Pocharam
-
పోచారంలో కూల్చివేతలపై స్పందించిన హైడ్రా కమిషనర్
సాక్షి, హైదరాబాద్: పోచారంలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ (Hydra Commissioner) స్పందించారు. భద్రత పేరిట 200 ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారని.. అన్ని విషయాల్లో నిబంధనలు ఉల్లంఘించారని రంగనాథ్ తెలిపారు. పదుల ఎకరాల్లో ప్రభుత్వ భూమిని లాక్కొని.. ఎన్ఎంఆర్ సంస్థ కాంపౌండ్ వాల్ కట్టింది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగుతోందన్నారు.కాగా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పలు కాలనీలకు, నివాస ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా నిర్మించిన దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడను అధికారులు తొలగిస్తున్నారు. పోచారం మున్సిపాలిటీలో ఉన్న దివ్య లే అవుట్ మొత్తం విస్తీర్ణం 200 ఎకరాల వరకూ ఉంటుంది. ఇందులో మొత్తం 2218 ప్లాట్లు వేశారు. ఈ ప్లాట్లలో 30 శాతం నల్ల మల్లారెడ్డివేనంటూ ఆరోపణలు ఉన్నాయి.ఇక, దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ కూల్చివేతతో మార్గం సుగమం అయిన కాలనీలు.. ఏకశిలా లే ఔట్, వెంకటాద్రి టౌన్షిప్, సుప్రభాత్ వెంచర్ -1 , మహేశ్వరి కాలనీ, కచ్చవాణి సింగారం, ఏకశిలా - పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీనగర్, సుప్రభాత్ వెంచర్ -4 , వీజీహెచ్ కాలనీ, ప్రతాప్ సింగారం రోడ్డు, సుప్రభాత్ వెంచర్ -2, 3, సాయిప్రియ, మేడిపల్లి, పర్వతపురం, చెన్నారెడ్డి కాలనీ, హిల్స్ వ్యూ కాలనీ, ముత్తెల్లిగూడగా ఉన్నాయి.ఇదీ చదవండి: తెలంగాణలో మరో సంచలనం.. ఇంద్రసేనా రెడ్డి ఫోన్ ట్యాప్! -
పోచారం, సంజయ్‌పై బీఆర్ఎస్ ఫిర్యాదు.. స్పీకర్‌కు మెయిల్
సాక్షి,హైదరాబాద్: పార్టీ మారుతున్న ఎంఎల్ఏలపై అనర్హతపై దూకుడు బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్,శాసన సభ సెక్రటరీకి ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.వెంటనే వారిద్దరిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి మెయిల్లో విజ్ఞప్తి చేశారు. స్పీకర్ సమయమడగడానికి ఫోన్ చేసినా ఆయన ఆఫీస్ స్పందించకపోవడంతో ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం, దానం, తెల్లంలపైనా బీఆర్ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వీరందరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది. -
పోయొద్దాం..! పోచారం..!! పచ్చదనంతో పలకరిస్తున్న పోచారం ప్రకృతి
మెదక్‌జోన్: కోయిల కిలకిల రావాలు.. చెంగుచెంగున ఎగిరి దూకే జింకలు.. పురివిప్పి నాట్యం చేసే నెమళ్లు.. గాంభీర్యాన్ని ప్రదర్శించే మనుబోతులు.. నీల్గాయి, సాంబార్లు, మనసుకు ఆహ్లాదానిచ్చే పచ్చని అటవీఅందాల మధ్య నెలకొన్న సుందర దృశ్యాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అడవమ్మ ఒడిలో స్వేచ్ఛగా విహరిస్తూ.. అందాలను వీక్షించేందుకు ప్రకృతి ప్రేమికులు పట్టణాలను విడిచి పోచారం అభయారణ్యానికి పయనం అవుతున్నారు. ► జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో బోధన్–మెదక్ ప్రధాన రహదారి పక్కన కామారెడ్డి, మెదక్ జిల్లాల సరిహద్దు గ్రామం పోచారం శివారులో ఉందీ ఈ అభయారణ్యం. ► ఈ 600 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు. ఇందులో 1983లో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని స్థాపించారు. ►వైల్డ్ డాగ్, చిరుత, వోల్ఫ్, జాకల్, ఫారెస్ట్ క్యాట్, బద్ధకం బేర్, సాంబార్, నీల్గాయి, చింకారా, చిటల్, నాలుగు కొమ్ముల జింకలను చూడొచ్చు. ► అభయారణ్యం పక్కనే నిజాం కాలంలో నిర్మించిన పోచారం ప్రాజెక్టు అందాలతో ఈ ప్రాంతం పర్యాటకులకు అడ్డాగా మారింది. ► హైదరాబాద్‌కు కేవలం 115 కిలోమీటర్లు దూరంలో ఉన్న అభయారణ్యానికి వారంతంలో పిల్లలు, పెద్దలు కుటుంబంతో కలిసి వచ్చి ఆనందంగా గడుపుతారు. ► నిజాంపాలనలో ఈ అభయారణ్యం వేట ప్రాంతంగా పేరుగాంచగా, నేడు వన్యప్రాణుల ఆవాసంగా మారింది. ► హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, కరీంనగర్, బోధన్ ప్రాంతాల నుంచి పర్యాటకులు సందర్శనకు వస్తుంటారు. ► వసతి కోసం పోచారం, మెదక్ వద్ద అతిథి గదుల్లో సేదతీరవచ్చు. మెదక్ వద్ద ఫారెస్ట్ రెస్ట్ హౌస్ కూడా ఉంది. ఇలా చేరుకోవచ్చు.. హైదరాబాద్ నుంచి వయా నర్సాపూర్, జేబీఎస్ నుంచి వయా తూప్రాన్ మీదుగా మెదక్‌కు రావొచ్చు. మెదక్ నుంచి పోచారం అభయారణ్యం 15 కిలోమీటర్లు అక్కడ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో సీఎస్ఐ చర్చి, ఖిల్లా, ఏడుపాయల, 3 కిలోమీటర్ల దూరంలో జైనమందిర్ ఉంటాయి. -
బిజీ లైఫ్ నుంచి రిలీఫ్ పొందాలనుకుంటున్నారా..? చలో పోచారం..
ఎటుచూసినా భవనాలు... రోడ్లు.. వాహనాల రణగొణ ధ్వనులు.. ఉక్కిరిబిక్కిరి చేసే వాయుకాలుష్యం... ఉరుకుల పరుగుల జీవనం.. ఇదీ నేటి కాంక్రీట్ జంగిల్లా మారిన పట్టణ, నగరవాసుల దయనీయ పరిస్థితి. దీన్నుంచి కాస్త ఉపశమనం పొందాలనుకుంటున్నారా? ఎటుచూసినా పచ్చటి చెట్లు.. పక్షుల కిలకిలారావాలు... అక్కడక్కడా కనిపిస్తూ కనువిందు చేసే వన్యప్రాణులు, స్వచ్ఛమైన పిల్లగాలులు, ప్రకృతి సోయగాల నడుమ సూర్యోదయ, అస్తమయాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. చలో నర్సాపూర్, పోచారం. సాక్షి, హైదరాబాద్: ప్రకృతి ఒడిలో నగరవాసులు కాసేపు సేదతీరేందుకు వీలుగా మెదక్ అటవీ శాఖ, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఏఐడీ) సంయుక్తంగా ‘కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం’నేచర్ క్యాంప్‌లను అందుబాటులోకి తెచ్చాయి. నర్సాపూర్ అటవీ ప్రాంతం, పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ, జీప్ సఫారీ, ట్రెక్కింగ్ తదితరాలతో రెండు పగళ్లు, ఒక రాత్రి కలిపి మొత్తం 36 గంటలపాటు అడవిలో గడుపుతూ మధుర అనుభూతులను సొంతం చేసుకొనేలా ప్యాకేజీని సిద్ధం చేశాయి. పర్యాటకులు అడవుల్లోని చెట్లు, జంతువుల రకాలు, పర్యావరణ వ్యవస్థలు, స్థానిక ఆహారపు అలవాట్లు, గిరిజనుల సాంస్కృతిక జీవనం, వ్యవసాయ పద్ధతుల వంటి వాటిని ప్రత్యక్షంగా తెలుసుకోవడాన్ని ఇందులో అంతర్భాగం చేశాయి. స్థానికంగా తయారు చేసిన వస్తువులకు గిరాకీ కలి్పంచడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాల పెంపుతోపాటు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించనున్నాయి. నేచర్ క్యాంప్ టూర్ ఇలా.. ♦ ఉదయం 6 గంటలకు నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కు నుంచి ప్రారంభం ♦ ఈ పార్కులో ట్రెక్కింగ్, బర్డింగ్, బట్టర్ఫ్లై వాక్, వెట్‌ల్యాండ్ విజిట్ ♦ వాచ్‌టవర్ వద్ద అల్పాహారం. అక్కడే ఈ టూర్‌కు సంబంధించిన ఇంటరాక్షన్ ♦ నర్సాపూర్ పార్క్‌కు ఎదురుగానున్న అటవీప్రాంతం సందర్శన, అక్కడ నుంచి నర్సాపూర్ పట్టణానికి పయనం. ♦ మెదక్ పట్టణానికి ప్రయాణ మార్గమధ్యంలో ఫారెస్ట్, ప్రైవేట్ నర్సరీల విజిట్. మెదక్ చర్చి సందర్శన, ఆ తర్వాత సమీపంలోనే లంచ్ ♦ అక్కడి నుంచి పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీకి.. ♦ స్థానిక పర్యావరణ వ్యవస్థలపై అవగాహన పెంచుకునేందుకు సిద్ధం చేసిన ఎని్వరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ (ఈఈసీ) విజిట్ ♦ వైల్డ్‌లైఫ్ సఫారీ, పోచారం డ్యామ్, నిజాం హెరిటేజ్ బిల్డింగ్స్ సందర్శన, సూర్యాస్తమయ వీక్షణ. ♦ ఈఈసీ సెంటర్ వద్ద సమావేశం. అక్కడే స్థానిక వంటకాలు, రుచులతో బార్బిక్యూ డిన్నర్, హోమ్‌స్టే లేదా టెంట్లలో రాత్రి నిద్ర. ♦ మరుసటి రోజు ఉదయం 6 గంటలకు పోచారం లేక్ వద్ద సూర్యోదయ వీక్షణ ♦ అల్పాహారం తర్వాత పోచారం వైల్డ్‌లైఫ్ ♦ శాంక్చురీలో బర్డ్ వాచింగ్, బట్టర్ఫ్లై వాక్ ♦ ఉదయం 11 గంటలకు దంతేపల్లి లేదా మరోచోట గిరిజన గ్రామ సందర్శన ♦ మధ్యాహ్నం దంతేపల్లిలో ‘ఫామ్ లంచ్’ ♦ అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ ప్రత్యేకతలివే... హైదరాబాద్‌కు 115 కి.మీ. దూరంలోని పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ 130 చ.కి.మీ. విస్తీర్ణంలో మెదక్, కామారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించింది. ఇది పోచారం లేక్ వెంట విస్తరించి ఉండటం విశేషం. ఇక్కడ వివిధ రకాల జింకలు, చిరుతలు, ఎలుగుబంట్లు కూడా కనిపిస్తుంటాయి. పలు రకాల అరుదైన పక్షులకు సైతం ఇది కేంద్రంగా ఉంది. ఫారెస్ట్ ప్లస్ 2.0 అంటే... కేంద్ర అటవీ, పర్యావరణశాఖల సహకారంతో యూఎస్ఏఐడీ సంస్థ ప్రకృతిసిద్ధ పరిష్కారాల అభివృద్ధి ద్వారా అడవులపై ఆధారపడిన స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంతోపాటు కమ్యూనిటీల పరంగా బలోపేతం కావడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. దీనికి ఫారెస్ట్ ప్లస్ 2.0గా నామకరణం చేసింది. ఇందులో భాగంగా తిరువనంతపురం (కేరళ), గయ (బిహార్), మెదక్ (తెలంగాణ)లో కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం నేచర్ క్యాంపులకు శ్రీకారం చుట్టింది. కనీసం 20 మంది.. సొంత వాహనాల్లో వస్తేనే.. పర్యాటకులకు ప్రత్యక్షంగా ప్రకృతిని, వైల్డ్ లైఫ్‌ను అనుభవంలోకి తీసుకొచ్చేందుకు ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించాం. ప్రజలకు అడవులు, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేసేందుకు ఈ క్యాంప్‌లకు ప్రాధాన్యతనిచ్చాం. నేచర్ క్యాంప్‌ల ద్వారా వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. కనీసం 20 మందితో కూడిన పర్యాటక బృందం ఈ క్యాంప్‌కు రావాల్సి ఉంటుంది. సొంత వాహనాల్లోనే వారు మొత్తం టూర్లో పాల్గొనాల్సి ఉంటుంది. పిల్లలకు (పదేళ్లు పైబడిన వారే) రూ. 1,500, పెద్దలకు రూ. 2 వేలు చొప్పున చార్జీగా ఖరారు చేశాం. ఆహారం, ఎంట్రీ ఫీజు, సఫారీ తదితరాలన్నీ ఈ ప్యాకేజీలో ఉంటాయి. – జి. సాయిలు, రీజినల్ డైరెక్టర్, ఫారెస్ట్–ప్లస్ 2.0 చదవండి: తెలంగాణ పంచాయతీలకు అవార్డుల పంట -
తమిళిసై వద్ద పెండింగ్‌లో ఫైల్.. పురసారథులకు ‘పరీక్ష’
సాక్షి, రంగారెడ్డిజిల్లా/ మేడ్చల్‌జిల్లా: నగర/పురపాలికల్లో క్యాంపు రాజకీయాలకు తెరలేస్తోంది. మూడేళ్ల పదవీకాలం ముగియనుండటంతో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టే దిశగా పావులు కదులుతున్నాయి. ఇందుకు వ్యూహరచన చేస్తుండటంతో ప్రస్తుత పాలక వర్గాలు పదవిని కాపాడుకునేందుకు.. వైరి వర్గం కుర్చీ దక్కించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. నగర, పురపాలక సంఘాల్లో అవిశ్వాస పరీక్షలకు మూడేళ్ల కాల పరిమితిని విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక చట్టంలో పొందుపర్చింది. దీన్ని నాలుగేళ్లకు సవరిస్తూ గత ఏడాది అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. గవర్నర్ తమిళిసై పరిశీలనకు వెళ్లిన ఈ బిల్లుకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. దీంతో పాత చట్టమే మనుగడలో ఉందని భావిస్తున్న అసంతృప్తి నేతలు, అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నారు. నగర/పురపాలక సంఘాలు పగ్గాలు చేపట్టి ఈ నెల 26 నాటికి మూడేళ్లు ముగుస్తున్నందున ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పురపాలికలపై కన్నేసిన ఆశావహులు ఎత్తులు వేస్తున్నారు. గడువు సమీపిస్తుండటంతో కొంతకాలంగా విందు, విహార యాత్రలతో బిజీగా ఉన్న ఈ నేతలు మరిన్ని వ్యూహాలు రచిస్తున్నారు. నగర శివారులోని దాదాపు మెజారిటీ మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో.. ► మేడ్చల్ జిల్లాలో నిజాంపేట్, బోడుప్పల్, జవహర్‌నగర్, పీర్జాదిగూడ, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార పార్టీ సభ్యులే వైరి వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుత పాలక వర్గాలకు మూడేళ్లు పూర్తి కావడంతో పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నిజాంపేట్ కార్పొరేటర్లు ఇటీవల శ్రీశైలం వేదికగా, జవహర్‌నగర్ నగరపాలక సంస్థ పాలక సభ్యులు ఉభయ గోదావరి జిల్లాలు వేదికగా క్యాంపు రాజకీయాలు నెరిపారు. ► బోడుప్పల్ కార్పొరేషన్‌లోనూ గ్రూపు రాజకీయాలు అధికమయ్యాయి. ఇక్కడ కూడా అవిశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మేడ్చల్ మున్సిపాలిటీలో కొంత కాలంగా మున్సిపల్ చైర్పర్సన్ తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయమై మంత్రి సమక్షంలో పలుమార్లు అసంతృప్తి వెళ్లబుచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోనూ అధికార పార్టీలోని ఇరు వర్గాలు నువ్వా నేనా అన్నట్లుగా అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నాగారం మున్సిపాలిటీలో చైర్మన్‌పై అవిశ్వాసానికి అంతర్గంగా పావులు కదుపుతున్నట్లు అధికార టీఆర్ఎస్ కౌన్సిర్లలోనే చర్చ జరుగుతోంది. దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దుండిగల్, కొంపెల్లి మున్సిపాలిటీల్లోని అధికార పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. రంగారెడ్డి జిల్లాలో.. ► ఆదిబట్ల, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టేందుకు అసంతృప్తి నేతలు పావులు కదుపుతున్నారు. గతంలో పదవీ కాలం ఒప్పందాలు కుదుర్చుకున్న సభ్యులు కూడా పట్టు వీడకపోవడంతో కొన్ని చోట్ల విశ్వాస పరీక్షలకు దారితీస్తోంది. ఇంకొన్ని చోట్ల పదవీ నుంచి దిగేందుకు ససేమిరా అనడం కూడా ఈ పరిస్థితులకు కారణంగా మారుతోంది. ► తుర్కయంజాల్‌లో మెజార్టీ కౌన్సిలర్లను గెలుచుకున్న కాంగ్రెస్.. రెండు వర్గాలుగా విడిపోయింది. పదవుల పంపకంపై ఇరుపక్షాలు బెట్టు దిగకపోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సీను ఇబ్రహీంపట్నం పురపాలికలోనూ కనిపిస్తోంది. గులాబీ శిబిరంలో కీచులాటలతో చైర్‌పర్సన్‌పై కౌన్సిలర్లు ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణలు సంధిస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా మూడేళ్ల కాలపరిమితి ముగియడంతో ఇదే అదనుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై మంతనాలు సాగిస్తున్నారు. ► మరోవైపు ఆదిబట్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్లో చేరి చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ కౌన్సిలర్ దక్కించుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో స్థానిక ఎమ్మెల్యేలతో చైర్‌పర్సన్‌కు పొసగడం లేదు. దీంతో ఆమెను గద్దె దింపే దిశగా ఎమ్మెల్యే వర్గీయులు చక్రం తిప్పుతున్నారు. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలు.. బండ్లగూడ నగర పాలక సంస్థలోనూ చైర్మన్‌గిరీ విషయంలో మడతపేచీ నెలకొంది. ఇక్కడ కూడా రెండున్నరేళ్ల చొప్పున పదవిని పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చారు. తాజా పరిణామాలతో పోస్టు నుంచి తప్పుకొనేందుకు నో చెబుతుండడంతో రాజకీయం ఉత్కంఠగా మారింది. (క్లిక్ చేయండి: కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ అసంతృప్తి) -
రాజీవ్ స్వగృహ టోకెన్ అడ్వాన్స్ చెల్లింపు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బండ్లగూడ, పోచారంలలో నిర్మించిన ఫ్లాట్స్‌ను సొంతం చేసుకునేందుకు వినియోగదారులు టోకెన్ అడ్వాన్స్ చెల్లించే గడువును హెచ్ఎండీఏ పొడిగించింది. ఫిబ్రవరి 15 వరకు అడ్వాన్స్ డిమాండ్ డ్రాఫ్ట్‌లను మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్, ఉర్దూగల్లీ, స్ట్రీట్‌నెం.17, హిమాయత్‌నగర్ హైదరాబాద్‌కు చేరేలా పంపించాలని సూచించింది. అనంతరం ఫ్లాట్స్ కేటాయింపునకు సంబంధించి లాటరీని పారదర్శక విధానంలో నిర్వహిస్తామని తెలిపింది. ప్రస్తుతం పోచారంలో 3 బీహెచ్‌కె ఫ్లాట్స్ 16, 2బీహెచ్‌కే ఫ్లాట్స్ 570, 1 బీహెచ్‌కె ఫ్లాట్స్ 269 ఉన్నాయని తెలిపింది. ఇక బండ్లగూడలో 1బీహెచ్‌కే ఫ్లాట్స్ 344, సీనియర్ సిటీజన్లకు 1 బీహెచ్‌కే ఫ్లాట్స్ 43 ఖాళీగా ఉన్నాయని ప్రకటించింది. 3 బీహెచ్‌కే ఫ్లాట్స్‌కు రూ.3 లక్షలు, 2 బీహెచ్‌కే ఫ్లాట్స్‌కు రూ.2 లక్షలు, 1 బీహెచ్‌కే ఫ్లాట్‌కు రూ.లక్ష చొప్పున టోకెన్ అడ్వాన్స్‌గా చెల్లించాలని కోరింది. -
Hyderabad: నాగారం, ఘట్కేసర్, దమ్మాయిగూడలో లింక్ రోడ్లు
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని రహదార్లకు మహద్భాగ్యం కలుగనుంది. నగరానికి తూర్పున ఉన్న మేడ్చల్ జిల్లా పరిధిలోని దమ్మాయిగూడ, జవహర్‌నగర్, నాగారం, ఘట్కేసర్ స్థానికసంస్థల పరిధిలో 4 లేన్లు, 6 లేన్లతో విశాలమైన రహదారులు రానున్నాయి. ఇన్నర్ రింగ్‌రోడ్, ఔటర్‌రింగ్ రోడ్‌కు అనుసంధానంగా ప్రజల సాఫీ ప్రయాణానికి లింక్, స్లిప్రోడ్లలో భాగంగా ప్రభుత్వం ఇటీవల 104 రోడ్ల పనులకు నిధులు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది. వాటిల్లో 50 రోడ్ల పనుల్ని ప్రాధాన్యతతో చేపట్టాల్సిందిగా సూచించింది. ఐదు ప్యాకేజీలుగా.. మొత్తం ఐదు ప్యాకేజీలుగా పనులకు నిధులు మంజూరు చేయగా వాటిల్లో మూడో ప్యాకేజీలోని 13 కారిడార్ల (రోడ్ల) పనులు చేసేందుకు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) టెండర్లు ఆహ్వానించింది. వీటి అంచనా వ్యయం రూ.293.55 కోట్లు. ఏడాదిలోగా పనులు పూర్తిచేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అవసరమైన భూసేకరణ, యుటిలిటీస్ షిఫ్టింగ్ వంటి పనులు లేని ప్రాంతాల్లో రోడ్ల పనులు వేగంగా జరగనున్నాయి. వీటికి అవసరమైన నిధుల్ని హెచ్ఎండీఏ ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. టెండర్లు పిలిచిన రోడ్ల వివరాలు.. దమ్మాయిగూడ మునిసిపాలిటీలో.. ► దమ్మాయిగూడ రోజ్‌గార్డెన్ ఫంక్షన్‌హాల్ నుంచి నాగారం రోడ్ (ఈసీఐఎల్‌ను కలుపుతూ): 2.80 కి.మీ.లు. ► చీర్యాల జేఎన్ఎన్యూఆర్ఎం హౌసింగ్ కాలనీ నుంచి అహ్మద్‌గూడ: 1.70 కి.మీ.లు. జవహర్‌నగర్ కార్పొరేషన్లో.. ► ఫైరింగ్ కట్ట నుంచి ఎన్టీఆర్ విగ్రహం రోడ్ వరకు: 2.10 కి.మీ.లు ► ఎన్టీఆర్ విగ్రహం నుంచి దమ్మాయిగూడ రోడ్ (మునిసిపల్ పరిధి వరకు ): 1.90 కి.మీ.లు ► ఎన్టీఆర్ విగ్రహం నుంచి డంపింగ్ యార్డ్ వరకు: 2.35 కి.మీ.లు ► ఎన్టీఆర్ విగ్రహం నుంచి వంపుగూడ రోడ్ వరకు: 1.20 కి.మీ.లు నాగారం మునిసిపాలిటీలో.. ► రాంపల్లి క్రాస్‌రోడ్స్ నుంచి సర్వే నెంబర్ 421 వరకు(హెచ్‌పీ పెట్రోల్‌పంప్ దగ్గర) : 3.90 కి.మీ.లు. ► సర్వే నెంబర్ 421 (హెచ్‌పీ పెట్రోల్‌పంప్ దగ్గర)నుంచి యామ్నాంపేట (నాగారం మునిసిపాలి టీ సరిహద్దు వరకు): 3.10 కి.మీ.లు. ► చర్లపల్లి నుంచి ఓఆర్ఆర్ సర్వీస్‌రోడ్ వరకు( వయా కరీంగూడ ): 3.80 కి.మీ.లు ► యామ్నాంపేట ఫ్లైఓవర్ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వరకు: 2.60 కి.మీ.లు ► చర్లపల్లి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి రాంపల్లి జంక్షన్ వరకు: 3.30 కి.మీ.లు పోచారం మునిసిపాలిటీలో.. ► యామ్నాంపేట నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వరకు: 2.10 కి.మీ.లు ఘట్కేసర్ మునిసిపాలిటీలో.. ► శివారెడ్డిగూడ నుంచి మాధవ్‌రెడ్డి బిడ్జ్రి : 2.50 కి.మీ.లు. ప్రయోజనాలు ఈ రోడ్లు అందుబాటులోకి వస్తే నగరంనుంచి శివారు ప్రాంతాలకు సాఫీ రవాణా సాధ్యమవుతుంది. ప్రజలకు ప్రయాణదూరం, సమయం, ఇంధనవ్యయం తగ్గుతాయి. వాహన కాలుష్యం తగ్గడంతో ప్రయాణాల వల్ల తలెత్తే ఆరోగ్య ఇబ్బందులూ తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు. (క్లిక్: రెండంతస్తుల్లో చర్లపల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం) -
Bandlaguda: రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలానికి అనూహ్య స్పందన
సాక్షి, హైదరాబాద్: బండ్లగూడ, పోచారంలలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు హెచ్ఎండీఏ నిర్వహించిన వేలానికి వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. మొత్తం 3,716 ఫ్లాట్లకు సంబంధించి 39,082 మంది వినియోగదారులు ఆన్లైన్లో బిడ్లు దాఖలు చేశారు. ఇందులో బండ్లగూడలోని 2,246 ఫ్లాట్లకు 33,161 మంది బిడ్లు దాఖలు చేశారు. పోచారంలోని 1470 ఫ్లాట్టకు 5921 మంది బిడ్లు దాఖలు చేశారు. బిడ్లు దాఖలు చేసిన వారిలో లాటరీ ద్వారా ఎంపిక చేసి ఫ్లాట్లను కేటాయించనున్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి పోచారం ఫ్లాట్స్ వినియోగదారులకు లాటరీ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఫేస్బుక్, యూట్యూ బ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ నిర్వహిస్తున్నారు. బండ్లగూడ ఫ్లాట్స్‌కు మంగళవారం లాటరీ నిర్వహించనున్నారు. బండ్లగూడ డీలక్స్ ఫ్లాట్స్ వినియోగదారులకు బుధవారం లాటరీ నిర్వహించనున్నట్లు హెచ్ఎండీఏ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. (క్లిక్: పబ్ కేసులో మరో ట్విస్ట్.. కోర్టును ఆశ్రయించిన పోలీసులు) -
తక్కువ ధరకే ప్రభుత్వ ఫ్లాట్లు,రాజీవ్ స్వగృహ ఇళ్ల కోసం ఎగబడుతున్న జనం!
తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ ఇళ్లను సేల్కు పెట్టింది. గతంలో కట్టిన ఇళ్లను అమ్మేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. తక్కువ ధరకే ఫ్లాట్లు అమ్మకానికి రావడంతో.. వాటిని సొంతం చేసుకునేందుకు కొనుగోలు దారులు పోటీపడుతున్నారు. ప్రభుత్వ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం..బండ్లగుడాతో పాటు పోచారంలోని రాజీవ్ స్వగృహ ప్లాట్ల అమ్మకానికి ఈనెల11న హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఫ్లాట్ల అమ్మకపు నోటిఫికేషన్‌కు ఊహించని రీతిలో రెస్సాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లాట్ల ధర తక్కువ కావడంతో మే 12నుంచి ప్రారంభమైన అప్లికేషన్ల రిజిస్ట్రేషన్లు మే 23 వరకు 3వేల ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు 14వేల మంది అప్లయ్ చేశారు. ఈ అప్లికేషన్ల సంఖ్య 20రోజుల్లో 30వేలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 3,271 ఫ్లాట్లు హైదరాబాద్ బండ్లగూడలో 1501 ఫ్లాట్లు, గట్కేసర్ సమీపంలో ఉన్న పోచారంలో 1470 ఫ్లాట్లను అమ్మకానికి పెట్టింది.వచ్చే నెల 14వ తేదీన గడువు ముగుస్తుండడంతో ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు భారీ ఎత్తున అప్లయ్ చేస్తున్నారు. లాటరీ సిస్టమ్‌లో స్వగృహ ఫ్లాట్లను అమ్మకానికి పెట్టిన ప్రభుత్వం..లాటరీ ద్వారా వివిధ ఫ్లాట్ల స్కైర్ ఫీట్ విలువ ఎంతనేది ఫైనల్ చేయనుంది. ఇందుకోసం ఒక వ్యక్తి రూ.1000 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉండగా..లాటరీలో కార్నర్ ఫ్లాట్ల కొనుగోలు దారుల కుటుంబ సభ్యులు, వారి బంధువులతో పాటు ఉద్యోగులు సైతం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.కాగా పెండింగ్‌లో ఫ్లాట్ల పనులను త్వరగా పూర్తి చేసి రీసేల్ పెట్టే అవకాశం ఉందని, అదృష్టం ఉంటే రీసేల్‌లో సైతం ఫ్లాట్లను సొంతం చేసుకోవచ్చు. స్వగృహా ఫ్లాట్లును ఎక్కడ ఎక్కువగా కొంటున్నారంటే ఓఆర్ఆర్, నాగోల్ మెట్రోస్టేషన్, సిటీ దగ్గర్లో ఉండడంతో పోచారం కంటే బండ్లగూడ స్వగృహలో ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు మక్కువ చూపుతున్నారు. కాబట్టే 14వేల అప్లికేషన్లలో 12వేల మంది బండ్లగూడ ఫ్లాట్లపై మక్కువ చూపుతుంటే కేవలం 2వేల మంది మాత్రమే పోచారం ఫ్లాట్లను సొంతం చేసుకునేందుకు అప్లికేషన్లు పెట్టుకున్నారు. బండ్లగూడా స్వగృహా ఫ్లాట్లు ఎన్నంటే మే 23 వరకు బండ్లగూడాలో 345..3బీహెచ్‌కే డీలెక్స్ ఫ్లాట్లను, 444..3బీహెచ్‌కే ఫ్లాట్లను,712..2బీహెచ్‌కే స్వగృహా ఫ్లాట్ల కోసం అప్లికేషన్లు వచ్చాయి. పోచారం స్వగృహా ఫ్లాట్లు ఎన్నంటే మే 23 వరకు పోచారంలో 91..3బీహెచ్‌కే డీలెక్స్ ఫ్లాట్లు, 53..3బీహెచ్‌కే ఫ్లాట్లు, 884..2బీహెచ్‌కే ఫ్లాట్లు, 442..1బీహెచ్‌కే ఫ్లాట్ల కోసం అప్లికేషన్లు వచ్చాయి. -
Medchal: స్విమ్మింగ్‌పూల్స్ వద్ద భద్రత ప్రశ్నార్థకం!
సాక్షి, హైదరాబాద్(పోచారం): వేసవి కాలంలో పిల్లల కేరింతలతో స్విమ్మింగ్ పూల్స్ సందడిగా ఉంటాయి. నీళ్లలో ఈత కొట్టేందుకు పిల్లలు ఉరకలు వేస్తారు. పూల్‌లో కూల్ అవుతూ వేసవి తాపం నుంచి తప్పించుకుంటున్నారు. కానీ, పోచారం మున్సిపాలిటీలోని స్విమ్మింగ్ పూల్స్ వద్ద భద్రత ప్రశ్నార్థకంగా మారడంతో చిన్నారులు తనువు చాలించిన సందర్భాలు చోటుచేసుకుంటున్నాయి. కొరవడిన అధికారిక పర్యవేక్షణ.. స్విమ్మింగ్ పూల్స్పై అధికారిక పర్యవేక్షణ లోపించడంతో నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. నిర్వాహకుల దయాదాక్షిణ్యాలపైనే స్విమ్మర్లు ఆధారపడాల్సి వస్తోంది. నేషనల్ బిల్డింగ్ కోడ్ నిబంధనలు మినహా నిర్వాహకులకు వేరే ఎలాంటి గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం జారీ చేయకపోవడంతో స్విమ్మింగ్ నేర్చుకునే వారికి వసతులు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్స్ గణాంకాలు.. స్విమ్మింగ్ పూల్స్‌కు సంబంధించిన గణాంకాలు పోచారం మున్సిపల్ అధికారుల వద్ద లేవు. వీటిలో ఎలాంటి సదుపాయాలున్నాయో వీరు పరిశీలించరు. లైఫ్ గార్డులు, నీటి లోతు, తరచు నీటి మార్పిడి, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు వంటి అంశాలను గాలికి వదిలేస్తున్నారు. కోచ్‌లు అందుబాటులో ఉండటం లేదు. ఇవన్నీ స్విమ్మింగ్ పూల్స్ వద్ద భద్రత లోపించిందనడానికి నిలువెత్తు నిదర్శనాలు. ఇటీవల బాలుడి మృతి.. ఇటీవల అన్నోజిగూడలోని స్విమ్మింగ్ పూల్‌లో 16 ఏళ్ల విద్యార్థి పూజారి పారికర్ మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందే. జిల్లా వ్యాప్తంగా 50కు పైగానే.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా గేటెడ్ కమ్యూనిటీలను కలుపుకొని గణాంకాలు తీస్తే సుమారు 50కు పైగానే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయని అంచనా వేశారు. వీటిలో నిబంధనల ప్రకారం నిర్మితమైనవి పది కంటే మించవు. నీటి కొరత, ఇతరత్రా కారణాల వల్ల మరో 15 స్విమ్మింగ్ పూల్స్ మూతపడినట్లు తెలిసింది. పిల్లలకు ఇవి ఇవ్వడం మర్చిపోవద్దు.. స్విమ్మింగ్ పూల్‌లోకి దిగే ముందు పిల్లలకు కంటి అద్దాలు, చెవి ప్లగ్‌లు, ఫ్లోటర్లు, టవర్లు వంటి భద్రతా పరికరాలు ఇవ్వడం గుర్తుంచుకోవాలి. వీటితో నిర్భయంగా ఈత నేర్చుకోవచ్చు. అప్పుడే పిల్లలు సురక్షితంగా ఉంటారు. -
అంత్యక్రియల్లో జాప్యం.. నిలిచిన ప్రాణం
సాక్షి, హైదరాబాద్: ‘ఆలస్యం.. అమృతం విషం’ అంటారు. కానీ ఇక్కడ ఆలస్యమే అమృతమై పసికందుకు ప్రాణాలు పోసింది. వివరాల్లోకి వెళితే.. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఇస్మాయిల్‌ఖాన్‌గూడకు చెందిన అన్నం శ్రీకాంత్ భార్య ఘట్కేసర్ హాస్పిటల్లో మగ శిశువుకు ఇటీవల జన్మనిచ్చింది. బాబు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో 10 రోజులపాటు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. వెంటిలేటర్ తీసేస్తే బాబు బతకడని చెప్పిన వైద్యులు, రూ.4 లక్షలు బిల్లు కట్టించుకుని బుధవారం రాత్రి డిశ్చార్జి చేశారు. ఇంటికి తీసుకొచ్చాక సమాధి చేసేందుకు ‘వసంత వ్యాలీ’ కాలనీలోని ప్రభుత్వ స్థలంలో గుంత తవ్వించారు. ఇంతలో కాలనీవాసులు ఇది శ్మశానవాటిక కాదని, ఇందులో సమాధి చేయొద్దని అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుండగానే.. అకస్మాత్తుగా పసికందులో కదలికలు ప్రారంభమయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు రాత్రి 11 గంటల సమయంలో నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. చదవండి: ఐఆర్సీటీసీ స్వదేశ్ దర్శన్ పర్యాటక రైళ్లు -
డిసెంబర్లో ప్రభుత్వం రద్దు.. మార్చిలో ఎన్నికలు
పోచారం: ‘వచ్చే డిసెంబర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు, మార్చిలో ఎన్నికలు, ఆపై కేసీఆర్ ఆత్మహత్య ఖాయం. తొందర్లోనే కేసీఆర్ మెడకు తాడు కట్టుకుంటాడు’అంటూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘దేశదిమ్మరిలా.. కాలు కాలిన పిల్లిలా.. చెట్టు మీద కోతిలా దేశమంతా తిరుగుతూ కేసీఆర్ రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు’అని మండిపడ్డారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నంలో తుపాకుల కాల్పులు, మహబూబ్‌నగర్‌లో మంత్రులను చంపాలనే కుట్ర వంటి ప్రతి సంఘటనలో టీఆర్ఎస్ నాయకుల పాత్రే ఉందని ఆరోపించారు. టీఆర్ఎస్లో పంపకాల లొల్లితో ఒకరినొకరు చంపుకోవాలని చూస్తున్నారని, కేసీఆర్ ఇంట్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం అప్పనంగా గుంజుకుం టోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ భూములకు యజమానులను చేస్తామని చెప్పారు. రైతులు పండించిన పంట చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొంటుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రగతి భవన్‌ను అంబేడ్కర్ విద్యా కేంద్రంగా మారుస్తామని చెప్పారు. కాంగ్రెస్ సర్కారులో సభ్యులకే తొలి ప్రాధాన్యం లక్షా 30 వేల కాంగ్రెస్ సభ్యత్వాల నమోదుతో మం చిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం మొదటి స్థానం లో, 92 వేలతో మేడ్చల్ రెండో స్థానంలో నిలిచాయని రేవంత్ చెప్పారు. 30 లక్షల సభ్యత్వాలను డిజిటల్ పద్ధతిలో చేస్తామని సోనియాగాంధీకి చెప్పి 40 లక్షలు చేయగలిగామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయించగలిగితే 90 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకే దక్కుతాయని, మన ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కార్యకర్తలే కథానాయకులవుతారని,చెప్పారు. చివర్లో స్థానిక నాయకులను సత్కరించకుండానే ఆయన సభాస్థలి నుంచి నిష్క్రమించడంతో కొందరు కార్యకర్తలు నిరుత్సాహం వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలతో క్రికెట్ ఆడిన స్పీకర్ పోచారం
-
హైదరాబాద్‌లో సోనూసూద్‌కు సత్కారం
సాక్షి, పోచారం: సంస్కృతి టౌన్‌షిప్‌కు విచ్చేసిన బాలీవుడ్ రియల్ హీరో సోనూసూద్‌ను ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీగిరి వెంకట్ మాధవ్‌రెడ్డి గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన సంస్కృతి టౌన్షిప్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోందన్నారు. లాక్డౌన్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించిన సోనూసూద్‌ను సత్కరించుకోవడం సంతోషంగా ఉందని వెంకట్ మాధవ్ అన్నారు. కార్యక్రమంలో కాలనీ నాయకుడు వాకిటి శ్రీకాంత్‌రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు. చదవండి: ఆ పాత్ర మర్చిపోలేనిది: సోనుసూద్ పేదలకు మరో సహాయం చేసిన సోనూసూద్ -
బ్యాంకులంటే వ్యాపారమేనా!
ఎస్ఎల్బీసీలో ఈటల, పోచారం ఫైర్ సాక్షి, హైదరాబాద్: ‘బ్యాంకులంటే వ్యాపార మేనా? మానవీయ కోణం ఉండదా? రుణ మాఫీ నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేసినా సహకరించకుంటే ఎలా? అన్నీ వ్యాపార సంబంధాలేనా? పైసా పెసా లెక్కేస్తే ఎలా? ఇది మంచి పద్ధతి కాదు’అని బ్యాంకు వర్గాలపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. శుక్రవారం ఎస్ఎల్బీసీ వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించిన అనంతర సమావేశంలో వాడీవేడీ చర్చ జరిగింది. రైతుల నుంచి వడ్డీ వసూలు చేయకూడదని పదేపదే చెప్పినా బ్యాంకులు వినకపోవడంపై మంత్రులు ఈటల, పోచారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాల నిధులు రూ.271 కోట్లు విడుదల చేయలేదని రైతుల నుంచి వడ్డీలు వసూలు చేయడం ఏమేరకు సమంజసం? చిన్న చిన్న విషయాలపై సహకరించకపోతే ఎలా’ అని ఈటల ప్రశ్నించారు. ఉదారంగా పేద లకు రుణాలు ఇవ్వాలని కోరారు. ఖరీఫ్‌లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు డబ్బుల కొరత లేకుండా బ్యాంకులు చూడాలని, ఈ మేరకు ఆర్బీఐకి విన్నవిం చాలని ఈటల కోరారు. రైతు ఖాతాలో జమ కాని రుణ మాఫీ... ‘రుణమాఫీ సొమ్ము విడుదల చేసి నెలలు గడిచినా ఇంకా కొన్ని బ్యాంకు బ్రాంచీల్లో రైతు ఖాతాల్లో జమ చేయలేదు. డబ్బు ఇచ్చాక కూడా ఇలాగైతే ఎలా’ అని పోచారం బ్యాంకర్లను నిలదీశారు. రుణాలు తీసుకున్న ప్రతీ రైతు నుంచి బీమా ప్రీమియం మినహాయించాలని బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. రూ. 1.14 లక్షల కోట్లు రాష్ట్ర రుణ ప్రణాళిక విడుదల చేసిన ఎస్ఎల్బీసీ రాష్ట్ర రుణ ప్రణాళిక ఖరారైంది. 2017–18లో పలు రంగాలకు రూ.1,14,353 కోట్ల మేర రుణాలివ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నిర్ణయించింది. శుక్రవారం ఎస్ఎల్బీసీ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి వార్షిక ప్రణాళికను విడుదల చేశారు. రాష్ట్ర రుణ ప్రణాళికలో సగం, అంటే రూ.54,198 కోట్లు వ్యవసాయ రుణాలే ఉండటం గమనార్హం. ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.39,752 కోట్ల పంట రుణాలివ్వాలని ఎస్ఎల్బీసీ లక్ష్యంగా పేర్కొంది. ఇందులో ఈ ఖరీఫ్‌లో రూ.23,851 కోట్లు, రబీలో రూ.15,901 కోట్లిస్తామని పేర్కొంది. దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు రూ.14,446 కోట్లివ్వాలని వెల్లడించింది. గతేడాది పంట రుణ లక్ష్యం రూ.29,101 కోట్లు మాత్రమే! చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.16,465 కోట్లు (గతేడాది 10,807 కోట్లు), విద్యా రుణాలు రూ.1,663 కోట్లు (గతేడాది రూ.731 కోట్లు), గృహ రుణాలు రూ.3,885 కోట్లు (గతేడాది రూ. 2,189 కోట్లు) కేటాయించారు. వరికి అత్యధికంగా రూ.16,690 కోట్ల రుణాలు: ఈ ఏడాది ఖరీఫ్, రబీల్లో ఇవ్వబోయే రూ.39,752 కోట్ల పంట రుణాల్లో అత్యధికంగా వరికి రూ.16,690 కోట్లివ్వాలని ఎస్ఎల్బీసీ నిర్ణయించింది. 19.18 లక్షల మంది వరి రైతులకు రుణాలిస్తారు. తర్వాత పత్తికి 7.48 లక్షల మంది రైతులకు రూ.6,809 కోట్లు; మొక్కజొన్నకు రూ.2,311 కోట్లు, జొన్న, సజ్జలకు రూ. 2,052 కోట్లు, పప్పుధాన్యాల పంటలకు రూ.1,770 కోట్లు ఇస్తారు. యాంత్రీకరణకు రూ.2,657 కోట్లు..: వ్యవసాయ యాంత్రీకరణకు రూ.2,657 కోట్లు కేటాయించనున్నారు. రైతులు తీసుకునే వ్యవసాయ యంత్రాలకు బ్యాంకులు రుణాలిస్తాయి. ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లకు రూ.1,694 కోట్లు, హార్వెస్టర్లకు 336 కోట్లిస్తారు. భారీ పరిశ్రమలకు రూ.7,340 కోట్లు, డెయిరీకి 2,002 కోట్లు, ఫుడ్ అండ్ ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లకు 1,029 కోట్లు, కోళ్ల పరిశ్రమకు 729 కోట్లు, కోల్డ్ స్టోరేజీ యూనిట్లకు 308 కోట్లు, చేపల పెంపకానికి 120 కోట్లు, పాల శీతలీకరణ ప్లాంట్లకు 81 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.88.35 కోట్లు కేటాయించారు. -
మాజీ ఎంపీ గంగారెడ్డి కన్నుమూత
హైదరాబాద్:నిజామాబాద్ మాజీ ఎంపీ కేశిపల్లి గంగారెడ్డి (90) కన్నుమూశారు. మూడుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గంగారెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉదయం తుదిశ్వాస విడిచారు. గంగారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలంగాణ ఉద్యమం, ఆవిర్భావంలో గంగారెడ్డి వెన్నంటి ఉన్నారంటూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే గణేశ్‌లు కూడా గంగారెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపారు. గంగారెడ్డి పదో లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి 1991-96లో మొదటిసారి ఎంపీగా గెలుపొందారు. అనంతరం 11వ లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ లభించలేదు. తిరిగి 12వ లోక్‌సభకు టీడీపీ తరపున గెలుపొందారు. ఆఖరిసారి 1999-2014 లో 13వ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సంతోష్‌రెడ్డిపై గెలుపొందారు. -
శాసనమండలి ప్రశ్నోత్తరాలు...
ప్రశ్నోత్తరాల సమయాన్ని వృథా చేయొద్దు మండలి చైర్మన్ స్వామిగౌడ్ సాక్షి. హైదరాబాద్: శుక్రవారం శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా తొలుత ప్రశ్నోత్తరాల సమయంలో మరే ఇతర అంశంపై చర్చకు ఆస్కారం లేదని మండలి చైర్మన్ స్వామిగౌడ్ స్పష్టంచేశారు. సమయాన్ని ఏ మాత్రం వృథా చేయొద్దని, అనుకున్న సమయంలో ప్రశ్నోత్తరాలు పూర్తి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే గంటా ఇరవై నిముషాల వ్యవధిలోనే ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయా అంశాలపై అధికార, విపక్ష సభ్యులు వేసిన ప్రశ్నలపై మంత్రులు సమాధానాలిచ్చారు. అవి సంక్షిప్తంగా... వచ్చే జూన్ నాటికి డిజిటల్ క్లాసులు: కడియం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హైస్కూళ్లు, రెసిడెన్షియల్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో వచ్చే జూన్ (2017) నాటికి డిజిటల్ క్లాసులను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. అలాగే ప్రైమరీ స్కూళ్లలోనే అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి, అంగన్వాడీలు, ప్రీప్రైమరీలను జోడించి వాటి ద్వారా ఎన్రోల్మెంట్ పెంచేందుకు చర్యలు చేపట్టాలనే ఆలోచనతో ఆయన తెలిపారు. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనంపై పరిశీలన.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని కడియం శ్రీహరి తెలిపారు. అన్ని అంశాలను పరిశీలించి ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. రైతుల దశ మారుతుంది: పోచారం స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్రం పంటలకు ధరలు కల్పిస్తేనే రైతుల భవిష్యత్ మారుతుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరకు అనుగుణంగానే రాష్ట్రంలో చెల్లిస్తున్నామన్నారు. ఈ ధరను నిర్ణయించే అధికారం రాష్ట్రానికి లేదని చెప్పారు. ఎలాంటి మార్పు ఉండదు: జూపల్లి ఎన్నికైన జిల్లా పరిషత్‌ల కాలపరిమితి ముగిసే వరకు కొత్తగా ఏర్పడిన జిల్లాలకు అనుగుణంగా కొత్త జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొత్తగా జిల్లాల విభజన జరిగినా గతంలోని పాత జిల్లా పరిషత్‌ల పరిధిలోకే ఆ జిల్లాలు కూడా వస్తాయని, విధులు, నిధులు, ఇతర విషయాల్లోనూ ఎలాంటి మార్పు లేదని స్పష్టంచేశారు. అనుకున్న విధంగా భద్రాద్రి ప్లాంట్: జగదీశ్‌రెడ్డి భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను అనుకున్న విధంగా పూర్తిచేసి 2017–18లో ఉత్పత్తి దశకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఈ విద్యుత్ ప్లాంట్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వృద్ధాశ్రమాల ఏర్పాటుకు యత్నం: తుమ్మల వృద్ధాశ్రమాలు లేని జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని రోడ్లు, భవనాలు, మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. తండాల అభివృద్ధి బోర్డు ప్రతిపాదన లేదు ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ గిరిజన తండాల అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. దీనిని సీఎం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. -
బాధ్యత కాదు.. టైం పాస్!
పంప్‌హౌస్‌లో సిబ్బంది పేకాట పుల్కల్: ఓ వైపు వర్షకాలంలోనూ గ్రామీణ ప్రాతాల్లో తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే... నీటిని పంపింగ్ చేయాల్సిన సిబ్బంది మాత్రం దర్జాగా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రతి రోజూ జూదం అడుతూ కాలక్షేపం చేస్తున్నారు. మండల పరిధిలోని పోచారం సత్యసాయి వాటర్ సప్లయ్ చేసే విభాగంలో పని చేసేందుకు పంపింగ్ ఆపరేటర్లను నిమించారు. విడతలవారీగా విధులు నిర్వహిస్తున్నారు. 24 గంటల పాటు నీటిని పంపింగ్ చేస్తూ ఆయా గ్రామాలకు నీటిని సరఫరా చేయాల్సిన బాధ్యత వీరిపై ఉంది. పంప్‌హౌస్‌లో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ దర్జాగా మధ్యాహ్నం మొదలుకొని అర్ధరాత్రి వరకు పేకాట ఆడుతున్నారు. పంపింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించాల్సిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అటు వైపు దృష్టి సారించడం లేదు. ఎప్పుడైనా సమస్య వస్తే కిందిస్థాయి సిబ్బందిని అక్కడికి పంపించి చేతులు దులిపేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. వారంలో ఒక రోజైన ానీటి పంపింగ్ కేంద్రాన్ని పరిశీలించాల్సి ఉండగా అధికారులు పట్టించుకోవడంలేదు. ఇక్కడ పని చేస్తున్న వారంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో వారి స్నేహితులను సైతం రప్పించి పంప్‌హౌస్‌లోనే జూదం ఆడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. 69 గ్రామాలకు మంచి నీటిని సరఫరా చేయల్సిన పోచారం పంప్‌హౌస్‌లో సిబ్బంది సక్రమంగా నీటిని పంపింగ్ చేయని కారణంగా పలు గ్రామాలకు నీరు అందడం లేదని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు మంజీరలో నీరు లేక పంపింగ్ చేయలేదు. ప్రస్తుతం నీరున్నా సిబ్బంది మాత్రం పంపింగ్ చేయడం లేదు. ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కృష్ణను వివరణ కోరగా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
బాధితుడికి చెక్కు అందించిన మంత్రి
బాన్సువాడ టౌన్ : మండలంలోని సంగోజిపేట్ గ్రామానికి చెందిన మాగి పోశవ్వ గతేడాది పాముకాటుతో మృతి చెందింది. దీంతో ఆపద్బంధు కింద మృతురాలి భర్త నారాయణకు రూ. 50 వేల చెక్కు మంజూరైంది. దీన్ని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపి, బోర్లం సహకార సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ సాయిలు, టీఆర్ఎస్ నాయకులు సాయిరాం, మారుతి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రులు
-
లక్ష్యం పూర్తయ్యే వరకు హరితహారం
కల్తీ కల్లును అరికట్టేందుకే.. ఈత వనాల పెంపకానికి ప్రోత్సాహం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వర్ని/బీర్కూర్ : నిజామాబాద్, మహబూబ్‌నగర్ కల్తీ కల్లుకు పేరొందాయని, కల్తీ కల్లును అరికట్టి స్వచ్ఛమైన కల్లును అందుబాటులోకి తీసుకొచ్చేందుకే హరితహారంలో ఈత వనాల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. లక్ష్యం పూర్తయ్యే వరకూ హరితహారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. శనివారం వర్ని మండలంలోని అక్బర్‌నగర్‌లో, అలాగే, బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లో మొక్కలు మంత్రి మొక్కలు నాటారు. తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఆయన మాట్లాడారు. కల్తీ కల్లును నివారించేందుకు ఈత వనాల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని పోచారం చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 3.75 లక్షల ఈత మొక్కలు నాటించామని, మరో 1.25 లక్షల మొక్కలు నాటి లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ మొక్కలు పెరిగిన తర్వాత కల్లు ప్రియులకు స్వచ్ఛమైన కల్లు దొరుకుంతుదని తెలిపారు. తద్వారా గీతకార్మికుల జీవనోపాధి మెరుగవుతుందని, ఎక్సైజ్ అధికారుల దాడులు ఉండవని చెప్పారు. ఇటీవల కోటగిరిలో 700 గిలక తాళ్లు అనే కొత్త రకం ఈతమొక్కలు నాటించామని, ఒక్కో చెట్టు 30–50 లీటర్ల కల్లునిస్తుందని వివరించారు. -
స్టైల్ మార్చిన మంత్రి పోచారం
-
ఆ ఘనత మా ప్రభుత్వానిదే: పోచారం
హైదరాబాద్: రాష్ట్రంలో పాల ఉత్పత్తి దారులకు రూ. 4 ఇన్సెంటీవ్ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన.. పాడి పరిశ్రమను ఆదుకుంటామన్నారు. గత 13 ఏళ్లుగా పాల ఉత్పత్తి దారులు ఇన్సెంటీవ్ కోసం పోరాటం చేసినా పాలకులు పట్టించుకోలేదని పోచారం విమర్శించారు. 75 శాతం సబ్సిడీతో రైతులకు గడ్డి విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. పాలు సేకరిస్తున్న అన్ని గ్రామాలకు మిల్క్ ఎనలైజర్లు పంపిణీ చేస్తామని తెలిపారు. పాడి పరిశ్రమ డ్వాక్రా మహిళలకు ఉపయోగపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పోచారం తెలిపారు. మంత్రి వర్గ ఉప సంఘం ద్వారా పాడి పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్తామని పోచారం తెలిపారు. -
రైతులకు పగటి పూటే పూర్తి విద్యుత్: పోచారం
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పగటి పూటే 9 గంటలు కరెంట్ ఇవ్వడంపై ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం పోచారంలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నిజాంసాగర్‌కు నీరందిస్తామన్నారు. తెలంగాణలోని అన్ని నియోజక వర్గాలకు పశువైద్య సంచార వాహనం కెటాయిస్తామని పోచారం వెల్లడించారు. -
వెయ్యి పంచాయతీలకు కొత్త భవనాలు
130 కోట్ల నిధుల కేటాయింపు ♦ మలి విడతలో మరో 1,271 పంచాయతీలకు.. ♦ శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 8770 గ్రామ పంచాయతీలకుగాను 1,650 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేవని పురపాలక, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తొలి విడతగా రూ. 130 కోట్లతో వెయ్యి పంచాయతీలకు నూతన భవనాలను నిర్మిస్తున్నామని, మిగిలిన 650 పంచాయతీలతోపాటు మరో 621 ‘ఒకే గది’ పంచాయతీలకు (మొత్తం 1,271) మలి దశలో భవనాలను నిర్మిస్తామన్నారు. సర్పంచ్, సిబ్బంది, ఈ-పంచాయతీకి ప్రత్యేక గదులు, సమావేశ మందిరంతో కూడిన భవనాలకు ప్రత్యేక డిజైన్ రూపొందించామని చెప్పారు. గతంలో ఒక్కో పంచాయతీ భవన నిర్మాణానికి రూ. 10 లక్షలు కేటాయింపులు జరగ్గా తాము రూ. 13 లక్షలకు పెంచామన్నారు. ఆదివారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు బాజిరెడ్డి గోవర్దన్, బోడిగ శోభ, చల్లా ధర్మారెడ్డి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ బదులిచ్చారు. ఐదు వేలు జనాభాగల మేజర్ గ్రామ పంచాయతీల భవనాలకు మరిన్ని నిధులిస్తామని...మండల కేంద్రాల్లో సచివాలయాల నిర్మాణం కోసం స్థానిక పంచాయతీలు రూ. 25 లక్షల చొప్పున నిధులు సమకూర్చితే ప్రభుత్వ వాటాను రూ. 25 లక్షలకు పెంచుతామని కేటీఆర్ పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశకు రూ. 220 కోట్లు ఎంఎంటీఎస్ రెండో దశను భక్తుల సౌకర్యార్థం ఘట్కేసర్-రాయిగిర్ (యాదాద్రి) వరకు పొడిగించేందుకు రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసిం దని ఈ అంశంపై సభ్యులు వేముల వీరేశం, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్, కె.ప్రభాకర్‌రెడ్డిల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. రూ. 330 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టులో కేంద్రం రూ. 110 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 220 కోట్ల వాటాను భరిస్తుందన్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక కింద 3,773 కోట్ల ఖర్చు: మంత్రి జగదీశ్‌రెడ్డి ఎస్సీ ఉప ప్రణాళిక కింద 2015-16లో కేటాయించిన రూ. 8,089.24 కోట్లలో రూ. 3,773.33 కోట్లు ఖర్చు చేశామని, ప్రభుత్వ సాయం వల్ల 48,98,069 మంది ఎస్సీలు లబ్ధిపొందారని రాష్ట్ర ఎస్సీల అభివృద్ధి, విద్యుత్‌శాఖల మంత్రి జి. జగదీశ్‌రెడ్డి తెలిపారు. గిరిజన ఉప ప్రణాళిక కింద కేటాయించిన రూ. 5,035.687 కోట్లలో రూ. 2,671.67 కోట్లు ఖర్చుపెట్టామని, దీనివల్ల 15,38,726 మంది ఎస్టీలు లబ్ధి పొందారని ఈ అంశంపై సభ్యులు సండ్ర వెంకట వీరయ్య, ఆర్. కృష్ణయ్య, ఎ.రేవంత్‌రెడ్డి, సున్నం రాజయ్య, మల్లు భట్టి విక్రమార్క, జెట్టి గీత, ఎస్.ఎ సంపత్ కుమార్, చల్లా వంశీచంద్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, తమ్మన్నగారి రామ్మోహన్‌రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, రవీంద్ర కుమార్ రమావత్ల ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. విద్యుత్ పొదుపు చర్యల కోసం ఎల్ఈడీ బల్బుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో డిమాండ్ సైడ్ ఎనర్జీ ఎఫీషియన్సీ ప్రోగ్రాం (డీఈఎల్పీ)ను అమలు చేస్తున్నామని సభ్యులు సతీశ్ కుమార్, బానోత్ మదన్‌లాల్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎస్.సత్యనారాయణ, వేముల వీరేశం, చల్లా ధర్మారెడ్డి, డి.కె అరుణల ప్రశ్నలకు జగదీశ్‌రె డ్డి సమాధానమిచ్చారు. ఉర్దూ బడులకు మౌలిక సదుపాయాలు: కడియం రాష్ట్రంలోని 1,571 ఉర్దూ మాధ్యమ పాఠశాలలకుగాను 219 పాఠశాలలు మౌలిక సదుపాయాలతో ఉన్న ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. 1:25 దామాషాలో ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య ఉందన్నారు. స్థల లభ్యత ప్రాతిపదికన పాఠశాలల భవనాలను నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయని ఈ అంశంపై ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్, ముంతాజ్‌ఖాన్, మొజంఖాన్, జాఫర్ , అహ్మద్ పాషా ఖాద్రీ, అహ్మద్ బలాలా లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఉద్యానవన కార్పొరేషన్: పోచారం ఉద్యానవనాలు, పూల పెంపకం, కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సభ్యులు మనోహర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, వేముల వీరేశంల ప్రశ్నలకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. రాష్ట్రంలో 1.28 కోట్ల గొర్రెలు, 46.75 లక్షల మేకల యూనిట్లను మంజూరు చేశామని ఎమ్మెల్యే ఎ.అంజయ్య అడిగిన ప్రశ్నకు పోచారం సమాధానమిచ్చారు.