
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ టార్గెట్‌గా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీలో చాలా మంది బాహుబలులు ఉన్నారని అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే నా టార్గెట్ అంటూ ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మా పార్టీలో అధ్యక్షులు ఎప్పటికప్పుడు మారుతుంటారు. కేసీఆర్‌లాగా ఒక్కరే జీవితాంతం అధ్యక్షుడిగా ఉండరు. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం బీజీపీ అనే ప్రజలు నమ్ముతున్నారు. ఏ పార్టీకి చేరికల కమిటీ అనేది ఉండదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేసీఆర్ వైఫల్యాలే మా ఎజెండా. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ ప్రజాదరణను తెలంగాణలో కూడా అందిపుచ్చుకుంటాము. మళ్లీ మోదీనే ప్రధాని అవుతారు.
రైతుబంధు ఇచ్చి మిగిలిన పథకాలన్నీ కేసీఆర్ రద్దు చేశాడు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఎక్కడపోయాయి. కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్‌లో ఉంది. కేసీఆర్‌ను గద్దె దించడమే నా టార్గెట్. బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా జీవిత లక్ష్యం. 20 ఏళ్ల పాటు కేసీఆర్ వద్ద ఉన్న నన్ను.. పార్టీ నుంచి వెళ్లగొట్టారు. మా పార్టీలో ముందుగానే ఎమ్మెల్యే టికెట్ హామీ ఇవ్వరు. చాలా మంది నేతలు, ద్వితియ శ్రేణి నాయకులు బీజేపీలో చేరుతున్నారు అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment