సాక్షి,హైదరాబాద్:తన రాజకీయ జీవితంలో ఇంత అసమర్థ,అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీజేపీ(Bjp) ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) విమర్శించారు. ఆదివారం(జనవరి19) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు. ఆర్థిక శాఖలో కమిషన్ లేకుండా ఒక్క బిల్లు మంజూరు చేయడం లేదని, 7నుంచి10శాతం కమిషన్ లేనిదే చిన్న బిల్లు కూడా ఇవ్వడం లేదని సంచలన ఆరోపణలు చేశారు.
‘ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా దుకాణాలు ఓపెన్ చేశారు. మళ్లీ దొరుకుతదో దొరకదో అన్నట్లు దోచుకుంటున్న ప్రభుత్వం ఇది. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ఎవరితరం కాదు. తెలంగాణలో రానున్న శకం బీజేపీది.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని నెలల పాటు ‘హై డ్రా’ పేరిట పేదల ఇండ్లు కూల్చింది.కొన్ని నెలల పాటు మూసీ పేరిట ఇండ్లు కూల్చింది.
ఈ మధ్య కాలంలో దేశంలోనే పెద్దదైన,అతి పురాతనమైన స్లమ్ బాలాజీనగర్,జవహర్ నగర్ స్లమ్ ఏరియాల్లో ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా వలస వచ్చిన ఎంతోమంది కూలీలు,పేదలు నివసిస్తున్నారు.ఇక్కడి ప్రజలు కబ్జా చేసుకుని ఇండ్లు కట్టుకోలేదు.డబ్బులు పెట్టి కొని కట్టుకున్నారు.బ్రిటీష్ కాలంలో ఈ భూమిని సైనికులకు కేటాయించారు.ఆ భూమిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు..కేర్ టేకింగ్ మాత్రమే చేపట్టాలని 1951లోనే స్పష్టంచేశారు.సైనికులు కొందరు ఆ భూమిని అమ్ముకుంటే వారి నుంచి పేదలు కొనుక్కున్నారు.
గతంలోనూ కాంగ్రెస్ మంత్రి కమటం రాంరెడ్డి ఆ ప్రాంతంలో ఇండ్లను కూల్చాలని మిషన్లను పంపారు.మళ్లీ ఇప్పుడు రేవంత్ కూల్చివేతలు చేస్తున్నారు.బాలీజీ నగర్‌లో పేదల ఇండ్లను కబ్జా చేసుకునేందుకు,అమ్మకాలు,కొనుగోలు చేసే బ్రోకర్లు ఎక్కువైపోయారు.రెవెన్యూ అధికారుల ఆగడాలు ఎక్కువైపోయాయి.డబ్బులు ఇస్తే తప్పా మీ ఇండ్లు కూల్చివేతలు ఆగవని చెబుతున్నారు.రెవెన్యూ అధికారులే బ్రోకర్లుగా మారారా? అనే సందేహాలు వస్తున్నాయి.
రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు డబ్బులిస్తే తప్ప రేకుల షెడ్ వేసుకునేందుకు అవకాశం ఇవ్వడంలేదు.ఈ భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదని హైకోర్డు కూడా మొట్టికాయలు వేసింది..అయినా ఎలా కూల్చుతున్నారు. మల్కాజిగిరి ఎంపీగా పనిచేసిన సీఎం రేవంత్ కు ఈ ప్రాంత ప్రజల బాధలు తెలియవా?పేదల ఇండ్లు కూలిస్తే చూస్తూ ఊరుకోబోం..కొట్లాటకు కూడా మేం సిద్ధం.
కాళేశ్వరం విచారణకు సహకరిస్తారా? అన్న అంశంపై స్పందించిన ఈటల.కాళేశ్వరం విచారణపై అవగాహన లేని వ్యక్తులు ఏదేదో మాట్లాడుతున్నారు.మిడిమిడి జ్ఞానంతో ఉన్నవారు, ప్రొటోకాల్ తెలియని వారు,అవగాహన లేని మెంటల్ గాళ్లు ఏదోదో మాట్లాడుతారు.ప్రభుత్వ పని విధానం ఎలా ఉంటుందనేది కూడా తెలియని వారు ఇలాంటి మాటలు మాట్లాడుతారు.అన్ని డిపార్ట్ మెంట్లు బిల్లులు చేసి పంపిస్తే బిల్లులు రిలీజ్ చేసిది ఆర్థికశాఖ.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అంశంపై తాను ఎలాంటి కామెంట్ చేయను’అని ఈటల అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment