
సాక్షి, హైదరాబాద్: ఈటల ఎపిసోడ్‌పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మీడియాతో ఆయన మంగళవారం చిట్‌చాట్ నిర్వహించారు. ఇప్పటి వరకు తానను ఈటల రాజేందర్ కలవలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తానను కలిసేందుకు సంప్రదించిన మాట వాస్తవమేనన్నారు. ఈటల, తాను 15 ఏళ్లు కలిసి పనిచేశామని.. కలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.
కలిసినంత మాత్రాన పార్టీలో చేరేందుకు అనుకోలేమన్నారు. ఎప్పుడు కలుస్తామన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. అందరినీ కలుస్తున్నా, మిమ్మల్నీ కలుస్తా అని నాతో అన్నారని కిషన్‌రెడ్డి వివరించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వస్తే పోటీ అంశంపై చర్చించలేదని.. పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కిషన్‌రెడ్డి తెలిపారు.
చదవండి: ఈటలకు బీజేపీ ఆహ్వానం!
Corona Vaccine: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment