(ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ నేత మల్లు రవి ఖండించారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు వచ్చే పరిస్థితి లేదని అన్నారు. సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద మల్లు రవి మాట్లాడారు.
‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరు ప్రకటించకపోతెనే అసెంబ్లీ ఎన్నికల్లో 65 సీట్లు వచ్చాయి. ముందే ప్రకటించి ఉంటే 80కి పైగా సీట్లు వచ్చేవి. ప్రజాపాలన కేటీఆర్ కళ్ళకు కనిపించడం లేదా?. తెలంగాణలో ప్రజలు స్వేచ్చగా తిరుగుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులను కలుస్తున్నారు.
...బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు కేసుల భయంతో బతికారు. గత ప్రభుత్వంలో ప్రజలు లేక వెలసిపోయిన సెక్రటేరియట్, ఇప్పుడు మంత్రులను సాధారణ ప్రజలు డైరెక్టుగా కలుస్తున్నారు. కేటీఆర్ తరహా వ్యాఖ్యలు పుట్టుకతోనే గుడ్డి, చెవుడు ఉన్నల్లే చేస్తారు. 420 అన్న వ్యాఖ్యలు చేసినందుకు కేటీఆర్‌పై కేసు పెట్టాలి. 10 లక్షల ఆరోగ్యశ్రీ కింద ఇప్పటికే 6వేల మంది పేదలు లబ్ధి చెందారు’ అని మల్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment