
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. కేంద్రం సైతం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఆదివారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ భేటీ ముగిసింది. ఈ కోర్ కమిటీ భేటీకి తరుణ్ చుగ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ సహా బీజేపీ నేతలు హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఈ నెల 21 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ బైక్ ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రజల గోస-బీజేపీ భరోసా పేరుతో బైక్ ర్యాలీ తీయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇక, ఏయే నియోజకవర్గాల్లో పార్టీకి సరైన అభ్యర్థులు లేరో.. ఆయా నియోజకవర్గాల్లో చేరికలపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అయ్యే వరకు పేర్లు బయట పెట్టకూడదన్నారు.
ఇది కూడా చదవండి: పార్టీలో యాక్టివ్‌గానే ఉన్నాను.. వారికే టికెట్లు ఇవ్వాలి: ఎంపీ కోమటిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment