
సాక్షి,హైదరాబాద్: పార్టీ మారుతున్న ఎంఎల్ఏలపై అనర్హతపై దూకుడు బీఆర్‌ఎస్ దూకుడు పెంచింది. ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్,శాసన సభ సెక్రటరీకి ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
వెంటనే వారిద్దరిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి మెయిల్‌లో విజ్ఞప్తి చేశారు. స్పీకర్ సమయమడగడానికి ఫోన్ చేసినా ఆయన ఆఫీస్ స్పందించకపోవడంతో ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది.
గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం, దానం, తెల్లంలపైనా బీఆర్‌ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వీరందరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment