Updates..
12:18PM
తెలంగాణ అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా
బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీశ్‌రావు
►కేంద్ర పన్నుల వాటా రూ. 21, 471 కోట్లు
►ట్యాక్స్ మరియు ఖర్చుల పన్నుల ద్వారా ఆదాయం రూ. 650 కోట్లు
►పన్నేతర ఆదాయం రూ. 22,801 కోట్లు
►కేంద్ర నిధులు రూ. 41, 259. 17 కోట్లు
►వాహన పన్ను ద్వారా ఆదాయం రూ. 7,512 కోట్లు
►ఎలక్టిసిటీ పన్నుల ద్వారా ఆదాయం రూ. 750 కోట్లు
►రియల్ ఎస్టేట్ పన్నుల ద్వారా రాబడి రూ. 175 కోట్లు
►ఇతర పన్నుల సుంకాల ద్వారా ఆదాయం రూ. 44.20 కోట్లు
►స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్న్ ద్వారా ఆదాయం రూ. 18, 500 కోట్లు
►ల్యాండ్ రెవెన్యూ ద్వారా ఆదాయం రూ. 12.5 కోట్లు
►ఎక్సైజ్‌శాఖ ద్వారా ఆదాయం రూ. 19 వేల 884.90 కోట్లు
►అమ్మకపు పన్ను ద్వారా ఆదాయం రూ. 39.500 కోట్లు
►కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ. 3,210 కోట్లు.
►కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌కు రూ 200 కోట్లు
►డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ. 1200 కోట్లు
►ఉన్నత విద్యాశాఖకు రూ. 3,001 కోట్లు
►టీఎస్ ఆర్టీసీకి రూ. 1500 కోట్లు
►రవాణాశాఖకు రూ. 1,644 కోట్లు
►మున్సిపల్ శాఖకు రూ. 11వేల 372 కోట్లు
►రోడ్లు, భవనాల శాఖకు రూ. 2 వేల కోట్లు
►హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు రూ. 500 కోట్లు
►పాతబస్తీకి మెట్రో కనెక్టివిటీకి రూ. 500 కోట్లు
►షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 36వేల 750 కోట్లు
►ఐ అండ్ పీఆర్ కోసం రూ. వెయ్యి కోట్లు
►హోంశాఖకు రూ. 9వేల 500 కోట్లు
►మహిళా వర్సిటీకి రూ. 100 కోట్లు
►మూసీ అభివృద్ధి కోసం రూ. 200 కోట్లు
►రవాణాశాఖకు రూ. 1,644 కోట్లు
►గిరిజన సంక్షేమానికి రూ. 3,965 కోట్లు
►పరిశ్రమలకు రూ. 4,037 కోట్లు
►గ్రామాల్లో రోడ్ల కోసం రూ. 2 వేల కోట్లు
►హరితహారానికి రూ. 14 వేల 71 కోట్లు
►మైనారిటీ సంక్షేమానికి రూ. 2 వేల 200 కోట్లు
►విద్యారంగానికి రూ.19వేల 093 కోట్లు
►ఇరిగేషన్ రంగానికి రూ. 26వేల 885 కోట్లు
►షెడ్యూల్ తెగలకు రూ.15, 233 కోట్లు
►బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
►దళితబంధుకు రూ. 17 వేల 700 కోట్లు
►ఆసరా పెన్షన్లకు రూ.12 వేల కోట్లు
►రైతు వేదికలకు రూ. 26 835 కోట్లు
►నీటి పారుదల రంగానికి రూ. 26, 831 కోట్లు
►విద్యుత్ రంగానికి రూ.12, 727 కోట్లు
►ప్రజాపంపిణీ రంగానికి రూ. 3117 కోట్లు
►రైతుబంధు పథకానికి రూ.1575కోట్లు
► రైతుబీమా పథకానికి రూ. 1589కోట్లు
►పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పథకానికి రూ. 4834 కోట్లు
►ఆయిల్ ఫామ్ సాగు - 1000 కోట్లు.
►సొంత జాగ ఉన్న వాళ్ల కోసం - 7890కోట్లు.
►యునివర్సిటీ ల అభివృద్ధి - 500 కోట్లు.
►పరిశ్రమల ఉత్పత్తి ప్రోత్సాహకాలు - 2937.20 కోట్లు.
►పరిశ్రమలకు విద్యుత్ సబ్సిడీ -316.39 కోట్లు.
►ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు పావలా వడ్డీ రుణం - 266.20 కోట్లు
►కొత్త ఉద్యోగ నియామకాల కోసం -1000కోట్లు
►ఆరోగ్యశ్రీకి రూ.1463 కోట్లు
►ఆర్థికశాఖకు రూ. 49, 749 కోట్లు
►రెవెన్యూ శాఖకు 3,560 కోట్లు
►జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కార్సస్ ఫండ్
►మిషన్ భగీరథ నిర్వహణ కోసం రూ. 1000 కోట్లు
►సమాచార, ప్రసారశాఖకు రూ. 1,000 కోట్లు
►న్యాయ శాఖకు రూ.1,665 కోట్లు
►డబుల బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి రూ. 12,000 కోట్లు
►ప్రణాళిక విభాగానికి రూ. 11, 495 కోట్లు
►ఐటీ, కమ్యూనికేషన్ల శాఖకు రూ. 366 కోట్లు
►2023-24 తలసరి ఆదాయం రూ. 3 లక్షల 17 వేల 175
►రెవెన్యూ వ్యయం రూ. 2,11, 685 కోట్లు
►మూలధన వ్యయం రూ. 37, 525 కోట్లు
►తెలంగాణ బడ్జెట్ రూ. 2,90, 396 కోట్లు
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం మండిపడ్డ హరీశ్‌రావు
►తెలంగాణకు కేంద్ర సహకరించడం లేదని ఆగ్రహం
►రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అడగడుగునా ఆటంకాలు
►కేంద్ర సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర నిధులకు కోత పెడుతోంది
► ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన మంత్రి హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి. కేసీఆర్‌కు పాదాభివందనం చేసిన ఇద్దరు మంత్రులు.
► అసెంబ్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్.
► ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అసెంబ్లీ వద్ద మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ కోసం ఉత్తర తెలంగాణ హక్కులను కేసీఆర్ కాలరాస్తున్నారు. కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తుంటే కేసీఆర్ ప్రకటనలు, తీర్మానాలతో కాలం వెల్లదీస్తున్నారు. దేశంలో కేసీఆర్ అసమర్ధపు ముఖ్యమంత్రి. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు తోడు దొంగలు. శ్రీరాంసాగర్ నీటిని మహారాష్ట్రకు తరలించాలని చూస్తే సహించేది లేదు.
09:30AM
► అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌ను కలిసిన మంత్రి హరీశ్
►అసెంబ్లీకి చేరుకున్న హరీశ్‌రావు
08:30AM
► జూబీహిల్స్ టీటీడీ ఆలయానికి మంత్రి హరీశ్‌రావు.
►బడ్జెట్ కాపీలతో ఆలయానికి వెళ్లిన హరీశ్
► శ్రీవారి ఆలయం నుంచి నేరుగా హరీశ్ రావు అసెంబ్లీకి వెళ్లనున్నారు.
► సోమవారం ఉదయం మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుంది. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. కేంద్రం సహకారం లేకున్నా అభివృద్ధి సాధిస్తున్నాము. తెలంగాణ బడ్జెట్ దేశానికే మోడల్‌గా నిలుస్తుందని ఆకాంక్షించారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ఏడాది కావడంతో సంక్షేమం, అభివృద్ధిని యథాతథంగా కొనసాగిస్తూ కొన్ని కొత్త పథకాలను జోడిస్తూ ప్రజారంజక బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఈసారి బడ్జెట్ పెట్టే అవకాశాలున్నాయి. దాదాపు 3 లక్షల కోట్ల వరకు బడ్జెట్ ఉండే అవకాశం ఉంది.
సాగు, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో 2023–24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత శాసనమండలిలో రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెడతారు.
Comments
Please login to add a commentAdd a comment