తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ ఇళ్లను సేల్‌కు పెట్టింది. గతంలో కట్టిన ఇళ్లను అమ్మేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. తక్కువ ధరకే ఫ్లాట్లు అమ్మకానికి రావడంతో.. వాటిని సొంతం చేసుకునేందుకు కొనుగోలు దారులు పోటీపడుతున్నారు.
ప్రభుత్వ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం..బండ్లగుడాతో పాటు పోచారంలోని రాజీవ్ స్వగృహ ప్లాట్ల అమ్మకానికి ఈనెల11న హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఫ్లాట్ల అమ్మకపు నోటిఫికేషన్‌కు ఊహించని రీతిలో రెస్సాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లాట్ల ధర తక్కువ కావడంతో మే 12నుంచి ప్రారంభమైన అప్లికేషన్‌ల రిజిస్ట్రేషన్‌లు మే 23 వరకు 3వేల ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు 14వేల మంది అప్లయ్ చేశారు. ఈ అప్లికేషన్‌ల సంఖ్య 20రోజుల్లో 30వేలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మొత్తం 3,271 ఫ్లాట్లు
హైదరాబాద్ బండ్లగూడలో 1501 ఫ్లాట్లు, గట్కేసర్ సమీపంలో ఉన్న పోచారంలో 1470 ఫ్లాట్లను అమ్మకానికి పెట్టింది.వచ్చే నెల 14వ తేదీన గడువు ముగుస్తుండడంతో ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు భారీ ఎత్తున అప్లయ్ చేస్తున్నారు.
లాటరీ సిస్టమ్‌లో
స్వగృహ ఫ్లాట్లను అమ్మకానికి పెట్టిన ప్రభుత్వం..లాటరీ ద్వారా వివిధ ఫ్లాట్ల స్కైర్ ఫీట్ విలువ ఎంతనేది ఫైనల్ చేయనుంది. ఇందుకోసం ఒక వ్యక్తి రూ.1000 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉండగా..లాటరీలో కార్నర్ ఫ్లాట్ల కొనుగోలు దారుల కుటుంబ సభ్యులు, వారి బంధువులతో పాటు ఉద్యోగులు సైతం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.కాగా పెండింగ్‌లో ఫ్లాట్ల పనులను త్వరగా పూర్తి చేసి రీసేల్ పెట్టే అవకాశం ఉందని, అదృష్టం ఉంటే రీసేల్‌లో సైతం ఫ్లాట్లను సొంతం చేసుకోవచ‍్చు.
స్వగృహా ఫ్లాట్లును ఎక్కడ ఎక్కువగా కొంటున్నారంటే
ఓఆర్‌ఆర్, నాగోల్ మెట్రోస్టేషన్, సిటీ దగ్గర్‌లో ఉండడంతో పోచారం కంటే బండ్లగూడ స్వగృహలో ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు మక్కువ చూపుతున్నారు. కాబట్టే 14వేల అప్లికేషన్‌లలో 12వేల మంది బండ్లగూడ ఫ్లాట్లపై మక్కువ చూపుతుంటే కేవలం 2వేల మంది మాత్రమే పోచారం ఫ్లాట్లను సొంతం చేసుకునేందుకు అప్లికేషన్‌లు పెట్టుకున్నారు.
బండ్లగూడా స్వగృహా ఫ్లాట్లు ఎన్నంటే
మే 23 వరకు బండ్లగూడాలో 345..3బీహెచ్‌కే డీలెక్స్ ఫ్లాట్లను, 444..3బీహెచ్‌కే ఫ్లాట్లను,712..2బీహెచ్‌కే స్వగృహా ఫ్లాట్ల కోసం అప్లికేషన్‌లు వచ్చాయి.
పోచారం స్వగృహా ఫ్లాట్లు ఎన్నంటే
మే 23 వరకు పోచారంలో 91..3బీహెచ్‌కే డీలెక్స్ ఫ్లాట్లు, 53..3బీహెచ్‌కే ఫ్లాట్లు, 884..2బీహెచ్‌కే ఫ్లాట్లు, 442..1బీహెచ్‌కే ఫ్లాట్ల కోసం అప్లికేషన్‌లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment