సాక్షి,హైదరాబాద్: అరికెపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.శనివారం కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయనను పరామర్శించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. పోలీస్ ఎస్కార్ట్‌తో వచ్చి కౌశిక్‌రెడ్డి ఇంటిపై గాంధీ దాడి చేశారని మండిపడ్డారు.
హైదరాబాద్‌లో శాంతి భద్రతలను రేవంత్ కాపాడలేకపోయారన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని, ఇక్కడి ప్రజలను రేవంత్ పగబట్టారని విమర్శించారు. ఇందుకే హైడ్రా తీసుకు వచ్చారన్నారు. నగరంలోప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. తమ పదేళ్ల పాలనలో హైదరాబాద్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు.
‘మా పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి రేవంత్‌రెడ్డి కండువా కప్పారు. రేవంత్‌రెడ్డి ఆయన తొత్తులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. 10 మంది ఎమ్మెల్యేలకు రేవంత్ స్వయంగా కండువా కప్పారు. కోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గడగడ వణికి పోతున్నారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉరి తీయాలని గతంలో రేవంత్ అన్నారు.
మరి ఇప్పుడెందుకు మా పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాటనా. పోలీసు ఎస్కార్ట్ ఇచ్చి మరీ కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేయించిన చరిత్ర రేవంత్‌రెడ్డిది. దాడికి సహకరించిన పోలీసులపై చర్య తీసుకోవాలి. రాజకీయాలను కాంగ్రెస్ దిగజార్చుతోంది’అని కేటీఆర్ మండిపడ్డారు.
విదేశీ పర్యటన ముగించుకుని శనివారం ఉదయమే కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం తొలుత కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కౌశిక్ ఇంటిపై దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కౌశిక్ రెడ్డిని వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. కేటీఆర్ వెంట పలువురు బీఆర్‌ఎస్ నేతలున్నారు.
కాగా, పార్టీ ఫిరాయింపుల విషయమై రెండు రోజుల పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడిచాయి. ఇవి కాస్తా ముదిరి ఎమ్మెల్యే గాంధీ తన అనుచరుతో కలిసి కౌశిక్‌రెడ్డి ఇంటి మీద దాడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.దీంతో పోలీసులు హైదరాబాద్ నగరంలోని బీఆర్‌స్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో శుక్రవారం పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి.
ఇదీ చదవండి.. ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు
Comments
Please login to add a commentAdd a comment