Telangana BJP Core Committee Meeting Headed By Kishan Reddy - Sakshi
Sakshi News home page

TS: బీజేపీ కోర్‌ కమిటీ భేటీ.. చర్చలోని అంశాలివే..

Published Fri, Apr 7 2023 10:20 AM | Last Updated on Fri, Apr 7 2023 11:27 AM

Telangana BJP Core Committee Meeting Headed By Kishan Reddy - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పొలిటికల్‌ వాతావరణం మరోసార వేడెక్కింది. పేపర్‌ లీక్‌ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ అరెస్ట్‌ను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు.. రేపు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను స్థానిక బీజేపీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కోర్‌ కమిటీ సమావేశమైంది. 

కాగా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలో కోర్‌ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సందర్బంగా ప్రధాని మోదీ సభను విజయవంతం చేయడంపై చర్చ జరగుతోంది. అలాగే, బండి సంజయ్‌ అరెస్ట్‌ తర్వాత పరిణామాలపై డిస్కషన్‌ చేస్తున్నట్టు సమాచారం. ఇక, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై కోర్‌ కమిటీ చర్చిస్తున్నది. ఈ సమావేశంలో డీకే అరుణ, ఈటల రాజేందర్‌, రఘునందన్‌ రావు, జితేందర్‌ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement