
సాక్షి,కరీంనగర్ జిల్లా: ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి,సంజయ్ కుమార్ వ్యవహారంలో కౌశిక్‌రెడ్డిని పోలీసులు లాక్కెళ్లడం విచారకరమని మాజీ మంత్రి,బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు వచ్చారని, అక్కడికి మమ్మల్ని ఆహ్వానిస్తేనే వెళ్లామని తెలిపారు. ఎమ్మెల్యేల బాహాబాహీపై గంగుల సోమవారం(జనవరి13) మీడియాతో మాట్లాడారు.
‘సమావేశం ఎజెండా క్లియర్‌గా ఉంది. ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యల్ని తీసుకెళ్లాలనుకున్నాం. మా డిమాండ్స్ సభ ముందు పెట్టాం. ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని వాటి కోసం ఫొటోలు దిగినవారంతా భ్రమలో ఉన్నారు. ఇళ్లపై క్లారిటీ ఇవ్వాలని కోరాం. దీనిపై సమాధానం రాలేదు.
ఎమ్మెల్యేను లాక్కెల్లడం నేనెప్పుడూ చూడలేదు. ముగ్గురు మంత్రులు అనుమతిస్తేనే లాక్కెళ్లారా..? అనుమతిస్తే మీరు సభ నడపడంలో విఫలమైనట్టే. మీ ఆదేశాలు లేకుండా పోలీసులు స్టేజ్ ఎక్కారంటే మీరు క్షమాపణ చెప్పాలి. సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కౌశిక్ ఇరిటేట్ అయ్యాడు. కోపతాపాలు సర్వసాధారణమే అయితే వాటిని కంట్రోల్ చేయాలి.
ఒక ఎమ్మెల్యేను గుంజుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంతమందిపై మీరు కేసులు పెడతారు?అదేమైనా బలప్రదర్శన వేదికనా..? పోలీసు కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. కౌశిక్,సంజయ్ మధ్య ఏం జరిగిందనేది డిఫరెంట్, అది వ్యక్తిగతం. కానీ, ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారనేది మా ప్రశ్న’అని గంగుల అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment