sanjay kumar
-
సంజయ్‌ని నేనేం రాళ్లతో కొట్టలేదు: కౌశిక్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: కరీంనగర్ డీఆర్సీ మీటింగ్‌లో బట్టలు విప్పుతా అని ఎమ్మెల్యే సంజయ్ నన్ను రెచ్చగోట్టేలా మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. బుధవారం(జనవరి15) కౌశిక్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.‘మొదట సంజయ్ నాపై దాడి చేశారు. శ్రీధర్ బాబు నన్ను వేలు చూపుతూ బెదిరించారు. కాంగ్రెస్ నేతల ఆదేశాలతో పోలీసులు రౌడీలుగా తయారయ్యారు. రైతు భరోసా కోసం ప్రశ్నించా. రైతు రుణ మాఫీ 50 శాతం అయ్యింది పూర్తి చేయండని రైతుల పక్షాన అడిగాను అందులో తప్పేముంది. సంజయ్ ఏ పార్టీ నుంచి ఏ గుర్తుతో గెలిచిండు. సంజయ్ వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడు. కేసీఆర్ బొమ్మతో సంజయ్ గెలిచిండు. డబ్బులకు అమ్ముడుపోయిన సంజయ్ సిగ్గు లేకుండా స్పీకర్ నాపై ఫిర్యాదు చేసాడు. స్పీకర్‌కు సంజయ్ పై ఫిర్యాదు చేస్తా. మంత్రుల సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన సంజయ్ డిస్ క్వాలిఫై చేయాలి. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టిస్తా అని రేవంత్ రెడ్డే అన్నారు. నేను రాళ్లతో కొట్టలేదు కదా..ప్రశ్నిస్తే నా పై కేసులా’అని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. ఇదీ చదవండి: మోకాళ్లపై కూర్చొని మంత్రి పొన్నం నిరసన -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టు
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(Kaushik Reddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం (జనవరి13) కౌశిక్‌రెడ్డిని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్(Sanjaykumar)ను నెట్టివేసిన కేసులో కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు(Karimnagar police) అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అనంతరం కౌశిక్‌రెడ్డిని పోలీసులు కరీంనగర్‌కు తరలించారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆదివారం తనను కౌశిక్‌రెడ్డి దుర్భాషలాడుతూ నెట్టివేసిన వ్యవహారంలో పోలీసులకు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు. కాగా, కరీంనగర్ కలెక్టరేట్లో ఆదివారం జరిగిన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, సంజయ్‌కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. సంజయ్‌కుమార్ మాట్లాడుతుండగా కౌశిక్‌రెడ్డి కల్పించుకుని ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావని ప్రశ్నించడంతో గొడవ పెద్దదైంది. ఈ క్రమంలోనే కౌశిక్‌రెడ్డి సంజయ్‌కుమార్‌పై చేయి వేసి ఆయను నెట్టివేశారు. అనంతరం సమావేశ మందిరం నుంచి కౌశిక్‌రెడ్డిని పోలీసులు లాక్కెల్లారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఉండడం గమనార్హం. ఈ ఘటనపై ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ పోలీసులతో పాటు తన హక్కులకు భంగం కలిగించారని స్పీకర్‌కు కూడా రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు ప్రస్తుతం కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టు దారుణం:కేటీఆర్హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్యపూటకో అక్రమ కేసు పెట్టడం.. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టుచేయడం రేవంత్ సర్కారుకు అలవాటుగా మారిందిముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారుపార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టుచేయడం పూర్తిగా అప్రజాస్వామికం -
‘నన్ను నెట్టేస్తావా.. కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తే ఇంత అక్కసా?’
కరీంనగర్ జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(kaushik reddy) తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. నిన్న (ఆదివారం) ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) లో కౌశిక్‌రెడ్డి తనను నెట్టివేశాడని సంజయ్ కుమార్(Sanjay Kumar)ఆరోపించారు. ‘ నిన్న జరిగింది అధికారిక సమావేశం. నన్ను కౌశిక్‌రెడ్డి నెట్టేశాడు. కౌశిక్‌రెడ్డి ఇలా చేయడం ఎంతవరకూ కరెక్ట్.నేను ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిని దూషించలేదు. కౌశిక్‌రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే ఆయనపై కేసులున్నాయి. కౌశిక్‌రెడ్డికి బెదిరించడం అలవాటు,. వరంగల్‌లో బెదిరించి సెటిల్మెంట్ చేశాడు. స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశాను. స్పీకర్ దీనిపై చర్యలు తీసుకోవాలి. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను ఎవరూ హర్షించరు. నేను ప్రజా సమస్యలపై మాట్లాడుతామనుకుంటే నాకు ఆటంక కల్గించాడు. జగిత్యాల అభివృద్ధి కొరకే ప్రజలు నన్ను గెలిపించారు.. అభివృద్ధి చేయడం నా ధర్మం . కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తే ఇంత అక్కసు ఎందుకు? అని ప్రశ్నించారు సంజయ్.సమీక్షా సమావేశంలో తోపులాటఆదివారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్‌రెడ్డి(kaushik reddy)ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ‘నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత’ అనేంత స్థాయిలో వాగ్వాదం జరిగింది. జిల్లా సమీక్షా సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే సంజయ్(MLA Sanjay) మాట్లాడుతుండగా పాడి కౌశిక్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇంతకీ మీ పార్టీ ఎంటంటూ సంజయ్‌ను కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రస్థాయికి చేరి ఇద్దరు తోసుకునేంతవరకూ వెళ్లింది. దాంతో కౌశిక్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఇదంతా ముగ్గురు తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబుల సమక్షంలో జరగడం శోచనీయం.కౌశిక్‌రెడ్డి బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూఊ. ‘ ఎమ్మెల్యే సంజయ్ అమ్ముడుపోయారు. సంజయ్‌కు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష. దమ్ముంటే సంజయ్ రాజీనామా చేయాలి. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్లా అంటూ కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. -
BRS ఎమ్మెల్యే కౌశిక్డ్డిపై స్పీకర్‌కు జగిత్యాల MLA సంజయ్ ఫిర్యాదు
-
కౌశిక్‌రెడ్డిVsసంజయ్‌కుమార్: గంగుల కీలక వ్యాఖ్యలు
సాక్షి,కరీంనగర్ జిల్లా: ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి,సంజయ్ కుమార్ వ్యవహారంలో కౌశిక్‌రెడ్డిని పోలీసులు లాక్కెళ్లడం విచారకరమని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు వచ్చారని, అక్కడికి మమ్మల్ని ఆహ్వానిస్తేనే వెళ్లామని తెలిపారు. ఎమ్మెల్యేల బాహాబాహీపై గంగుల సోమవారం(జనవరి13) మీడియాతో మాట్లాడారు. ‘సమావేశం ఎజెండా క్లియర్‌గా ఉంది. ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యల్ని తీసుకెళ్లాలనుకున్నాం. మా డిమాండ్స్ సభ ముందు పెట్టాం. ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని వాటి కోసం ఫొటోలు దిగినవారంతా భ్రమలో ఉన్నారు. ఇళ్లపై క్లారిటీ ఇవ్వాలని కోరాం. దీనిపై సమాధానం రాలేదు.ఎమ్మెల్యేను లాక్కెల్లడం నేనెప్పుడూ చూడలేదు. ముగ్గురు మంత్రులు అనుమతిస్తేనే లాక్కెళ్లారా..? అనుమతిస్తే మీరు సభ నడపడంలో విఫలమైనట్టే. మీ ఆదేశాలు లేకుండా పోలీసులు స్టేజ్ ఎక్కారంటే మీరు క్షమాపణ చెప్పాలి. సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కౌశిక్ ఇరిటేట్ అయ్యాడు. కోపతాపాలు సర్వసాధారణమే అయితే వాటిని కంట్రోల్ చేయాలి.ఒక ఎమ్మెల్యేను గుంజుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంతమందిపై మీరు కేసులు పెడతారు?అదేమైనా బలప్రదర్శన వేదికనా..? పోలీసు కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. కౌశిక్,సంజయ్ మధ్య ఏం జరిగిందనేది డిఫరెంట్, అది వ్యక్తిగతం. కానీ, ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారనేది మా ప్రశ్న’అని గంగుల అన్నారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు.. స్పీకర్‌కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు వెళ్లింది. ఆయన ప్రవర్తన మీద జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. తనతో దురుసుగా ప్రవర్తించారని, కాబట్టి కౌశిక్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కోరారాయన. కరీంనగర్ కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్(MLA Sanjay) మాట్లాడే సమయంలో.. ఆయన పక్కనే కూర్చున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. ‘ఈయనకు మైకు ఇవ్వొద్దు.. నువ్వు ఏ పార్టీవయా..?’ అంటూ వేలెత్తి చూపిస్తూ మాటల దాడికి దిగారు. దీంతో డాక్టర్ సంజయ్ ‘నీకేం సంబంధం.. నాది కాంగ్రెస్ పార్టీ.. నువ్వు కూర్చో’ అన్నారు. దీంతో.. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో సంజయ్ చేతిని కౌశిక్‌రెడ్డి తోసేశారు. అనంతరం కౌశిక్‌రెడ్డి పరుష పదజాలం వాడటంతో గొడవ పెద్దదై పరస్పరం తోసుకునే స్థాయికి చేరింది. ఆ అనూహ్య పరిణామానికి వేదికపై ఉన్న మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు నిర్ఘాంతపోయారు. పక్కనే ఉన్న ప్రజాప్రతినిధులు వారించే యత్నం చేసినా కౌశిక్‌రెడ్డి వినలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆయనను బలవంతంగా సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. కౌశిక్ వెంట మిగతా బీఆర్ఎస్ ప్రతినిధులు వెళ్లిపోయారు.నీటిపారుదల శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఏడుసార్లు గెలిచిన తాను రాజకీయంగా ఇలాంటి ప్రవర్తనను ఎన్నడూ చూడలేదంటూ తోటి శాసనసభ్యుడితో కౌశిక్‌రెడ్డి ప్రవర్తించిన తీరును ఉత్తమ్ తప్పుబట్టారు. నాలుగు కేసులు నమోదుహుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై (Padi kaushik Reddy) పలు సెక్షన్ల కింద మూడు కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారని.. ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ ఛైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకో కేసును ఫైల్ చేశారు. వీటితో పాటు గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కాంగ్రెస్ మరో ఫిర్యాదు చేసింది. ఈమేరకు వేర్వేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై నాలుగు కేసులను పోలీసులు నమోదు చేశారు. -
కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు
సాక్షి, కరీంనగర్: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో వాగ్వాదం కారణంగా హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో, కరీంనగర్లో రాజకీయం మరోసారి హీటెక్కింది. కౌశిక్ రెడ్డి సవాల్‌తో రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బిగ్ షాక్ తగలింది. ఆయనపై పలు సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌పై దురుసుగా ప్రవర్తించారని.. ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, సమావేశంలో గందరగోళం సృష్టించి, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై మూడో కేసు ఫైల్ చేశారు పోలీసులు.ఇదిలా ఉండగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యాచరణ ప్రణాళిక, సమీక్ష సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న పథకాల అమలులో సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కోరారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఏ పార్టీ అని.. మైక్ ఎందుకు ఇచ్చారని మంత్రులను ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే సంజయ్ కూడా స్పందించారు. ‘నీది ఏ పార్టీ అంటే నీది ఏ పార్టీ..’అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. దూషణల పర్వం..ఈ సందర్బంగా తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని సంజయ్ సమాధానం ఇచ్చారు. ఇద్దరి మధ్యన వాగ్వాదం పెరిగి కలబడి చేతులతో తోసుకున్నారు. పరస్పరం దూషణలకు దిగారు. పోలీసులు కలగజేసుకొని పాడి కౌశిక్‌ను అడ్డుకున్నారు. దీంతో కొన్ని నిమిషాలపాటు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పరుగున వెళ్లి వారిద్దరినీ వారించే యత్నం చేశారు. పాడిని బలవంతంగా పోలీసులు బయటకు తరలించారు. కేసీఆర్ ఫొటో పెట్టుకొని గెలిచిన వారంతా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యేనూ ఇలాగే నిలదీస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై సంజయ్ బదులిస్తూ.. ముందు పార్టీ ఫిరాయింపులను గతంలో ప్రోత్సహించిన కేసీఆర్, కేటీఆర్ ముందు రాజీనామా చేయాలని, తాను జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తానని, త్వరలో పార్టీలో చేరతానని మీడియాకు తెలిపారు.నేను రాజీనామా చేస్తా.. మీరు సిద్ధమా? శాసనసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని.. దమ్ముంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలంతా తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అమ్ముడుపోయారని, ఆయనకు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని చెప్పారు. దమ్ముంటే సంజయ్ తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్‌పై గెలవాలన్నారు. -
ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్‌రెడ్డిల మధ్య తోపులాట
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్‌రెడ్డి(kaushik reddy)ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ‘నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత’ అనేంత స్థాయిలో వాగ్వాదం జరిగింది.జిల్లా సమీక్షా సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే సంజయ్(MLA Sanjay) మాట్లాడుతుండగా పాడి కౌశిక్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇంతకీ మీ పార్టీ ఎంటంటూ సంజయ్‌ను కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రస్థాయికి చేరి ఇద్దరు తోసుకునేంతవరకూ వెళ్లింది. దాంతో కౌశిక్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఇదంతా ముగ్గురు తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబుల సమక్షంలో జరగడం శోచనీయం.కౌశిక్‌రెడ్డి బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూఊ. ‘ ఎమ్మెల్యే సంజయ్ అమ్ముడుపోయారు. సంజయ్‌కు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష. దమ్ముంటే సంజయ్ రాజీనామా చేయాలి. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్లా అంటూ కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. -
కెనడా ప్రధాని చుట్టూ ఖలిస్తాన్ ఉగ్రవాదులే
న్యూఢిల్లీ: కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో తీరును కెనడాలో భారత హై కమిషనర్‌గా పనిచేసిన సంజయ్ కుమార్ వర్మ బట్టబయలు చేశారు. ట్రూడో ఆంతరంగికుల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులతోపాటు భారత వ్యతిరేక శక్తులు ఉంటాయని చెప్పారు. కెనడాలో రాజకీయ అవసరాల కోసం ఖలిస్తానీ ఉగ్రవాదులకు ట్రూడో ప్రభుత్వం రక్షణ కవచంగా నిలుస్తోందని అన్నారు. భారత్–కెనడా మధ్య వివాదం నేపథ్యంలో సంజయ్ కుమార్ వర్మను భారత ప్రభుత్వం ఇటీవల వెనక్కి పిలిపించిన సంగతి తెలిసిందే. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కెనడాలోని ఖలిస్తానీ శక్తులు, భారత వ్యతిరేక శక్తులు ప్రధాని ట్రూడోతో అత్యంత సన్నిహితంగా మెలుగుతుంటాయని వెల్లడించారు. ఖలిస్తాన్ మద్దతుదారులు ట్రూడో ఆప్తమిత్రులుగా మారిపోయారని తెలిపారు. 2018లో ట్రూడో భారత్‌ను సందర్శించినప్పుడు ఆయన వెంటనే ఖలిస్తాన్ సానుభూతిపరులు కూడా కనిపించారని సంజయ్ కుమార్ వర్మ గుర్తుచేశారు. ఖలిస్తాన్ పోరాట యోధులమని చెప్పుకుంటున్న వ్యక్తులకు కెనడాలో ఎనలేని ప్రోత్సాహం లభిస్తోందని ఆరోపించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో సంజయ్ కుమార్ వర్మను కెనడా ప్రభుత్వం అనుమానితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు భారత్ సహకరించడం లేదని కెనడా చేస్తున్న ఆరోపణలపై సంజయ్ కుమార్ వర్మ స్పందించారు. ఆ కేసులో భారత్ పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని తేలి్చచెప్పారు. ఖలిస్తానీ ముష్కరులు కెనడాలో భారత కాన్సులేట్ కార్యాలయాల ఎదుట అల్లర్లు సృష్టించారని, భారత దౌత్యవేత్తలను సోషల్ మీడియా ద్వారా బెదిరించేందుకు ప్రయత్నించారని గుర్తుచేసుకున్నారు. దారుణ పరిస్థితుల్లో విద్యార్థులు కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాలని కోరుకుంటున్న భారత విద్యార్థులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సంజయ్ కుమార్ వర్మ సూచించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మెరుగ్గా లేవని అన్నారు. రూ.లక్షలు ఖర్చు చేసినా మంచి కాలేజీల్లో ప్రవేశాలు దొరకడం లేదని, చదువులు పూర్తిచేసుకున్నాక ఉద్యోగాలు లభించడం లేదని చెప్పారు. విద్యార్థుల్లో కుంగుబాటు, ఆత్మహత్య వంటి పరిణామాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. తాను కెనడాలో హైకమిషనర్‌గా పనిచేసిన సమయంలో వారానికి కనీసం రెండు మృతదేహాలను భారత్‌కు పంపించిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యోగాలు రాక, తల్లిదండ్రులకు ముఖం చూపించలేక కెనడాలో భారతీయ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. అందుకని కెనడాను ఎంచుకోకపోవడమే మంచిదని సూచించారు. ఒకవేళ భారత్–కెనడా మధ్య సంబంధాలు బాగున్నా కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు తాను ఇదే సలహా ఇచ్చేవాడినని వ్యాఖ్యానించారు. ఎన్నో ఆశలతో వెళ్లిన విద్యార్థులు శవాలై తిరిగి వస్తున్నారని పేర్కొన్నారు. ఈ దుస్థితికి ఏజెంట్లు కూడా కొంత కారణమని విమర్శించారు. రూ.లక్షలు దండుకొని ఊరూపేరు లేని కాలేజీల్లో విద్యార్థులను చేరి్పస్తున్నారని, సరైన వసతులు కూడా కలి్పంచడం లేదని వెల్లడించారు. వారానికి కేవలం ఒక క్లాసు నిర్వహించే కాలేజీలు కూడా ఉన్నాయన్నారు. ఇరుకు గదిలో ఎనిమిది మంది విద్యార్థులు సర్దుకోవాల్సిన పరిస్థితి అక్కడ కనిపిస్తున్నాయని తెలిపారు. కెనడాలో భారతీయ విద్యార్థులు చదువులు పూర్తి చేసుకున్నప్పటికీ ఉద్యోగాలు రాక జీవనోపాధి కోసం క్యాబ్ డ్రైవర్లుగా పని చేస్తున్నారని, దుకాణాల్లో చాయ్, సమోసాలు అమ్ముకుంటున్నారని సంజయ్ వర్మ ఆవేదన వ్యక్తంచేశారు. -
వెన్నుపోటు పొడిచింది
