సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్ కేటాయింపులపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. బడ్జెట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘బడ్జెట్‌లో చెప్పేదానికి వాస్తవానికి పొంతన లేదు. విద్యా, వైద్య రంగానికి సరైన కేటాయింపులు లేవు. విద్యావాలంటీర్లకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉంది. మన ఊరు-మన బడి రంగుల కల. ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించలేమని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆరోగ్యశ్రీ డబ్బులను ఆసుపత్రులకు ప్రభుత్వం ఇవ్వడంలేదు. కాంట్రాక్టర్లకు రెండు, మూడేళ్లైనా డబ్బులు రావడంలేదు. తెలంగాణలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 10వేల కోట్ల నుంచి 45వేల కోట్లకు పెరిగింది’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment