
సాక్షి,హైదరాబాద్:శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మీద హత్యాయత్నం కేసు నమోదైంది.హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్యే గాంధీతో పాటు ఆయన కుమారుడు సోదరుడి మీద గచ్చిబౌలి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
కౌశిక్‌రెడ్డి ఇంటి మీద దాడి చేసిన ఘటనపై ఎస్ఐ మహేష్ ఇచ్చిన ఫిర్యాదుతో రెండు రోజుల క్రితమే ఒక కేసు నమోదవగా ఆ కేసులో గాంధీ ఇప్పటికే బెయిల్ తీసుకున్నారు. తాజాగా కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు పెట్టారు.కాగా, పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, గాంధీలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు.
ఇవి కాస్తా హద్దు మీరి కౌశిక్‌రెడ్డి ఇంటి మీద గాంధీ దాడి చేసే దాకా వెళ్లింది. ఈ దాడిపై బీఆర్‌ఎస్ నేతలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ముందు నిరసన తెలిపారు. ఈ నిరసన ఉద్రిక్తంగా మారడంతో హరీశ్‌రావు సహా ముఖ్యనేతలను పోలీసులు అరెస్టు చేసి తర్వాత విడిచిపెట్టారు.

ఇదీ చదవండి.. ఎమర్జెన్సీ కన్నా దారుణం: హరీశ్‌రావు
Comments
Please login to add a commentAdd a comment