సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతోంది. ఇక, ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన కొందరు నేతలు భారీ వెనుకంజలో ఉన్నారు. కేసీఆర్ కేబినెట్ కీలకంగా పనిచేసిన నేతలు ఓటమికి చేరువలో ఉండటంతో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.
ఓడిన మంత్రులు వీరే..
పాలకుర్తి.. ఎర్రబెల్లి దయాకర్ రావు
ఖమ్మం.. పువ్వాడ అజయ్‌కుమార్
నిర్మల్.. ఇంద్రకరణ్ రెడ్డి
ధర్మపురి.. కొప్పుల ఈశ్వర్
మహబూబ్‌నగర్.. శ్రీనివాస్ గౌడ్..
వనపర్తి.. నిరంజన్ రెడ్డి.
ఇక, పాలకుర్తిలో ఎర్రబెల్లి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని ఇక్కడ విజయం సాధించారు. మరోవైపు.. ఖమ్మంలో పువ్వాడను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కాంగ్రెస్ నేతలు తుమ్మల, పొంగులేటి చాలా సందర్బాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఛాలెంజ్‌ను గెలిచి చూపించారు తుమ్మల.
నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి(బీజేపీ) చేతిలో ఇంద్రకరణ్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. అలాగే ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్‌ను కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ఓడించారు.
మరోవైపు.. తాజాగా ప్రగతి భవన్ వద్ద పరిస్థితి ఇలా ఉంది..
#WATCH | #TelanganaAssemblyElections2023 | CM Camp Office in Hyderabad wears a deserted look as the ruling BRS trails in the state election, as per official EC trends. Chief Minister and party chief K Chandrashekar Rao is currently at the CM residence.
— ANI (@ANI) December 3, 2023
Congress is leading in… pic.twitter.com/KidmLpbBD6
Comments
Please login to add a commentAdd a comment