముందుకు వెళ్తున్నాం. మాట తప్పిన సీఎంను అడ్రస్ లేకుండా చేయాలి. తెలంగాణలో మార్పు కోసం, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం మలిదశ ఉద్యమానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ తెలిపారు. చదవండి: Huzurabad: ‘సాగర్’ ఫార్మూలాతో ఈటలకు చెక్.. బాస్ ప్లాన్ ఇదేనా? తెలంగాణలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేత -
కురుక్షేత్ర యుద్ధంలో ఈటల పాత్ర ఏంటో చెప్పాలి?
హైదరాబాద్: గులాబీ గూటికి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ అండ లేకుండానే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారా? అంటూ ఈటల రాజేందర్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కురుక్షేత్ర యుద్ధంలో ఈటల పాత్ర ఏంటో చెప్పాలి? ఈటెల బీజేపీలో చేరి పెట్రోల్-డీజిల్ తగ్గిస్తారా? పోలవరం తరహాలో తెలంగాణకు జాతీయస్థాయి ప్రాజెక్టు రప్పిస్తారా? ఈటెలకు మర్యాద ఇవ్వలేదు అంటే ఎలా? మంత్రి పదవి ఇచ్చారు చాలదా? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. అంతేకాకుండా ఈటలపై నమ్మకంతో కేసీఆర్ ఫ్లోర్ లీడర్ అవకాశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గొప్పతనాన్ని పొడిగిన విషయం గుర్తుచేసుకోవాలి అన్నారు. ఈటల వ్యక్తిగతంగా జరిగిన తప్పును నిరూపించుకోలేక నిరాశలో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇన్నేళ్లు ఈటలను పెంచి పోషించిన కేసీఆర్‌పై అబండాలు వెయ్యడం సరైంది కాదని, అన్నం పెట్టిన పార్టీపై విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఇక ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. వరవరరావుని జైల్లో పెట్టిన పార్టీలో ఎలా జాయిన్ అవుతారని అన్నారు. బీజేపీపై నెలక్రితం చేసిన విమర్శలు ఈటలకు గుర్తులేవా? అని ఆయన అడిగారు. నాడు దయ్యంలా కనిపించిన బీజేపీ.. నేడు దైవం అయ్యిందా? అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. చదవండి: వారు గాడిదపై ప్రయాణిస్తున్నట్టున్నారు! -
ఆ మాట వాస్తవమే: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈటల ఎపిసోడ్‌పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మీడియాతో ఆయన మంగళవారం చిట్‌చాట్ నిర్వహించారు. ఇప్పటి వరకు తానను ఈటల రాజేందర్ కలవలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తానను కలిసేందుకు సంప్రదించిన మాట వాస్తవమేనన్నారు. ఈటల, తాను 15 ఏళ్లు కలిసి పనిచేశామని.. కలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. కలిసినంత మాత్రాన పార్టీలో చేరేందుకు అనుకోలేమన్నారు. ఎప్పుడు కలుస్తామన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. అందరినీ కలుస్తున్నా, మిమ్మల్నీ కలుస్తా అని నాతో అన్నారని కిషన్‌రెడ్డి వివరించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వస్తే పోటీ అంశంపై చర్చించలేదని.. పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కిషన్‌రెడ్డి తెలిపారు. చదవండి: ఈటలకు బీజేపీ ఆహ్వానం! Corona Vaccine: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం