హైదరాబాద్, సాక్షి: తనను హత్య చేయడానికి అనుచరులను పంపించానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరోక్షంగా మాట్లాడారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సహచ ఎమ్మెల్యేను హత్య చేయడానికి పంపించారంటే ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఉండదని తీవ్రంగా మండిపడ్డారు. ఆయన తెలంగాణ భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు.
‘మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు పార్టీ నాయకులు కొట్లాడుకున్నారని అన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకొని హైదరాబాద్ బ్రాండ్ డ్యామేజ్ చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏమో నేనే అనుచరులను పంపిన అంటున్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాని ప్రశ్నించినదుకు సీఎం రేవంత్ నన్ను హత్య చేయాలని అనుకున్నారా?. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీ, హోమ్స్ సెక్రెటరీ స్పదించాలి.
.. డీజీపీ, హోం శాఖ స్పదించక పోతే రేపు(మంగళవారం) గవర్నర్‌ను కలుస్తా. పోలీసులు సీఎం రేవంత్‌పైన 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి. సైబరాబాద్ పోలీస్ కమిషన్‌కు మంచి పేరు ఉంది. అవినాష్ మహంతి కరీంనగర్ సీపీగా డైనమిక్‌గా పని చేస్తున్నారు. డైనమిక్ లాగా అవినాష్ మహంతి పని చేయాలి. ఎమ్మెల్యే ఇంటి మీద ఎటాక్ జరిగితే ఎం జరిగిందో పోలీసులు చెప్పరా?
..ఒకన్నీ అరెస్ట్ చేసి ఇంకొకనికి ఎస్కార్ట్ ఇచ్చి చింతపండు చేసినం అని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. మరీ ఓటుకు నోటు కేసులో చింతపండు అయిన విషయం మర్చిపోయినవా? నేను తెలంగాణ జనం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం. సీఎం రేవంత్ స్థాయి.. వీధి రౌడీ స్థాయికి దిగజారిపోయింది. సీఎం రేవంత్ మనుషులు హత్య చేస్తామని బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఇంటలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డికి ఫోన్ కాల్స్ వివరాలు ఇచ్చాను. నా ప్రాణానికి హాని జరిగితే రేవంత్ రెడ్డిదే బాధ్యత. రాష్ట్రంలో మల్లా బీఆర్‌ఎస్ జెండా ఎగరబోతుంది.. ఇది పక్కా. అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదలం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment