సాక్షి, కరీంనగర్: తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నారు. ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 29 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు వెంటనే విధుల్లో చేరాలని లేనిపక్షంలో ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తప్పిస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. దీంతో, వారికి మంగళవారం సాయంత్రం 5గంటలలోపు విధుల్లోకి చేరాలని గడువు ఇచ్చింది.
ఈ క్రమంలో జూనియర్ సెక్రటరీలకు ప్రతిపక్ష నేతలు మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు. తాజాగా జేపీఎస్‌ల సమ్మెకు కరీంనగర్‌లో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘డిమాండ్ సాధన కోసం సమ్మె చేస్తే నోటీసులివ్వడం దుర్మార్గం. ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న కేసీఆర్ వేతనాలు ఎందుకు పెంచడం లేదు. వెంటనే జేపీఎస్‌ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి’ అని సీరియస్ అయ్యారు.
మరోవైపు, జేపీఎస్‌ల సమ్మెపై టీపీసీసీ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులర్ చేయాలని లేఖలో పేర్కొన్నారు. జేపీఎస్‌ల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైందన్నారు. జేపీఎస్‌లతో గొడ్డు చాకిరీ చేయించుకుని వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
ఇది కూడా చదవండి: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి!
Comments
Please login to add a commentAdd a comment