core committee meeting
-
AP: పవన్‌ను నమ్ముకుంటే.. ఖల్లాస్!
సాక్షి, విజయవాడ: పవన్‌ను నమ్ముకుని ఎన్నికలకు వెళ్లడమా? బాబోయ్.. అనుకుంటోంది ఆంధ్రప్రదేశ్ బీజేపీ. తాజాగా కోర్ కమిటీ సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాడేపల్లిలో దాదాపు అయిదు గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో ఎన్నికల సన్నద్దత, పొత్తుల అంశాలపై కీలకంగా చర్చించారు. వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఎలా సన్నద్దమవ్వాలనే దానిపై జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ జీ అభిప్రాయాలను సేకరించారు. పొత్తులపై నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీలో ఉండాలని పలువురు నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒంటరిగా పోటీ చేస్తే ఓట్ల శాతం పెరుగుతుందని నేతలు చెప్పినట్లు సమాచారం. ఈ భేటీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుపైనా బీజేపీ నేతలు చర్చించగా.. పవన్‌ను నమ్ముకుంటే బీజేపీకి ఎదురుదెబ్బేనని పలువురు అభిప్రాయపడినట్లు వినికిడి. టీడీపీ-జనసేన పొత్తుపై చర్చించారు. ఈ సందర్భంగా గతంలో చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేసి భంగపడిన అనుభవాలను నేతలు గుర్తుచేసుకున్నారట. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయగలమా? అనే అంశంపైనా అభిప్రాయ సేకరణ జరిపారు. టీడీపీతో పొత్తు అంశాన్ని అధిష్టానానికి వదిలేయాలని నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏయే సీట్లల్లో బీజేపీ పోటీ చేయడానికి ఆస్కారం ఉందనే అంశంపైనా చర్చించినట్లు సమాచారం. ఏపీలో ఈ నెలలో అమిత్ షా పర్యటించనున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్రమంత్రి పర్యటన సమయంలోనే పొత్తులపై క్లారిటీ ఇవ్వాలని నేతలు కోరారట. చదవండి: చంద్రబాబుకి ఆ గేటు తెరిచే ఉద్దేశం లేదేమో! -
TS: అమిత్ షా దిశానిర్దేశం.. ఎన్నికలపై బీజేపీ మాస్టర్ ప్లాన్
సాక్షి, ఖమ్మం: ఖమ్మం నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణపై తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఖమ్మంలో ‘రైతు గోస–బీజేపీ భరోసా’ బహిరంగ సభ అనంతరం బీజేపీ రాష్ట్రస్థాయి కోర్ కమిటీ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో సబ్బండ వర్గాలను ఆకట్టుకునేలా బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసినట్లు సమాచారం. బీజేపీ కేంద్రీకరించి పనిచేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీలు స్థానాలు ఎన్ని.. ఏ జిల్లాలో గెలుస్తాం.. ఏ నియోజకవర్గంలో రెండో స్థానంలో ఉంటాం.. అంటూ అమిత్ షా పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గెలుపు కోసం అధిష్టానం నుంచి కావాల్సిన సహకారంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన అమిత్ షా.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే దిశగా పనిచేయాలని నేతలకు అమిత్ షా సూచించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్త నేతలను బీజేపీలోకి ఆహ్వానించడం.. మజ్లిస్, బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ రాజకీయ ఎత్తుగడలు.. బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలపై దృష్టి పెట్టాలని అమిత్ షా సూచించారు. నేతల మధ్య ఆధిపత్య పోరు.. గ్రూపులు ఉండొద్దన్న అమిత్ షా.. ఐక్యంగా పనిచేయాలని హితవు పలికారు. చదవండి: కేసీఆర్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది: అమిత్ షా -
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ కోర్ కమిటీ భేటీ
-
TS: బీజేపీ కోర్ కమిటీ భేటీ.. చర్చలోని అంశాలివే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పొలిటికల్ వాతావరణం మరోసార వేడెక్కింది. పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు.. రేపు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను స్థానిక బీజేపీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కోర్ కమిటీ సమావేశమైంది. కాగా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలో కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సందర్బంగా ప్రధాని మోదీ సభను విజయవంతం చేయడంపై చర్చ జరగుతోంది. అలాగే, బండి సంజయ్ అరెస్ట్ తర్వాత పరిణామాలపై డిస్కషన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై కోర్ కమిటీ చర్చిస్తున్నది. ఈ సమావేశంలో డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, జితేందర్ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘కేసీఆర్ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తాం’
ఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. ఆ మేరకు ఇప్పట్నుంచి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఢిల్లీలో తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతలు హాజరు కాగా, వారికి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశం అనంతరం తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్‌చుగ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించామని, బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టిపెట్టినట్లు పేర్కొన్నారు. బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యం: బండి సంజయ్ వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని జనం భావిస్తున్నారని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. ‘రకరకాల కార్యక్రమాలతో జనం లోకి వెళ్తున్నాం.స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు విజయవంతం అయ్యాయి. పార్టీ అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసింది. 119 నియోజకవర్గాల్లో 119 సభలు నిర్వహిస్తాం. ఆ తర్వాత 10 పెద్ద బహిరంగ సభలు పెడతాం. చివరికి ఒక మెగా బహిరంగ సభ ఉంటుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తారు’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. -
19 మంది ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ.. మరో భారీ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరైన విషయం తెలిసిందే. కాగా, పరేడ్ గ్రౌండ్స్ సభలో అమిత్ షా.. కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు. హరిత ప్లాజాలో బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి గురించి, మునుగోడు ఉప ఎన్నికలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా తెలంగాణలో ఇప్పటి వరకు బీజేపీ గెలవని 19 ఎంపీ స్థానాల గురించి చర్చించనున్నారు. భువనగిరి, నల్లగొండ, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ స్థానాల్లో బీజేపీ ఇప్పటి వరకు విజయం సాధించలేదు. కాగా, ఈ స్థానాల్లో గెలుపు కోసం ఈ సమావేశంలో ముఖ్య నేతలకు అమిత్ షా దిశా నిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా.. కేవలం 19 మంది ముఖ్య నేతలతో మాత్రమే భేటీ అయ్యారు. ఇతర నేతలు ఎవరికీ.. ఈ భేటీలోకి అనుమతివ్వలేదు. ఇక, హైదరాబాద్ ఎంపీ స్థానం గురించి కూడా ప్రత్యేకంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కూడా ముఖ్య నేతలతో చర్చించనున్నట్టు సమాచారం. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతీ నియోజకవర్గంలో బూత్ కమిటీలను త్వరగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర నేతలకు ఆదేశాలు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: వారి త్యాగాల వల్లే నువ్వు అధికారంలో ఉన్నావ్ కేసీఆర్: అమిత్ షా ఫైర్ -
‘మునుగోడు’ ఉప ఎన్నిక సమన్వయానికి కమిటీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సమన్వయానికి ప్రత్యేకంగా కమిటీ వేయాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో చర్చించిన తర్వాత కమిటీని నియమించనున్నారు. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని మంగళవారం జరిగిన పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో తీర్మానించారు. అలాగే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో 15న చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం నుంచి అసెంబ్లీ ఎదుటనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. 17న విమోచన దినోత్సవంతో పాటు, ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ రోజు నుంచి వచ్చేనెల 2న మహాత్మాగాంధీ జయంతి దాకా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. కాగా 16 లోక్‌సభ నియోజకవర్గాలకు నియమించిన కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, జిల్లా పార్టీ ఇన్చార్జిలతో బుధవారం సంజయ్ ఇతర ముఖ్యనేతలు భేటీ కావాలని నిర్ణయించారు. ఇదీ చదవండి: దేశ రాజకీయాల పేరిట కేసీఆర్ కొత్త డ్రామాలు: బండి సంజయ్ -
నేడు తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం
-
TS: బీజేపీ కోర్ కమిటీ మీటింగ్.. ఆ నియోజకవర్గాలపైనే ఫోకస్
-
TS: బీజేపీ కోర్ కమిటీ మీటింగ్.. ఆ నియోజకవర్గాలపైనే ఫోకస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. కేంద్రం సైతం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఆదివారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ భేటీ ముగిసింది. ఈ కోర్ కమిటీ భేటీకి తరుణ్ చుగ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ సహా బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఈ నెల 21 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ బైక్ ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రజల గోస-బీజేపీ భరోసా పేరుతో బైక్ ర్యాలీ తీయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇక, ఏయే నియోజకవర్గాల్లో పార్టీకి సరైన అభ్యర్థులు లేరో.. ఆయా నియోజకవర్గాల్లో చేరికలపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అయ్యే వరకు పేర్లు బయట పెట్టకూడదన్నారు. ఇది కూడా చదవండి: పార్టీలో యాక్టివ్గానే ఉన్నాను.. వారికే టికెట్లు ఇవ్వాలి: ఎంపీ కోమటిరెడ్డి -
కోర్ కమిటీ సమావేశంలో అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేయనున్న అమిత్ షా
-
విజయమే లక్ష్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం అభిప్రాయపడింది. ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని కలిసికట్టుగా పని చేయ డం ద్వారా ఇక నుంచి వచ్చే ఏ ఎన్నికల్లో అయినా విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఆదివారం తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆర్.సి.కుంతియా అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం జూమ్ యాప్ ద్వారా 3 గంటలకుపైగా జరిగింది. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీ అనుసరించా ల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. ముందుగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గాల ఎన్నికలపై సమావేశంలో పాల్గొన్న నాయకులంతా తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం కోర్ కమిటీ నిర్ణయాలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి వివరించారు. పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని, పార్టీ విజయం కోసం అందరూ కలిసి పనిచేయాలని కోరారు. ఆంధ్ర మూలాలున్న వారికి ప్రాధాన్యత జీహెచ్ఎంసీ ఎన్నికలపై జరిగిన చర్చలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తన లోక్ సభ పరిధిలోనికి వచ్చే 48 డివిజన్లలో యాత్ర చేపట్టి పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత యాత్ర చేపట్టనున్నట్టు కోర్ కమిటీకి వెల్లడించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెటిలర్ల ఓట్లు కీలకమని, ఆ మూలాలున్న నాయకులకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 30 డివిజన్లలో ఆంధ్ర ప్రాంతానికి చెందినవారికి టికెట్లు ఇచ్చి విజయం సాధించిందని గుర్తు చేశారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ.. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. పార్టీలోని కొందరు నేతలు బీసీల్లో ఒకట్రెండు కులాలకే పదవులు ఇస్తారా అని అర్థంలేని వాదనలు చేస్తూ బీసీల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, ఎస్.సంపత్ కుమార్, మధుయాష్కీ, చిన్నారెడ్డి, వంశీ చంద్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్ది, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం టీపీసీసీ కోర్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలివే... – దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలి. 2, 3 రోజుల్లో సర్వే జరిపి, ఇప్పటి వరకు పరిశీలనలో ఉన్న నలుగురు అభ్యర్థిత్వాలను పరిశీలించి జిల్లా నాయకులతో మాట్లాడి వారం రోజుల్లో అభ్యర్థిని ప్రకటించాలి. – జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్ సభల వారీగా ఎంపీలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నేతలతో కమిటీలు ఏర్పాటు చేయాలి. వీలున్నంత త్వరగా డివిజన్ కమిటీలు పూర్తి చేసి అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాలి. – ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల కోసం పార్టీ సీనియర్లతో వెంటనే కమిటీలు వేయాలి. – పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రెండు, మూడు రోజుల్లో దరఖాస్తులు స్వీకరించి, సర్వేలు నిర్వహించిన తర్వాత అభ్యర్థులను ఎంపిక చేయాలి. -
రేపు నల్ల జెండాల ఎగురవేత
సాక్షి, హైదరాబాద్: పోతిరెడ్డిపాడు జీవో 203 విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై బీజేపీ కోర్ కమిటీ మండిపడింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం కోర్ కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పోతిరెడ్డిపాడు, రైతుల ఆందోళన తదితర అంశాలపై కోర్ కమిటీ చర్చించింది. పోతిరెడ్డిపాడు విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా జారీ చేసిన జీవో పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ వైఖరికి నిరసనగా ఈనెల 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చింది. తాను చెప్పిన పంటలు వేస్తేనే రైతుబంధు డబ్బులు ఇస్తానంటూ సీఎం కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని పేర్కొంది. ఆ పథకాన్ని ఎగ్గొట్టడానికే సీఎం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, ఇలాంటి ప్రకటనలతో సీఎం రైతులకు శత్రువుగా మారుతున్నారని ఆరోపించింది. రైతులకు, కార్మికులకు, చిరు వ్యాపారులకు, మధ్యతరగతి ప్రజలకు భరోసా నింపేలా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీకి కోర్‌కమిటీ ధన్యవాదాలు తెలిపింది. -
ముగిసిన టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. కొత్త సభ్యత్వ నమోదు చేపట్టే అంశాలపై ఏఐసీసీ ఆదేశాల ప్రకారం త్వరలో కార్యాచరణ చేపట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యురేనియం, యూరియా, రైతుల అంశాలు, అవినీతి, యాదగిరి గుట్ట వంటి అంశాలపై నాయకులు చర్చించారు. దీనితోపాటు ఉద్యమాలకు సంబంధించి పలు కమిటీలు వేయాలని, త్వరలోనే దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమ కార్యచరన చేపట్టనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆదివారం నాడు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, మాజీ పీసీసీ అధ్యక్షులు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, నాయకులు కొండపల్లి విద్యాసాగర్ యాదాద్రి పర్యటన బృందంలో ఉన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు యాదాద్రికి చేరుకొని అక్కడ స్తంభాలపై ఉన్న కేసీఆర్, కారు, ఇతర గుర్తులను పరిశీలించనున్నారు. -
‘అవినీతి ప్రభుత్వాన్ని ఎండగడతాం’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ అవినీతిని భయటపెట్టాలని నిర్ణయించుకున్నట్లు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు ప్రేమేందర రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ ముగిసిన తర్వాత ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసే అవినీతిపై ప్రజలకు అవగాహన కల్పించి, అవినీతి టీఆర్ఎస్ను ఎండగట్టడానికే నిర్ణయించుకున్నామన్నారు. ఈ మున్నిపల్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపుతామని, పార్లమెంట్ నియోజకవర్గాలను క్లస్టర్‌గా విభజించి ఎన్నికల్లో పనిచేస్తాం అన్నారు. -
మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ సమావేశం
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలిచి రాష్ట్రంలో కొంత పట్టు సాధించిన బీజేపీ, త్వరలో జరగనున్న మున్సిపాల్ ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. ఈ దిశగా ఆదివారం హైదరాబాద్‌లో కోర్ కమిటీ సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా సూచించిన అంశాలపై చర్చ కొనసాగింది. దీనితోపాటు బీజేపీ సభ్యత్వ నమోదు, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ వంటి అంశాలను చర్చించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, మురళీధర్‌రావు, రాజా సింగ్, డీకే అరుణ హాజరైయ్యారు -
టీజేఎస్‌తో చర్చలు జరుగుతున్నాయ్: కిషన్ రెడ్డి
హైదరాబాద్: నగరంలోని మారియట్ హోటల్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి పలువురు బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ఎన్నికల వ్యూహం, ప్రచారంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. అక్టోబర్ 1 నుంచి 15 లోపు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని బీజేపీ అగ్రనేత కిషన్ రెడ్డి తెలిపారు. అమిత్ షా టూరు అక్టోబర్ 17న లేదా 18 తేదీలలో ఉండవచ్చునని చెప్పారు. టీఆర్ఎస్ నుంచి ఎటువంటి పెద్ద తలకాయలు బీజేపీలో చేరడం లేదని వెల్లడించారు. తెలంగాణ జన సమితితో పొత్తుపై ఇంకా క్లారిటీ రాలేదని, చర్చలు జరుగుతున్నాయని మీడియా చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. -
కావాలనే కేంద్రంపై దుష్ప్రచారం..
-
కావాలనే మాపై దుష్ప్రచారం!
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ కోర్‌కమిటీ ఆదివారం సమావేశమైంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు, పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీరాజు, ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీనివాసరావు, మాధవ్, గోకరాజు గంగరాజు తదితరులు పాల్గొన్న ఈ భేటీలో టీడీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంపై ప్రధానంగా నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదాపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ముమ్మరమైన నేపథ్యంలో టీడీపీ కేంద్ర మంత్రులు ఇటీవల ఎన్డీయే ప్రభుత్వం నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అనంతరం బీజేపీ, కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌గా టీడీపీ నేతలు ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ ప్రచారాన్ని తిప్పికొట్టడం.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దానిపై సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. కావాలనే కేంద్రంపై దుష్ప్రచారం.. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. కావాలనే కేంద్రంపై కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులను దారి తప్పిస్తున్నారని పరోక్షంగా టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. వాస్తవాలన్నింటినీ ప్రజలకు వివరిస్తామని చెప్పారు. -
'టీడీపీతో పొత్తు వద్దంటున్న బీజేపీ నేతలు'
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ కోర్‌కమిటీ సమావేశం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, అచ్చంపేట ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ...మున్సిపల్ ఎన్నికలలో టీడీపీతో పొత్తు వద్దని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారని అన్నారు. టీడీపీతో పొత్తు అంశం స్థానిక నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రామచంద్రరావు తెలిపారు. -
నేడు బీజేపీ రాష్ట్ర కోర్‌కమిటీ సమావేశం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : బీజేపీ రాష్ర్ట కోర్ కమిటీ సమావేశం ఆదివారం రాజమహేంద్రవరంలో జరగనుంది. దీనికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్, ఎంపీలు గోకరాజు గంగరాజు, కంభంపాటి హరి బాబు, రాష్ట్ర మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, కంతేటి సత్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్‌రాజు, కేంద్ర మాజీ మంత్రులు పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తదితరులు హాజరుకానున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటనను ఖరారుపై ఈ సమావేశంలో చర్చ ఉంటుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పదవీకాలం త్వరలో పూర్తికానున్నందున.. ఆయన వారసుడి ఎంపికపై చర్చించవచ్చని తెలుస్తోంది. తన కుమార్తె దీపా వెంకట్ కుటుంబంలో జరిగే ఓ శుభకార్యానికి కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఈ నెల 17న రాజమహేంద్రవరం రానున్నారని సమాచారం. ఈలోగా ఈ అంశాన్ని ఓ కొలిక్కి తీసుకురావడంపై కోర్‌కమిటీలో చర్చించనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో కాపులకు అన్ని పార్టీలూ ప్రాధాన్యం ఇస్తున్నందున.. బీజేపీ కూడా అదేబాటలో పయనించాలనే వాదన కొద్దికాలంగా వినిపిస్తోంది. దీంతో ఎమ్మెల్సీ సోము వీర్రాజుకే రాష్ర్ట అధ్యక్ష పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది. ఇప్పటికే చంద్రబాబు వ్యతిరేకిగా ముద్రపడినా, ఇటీవల టీడీపీ అక్రమాలపై ఆయన నోరు మెదపడంలేదు. టీడీపీ నుంచి వ్యతిరేకతా రాకుండా ఉండేందుకే ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారన్న వాదన ఉంది. ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపుగర్జన సభకు వీర్రాజు హాజరు కాకపోవడం, సభకు హాజరైన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై ప్రభుత్వం కేసు నమోదు చేసినా స్పందించకపోవడం, చివరకు ముద్రగడ నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించక పోవడంతో పార్టీలోని కాపు సామాజికవర్గం ఆయనపై గుర్రుగా ఉంది. దీంతో పార్టీలోని రెండు ప్రధాన సామాజికవర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందనే సాకుతో కంభంపాటినే మరోసారి కొనసాగించవచ్చని చెబుతున్నారు. -
కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతునే ఉంది. ఎన్నికల పొత్తు అంశం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి అధ్యక్షుడు శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ సమావేశమైంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నేత ప్రఫుల్ పటేల్, ఇతర నేతలు హాజరయ్యారు. అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని కాలాన్ని పంచుకోవాలని ఎన్సీపీ చేసిన డిమాండ్ ను కాంగ్రెస్ తోసిపుచ్చిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన భేటికి ఎన్సీపీ నేతలు గతరాత్రి హాజరుకాకపోవడం కూడా రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. -
వెంకయ్యా.. ఇదేం బాగా లేదయ్యా!
సాక్షి, హైదరాబాద్: టీడీపీతో పొత్తులు, సర్దుబాట్లపై బీజేపీలో కలకలం మొదలైంది. కోర్ కమిటీ సమావేశానికి చివరి క్షణంలో హాజరైన పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడుపై పార్టీ రాష్ట్ర నేతలు ధిక్కార స్వరం వినిపించారు. పార్టీ ఎన్నికల వ్యూహం, సీమాంధ్ర ఉద్యమం, సంస్థాగత వ్యవహారాలు, కీలక నియోజకవర్గాల గుర్తింపు తదితర అంశాలను చర్చించేందుకు కోర్ కమిటీ బుధవారమిక్కడి గుజరాత్ భవన్లో సమావేశమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పరిశీలకులుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సతీష్ జీ, ఆర్ఎస్ఎస్ నేతలు ఎక్కా శేఖర్, శ్యాంజీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, వెంకయ్య నాయుడు, కోర్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. టీడీపీతో గతంలో పొత్తు, గెలిచిన సీట్లు, ప్రస్తుత పరిస్థితి గురించి భేటీలో చర్చ సందర్భంగా.. వెంకయ్యపై పార్టీ శాసనసభాపక్ష నాయకుడు యెండల లక్ష్మీనారాయణ, సీమాంధ్ర ఉద్యమ కమిటీ నేత సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. ‘‘ఎవరెవరో ఏమోమో మాట్లాడుతున్నారు. లేనిపోనివన్నీ అంటున్నారు. తెలంగాణలో అనేక మంది ఇతర పార్టీల వారు వచ్చి చేరతారని చెప్పారు. కానీ ఇంతవరకు ఎవ్వరూ చేరినట్టు కనిపించడం లేదు’’ అని వెంకయ్య నాయుడు అనడంతో యెండల తీవ్రంగా స్పందించారు. ‘‘అసలు మీరేం మాట్లాడుతున్నారు? పొత్తులుండవని సుష్మాస్వరాజ్ పాలమూరులో చెప్పిన మర్నాడే పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని సంకేతం ఇచ్చేలా మీరు బెంగళూరులో మీడియాతో చెప్పారు. మీరు చేసే పని వల్లే లేనిపోని అపోహలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో ఏమున్నదని చంద్రబాబుతో పొత్తంటున్నారు? టీడీపీతో పొత్తనే ఉహాగానాలు రావడంతోనే వచ్చే వాళ్లందరూ వెనక్కుపోయారు. చివరకు పంచాయతీ సర్పంచులు కూడా పార్టీలో చేరడానికి వెనకాముందాడుతున్నారు’’ అని ఆయన మండిపడ్డట్టు తెలిసింది. ఇదే సమయంలో వీర్రాజు జోక్యం చేసుకుంటూ.. సీమాంధ్రలో మాత్రం పొత్తు కావాలని ఎవరు కోరారని వెంకయ్యను నిలదీశారు. ‘‘చంద్రబాబుతో పొత్తని ఎవరు డిసైడ్ (నిర్ణయం) చేశారు. ఇందులో మా పాత్ర ఏమీ ఉండదా? దీనిపై పెద్ద నేతలెవ్వరూ స్పష్టత ఇవ్వరా?’’ అని ప్రశ్నించారు. తర్వాత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పొత్తులుండవని రాజ్‌నాథ్ సింగ్ కూడా తనకు చెప్పారని, అవసరమైతే ఢిల్లీలో ప్రెస్కాన్ఫరెన్స్ పెట్టి తనతో పాటు కలిసి మాట్లాడతానని హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఈ దశలో వెంకయ్యనాయుడు సమావేశం నుంచి నిష్ర్కమించినట్టు తెలిసింది. అనంతరం పార్టీ నేతలు, కోర్ కమిటీ సభ్యులు తెలంగాణ ప్రాంత పదాధికారులతో భేటీ అయ్యారు. సాయంత్రం ఆర్ఎస్ఎస్ ఆంధ్రాప్రాంత నేతలతో సమావేశమై రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని సమీక్షించారు. టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదు బీజేపీ తెలంగాణ పదాధికారుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని బీజేపీ తెలంగాణ ప్రాంత పదాధికారులు తేల్చిచెప్పారు. తెలంగాణలో పార్టీని, కార్యకర్తలను కాపాడుకునేందుకే టీడీపీ ఈ వదంతులను సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. సీమాంధ్ర ఉద్యమం, తెలంగాణపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి సమర్పించాల్సిన నివేదిక, సంస్థాగత నిర్మాణం, తెలంగాణ బిల్లు తదితర అంశాలను చర్చించేందుకు పార్టీ ఉద్యమ కమిటీ నేతలు, తెలంగాణ ప్రాంత పథాధికారులు బుధవారమిక్కడ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఉద్యమ కమిటీ ఛైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సతీష్జీ, ఆర్ఎస్ఎస్ బాధ్యులు రామచంద్రరాజు తదితరులు హాజరయ్యారు. అనంతరం పార్టీ నేతలు యెండల లక్ష్మీనారాయణ, డాక్టర్ టి.రాజేశ్వరరావు, ఎన్.వేణుగోపాల్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, అశోక్‌కుమార్ యాదవ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ స్థాయిలో టీడీపీతో పొత్తు కుదిరిందన్న ప్రచారంలో వాస్తవం లేదని యెండల స్పష్టంచేశారు. నరేంద్రమోడీ నేతృత్వంలో ప్రజల్లోకి వెళ్తామన్నారు.