సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. కొత్త సభ్యత్వ నమోదు చేపట్టే అంశాలపై ఏఐసీసీ ఆదేశాల ప్రకారం త్వరలో కార్యాచరణ చేపట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యురేనియం, యూరియా, రైతుల అంశాలు, అవినీతి, యాదగిరి గుట్ట వంటి అంశాలపై నాయకులు చర్చించారు. దీనితోపాటు ఉద్యమాలకు సంబంధించి పలు కమిటీలు వేయాలని, త్వరలోనే దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమ కార్యచరన చేపట్టనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆదివారం నాడు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, మాజీ పీసీసీ అధ్యక్షులు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, నాయకులు కొండపల్లి విద్యాసాగర్ యాదాద్రి పర్యటన బృందంలో ఉన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు యాదాద్రికి చేరుకొని అక్కడ స్తంభాలపై ఉన్న కేసీఆర్, కారు, ఇతర గుర్తులను పరిశీలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment