
పోలీసులకు ఫిర్యాదు చేసిన జెడ్పీ సీఈవో
సీఈవోపై పోలీసులకు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఫిర్యాదు
కరీంనగర్‌క్రైం: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అధికారులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారని జెడ్పీ సీఈవో ఎం.శ్రీనివాస్ ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. కొత్తగా అమలులోకి వచి్చన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) 221, 126(2) సెక్షన్ల కింద కేసు నమోదైంది.
జెడ్పీ సీఈవోపై ఎమ్మెల్యే ఫిర్యాదు
హుజూరాబాద్ నియోజకవర్గంలో సమస్యలపై తాను జెడ్పీ సమావేశంలో ప్రశ్నించేందుకు ప్రయత్నించగా జెడ్పీ సీఈవో తన విధులకు ఆటంకం కలిగించారంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి బుధవారం కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేశారు.
నియోజకవర్గంలో దళితుల కోసం దళితబంధు, నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కోసం ప్రజాప్రతినిధిగా ప్రశి్నస్తున్న సమయంలో తన విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా జెడ్పీ సీఈవో ప్రొటోకాల్ ఉల్లంఘించారని కౌశిక్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే విచారణ చేసి సీఈవోపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.