న్యూఢిల్లీ: ఒక ఖలిస్తానీ వేర్పాటువాద ఉగ్రవాదికి వంతపాడుతూ భారత్ వంటి ప్రజాస్వామ్య దేశం పట్ల కెనడా అత్యంత అనైతికంగా వ్యవహరించిందని అక్కడి నుంచి తిరిగొచ్చిన భారత హైక మిషనర్ సంజయ్ కుమార్ వర్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. కెనడాలో ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో సంజయ్ వర్మసహా పలువురు దౌత్యాధికారులను విచారిస్తామని కెనడా ప్రకటించడం, కెనడా చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ భారత్ తన దౌత్యాధికారులను వెంటనే వెన క్కి రప్పించి, కెనడా దౌత్యాధికారులను బహిష్కరించడం తెల్సిందే. హఠాత్తుగా భారత్– కెనడా దౌత్యబంధంలో భారీ బీటలు వారిన వేళ సంజయ్ గురువారం ‘పీటీఐ’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.పాలకవర్గం మొదలు పార్లమెంట్‌దాకా‘‘ కెనడాలో పాలకవర్గం మొదలు రక్షణ బలగాలు, చివరకు పార్లమెంట్‌దాకా అన్ని రాజ్యాంగబద్ధ్ద సంస్థల్లో ఖలిస్తానీ సానుభూతిపరులు చొరబడ్డారు. ఇలా ఖలిస్తానీవాదులు తమ అజెండాను బలంగా ముందుకు తోస్తున్నారు. భారత సార్వభౌమత్వాన్ని సైతం సవాల్ చేసే సాహసం చేస్తున్నారు. మన సమగ్రతను అక్కడి ఎంతోమంది కెనడియన్ పార్లమెంటేరియన్లు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. తోటి ప్రజాస్వామ్య మిత్రదేశంగా భారత సమగ్రతను కెనడా గౌరవిస్తుందని భావించా. కానీ వాళ్లు వెన్నుపోటు పొడిచారు. అత్యంత అనైతికంగా వ్యవహరించారు. ఖలిస్తానీవాదుల కారణంగా కెనడా విదేశాంగ విధానం పెడతోవలో వెళ్తోంది. ఓటు బ్యాంక్‌ను కాపాడుకునేందుకు రాజకీయనేతలకు ఖలిస్తానీ వాదుల మద్దతు అవసరమైంది. ఇదే చివరకు ఇరుదేశాల దౌత్యసత్సంబంధాల క్షీణతకు ప్రధాన హేతువు. రోజురోజుకూ కెనడా రాజకీయ ముఖ చిత్రంపై ఖలిస్తానీవాదుల పాత్ర పెద్దదవుతోంది. అక్కడి భారతీయ సంతతి ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతుంటే ఖలిస్తానీవాదులు మాత్రం తమ అనైతిక డిమాండ్ల కోసం తెగిస్తున్నారు. ‘ఖలిస్తాన్’ వాదనను ఖలిస్తానీవాదులు కెనడాలో ఒక వ్యాపారంగా మార్చేశారు. ఆయుధాలు, మత్తుపదార్థాల అమ్మకాలు, మానవుల అక్రమ రవాణా, వ్యభిచారం, బెదిరింపులు వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. ఓట్లు పోతాయన్న భయంతో అక్కడి ప్రభుత్వం ఇవన్నీ తెల్సి కూడా కళ్లుమూసుకుంటోంది’’ అని అన్నారు.దౌత్య రక్షణ పీకేస్తామన్నారుతనతోపాటు మరో ఐదుగురు దౌత్యసిబ్బందిని కెనడా బహిష్కరించిన ఘటనను వర్మ గుర్తుచేసుకున్నారు. ‘‘ అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం టొరంటో ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నప్పుడు నాకొక మెసేజ్ వచ్చింది. అర్జంటుగా కెనడా విదేశాంగ శాఖకు వచ్చి అధికారులను కలవాలని ఆ సందేశంలో ఉంది. 13వ తేదీన గ్లోబల్ అఫైర్స్ కెనడా(విదేశాంగశాఖ) ఆఫీస్‌కు నేను, డెప్యూటీ హైకమిషనర్ వెళ్లాం. ‘నిజ్జర్ హత్య కేసులో మీ ప్రమేయంపై మిమ్మల్ని ఇంటరాగేషన్ చేయాల్సి ఉంది. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు మిమ్మల్ని విచారిస్తారు. వీటికి అవరోధంగా ఉన్న, మిమ్మల్ని కాపాడుతున్న ‘దౌత్యరక్షణ’ను తీసేస్తాం’ అని కెనడా అధికారులు మాతో చెప్పారు. దాంతో మాకో విషయం స్పష్టమైంది. దౌత్యనీతిని అవహేళన చేస్తూ, నిబంధనలకు నీళ్తొదిలేస్తూ హైకమిషనర్‌ను ప్రశ్నిస్తామని చెప్పడంతో నిర్ఘాంతపోయాం. పలు దేశాల్లో దౌత్యవేత్తగా పనిచేసిన నా 36 సంవత్సరాల కెరీర్లో ఇలాంటి అవమానాన్ని ఏ దేశంలోనూ ఎదుర్కోలేదు. నిజ్జర్హత్యసహా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు మేం పాల్పడలేదు. అయినా దౌత్యవేత్తలతో వ్యవహరించాల్సిన పద్ధతి ఇదికాదు’’ అని ఆయన అన్నారు. -
భగ్గుమన్న దౌత్య బంధం
న్యూఢిల్లీ: సిక్కు వేర్పాటువాది, ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతం ఒక్కసారిగా భారత్, కెనడా దౌత్యసంబంధాల్లో మంటలు రాజేసింది. నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సి ఉందంటూ ఆదివారం భారత విదేశాంగ శాఖకు కెనడా సందేశం పంపింది. దీంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఖలిస్తాన్ వేర్పాటువాది హత్య కేసులో తమ దౌత్యాధికారులను ఇరికించడంపై భారత సర్కార్ తీవ్రంగా స్పందించింది. కెనడా తాత్కాలిక హైకమిషనర్ స్టివార్ట్ వీలర్సహా ఆరుగురు దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. బహిష్కరణకు గురైన వారిలో డెప్యూటీ హై కమిషనర్ ప్యాట్రిక్ హేబర్ట్, ఫస్ట్ సెక్రటరీలు మేరీ కేథరీన్ జోలీ, అయాన్ రోస్ డేవిడ్ ట్రైస్, ఆడమ్ జేమ్స్ చుప్కా, పౌలా ఓర్జులాలు ఉన్నారు. అక్టోబర్ 19వ తేదీన రాత్రి 11.59 గంటల్లోపు భారత్‌ను వీడాలని ఆదేశాలు జారీచేసింది. కెనడాలో విధులు నిర్వర్తిస్తున్న భారత దౌత్యవేత్త, దౌత్యాధికారులు, సిబ్బందిని స్వదేశానికి రప్పిస్తామని సోమవారం భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అంతకుముందు తన నిరసన తెలిపేందుకు కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ రోస్ వీలర్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీచేసింది. దీంతో ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చి ఆ శాఖ కార్యదర్శి(తూర్పు) జైదీప్ మజుందార్‌ను కలిశారు. అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త పేరును చేర్చడంపై ఆయన ఎదుట భారత్ తన నిరసనను వ్యక్తంచేసింది. ఇది జరిగిన కొద్దిసేపటికే దౌత్యాధికారులను రప్పించడంపై విదేశాంగశాఖ నిర్ణయం వెలువడింది. ‘‘ కెనడాలో తీవ్రవాదం, హింసాత్మక ఘటనలు, ట్రూడో ప్రభుత్వ చర్యలు అక్కడి భారతీయ దౌత్యాధికారులను ప్రమాదంలోకి నెట్టేశాయి. ప్రస్తుత కెనడా ప్రభుత్వం వీళ్ల భద్రతకు భరోసా కలి్పస్తుందన్న నమ్మకం పోయింది. అందుకే వీళ్లందరినీ వెనక్కి రప్పించుకోవాలని భారత సర్కార్ నిర్ణయంచుకుంది. సిక్కు వేర్పాటువాదానికి మద్దతు పలుకుతూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ట్రూడో సర్కార్ దుందుడుకు చర్యలకు దీటుగా ప్రతిస్పందించే హక్కు భారత్‌కు ఉంది’’ అని విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్, కెనడా దౌత్యసంబంధాలు దారుణస్థాయికి క్షీణించడంతో కెనడాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయ పౌరులు, విద్యనభ్యసిస్తున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ట్రూడో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఓటు బ్యాంక్ రాజకీయ లబి్ధపొందేందుకు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఇలా తమ దౌత్యవేత్తలను అప్రతిష్టపాలు చేస్తోందని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. మీ ప్రభుత్వం నిందారోపణలు చేయడం మానుకోవాలని కెనడా దౌత్యవేత్త ఎదుట భారత్ తన నిరసన వ్యక్తంచేసింది. ‘‘ కెనడాలోని భారతీయ హై కమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులపై ఇలా నిరాధారపూరితంగా వేధించడం ఏమాత్రం ఆమోదనీయం కాదు’’ అని స్పష్టంచేసింది. ఆరోపణలకు తగ్గ ఆధారాలు ఇవ్వలేదు ‘‘ 2023 సెపె్టంబర్లో ఈ ఉదంతంలో భారత ప్రమేయం ఉందంటూ ట్రూడో ఆరోపణలు చేశారు. కానీ ఆ మేరకు సాక్ష్యాధారాలను భారత ప్రభుత్వానికి అందజేయలేదు. ట్రూడో కెనడా ఓటుబ్యాంక్ రాజకీయాల్లో లబ్ది పొందేందుకే కేసు దర్యాప్తు సమగ్రంగా జరక్కముందే వాస్తవాలు లేకుండా భారత హైకమిషనర్ వర్మకు వ్యతిరేకంగా కెనడా వ్యవహరిస్తోందన్నది సుస్పష్టం. 2018లో భారతలో పర్యటించినప్పటి నుంచే ట్రూడో భారత్‌తో ఘర్షణాత్మక వైఖరిని అవలంభిస్తున్నారు. భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న, తీవ్రవాదులతో సత్సంబంధాలున్న వ్యక్తులకు ట్రూడో మంత్రివర్గంలో చోటుదక్కింది. 2020 డిసెంబర్లో భారత ఎన్నికల ప్రక్రియలోనూ ట్రూడో జోక్యం చేసుకునేందుకు యతి్నంచారు. ట్రూడో ప్రభుత్వం పూర్తిగా ఒకే రాజకీయ పారీ్టపై ఆధారపడింది. ఆ పార్టీ కేవలం భారత్‌లో సిక్కు వేర్పాటువాదాన్ని ఎగదోయడమే పనిగా పెట్టుకుంది’’ అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.విశ్వసనీయ సమాచారం ఇచ్చాం: వీలర్ భారత విదేశాంగ శాఖ కార్యాలయం నుంచి బయటికొచ్చాక కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ వీలర్ మీడియాతో మాట్లాడారు. ‘‘ భారత్ ఏవైతే ఆధారాలను అడిగిందో వాటిని కెనడా ప్రభుత్వం ఇచి్చంది. కెనడా సొంత గడ్డపై కెనడా పౌరుడి హత్యోదంతంలో భారత సర్కార్‌కు చెందిన ఏజెంట్ల పాత్రపై విశ్వసనీయ, ఖచి్చతమైన సమగ్ర ఆధారాలను భారత్‌కు కెనడా ప్రభుత్వం అందజేసింది. ఇక నిర్ణయం భారత్‌కే వదిలేస్తున్నాం. ఇరు దేశాల స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ తన తదుపరి చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నాం. ఈ విషయంలో సహకరించేందకు కెనడా సిద్ధంగా ఉంది’’అని వీలర్ వ్యాఖ్యానించారు.ఏమిటీ నిజ్జర్ వివాదం? నిజ్జర్ కెనడా కేంద్రంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని గతంలోనే భారత్ కెనడా సర్కార్‌కు తెలియజేసినా ఎలాంటి స్పందనా రాలేదు. 2023 ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో గురుద్వారా సాహెబ్ పార్కింగ్ ప్రదేశంలో నిజ్జర్‌ను గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు కాల్చి చంపారు. అయితే ఈ కాల్పుల ఘటన వెనుక భారత నిఘా ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో గత ఏడాది సెపె్టంబర్లో తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఆధారాల్లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది. హత్యకు సంబంధించి ఆధారాలు సమర్పిస్తే పరిశీలించి దర్యాప్తునకు సహకరించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని భారత్ స్పష్టంగా చెప్పింది. అయితే నిజ్జర్‌ను పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు చంపేసి ఆ నేరం భారత్‌పై మోపాలని కుట్ర జరిగిందని గతంలో అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. నిజ్జర్ హత్యకు గురై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది జూన్‌లో అక్కడి పార్లమెంట్ దిగువసభలో కెనడా ఎంపీలు నిజ్జర్‌కు నివాళులర్పించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్‌పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తికి ఏకంగా పార్లమెంటులో నివాళులరి్పంచడం దారుణం’’ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరీ నిజ్జర్? నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్, ‘గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్’ అధిపతి అయిన నిజ్జర్ సిక్కు వేర్పాటువాదిగా పేరొందాడు. భారత్‌లోని జలంధర్ ప్రాంతంలోని బార్సింగ్పూర్లో జని్మంచాడు. 1997లో తప్పుడు పాస్ట్‌పోర్ట్‌లో కెనడాకు వెళ్లి స్థిరపడ్డాడు. అయితే అక్కడి నుంచే భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాడు. అమెరికాలో నెలకొల్పిన జస్టిస్ ఫర్ సిఖ్స్ సంస్థలో క్రియాశీలకంగా పనిచేశాడు. పంజాబ్‌లో హత్యలకు కుట్రపన్నాడన్న కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద భారత్ ఇతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇతని తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. జాతీయ దర్యాప్తు సంస్థ భారత్‌లోని ఇతని ఆస్తులను స్వా«దీనం చేసుకుంది. -
బంగారం అక్రమ రవాణా తగ్గుతుంది..
న్యూఢిల్లీ: బంగారంపై భారీగా కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలనే నిర్ణయం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి దోహదపడుతుందని సీబీఐసీ (పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డ్) చైర్మన్ సంజయ్ కుమార్ మల్హోత్రా తెలిపారు. అలాగే దేశంలోని రత్నాలు ఆభరణాల ఎగుమతులు పెరగడానికి, ఉపాధి వృద్ధికి సహాయపడుతుందని ఆయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2023–24) కస్టమ్స్ శాఖ, డీఆర్ఐ కలిసి 4.8 టన్నుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2022–23లో ఈ పరిమాణం 3.5 టన్నులు కావడం గమనార్హం. యల్లోమెటల్సహా పలు విలువైన లోహాల దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి భారీగా తగ్గిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారీ ఉపాధి కల్పన రత్నాలు, ఆభరణాల రంగంలో దాదాపు 50 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, ఎగుమతుల్లో ఈ రంగం వాటా 8 శాతం వరకూ ఉందని కుమార్ మల్హోత్రా తెలిపారు. దేశానికి 2023–24లో 45.54 బిలియన్ డాలర్ల విలువైన పసిడి దిగుమతులు జరిగాయి. వెండి విషయంలో ఈ విలువ 5.44 బిలియన్ డాలర్లుగా ఉంది. అదే సమయంలో ఆభరణాల ఎగుమతులు విలువ 13.23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వార్షికంగా భారత్ 800 నుంచి 900 టన్నుల పసిడి దిగుమతులను చేసుకుంటోంది. బంగారం దిగుమతులలో స్విట్జర్లాండ్ అతిపెద్ద వాటాదారుగా ఉంది. మొత్తం దిగుమతుల్లో ఈ దేశం వాటా దాదాపు 40 శాతం. తరువాతి 16 శాతానికిపైగా వాటాతో యూఏఈ రెండవ స్థానంలో ఉంది. 10 శాతం వాటాలో దక్షిణాఫ్రికా మూడవ స్థానంలో నిలుస్తోంది. 2022లో పెరిగిన సుంకాలుదేశంలోకి వచీ్చ–వెళ్లే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) భారీ పెరుగుదలను నివారించడానికి 2022 జూలైలో (10.75 శాతం నుంచి 15 శాతానికి) కస్టమ్స్ సుంకాన్ని భారీగా పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2022–23లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతంగా ఉన్న క్యాడ్, 2023–24లో ఏకంగా 0.7 శాతానికి తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏకంగా మిగులు నమోదయ్యింది. -
జగిత్యాల కాంగ్రెస్‌లో కొత్త చర్చ.. జీవన్‌రెడ్డి ఫొటో ఎక్కడ?
సాక్షి, జగిత్యాల: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష పార్టీల నేతలు హస్తం గూటికి చేరుతున్న నేపథ్యంలో పలు చోట్ల కాంగ్రెస్ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాలలో కాంగ్రెస్ రాజకీయం చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఫ్లెక్సీల వార్ ఇంకా కొనసాగుతోంది.తాజాగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, ఫ్లెక్సీల్లో ఎక్కడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫొటోలు లేకపోవడం స్థానికంగా హాట్ టాపిక్ అయ్యింది. కావాలనే జీవన్ రెడ్డి ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. ఇక.. మొన్న కూడా జీవన్ రెడ్డి ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించిన విషయం తెలిసిందే.మరోవైపు.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య సయోధ్య కుదరడం లేదు. దీంతో, రెండు వర్గాల మధ్య దూరం పెరుగుతోంది. ఈనేపథ్యంలో జగిత్యాల కాంగ్రెస్‌లో అంతర్గత పోరు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. జగిత్యాలలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డిని కావాలనే సైడ్ చేస్తున్నారా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
జగిత్యాల ప్రగతికే కాంగ్రెస్‌లో చేరా
జగిత్యాల: సీఎం రేవంత్‌రెడ్డి రైతు పక్షపాతి అని, జగిత్యాల ప్రాంతాభివృద్ధికి ఆయనతో కలిసి పనిచేసేందుకే కాంగ్రెస్‌లో చేరానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.తనను విమర్శించిన ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో హుందాతనంతో రాజకీయాలు చేయాలని, తనపై తప్పుడు ఆరోపణలను ఖండించారు. తన ఆర్థిక పరిస్థితి ప్రజలందరికీ తెలుసన్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారని సంజయ్ కుమార్ గుర్తు చేశారు. -
నాడు మీరు పార్టీలో చేర్చుకోలేదా?.. కేటీఆర్‌కు ఎమ్మెల్యే సంజయ్ కౌంటర్
సాక్షి, జగిత్యాల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అలాగే, తనపై విమర్శలు చేసిన వారే ఏం జరిగిందో ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని కౌంటరిచ్చారు. అలాగే, జగిత్యాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ చేరినట్టు వెల్లడించారు.కాగా, సంజయ్ కుమార్ మంగళవారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. నేను బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు కనీసం ఒక్క కౌన్సిలర్‌గా కూడా లేని పరిస్థితిలో ఉన్నాను. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టడానికి ఎవరూ ముందుకు రాకపోతే మా బంధువులతో కట్టించాను. నన్ను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాను. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను. కేటీఆర్ మాటలు నన్ను బాధించాయి. విమర్శలు చేసిన వారే ఏం జరిగిందో ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి. గతంలో వేరే పార్టీలో గెలిచినవారిని మీరెలా(బీఆర్ఎస్) చేర్చుకోన్నారో ముందు సమాధానం చెప్పాలి. జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం. నేను ఒక డాక్టర్‌ను చాలా కుటుంబాలను పోషించేంత ఆర్థికంగా ఉన్నవాడిని. జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే కాంగ్రెస్‌లో చేరాను. మా కుటుంబం అంతా కాంగ్రెస్‌లోనే ఉన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి నడిస్తే అభివృద్ధి సాధ్యమని భావించాను. రైతుల కోసం రుణమాఫీ చేయడానికి ప్రక్రియ ప్రారంభించారు సీఎం రేవంత్. తెలంగాణాలో ఎక్కడా లేని విధంగా జగిత్యాలలో డబుల్ బెడ్ రూమ్స్ కట్టించాం. దీనికి సంబంధించిన డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. సంజయ్ కుమార్ ఇటీవలే సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ బీ-ఫామ్‌తో ఎన్నికల్లో గెలిచిన సంజయ్.. పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే సంజయ్‌పై కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంలో బీఆర్ఎస్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. -
గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే.. ఎమ్మెల్యే సంజయ్‌కు కేటీఆర్ చురకలు
సాక్షి, జగిత్యాల: గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను ఉద్ధేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలకు పట్టిన శని పోయిందని నియోజకవర్గ ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడు మనషుల విలువ తెలుస్తుందని తెలిపారు. గాలికి గడ్డపారలు కొట్టుకుపోవు. గట్టి నాయకులు కొట్టుకుపోరని అన్నారు. గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమేనని తెలిపారు.కార్యకర్తలు ఎమ్మెల్యేను తయారు చేశారు కానీ.. ఎమ్మెల్యే, కార్యకర్తలను తయారు చేయలేదని తెలిపారు. వేల మంది కష్టపడితే ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇప్పుడు దొంగల్లో కలిశాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతులకు ఆశపడి పోయిండని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే బుద్ది ఇవాళ తెలిసి వచ్చిందన్నారు.‘అభివృద్ధి కోసం పోయినా అని సంజయ్ అన్నాడు. జగిత్యాల జిల్లా రద్దు చేస్తా.. మెడికల్, నర్సింగ్ కాలేజీ రద్దు చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నందుకు సంజయ్ కాంగ్రెస్‌లోకి వెళ్లిండా..? రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 4500 డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినందుకు రద్దు చేయమని పోయావా..? ఏ అభివృద్ధి ఆశించి పోయిండు సంజయ్. ఆయన పోయింది ఒక్కదాని కోసం..వియ్యంకుడి బిల్లులు రావాలి.. ఆయన క్రషర్ ఆగొద్దని పోయిండు. సొంత అభివృద్ధి కోసం పోయిండు.. జగిత్యాల అభివృద్ధి కోసం పోలేదు. ఎమ్మెల్యే సంజయ్‌కు దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలి.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది కాంగ్రెస్ పార్టీనే. దేశంలో ఆయారాం, గయారాం సంస్కృతికి బీజం వేసింది కాంగ్రెసే. దేశంలో ఎన్నో ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని చవిచూశాయి. స్థానిక సంస్థల్లో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి. జగిత్యాల ఎమ్మెల్యే తనకు తానే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు.2014 తర్వాత రేవంత్ రెడ్డి 50 లక్షలతో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికి జైలుకు పోయాడు. మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశాడు. టీడీపీ, బీఎస్పీ నుంచి మూడింట రెండొంతుల మంది మన పార్టీలో రాజ్యాంగబద్ధంగా విలీనం అయ్యారు. మనం రాజ్యాంగాన్ని, చట్టాన్ని తుంగలో తొక్కలేదు. 2014లో టీడీపీ నుంచి 15 మంది గెలిస్తే 10 మంది, బీఎస్పీ నుంచి గెలిచిన ఇద్దరు కలిసి బీఆర్ఎస్లో విలీనం అయ్యారు. 2018లో కాంగ్రెస్ నుంచి 18 మంది గెలిస్తే.. 12 మంది చేరారు. రాజ్యాంగబద్దంగా మూడింట రెండొంతుల మంది చేరారు. ఒక్కొక్కరు వచ్చి కండువా కప్పుకోలేదు. ఆ పని కేసీఆర్ చేయలేదు అని కేటీఆర్ వివరించారు.పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలను కుక్కల మాదిరి రాళ్లతో కొట్టి చంపాలని రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడారు. మరి ఇప్పుడు ఎవరు పిచ్చికుక్క.. ఎవర్నీ రాళ్లతో కొట్టిచంపాలి. మీ చెమట, మీ రక్తం ధారపోసి గెలిపించాక పార్టీ ఫిరాయింపులు చేస్తే అలాంటి వారిని రాళ్లతో కొట్టిచంపమని రేవంత్ రెడ్డే చెప్పాడు. మరి ఎవర్నీ పిచ్చి కుక్క మాదిరి కొట్టాలి..? ఎవర్నీ రాళ్లతో కొట్టాల్సిన అవసరం లేదు కానీ.. రేవంత్ రెడ్డి నీవు మొగోడివి అయితే.. నీకు దమ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా.. ఓట్లతో కొట్టి ఆ ఆరుగురిని రాజకీయంగా శ్వాశతంగా సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటది అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
పోచారం, సంజయ్‌పై బీఆర్ఎస్ ఫిర్యాదు.. స్పీకర్‌కు మెయిల్
సాక్షి,హైదరాబాద్: పార్టీ మారుతున్న ఎంఎల్ఏలపై అనర్హతపై దూకుడు బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్,శాసన సభ సెక్రటరీకి ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.వెంటనే వారిద్దరిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి మెయిల్లో విజ్ఞప్తి చేశారు. స్పీకర్ సమయమడగడానికి ఫోన్ చేసినా ఆయన ఆఫీస్ స్పందించకపోవడంతో ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం, దానం, తెల్లంలపైనా బీఆర్ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వీరందరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది. -
ఇంకా అలక వీడని జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనకు సమాచారం లేకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడంపై కినుక వహించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఇంకా అలకపాన్పు వీడలేదు. సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,సీనియర్ మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం హైదరాబాద్‌లోని జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లి గంటన్నర పాటు చర్చించారు. చర్చల తర్వాత కూడా ఆయన తన వైఖరి మార్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీని తాను వదిలే ప్రసక్తే లేదని, అయితే ఎమ్మెల్సీ పదవికి మాత్రం త్వరలోనే రాజీనామా చేస్తానని జీవన్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. మండలి చైర్మన్‌కు ఫోన్ సంజయ్ చేరిక సమయంలో కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదన్న మనస్తాపంతో ఉన్న జీవన్‌రెడ్డితో కాంగ్రెస్ నాయకత్వం సోమవారం చర్చలు జరిపింది. పార్టీ అధిష్టానం కూడా మాట్లాడింది. అయినా, తన వైఖరిలో మార్పు లేదంటూ జీవన్‌రెడ్డి మంగళవారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తాను కలుస్తానంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఫోన్ చేశారు. కానీ, తాను అందుబాటులో లేనని, నల్లగొండ వెళుతున్నానని గుత్తా వెల్లడించడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు బేగంపేటలోని జీవన్‌రెడ్డి నివాసానికి హుటాహుటిన వెళ్లారు. గంటన్నరకు పైగా అక్కడే ఉండి జీవన్‌రెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ తగిన గౌరవం ఇస్తుందని, సీనియారిటీకి ఎక్కడా గౌరవం తగ్గకుండా తాము చూస్తామని నచ్చజెప్పారు. అయితే, మంత్రులతో చర్చల సందర్భంగా జీవన్‌రెడ్డి తన మనసులోని మాటలను వారికి వెల్లడించారని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలోని తన రాజకీయ ప్రత్యరి్థని పార్టీలో చేర్చుకోవడం ద్వారా తనకు ఏం గౌరవం ఇచి్చనట్టని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో తనది నాలుగు దశాబ్దాల అనుబంధమని, తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని, అయితే ఎమ్మెల్సీ పదవిలో కొనసాగే ఆలోచన ప్రస్తుతానికి లేదని, తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసినట్టు సమాచారం. జీవన్‌రెడ్డి మా మార్గదర్శకులు: డిప్యూటీ సీఎం భట్టి మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర నేతలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని పదేళ్లు పార్టీ జెండాను భుజాన మోస్తూ పార్టీ భావజాలాన్ని చట్టసభల్లో వినిపించిన నాయకుడు జీవన్‌రెడ్డి అని అన్నారు. ఆయన మనస్తాపానికి గురైతే తాము కూడా బాధపడతామని వ్యాఖ్యానించారు. జీవన్‌రెడ్డి తమందరికీ మార్గదర్శకులని, ఆయన అనుభవాన్ని ప్రభుత్వాన్ని నడిపేందుకు తప్పనిసరిగా వినియోగించుకుంటామని చెప్పారు. ఆయన సీనియారిటీకి ఎలాంటి భంగం కలిగించకుండా పార్టీ సముచిత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. సీనియర్ నాయకులను వదులుకునేందుకు పార్టీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జీవన్‌రెడ్డిని తాము కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారని భట్టి వెల్లడించారు. చైర్మన్‌ను సమయం ఎందుకు అడిగానో ఆలోచించుకోండి: జీవన్‌రెడ్డి భట్టి, శ్రీధర్‌బాబులతో చర్చలు ముగిసిన అనంతరం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీతో 40 ఏళ్ల అనుబంధం ఉదని చెప్పారు. జరిగిన పరిణామాలు కొన్ని బాధించాయని వ్యాఖ్యానించారు. తనతో పార్టీ ఇన్చార్జ్ మున్షీ కూడా మాట్లాడారని వెల్లడించారు. శాసనమండలి చైర్మన్ అందుబాటులో లేరని, ఆయన అందుబాటులోకి రాగానే నిర్ణయం చెబుతానని, త్వరలోనే మండలి చైర్మన్ దగ్గరకు వస్తానని అన్నారు. మీరు ఎమ్మెల్సీగా కొనసాగుతారా? రాజీనామా చేస్తారా అని ప్రశ్నించగా, మండలి చైర్మన్ టైం ఎందుకు అడిగానో అర్థం చేసుకోవాలని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
చాలా మనస్తాపానికి గురయ్యాను
-
కాంగ్రెస్ లో కలకలం
-
సంజయ్ చేరిక.. జీవన్ కినుక
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్/జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరిక ఆ పార్టీలో చిచ్చు పెట్టింది. ఆదివారం రాత్రి అనూహ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎం.సంజయ్‌కుమార్ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఫొటోలు బయటికి రావడంతో సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి భగ్గుమన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి శ్రీనివాస్‌లు నచ్చజెప్పినా ఆయన దిగిరాలేదు. చివరికు మంత్రి శ్రీధర్‌బాబు చొరవ తీసుకుని చర్చలు జరిపినా జీవన్‌రెడ్డి శాంతించినట్టుగా కన్పించలేదు. ఏ వ్యక్తిపైనైతే పోరాడానో ఆ వ్యక్తినే పార్టీలో చేర్చుకోవడం ద్వారా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని, వారి అభిప్రాయాలను గౌరవించే బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. తన భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందంటూ సమస్య పరిష్కారం కాలేదనే సంకేతాలు ఇచ్చారు. నన్ను సంప్రదించకుండా ఎలా? జగిత్యాలలో తనపై పోటీ చేసి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తనతో కనీసం సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్‌కు విధేయుడిగా కొనసాగుతున్న తనను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఎలా వ్యవహరిస్తారని ఆయన నిలదీసినట్లు తెలిసింది. తన అవసరం పార్టీకి లేదని భావించే, కనీస సమాచారం ఇవ్వకుండా సంజయ్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని ఆయన అన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయమే ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని భావించారు. ఉదయాన్నే జగిత్యాలలోని తన నివాసానికి చేరుకున్న అనుచరులు, పార్టీ శ్రేణులతో చర్చలు జరిపారు. 40 ఏళ్లు గౌరవప్రదంగా రాజకీయాలు చేశానని, పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానంటూ తన సన్నిహితుల వద్ద జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ విప్‌లుగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాలలో జీవన్‌రెడ్డి ఇంటికి చేరుకుని ఆయనతో చర్చలు జరిపారు. రాజీనామా వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. కానీ జీవన్‌రెడ్డి ససేమిరా అన్నారు. పార్టీకి అండగా నిలిచిన పెద్దమనిషి: శ్రీధర్‌బాబు తర్వాత మంత్రి శ్రీధర్‌బాబు రంగంలోకి దిగారు. జరిగిన వ్యవహారంపై విచారం వ్యక్తం చేస్తూ అన్నివిధాలుగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అనంతరం శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. అనేక క్లిష్టమైన సందర్భాల్లో పార్టీకి, ప్రజలకు అండగా నిలిచిన పెద్దమనిషి జీవన్‌రెడ్డి అని కొనియాడారు. ఆయన మనస్తాపం చెందిన విషయం తెలుసుకుని తామంతా వచ్చి పార్టీకి పెద్దదిక్కుగా ఉండాలని కోరామని తెలిపారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాన్ని, మనోవేదనను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని అందరికీ న్యాయం చేస్తామని ప్రకటించారు. కానీ సోమవారం రాత్రి జగిత్యాలలో విలేకరులతో మాట్లాడిన జీవన్‌రెడ్డి మాత్రం ఎమ్మెల్యే సంజయ్‌ను ఏకపక్షంగా చేర్చుకోవడం సరికాదని అన్నారు. నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ బలోపేతానికి పనిచేశారని, సంఖ్యాబలం ఉన్నా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. వారి అభిప్రాయాల మేరకు నడుచుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. తనతో చర్చించడానికి మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు ఇతర నేతలు వచ్చారని అన్నారు. మూడు విడతలు తలపడిన జీవన్‌రెడ్డి, సంజయ్ జగిత్యాల నియోజకవర్గంలో జీవన్‌రెడ్డి ప్రస్థానం 1983 నుంచి మొదలైంది. అప్పటి నుంచి 2014 వరకు పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక 2014 నుంచి మూడు పర్యాయాలు సంజయ్, జీవన్‌రెడ్డి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. 2014లో జీవన్‌రెడ్డి గెలిచినప్పటికీ, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ చేతిలో ఓడిపోయారు. 2024లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఎమ్మెల్యేగా పరాజయం తర్వాత 2019లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇలావుండగా కాంగ్రెస్‌లో సంజయ్ చేరికను వ్యతిరేకిస్తూ కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కో ఆర్డినేటర్ పదవీకి వాకిటి సత్యంరెడ్డి రాజీనామా చేశారు. -
జీవన్ రెడ్డి అవుట్!.. సంజయ్ ఇన్..!?
-
కాంగ్రెస్‌లో ఆసక్తికర రాజకీయం.. జీవన్‌రెడ్డి వ్యాఖ్యలకు చెక్ పెట్టినట్టేనా?
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ చాలా బలంగా ముందుకు తీసుకువెళ్తోంది. ప్రతిపక్ష పార్టీల్లో కీలక నేతలను హస్తం గూటికి చేర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో జగిత్యాల కాంగ్రెస్‌లో భిన్న నెలకొంది.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రతీ రాజకీయ పార్టీ వారి సిద్దాంతాలకు అనుగుణంగా పని చేయాలి.. పోరాటం చేయాలి. రాష్ట్రంలో ఇప్పటికే 65 మంది ఎమ్మెల్యేలతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవాల్సిన పనిలేదని నా భావన అని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఇతరుల చేరిక అవసరం లేదుపోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికను వ్యతిరేకించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..@jeevanreddyMLC @PocharamBRS @PocharamBRS @PocharamBhasker @BRSparty @INCTelangana @KTRBRS pic.twitter.com/w7wYzgz0gz— Sai (@Vardhavelly) June 23, 2024 అయితే, జీవన్ రెడ్డి ఇలా కామెంట్స్ చేసిన మరుసటి రోజే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో ఆదివారం సంజయ్ కుమార్ హస్తం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో, జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో రెండు పవర్ సెంటర్స్‌పై విస్తృత చర్చ నడుస్తోంది. కాగా, జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ ప్రత్యర్థులుగా ఉన్న విషయం తెలిసిందే. -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మరో ఎమ్మెల్యే
రాయికల్: జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్‌కుమార్ బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి ఆదివారం రాత్రి కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోగల సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రెండురోజుల వ్యవధిలోనే బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశంగా మారింది. సంజయ్‌కుమార్ 2014లో టీఆర్ఎస్లో చేరారు. ఆ సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. తిరిగి 2018లో మరోసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి అదే జీవన్‌రెడ్డిపై విజయం సాధించారు. తిరిగి 2023లో జరిగిన ఎన్నికల్లో జీవన్‌రెడ్డిపైనే మరోసారి గెలుపొందారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొంత నిరుత్సాహంతో ఉన్నట్లు సమాచారం. జాగృతి అధ్యక్షురాలు కవితకు నమ్మిన బంటుగా ఉన్న సంజయ్.. ఆమె అరెస్ట్ అయినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలు కొంత దూరందూరంగా ఉంటున్నారు. మరోవైపు పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ కనీసం సమావేశం కాకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా తర్జనభర్జనలో ఉన్న ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అయితే సంజయ్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పార్టీలో సీనియర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి కూడా తెలియదని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. జీవన్‌రెడ్డికి తెలియకుండా ఆయన పార్టీలో చేరడంతో జిల్లాలో రాజకీయం మలుపుతిరిగే అవకాశముంది. -
ఐఆర్సీటీసీ సీఎండీగా సంజయ్ కుమార్
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా సంజయ్ కుమార్ జైన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు ఐఆర్సీటీసీ తెలిపింది. ఇప్పటి వరకు సంజయ్ కుమార్ జైన్ నార్తర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా సేవలు అందించారు. ‘‘సీఎండీగా సంజయ్ కుమార్ జైన్ తక్షణ నియామకానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. పదవీ విరమణ తేదీ 2026 డిసెంబర్ 31 వరకు లేదంటే తదుపరి ఆదేశాలు వెలవరించేంత వరకు.. వీటిల్లో ఏది ముందు అయితే అది అమలవుతుందని తెలిపింది. ఈ నెల 13న నార్తర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ బాధ్యతల నుంచి తప్పుకున్న జైన్, మరుసటి రోజు ఐఆర్సీటీసీ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సరీ్వసెస్, 1990 బ్యాచ్ అధికారి అయిన జైన్, చార్టర్ అకౌంటెంట్ ఉత్తీర్ణులు. లోగడ భారత ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల వాణిజ్య వెంచర్లు, విధానాల రూపకల్పనలో పాలుపంచుకున్నారు.