కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన
కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన
Published Wed, Sep 24 2014 12:26 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతునే ఉంది. ఎన్నికల పొత్తు అంశం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి అధ్యక్షుడు శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ సమావేశమైంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నేత ప్రఫుల్ పటేల్, ఇతర నేతలు హాజరయ్యారు.
అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని కాలాన్ని పంచుకోవాలని ఎన్సీపీ చేసిన డిమాండ్ ను కాంగ్రెస్ తోసిపుచ్చిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన భేటికి ఎన్సీపీ నేతలు గతరాత్రి హాజరుకాకపోవడం కూడా రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది.
Advertisement
Advertisement