real estate (industry)
-
హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు డీలా..
హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు (Housing sales) 2024లో నెమ్మదించాయి. 2023తో పోలిస్తే 25 శాతం తక్కువగా, 61,722 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023లో విక్రయాలు 82,350 యూనిట్లుగా ఉండడం గమనార్హం. అంతేకాదు, దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల్లోనూ 2024లో ఇళ్ల అమ్మకాలు 9% మేర క్షీణించాయి. 4.71 లక్షల యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి.2023లో ఈ తొమ్మిది నగరాల్లో అమ్మకాలు 5,14,820 యూనిట్లుగా ఉన్నాయి. ఈ మేరకు ప్రాప్ ఈక్విటీ (PropEquity) సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. డిమాండ్‌తోపాటు, తాజా సరఫరా తగ్గడం ఇందుకు కారణాలుగా పేర్కొంది. తొమ్మిది నగరాల్లో కొత్త ఇళ్ల సరఫరా (విక్రయానికి అందుబాటులోకి రావడం) 15 శాతం తగ్గి 4,11,022 యూనిట్లుగా ఉంది.పట్టణాల వారీగా విక్రయాలు.. బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 2024లో 9 % క్షీణించి 60,506 యూనిట్లుగా నమోదు.చెన్నైలో 11% తక్కువగా 19,212 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోల్‌కతాలో అమ్మకాలు 2023తో పోల్చితే కేవ లం 1% తగ్గి 19,212 యూనిట్లకు పరిమితం.ముంబైలో అమ్మకాలు 6% క్షీణించాయి. 50,140 యూనిట్ల విక్రయాలు జరిగాయి.నవీ ముంబైలో మాత్రం విక్రయాలు 16 శాతం పెరిగి 33,870 యూనిట్లుగా ఉన్నాయి.పుణెలో ఇళ్ల విక్రయాలు 13 శాతం తగ్గి 92,643 యూనిట్లుగా ఉన్నాయి. థానేలో 5% తక్కువగా 90,288 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.ఢిల్లీ ఎన్సీఆర్లో గతేడాది ఇళ్ల అమ్మకాలు 5% వృద్ధితో 43,923 యూనిట్లుగా నమోదయ్యాయి.“2024లో హౌసింగ్ సప్లై,సేల్స్ తగ్గడానికి అధిక బేస్ ఎఫెక్ట్ కారణం. 2023లో ఇది అత్యంత గరిష్టానికి చేరింది. గణాంకాలను విశ్లేషణ ప్రకారం సేల్స్ పడిపోయినప్పటికీ, 2024లో సరఫరా-స్వీకరణ నిష్పత్తి 2023లో ఉన్నట్టుగానే ఉంది. ఇది రియల్ ఎస్టేట్ రంగం ప్రాథమికాలు బలంగా, ఆరోగ్యంగా ఉన్నాయని సూచిస్తున్నాయి” అని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజా అన్నారు. -
రియల్టీలో మహిళలకు ఉపాధి ఎక్కడ?
రియల్ ఎస్టేట్ రంగంలో ఉపాధి పరంగా మహిళలకు తగినన్ని అవకాశాలు దక్కడం లేదని రియల్టీ(Realty) సంస్థ మ్యాక్స్ ఎస్టేట్స్, ఇన్ టాండెమ్ గ్లోబల్ కన్సల్టెంగ్‌తో కలసి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమ 7.1 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంటే, అందులో మహిళలు 70 లక్షలుగానే (10 శాతం) ఉన్నట్టు తెలిపింది. ఈ రంగంలో సమానత్వం సాధనకు ఎంతో సమయం పడుతుందని పేర్కొంది.‘భారత రియల్ ఎస్టేట్(Real Estate) రంగం కూడలి వద్ద ఉంది. అసాధారణ వృద్ధికి సిద్దంగానే ఉన్నా, సవాళ్ల కారణంగా పూర్తి సామర్థ్యాలను చూడలేకుంది. భారత జనాభాలో మహిళలు 48.5 శాతంగా ఉంటే, ఇందులో కేవలం 1.2 శాతం మందికే రియల్ ఎస్టేట్ రంగంలో ఉపాధి లభిస్తోంది’అని ఈ నివేదిక వెల్లడించింది. ఒకవైపు మహిళలకు తగినంత ప్రాతినిధ్యం లేకపోగా, మరోవైపు వారికి వేతన చెల్లింపుల్లో అసమానత్వం ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లలో ఒకటిగా పేర్కొంది.‘ఉపాధి కల్పనలో రియల్ ఎస్టేట్ రంగానికి గణనీయమైన పాత్ర ఉంది. అయినప్పటికీ మహిళలకు సమాన అవకాశాల కల్పన పరంగా ఎంతో దిగువన ఉంది. లింగ అసమానతను పరిష్కరించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను, ఉత్పాదకతను, ఆవిష్కరణలను, లాభదాయకతను గణనీయంగా పెంచొచ్చు’ అని ఈ నివేదిక సూచించింది. బ్లూకాలర్, వైట్ కాలర్ మహిళా కార్మికుల సాధికారత పెంచేందుకు నైపుణ్య శిక్షణ అందించాలని పేర్కొంది. మరింత మంది మహిళలకు భాగస్వామ్యం కలి్పంచడం వల్ల ఈ రంగం ముఖచిత్రం మారిపోతుందని ఇన్టాండెమ్ గ్లోబల్ కన్సల్టెంగ్ ఎండీ శర్మిష్ట ఘోష్ అభిప్రాయపడ్డారు. -
‘నేను ప్రజల మనిషినయ్యా.. అందుకే వాణ్ని ..’
సాక్షి, హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ ఏకశిలానగర్‌లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పర్యటనలో ఉద్రికత్త చోటు చేసుకుంది. కబ్జా రాయుళ్లు తమ భూముల్ని కాజేస్తున్నారంటూ పలువురు బాధితుల ఫిర్యాదతో ఈటల రాజేందర్ మంగళవారం ఏకశిలానగర్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పేదల భూముల్ని కబ్జా చేస్తున్నారంటూ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఈటల రాజేందర్ దాడి చేశారు. ఆ ఘటనపై తాజాగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. పోచారం మున్సిపాల్టీ పరిధిలోని కొర్రేముల 1985లో 149 ఎకరాల భూమిని 2076 మందికి విక్రయించారు. ప్రభుత్వ ఉద్యోగులు లోన్ తీసుకొని ప్లాట్లు కొనుగోలు చేశారు. 2006లో దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వ్యవసాయ భూమిగా రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రయత్నం చేశాడు. డీపీవో అండదండతో మళ్ళీ వ్యవసాయ భూమిగా మార్చారు.ధరణి లొసుగులతో ఆప్పటి కలెక్టర్ అమాయ్ కుమార్ 9 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారి కి కట్టబెట్టే ప్రయత్నం చేశారు.రియల్ ఎస్టేట్ వ్యాపారి కిరాయి గుండాలతో కుక్కలను పెట్టీ ఇక్కడ స్థానికులను భయపెట్టే ప్రయత్నం చేశారు. బాధితులు నా దగ్గరకు వచ్చారు. సీపీకి ఫోన్ చేశాను, కలెక్టర్‌కు చెప్పాను. రాత్రి పూట ఎంపీ వస్తే ఏం పీకు** అంటూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ స్థానికులను బెదరించాడు. నలభై లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకుంటే కూల్చారని ఒక అబ్బాయి ఏడుస్తూ ఫోన్ చేశారు. దీంతో నేను బాధితుడి ఇంటికి వెళ్లా. నేను వెళ్లే సమయంలో గుండాలు తాగుతూ ఇక్కడే కూర్చున్నారు. ప్రజల మనిషిగా వాడ్ని కొట్టిన.న్యాయం కాపాడాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు అధర్మానికి అండగా అంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధితులకు పూర్తి న్యాయం చేయాలి. కాంగ్రెస్ నాయకుల అండతోనే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రెచ్చిపోతున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. -
త్వరలో టీజీ రెరా యాప్..
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించేందుకు ఉద్దేశించినదే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(TG-RERA). సాంకేతికత వినియోగం పెరిగిన ఈ రోజుల్లో టీజీ రెరా సేవలకు కూడా ఆధునికత చేర్చాలని నిర్ణయించారు. రియల్ ఎస్టేట్(Real Estate) ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్, ఫిర్యాదుల ట్రాకింగ్, రియల్ టైం నోటిఫికేషన్ల క్రమబద్ధీకరణ కోసం టీజీ రెరా యాప్‌ను తీసుకురానున్నట్లు టీజీ రెరా ఛైర్మన్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. అలాగే ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్లు తక్షణ ధ్రువీకరణ కోసం క్యూఆర్ కోడ్ సాంకేతికత అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం టీజీ రెరా వెబ్సైట్(Website)లో రిజిస్ట్రేషన్లు, ఫిర్యాదులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ.. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడమే దీన్ని ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూ పూర్తి వివరాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోనివాస సముదాయాలు మాత్రమే రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? వాణిజ్య భవనాలకు రెరా రిజిస్ట్రేషన్ అవసరం లేదా?జవాబు: నివాస, వాణిజ్య ఏ భవనమైనా సరే రెరాలో రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ నుంచి అనుమతి పొందిన 500 చ.మీ. లేదా 8 యూనిట్ల కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉన్న ప్రతీ ప్రాజెక్ట్ కూడా ఆర్ఈ(R and D) చట్టంలోని సెక్షన్–3 కింద రిజిస్ట్రేషన్ చేయాలి.రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండానే విక్రయాలు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?జవాబు: బ్రోచర్లు, కరపత్రాలతో సహా అన్ని ప్రింట్, ఎల్రక్టానిక్, సోషల్ మీడియాలో ప్రచురించే ప్రకటనలు, ప్రాజెక్ట్(Project)లకు తప్పనిసరిగా రెరా రిజిస్ట్రేషన్ నంబరు ఉండాలి. దాన్ని ప్రదర్శించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే తొలుత షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. 15 రోజుల వ్యవధిలో ప్రత్యుత్తరాన్ని సమర్పించాలి. లేని పక్షంలో ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం వరకు జరిమానా విధిస్తారు. ఉల్లంఘనలు పునరావృతమైతే సంబంధిత ప్రమోటర్‌కు మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు.ఇల్లు కొనేందుకు కొనుగోలు దారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?జవాబు: ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు కొనుగోలుదారులు సంబంధిత ప్రాజెక్ట్‌కు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ(HMDA), డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ వంటి స్థానిక సంస్థల నుంచి నిర్మాణ అనుమతులు ఉన్నాయా? లేదా అని తెలుసుకోవడంతో పాటు రెరాలో రిజిస్ట్రేషన్ అయ్యిందో లేదో నిర్ధారించుకోవాలి. రెరా వెబ్సైట్ ద్వారా ప్రాజెక్ట్ రెరా రిజిస్ట్రేషన్ నంబర్‌ను పరిశీలించవచ్చు. అలాగే లీగల్ టైటిల్, ఆమోదిత లేఔట్ ప్లాన్, ప్రాజెక్ట్ పేరు, వసతులు, ప్రాంతం వివరాలు, చట్టపరమైన టైటిల్ డీడ్స్, ప్రాజెక్ట్ నిర్మాణ గడువు వంటి అన్ని రకాల వివరాలను పరిశీలించవచ్చు.బాధితులు రెరాకు ఎలా ఫిర్యాదు చేయాలి? జవాబు: రెరా రిజిస్ట్రేషన్ లేకుండా, ప్రీలాంచ్, బైబ్యాక్ స్కీమ్‌ల పేరిట ప్రచారం చేసినా, విక్రయాలు చేసినా టీజీ రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. 040–29394972 లేదా 9000006301 వాట్సాప్ నంబరులో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే https://rera.telangana.gov.in/complaint/ లేదా rera-maud@telangana.gov.in లేదా secy-rera-maud@telangana.gov.inలకు ఈ–మెయిల్స్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లేదా సేల్‌డీడ్‌లో పేర్కొన్న గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకపోయినా, అడ్వాన్స్‌గా 10 శాతం కంటే ఎక్కువ సొమ్ము వసూలు చేసినా రెరాకు ఫిర్యాదు చేయవచ్చు.ఇప్పటి వరకు రెరాలో ఎన్ని ప్రాజెక్ట్‌లు రిజిస్ట్రేషన్ అయ్యాయి?జవాబు: ఇప్పటివరకు టీజీ రెరాలో 9,129 ప్రాజెక్ట్‌లు రెరాలో రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటిలో అత్యధికంగా రంగారెడ్డిలో 2,954, అత్యల్పంగా ఆసిఫాబాద్‌లో 2 ప్రాజెక్ట్‌లు రిజిస్టర్ అయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. మేడ్చల్–మల్కాజ్గిరి 2,199, సంగారెడ్డి 986, హైదరాబాద్ 516, వరంగల్ అర్బన్ 414, యాదాద్రి భువనగిరి 349, మహబూబ్‌నగర్ 257, ఖమ్మం 280, నిజామాబాద్ 158, కరీంనగర్ 144, సిద్దిపేట 101, వికారాబాద్ 101, సూర్యాపేట 98, నల్లగొండ 87, నాగర్‌కర్నూల్ 66, మెదక్ 61, కామారెడ్డి 53, మంచిర్యాల 37, భద్రాది కొత్తగూడెం 34, జగిత్యాల 32, ఆదిలాబాద్ 31, మహబూబాబాద్ 27, పెద్దపల్లి 26, జనగాం 24, వనపర్తి 21, రాజన్న సిరిసిల్ల 19, జోగులాంబ గద్వాల్ 17, నిర్మల్ 12, వరంగల్ రూరల్ 12, జయశంకర్ 11 ప్రాజెక్ట్‌లు రిజిస్టరయ్యాయి.ఇప్పటి వరకు రెరా ఎంత జరిమానా విధించింది? ఎంత వసూలైంది?జవాబు: ఇప్పటి వరకు రెరా నిబంధనల ఉల్లంఘనదారులపై రూ.40.95 కోట్ల జరిమానాలు విధించాం. ఇందులో రూ.15.64 కోట్లు వసూలు చేశాం.నిర్మాణ సంస్థలు జరిమానా చెల్లించకపోతే రెరా తదుపరి చర్యలు ఏంటి?జవాబు: రెరా విధించిన జరిమానా లేదా వడ్డీ పరిహారం చెల్లించడంలో ప్రమోటర్ విఫలమైతే.. అది రెవెన్యూ బకాయిగా పరిగణిస్తారు. ఈ తరహా కేసులను ఆర్ఈ(ఆర్అండ్డీ) చట్టం–2016లోని సెక్షన్ 40(1) కింద జరిమానా లేదా వడ్డీ రికవరీ చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేస్తాం.ఇప్పటి వరకు ఎంత మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు?జవాబు: రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా తప్పనిసరిగా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. రెరా రిజిస్ట్రేషన్ నంబరు లేకుండా ఏజెంట్లు ప్లాట్లు, ఫ్లాట్, ఇల్లు ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ను విక్రయించకూడదు. ఇప్పటి వరకు టీజీ–రెరాలో 3,925 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రిజిస్టరయ్యారు.ఇదీ చదవండి: భవిష్యత్తులో కనుమరుగయ్యే ఉద్యోగాలు ఇవే..ఈమధ్య కాలంలో బిల్డర్ల చీటింగ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. వీటిలో చాలా మంది బిల్డర్లు ఏజెంట్ల ద్వారా విక్రయాలు చేసినవాళ్లే.. మరి, ఏజెంట్ల మీద రెరా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?జవాబు: రెరా చట్టంలోని 9, 10లను ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కూడా రెరా జరిమానా విధిస్తుంది. ఇప్పటి వరకు భృగు ఇన్ఫ్రా, సాయిసూర్య డెవలపర్స్, భారతి ఇన్ఫ్రా డెవలపర్స్, రియల్ ఎస్టేట్ అవెన్యూ కన్సల్టెంట్ సర్వీసెస్, యంగ్ ఇండియా హౌసింగ్ ప్రై.లి. వంటి ఏజెంట్లపై రెరా చర్యలు తీసుకున్నాం. రెవెన్యూ రికవరీ చట్టం కింద జరిమానా రికవరీ చేసేందుకు సంబంధిత జిల్లా కలెక్టర్ చర్యలు కూడా ప్రారంభించారు.ఇప్పటి వరకు రెరా ఎన్ని ఫిర్యాదులను పరిష్కరించింది?జవాబు: టీజీ రెరా పోర్టల్ ద్వారా ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా ఆన్లైన్లో కేసుల విచారణ కూడా చేపడుతున్నాం. దీంతో ఎక్కడి నుంచైనా సరే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మౌఖిక వాదనాలు వినిపించవచ్చు. ఇప్పటి వరకు 1,216 ఫిర్యాదులను పరిష్కరించాం. -
భవనాల ఎత్తుకు క్యాప్ పెట్టండి!
‘ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) పరిమితులు ఉన్నాయి. కానీ, ఔటర్ రింగ్ రోడ్డు వరకూ స్థలాల లభ్యత ఉన్న హైదరాబాద్‌లో మాత్రం ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు లేవు. దీంతో రోడ్డు, స్థలం విస్తీర్ణంతో సంబంధం లేకుండా బిల్డర్లు ఇష్టారాజ్యంగా హైరైజ్ భవనాలను నిర్మిస్తున్నారు. దీంతో భూములు, అపార్ట్మెంట్ల ధరలు పెరుగుతున్నాయి. ఒకే ప్రాంతంలో భవన నిర్మాణాలు ఉండటంతో రోడ్లపై వాహనాల రద్దీ, కాలుష్యం పెరగడంతో పాటు విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలపై అదనపు భారం పడుతుంది’ అని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్(నరెడ్కో) వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఛైర్మన్ ఎం.ప్రేమ్‌కుమార్ అన్నారు. ‘సాక్షి రియల్టీ’తో ఆయన ఇంటర్వ్యూ పూర్తి వివరాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోమౌలిక వసతులు, డిమాండ్ ఉన్న ప్రాంతంలో తక్కువ స్థలం దొరికినా చాలు బిల్డర్లు హైరైజ్ భవనాలు కట్టేస్తున్నారు. దీంతో స్థలాలు, అపార్ట్మెంట్ల ధరలు పెరగడం తప్ప సమాంతర అభివృద్ధి జరగడం లేదు. నగరాభివృద్ధికి ఆకాశహర్మ్యలే ప్రతీక. ఆర్థికంగా, సాంకేతికంగా మనం ఎంత శక్తిమంతులమో ఇవి నిరూపిస్తాయి. అలా అని రోడ్డు, మౌలిక సదుపాయాలపై పడే ప్రభావాన్ని అంచనా వేయకుండా అనుమతులు ఇవ్వకూడదు. ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు ఉంటేనే బిల్డర్లు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా ఓఆర్ఆర్ చుట్టూ ఖాళీగా ఉన్న ప్రాంతాల వైపు దృష్టిసారిస్తారు. దీంతో ధరలు తగ్గి, సామాన్యుల సొంతింటి కల సాకారం అవుతుంది. నార్సింగి, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో కనీసం నివాస భవనాలకైనా ఎఫ్ఎప్ఐపై క్యాప్ పెట్టాలి.మూసీ పరిహారంగా స్థలాలు..గ్లోబల్ సిటీగా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న హైదరాబాద్‌లో కంపుకొట్టే మూసీ నది ఉండటం శోచనీయం. విదేశీ పర్యాటకులు, పెట్టుబడులను ఆకర్షించాలంటే మూసీ సుందరీకరణ అనివార్యం. ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అభినందనీయం. అయితే మూసీ పరివాహక ప్రాంతంలోని నివాసితులను ఒప్పించి ఆయా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. మూసీ బాధితులకు శివారు ప్రాంతంలో ప్రభుత్వమే లేఔట్ చేసి, 60–80 గజాల చొప్పున స్థలాన్ని కేటాయించాలి. దీంతో వాళ్లే సొంతంగా ఇళ్లు కట్టుకుంటారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల నిధులను ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరణతో రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుంది. రోడ్ల మీద వాహనాల రద్దీతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుంది. మెరుగైన రవాణాతో నగరం సమాంతరంగా అభివృద్ధి చెందుతుంది.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఎన్ని ఇళ్లు అమ్మకానికి ఉన్నాయంటే..చెరువుల్లో పట్టా భూములు..చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రా ఉద్దేశం మంచిదే. కానీ, ప్రభుత్వం దీన్ని సరైన రీతిలో పరిచయం చేయలేదు. ఇప్పటికీ గ్రేటర్లో చాలా చెరువులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ప్రభుత్వం నిర్ధారించలేదు. అయినా ఆగమేఘాల మీద బుల్డోజర్లతో కూల్చివేతలు చేశారు. అలా కాకుండా ముందుగా చెరువులకు కంచె వేసి, బఫర్ జోన్లను నిర్ధారించాలి. గ్రేటర్‌లోని చాలా చెరువుల్లో పట్టా భూములు ఉన్నాయి. ఆయా భూయజమానులకు 400 శాతం ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) భూములను స్వాధీనం చేసుకోవాలి. ఈ విధానాన్ని హైదరాబాద్‌కే కాకుండా రాష్ట్రమంతటా అమలు చేయాలి. అప్పుడే బాధితులు ముందుకొస్తారు. గతంలో కొనుగోలుదారులు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పర్మిషన్ ఉందా అడిగేవారు కానీ ఇప్పుడు హైడ్రా పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. -
హైదరాబాద్‌లో ఎన్ని ఇళ్లు అమ్మకానికి ఉన్నాయంటే..
డిమాండ్‌కు మించి సరఫరా జరుగుతుండటంతో హైదరాబాద్‌లో అమ్మకానికి ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) పెరిగిపోతున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే అత్యధిక ఇన్వెంటరీ ఉంది. ఇక, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోలిస్తే మన దగ్గరే ఎక్కువ. ప్రస్తుతం గ్రేటర్లో 1,01,091 ఇళ్ల ఇన్వెంటరీ (వీటిలో నిర్మాణంలో ఉన్నవి, పూర్తయినవి కలిపి) ఉంది. వీటి విక్రయానికి కనిష్టంగా 19 నెలల కాలం పడుతుంది.రెండేళ్లలో నగరంలో గృహాల సరఫరా పెరగడమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణం. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో మొత్తం 5,64,416 యూనిట్ల ఇన్వెంటరీ మిగిలి ఉందని, వీటి విక్రయానికి కనిష్టంగా 14 నెలల కాలం పడుతుందని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది.ఇదీ చదవండి: ట్రంప్ కలం నుంచి జాలువారిన అక్షరాలునగరాల వారీగా ఇన్వెంటరీ (యూనిట్లలో)ఎన్సీఆర్ ఢిల్లీ 85,460 ఎంఎంఆర్ ముంబయి 1,86,677 బెంగళూరు 46,316 పుణే 88,176 హైదరాబాద్ 1,01,091 చెన్నై 28,758 కోల్‌కతా 25,938 -
సోలారే సోబెటరూ..
సాక్షి, సిటీబ్యూరో: ఈ మధ్య కాలంలో వచ్చిన అధునాతన సాంకేతిక మార్పుగా అవతరించి, సామాజికంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న వాటిలో ‘సోలార్ విద్యుత్ శక్తి, ఈ–వాహనాలు’ హవా కొనసాగిస్తున్నాయి. ఈ రెండు అంశాలు సామాజిక జీవన వైవిధ్యంలో పెను మార్పులకు నాంది పలికాయి. ఒక వైపు విపరీతంగా పెరిగిపోతున్న కరెంట్ వాడకం, దానికి అనుగుణంగానే పెరిగిపోతున్న విద్యుత్ ఛార్జీలు. వెరసీ అందరి చూపూ సోలార్ విద్యుత్ వైపునకు మళ్లింది.దశాబ్ద కాలంగానే సోలార్కు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ అది నగరాల వరకే పరిమితమైంది. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ సోలార్ సెట్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు సోలార్ వ్యవస్థను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రత్యేక సబ్సిడీలను సైతం అందిస్తున్నారు. కొన్నేళ్లుగా సోలార్ వ్యవస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వ్యాపార సంస్థలు సైతం ఈ సందర్భంగా వారి సేవలు పెంచుతున్నాయి. కొన్ని సంస్థలైతే వివిధ జిల్లాల్లోని టౌన్లలో ప్రత్యేకంగా ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఆవిష్కరించి ఈ సోలార్ సెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు.సూర్య ఘర్ స్కీంతో సబ్సిడీ..హైదరాబాద్ వంటి నగరాల్లో సోలార్ వాడకంపై అవగాహన మెరుగ్గానే ఉంది. సోలార్ విద్యుత్ వినియోగించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే ఈ విధానానికి అలవాటు పడుతున్నారు. ఈ సోలార్ పద్ధతులు వ్యక్తిగత ఇళ్లతో పాటు చిన్న–పెద్ద తరహా పరిశ్రమల్లోనూ విరివిగా వాడుతున్నారు. వారి వారి విద్యుత్ వాడకానికి అనుగుణంగానే పీఎం సూర్య ఘర్ స్కీంలో ఒక కిలో వాట్ నుంచి వినియోగాన్ని బట్టి అవసరమైనన్ని కిలో వాట్ల సోలార్సెట్లను, వాటికి సబ్సిడీని అందిస్తుంది. ఈ సోలార్ విధానాన్ని రెసిడెన్షియల్ ఏరియాలో, స్కూల్స్, ఫామ్ హౌజ్‌లు, రైస్‌మిల్స్ వంటి చిన్న తరహా పరిశ్రమల్లోనూ ఎక్కువగా వాడుతున్నారు. పరిశ్రమలైనా, వ్యక్తిగత వినియోగమైనా.. టెక్నాలజీ పెరగడంతో కరెంట్ వినియోగం సైతం అధికంగా పెరిగిపోయింది. గతంలో ఇళ్లలో రూ.200 నుంచి రూ.500ల కరెంట్ బిల్ అత్యధికం అనుకుంటే.. ఇప్పుడది రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పెరిగిపోయింది. ఇక పరిశ్రమల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మిషనరీ, అధునాతన సాంకేతికత వినియోగం పెరగడంతో వాటి చార్జీలు మూడింతల కన్నా పైగానే పెరిగాయని నిపుణులు తెలుపుతున్నారు. పర్యావరణ హితం.. సోలార్ సిస్టం..విద్యుత్ తయారీ కోసం ప్రస్తుతం వాడే పద్ధతులన్నీ ఏదో విధంగా పర్యావరణానికి హాని చేసేవే అని పరిశోధకుల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా థర్మల్, గ్యాస్, విండ్, హైడ్రో తదితర పద్ధతుల్లో విద్యుత్‌ను సేకరిస్తున్నారు. ఈ తరుణంలో కిలో వాట్ సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే కొన్ని వందల మొక్కలు పెంచిన దానితో సమానమని, అంతటి కాలుష్యాన్ని తగ్గించే విధానంగా సోలార్ నిలుస్తుందని నిపుణుల మాట. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ పెరగడం, కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు పెరగడం.. తదితర కారణాలతో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఏర్పడటం, వెరసీ పర్యావరణ మార్పులతో పెను ప్రమాదాలను ఎదుర్కొంటున్నాం. ఇలాంటి తరుణంలో కాలుష్యరహిత పద్ధతులైన సోలార్ సిస్టమ్ అత్యంత శ్రేయస్కరమని భావిస్తున్నారు. అంతా లాభమే.. – రాధికా చౌదరి, ఫ్రెయర్ ఎనర్జీ కోఫౌండర్రాష్ట్రంలో సోలార్ వినియోగంపై అవగాహన పెరిగింది. ఈ రంగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ సేవలందిస్తున్నాం. కరోనా అనంతరం సోలార్ ఎనర్జీను వినియోగించేవారి సంఖ్య అధికంగా పెరిగింది. పీఎం సూర్య ఘర్ స్కీం కూడా దీనికి కారణం. ఇందులో భాగంగా రూ.2 లక్షల సోలార్ సెట్ బిగించుకుంటే దాదాపు రూ.78 వేల సబ్సిడీ లభిస్తుంది. మిగతా పెట్టుబడి కూడా రెండు మూడేళ్ల కరెంట్ ఛార్జీలతో సమానం. కాబట్టి మూడేళ్ల తర్వాత వినియోగించే సోలార్ కరెంట్ అంతా లాభమే. -
హైదరాబాద్ ‘రియల్’ ట్రెండ్
దేశీయ స్థిరాస్తి రంగంలో హైదరాబాద్ పవర్ హౌస్‌గా మారింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), లైఫ్ సైన్స్ రంగాల బహుళ స్థిరాస్తి పెట్టుబడులకు వేదికగా అభివృద్ధి చెందింది. గతంలో సిటీ రియల్ ఎస్టేట్‌లో ఐటీ కంపెనీలు, ఉద్యోగుల లావాదేవీలు ఎక్కువగా జరుగుతుండేవి. కానీ, కొంతకాలంగా ఫార్మాసూటికల్స్ రంగం నుంచి కూడా పెట్టుబడులు, కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దీంతో గృహాలు, ఆఫీసులు, గిడ్డండులు, డేటా సెంటర్లకు డిమాండ్ ఏర్పడింది. – సాక్షి, సిటీబ్యూరోఇదీ రియల్ వృద్ధి..హైదరాబాద్‌లో ఈ ఏడాది తొమ్మిది నెలల్లో రూ.36,461 కోట్లు విలువ చేసే రూ.59,386 గృహాలు అమ్ముడుపోయాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది. అలాగే మార్కెట్లోకి కొత్తగా 85 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న ఆఫీస్ స్పేస్‌తో కలిపి మొత్తం 87 లక్షల చ.అ. కార్యాలయాల స్థలాల లావాదేవీలు జరిగాయి. ఇక గ్రేటర్లో 54 లక్షల చ.అ. గిడ్డంగుల స్థలం, 47 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 20 మెగావాట్లు నిర్మాణంలో ఉండగా.. మరో 38 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయని కొల్లియర్స్ ఇండియా నివేదిక తెలిపింది.భవిష్యత్తులో మరింత జోష్ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ, టీ–స్క్వేర్, ఫార్మా క్లస్టర్లు, మెట్రో విస్తరణతో పాటు విమానాశ్రయంతో కనెక్టివిటీ, రీజినల్ రింగ్‌రోడ్ వంటి బృహత్తర ప్రాజెక్ట్‌లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో సిటీ విస్తరణ పెరగడంతో పాటు పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఏర్పడతాయి. దీంతో హైదరాబాద్‌లో ఇళ్లు, ఆఫీసులు, వేర్‌హౌస్, డేటా సెంటర్లకు మరింత డిమాండ్ ఏర్పడుతుందని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే 3–4 ఏళ్లలో నగరంలో కొత్తగా లక్ష గృహాలు లాంచింగ్ అవుతాయని, 2026 నాటికి ఏటా 1.7–1.9 కోట్ల చ.అ. ఆఫీసు స్థలాన్ని అందుబాటులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వచ్చే రెండేళ్లలో వేర్‌హౌస్ స్థలం 40 లక్షల చ.అ.కు, డేటా సెంటర్ల సామర్థ్యం 23 మెగావాట్లకు విస్తరిస్తాయని అంచనా.ఐటీ వర్సెస్ ఫార్మా..ఐటీ, ఐటీఈఎస్ ఎగుమతులు, ఉత్పత్తులతో హైదరాబాద్ ఐటీ హబ్‌గా పేరొందింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు 11.3 శాతం పెరిగి రూ.2.68 లక్షల కోట్లను అధిగమించాయి. ప్రస్తుతం 1,500లకు పైగా ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల్లో 9 లక్షలకు పైగా ఉద్యోగులున్నారు. టీ–హబ్, టీ–వర్క్స్ వంటి ఇన్నోవేషన్ పవర్హౌస్లతో నగరం 4 వేల స్టార్టప్‌లకు ఆతిథ్యం ఇస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్(ఏఐ), సెమీకండక్టర్ల డిజైన్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై దృష్టి పెట్టడంతో అభివృద్ధి మరింత జోరందుకుంటుంది.లైఫ్ సైన్సెస్ క్యాపిటల్‌గా పిలిచే హైదరాబాద్‌లో 1,500లకు పైగా ఫార్మాసూటికల్స్, బయోటెక్ కంపెనీలున్నాయి. దేశంలోని మొత్తం ఫార్మా ఎగుమతుల్లో మన రాష్ట్రం వాటా 20–30 శాతం. దేశంలో మూడింట ఒక వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. 2023–24లో రూ.36,893 కోట్ల ఫార్మాసూటికల్స్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. వచ్చే పదేళ్లలో లైఫ్ సైన్స్ పరిశ్రమ వంద బిలియన్ డాలర్ల అభివృద్ధి చేయాలని, కొత్తగా 4 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫార్మా క్లస్టర్లు, జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైస్ పార్క్‌ల విస్తరణ తదితర బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా?2023–24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఎగుమతులు రూ.1,16,182 కోట్లు కాగా.. ఇందులో రూ.2,68,233 కోట్లు ఐటీ, రూ.36,893 కోట్ల ఫార్మాస్యూటికల్స్ ఎగుమతుల వాటాను కలిగి ఉన్నాయి. నగరంలో ఐటీతో మొదలైన రియల్ బూమ్ ఫార్మా ఎంట్రీతో నెక్ట్స్ లెవల్‌కి చేరింది. బలమైన ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ వ్యూహాత్మక ప్రణాళికలు, వ్యాపార అనుకూల విధానాలు, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, అందుబాటులో ప్రాపర్టీల ధరలు.. ఇవన్నీ ఐటీ, ఫార్మా రంగాలకు చోదక శక్తిగా మారాయి. బహుళ రంగాల్లో అంతర్జాతీయ కంపెనీలు కొలువుదీరడంతో నగరం శరవేగంగా అభివృద్ధి చెందింది. రాష్ట్రంలో ఐటీ, ఫార్మా ఎగుమతుల్లో గ్రేటర్ వాటా 60 శాతానికి పైగానే ఉంటుంది. వెస్ట్ హైదరాబాద్‌తో పాటు పోచారం, ఆదిభట్ల వంటి ప్రాంతాల్లో ఐటీ సంస్థలు, మేడ్చల్, కొత్తూరు, పటాన్చెరు వంటి ప్రాంతాల్లో వేర్‌హౌస్‌లు, శంషాబాద్, కందుకూరు, మేకగూడ వంటి ప్రాంతాల్లో డేటా సెంటర్లకు డిమాండ్ ఏర్పడింది. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుందంటే..!!
-
Ananya Tripathi: కోడర్ టు రియల్ ఎస్టేట్ క్వీన్
రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల పేర్లు అరుదుగా వినిపిస్తాయి. కోడర్, స్ట్రాటజీ కన్సల్టెంట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్, సీయీవోగా మంచి పేరు తెచ్చుకున్న 39 సంవత్సరాల అనన్య త్రిపాఠి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టి విజయం సాధించింది. ‘రియల్ ఎస్టేట్ క్వీన్’గా పేరు తెచ్చుకుంది... ఆర్మీ ఆఫీసర్ కూతురు అయిన అనన్య త్రిపాఠి తరచుగా ఒక స్కూల్ నుంచి మరో స్కూల్‌కు మారుతూ ఉండేది. ‘రకరకాల ప్రాంతాలలో చదువుకోవడం వల్ల ఎన్నో సంస్కృతుల గురించి తెలుసుకునే అవకాశం, అదృష్టం దొరికింది’ అంటుంది అనన్య. పుణెలోని ఆర్మీ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ పూర్తిగా చేసిన అనన్య ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ‘టీసీఎస్’ తొలి ఉద్యోగం చేసింది. కోడర్‌గా మంచి పేరు వచ్చినా తన దృష్టి వ్యాపారంగంపై మళ్లింది. అలా కోళికోద్ – ఐఐఎంలో ఎంబీఏ చేసింది. క్యాంపస్ సెలెక్షన్లో ‘మెకిన్సీ’కి ఎంపికైన ఏకైక స్టూడెంట్ అనన్య. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ ‘మెకిన్సీ’లో ఏడు సంవత్సరాల ప్రయాణం తనకు ఎన్నో పాఠాలు నేర్పింది. మార్గదర్శకులలాంటి వ్యక్తులతో పరిచయం జరిగింది. విశ్లేషణాత్మకంగా ఉండడంతో పాటు స్ట్రక్చర్డ్ డాటా తాలూకు సమస్యలను పరిష్కారించడానికి సంబంధించిన జ్ఞానాన్ని మెకిన్సీలో సొంతం చేసుకుంది. అయితే ఫ్యాషన్ ఇ–కామర్స్ కంపెనీ ‘మింత్రా’ నుంచి వచ్చిన అవకాశం అనన్య కెరీర్‌ను మార్చి వేసింది. ఇ–కామర్స్ గురించి ఎన్నో సందేహాలు ఉన్న ఆ కాలంలో ‘మింత్రా’ నుంచి వచ్చిన ఆఫర్‌కు వెంటనే ఓకే చెప్పడం కష్టమే. అయినప్పటికీ సందేహాలను పక్కన పెట్టి చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ హోదాలో ‘మింత్రా’లో చేరింది అనన్య. మూడున్నరేళ్లలో ‘మింత్రా’ లాభాలను పెంచింది. ఆ తరువాత గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ‘కేకేఆర్ కేప్స్టోన్’ నుంచి కొత్త కెరీర్ ఆపర్చునిటీ వెదుక్కుంటూ వచ్చింది. ‘కేకేఆర్’లో మాక్స్ హెల్త్‌కేర్, వినీ కాస్మెటిక్స్‌లాంటి కంపెనీలతో కలిసి పనిచేసింది. అనన్య మెటర్నిటీ లీవ్‌లో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ గ్రూప్ ‘బ్రూక్‌ఫీల్డ్’ నుండి పిలుపు వచ్చింది. మామూలుగానైతే మెటర్నిటీ బ్రేక్‌లో ఉన్నప్పుడు సెలవు కాలం పూర్తయ్యేంత వరకు చాలా కంపెనీలు వేచి చూడవు. అయితే బ్రూక్‌ఫీల్డ్ మాత్రం అనన్య ప్రతిభాసామర్థ్యాలపై నమ్మకంతో ఓపిగ్గా వేచి చూసింది. వారి నమ్మకాన్ని అనన్య వమ్ము చేయలేదు. ‘పలు పరిశ్రమలకు సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్‌లలో అనన్యకు అపారమైన అనుభవం ఉంది. స్ట్రాటజీ కన్సల్టెంట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్‌గా ఆమె ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది’ అంటాడు బ్రూక్‌ఫీల్డ్ రియల్ ఎస్టేట్ మేనేజింగ్ పార్టనర్ అంకుర్ గుప్తా. బ్రూక్‌ఫీల్డ్ రియల్ ఎస్టేట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా మరోసారి గెలుపు జెండా ఎగరేసిన అనన్య త్రిపాఠి నుంచి వినిపించే సక్సెస్మంత్రా ‘కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి’. -
ఇళ్ల ధరలకు రెక్కలు.. రెండేళ్లలో ఇంత తేడానా!
భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగం భారీగా వృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో ఇళ్ల ధరలకు రెక్కలొచ్చాయి. 2021 నుంచి 2023 మధ్య ఇళ్ల ధరలు ఏకంగా 20 పెరిగినట్లు హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ క్రెడాయ్ (CREDAI) నివేదిక ద్వారా తెలిసింది. దేశంలో నిర్మాణ వ్యయం పెరగటం మాత్రమే కాకుండా.. ఇళ్ల కొనుగోళ్ళకు కస్టమర్లు కూడా పెద్ద ఎత్తున ఎగబడటమే ధరలు పెరగటానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దేశంలో సుమారు 8 పెద్ద నగరాల్లో ధరలు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక ద్వారా తెలిసింది. ముఖ్యంగా బెంగళూరులో 2021 - 2023 కాలంలో ఇళ్ల ధరలు 31 శాతం పెరిగాయి. వైట్‌ఫీల్డ్, కెఆర్ పురం, సర్జాపూర్ వంటి ఐటీ హబ్‌లకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో డిమాండ్ బలంగా ఉంది, ప్రత్యేకించి లగ్జరీ సెగ్మెంట్లో కొత్త లాంచ్‌లు పెరగటం వల్ల కూడా ధరలు ఆకాశాన్ని తాకాయని తెలుస్తోంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ధరల విషయానికి వస్తే.. 2021 కంటే 2023లో గృహాల ధరలలో 2 శాతం పెరుగుదల ఉందని నివేదికలో స్పష్టమైంది. కరోనా మహమ్మారి తగ్గిన తరువాత ఈ ప్రాంతాల్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఇదీ చదవండి: గోడ కట్టేస్తున్న రోబోట్.. వీడియో వైరల్ హైదరాబాద్‌లో కోటి రూపాయల కంటే ఎక్కువ ధర వద్ద ఉన్న విల్లాలు, రూ. 50 లక్షల లోపు ఉన్న అపార్ట్మెంట్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. కేవలం రెండు సంవత్సరాల్లోనే ధరలు 20 శాతం పెరగటం వల్ల దేశంలోని మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది. -
అదే జరిగితే.. ఇళ్ల కొనుగోలుదారులకు ఊరటే!
స్థిరాస్తి నియంత్రణ అథారిటీ(రెరా) వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని చెల్లించాలా? వద్దా? అనే అంశంపై త్వరలోనే జీఎస్టీ కౌన్సిల్ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై సంబంధం ఉన్న ఓ అధికారి మాట్లాడుతూ..రెరాలకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తాయని, అందువల్ల జీఎస్టీ విధించడం అంటే రాష్ట్ర ప్రభుత్వాలపై పన్ను విధించడమేనని తెలిపారు. ఏప్రిల్-మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విధించడానికి ముందు కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన, రాష్ట్ర మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోనుంది. జీఎస్టీ కౌన్సిల్ చివరి సమావేశం అక్టోబర్ 7, 2023న జరిగింది. ఇక రెరా జీఎస్టీ చెల్లించే విషయంపై అకౌంటింగ్ అండ్ అడ్వైజరీ నెట్ వర్క్ సంస్థ మూర్ సింఘి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్ మోహన్ మాట్లాడుతూ.. జూలై 18, 2022కి ముందు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ నెట్వర్క్ జీఎస్టీకి లోబడి లేవని అన్నారు. ఈ సందర్భంగా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనుమతించబడదు అంటే జీఎస్టీ నుంచి రెరాను మినహాయిస్తే సానుకూల ఫలితాలే ఎక్కువ అని అన్నారు. రెరా జీఎస్టీ చెల్లించే అవసరం లేకపోతే డెవలపర్లు, గృహ కొనుగోలుదారులు ఇద్దరికీ ఖర్చులు తగ్గుతాయి. తత్ఫలితంగా రంగానికి గణనీయంగా లాభదాయకంగా ఉంటుందని అని మోహన్ తెలిపారు. -
రియల్ ఎస్టేట్ కొత్త పుంతలు - వాటివైపే కొనుగోలుదారుల చూపు!
రియల్ ఎస్టేట్ మార్కెట్ రోజు రోజుకి పెరుగుతోంది. ప్లాట్ల్స్ లేదా అపార్ట్మెంట్ కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అయితే గత కొంత కాలంగా పెద్ద ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో భారతదేశంలో ఏడు ప్రధాన నగరాల్లో సగటు అపార్ట్మెంట్ సైజులు గత ఏడాది 11 శాతం పెరిగాయి. పెద్ద ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2022లో 1175 చదరపు అడుగులు ఉన్న అపార్ట్మెంట్ల పరిమాణం 2023 నాటికి 1300 చదరపు అడుగులకు చేరిందని అనరాక్ రీసెర్చ్ ఒక నివేదికలో వెల్లడించింది. 2020, 2021 కంటే కూడా 2023లో ఢిల్లీ NCR, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, హైదరాబాద్, కోల్‌కతా, పూణే, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఫ్లాట్స్ పరిమాణం పెరిగినట్లు తెలిసింది. 👉ఢిల్లీ NCRలో ఫ్లాట్ పరిమాణం అత్యధిక వృద్ధిని సాధించింది. అంటే 2022లో 1375 చదరపు అడుగులు ఉన్న ప్లాట్ 2023 నాటికి 1890 చదరపు అడుగులకు చేరింది. దీన్ని బట్టి చూస్తే ఈ నగరంలో పరిమాణం 37 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. కొనుగోలుదారుల డిమాండ్ విలాసవంతమైన అపార్ట్మెంట్ల వైపు తిరగడం వల్ల డెవలపర్లు పెద్ద అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. 👉హైదరాబాద్‌లో 2022లో 1775 చదరపు అడుగులున్న ప్లాట్ 2023 నాటికి 2300 చదరపు అడుగులకు చేరింది. అంటే హైదరాబాద్‌లో ప్లేట్ సైజు 30 శాతం పెరిగింది. 👉బెంగళూరులో, సగటు ఫ్లాట్ పరిమాణం 2023వ సంవత్సరంలో 26% పెరిగింది. 2022లో 1,175 చదరపు అడుగుల నుంచి 2023లో 1,484 చదరపు అడుగులకు పెరిగింది. 👉పూణేలో సగటు ఫ్లాట్ పరిమాణాలు 2022లో 980 చదరపు అడుగుల నుంచి 2023లో 11% పెరిగి 1,086 చదరపు అడుగులకు చేరుకున్నాయి. 👉చెన్నైలో ప్లాట్ పరిమాణం 2022 కంటే 5 శాతం పెరిగింది. 2022లో 1200 చదరపు అడుగులున్ ఫ్లాట్ సైజు 2023 నాటికి 1260 చదరపు అడుగులకు చేరింది. ఇదీ చదవండి: ముందుగానే హింట్ ఇచ్చిన నిర్మలమ్మ - నాలుగు అంశాలు కీలకం -
హైదరాబాద్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షో.. ప్రారంభం ఎప్పటి నుంచంటే
సాక్షి, హైదరాబాద్: నగరంలో వచ్చే 2–3 ఏళ్లలో 1.30 లక్షల గృహాలు అందుబాటులోకి వస్తాయని కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ప్రతినిధులు తెలిపారు. గచ్చిబౌలి, కొండాపూర్, నల్లగండ్ల, కోకాపేట్, పుప్పాలగూడ, నార్సింగి, తెల్లాపూర్, కొంపల్లి, శామీర్‌పేట్ వంటి ప్రాంతాలలో గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నాయని పేర్కొన్నారు. నగరంలో ఐటీ కేంద్రాలు, ఔట్సోర్సింగ్ సెంటర్లు, ఆర్ అండ్ డీ యూనిట్లు, బహుళ జాతి సంస్థలు ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలను స్థాపించడానికి నగరంలో ఆఫీసు స్పేస్‌కు డిమాండ్ మరింత పెరిగిందని, 2022లో 10 కోట్ల చ.అ. లావాదేవీలను అధిగమించగా.. 2023లో 11.9 కోట్ల చ.అ.లకు దాటిందని వివరించారు. మార్చి 8–10 తేదీలలో మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో జరగనుంది. ఈ సందర్భంగా క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వీ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందిందని, స్థిరాస్తి ధరలు పెరుగుతున్నప్పటికీ నగరం గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తూనే ఉందని తెలిపారు. క్రితం సంవత్సరంతో పోల్చితే 2023లో ప్రాపర్టీ లావాదేవీలలో 25 శాతం వృద్ధి నమోదయిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో నగరంలో వృద్ధి జోరు కొనసాగుతుందని, ఈ ప్రభుత్వం రూ.40 వేల కోట్లకు పైగా తాజా పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించిందని చెప్పారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే క్రమంలో మెట్రో రైలు విస్తరణ, మూసీ కారిడార్ అభివృద్ధి, టౌన్‌షిప్‌ల నిర్మాణం వంటి చోదకశక్తి ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టిందని వివరించారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎన్ జైదీప్ రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 3.5–3.8 కోట్ల చ.అ.లలో హై–క్వాలిటీ బిజినెస్ పార్కులు రానున్నాయని, దీంతో వచ్చే రెండేళ్లలో స్థిరాస్తి రంగంలో గణనీయమైన వృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. నేడే బీఏఐ కన్వెన్షన్ హైటెక్స్‌లో ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ 31వ సదస్సు (ఏఐబిసి)– 2024 మాదా పూర్లోని హైటెక్స్‌లో శనివారం ప్రారంభంకానుంది. మూడు రోజుల ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. గౌరవ అతిధులుగా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారు. నిర్మాణ రంగంలో అధునాతన సాంకేతికత వినియోగం వంటి పలు అంశాలపై చర్చలు, ప్రదర్శనలుంటాయి. బీఏఐ జాతీయ అధ్యక్షులు ఎస్ఎన్ రెడ్డి, మాజీ జాతీయ అధ్యక్షులు బొల్లినేని శీనయ్య, రాష్ట్ర అధ్యక్షులు కె.దేవేందర్ రెడ్డిలు తదితరులు పాల్గొననున్నారు. -
2023లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు ఎలా ఉన్నాయంటే?
న్యూఢిల్లీ: దేశీయంగా రియల్టీ రంగంలో గత క్యాలండర్ ఏడాది(2023) చివరి త్రైమాసికం(క్యూ4)లో సంస్థాగత పెట్టుబడులు 37 శాతం క్షీణించాయి. 82.23 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. రియల్టీ రంగ కన్సల్టెంట్ ‘కొలియర్స్’ నివేదిక ప్రకారం అన్ని రకాల ఆస్తులలోనూ ఇవి కనిష్టంకాగా..అంతక్రితం ఏడాది(2022) ఇదే కాలం(అక్టోబర్–డిసెంబర్)లో 129.94 కోట్ల డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. కార్యాలయ విభాగంలో నిధులు 23 శాతం నీరసించి 13.55 కోట్ల డాలర్లకు చేరగా.. గతేడాది క్యూ4లో 17.55 కోట్ల డాలర్లు లభించాయి. గృహ నిర్మాణ విభాగంలో మరింత అధికంగా 79 శాతం పడిపోయి 8.1 కోట్ల డాలర్లకు సంస్థాగత పెట్టుబడులు పరిమితమయ్యాయి. 2022 క్యూ4లో 37.91 కోట్ల డాలర్లు ప్రవహించడం గమనార్హం! ఆల్టర్నేట్ ఆస్తులు.. ప్రత్యామ్నాయ ఆస్తులు 11 శాతం తగ్గి 41.87 కోట్ల డాలర్లను తాకాయి. అంతక్రితం క్యూ4లో ఇవి 46.79 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ఆల్టర్నేట్ ఆస్తులలో డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, సీనియర్ హౌసింగ్ హాలిడే హోమ్స్, విద్యార్ధుల గృహాలు, స్కూళ్లు తదితరాలున్నాయి. ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్ ఆస్తుల విభాగాలలో పెట్టుబడులు 16 శాతం వెనకడుగుతో 18.71 కోట్ల డాలర్లకు చేరగా.. 2022 క్యూ4లో 22.2 కోట్ల డాలర్ల నిధులను అందుకున్నాయి. మిశ్రమ వినియోగ ప్రాజెక్టులకు ఎలాంటి పెట్టుబడులు లభించకపోగా.. అంతక్రితం ఏడాది అక్టోబర్–డిసెంబర్లో 5.49 కోట్ల డాలర్లు నమోదయ్యాయి. పెట్టుబడుల తీరిలా రియల్టీ రంగ పెట్టుబడులు చేపట్టే సంస్థాగత ఇన్వెస్టర్లలో కుటుంబ కార్యాలయాలు, విదేశీ కార్పొరేట్ గ్రూప్‌లు, విదేశీ బ్యాంకులు, ప్రొప్రయిటరీ బుక్స్, పెన్షన్ ఫండ్స్, ప్రయివేట్ ఈక్విటీ, రియల్టీ ఫండ్ కమ్ డెవలపర్స్, విదేశీ నిధుల ఎన్బీఎఫ్సీలు, సావరిన్ వెల్త్ ఫండ్స్ ఉన్నాయి. మొత్తంగా గతేడాది రియల్టీ రంగంలో సంస్థాగత పెట్టుబడులు 10 శాతం వృద్ధితో 538.40 కోట్ల డాలర్లను తాకాయి. 2022లో ఇవి 487.79 కోట్ల డాలర్లు మాత్రమే. ఆఫీస్ విభాగం 302.25 కోట్ల డాలర్ల పెట్టుబడులు(53 శాతం వాటా)తో అగ్రపథాన నిలిచింది. 2022లో 197.83 కోట్ల డాలర్లు వచ్చాయి. హౌసింగ్ విభాగంలో 20 శాతం అధికంగా 78.89 కోట్ల డాలర్లు లభించగా.. అంతక్రితం 65.56 కోట్ల డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్ ప్రాజెక్టులలో రెట్టింపై 87.76 కోట్లను తాకగా.. 2022లో కేవలం 42.18 కోట్ల డాలర్ల పెట్టుబడులు తరలి వచ్చాయి. ఇక ఆల్టర్నేట్ ఆస్తులలో పెట్టుబడులు 25 శాతం క్షీణించి 64.91 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం 86.67 కోట్ల డాలర్లు అందుకున్నాయి. మిశ్రమ వినియోగ ప్రాజెక్టులకు 91 శాతం తక్కువగా 4.23 కోట్ల డాలర్లు అందగా.. 2022లో 46.37 కోట్ల డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. 2023లో రిటైల్ ఆస్తులకు పెట్టుబడులు లభించకపోగా.. అంతక్రితం ఈ విభాగం 49.18 కోట్ల డాలర్లను ఆకట్టుకుంది. -
భారీగా పెరిగిన అపార్ట్మెంట్ సేల్స్ - హయ్యెస్ట్ ఈ నగరాల్లోనే..
ఈ ఏడాది ఆటోమొబైల్ రంగం మాత్రమే కాకుండా రియర్ ఎస్టేట్ రంగం కూడా బాగా ఊపందుకుంది. 2023వ సంవత్సరంలో అపార్ట్మెంట్లకు గిరాకీ భారీగా పెరిగిందని 'జేఎల్ఎల్ ఇండియా' (JLL India) వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం దేశంలోని ప్రధాన నగరాల్లో అపార్ట్మెంట్లకు డిమాండ్ బాగా పెరిగిందని ఢిల్లీ-NCR, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, పూణేలలో మొత్తం రెండు లక్షల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలు జరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. గతం కంటే ఈ ఏడాది 20 శాతం అమ్మకాలు పెరుగుతాయని, 2023 మొదటి తొమ్మిది నెలల్లో అమ్మకాలు 1,96,227 యూనిట్లు అని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. 2022 ఇదే సమయంలో మొత్తం విక్రయాన్ని 1,61,575 యూనిట్లు మాత్రమే అని కూడా నివేదికలో వెల్లడైంది. వచ్చే ఏడాదికి అపార్ట్మెంట్ అమ్మకాలు 2.9 లక్షల నుంచి 3 లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని జేఎల్ఎల్ ఇండియా భావిస్తోంది. మార్కెట్లో అపార్ట్మెంట్స్ కొనుగోలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో 2024లో కూడా సేల్స్ తారా స్థాయికి చేరనున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: 2023లో బెస్ట్ సీఎన్జీ కార్లు.. ఇవే! అపార్ట్మెంట్స్ ధరలు, హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ కొనుగోలుదారులు మాత్రం వెనుకడుగు వేయడం లేదు. దీంతో దేశంలో హోసింగ్ మార్కెట్ సజావుగా ముందుకు సాగుతుందని జేఎల్ఎల్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ అండ్ రీసెర్చ్ హెడ్ 'సమంతక్ దాస్' తెలిపారు. రానున్న రోజుల్లో ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగం మరింత వేగం పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. -
రిటైల్ మాల్స్ భారీ విస్తరణ.. వేల కోట్ల పెట్టుబడి
ముంబై: రిటైల్ మాల్ ఆపరేటర్లు వచ్చే 3–4 ఏళ్లలో 30–35 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని జోడించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విస్తరణకు ర.20,000 కోట్ల వ్యయం చేయనున్నారని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక వెల్లడింంది. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ అమ్మకాలు బాగా పుంజుకోవడం ఇందుకు కారణమని తెలిపింది. 17 నగరాల్లోని 28 మాల్స్ నుంచి సేకరించిన సవచారం ఆధారంగా ఈ నివేదిక రపుదిద్దుకుంది. లీజుకు ఇవ్వగలిగే 1.8 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇవి విస్తరించాయి. ‘రిటైల్ మాల్ ఆపరేటర్ల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థలంలో మూడింట ఒక వంతు నతనంగా తోడు కానుంది. కొత్తగా తోడయ్యే స్థలంలో ద్వితీయ శ్రేణి నగరాల వాటా 25 శాతం ఉంటుంది. మెట్రోలు, ప్రథమ శ్రేణి నగరాల వెలుపల డిమాండ్‌ను ఇది సూచిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మాల్స్ ఆదాయం మహమ్మారి ముందస్తు కాలంతో పోలిస్తే 125 శాతం ఉండనుంది’ అని నివేదిక వివరించింది. స్థిరంగా క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్.. ‘మాల్స్‌లో పెట్టుబడులకు ఇన్వెస్టర్ల ఆసక్తి ఉంది. కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడులు ఇందుకు నిదర్శనం. ప్రైవేట్ ఈక్విటీ, గ్లోబల్ పెన్షన్ ఫండ్స్, సావరిన్ వెల్త్ ఫండ్స్ నుంచి 15–20 శాతం నిధులు వచ్చే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 60 శాతం వృద్ధిని సాధించిన తరువాత మాల్ యజమానులు 2023–24లో 7–9 శాతం ఆదాయ వృద్ధితో వరుసగా రెండవ సంవత్సరం అధిక పనితీరును కనబరిచే అవకాశం ఉంది. ఈ బలమైన పనితీరు మాల్స్ 95 శాతం ఆరోగ్యకర ఆక్యుపెన్సీని కొనసాగించడంలో సహాయపడింది. కస్టమర్ల రాక విషయంలో మల్టీప్లెక్స్‌లు సాధారణంగా మాల్స్‌కు బలమైన పునాది. మెరుగైన కంటెంట్ లభ్యతతో ఈ విభాగం ఆరోగ్యకర పనితీరును కనబరుస్తోంది’ అని నివేదిక తెలిపింది. సౌకర్యవంత బ్యాలెన్స్ షీట్స్‌తో పాటు గణనీయంగా పెట్టుబడి ప్రణాళికలు ఉన్నప్పటికీ మాల్ యజమానుల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్‌ను స్థిరంగా ఉంచుతున్నట్టు క్రిసిల్ పేర్కొంది. 28 మాల్స్‌కు మొత్తం రూ.8,000 కోట్ల రుణాలు ఉన్నాయి. -
హైదరాబాద్‌లో ఇళ్ల అద్దెలకు రెక్కలు
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇళ్ల అద్దెలు 24 శాతం పెరిగాయి. అంతేకాదు, దేశవ్యాప్తంగా 13 పట్టణాల్లో సగటున 22.4 శాతం మేర అద్దెలు పెరిగినట్టు (క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు) మ్యాజిక్‌బ్రిక్స్ రెంటల్ ఇండెక్స్ ప్రకటించింది. అదే క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఈ పెరుగుదల 4.6 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్) గణాంకాలను మ్యాజిక్‌బ్రిక్స్ విడుదల చేసింది. మ్యాజిక్‌బ్రిక్స్ ప్లాట్‌ఫామ్‌పై 2 కోట్లకు పైగా కస్టమర్ల ప్రాధాన్యతల ఆధారంగా ఈ నివేదికను సంస్థ రూపొందించింది. వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు థానేలో ఇళ్ల ధరలు 57.3 శాతం, గురుగ్రామ్‌లో 41.4 శాతం, గ్రేటర్ నోయిడాలో 28.7 శాతం, నోయిడాలో 25.2 శాతం చొప్పున పెరిగాయి. ఈ పట్టణాల్లో అద్దెల డిమాండ్‌లో యువత (18.34 ఏళ్లు) పాత్ర 67 శాతంగా ఉంది. 41 శాతం మంది కిరాయిదారులు రూ.10,000–30,000 మధ్య అద్దెల ఇళ్లకు మొగ్గు చూపిస్తున్నారు. అద్దె ఇళ్లల్లో 52.7 శాతం సెమీ ఫర్నిష్డ్ ఇళ్లకే డిమాండ్ ఉంటోంది. కానీ, వీటి సరఫరా 48.7 శాతంగా ఉంది. ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న పట్టణీకరణ, తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిన పరిస్థితులు అద్దెలు పెరగడానికి కారణాలుగా మ్యాజిక్‌బ్రిక్స్ సీఈవో సుధీర్‌పాయ్ పేర్కొన్నారు. ఒకవైపు అద్దె ఇళ్లకు అధిక డిమాండ్, మరోవైపు సరఫరా తగినంత లేకపోవడం ధరలను పెంచుతున్నట్టు చెప్పారు. -
గచ్చిబౌలి... మూడేళ్లలో 33 శాతం పైకి!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇళ్ల ధరల పెరుగుదలలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతం ముందుంది. ఇక్కడ గడిచిన మూడేళ్లలో ఇళ్ల ధరలు 33 శాతం పెరిగాయి. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లోనూ ఇళ్ల ధరలు ఇదే కాలంలో 13–33 శాతం మధ్య పెరగడం గమనార్హం. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. గచ్చిబౌలిలో 2023 అక్టోబర్ నాటికి ఇళ్ల ధర చదరపు అడుగుకు (సగటున) రూ.6,355కు చేరింది. 2020 అక్టోబర్ నాటికి ఇక్కడ చదరపు అడుగు ధర రూ.4,790గా ఉండేది. ఇక కొండాపూర్లోనూ చదరపు అడుగుకు ధర 31 శాతం పెరిగి, రూ.4,650 నుంచి రూ.6,090కు చేరింది. సౌకర్యవంతమైన, విశాలమైన ఇళ్లను ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, పుణె, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ మార్కెట్ వివరాలు ఈ నివేదికలో ఉన్నాయి. 🏘️బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఇళ్ల ధరలు 29 శాతం వృద్ధితో చదరపు అడుగుకు రూ.6,325కు చేరాయి. 🏘️ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల ధరలు సగటున చదరపు అడుగుకు 13–27 శాతం మధ్య గత మూడేళ్లలో పెరిగాయి. 🏘️ఢిల్లీ ఎన్సీఆర్లో గ్రేటర్ నోయిడా వెస్ట్‌లో మాత్రం 27 శాతం ధరలు ఎగిశాయి. ఎంఎంఆర్‌లో లోయర్ పరేల్‌లో 21 శాతం మేర పెరిగాయి. 🏘️బెంగళూరులోని తానిసంద్ర మెయిన్రోడ్లో 27 శాతం, సార్జాపూర్ రోడ్లో 26 శాతం చొప్పున ధరలకు రెక్కలొచ్చాయి. 🏘️పుణెలో ఐటీ కంపెనీలకు కేంద్రాలైన వాఘోలిలో 25 శాతం, హింజేవాడిలో 22 శాత, వాకాడ్‌లో 19 శాతం చొప్పున ధరలు పెరిగాయి. 🏘️ముంబైలోని లోయర్ పరేల్, అంధేరి, వర్లి టాప్–3 మైక్రో మార్కెట్లుగా ఉన్నాయి. ఇక్కడ ధరలు 21 శాతం, 19 శాతం, 13 శాతం చొప్పున అధికమయ్యాయి. బలమైన డిమాండ్.. ‘‘బలమైన డిమాండ్‌కు తోడు, నిర్మాణంలో వినియోగించే మెటీరియల్స్ ధరలు ఎగియడం వల్ల దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో సూక్ష్మ మార్కెట్లలో ఇళ్ల ధరలు పెరిగాయి’’అని అనరాక్ రీసెర్చ్ హెడ్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. ముడి సరుకుల ధలు, నిర్మాణ వ్యయాలు పెరగడం, భూముల ధరలు పెరుగుదల, డిమాండ్ అధికం కావడం వంటివి ఇళ్ల ధరల వృద్ధికి దారితీసినట్టు సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) సహ వ్యవస్థాపకుడు, ఎండీ రవి అగర్వాల్ పేర్కొన్నారు. -
భారత్‌కు క్యూ కడుతున్న సంస్థలు.. గ్లోబుల్ కేపబులిటి సెంటర్ల జోరు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కార్యకలాపాల సామర్థ్య కేంద్రాలు (జీసీసీలు) భారత్‌లో 2025 నాటికి 1,900కు చేరుకుంటాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏషియా తెలిపింది. మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో (కార్యాలయ స్థలం) వీటి వాటా 35–40 శాతానికి చేరుకుంటుందని పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో 1,580 జీసీసీలు ఉన్నట్టు తెలిపింది. బహుళజాతి సంస్థల కార్యకలాపాలకు వేదికగా ఉండే వాటిని జీసీసీలుగా చెబుతారు. భారత్ ఆకర్షణీయం భారత్ కాకుండా బ్రెజిల్, చైనా, చిలే, చెక్ రిపబ్లిక్, హంగరీ, ఫిలిప్పీన్స్, పోలాండ్ సైతం జీసీసీ కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. అయితే, లీజు వ్యయాల పరంగా, నైపుణ్య మానవ వనరుల పరంగా భారత్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటూ, జీసీసీలకు ప్రాధాన్య కేంద్రంగా ఉన్నట్టు వివరించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో భారత్‌లో జీసీసీల విస్తరణ దూకుడుగా ఉందని, ఆరు పట్టణాల్లో మొత్తం ఆఫీస్ లీజులో వీటి వాటా 38 శాతానికి చేరుకుందని తెలిపింది. ప్రస్తుత ఏడాది మొదటి ఆరు నెలల్లో జీసీసీల ఆఫీసు లీజు పరిమాణం 9.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నట్టు వెల్లడించింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ జీసీసీ ఆఫీస్ లీజులో 77 శాతం వాటాను (జనవరి–జూన్ మధ్య) ఆక్రమిస్తున్నట్టు పేర్కొంది. ‘‘జీసీసీలకు భారత్ అత్యంత ప్రాధాన్య కేంద్రంగా మారింది. నైపుణ్య మానవ వనరులు, తక్కువ వ్యయాలు, వ్యాపార అనుకూల వాతావరణం, ప్రభుత్వ మద్దతుకు జీసీసీల వృద్ధి సాక్షీభూతంగా నిలుస్తుంది’’అని సీబీఆర్ఈ భారత్, ఆగ్నేయాసియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మేగజిన్ పేర్కొన్నారు. ద్వితీయ శ్రేణీ పట్టణాల్లోనూ.. చిన్న, మధ్య స్థాయి బహుళజాతి సంస్థలు సైతం క్రమంగా భారత్‌లోకి అడుగుపెడుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. కంపెనీలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ జీసీసీల ఏర్పాటు ద్వారా విస్తరణకు ఆసక్తి చూపిస్తున్నట్టు పేర్కొంది. -
పెట్టుబడుల వరద.. ‘సీనియర్ సిటిజన్’ ఇళ్లకు గిరాకీ
వృద్ధుల నివాస విభాగంలో పెట్టుబడులకు భారీ అవకాశాలున్నట్టు జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. వృద్ధ జనాభా దేశ జనాభాలో 2050 నాటికి 20 శాతానికి చేరుకుటుందన్న అంచనాలను ప్రస్తావించింది. ప్రస్తుతం భారత్‌లో వృద్ధుల జనాభా (60 ఏళ్లుపైన ఉన్నవారు) 10 కోట్లుగా ఉందని, వీరికి సంబంధించి నివాస విభాగంలో ప్రాజెక్టుల అభివృద్ధి, పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని వెల్లడించింది. చిన్న కుటుంబాలు పెరుగుతుండడం, ఉద్యోగాల కోసం పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్సాల్సి వస్తుండడం.. పెద్దలకు ప్రత్యేక నివాసాల అవసరాన్ని పెంచుతున్నట్టు పేర్కొంది. 2050 నాటికి పెద్దలపై ఆధారపడిన పిల్లల సంఖ్యకు సమాంతరంగా, పిల్లలపై ఆధారపడే తల్లిదండ్రులూ ఉంటారని చెప్పింది. పెరిగే వృద్ధ జనాభాకు ప్రత్యేకమైన సంరక్షణ అవసరమవుతుందని వివరించింది. సాధారణ నివాసాలతో పోలిస్తే వృద్ధులకు సంబంధించి ఇళ్ల ధరలు 10–15 శాతం మేర భారత్‌లో అధికంగా ఉన్నట్టు పేర్కొంది. -
పండగ సమయంలో ఆస్తి అమ్మేసిన స్టార్ హీరో.. ధర ఎన్ని కోట్లంటే?
ప్రముఖ బాలీవుడ్ నటుడు 'రణవీర్ సింగ్' (Ranveer Singh) ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఉన్న తన రెండు ఫ్లాట్లను విక్రయించాడు. ఈ ఫ్లాట్లను ఎప్పుడు కొనుగోలు చేసాడు? ఇప్పుడు ఇంతకు విక్రయించాడు? అనే మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. రణవీర్ సింగ్ 2014 డిసెంబర్లో ముంబైలోని ఒబెరాయ్ మాల్‌కు సమీపంలో రెండు ఫ్లాట్లను కొనుగోలు చేశాడు. ఒక్కొక్క ఫ్లాట్ కోసం సింగ్ రూ.4.64 కోట్లు, స్టాంప్ డ్యూటీల కోసం రూ.91.50 లక్షలు చెల్లించినట్లు ఆన్లైన్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ IndexTap.com ప్రకారం తెలిసింది. రణవీర్ సింగ్ కొనుగోలు చేసిన ఈ ఫ్లాట్స్ విస్తీర్ణం 1,324 చదరపు అడుగులు. ప్రతి ఫ్లాట్‌లోనూ ఆరు పార్కింగ్ స్థలాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ ఫ్లాట్లను రూ. 15.25 కోట్లకు అదే గృహ సముదాయానికి చెందిన వ్యక్తి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: భారత్ నిర్ణయంతో చైనాకు రూ.50000 కోట్లు నష్టం - ఎలా అంటే? గోరేగావ్ అపార్ట్‌మెంట్‌తో పాటు, రణవీర్ సింగ్‌కి ఇతర హోల్డింగ్‌లు కూడా ఉన్నాయి. 2022 ఈయన బాంద్రా వెస్ట్‌లో 119 కోట్ల రూపాయలకు క్వాడ్రప్లెక్స్ ఫ్లాట్‌ను కొనుగోలు చేసాడు. దీనికి స్టాంప్ డ్యూటీ రూ.7.13 కోట్లు. ఇది మొత్తం 11,266 చదరపు అడుగులు విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో టెర్రేస్ ప్రాంతం మాత్రమే 1,300 చదరపు అడుగులు. ఇందులో మొత్తం 19 కార్ పార్కింగ్ స్థలాలతో ఉన్నాయి. -
దేశంలోని ఈ నగరాల్లో చుక్కలు చూపిస్తున్న అద్దె ఇళ్లు.. మరి హైదరాబాద్‌లో
దేశంలో అద్దె ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో నెల సంపాదనలో సగం అద్దింటికే చెల్లించాల్సి వస్తుందని చిరుద్యోగులు వాపోతున్నారు. పైగా పెరిగిపోతున్న అద్దె ఇళ్ల ధరలు సంపాదనలో కొంత మొత్తాన్ని దాచి పెట్టుకోవాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. తాజాగా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీ అనరాక్ ఓ నివేదికను విడుదల చేసింది. అందులో దేశంలోని ప్రముఖ మెట్రో నగరాలైన బెంగళూరు,హైదరాబాద్, పూణేతో పాటు మిగిలిన ప్రాంతాల్లో ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో అద్దె ఇళ్ల ధరలు పెరిగినట్లు తెలిపింది. 🏘️వెయ్యి చదరపు అడుగులో డబుల్ బెడ్రూం ఇల్లు సగటున నెలవారీ అద్దె గత ఏడాది రూ.24,600 ఉండగా.. ఇప్పుడు అదే రెంట్ 2023 సెప్టెంబర్ నెల ముగిసే సమయానికి రూ28,500కి చేరింది. 🏘️ముఖ్యంగా బెంగళూరులోని ప్రముఖ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ రెంట్లు దాదాపూ 30 శాతం పెరగ్గా.. వైట్ ఫీల్డ్ ఏరియాలో 31శాతం పెరిగాయి. ఆ తర్వాతి స్థానంలో సర్జాపూర్ రోడ్డు ప్రాంతంలోని అద్దె ఇళ్ల ధరలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు అనరాక్ తన నివేదికలో వెల్లడించింది. 🏘️సర్జాపూర్ రోడ్లో నెలవారీ సగటు అద్దె ఇల్లు ధర 2022 ఏడాది ముగిసే సమయానికి రూ.24,000 ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ నెల ముగిసే సమయానికి అదే రెంట్ ధర రూ.30,500కి చేరింది. 🏘️ఇక 9 నెలల కాలంలో హైదరాబాద్‌లో రెంట్ ధరలు 24 శాతం పెరగ్గా.. పూణేలో 17 శాతం పెరిగాయి. హైదరాబాద్ గచ్చీబౌలి ప్రాంతంలో అద్దె ఇల్లు ధరలు 2022 ముగిసే సమయానికి రూ.23,400 ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ నెల ముగిసే సమయానికి రూ.29,000కి చేరింది. 🏘️ అదే పూణేలో 2022 ముగిసే సమయానికి రూ.21,000 ఉన్న అద్దె ఇల్లు ధర ఈ ఏడాది సెప్టెంబర్ నెల ముగిసే సమయానికి రూ.24,500కి చేరింది. 🏘️బళ్లారిలో 2బీహెచ్‌కే అద్దె రూ.24,600 నుంచి రూ.28,500కు పెరిగింది. 🏘️వైట్ ఫీల్డ్ ప్రాంతంలో వెయ్యి చదరపు చదరపు అడుగుల్లో ఉన్న 2 బీహెచ్‌కే ఇంటి సగటు నెలవారీ అద్దె 2022 ఏడాది చివరి నాటికి రూ.24,600 ఉండగా 2023, సెప్టెంబర్ నెల ముగిసే సయానికి రూ.28,500కి పెరిగింది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతాలో అద్దె ఇల్లు ధర 9 శాతంనుంచి 14 శాతానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ‘ప్రస్తుత త్రైమాసికంలో చాలా నగరాల్లో అద్దె ఇంటి ధరలు స్థిరంగా ఉండొచ్చు. ఎందుకంటే? అద్దె సాధారణంగా సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తక్కువగా ఉంటాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో నియామకాలు పెరిగిన నేపథ్యంలో భారతీయులు మెరుగైన ఉద్యోగావకాశాల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుంటారు. కాబట్టే జనవరి-మార్చి కాలంలో అద్దెలు మళ్లీ పెరుగుతాయి' అని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పురి అన్నారు. -
మాల్స్ అదుర్స్.. పుంజుకుంటున్న రిటైల్ రంగం
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రభావం రిటైల్ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీంతో షాపింగ్ మాల్స్ విలవిల్లాడిపోయాయి. ఆన్లైన్ కొనుగోళ్ల వృద్ధి చూశాక ఇక ఆఫ్లైన్లోని రిటైల్ రంగం కోలుకోవడం కష్టమేమో అనిపించింది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కరోనా ప్రభావం నుంచి షాపింగ్ మాల్స్ శరవేగంగా కోలుకున్నాయి. మాల్స్‌లోని రిటైల్ దుకాణాలలో కొనుగోలుదారుల సందడి, మల్టీప్లెక్స్‌లలో వీక్షకుల తాకిడి పెరగడంతో మాల్స్ నిర్వాహకులలో కొత్త ఉత్సాహం నెలకొంది. మరోవైపు దేశవ్యాప్తంగా కొత్త షాపింగ్ మాల్స్ వస్తున్నాయి. ►షాపింగ్ మాల్స్, హైస్ట్రీట్లలో వాణిజ్య కార్యకలాపాలు పెరిగాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో హైదరాబాద్‌లో రిటైల్ లీజులు 137 శాతం పెరిగాయని సీబీఆర్ఈ నివేదిక వెల్లడించింది. అయితే రిటైల్ మార్కెట్ పరిమాణం ఇంకా పెరగాల్సి ఉందని, ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ రిటైల్ రంగం చాలా వెనకబడి ఉంది. ►ఫ్యాషన్, హోమ్‌వేర్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ వంటి రిటైలర్ల డిమాండ్‌ను బట్టి షాపింగ్ మాల్స్‌లో లీజు లావాదేవీలు జరుగుతుంటాయి. ఈ ఏడాది ముగింపు నాటికి దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో రిౖ టెల్ లీజులు 17–28 శాతం మేర పెరిగి 55–60 లక్షల చ.అ.లకు చేరుతుందని అంచనా వేసింది. 20 19లో అత్యధికంగా 68 లక్షల చ.అ. లీజు లావాదేవీ లు జరిగాయి. 2021లో 39 లక్షలు, 2022లో 47 లక్షల చ.అ. రిటైల్ లీజు కార్యకలాపాలు పూర్తయ్యాయి. ►హైదరాబాద్‌లో పలు ప్రాంతాలలో షాపింగ్ మాల్స్ నిర్మాణం తుదిదశలో ఉన్నాయి. డిమాండ్ ఉన్న ప్రాంతాలలో నిర్మాణం పూర్తికాకముందే లీజులు జరుగుతున్నాయి. గత ఏడాది డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటంతో పూర్తయ్యే దశకు చేరినా లీజు లావాదేవీలు ఆశించిన స్థాయిలో జరగలేదు. అయితే ఈ ఏడాది కొంత సానుకూల వాతావరణం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు నగరంలో 2.5 లక్షల చ.అ. రిటైల్ స్థల లీజు లావాదేవీలు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో కేవలం లక్ష చ.అ. స్థలం మాత్రమే లీజుకు పోయింది. రిటైల్ లీజులలో స్టోర్ల వాటా 33 శాతం ఉండగా.. ఫ్యాషన్, అపరెల్స్ షో రూమ్‌ల వాటా 30 శాతం, ఫుడ్ కోర్టుల వాటా 11 శాతంగా ఉంది. -
దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ ఎందుకు పెరుగుతోంది? కారణం ఇదేనా!
ప్రపంచంలోని చాలా దేశాలు అభివృద్ధి దిశలో అడుగులు వేస్తున్నాయి, ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ రంగంలో మరింత డెవలప్ అయిపోతోంది. నేడు చిన్న చిన్న నగరాల్లో కూడా భూములు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఇతరదేశాలతో పోలిస్తే అరబ్ దేశాల్లో ఇది ఒకింత ఎక్కువగా ఉంది. దీనికి కారణమేంటి? కొనుగోలుదారులు ఎందుకు అక్కడే ఆసక్తి చూపుతున్నారనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం. దుబాయ్ అనేది అత్యంత ఖరీదైన దేశాల్లో ఒకటి. కావున ఇక్కడ రియల్ ఎస్టేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువమంది ఇక్కడ స్థలాలు కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం.. ఈ దేశం ప్రముఖ దేశాలకు నడుమ ఉంది. కావున ఎక్కడికి ప్రయాణించాలన్న కావలసిన సదుపాయాలు ఎక్కువగా ఉండటమే. ఒకప్పటి పాలన మాదిరిగా కాకుండా దుబాయ్‌లో స్వతంత్య్రత బాగా పెరిగింది. దీనితో పాటు భద్రతలు కూడా పెరిగాయి. ఇవన్నీ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. దుబాయ్‌లో లగ్జరీ లైఫ్ అనుభవించడానికి చాలామంది బారులు తీరుతున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతోంది. 2021లో దుబాయ్ రియల్ ఎస్టేట్‌లో ఇండియన్స్ సుమారు 900 కోట్ల దిర్హామ్‌లు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఈ మొక్కలతో కోట్లు సంపాదించవచ్చు! అయితే ఈ రూల్స్ పాటించాల్సిందే.. బుర్జ్ ఖలీఫాతోపాటు ఆకాశాన్నంటే రీతిలో ఇండ్లు, షాపింగ్ మాల్స్ వంటివి దుబాయ్‌ని టూరిస్ట్ హబ్‌గా నిలపడంతో సహాయపడుతున్న గణాంకాలు చెబుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సెంటర్ ఆధ్వర్యంలో ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్ అందుబాటులోకి రావడం వల్ల పారిశ్రామిక వేత్తల చూపు ఇటువైపు తిరిగింది. రానున్న రోజుల్లో దుబాయ్ రియల్ ఎస్టేట్ మరింత పెరుగుతుంది అంటే ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. -
ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్న నగరాలేంటో తెలుసా?
పెరిగిన వడ్డీ రేట్ల ప్రభావం గృహ రుణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. అత్యధిక వడ్డీ రేట్ల కారణంగా వినియోగదారుల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతున్నట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా ఓ నివేదికను విడుదల చేసింది. అయినప్పటికీ దేశంలోని 8 ప్రధాన నగరాల్లో అహ్మదాబాద్‌లో ఇళ్లను కొనుగోలు చేసే సామర్థ్యం ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేసింది. అహ్మదాబాద్ తర్వాతి స్థానాల్లో పూణే, కోల్‌కతాలు ఉన్నాయి. ఇంటి ధరను, ఏడాదికి ఓ కుటుంబ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. వారి ఆదాయంతో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఎక్కడ ఇళ్లను కొనుగోలు చేసే సామర్ధ్యం ఎక్కువగా ఉంటుందో వివరిస్తుంది. వాటిలో 23 శాతం నిష్పత్తితో పుణె, కోల్‌కతా 26 శాతం చొప్పున ఉన్నాయని నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఈ సందర్భంగా ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్న 8 నగరాల జాబితాను విడుదల చేసింది. వాటిల్లో ముంబై, ఢిల్లీ - ఎన్సీఆర్, బెంగళూరు,చెన్నై, కోల్‌కతా, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్‌లు మోస్ట్ అఫార్డబుల్ ఇండెక్స్ జాబితాలో స్థానాన్ని దక్కించుకున్నాయి. నైట్ ఫ్రాంక్ అఫర్డబిలిటీ ఇండెక్స్ ప్రకారం.. ఒక నగరంలో ఇల్లు కొనుగోలు స్థాయి 40 శాతం అంటే, ఆ నగరంలోని కుటుంబాలు ఆ యూనిట్ కోసం హౌసింగ్ లోన్ ఈఎంఐకి చెల్లించేందుకు వారి ఆదాయంలో 40 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుందని సూచిస్తుంది. 50 శాతం కంటే ఎక్కువ ఈఎంఐ ఆదాయ నిష్పత్తి భరించలేనిదిగా పరిగణిస్తుంది. -
బంపరాఫర్ : డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుగోలుపై 10 లక్షల డిస్కౌంట్!
స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే, ఇతర పండగల సీజన్లో ఆయా ఈ - కామర్స్ కంపెనీలు, స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కొనుగోలు దారుల్ని ఆకట్టుకునేందుకు భారీ ఎత్తున డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. అందుకు అనుగుణంగా వినియోగదారులు తక్కువ ధరకే తమకు కావాల్సిన వస్తువులు సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. వ్యాపారం కూడా భారీ ఎత్తున జరుగుతుంది. ఇప్పుడీ ఈ డిస్కౌంట్ ఫార్మలానే రియల్ ఎస్టేట్ కంపెనీలు అప్లయ్ చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలు రియాలిటీ సంస్థలు కొనుగోలు దారులకు తక్కువ ధరలకే వారు కోరుకున్న ప్లాట్లు, విల్లాలు, వన్ బీహెచ్‌కే, టూబీహెచ్‌కే ఇళ్లను అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ( ఫైల్ ఫోటో ) 👉 ముంబైకి చెందిన డెవలపర్లు ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 31వరకు అపార్ట్మెంట్లను బుక్ చేసుకునే గృహ కొనుగోలుదారులకు జీరో స్టాంప్ డ్యూటీ, ఫ్లెక్సీ పేమెంట్ ప్లాన్ (బై నవ్ పే లేటర్) 12 నెలల ఈఎంఐ మినహాయింపును అందిస్తున్నారు. జీఎస్టీని సైతం రద్దు చేస్తున్నారు. 👉 జేపీ ఇన్ఫ్రా జీరో స్టాంప్ డ్యూటీ, ఫ్లెక్సీ-పేమెంట్ ప్లాన్, 12 నెలల ఈఎంఐ మినహాయింపును అందిస్తుంది. ఆఫర్లో భాగంగా స్టాంప్ డ్యూటీ, జీఎస్టీని మినహాయించింది. 👉 త్రిధాతు రియాల్టీ అనే సంస్థ 2 బీహెచ్‌కే యూనిట్‌పై రూ. 10 లక్షలు, 3 బీహెచ్‌కే పై 20 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ( ఫైల్ ఫోటో ) 👉ఢిల్లీ-ఎన్సీఆర్లో భూటానీ ఇన్ఫ్రా సొంతింటి కలల్ని నిజం చేసుకునేందుకు వీలుగా ఓ స్కీమ్‌ను ప్రవేశ పెట్టింది. పథకంలో కస్టమర్లు కోరుకున్న ధరకే ప్రాపర్టీని అందిస్తున్నట్లు తెలిపింది. ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 15 వరకు కొనసాగే ఈ స్కీమ్‌లో రూ.1 కోటి అంతకంటే ఎక్కువ విలువైన 77 యూనిట్ల కేటాయింపును లక్కీ డ్రా ఆధారంగా నిర్ణయిస్తారు. 👉 పథకం కింద, కొనుగోలుదారులు భూటానీ ఇన్ఫ్రా ప్రాపర్టీని ఎంచుకుంటే ఎంత ధరకి ఆ స్థిరాస్థి కావాలనుకుంటున్నారో అంతకే కోట్ చేయొచ్చు. ఉదాహరణకు, ఒక యూనిట్ ధర రూ. 2 కోట్లు అయితే కొనుగోలుదారులు తమ బడ్జెట్ ప్రకారం రూ.1.75 కోట్లు లేదా రూ.1.5 కోట్ల ధరను కోట్ చేయవచ్చు. ఈ సందర్భంగా..లక్కీ డ్రా ద్వారా విజేతను నిర్ణయిస్తామని భూటానీ ఇన్ఫ్రా సీఈఓ ఆశిష్ భుటానీ తెలిపారు. ( ఫైల్ ఫోటో ) 👉 గౌర్స్ గ్రూప్ గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని గౌర్ వరల్డ్ స్మార్ట్‌స్ట్రీట్ ప్రాజెక్ట్ కమర్షియల్ కాంప్లెక్స్‌లో ప్రతి బుకింగ్‌పై కారును ఉచితంగా అందిస్తోంది. ఈ పథకం ఆగస్ట్ 12 నుంచి ఆగస్ట్ 13 రెండు రోజులు అందుబాటులో ఉంది. అంతేకాదు మూడు సంవత్సరాల పాటు షాపుల నిర్వహణ అంతా ఉచితం 👉 ఘజియాబాద్‌లోని గౌర్ ఏరోసిటీ మాల్లోని షాపుల కోసం కంపెనీ ప్రతి బుకింగ్‌పై ఐఫోన్‌ను అందిస్తోంది. 👉 బెంగళూరులో ప్రావిడెంట్ హౌసింగ్ సంస్థ ప్రస్తుతం ఫ్రీడమ్ ఆన్లైన్ హోమ్ ఫెస్ట్ 4.0ని నిర్వహిస్తోంది, ఇందులో కొనుగోలుదారులు ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా హౌసింగ్ యూనిట్‌ను బుక్ చేసుకోవచ్చు. గరిష్ట ధర రూ. 12 లక్షలుగా నిర్ణయించింది. ఇలా డిస్కౌంట్ ధరలకే వారికి నచ్చిన ప్లాట్లను అందిస్తూ సేల్స్‌ను పెంచే ప్రయత్నం చేస్తున్నాయి ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలు. చదవండి👉 6 నెలల్లో ఏకంగా రూ.15 వేలు పెరిగిన ఇంటి అద్దె! -
అదే జరిగితే 70 వేల ఉద్యోగాలు పోతాయ్.. ఎక్కడో తెలుసా?
Country Garden: కరోనా మహమ్మారి ప్రపంచ పరిస్థితులనే తలకిందులు చేసింది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించేశాయి. ఇప్పటికి కూడా ఆ ప్రభావం ఏదో ఒక మూల కనిపిస్తూనే ఉంది. చైనాలో ఒక దిగ్గజ రియల్ ఎస్టేట్ కంపెనీ గతంలో దాదాపు రూ. 6 లక్షల కోట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే.. కాగా ఇదే బాటలో మరో కంపెనీ కూడా కొనసాగుతున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ప్రాపర్టీ డెవలపర్ 'కంట్రీ గార్డెన్' నష్టాల్లో కూరుకుపోయినట్లు, మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికి సుమారు 7.6 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 57వేల కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కంపెనీ షేర్లు కూడా చాలా వరకు కుప్పకూలాయి. ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగినిపై నిఘా - పర్ఫామెన్స్ చూసి ఖంగుతిన్న కంపెనీ! గత సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ 265 మిలియన్ డాలర్ల లాభంతో ఉండేది, ఆ తరువాత క్రమంగా నష్టాల్లోనే ముందుకు సాగింది. మొత్తం మీద అటు లాభాలు.. ఇటు కంపెనీ షేర్లు పతనమవుతున్నాయి. దీంతో కంట్రీ గార్డెన్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! ప్రపంచమే సలాం కొట్టేలా.. కంట్రీ గార్డెన్ కంపెనీ దాదాపు మూడువేల హోసింగ్ ప్రాజెక్టులను చేపడుతున్నట్లు, ఇందులో సుమారు 70 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. కంపెనీ ఇదే తీరుగా నష్టాల్లోనే పయనిస్తే వీరందరి భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. -
Rs 100 Crore Per Acre In Kokapet: కోకాపేటలో ఎకరం 100 కోట్లు.. ఏముందక్కడ? ఎందుకంత స్పెషల్? (ఫోటోలు)
-
రూ.1 కోటికి మించి ధర ఉన్న ఫ్లాట్లకు భలే గిరాకీ..ఎక్కడంటే
న్యూఢిల్లీ: ఖరీదైన అపార్ట్మెంట్ల అమ్మకాలు దేశంలోని ఏడు ప్రధాన పట్టణాల్లో జోరుగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో రూ.కోటికి పైన విలువ చేసే ఫ్లాట్ అమ్మకాలు 50,132 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది తొలి ఆరు నెలల కాలంలో అమ్మకాలు 33,477 యూనిట్లతో పోలిస్తే 50 శాతం పెరిగినట్లు పీటీఐ నివేదించింది. అంతేకాదు 15 ఏళ్లలో తొలిసారి విలాసవంత ప్రాపర్టీలకు మంచి డిమాండ్ కనిపిస్తున్నట్టు జెల్ఎల్ ఇండియా ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. విల్లా, ప్లాట్ల అమ్మకాలను ఇందులో జేఎల్ఎల్ ఇండియా కలపలేదు. కేవలం అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల అమ్మకాలనే పరిగణనలోకి తీసుకుంది. ►ఏడు పట్టణాల్లో మొత్తం మీద అన్ని రకాల ఫ్లాట్ల అమ్మకాలు 2023 జనవరి–జూన్ కాలంలో 21 శాతం పెరిగి 1,26,500 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,04,926 యూనిట్లుగా ఉన్నాయి. జనవరి - జూన్ అమ్మకాలు 15 ఏళ్లలో అత్యధికంగా ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో జరిగినట్లు స్పష్టం చేసింది. ►రూ.50 లక్షల ధరలోపు ఉన్న ఫ్లాట్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చినప్పుడు, 2 శాతం క్షీణించి 24,482 యూనిట్లుగా ఉన్నాయి. మొత్తం అమ్మకాల్లో అఫర్డబుల్ విభాగం (అందుబాటు ధరల) ఫ్లాట్ల వాటా 24 శాతం నుంచి 17 శాతానికి పరిమితమైంది. ►రూ.50–75 లక్షల విభాగంలో అమ్మకాలు 4 శాతం పెరిగి 30,125 యూనిట్లుగా ఉన్నాయి. మిడ్ సెగ్మెంట్ అమ్మకాల వాటా మొత్తం అమ్మకాల్లో 28 శాతం నుంచి 24 శాతానికి తగ్గింది. ►రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు విలువ కలిగిన ఫ్లాట్ల అమ్మకాలు 25 శాతం వృద్ధితో 21,848 యూనిట్లకు చేరాయి. ఈ విభాగం వాటా 17 శాతంగా ఉంది. ►రూ.1–1.5 కోట్ల ధరల విభాగంలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 67 శాతం పెరిగి 24,121 యూనిట్లుగా ఉన్నాయి. ►ఇక రూ.1.5 పైన ధర కలిగిన ఫ్లాట్లు 26,011 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 18,993 యూనిట్లతో పోలిస్తే 21 శాతం పెరిగాయి. ద్వితీయ భాగంలోనూ బలమైన అమ్మకాలు ప్రస్తుత ఏడాది ద్వితీయ ఆరు నెలల కాలంలో పండుగలు ఉండడంతో బలమైన అమ్మకాలు నమోదు అవుతాయని భావిస్తున్నట్టు జేఎల్ఎల్ ఇండియా ఎండీ శివకృష్ణన్ తెలిపారు. ‘‘ప్రభుత్వం వైపు నుంచి బలమైన ప్రోత్సాహం, వడ్డీ రేట్లను గత రెండు సమీక్షల నుంచి ఆర్బీఐ యథాతథంగా కొనసాగించడం, ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగిరావడం ఇళ్ల మార్కెట్ పుంజుకునేందుకు మద్దతుగా నిలిచాయి. మధ్య కాలానికి ఇళ్లకు డిమాండ్ వృద్ధి బాటలోనే ఉంటుంది’’అని శివకృష్ణన్ తెలిపారు. చదవండి👉 అతి తక్కువ ధరకే ప్రభుత్వ డబుల్ బెడ్రూం ఫ్లాట్లు -
రియల్ ఎస్టేట్ జోరు..6 నెలల్లో రూ. 24,110 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీ రియల్టీ రంగంలో సంస్థాగత పెట్టుబడులు గత ఆరు నెలల్లో స్వల్పంగా పుంజుకున్నాయి. జనవరి–జూన్ మధ్య కాలంలో దాదాపు 2.94 బిలియన్ డాలర్ల(రూ. 24,110 కోట్లు)కు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ దేశీ రియల్టీపై విశ్వాసం కొనసాగడం ఇందుకు దోహదపడింది. ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదిక ప్రకారం గతేడాది(2022) తొలి ఆరు నెలల్లో సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 2.88 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించాయి. అంతర్జాతీయంగా ఆర్థికాభివృద్ధితోపాటు, రాజకీయ, భౌగోళిక అనిశ్చితుల నేపథ్యంలోనూ దేశీ రియల్టీలోకి పెట్టుబడులు బలపడినట్లు నివేదిక పేర్కొంది. వెరసి పెరుగుతున్న పెట్టుబడులు వృద్ధి అవకాశాలను ప్రతిబింబిస్తున్నట్లు తెలియజేసింది. ప్రపంచ మార్కెట్లలో ఇండియా ఆశావహంగా కనిపిస్తున్నట్లు పేర్కొంది. 22 లావాదేవీలు ఈ క్యాలండర్ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో ప్రాపర్టీ రంగంలోకి 22 లావాదేవీల ద్వారా దాదాపు 2.94 కోట్ల డాలర్లు ప్రవహించినట్లు జేఎల్ఎల్ నివేదిక వెల్లడించింది. ఈ బాటలో ఏడాది చివరి(డిసెంబర్)కల్లా దేశీ రియల్టీలోకి 5 బిలియన్ డాలర్ల సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు లభించనున్నట్లు అంచనా వేసింది. కోవిడ్–19 తదుపరి కనిపిస్తున్న ట్రెండ్ ప్రకారం తాజా అంచనాలు ప్రకటించింది. తొలి ఆరు నెలల్లో కార్యాలయ ఆస్తులలో పెట్టుబడులు 105.6 కోట్ల డాలర్ల నుంచి 192.7 కోట్ల డాలర్లకు జంప్ చేయగా.. గృహ విభాగంలో 42.9 కోట్ల డాలర్ల నుంచి 51.2 కోట్లకు ఎగశాయి. ఈ బాటలో వేర్‌హౌసింగ్ విభాగం 36.6 కోట్ల డాలర్లు(గతంలో 20 కోట్ల డాలర్లు), హోటళ్ల రంగం 13.4 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. అయితే డేటా సెంటర్లు, రిటైల్, విభిన్న వినియోగ ప్రాజెక్టులకు ఎలాంటి పెట్టుబడులు లభించకపోవడం గమనార్హం! గతేడాది వీటిలో వరుసగా 49.9 కోట్ల డాలర్లు, 30.1 కోట్ల డాలర్లు, 39.6 కోట్ల డాలర్లు చొప్పున పెట్టుబడులు నమోదయ్యాయి. -
రీట్స్‌కు భారీ అవకాశాలు
కోల్‌కతా: దేశీయంగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్స్)కు భారీ అవకాశాలున్నట్లు పరిశ్రమ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్‌లో ఇతర ఆస్తులలోకి సైతం రీట్ నిధులు ప్రవేశించే వీలున్నట్లు అంచనా వేశారు. ఇండస్ట్రియల్, డేటా సెంటర్లు, ఆతిథ్యం, హెల్త్‌కేర్, విద్య తదితర రంగాలోకి రీట్స్ విస్తరించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. రియల్టీ రంగంలో ఆదాయాన్ని ఆర్జించే కంపెనీలు రీట్స్ జారీ చేసే సంగతి తెలిసిందే. రియల్టీ ఆస్తులలో పెట్టుబడుల ద్వారా స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్టయ్యే రీట్స్ మదుపరులకు డివిడెండ్ల ఆర్జనకు వీలు కల్పిస్తుంటాయి. తొలి దశలోనే ఇతర ప్రాంతీయ మార్కెట్లతో పోలిస్తే ప్రస్తుతం దేశీయంగా రీట్స్ తొలి దశలోనే ఉన్నట్లు కొలియర్స్ ఇండియా క్యాపిటల్ మార్కెట్లు, ఇన్వెస్ట్మెంట్ సర్వీసుల ఎండీ పియూష్ గుప్తా పేర్కొన్నారు. అమెరికాసహా ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని సింగపూర్ తదితర దేశాలతో పోలిస్తే దేశీ రీట్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 10 శాతానికంటే తక్కువగా ఉన్నట్లు తెలియజేశారు. అయితే దేశీయంగా కార్యాలయ మార్కెట్ పరిమాణంతో చూస్తే భారీ వృద్ధికి వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. రీట్ మార్కెట్ అవకాశాలపై ఆశావహంగా ఉన్నట్లు లిస్టెడ్ కంపెనీ.. ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్ డిప్యూటీ సీఎఫ్‌వో అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆఫీస్ రీట్ మార్కెట్ విస్తరణకు చూస్తున్నట్లు తెలియజేశారు. చెన్నైలో 5 మిలియన్ చదరపు అడుగుల(ఎంఎస్ఎఫ్) కార్యాలయ ఆస్తుల(స్పేస్)ను విక్రయించేందుకు చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇతర నగరాలలోనూ విస్తరించే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలియజేశారు. కంపెనీ 35 ఎంఎస్ఎఫ్ ఆఫీస్ స్పేస్‌తో పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. 8 ఎంఎస్‌ఎఫ్‌లో బిజినెస్ పార్క్‌లను నిర్మిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా 2 ఎంఎస్ఎఫ్ సిద్ధంకానున్నట్లు వెల్లడించారు. డివిడెండ్ ఈల్డ్ దేశీయంగా లిస్టెడ్ రీట్స్ డివిడెండ్ ఈల్డ్తోపాటు ఇతర అంశాలపై ఆధారపడి విజయవంతమవుతుంటాయని గుప్తా పేర్కొన్నారు. అంతర్జాతీయ నియంత్రణలకు అనుగుణమైన స్థాయిలో నిబంధనలు రూపొందించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో దేశీయంగా రీట్స్ పరిశ్రమలు, డేటా సెంటర్లు, ఆతిథ్యం, ఆరోగ్య పరిరక్షణ, విద్య తదితర రంగాలకూ విస్తరించవచ్చని అంచనా వేశారు. ఈ బాటలో దేశీయంగా తొలిసారి రిటైల్ (మాల్స్) ఆధారిత నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రీట్ 2023 మే నెలలో లిస్టయినట్లు ప్రస్తావించారు. దేశీయంగా మొత్తం 667 ఎంఎస్ఎఫ్ ఆఫీస్ స్పేస్‌లో 380 ఎంఎస్ఎఫ్(ఏ గ్రేడ్) లిస్టింగ్‌కు అర్హత కలిగి ఉన్నట్లు కొలియర్స్ ఇండియా విశ్లేషించింది. ప్రస్తుతం 3 లిస్టెడ్ రీట్స్ 74.4 ఎంఎస్ఎఫ్ పోర్ట్‌ఫోలియోతో ఉన్నట్లు తెలియజేసింది. దీనిలో 25 శాతం వాటాతో బెంగళూరు, 19 శాతం వాటాతో హైదరాబాద్ తొలి రెండు ర్యాంకుల్లో నిలుస్తున్నట్లు పేర్కొంది. -
ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌కు డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ఇండియా సర్వే ప్రకారం.. 2025 నాటికి దాదాపు 56 శాతం కార్పొరేట్ కంపెనీలు తమ మొత్తం ఆఫీస్ స్థలంలో 10 శాతానికి పైగా ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ ఉండాలని భావిస్తున్నాయి. ఏడాదిలో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌ను ఎక్కువగా ఉపయోగిస్తామని 47 శాతం కార్పొరేట్లు తెలిపారు. సామర్థ్యాలను మెరుగ్గా సద్వినియోగం చేయడంలో భాగంగా కన్సాలిడేషన్ పెరుగుతుందని 37 శాతం మంది అభిప్రాయపడ్డారు. నిపుణుల లభ్యత, మెరుగైన వసతుల కారణంగా కొన్ని కార్యకలాపాలను జనవరి–మార్చిలో ద్వితీయ శ్రేణి నగరాలకు మార్చినట్టు 13 శాతం మంది కార్పొరేట్లు తెలిపారు. 2021 డిసెంబర్ త్రైమాసికంలో ఇది 8 శాతం నమోదైంది. వచ్చే రెండేళ్లలో కార్యాలయ స్థలం మరింత అధికం అవుతుందని 75 శాతం మంది వెల్లడించారు. భారత కార్యాలయ విభాగంలో రికవరీ మెరుగ్గా ఉందని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. -
బెటర్ డాట్ కామ్ రియల్ ఎస్టేట్ యూనిట్ షట్‌డౌన్.. వేల మంది ఉద్యోగుల తొలగింపు
ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. తాజాగా, ఆర్ధిక మందగమనం వెంటాడుతుండటంతో మార్ట్గేజ్ సంబంధిత సేవలను అందించే ఆన్లైన్ ప్లాట్‌ఫాం బెటర్.కాం (Better.com) సంచలన నిర్ణయం తీసుకుంది. తన రియల్ ఎస్టేట్ విభాగాన్ని మూసివేసింది. మొత్తం సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్టు బెటర్.కాం వ్యవస్ధాపక సీఈవో విశాల్ గార్గ్ వెల్లడించారు. మార్ట్గేజ్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది. అయితే, మార్ట్గేజ్ వడ్డీ రేట్ల పెరుగుదలతో ఈ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు కంపెనీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపధ్యంలో 4,000 మంది ఉద్యోగుల తొలగింపు ముందే ఊహించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరోవైపు సోషల్ మీడియా సంస్థ రెడిట్ 90 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. వ్యయ నియంత్రణ చర్యలు, ఆర్ధిక అనిశ్చితి కారణగా గ్లోబల్ టెక్ దిగ్గజాలతో పాటు భారతీయ స్టార్టప్‌లు కూడా గత ఏడాదిగా ఏకంగా 27,000 మందికిపైగా విధుల నుంచి తొలగించినట్లు వెలుగులోకి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. -
హైదరాబాద్‌లో ఆ ఏరియా ఇళ్లే కావాలి.. కొనుక్కునేందుకు ఎగబడుతున్న జనం?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్టీ రంగంపై 111 జీవో ఎత్తివేత ప్రభావం గట్టిగానే పడనుంది. చదరపు అడుగు (చ.అ.) రూ.6 వేల కంటే ఎక్కువ ధర ఉన్న ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకు కస్టమర్లు పునరాలోచనలో పడ్డారు. ఎక్కువ ధర పెట్టి అపార్ట్మెంట్లలో కొనుగోలు చేసే బదులు అదే ధరకు 111 జీవో పరిధిలోని గ్రామాలలో వ్యక్తిగత గృహాలు, విల్లాలు కొనుగోలు చేయవచ్చనే భావన కొనుగోలుదారులలో పెరిగిపోయింది. దీంతో పశ్చిమ హైదరాబాద్‌లోని హైరైజ్, లగ్జరీ ప్రాజెక్ట్‌లలో విక్రయాలు తగ్గిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమంలో 50 వేల యూనిట్లు.. హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో పశ్చిమ హైదరాబాద్ కీలకమైనది. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల కారణంగా ఈ ప్రాంతాలలో గృహ కొనుగోళ్లు, లాంచింగ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఏటా హైదరాబాద్‌లోని రియల్టీ క్రయవిక్రయాలలో వెస్ట్ హైదరాబాద్ వాటా 60 శాతం ఉంటుంది. కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయ దుర్గం, కోకాపేట, గోపన్‌పల్లి, నల్లగండ్ల వంటివి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాలలో సుమారు 10 కోట్ల చ.అ.లలో నివాస సముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటిల్లో సుమారుగా 50 వేల యూనిట్లు ఉంటాయని అంచనా. 111 జీవో రద్దుతో ఆయా ప్రాజెక్ట్‌ల డెవలపర్లు డోలాయమానంలో పడ్డారు. ప్రీలాంచ్ నిర్మాణాలకు బ్రేక్.. కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ వంటి వెస్ట్ హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలలో డెవలపర్లు ప్రీలాంచ్లో విక్రయాలు చేశారు. ధర తక్కువకు వస్తుంది కదా అని కొనుగోలుదారులూ ఎగిరి గంతేసి బిల్డర్లతో అగ్రిమెంట్లు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయా ప్రాజెక్ట్‌లన్నీ నిర్మాణ దశలో ఉన్నాయి. గత 3–4 నెలలుగా మార్కెట్ ప్రతికూలంగా మారడంతో లగ్జరీ ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. విక్రయాలు లేకపోవటం, నిధుల లేమి కారణంగా చాలా వరకు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నెమ్మదించాయి. తాజాగా 111 జీవో రద్దు ప్రకటించిన నాటి నుంచే పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ప్రీలాంచ్లోని పలువురు కస్టమర్లు డెవలపర్‌తో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయమని నిర్మాణ సంస్థల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ డెవలపర్లను కోరుతున్నారని స్పేస్ విజన్ గ్రూప్ సీఎండీ టీవీ నర్సింహా రెడ్డి తెలిపారు. స్పష్టత వచ్చేదాక స్తబ్ధుగానే.. జంట జలాశయాల పరిరక్షణ కోసం తెచ్చిన జీవో 111ను ప్రభుత్వం ఎత్తేసి 69 జీవో తీసుకొచ్చినా స్థానిక భూ యజమానులు మాత్రం వేచిచూసే ధోరణిలో ఉన్నారు. వెంటనే భూములు అమ్మడానికి ఆసక్తి చూపడంలేదు. నగరానికి అతి చేరువలో ఉన్న ఈ ప్రాంతంలో మునుముందు భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వం గ్రీన్ జోన్, బఫర్ జోన్లు చేస్తామని ప్రకటించింది. దీంతో ఏయే ప్రాంతాలు గ్రీన్ జోన్లో ఉంటాయి? ఏ ప్రాంతాలు బఫర్ జోన్లో ఉంటాయనే విషయంలో స్పష్టత లేదు. దీంతో ఇప్పుడు భూములు ఎందుకు అమ్ముకోవాలని రైతులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అవసరాల కోసం కొందరు రైతులు భూములు అమ్మకానికి పెట్టినా గతం కంటే ఎక్కువ ధరలే చెబుతున్నారు. జీవో 69 విధివిధానాలను మాత్రం ఖరారు చేయలేదు. భవన నిర్మాణ నిబంధనలు, జలాశయాల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, జోన్ల ఏర్పాటు, మాస్టర్ ప్లాన్ వంటి వాటిపై స్పష్టత వస్తే ఇక్కడి భూములకు మరింత గిరాకీ ఉంటుంది. ప్రభావిత ప్రాంతాలివే.. కొల్లూరు, తెల్లాపూర్, నల్లగండ్ల, గోపన్‌పల్లి, నానక్‌రాంగూడ, ఖానామెట్, నార్సింగి, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పాలగూడ వంటి 111 జీవో పరిధిలోని 10 కి.మీ. క్యాచ్మెంట్ ఏరియాకు ఆనుకొని ఉన్న ప్రాంతాలలో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండున్నర దశాబ్ధాల కలను ప్రభుత్వం సాకారం చేసింది. 111 జీవోను ఎత్తివేస్తూ రాష్ట్ర క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది. దీంతో 84 గ్రామాల్లోని 1.32 లక్షల ఎకరాలకు పైగా భూమి అందుబాటులోకి వస్తుంది. ఆహ్వానించదగ్గ పరిణామమే.. కానీ, ఆ ఫలాలు నిజంగా స్థానిక రైతులకు అందుతాయా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. నిర్మాణ నిబంధనల సాకు చూపి ఇప్పటికే 60 శాతానికి పైగా భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దీంతో జీవో రద్దు ఫలాలు ఎవరికి దక్కుతాయనేది సుస్పష్టం. చదవండి👉 ఫ్లాష్‌బ్యాక్: ఆ నిర్ణయంతో..అతలాకుతలం -
కళ్లు తిరిగేలా.. దేశంలో ఇళ్ల ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏదో తెలుసా?
న్యూఢిల్లీ: ఖరీదైన నివాస గృహాల ధరల పెరుగుదలలో అంతర్జాతీయంగా ముంబై నగరం 6వ స్థానంలో నిలిచినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ తెలిపింది. 2023 సంవత్సరం మొదటి మూడు నెలల కాలానికి సంబంధించి ఈ సంస్థ ‘ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ క్యూ1, 2023’ను విడుదల చేసింది. ఈ కాలంలో ముంబైలో ఖరీదైన ఇళ్ల ధరలు 5.5 శాతం పెరిగాయి. అలాగే, బెంగళూరు, న్యూఢిల్లీలోనూ సగటున ధరలు పెరిగాయి. ఖరీదైన ఇళ్ల ధరల పెరుగుదల పరంగా 2022 మొదటి త్రైమాసికం జాబితాలో ముంబై 38వ ర్యాంకులో ఉండగా, ఏడాది తిరిగేసరికి 6వ స్థానానికి చేరుకున్నట్టు నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో గతేడాది ఇదే కాలంలో 37వ ర్యాంకులో ఉన్న బెంగళూరు తాజా జాబితాలో 16కు, న్యూఢిల్లీ 39 నుంచి 22వ ర్యాంకుకు చేరుకున్నాయి. ‘‘ముంబైలో ప్రముఖ ప్రాంతాల్లో ఇళ్ల ధరలు 5.5 శాతం పెరగ్గా, బెంగళూరులో క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 3 శాతం పెరిగాయి. న్యూఢిల్లీలో ఈ పెరుగుదల 1.2 శాతంగా ఉంది’’అని నైట్‌ఫ్రాంక్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 46 పట్టణాల్లో ప్రముఖ ప్రాంతాల్లో ఇళ్ల ధరల పెరుగుదల ఆధారంగా వాటికి ర్యాంకులకు కేటాయిస్తుంటుంది. స్థానిక కరెన్సీలో సాధారణ ధరలను ప్రామాణికంగా తీసుకుంటుంది. ముంబైలో ఇళ్లకు డిమాండ్ గణనీయంగా పెరగడమే సూచీలో మెరుగైన ర్యాంకుకు తీసుకెళ్లినట్టు నైట్ ఫ్రాంక్ పేర్కొంది. ముంబై ఇళ్ల మార్కెట్లో అన్ని విభాగాల్లోనూ డిమాండ్ బలంగానే ఉందని, ఖరీదైన ఇళ్ల ధరలు ఎక్కువగా పెరిగినట్టు తెలిపింది. అంతర్జాతీయంగా దుబాయిలో ఖరీదైన ఇళ్ల ధరలు 44.2 శాతం పెరగడంతో, ఈ నగరం మొదటి స్థానంలో నిలిచింది. చదవండి👉 సొంతిల్లు కొంటున్నారా?, అదిరిపోయే ఈ కేంద్ర ప్రభుత్వ స్కీం గురించి తెలుసా? -
రియల్ ఎస్టేట్ అదరహో.. భారత్‌లో భారీగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత రియల్టీ మార్కెట్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. 2017 నుంచి 2022 మధ్య వీరి నుంచి మొత్తం 26.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.16 లక్షల కోట్లు) వచ్చాయి. అంతకుముందు ఆరేళ్ల కాలంలో (2011–16) వీరు చేసిన పెట్టుబడులతో పోలిస్తే మూడింతలు అధికంగా వచ్చినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఇందులో అమెరికా, కెనడా నుంచే 70 శాతం మేర పెట్టుబడులు వచ్చాయి. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రాధాన్య ఎంపికకగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. భారత్‌లో విదేశీ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు గత కొన్నేళ్లుగా పెరుగుతూనే వస్తున్నాయి. ఈ రంగంలో ఎన్నో కొత్త విధానాలు, సంస్కరణ చర్యలు చేపట్టడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. పెట్టుబడుల వివరాలు.. ► 2017–22 మధ్య భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి దేశీ (డీఐఐలు), విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి మొత్తంగా 32.9 బిలియన్ డాలర్లు వచ్చాయి. 2011–16 మధ్య ఇవి 25.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మొత్తం పెట్టుబడుల్లో 45 శాతం ఆఫీస్ విభాగంలోకే వెళ్లాయి. ►మొత్తం 32.9 బిలియన్ డాలర్లలో ఎఫ్ఐఐల పెట్టుబడులు 26.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2011–16 మధ్య వచ్చిన 8.2 బిలియన్ డాలర్లతో పోలిస్తే మూడింతలు అధికమయ్యాయి. ►డీఐఐల పెట్టుబడులు 2017–22 మధ్య 6.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ►ఎఫ్ఐఐల పెట్టుబడుల్లో యూఎస్ఏ నుంచి వచ్చినవి 11.1 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2011–16 మధ్య ఇవి 3.7 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. ►కెనడా నుంచి 7.5 బిలియన్ డాలర్లు వచ్చాయి. అంతకుముందు ఆరేళ్లలో కెనడా నుంచి వచ్చిన ఎఫ్ఐఐ పెట్టుబడులు కేవలం 0.5 బిలియన్ డాలర్లుగానే ఉండడం గమనార్హం. ►సింగపూర్ నుంచి కూడా మూడు రెట్లకు పైగా పెరిగి 6 బిలియన్ డాలర్లు వచ్చాయి. అంతకుముందు ఆరేళ్లలో ఇవి 2.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఎన్నో అనుకూలతలు అధిక జనాభా అనుకూలతలు, అభివృద్ధికి అనుకూలమైన ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాల బలోపేతం, పోటీ ధరలతో అంతర్జాతీయ సంస్థలకు భారత రియల్ ఎస్టేట్ ప్రాధాన్య మార్కెట్‌గా మారింది. రియల్ ఎస్టేట్ డిమాండ్‌కు ఇవి చోదకంగా నిలుస్తున్నాయి. బలమైన ఆర్థిక, వ్యాపార మూలాలు సంస్థాగత ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తున్నాయి. దీంతో విదేశీ వ్యూహాత్మక భాగస్వాములు తమ పోర్ట్‌ఫోలియోని విస్తరిస్తున్నారు’’అని కొలియర్స్ ఇండియా చైర్మన్, ఎండీ సాంకే ప్రసాద్ తెలిపారు. భారత్ దీర్ఘకాల నిర్మాణాత్మక సైకిల్లో ఉందని, వచ్చే కొన్నేళ్ల పాటు అవకాశాలు మరింత వృద్ధి చెందుతాయని కొలియర్స్ ఇండియా ఎండీ (క్యాపిటల్ మార్కెట్లు) పీయూష్ గుప్తా తెలిపారు. -
అదరగొట్టిన గోద్రెజ్ ప్రాపర్టీస్.. నికర లాభంలో 58% వృద్ధి
న్యూఢిల్లీ: రియల్టీ రంగ దిగ్గజం గోద్రెజ్ ప్రాపర్టీస్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 58 శాతం జంప్‌చేసి రూ. 412 కోట్లను అధిగమించింది. హౌసింగ్‌కు నెలకొన్న పటిష్ట డిమాండ్ ఇందుకు సహకరించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 260 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,523 కోట్ల నుంచి రూ. 1,839 కోట్లకు ఎగసింది. కంపెనీ బోర్డు ఎన్సీడీలు, బాండ్లు తదితర మార్గాల ద్వారా ఒకేసారి లేదా దశలవారీగా రూ. 2,000 కోట్ల సమీకరించేందుకు అనుమతించింది. చేపడుతున్న ప్రాజెక్టులు, పటిష్ట బ్యాలన్స్‌షీట్, హౌసింగ్ రంగ వృద్ధి నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం(2023–24)లోనూ ప్రోత్సాహకర ఫలితాలు సాధించే వీలున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్శన్ పిరోజ్షా గోద్రెజ్ అభిప్రాయపడ్డారు. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 571 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. 2021–22లో రూ. 352 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 2,586 కోట్ల నుంచి రూ. 3,039 కోట్లకు బలపడింది. గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 12,232 కోట్ల విలువైన అమ్మకాల బుకింగ్స్‌ను సాధించింది. 2021–22లో నమోదైన రూ. 7,861 కోట్లతో పోలిస్తే ఇవి 56 శాతం అధికం. నగదు వసూళ్లు 41 శాతం ఎగసి రూ. 8,991 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో గోద్రెజ్ ప్రాపరీ్టస్ షేరు ఎన్ఎస్ఈలో 0.4 శాతం తగ్గి రూ. 1,323 వద్ద ముగిసింది. -
అపార్ట్మెంట్ ప్రారంభ ధర రూ.30 కోట్లు.. రెంట్ నెలకు రూ.10లక్షలు!
గగనమే హద్దుగా రియల్ ఎస్టేట్‌లో ఆకాశహర్మ్యాల కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఒకదాన్ని మించి మరోటి పోటీపడుతున్నాయి. ముఖ్యంగా భూతల స్వర్గాన్ని తలపించే బెంగళూరులో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ప్రాంతం యూబీ సిటీ (ubcity-United Breweries)లో అపార్ట్మెంట్ నిర్మాణాలు నింగిలోని చుక్కలను తాకేలా నిర్మిస్తున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. ఇప్పుడు వాటిని సొంతం చేసుకునేందుకు బిలియనీర్లు పోటీపడుతున్నారు. ఇక్కడ ఒక్కో అపార్ట్ మెంట్లలో ఫ్లాట్ ధర కోట్లలో ఉంటే రెంట్ లక్షల్లో ఉంది. బెంగళూరులో విలాసవంతమైన జిల్లాగా ప్రసిద్ధి చెందిన యూబీ సిటీలో లగ్జరీ మాల్ (ది కలెక్షన్), విశాలమైన ఆఫీస్ స్పేస్ కార్యాలయాలు, ఓక్వుడ్ సర్వీస్ అపార్ట్మెంట్లు, బిలియనీర్స్ టవర్ (కింగ్‌ఫిషర్ టవర్స్)తో పాటు అన్నీ రంగాలకు చెందిన ఆఫీస్ కార్యకలాపాలు ఇక్కడే జరుగుతున్నాయి. విజయ్ మాల్య తండ్రి విటల్ మాల్య రోడ్డులో విజయ్ మాల్య తండ్రి విటల్ మాల్య రోడ్డులో యూబీ సిటీ, కింగ్ ఫిషర్ ప్లాజా, కాంకోర్డ్, కాన్బెర్రా, కామెట్, కింగ్‌ఫిషర్ టవర్స్ అంటూ 6 బ్లాకుల్లో మొత్తం 16 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టారు విజయ్ మాల్య. 2004లో ప్రారంభమైన ఇక్కడి నిర్మాణాలు 2008లో పూర్తయ్యాయి. నాటి నుంచి ఆ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగొందుతూ బెంగళూరుకు దిక్సూచిలా మారింది. అందుకే కాబోలు అక్కడ నివసించేందుకు బడ బడా వ్యాపార వేత్తలు కోట్లు కుమ్మరించి ఫ్లాట్ల కొనుగోలు కోసం ఎదురు చూస్తుంటారు. 2014-2016లో ఆ ప్రాంతాన్ని మరింత అభిృద్ది చేసేందుకు మాల్యా ఆధీనంలోని ఓ సంస్థ రూ.1500 కోట్లు పెట్టుబడులు పెట్టింది. వెరసీ ఆ ఏరియాలో 8వేల స్కైర్ ఫీట్ అపార్ట్ మెంట్ ధర రూ. 35వేలతో ప్రారంభ విలువ రూ.30 కోట్లకు పైగా పెరిగిందని, సగటు నెలవారీ అద్దె రూ.10 లక్షలుగా ఉందని స్థానిక రియల్టర్స్ చెబుతున్నారు. ప్రముఖుల నుంచి దిగ్గజ సంస్థల వరకు ఇక బీఎండబ్ల్యూ, ఫోర్సే, హార్లే డేవిడ్సన్ వంటి కంపెనీలకు చెందిన షోరూమ్స్ ఇక్కడ ఉన్నాయి. లూయిస్ విట్టన్, డీజిల్, రోలెక్స్ వంటి లగ్జరీ బ్రాండ్స్ షాప్స్ ఉండడంతో యూబీ సిటీ బెంగళూరు వాసులకు వీకెండ్ గమ్యస్థానంగా మారింది. ఈ అల్ట్రా లగ్జరీ రెసిడెన్షియల్ క్వార్టర్స్‌లో బయోకాన్ కిరణ్ మజుందార్ షా, ఫ్లిప్‌కార్ట్ సచిన్ బన్సాల్, మెన్సా బ్రాండ్స్ అనంత్ నారాయణన్, జెరోధా నిఖిల్ కామత్‌లతో పాటు మరికొందరు వ్యాపారవేత్తలు నివాసం ఉంటున్నారు. -
ఇళ్ల ధరల్లో ఈ సిటీలు చాలా కాస్ట్లీ గురూ.. ముంబై ప్లేస్?
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నగరాలు ఉన్నా.. వాటిల్లో కొన్నింటికి డిమాండ్ చాలా ఎక్కువ. స్థానిక పరిస్థితులతోనో, వ్యాపార, వాణిజ్య అవకాశాల తోనో అక్కడ ఇళ్ల ధరలు కూడా చాలా ఎక్కువ. ఈ క్రమంలో నైట్ ఫ్రాంక్ సంస్థ.. ఇళ్ల ధరల ఆధారంగా ప్రపంచంలో ఖరీదైన నగరాల జాబితాను ‘వెల్త్ రిపోర్ట్–2023’లో వెల్లడించింది. ముఖ్యమైన నగరాల్లోని ప్రధాన ప్రాంతాల్లో.. రూ.8.2 కోట్లు ఖర్చుపెడితే ఎన్ని చదరపు మీటర్ల విస్తీర్ణమున్న ఇల్లు వస్తుందనే అంచనాలనూ పేర్కొంది. నగరాలు ఇవే.. - మొనాకో.. 17 చ.మీటర్లలో ఇంటి పరిమాణం - న్యూయార్క్.. 21 - సింగపూర్.. 33 - లండన్.. 34 - జెనీవా.. 37 - లాస్ ఏంజిలెస్.. 39 - ప్యారిస్.. 43 - షాంఘై.. 44 - సిడ్నీ.. 44 - బీజింగ్.. 58 - టోక్యో.. 60 - మియామీ.. 64 - బెర్లిన్.. 70 - మెల్బోర్న్.. 87 - దుబాయ్.. 105 - మాడ్రిడ్.. 106 - ముంబై.. 113 - కేప్‌టౌన్.. 218 - సావోపాలో.. 231 -
హైదరాబాద్‌లో స్థిరాస్తి ధరలు ఎందుకింత తక్కువో తెలుసా?
హైదాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిస్తోంది. ప్రాపర్టీల (స్థిరాస్తి) ధరలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ ఇక్కడ పెట్టుబడి పెట్టిన ప్రతిరూపాయి లాభాలు కురిపిస్తాయనే అభిప్రాయంతో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. దీనికి తోడు ఇళ్ల డిమాండ్, ఎకానమీ వృద్ది, నగరం నలువైపులా మౌలిక సదుపాయల అభివృద్ది వంటి సానుకూల అంశాల కారణంగా దేశంలో బడ్జెట్ ధరల్లో ప్రాపర్టీలు సొంతం చేసుకునే 6 నగరాల జాబితాలో దేశంలోనే హైదరాబాద్ ప్రధమ స్థానంలో నిలిచింది. ఇటీవల ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ దేశంలో ప్రముఖ నగరాలైన ఢిల్లీ- ఎన్సీఆర్,కోల్‌కతా, ముంబై, పూణే, హైదాబాద్, చెన్నై, బెంగళూరులలో సగటున స్థిరాస్థి (ప్రాపర్టీ) ధరలు ఎంతున్నాయోనని పోల్చి చూసింది. అనరాక్ సర్వేలో ఇతర నగరాలకంటే హైదరాబాద్‌లో చౌకగా స్థిరాస్థి ధరలు ఉన్నట్లు తేలింది. నగరంలో యావరేజ్‌గా ఒక్కో చదరపు అడుగు ధర రూ.4,620 గా ఉందని తెలిపింది. ఇక హైదరాబాద్‌లో రియల్ రంగం స్థిరంగా కొనసాగేందుకు నివాసగృహాలు, వ్యాపార వాణిజ్య సముదాయలకు డిమాండ్ పెరగడం,ఏరియాల మధ్య దూరాన్ని తగ్గించేలా ప్రభుత్వం మౌలిక సదుపాయాల్ని అభివృద్ది చేయడం కారణంగా రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చినట్లైంది. తద్వారా హైదరాబాద్‌లో సగటు ప్రాపర్టీ ధరల్లో గరిష్టంగా 10 శాతం పెరుగుదల నమోదైంది. ఇప్పటికీ మిగిలిన నగరాలతో పోలిస్తే అనువైన ధరల్లో ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ భారతదేశంలో అత్యంత సరసమైన నగరాలలో ఒకటిగా నిలిచింది. 2018 హైదరాబాద్‌లో స్కైర్ ఫీట్ సగటు ధర రూ.4,128గా ఉంది. ఇది 2022లో రూ.4,620కి పెరిగింది. ఇక గడిచిన ఐదు సంవత్సరాల్లో 7 నగరాల్లోని యావరేజ్‌గా స్కైర్ ఫీట్ ప్రాపర్టీ ధరలు ఎలా ఉన్నాయని ఒక్కసారి పరిశీలిస్తే.. ముంబైలో స్కైర్ ఫీట్ ధర అత్యధికంగా రూ.11,875 ఉండగా పూణేలో రూ.6వేలు, బెంగళూరులో రూ.5,570, చెన్నైలో రూ.5,315, ఎన్సీఆర్ రూ.5,025, కోల్‌కతాలో రూ.4,700, హైదరాబాద్‌లో రూ.4,620గా ఉన్నాయి. ఈ సందర్భంగా 2022లో సగటు ప్రాపర్టీ ధరల్లో గరిష్ట వార్షిక పెరుగుదల కనిపించిందని, అనరాక్ గ్రూప్‌లోని రీసెర్చ్ సీనియర్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ అన్నారు. మహమ్మారి తర్వాత నగరాల్లో డిమాండ్ పెరిగింది. 2021-2022లలో డెవలపర్ల ఇన్పుట్ ఖర్చులు పెరగడంతో ధరలు పెరగడానికి కారణమైనట్లు తెలిపారు. -
జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ.. బోలెడు బహుమతులు
వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో మీ సొంతింటి కలను సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ గమ్యస్థానం ఇదే కావచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణం, కాలుష్య రహిత ప్రాంతం, పచ్చదనంతో పాటు మెరుగైన కనెక్టివిటీతో నగర వాసులకు కోరిక తగ్గట్టు రూపొందిన ప్రాజెక్ట్ ‘జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ’(G Square Epitome Integrated City). రియల్ ఎస్టేట్ రంగంపై లోతైన అవగాహనతో పాటు అపార అనుభవమున్న జీ స్కైర్ హౌసింగ్ గ్రూప్ తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని చేపట్టింది. మకర సంక్రాంతి దక్షిణ భారతదేశంలో ప్రత్యేకంగా జరుపుకునే ముఖ్యమైన పండుగ. సౌతిండియాలో అతిపెద్ద ప్లాట్ ప్రమోటర్ జీ స్కైర్ హౌసింగ్ గ్రూప్ (G Square Epitome Housing) పండుగ సందర్భంగా, ‘జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ’ కస్టమర్లకు అద్భుతమైన బహుమతులను అందిస్తున్నట్లు ప్రకటించింది. పండగ అంటే అందరం కలిసి చేసుకోవాలనే భావనతో మీ ముందుకు కళ్లు చెదిరే ఆఫర్లను తీసుకువచ్చింది. హైదరాబాద్-విజయవాడ హైవేలోని జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ సైట్లో ఈ వేడుకులు జనవరి 11 నుంచి 22, 2023 వరకు ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తోంది. వీటితో పాటు సైట్‌ని సందర్శించే వారికోసం అల్పాహారం, మధ్యాహ్న భోజనం కోసం ప్రత్యేక ఆహారం, డ్రింక్స్ కూడా ఏర్పాటు చేసింది. బోలెడు బహుమతులు మీకోసమే ఆఫర్ కాలంలో ఈ భారీ ఇంటిగ్రేటెడ్ సిటీని సందర్శిస్తే, 5 కార్లు, 20 బైక్‌లను గెలుచుకునే అదృష్టవంతుల్లో మీరు ఒకరు కావచ్చు. రోజూ సైట్‌ని సందర్శించిన 100 మంది కస్టమర్లు గోల్డ్ కాయిన్స్ అందుకోనున్నారు. అంతే కాదండోయ్ ప్లాట్‌ను బుక్ చేసుకన్న కస్టమర్లు(ఇద్దరు) హాంకాంగ్, మలేషియా, సింగపూర్ లేదా దుబాయ్‌కి వెళ్లే లక్కీ ఛాన్స్ కూడా ఉంది. కస్టమర్ వారి ప్రాధాన్యత ప్రకారం విదేశీ పర్యటనకు బదులుగా 40 గ్రాముల బంగారు నాణేన్ని కూడా ఎంచుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. ఇంకా బోలెడు ఉన్నాయి... సైట్‌ను సందర్శించేవారికి చీరలు, టీషర్టులు వంటి ప్రత్యేక బహుమతులు కూడా ఉన్నాయి. పతంగుల పండుగ, మెహందీ, కుమ్మరి, బొమ్మల కొలువు మొదలైన అనేక ఆసక్తికరమైన సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రాజెక్ట్‌ను సందర్శించాలని జీ స్కైర్ హౌసింగ్ గ్రూప్ కోరుతోంది. ఎక్కడ ఉందంటే హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ప్రసిద్ధ రామోజీ ఫిల్మ్ సిటీకి ఆనుకుని ఉంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి అతి సమీపంలో జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ 1242 ఎకరాల ప్రధాన భూభాగంలో విస్తరించి ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని మొదటి ఇంటిగ్రేటెడ్ సిటీ మాత్రమే కాదు హెచ్ఎండీఏ, రెరాచే ఆమోదించబడిన ఏకైక అతిపెద్ద ప్రాజెక్ట్. ఫేజ్ 1లో భాగంగా, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఫీచర్లతో కూడిన 368 ఎకరాల ప్రీమియం విల్లా ప్లాట్ కమ్యూనిటీని కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఆకర్షణగా వివిధ రకాలైన లైఫ్ స్టైల్స్, ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్‌తో హైదరాబాద్‌లోని అతిపెద్ద క్లబ్‌హౌస్ (5.65 ఎకరాలు)తో 140+ ప్రపంచ స్థాయి సౌకర్యాల దీని సొంతం. జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ 24/7 CCTV నిఘాతో అత్యంత సురక్షితమైన జోన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేకతలు చూస్తే వావ్ అనాల్సిందే.. 30 ఎకరాల ఐటీ పార్క్, 100 ఎకరాల గోల్ఫ్ కోర్స్, 40 ఎకరాల లగ్జరీ రిసార్ట్, 279 ఎకరాల నేచురల్ లేక్, వెల్నెస్ సెంటర్, స్పోర్ట్స్ అకాడెమీ, మాల్, సూపర్ మార్కెట్, స్కూల్, కాలేజ్ తో పాటు, మరిన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కొండలు, ప్రాంతం సమీపంలో జీస్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ ఉండటంతో పాటుగా హైదరాబాద్‌లో అతి పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తుంది. శ్రీ ఈశ్వర్ ఎన్, సీఈఓ (జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్), ‘మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణ సంస్కృతితో ముడిపడి ఉన్న ఈ అద్భుతమైన పండుగను ప్రతి ఒక్కరితో కలిసి మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీలో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈ ప్రాజెక్ట్ రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్-విజయవాడ హైవేపై ఉంది. ప్రతి ఒక్కరూ మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీని సందర్శించి, ఈ పండుగ వేడుకల్లో భాగం కావాల’ని కోరుకుంటున్నట్లు తెలిపారు. జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్ గురించి జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్ బృందం రియల్ ఎస్టేట్ రంగంపై లోతైన అవగాహనతో పాటు అపార అనుభవం కూడా కలిగి ఉంది. భారీ ప్రాజెక్ట్‌లను కస్టమర్ల సంతృప్తితో విజయవంతంగా పూర్తి చేసిన ఘనత ఈ సంస్థ సొంతం. 6000 కంటే ఎక్కువ కస్టమర్ల కస్టమర్ బేస్‌తో 60కి పైగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లు ఉండగా, వాటి సంఖ్య జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్ నిరంతరం పెంచుకుంటోంది. ఇంతటి చరిత్ర కలిగిన జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా ప్రీమియం ప్రాజెక్ట్‌లను అందిస్తోంది. జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్ తన కస్టమర్లకు 100 శాతం స్పష్టమైన డాక్యుమెంటేషన్, ఉచిత నిర్వహణను అందించడం ద్వారా అవాంతరాలు లేని అనుభవాన్ని అందించింది. (అడ్వర్టోరియల్) -
ఎన్‌హెచ్ 65కు మహర్దశ, ధర ఎంతైనా తగ్గేదేలే.. మాకు ఆ ఏరియా ఇళ్లే కావాలి!
నా కష్టార్జితం కూడపెట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ ప్రోపర్టీ కొనాలనుకుంటున్నాను. కానీ ఎక్కడ కొనాలో అర్థం కావడం లేదు. అభివృద్ధి చెందిన ప్రాంతంలో కొందామంటే, అందుబాటులో రేట్లు లేవు. ఓ 2-3 ఏళ్లలో మనం పెట్టిన సొమ్ము కు తగిన రాబడి అందించే విధంగా ప్రాపర్టీ కొనాలనే కోరిక. ఇదే రకమైన భావనలో మీరు ఉంటే.. దక్షిణ భారత దేశంలో అతిపెద్ద ప్లాట్ ప్రమోటర్ జీ స్కైర్ హౌసింగ్ గ్రూప్. వేగంగా అభివృద్ధి చెందతున్న హైదరాబాద్ విజయవాడ హైవే (ఎన్‌హెచ్ 65 )లో సౌత్ ఇండియాలోనే తొలిసారి 368 ఎకరాల్లో వరల్డ్ క్లాస్ ప్రీమియం విల్లా ప్లాట్లతో 1242 ఎకరాల్లో ఇంటీగ్రెటెడ్ సిటీని నిర్మిస్తుంది. హెచ్ఎండీఏ, రెరా అనుమతులతో 267 నుంచి 533 స్కైర్ యార్డ్స్‌లో నిర్మిస్తున్న జీ స్కైర్ ఎపిటాన్లో వివిధ రకాలైన లైఫ్ స్టైల్స్, ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్‌తో 5.65 ఎకరాల్లో హైదరాబాద్ లార్జెస్ట్ క్లబ్ హౌస్, వరల్డ్ క్లాస్ ప్రీమియం, అవుటర్ రింగ్ రోడ్డు వెలుపల అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలున్నాయి. నగర పరిసర ప్రాంతాల్లో తమ కలల సౌధాన్ని లేదంటే విల్లాలను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం అంటోంది జీ స్కైర్ హౌసింగ్ గ్రూప్. మరోవైపు హైలీ సెక్యూర్ జోన్లో 24 గంటలూ సీసీటీవీ సర్వేలైన్స్‌తో పాటు 100 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్ 40 ఎకరాల్లో లగ్జరీ రిసార్ట్, వెల్నెస్ సెంటర్, స్పోర్ట్స్ అకాడమీ, స్కూల్స్, కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. అత్యున్నత జీవన ప్రమాణాలను అందించేలా ప్రతి ఒక్కరి కలల గమ్యంగా మార్చేలా కొండ ప్రాంతాలు, వ్యవసాయ క్షేత్రాలు, 279 ఎకరాల విశాలమైన సహజ సరస్సు మధ్య జీ స్క్వేర్ ఎపిటామ్ ఇంటిగ్రేటెడ్ సిటీ హైదరాబాద్‌లోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తుంది. ఆహ్లాదకరమైన ప్రకృతి, కాలుష్య రహిత వాతావరణం, తూర్పు హైదరాబాద్‌కు అదనపు ఆకర్షణతో అందుబాటు ధరలు, మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల వల్ల ఎన్నో కంపెనీలు తమ విస్తరణ కోసం ఈ కారిడార్ వైపు చూస్తున్నాయి. ఐటీ, హెల్త్ కేర్, ఆటోమొబైల్, 5ఐటీ పార్క్‌లు, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఎంఎస్ఎంఈలు, లాజిస్టిక్ హబ్‌ల నిర్మించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. 247 కిలోమీటర్ల దూరాన్ని కలుపుతున్న హైదరాబాద్ - విజయవాడ హైవే కారిడార్‌లో పెట్టుబడులకు అనువైన సమయమంటూ ఈ ప్రాంతంలో స్థలాలు కొన్న వారు భవిష్యత్‌లో మంచి రాబడులు పొందగలరని చెబుతున్నారు. అందుకు ఊతం ఇచ్చేలా పశ్చిమ హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గించడంతో పాటుగా తూర్పు హైదరాబాద్ అభివృద్దే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డెవలప్మెంట్ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. దండుమల్కాపూర్ (ఎన్‌హెచ్ 65 సమీపంలోని గ్రామం) వద్ద ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ ఇప్పుడు అభివృద్ధి చేస్తుండటం, కేంద్ర ప్రభుత్వం విజయవాడ హైవేను త్వరలోనే ఆరు లైన్ రోడ్‌గా విస్తరించనున్నామని త్వరలోనే ఆ పనులు ప్రారంభిస్తామని వెల్లడించడంతో ఆరు లైన్ల రోడ్డు దగ్గర ప్రాపర్టీ అంటే ఆస్తి విలువ కూడా గణనీయంగా కూడా పెరుగుతున్నట్లేనని రియాల్టీ పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా జీస్వైర్ హౌసింగ్ సీఈవో ఎన్.ఈశ్వర్ మాట్లాడుతూ..ఇప్పటికే మేం జీ స్కైర్ ఈడెన్ గార్డెన్ పేరుతో బీఎన్ రెడ్డీ నగర్లో చేపట్టిన ప్రాజెక్ట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు అదే తరహాలో జీస్కైర్ ఎపిటామ్ పేరుతో హైదరాబాద్ -విజయవాడలను కలిపే జాతీయ రహదారి మార్గంలో 1242 ఎకరాల్లో కస్టమర్ల లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా ప్రాజెక్ట్ నిర్మాణాలను చేపడుతున్నాం. పెట్టుబడులకు అనువైన సమయమంటూ ఈ ప్రాంతంలో స్థలాలు కొన్న వారు భవిష్యత్‌లో మంచి రాబడులు పొందగలరని ధీమాగా చెబుతున్నారు. అందుకే ఇప్పుడే పెట్టుబడులు పెట్టండి.. మీ బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోండి. (అడ్వర్టోరియల్) -
రియల్ ఎస్టేట్ రంగంలో బీకే మోడీ వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్లలో దేశీయంగా రియల్టీ, వెల్నెస్ విభాగాలలో కార్యకలాపాల విస్తరణపై దృష్టిపెట్టినట్లు బీకే మోడీ గ్రూప్ తాజాగా పేర్కొంది. భారీ వృద్ధి అవకాశాలున్న ఈ రెండు రంగాలలో బిలియన్ డాలర్లు(సుమారు రూ. 8,250 కోట్లు) ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. రియల్టీ, వెల్నెస్ విభాగాలలో కొత్త టెక్నాలజీలకు వీలున్నట్లు గ్రూప్ వ్యవస్థాపకులు బీకే మోడీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ప్రతిపాదిత ప్రాజెక్టులలో విదేశీ ఇన్వెస్టర్లను భాగస్వాములు చేయనున్నట్లు తెలియజేశారు. ఒక డెవలపర్‌తో కలసి ఇప్పటికే ముంబైలో వాణిజ్య రియల్టీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ బిజినెస్‌ను మరింత విస్తరించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. మిక్స్డ్ ప్రాజెక్టుకు రెడీ ప్రయివేట్ స్మార్ట్ సిటీ ఆలోచనపై స్పందిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో మిక్స్డ్ వినియోగానికి వీలైన ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు మోడీ తెలియజేశారు. -
హైదరాబాద్‌లో దుమ్ములేపిన ఇళ్ల అమ్మకాలు!
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఈ ఏడాది రెట్టింపు స్థాయిలో ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. గతేడాది 25,406 యూనిట్లు అమ్ముడు కాగా, ఈ ఏడాది 47,487 యూనిట్ల విక్రయాలు జరిగాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో అత్యధికంగా 3,64,900 యూనిట్లు అమ్మడయ్యాయి. గతేడాది (2021)తో పోలిస్తే ఈ ఏడాది ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు 54 శాతం పెరిగాయి. 2021లో విక్రయాలు 2,36,500 యూనిట్లుగా ఉన్నాయి. 2014లో నమోదైన 3.43 లక్షల యూనిట్ల అమ్మకాలే ఇప్పటి వరకు గరష్ట రికార్డుగా ఉంటే, ఈ ఏడాది అమ్మకాలు సరికొత్త రికార్డు నమోదు చేశాయి. వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ ఇళ్లకు బలమైన డిమాండ్ నెలకొందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తెలిపింది. నిర్మాణంలో వినియోగించే మెటీరియల్ ధరలు పెరిగిన ఫలితంగా ఇళ్ల ధరలు ఈ ఏడాది 4–7 శాతం వరకు ఎగసినట్టు అనరాక్ తన నివేదికలో వెల్లడించింది. హైదారాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ముంబై ఎంఎంఆర్), చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణె నగరాల గణాంకాలు ఈ నివేదికలో ఉన్నాయి. ►ముంబై ఎంఎంఆర్ మార్కెట్లో 1,09,700 యూనిట్ల ఇళ్ల విక్రయాలు జరిగాయి. 2021లో ఇక్కడ అమ్మకాలు 63,712 యూనిట్లుగానే ఉన్నాయి. ►పుణెలో గతేడాదితో పోలిస్తే 59 శాతం అధికంగా 57,146 యూనిట్లు విక్రయమయ్యాయి. ►బెంగళూరులో 50 శాతం అధికంగా 49,478 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ►చెన్నైలో 29 శాతం పెరిగి 16,097 యూనిట్లు అమ్మడయ్యాయి. ►కోల్‌కతా మార్కెట్లో గతేడాది 13,077 యూనిట్లు అమ్ముడైతే, ఈ ఏడాది 21,220 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ►ఏడు పట్టణాల్లో 3,57,600 యూనిట్ల కొత్త ఇళ్లు ఈ ఏడాది అందుబాటులోకి వచ్చాయి. గతేడాది ఉన్న 2,36,700 యూనిట్లతో పోలిస్తే 51 శాతం అధికం. ►ఈ ఏడాది హైదరాబాద్, ఎంఎంఆర్ మార్కెట్లలో కొత్త ప్రాజెక్టుల ఆరంభాలు ఎక్కువగా ఉన్నాయి. ఏడు పట్టణాలకు గాను ఈ రెండింటి వాటాయే 54 శాతంగా ఉంది. ►అమ్ముడుపోని ఇళ్ల విక్రయాలు డిసెంబర్ త్రైమాసికంలో 1 శాతం తగ్గి 6,30,953 యూనిట్లుగా ఉన్నాయి. ►ప్రధానంగా 2020, 2021లో కరోనా మహమ్మారి కారణంగా ఇళ్ల కొనుగోలును వాయిదా వేసుకున్న వారు కూడా ఈ ఏడాది కొనుగోళ్లకు మొగ్గు చూపడం కలిసొచ్చింది. అద్భుతమైన సంవత్సరం ‘‘నివాస గృహాలకు ఈ ఏడాది అద్భుతంగా ఉంది. ప్రాపర్టీల ధరలు పెరిగినా, వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ సానుకూల విక్రయాలు నమోదయ్యాయి. 2022 ద్వితీయ ఆరు నెలల్లో ప్రాపర్టీ ధరలు, వడ్డీ రేట్లు పెరగడం అన్నది విక్రయాలపై ప్రభావం పడుతుందని ముందు నుంచి అంచనా నెలకొంది. అయినప్పటికీ డిసెంబర్ క్వార్టర్లో బలంగా 92160 యూనిట్ల విక్రయాలు జరిగాయి’’అని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. చదవండి👉 ధర ఎంతైనా తగ్గేదేలే..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియా ఇళ్లే కావాలి! -
రియల్టీలో పిరమల్ గ్రూప్ వేల కోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: పిరమల్ గ్రూప్‌నకు చెందిన రియల్టీ కంపెనీ పిరమల్ రియల్టీ వచ్చే రెండేళ్లలో రూ.3,500 కోట్లు పెట్టుబడి చేస్తోంది. 60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కస్టమర్లకు అందించాలన్న లక్ష్యంతో నిర్మాణంలో ఉన్న నాలుగు రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు పిరమల్ రియల్టీ సీఈవో గౌరవ్ సాహ్నే తెలిపారు. ‘ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో ప్రస్తుతం 1.5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో గృహ, వాణిజ్య సముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో 1.3 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ములంద్, థానే, మహాలక్ష్మి, బైకులా వద్ద గృహ సముదాయాలు నిర్మితమవుతున్నాయి. ఈ నాలుగు ప్రాజెక్టులకుగాను 12,000 యూనిట్ల అపార్ట్మెంట్స్ రానున్నాయి. తొలి 1,000 యూనిట్లు కస్టమర్లకు అందించడం ప్రారంభం అయింది’ అని తెలిపారు. గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ హౌసింగ్ డిమాండ్ బలంగానే ఉందని గౌరవ్ వివరించారు. ఉమ్మడిగా ప్రాజెక్టుల అభివృద్ధి కోసం భూ యజమానులతో భాగస్వామ్యాన్ని అన్వేషిస్తున్నామన్నారు. -
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడుతున్నారా? ,అయితే ఇవి తెలుసుకోండి..
డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ పథకాల పట్ల మీ అభిప్రాయం ఏమిటి? – మంజనాథ్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు పన్ను పరంగా అనుకూలం కాదు. ఫండ్ సంస్థ డివిడెండ్ ప్రకటించినప్పటికీ అది ఇన్వెస్టర్ బ్యాంకు ఖాతాకు రాదు. ఆ మొత్తం ఆటోమేటిక్‌గా అదే పథకంలో పెట్టుబడిగా మారిపోయి యూనిట్లు జమ అవుతాయి. దాంతో డివిడెండ్ విలువకు సరిపడా యూనిట్లను పొందుతారు. ఈ కార్యక్రమం మొత్తం మీద చేతికి వచ్చే డివిడెండ్ ఏమీ లేకపోయినా పన్ను మాత్రం చెల్లించాల్సి వస్తుంది. ఐటీ రిటర్నులు దాఖలు చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల డివిడెండ్ ఆదాయాన్ని కూడా చూపించి పన్ను చెల్లించాల్సిందే. ఇన్వెస్టర్లు తమకు వర్తించే శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లకు గ్రోత్ ప్లాన్ మెరుగైన ఎంపిక అవుతుంది. పెట్టుబడి కోసం రియల్ ఎస్టేట్ మెరుగైన సాధనమేనా? ఇతర ఉత్పత్తులతో దీన్ని ఎలా పోల్చి చూడాలి? – శివమ్ కంది రియల్ ఎస్టేట్‌ను పెట్టుబడి సాధనంగా నేను భావించడం లేదు. ఇల్లు అయితే ఒక కుటుంబం నివసించేందుకే గానీ, పెట్టుబడిగా చూడకూడదు. ఒక్కసారి ఇల్లు కొనుగోలు చేసి, దానిలో నివసిస్తుంటే విలువ పెరుగుతుందా? లేక తగ్గుతుందా అన్నది పట్టింపు కాదు. పెట్టుబడిగా రియల్ ఎస్టేట్‌కు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. పెట్టబడి పరిమాణం అధికంగా కావాల్సి ఉంటుంది. ఇతర సాధనాలతో పోలిస్తే లిక్విడిటీ (నగదుగా మార్చుకునే సౌలభ్యం) తక్కువగా ఉంటుంది. దీంతో కోరుకున్నప్పుడు విక్రయించుకునే వీలు ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడిలో సవాళ్లూ ఉంటాయి. ఒకవేళ ప్రాపర్టీని అద్దెకు ఇస్తే కిరాయిదారు రూపంలో ఇంటి నిర్వహణ సక్రమంగా కొనసాగొచ్చు. అలా చూస్తే ఇల్లు మంచి పెట్టుబడే అవుతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణంతోపాటే అద్దె కూడా పెరుగుతూ వెళుతుంది. అదే సమయంలో ప్రతికూలతలూ కనిపిస్తాయి. ఇల్లు ఎంత గొప్పది అయినా 20 ఏళ్ల తర్వాత డిమాండ్ తగ్గుతుంది. అద్దెకు ఉండేవారు అధునికమైన, కొత్త ఇంటి కోసం ప్రాధాన్యం ఇస్తుంటారు. కనుక రియల్ ఎస్టేట్ విలువ పెరిగినా కానీ, దానికి అనుగుణంగా అద్దె రాబడి మెరుగ్గా ఉండదు. అందుకే ప్రాపర్టీని కొనుగోలు చేసే ముందు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. నా సలహా ఏమిటంటే రియల్ ఎస్టేట్‌ను పెట్టుబడిగా కాకుండా నివాసంగానే చూడండి. ఇటీవలి కరోనా కొత్త రకం ముప్పు నేపథ్యంలో నా పెట్టుబడుల వ్యూహం ఎలా ఉండాలి? ఈక్విటీ నుంచి డెట్‌కు పెట్టుబడి మార్చుకోవాలా? – రమాకాంత్ ఈక్విటీ నుంచి డెట్‌కు పెట్టుబడులను పూర్తిగా మార్చుకోవద్దు. 2020 మార్చిలో ఏం జరిగిందో గుర్తు చేసుకోండి. మార్కెట్ అదే పనిగా పడిపోయింది. దీంతో చాలా మంది భయపడి పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు. ఆ తర్వాత అసాధారణమైన లాభాలను చూశాం. ఈక్విటీలను ఊహించడం కష్టం. అవి ఎప్పుడూ అస్థిరంగా, అంచనాలకు భిన్నంగా ఉంటాయి. ఒకవేళ మీరు దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసి ఉంటే, వచ్చే ఐదేళ్లపాటు పెట్టుబడితో అవసరం లేకుంటే, కరెక్షన్ గురించి భయపడాల్సిన పనిలేదు. దీనికి బదులు మీరు అస్సెట్ అలోకేషన్ ప్రణాళికపై దృష్టి పెట్టండి. ఈక్విటీ, డెట్ మధ్య పెట్టుబడుల కేటాయింపులను నిర్ణయించుకోండి. డెట్‌లో 30 శాతం పెట్టుబడులను ఉంచాలనుకుంటే.. మొత్తం పెట్టుబడుల్లో ఆ మేరకు డెట్ విభాగంలోకి మళ్లించండి. దాంతో ఏదైనా అసాధారణ మార్పులు చోటు చేసుకుంటే అస్సెట్ అలోకేషన్ ప్రణాళిక మేరకు ఈక్విటీ, డెట్ మధ్య పెట్టుబడులను రీబ్యాలన్స్ చేసుకోవచ్చు. -
హైదరాబాద్‌లో హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్న ఈ ఏరియా ఓపెన్ ప్లాట్లు!
సాక్షి, హైదరాబాద్: కూతురు పెళ్లి కోసమో, కొడుకు చదువుల కోసమో, భవిష్యత్తు అవసరాల కోసమో కారణమేదైనా సామాన్య, మధ్యతరగతి ప్రజలు ప్లాట్లను కొనేందుకే ఇష్టపడుతుంటారు. సొంతంగా ఉండేందుకు ఇల్లు మొదటి ప్రాధాన్యత పూర్తయితే ఇక వారి లక్ష్యం శివారు ప్రాంతమైనా సరే ఎంతో కొంత స్థలం కొనుగోలు చేయటమే. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వెలిసిన వెంచర్లలో ప్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 2018 నుంచి హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, గుర్గావ్ నగరాలలో ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని హౌసింగ్.కామ్ సర్వే వెల్లడించింది. గత మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13–21 శాతం మేర పెరిగాయని తెలిపింది. ఇదే నగరాల్లోని అపార్ట్మెంట్ల ధరలలో మాత్రం 2–6 శాతం మేర వృద్ధి ఉందని పేర్కొంది. కరోనా నేపథ్యంలో కొనుగోలుదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, పాలసీలతో రాబోయే త్త్రైమాసికాలలో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలున్నాయని సర్వే అంచనా వేసింది. కరోనాతో బూస్ట్..: సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే అపార్ట్మెంట్లను కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే భద్రతతో పాటూ పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉంటాయని అపార్ట్మెంట్ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు. కానీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కామన్ వసతులు వినియోగం, అపార్ట్మెంట్లలో ఎక్కువ జనాభా వంటివి శ్రేయస్కరం కాదనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకోవటమో లేక వ్యక్తిగత గృహాలను కొనుగోలుకు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. -
7 ఒప్పందాలు.. 769 ఎకరాలు!.. హైదరాబాద్‌లో ఈ ప్రాంతాలకు భలే డిమాండ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భూముల క్రయవిక్రయాలు రికార్డ్ స్థాయికి చేరాయి. దేశంలోని 8 ప్రధాన నగరాలతో పోలిస్తే నగరంలో అత్యధిక లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల కాలంలో 68 ఒప్పందాల ద్వారా 1,656 ఎకరాల లావాదేవీలు జరగగా.. అత్యధికంగా హైదరాబాద్‌లోనే చోటు చేసుకున్నాయి. ఇక్కడ 7 డీల్స్‌లో 769 ఎకరాల ట్రాన్సాక్షన్స్ జరిగాయని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. ∙గతేడాది జనవరి – సెప్టెంబర్‌లో దేశంలోని ఎనిమిది నగరాలలో కేవలం 20 ఒప్పందాల ద్వారా 925 ఎకరాల లావాదేవీలు మాత్రమే జరిగాయి. ఈ ఏడాది జరిగిన స్థల లావాదేవీలలో అత్యధిక డీల్స్ నివాస విభాగంలోనే జరిగాయి. 40 ఒప్పందాలలో 590కి పైగా ఎకరాల లావాదేవీలు నివాస సముదాయాల అభివృద్ధి కోసం జరగగా.. 4 డీల్స్‌లో 147 ఎకరాలు పారిశ్రామిక మరియు గిడ్డంగుల విభాగంలో, 4 ఒప్పందాలలో 119 ఎకరాలు డేటా సెంటర్ల ఏర్పాటు, 5 డీల్స్‌లో 115 ఎకరాలు మిక్స్డ్ డెవలప్మెంట్ కోసం, 4 ఒప్పందాలలో 26 ఎకరాలు వాణిజ్య సముదాయాల విభాగంలో, 11 డీల్స్‌లో సుమారు 659 ఎకరాల లావాదేవీలు రిటైల్, బీపీఓ వంటి అభివృద్ధి పనుల కోసం జరిగాయి. హైదరాబాద్‌లో భూమ్.. ఈ ఏడాది జరిగిన స్థల లావాదేవీలలో విస్తీర్ణం పరంగా అత్యధికంగా హైదరాబాద్‌లోనే జరిగాయి. 46 శాతం వాటాతో హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచింది. 14 శాతంతో ఎన్సీఆర్ రెండో స్థానంలో, 13 శాతం బెంగళూరు మూడో స్థానంలో నిలిచాయి. ముంబైలో అత్యధిక ల్యాండ్ డీల్స్ జరిగినా.. అవి కేవలం చిన్నపాటి స్థల లావాదేవీలకే పరిమితమయ్యాయి. నగరంలో జరిగిన లావాదేవీలు పరిశీలిస్తే.. ►ఈ ఏడాది మూడో త్త్రైమాసికంలో జీఓసీఎల్ కార్పొరేషన్ స్థల యాజమాని నుంచి స్క్వేర్‌స్పేస్ ఇన్ఫ్రా సిటీ 12.25 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. డీల్ విలువ సుమారు రూ.125 కోట్లు. ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలనేది ఇంకా నిర్ణయంకాలేదు. ►ఈ ఏడాది తొలి త్త్రైమాసికంలో ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో గ్రూప్ 600 ఎకరాల ►స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.350 కోట్లు. ►అలాగే క్యూ1లో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ షాద్‌నగర్‌లో రూ.164 కోట్లతో 41 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇందులో డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. -
‘సగం ధరకే సొంతిల్లు’.. ఈ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి
ప్రీలాంచ్, బై బ్యాక్, యూడీఎస్, అన్‌లాకబుల్ స్పేస్, రెంటల్ స్కీమ్.. ఇలా రకరకాలుగా నివాస, వాణిజ్య సముదాయాలలో ఆఫర్ల పేరిట కొనుగోలుదారులకు ఎర వేస్తున్న నిర్మాణ సంస్థలు అనేకం. సెంటు భూమి లేకుండానే ఆకాశంలో మేడలు కడుతున్నామని నమ్మించి నట్టేట ముంచేస్తున్నాయి. ఏ కంపెనీలు ఏ తరహా మోసాలకు పాల్పడుతున్నాయనే ప్రస్తావన కాసేపు పక్కన పెడితే.. అసలు ప్రీలాంచ్ మోసాలకు కారణం ఎవరు? చిన్న వస్తువు కొంటేనే బ్రాండ్, ధర, ఎక్స్పైరీ వంటి వివరాలన్నీ తెలుసుకునే కొనుగోలుదారులు.. జీవితంలో అత్యంత కీలకమైన గృహ కొనుగోలులో ఎందుకు పునఃపరిశీలన చేసుకోవటం లేదు? సగం ధరకే ఫ్లాట్ అనగానే గుడ్డిగా నమ్మేసి కష్టార్జితాన్నంతా బిల్డర్ చేతిలో పెట్టేయడం ఎంతవరకు కరెక్ట్? సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ రంగానికి పునాది నమ్మకం. ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభించేటప్పుడు అందులోని ఫ్లాట్లన్నింటినీ అమ్మగలననే నమ్మకం బిల్డర్‌కు, ఆ ప్రాజెక్ట్‌ను గడువులోగా పూర్తి చేసి అందించగలడనే నమ్మకం కొనుగోలుదారునికి ఉండాలి. అప్పుడే ప్రతికూల సమయంలోనూ బిల్డర్, కస్టమర్లు ఇద్దరూ ఆనందంగా ఉంటారు. కానీ, ప్రస్తుతం హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో కొరవడింది ఈ నమ్మకమే.రాత్రికి రాత్రే పుట్టుకొచ్చే బిల్డర్లు, స్వలాభమే ఆశించే భూ యజమానులు, సగం ధరకే సొంతిల్లు కావాలనుకునే కస్టమర్లు.. వీరందరూ అత్యాశతో పరిశ్రమకు మచ్చ తెస్తున్నారు. నిధుల మళ్లింపుతో.. వ్యాపారంలో షార్ట్‌కర్ట్ దురుద్దేశంతో సాహితీ వంటి కొంతమంది బిల్డర్లు ప్రీలాంచ్ పేరుతో సగం ధరకే ఫ్లాట్లు విక్రయించే ప్రయత్నాలు చేస్తూ హోమ్ బయ్యర్లను ఆకర్షిస్తున్నారు. ఈ విధంగా సమీకరించిన సొమ్మును బిల్డర్లు ఇతర ప్రాజెక్ట్‌లకు, వ్యక్తిగత అవసరాలకు మళ్లిస్తున్నారు. సగం ధరకే అమ్మిన సొమ్ముతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేక చతికిలపడిపోతున్నారు. అత్యాశ కలిగిన బిల్డర్లు, కొనుగోలుదారులు ఇద్దరూ సక్రమంగా ఉన్న పరిశ్రమకు చెడ్డ పేరు తెస్తున్నారు. విలువలతో కూడిన వ్యాపారం చేసే డెవలపర్లకు ఇబ్బందులు కలుగజేస్తున్నారు. అధ్యయనం చేయకుండానే.. ప్రీలాంచ్, యూడీఎస్ స్కీమ్‌ల పేరిట కస్టమర్లను మోసం చేసే వందలాది మంది బిల్డర్ల పుట్టుకకు కారణం కస్టమర్లే. వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయకుండా సగం ధరకే ఫ్లాట్ అనగానే నమ్మేసి, అత్యాశకు పోయి బిల్డర్లకు సొమ్ము సమర్పించుకునే కస్టమర్లు ఉన్నంతకాలం ప్రీలాంచ్ చీడపురుగులు వస్తూనే ఉంటారు. అత్యాశ కలిగిన కస్టమర్లే లేకపోతే ప్రీలాంచ్ డెవలపర్లు మొగ్గలోనే వాడిపోతారు. ప్రీలాంచ్ పేరిట డబ్బులు వసూలు చేసే బిల్డర్లను శిక్షించి నట్టుగానే వారిని ప్రోత్సహించే కొనుగోలుదారులనూ శిక్షించాల్సిన అవసరం ఉంది. కొనేముందు గమనించాల్సినవివే ► నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లలోనే కొనుగోలు చేయాలి. ►ప్రాజెక్ట్ నిర్మించే స్థలానికి న్యాయపరమైన అంశాలపై నిపుణులను సంప్రదించాలి. ►డెవలపర్ ప్రొఫైల్, ఆర్ధిక సామర్థ్యం తెలుసుకోవాలి. ►గతంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్‌లను నేరుగా వెళ్లి పరిశీలించాలి. అందులోని కస్టమర్లతో మాట్లాడాలి. ►పాత ప్రాజెక్ట్‌లలో ధరల వృద్ధి ఎలా ఉంది? బ్రోచర్లలో ఇచ్చిన హామీలను అమలు చేశాడా లేదో తెలుసుకోవాలి. ►ప్రాజెక్ట్ రుణాలు, పాత లోన్ల చెల్లింపులు తదితర వివరాలపై ఆరా తీయాలి. ►డెవలపర్ లేదా కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ గురించి కూడా పరిశీలించాలి. కస్టమర్లూ శిక్షార్హులే.. లంచం తీసుకోవటం ఎంత నేరమో.. ఇవ్వటమూ అంతే నేరం. అలాగే ప్రీలాంచ్ స్కీమ్‌లతో ప్రజలను మోసం చేస్తున్న బిల్డర్లది ఎంత తప్పో.. ఆయా స్కీమ్‌లను నమ్మి బిల్డర్లను ప్రోత్సహించే కస్టమర్లదీ అంతే తప్పు. లంచం విషయాలలో ఎలాగైతే ఇద్దరూ శిక్షించబడతారో ప్రీలాంచ్ కేసుల్లోనూ అటు బిల్డర్, ఇటు కస్టమర్ ఇద్దరూ శిక్షార్హులే. – రవీందర్ రెడ్డి, ఫౌండర్, చైర్మన్ జనప్రియ -
ధర ఎంతైనా తగ్గేదేలే..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియా ఇళ్లే కావాలి!
రియల్ ఎస్టేట్‌లో హైదరాబాద్ జెట్ స్పీడులో దూసుకెళ్తోంది. దేశంలోని మెట్రో సిటీస్‌ను వెనక్కి నెట్టి ముందుకెళుతోంది. అక్కడ ఇక్కడా అని కాకుండా హైదరాబాద్ నలువైపులా వందలాది రియల్ఎస్టేట్ ప్రాజెక్ట్‌లతో తన మార్క్‌ను చూపుతోంది. నిర్మాణ రంగంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. కరోనా తర్వాత బాగా పంజుకున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఇదే అనువైన సమయంగా కొనుగోలు దారులు భావిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , ఐటీ ఆధారిత కంపెనీలు కేంద్రీకృతమైన ప్రాంతాలలో గృహాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా నగర శివారు ప్రాంతమైన తెల్లాపూర్ ఇప్పుడు రెసిడెన్షియల్ హబ్‌గా అవతరిస్తోంది. ఈ ప్రాంతంలో ఇళ్లను సొంతం చేసుకునేందుకు కొనుగోలు దారులు ఉత్సాహాం చూపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ,రామచంద్రాపురం మండల పరిధిలోని తెల్లాపూర్ ఏరియా శాటిలైట్ టౌన్‌గా ఉండేది. అయితే ఐటీ రంగం అభివృద్ధి చెందడం, నగరంలోని ఐటీ హబ్, ఔటర్ రింగ్ రోడ్‌కు సమీపంలో ఉండటంతో అనేక మంది టెక్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇక్కడ స్థిరపడేందుకు మక్కువ చూపుతున్నారు. దీనికి తోడు ఫేస్బుక్, డెలాయిట్, హెచ్ఎస్బీసీ, ఆప్టమ్, క్వాల్కామ్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, నోవార్టిస్ల కార్యాలయాలు తెల్లాపూర్, సమీప ప్రాంతాలలో ఉండడం రియల్ ఎస్టేట్ బూమ్‌కు మరింత ఊతం ఇస్తున్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు లింగం పల్లి ఇప్పుడు తెల్లాపూర్ గృహ కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోందని, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఈ ప్రాంతంలో ప్లాట్లు, ఫ్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేసేలా ఆకర్షిస్తున్నట్లు రియల్టర్లు చెబుతున్నారు. ఇంతకుముందు రియల్టీ బూమ్ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగంపల్లి వంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందని, అయితే నగరంలో ఐటీ రంగం వృద్ధితో ఇది విస్తరించిందని, భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో మరింత రియాల్టీ అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు. చదరపు అడుగు ఎంతంటే ఈ తరుణంలో క్రెడాయ్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తెల్లాపూర్‌లో రియల్ బూమ్‌పై మాట్లాడుతూ... ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇళ్లు చదరపు అడుగుకు సగటున రూ. 7,000 నుండి రూ. 8,000 వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 1,000 చదరపు అడుగుల నుంచి 1,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2బీహెచ్‌కే ఇళ్ల ధర దాదాపు రూ. 1.2 కోట్లు ఖర్చవుతుండగా, 3బీహెచ్‌కే రూ. 1.5 కోట్లకు పైగా ధరలకు అమ్ముతున్నట్లు అంచనా వెలసిన ప్రాజెక్ట్‌లు తెల్లాపూర్ ఐటీ పరిసర ప్రాంతాల్లో ఐటీ బూమ్‌తో మై హోమ్, రాజపుష్ప, హానర్ హోమ్స్, రామ్కీ, వెర్టెక్స్ హోమ్స్ వంటి రియాల్టీ డెవలపర్లు ఇప్పటికే అక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించాయి. అపర్ణా కన్స్ట్రక్షన్స్ ఈ ప్రాంతంలో మాల్‌ను ఏర్పాటు చేస్తుండగా..మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలను నిర్మించేందుకు బిల్డర్లు ముందుకు వస్తున్నారు. కనెక్టివిటీ బాగుంది తెల్లా పూర్ సమీపంలో మియాపూర్ మెట్రో స్టేషన్, టీఎస్ఆర్టీసీ బస్సు సదుపాయం ఉంది. ఆ ప్రాంత నివాసితులు తక్కువ సమయంలో నగరంలోని ఏ ప్రాంతానికైనా చేరుకోవచ్చు. మాదాపూర్ నుండి 15 కి.మీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి దాదాపు 30 కి.మీ, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కేవలం 30 నిమిషాల దూరంలో ఉన్న తెల్లాపూర్ నగరంలోని అన్ని ప్రాంతాలకు మంచి రహదారి కనెక్టివిటీని కలిగి ఉంది. ఎంఎంటీఎస్ సౌకర్యం పెరుగుతున్న డిమాండ్ల మధ్య, దక్షిణ మధ్య రైల్వే (SCR) ఈ ప్రాంతానికి ఎంఎంటీఎస్ కనెక్టివిటీని అందించాలని యోచిస్తోంది. 10 కి.మీ దూరంలో ఉన్న మియాపూర్ వంటి ప్రాంతాలకు లింగంపల్లి ద్వారా చేరుకోవచ్చు, కొల్లూరు ఓఆర్ఆర్ ద్వారా చేరుకోవచ్చు. ప్రభుత్వం రోడ్ల నిర్మాణంతో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (FoBs) నిర్మించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసింది. -
జీ స్క్వేర్ హౌసింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోనీ
దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ప్లాట్ ప్రమోటర్ ‘జీ స్క్వేర్ హౌసింగ్’.. క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనితో తమ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ధోనితో భాగస్వామ్యం ద్వారా దక్షిణ భారత దేశంలోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కోయంబత్తూరు లాంటి నగరాల్లో తమ డైనమిక్, ప్రగతిశీల వృద్ధి వ్యూహాన్ని పునరుద్ఘాటిస్తుందని కంపెనీ తెలిపింది. రియల్ ఎస్టేట్‌లో తమ నైపుణ్యాన్ని భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రణాళికల్లో ఉంది కంపెనీ. పదేళ్ల అనుభవంతో, జీ స్క్వేర్ హౌసింగ్ టీమ్ రియల్ ఎస్టేట్ రంగంపై లోతైన అవగాహనతో, భారీ ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తి చేసిందనీ, తద్వారా కస్టమర్ల మనసు దోచుకుందని తెలిపింది. ప్రస్తుతం 6000 కంటే ఎక్కువ కస్టమర్ బేస్‌తో 60కి పైగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లు తమ చేతిలో ఉన్నాయని, ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉందని వెల్లడించింది. భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలోని తమ వినియోగదారులకు 1000 ఎకరాలకు పైగా భూమిని విక్రయించిన జీ స్క్వేర్ హౌసింగ్ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా ప్రీమియం ప్రాజెక్ట్‌లను అందిస్తోందని కంపెనీ సీఈవో ఈశ్వర్ ఎన్ తెలిపారు. ఎంఎస్ ధోని లాంటి దిగ్గజం, గొప్ప బ్యాట్స్‌మెన్, గొప్ప టీం లీడర్‌తో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగానూ, గర్వంగానూ ఉందంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు సీఈవో ఈశ్వర్. దేశీయ పాపులర్ ప్లాట్ ప్రమోటర్‌గా మరిన్ని భౌగోళిక ప్రాంతాల్లో తమ జీ స్క్వేర్ హౌసింగ్ బ్రాండ్ మరింత బలోపేతం కావడానికి ఇది సాయం చేస్తుందన్నారు. (అడ్వటోరియల్) -
చుక్కలనంటుతున్న ‘అద్దెలు’,కట్టలేక ఖాళీ చేస్తున్న జనాలు
బ్రిటన్‌లో లివర్‌పూల్ శివార్లలోని నారిస్ గ్రీన్ ప్రాంతానికి చెందిన గాలింగేల్ రోడ్‌ను ఇప్పుడంతా ‘దెయ్యాలవీథి’ గా పిలుచు కుంటున్నారు. ఎందుకలా? అక్కడేమైనా క్షుద్రపూజల వంటివి జరుగుతున్నాయా? అతీంద్రియ శక్తుల కదలికలేమైనా ఉన్నాయా? అంటే, అలాంటివేమీ లేవు. మరి దెయ్యాలవీథిగా పేరు ఎందుకొచ్చిందనేగా మీ అనుమానం? లండన్ తర్వాత బ్రిటన్‌లో ఖరీదైన ప్రాంతాల్లో లివర్‌పూల్ ఒకటి. లివర్‌పూల్ నడిబొడ్డునే కాదు, శివారు ప్రాంతాల్లో కూడా ఇటీవల ఇళ్ల అద్దెలు చుక్కలనంటే స్థాయిలో పెరిగాయి. గాలింగేల్ రోడ్‌లోనూ ఇళ్ల అద్దెలు జనాల తాహతుకు మించి పెరగడం మొదలవడంతో, ఇంతకాలం ఇక్కడ ఉంటూ వచ్చిన వారిలో చాలామంది ఒక్కొక్కరుగా ఇళ్లు ఖాళీచేసి వేరేచోటుకు తరలి పోయారు. ఇంకా మిగిలిన ఒకటీ అరా కుటుంబాల వారు కూడా వీలైనంత త్వరలోనే ఇక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకుని వేరేచోటుకు తరలిపోయే ఆలోచనల్లో ఉన్నారు. దాదాపు తొంభై శాతానికి పైగా ఇళ్లు ఖాళీ కావడంతో ఈ వీథి వీథంతా కొన్ని నెలలుగా నిర్మానుష్యంగా మారింది. దీంతో స్థానికులు ఈ ప్రాంతాన్ని ‘ఘోస్ట్ స్ట్రీట్’గా పిలుచుకుంటున్నారు. ‘ఇంటి అద్దె ఒకేసారి 680 పౌండ్ల (రూ.65 వేలు) నుంచి 750 పౌండ్లకు (71 వేలు) పెరిగింది. ఈ అద్దె భరించడం మాకు శక్తికి మించిన పని. త్వరలోనే ఇల్లు ఖాళీచేసి వేరేచోటుకు వెళ్లిపోదామనుకుంటున్నాం. ఇక్కడ మిగిలిన ఒకటీ అరా కుటుంబాల వారు కూడా ఇతర ప్రాంతాల్లో ఇళ్ల కోసం వెదుకులాడుతున్నారు. తగిన ఇల్లు దొరికితే ఈ వీథిని ఖాళీ చేసి వెళ్లిపోతారు. ఉన్న కాసిని కుటుంబాలు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతే పూర్తిగా ఇది ‘ఘోస్ట్స్ట్రీట్’గానే మిగులుతుంది’ అని ఆండీ అనే ఈ ప్రాంతవాసి తెలిపారు. -
లక్కీ లాటరీలో మూడు కోట్ల ఇల్లు.. రూ. 280కే!!
‘మంచి తరుణం మించిన దొరకదు..ఆలోచించిన ఆశా భంగం...రండి బాబు రండి..రూ.3.7కోట్ల ఖరీదైన ఇల్లును రూ.280కే అందిస్తాం’ అంటూ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఇంతకీ ఆ ఖరీదైన ఇల్లు ఎక్కడ ఉంది? రూ.280కే.. రూ. 3 కోట్ల విలువైన ఆ ఇల్లును కొనుగోలు చేయొచ్చా? ఇంతకీ ఆ ఇంటి కథాకమామిషు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి ధర రూ.3.7 కోట్లు. అందులో మూడు స్టేర్లు. స్టైలిష్ ఫర్నీచర్. నాలుగు పెద్ద పెద్ద బెడ్రూంలు. తినేందుకు విశాలమైన కిచెన్‌లో డైనింగ్ ఏరియా. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సేదతీరేందుకు లివింగ్ రూమ్. పైగా ఇంటి నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. సాధారణంగా ఇటువంటి విలాసవంతమైన భవనంలో ఉండేందుకు నెల అద్దె సుమారు రూ.188,000 చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ ముగ్గురు అన్నదమ్ములు మాత్రం కొనుగోలు దారులకు కేవలం రూ.280కే ఇస్తామని ప్రకటించారు. ముగురు సోదరులు బ్రిటన్‌కు చెందిన డానియల్, జాన్సన్,ట్వెన్‌ఫోర్ ముగ్గురు అన్నదమ్ములు. ఈ అన్నదమ్ములు కోవిడ్ -19 సమయంలో రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి అడుగు పెట్టారు. బిజినెస్ ప్రారంభంలో వాళ్లకు తట్టిన ఓ చిన్న ఐడియా కోటీశ్వరుల్ని చేసింది. ఇప్పుడు అదే స్ట్రాటజీతో రూ. 280కే కోట్ల విలువైన బంగ్లాను అప్పనంగా ఇచ్చేస్తామని చెబుతున్నారు. అయితే ఇందుకోసం ఓ షరతు విధించారు. ఏంటా షరతు! ఐడియా..కనెక్టింగ్ పీపుల్ ముగ్గురు సోదరులు ఈ ఖరీదైన ఇంటిని అమ్మేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. రూ. 280తో లాటరీ కొంటే ఆ విల్లా మీ సొంతమయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నారు. కేంబ్రిడ్జ్ న్యూస్ ప్రకారం..ఇంటిని అమ్మేందుకు అవసరమైన స్టాంప్ డ్యూటీ, చట్టపరమైన రుసుము వంటి బదిలీ ఖర్చులను కవర్ చేయడానికి ట్వెన్‌ఫోర్ బ్రదర్స్ లాటరీ తరహాలో సుమారు 155,000 టిక్కెట్లను విక్రయించాల్సి ఉంటుంది. కానీ 155,000 టిక్కెట్లు అమ్ముడుపోకపోతే..లాటరీ తీసి అందులో గెలిచిన విజేతకు ఇంటికి బదులుగా లాటరీ మొత్తం నగదులో 70 శాతం అందిస్తారు. బావుంది కదా బిజినెస్. ట్రామ్వే పాత్ పేరుతో నిర్వహిస్తున్న ఈ బిజినెస్‌లో ఇప్పటి వరకు ఈ ముగ్గురు సోదరులు నష్టపోలేదు. ట్రామ్వే పాత్ ట్రామ్వే పాత్ వెబ్సైట్ ప్రకారం..బ్రిటన్ కెంట్లోని మెడ్వేలో ఉన్న ఈ అద్భుతమైన 4 బెడ్ రూమ్‌ల ఇల్లు చారిత్రాత్మక సంస్కృతి, కళలు సమృద్ధిగా ఉన్న ప్రాంతంలో ఉంది. లండన్ విక్టోరియా నుంచి లండన్ సెయింట్ పాన్క్రాస్ల నాలుగు కిలోమీటర్ల దూరాన్ని గంటలోపు చేరుకునే ప్రయాణ సౌకర్యం ఉంది’ అని పేర్కొంది. -
హైదరాబాద్‌లో ఇళ్ల కొనుగోలు కోసం ఎగబడుతున్న ఎన్ఆర్ఐలు..ఎందుకంటే?
కరోనా కాటుతో స్తబ్ధుగా ఉన్న రియాల్టీ రంగం భారత్‌లో ఊపందుకుందా? పెట్టుబడులు, కొనుగోళ్లు, అమ్మకాలతో హైదరాబాద్ రియాల్టీకి జోష్ వచ్చిందా? హోమ్ లోన్ లపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నా.. ఇళ్లు, ప్లాట్ల, ఫ్లాట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నా విదేశాల్లో స్థిర పడ్డ భారతీయులు హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాల్లో ఇళ్లను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారా? ఆర్ధిక మాంద్యం దెబ్బకు ఎన్ఆర్ఐలు తిరిగి భారత్‌లో స్థిరపడాలని అనుకుంటున్నారా? అంటే అవుననే అంటోంది తాజాగా విడుదలైన ఓ సర్వే. ► సీఐఐ - అనరాక్ కన్స్యూమర్ సెంటిమెంట్ సర్వే హెచ్1 -2022 ప్రకారం.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఇక్కడ స్థిరాస్తుల్ని సులభంగా కొనుగోలు చేసేలా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో పాటు, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వంటి అంశాలు ఎన్ఆర్ఐలకు, ఓసీఐలకు కలిసి వస్తున్నట్లు తెలుస్తోంది. ►దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్, కర్ణాటక రాజధాని బెంగళూరులో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోయినా ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఎన్ఆర్ఐల మొగ్గు చూపుతున్నారు. ►ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఎన్ఆర్ఐలు ఇళ్లను కొనుగోలు చేసే ప్రాంతాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నట్లు అగ్రస్థానంలో ఉన్నాయని సీఐఐ - అనరాక్ సర్వే తెలిపింది. ►సర్వేలో పాల్గొన్న కనీసం 60 శాతం మంది ఎన్ఆర్ఐలు హైదరాబాద్, ఢిల్లీ , బెంగళూరులో ఇళ్లను కొనుగోలు చేస్తామనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక అదే జాబితాలో ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ నాల్గవ స్థానంలో నిలిచింది. ►ఈ ఏడాది ఎన్ఆర్ఐలు ఇళ్లను కొనుగోలు చేసే అత్యంత ఇష్టమైన ప్రాంతంగా హైదరాబాద్ దక్కించుకుంది. 22 శాతం మంది ఎన్ఆర్ఐలు హైదరాబాద్‌తో పాటు ఇతర పరిసర ప్రాంతాల్లో ఇళ్ల కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఢిల్లీలో 20 శాతం మంది, బెంగళూరులో 18 శాతం మంది మాత్రమే ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్యత ఇచ్చారు. ►2021లో ఇదే కాలంతో పోలిస్తే 2022 మొదటి తొమ్మిది నెలల్లో గృహ నిర్మాణం ఎన్ఆర్ఐలలో డిమాండ్‌లో 15-20 శాతం పెరిగింది. ►అనరాక్ రీసెర్చ్ ప్రకారం, 2022 జనవరి-సెప్టెంబర్ కాలంలో మొదటి ఏడు నగరాల్లో సుమారు 2.73 లక్షల గృహాలు అమ్ముడయ్యాయి. సగటున, ఏ త్రైమాసికంలోనైనా విక్రయించిన ఇళ్లలో 10-15 శాతం ఎన్ఆర్ఐల వాటా ఉంది" అని ఠాకూర్ చెప్పారు. ►ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా అనేక దేశాల్లో నెలకొన్న మాంద్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే, చాలా మంది ఎన్నారైలు ఇప్పుడు భారత్‌కు తిరిగి వెళ్లాలని చూస్తున్నారని సర్వే పేర్కొంది. వారు రూ. 90 లక్షల నుండి రూ. 1.5 కోట్ల మధ్య ప్రీమియం ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు తేలింది. ►ఇక ఎన్ఆర్ఐలలో 2బీహెచ్‌కే కంటే 3బీహెచ్‌కే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. సర్వే ప్రకారం, 44 శాతం మంది ఎన్ఆర్ఐలు 3బీహెచ్‌కేలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. వారిలో 38 శాతం మంది 2బీహెచ్‌కే ఇళ్ల కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని సర్వే తెలిపింది. ఈ సందర్భంగా అనరాక్ గ్రూప్ సీనియర్ డైరెక్టర్ & రీసెర్చ్ హెడ్ ప్రశాంత్ ఠాకూర్ మాట్లాడుతూ ‘ గృహ రుణ వడ్డీ రేట్లు, ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇల్లు కొనుగోలు చేయాలనే సెంటిమెంట్ బలంగా ఉందని అన్నారు.యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం ఎన్ఆర్ఐలు భారత్‌లో ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారని అన్నారు. చదవండి👉 ఈ హైవేలో ఎకరం ధర రూ.1.5కోట్లు..! చదవండి👉 : ఛాఛా!! ఆ పిచ్చిపని చేయకపోతే మరో వెయ్యికోట్లు సంపాదించే వాడిని: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా -
హైదరాబాద్‌లో అద్దెలు పెరిగాయ్, సగం జీతం.. ఇంటి అద్దెకే!
సాక్షి, సిటీబ్యూరో: విద్యా సంస్థలు, కార్యాలయాల పునఃప్రారంభంతో అద్దె గృహాలకు గిరాకీ పెరిగింది. దీంతో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో లగ్జరీ ఇళ్ల నెలవారీ అద్దెలలో తొలిసారిగా రెండంకెల వృద్ధి నమోదయింది. కరోనా కంటే ముందు ప్రీమియం ప్రాపర్టీల రెంట్లు 5–7 శాతం వృద్ధిని నమోదవుతుండగా.. గత రెండేళ్లలో ఏకంగా 18 శాతం పెరిగాయని అనరాక్ సర్వేలో తేలింది. ప్రధాన ప్రాంతాలలో డిమాండ్‌కు తగిన లగ్జరీ గృహాల సప్లయి లేకపోవటమే అద్దె పెరుగుదలకు కారణం. అలాగే కరోనా తర్వాతి నుంచి అద్దెదారులు పెద్ద సైజు గృహాల అద్దెలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఫలితంగా అందుబాటుతో పోల్చితే లగ్జరీ ప్రాపర్టీల రెంట్లు పెరిగాయని సర్వే వెల్లడించింది. ♦అత్యధికంగా ముంబైలోని వర్లీలో 18 శాతం మేర అద్దెలు పెరిగాయి. ఇక్కడ 2020లో 2 వేల చ.అ ఇంటి అద్దె రూ.2 లక్షలుగా ఉండగా.. 2022 నాటికి రూ.2.35 లక్షలకు పెరిగింది. టార్డియోలో రెండేళ్ల క్రితం రూ.2.70 లక్షలుగా ఉన్న అద్దె.. ఇప్పుడు 15 శాతం పెరిగి రూ.3.10 లక్షలకు చేరింది. ♦బెంగళూరులోని జేపీ నగర్లో 13 శాతం వృద్ధితో రూ.46 వేల నుంచి రూ.52 వేలకు, రాజాజీనగర్‌లో 16 శాతం వృద్ధితో రూ.56 వేల నుంచి రూ.65 వేలకు అద్దెలు పెరిగాయి. రాజాజీనగర్ అత్యధిక మూలధన విలువను సాధించిన ప్రాంతంగా నిలిచింది. చ.అ. ధర రూ.5,698 నుంచి 9 శాతం వృద్ధి రేటుతో రూ.6,200లకు పెరిగింది. ♦చెన్నైలోని కొత్తూరుపురంలో 14 శాతం ♦వృద్ధితో రూ.74 వేల నుంచి రూ.84 వేలకు, కోల్‌కత్తాలోని బల్లీగంజ్‌లో 10 శాతం పెరుగుదలతో రూ.88 వేల నుంచి రూ.97 వేలకు, ఎన్సీఆర్లోని గోల్ఫ్‌కోర్స్ ఎక్స్టెన్షన్ రోడ్లో 12 శాతం వృద్ధితో రూ.50 వేల నుంచి రూ.56 వేలకు, పుణేలోని కోరాగావ్ పార్క్‌లో 14 శాతం వృద్ధితో రూ.59,500ల నుంచి రూ.68 వేలకు నెలవారీ అద్దెలు పెరిగాయి. జూబ్లీహిల్స్‌లో 62 వేలు.. హైదరాబాద్‌లో లగ్జరీ గృహాల అద్దెలకు డిమాండ్ పెరిగింది. రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో 2 వేల చ.అ. ఇంటి అద్దె రూ.54 వేలుగా ఉండగా.. 2022 నాటికి 15 శాతం మేర పెరిగి రూ.62 వేలకు చేరింది. అలాగే హైటెక్‌సిటీలో 2020లో రూ.53 వేలుగా ఉన్న రెంట్.. ప్రస్తుతం 11 శాతం వృద్ధితో రూ.59 వేలకు పెరిగింది. అలాగే జూబ్లీహిల్స్‌లో 2020లో చ.అ. సగటు ధర రూ.6,950గా ఉండగా.. 2022 నాటికి 6 శాతం వృద్ధి రేటుతో రూ.7,400లకు పెరిగింది. హైటెక్‌సిటీలో రెండేళ్ల క్రితం చ.అ.కు రూ.5,675గా ఉండగా.. ప్రస్తుతం 7 శాతం పెరుగుదలతో రూ.6,100లకు చేరింది. చదవండి👉 లబోదిబో.. హైదరాబాద్‌లో పెరిగిపోతున్న అమ్ముడు పోని ఇళ్లు -
మహీంద్రా లైఫ్‌స్పేస్, యాక్టిస్ జోడీ
న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ తాజాగా అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ యాక్టిస్‌తో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేసింది. రూ.2,200 కోట్ల ముందస్తు పెట్టుబడితో దేశవ్యాప్తంగా ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ కేంద్రాలను ఇరు సంస్థలు కలిసి అభివృద్ధి చేస్తాయి. ఈ స్పెషల్ పర్పస్ వెహికిల్స్‌లో మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్‌కు 26–40 శాతం వాటా, మిగిలినది యాక్టిస్, అనుబంధ కంపెనీలు సొంతం చేసుకుంటాయి. మహీంద్రా వరల్డ్ సిటీస్‌లో 100 ఎకరాల వరకు ఇందుకోసం కేటాయిస్తారు. కొత్త కేంద్రాల స్థాపనతోపాటు ఇప్పటికే ఉన్న ఫెసిలిటీలను కొనుగోలు చేయాలని భాగస్వామ్య సంస్థలు నిర్ణయించాయి. బహుళజాతి, భారతీయ క్లయింట్ల నుండి గ్రేడ్–ఏ గిడ్డంగులు, తయారీ సౌకర్యాల కోసం బలమైన, వేగవంతమైన డిమాండ్‌ను చూస్తున్నామని మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ ఎండీ అరవింద్ సుబ్రమణియన్ ఈ సందర్భంగా తెలిపారు. చెన్నై, జైపూర్‌లో ఇటువంటి ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. -
లబోదిబో.. హైదరాబాద్‌లో పెరిగిపోతున్న అమ్ముడు పోని ఇళ్లు
న్యూఢిల్లీ: ప్రాపర్టీ డెవలపర్ల వద్ద అమ్ముడుపోని ఇళ్లు భారీగా ఉండిపోయాయి. సెప్టెంబర్ త్రైమాసికం చివరికి హైదరాబాద్ మార్కెట్లో 99,090 యూనిట్లు మిగిలిపోయాయి. ఇవి అమ్ముడుపోవడానికి 41 నెలల సమయం తీసుకుంటుందని అంచనా. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇలా విక్రయం కాకుండా ఉండిపోయిన ఇళ్ల యూనిట్లు 7.85 లక్షలుగా ఉన్నట్టు ప్రాప్‌టైగర్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుత అమ్మకాల తీరు ఆధారంగా చూస్తే, మిగిలిపోయిన 7.85 లక్షల ఇళ్లు విక్రయం కావడానికి 32 నెలలు పట్టొచ్చని పేర్కొంది. ‘‘ఢిల్లీ–ఎన్సీఆర్ మార్కెట్లో 1,00,770 ఇళ్ల యూనిట్లు ఉండిపోయాయి. ఇక్కడ ఆమ్రపాలి, జైపీ ఇన్ఫ్రాటెక్, యూనిటెక్ వంటి పెద్ద రియల్టీ సంస్థలు దివాలా తీయడంతో మిగిలిన ఇళ్ల యూనిట్లు పూర్తిగా అమ్ముడుపోవడానికి 62 నెలల వరకు సమయం పట్టొచ్చు’’అని ప్రాప్‌టైగర్ తెలిపింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం 2022 జూన్ నాటికి మిగిలిపోయిన ఇళ్లు 7,63,650గా ఉంటే, సెప్టెంబర్ చివరికి 7,85,260 యూనిట్లకు నిల్వలు పెరిగాయి. ఇందులో 21 శాతం ఇళ్లు ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, కోల్‌కతా, అహ్మదాబాద్, పుణె నగరాల గణాంకాలు ఈ నివేదికలో ఉన్నాయి. పట్టణాల వారీగా.. ►ఈ ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు జూలై–సెప్టెంబర్ కాలంలో 49 శాతం పెరిగి 83,220 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 55,910 యూనిట్లుగా ఉండడం గమనించాలి. ►కోల్‌కతాలో అతి తక్కువగా ఇళ్ల నిల్వలు ఉన్నాయి. ఇక్కడ 22,530 ఇళ్ల యూనిట్లు మిగిలిపోగా, వీటి విక్రయానికి 24 నెలల సమయం పట్టొచ్చని ప్రాప్ టైగర్ అంచనా వేసింది. ► అహ్మదాబాద్‌లో 65,160 యూనిట్లు ఉండగా, ఇవి పూర్తిగా అమ్ముడుపోవడానికి 30 నెలల సమయం తీసుకోవచ్చు. ►బెంగళూరులో 77,260 యూనిట్లు మిగిలి ఉన్నాయి. వీటి అమ్మకానికి 28 నెలలు తీసుకోవచ్చు. ►చెన్నైలో 32,810 యూనిట్లుగా ఉంటే, వీటి అమ్మకానికి 27 నెలల సమయం తీసుకోవచ్చని అంచనా. ► ఇక ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో 2,72,960 యూనిట్ల ఇళ్లు మిగిలిపోయాయి. వీటి అమ్మకానికి 33 నెలల సమయం పడుతుందని అంచనా. ► పుణెలో ఉన్న 1,15,310 మిగులు ఇళ్ల అమ్మకానికి 22 నెలలు సమయం తీసుకుంటుంది. ►అమ్ముడుపోని ఇళ్ల ఇన్వెంటరీ కాలం జూన్–జూలైలో 44 నెలలుగా ఉంటే, జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 32 నెలలకు తగ్గడాన్ని ప్రాప్‌టైగర్ ప్రధానంగా ప్రస్తావించింది. హౌసింగ్ డిమాండ్ పుంజుకోవడం ఇందుకు మద్దతుగా పేర్కొంది. చదవండి👉 లగ్జరీ ఇళ్ల కొనుగోలు కోసం ఎగబడుతున్న భారతీయులు! -
మీ ప్రాపర్టీస్‌పై ఎక్కువ ఆదాయం రావాలంటే గుర్తుంచుకోవలసిన విషయాలు!
దేశంలో స్థిరాస్థి మార్కెట్ పరుగులు తీస్తోంది. వరుసగా రెండేళ్ల పాటు మధ్యలో కోవిడ్-19 ఒడిదొడుకులు ఎదురైనా మళ్లీ పుంజుకుంది. వైరస్ తగ్గుముఖం పట్టి భవిష్యత్తుపై భరోసా కనిపిస్తుండటంతో క్రయ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీంతో మదుపర్లు హైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాల్లో స్థిరాస్థులైన ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల మీద పెట్టుబడులు పెడుతున్నారు. ఆ పెట్టుబడులే సురక్షితమైనవని, సమీప భవిష్యత్‌లో అవి పెరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. అందుకే స్థిరాస్థి రేట్లు పెరుగుతున్నా పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఒక వేళ మీరూ ప్రాపర్టీస్ మీద పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? ఆ ప్రాపర్టీస్ మీద పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ రిటర్న్ పొందాలని అనుకుంటున్నారా? అయితే పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకోండి. తద్వారా భవిష్యత్‌లో ఊహించని దానికంటే ఎక్కువ రిటర్న్ పొందవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లొకేషన్ మీరు ఏ ప్రాంతంలో పెట్టుబుడులు పెడుతున్నారో.. ఆ పెట్టుబడుల నుంచి ఎంత రిటర్న్స్ రావాలో నిర్ణయించేది లొకేషన్ మాత్రమే. అందుకే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉండి, ఆదాయం పొందాలనుకుంటే అభివృద్ధి అవుతున్న ప్రాంతాల్లో మాత్రమే పెట్టుబడి పెట్టండి. ఈ పెట్టుబడి ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పెట్టే పెట్టుబడికంటే తక్కువగా ఉంటుంది. సౌకర్యం కొనుగోలు దారులు షాపింగ్ క్లాంప్లెక్స్, పార్క్స్,స్కూల్స్, హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్న ఏరియాకు చెందిన ప్రాపర్టీల మీద పెట్టుబడులు పెట్టాలని అనుకుంటారు. అందుకే మీరు ప్రాపర్టీస్మీద పెట్టుబడులు పెట్టే ప్రాంతాల్లో ఈ సౌకర్యాలు ఉన్నాయా? లేవా అని చూసుకోండి. ఇప్పటికే ఈ సౌకర్యాలు ఉంటే ఇన్వెస్ట్ చేయండి. లేదంటే భవిష్యత్‌లో పైన పేర్కొన్న సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిసినా పెట్టుబడి పెట్టొచ్చు. ట్రాన్స్ పోర్ట్ ప్రాపర్టీని కొనుగోలు చేసే బయ్యర్స్ పరిగణలోకి తీసుకునే అంశం ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం ఉందా? కనెక్టివిటీ ఆప్షన్ ఉందా? అని చూసుకుంటారు. అదే ఆస్తిపై కొనుగోలుదారుడి ఆసక్తి, దాని విలువ పెరగడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీరు ప్రాపర్టీస్ మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లైతే రైల్వే స్టేషన్, విమానాశ్రయాలు, బస్టాండ్ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయండి. కమర్షియల్ ఏరియాలు మీ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న ప్రాపర్టీస్ కమర్షియల్ ఏరియాల్లో ఉంటే మంచిది. ముఖ్యంగా కార్పొరేట్ ఆఫీస్‌లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెట్టే పెట్టుబడులతో అధిక ఆదాయం పొందవచ్చు. ప్రాపర్టీస్‌ను లీజ్‌గా ఇవ్వొచ్చు. ఇళ్లైతే రెంట్‌కు ఇవ్వొచ్చు. ఇలా ప్రాపర్టీస్ మీద ఎక్కువ ఆదాయం గడించవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. -
ఇదే టార్గెట్.. రూ.12,000 కోట్ల ఆస్తులు అమ్మాల్సిందే!
న్యూఢిల్లీ: రియల్టీ రంగ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో రూ. 12,000 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేసింది. వెరసి అమ్మకాల్లో 16 శాతం వృద్ధిని ఆశిస్తోంది. దక్షిణాదిన పటిష్ట కార్యకలాపాలు కలిగిన కంపెనీ ఇటీవల ముంబై మార్కెట్లో ప్రవేశించింది. గతేడాది(2021–22) అమ్మకాల బుకింగ్స్ 90 శాతం పుంజుకున్నాయి. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 10,382 కోట్లను అధిగమించాయి. ఈ బాటలో ప్రస్తుత ఏడాదిలో కనీసం రూ. 12,000 కోట్ల విలువైన బుకింగ్స్‌ను సాధించాలని చూస్తున్నట్లు కంపెనీ సీఎండీ ఇర్ఫాన్ రజాక్ పేర్కొన్నారు. ఇంతకంటే ఎక్కువ వృద్ధినే అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అయితే వివిధ ప్రాజెక్టులను ఎంత త్వరగా అనుమతులు లభించేదీ అన్న అంశం ఆధారంగా లక్ష్యాలను చేరుకోగలమని వివరించారు. చదవండి: టెస్లా మరో ఘనత: ఆనందంలో ఎలాన్ మస్క్ -
భారీ విస్తరణ దిశలో రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్!
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ భారీ విస్తరణ దిశగా అడుగులేస్తోంది. నూతన మాల్స్ ఏర్పాటు ద్వారా రిటైల్ విభాగాన్ని అయిదేళ్లలో రెండింతలకు చేయాలని లక్ష్యంగా చేసుకుంది. రిటైల్ రంగంలో ప్రస్తుతం సంస్థ ఖాతాలో 42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 8 మాల్స్, షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి. 30 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని విభాగాల్లో కలిపి 150కిపైగా ప్రాజెక్టులను సంస్థ ఇప్పటికే పూర్తి చేసింది. అద్దె కింద 4 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. 21.5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో గృహ, వాణిజ్య భవనాల నిర్మాణానికి అవసరరమైన స్థలం కంపెనీ చేతిలో ఉంది. గృహ, కార్యాలయ ప్రాజెక్టులను సైతం కొత్తగా అభివృద్ధి చేస్తామని డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ వాటాదార్లకు ఇచ్చిన సందేశంలో వెల్లడించారు. ‘ఆఫీస్, మాల్స్ అద్దె వ్యాపారం క్రమంగా సాధారణ స్థితికి వస్తోంది. షాపింగ్ మాల్స్‌లో కస్టమర్ల రాక మహమ్మారి పూర్వ స్థాయికి స్థిరంగా చేరుతోంది’ అని వివరించారు. కాగా, నూతన బుకింగ్స్ 2021–22లో రెండింతలై రూ.7,273 కోట్లు నమోదైంది. గురుగ్రామ్, గోవాలో రెండు షాపింగ్ మాల్స్ నిర్మాణానికి రూ.2,000 కోట్లు పెట్టుబడి చేస్తున్నట్టు కంపెనీ ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. -
హైదరాబాద్‌లో చెలరేగిపోతున్న రియల్టీ,గృహ విక్రయాల్లో సరికొత్త రికార్డ్‌లు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్టీ తగ్గేదేలే అన్నట్లు చెలరేగిపోతుంది. గృహ విక్రయాలు, లాంచింగ్‌లో రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి – జూన్ (హెచ్1)లో ఇళ్ల అమ్మకాలు 11ఏళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. కరోనా కారణంగా పెరిగిన ఐటీ నియామకాలు, ఉద్యోగులలో ఆదాయ వృద్ధితో గృహ విక్రయాలు ఊపందుకున్నాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడించింది. 2022 హెచ్1లో నగరంలో 14,693 గృహాలు అమ్ముడుపోగా.. 21,356 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. ♦ నగర సిరాస్తి మార్కెట్‌కు ఆయువు పట్టు ఐటీ రంగమే. గృహాలు, ఆఫీస్ స్పేస్ ఏదైనా ఐటీ నిపుణులను లక్ష్యంగా చేసుకొనే నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌లను చేపడుతుంటాయి. వారి అభిరుచులకు అనుగుణంగా ఉండే ఇళ్ల విక్రయాలు హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి. కరోనా కారణంగా ఐటీ కంపెనీలకు విపరీతమైన ప్రాజెక్ట్‌లు వచ్చాయి. దీంతో కొత్త ఉద్యోగుల నియామకాలు పెద్ద ఎత్తున జరగడంతో వారందరూ వారి వారి బడ్జెట్లో ఇళ్లను కొనుగోలు చేశారని నైట్‌ఫ్రాంక్ హైదరాబాద్ డైరెక్టర్ శామ్సన్ ఆర్థూర్ తెలిపారు. పశ్చిమానిదే హవా.. 2021 హెచ్1తో పోలిస్తే ఈ ఏడాది హెచ్1లో గృహ విక్రయాలలో 23 శాతం, లాంచింగ్స్‌లో 28 శాతం వృద్ధి నమోదయింది. అత్యధికంగా పశ్చిమ హైదరాబాద్‌లోని ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో 9,112 యూనిట్లు అమ్ముడుపోగా.. నార్త్‌లో 2,615, సెంట్రల్లో 835, ఈస్ట్‌లో 1,363, దక్షిణంలో 768 గృహాలు విక్రయమయ్యాయి. 4.2 శాతం పెరిగిన ధరలు.. ఏడాది కాలంలో నగరంలో ప్రాపర్టీ ధరలలో 4.2 శాతం వృద్ధి నమోదయింది. ప్రస్తుతం ధర చ.అ. సగటు రూ.4,918గా ఉంది. అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) గతేడాది హెచ్1లో 11918 యూనిట్లుగా ఉండగా.. 2022 హెచ్1 నాటికి 25262లకు పెరిగాయి. వీటి విక్రయానికి 4.60 త్రైమాసికాల సమయం పడుతుంది. కోలుకుంటున్న ఆఫీస్ స్పేస్ హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ కరోనా కంటే ముందు స్థాయికి చేరుకుంటుంది. 2019 హెచ్1లో నగరంలో 38 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగగా.. ఈ ఏడాది హెచ్1 నాటికి 32 లక్షల చ.అ.లకు చేరింది. అయితే గతేడాది హెచ్1లో జరిగిన 16 లక్షల చ.అ.లతో పోలిస్తే ఇది 101 శాతం ఎక్కువ. 2015 నుంచి ఇప్పటివరకు నగరంలో అత్యధిక ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగిన అర్ధ సంవత్సరం 2019 హెచ్2నే. ఆ సమయంలో రికార్డ్ స్థాయిలో 89 లక్షల చ.అ. కార్యాలయ స్థల లావాదేవీలు పూర్తయ్యాయి. 2022 హెచ్1లో జరిగిన ఆఫీస్ స్పేస్ ట్రాన్సాక్షన్స్లో బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) విభాగానిదే పైచేయి. 2021 హెచ్1లో ఈ రంగం వాటా 12 శాతంగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా 22 శాతానికి పెరిగింది. మిగిలిన రంగాల వాటా చూస్తే ఐటీ 39 శాతం, కో–వర్కింగ్ స్పేస్ 6 శాతం, తయారీ రంగం 3 శాతం, ఇతర సేవల రంగాల వాటా 30 శాతంగా ఉన్నాయి. ♦ అదే సమయంలో కొత్త ఆఫీస్ స్పేస్ నిర్మాణాలలో కూడా వృద్ధి నమోదయింది. గతేడాది హెచ్1లో కేవలం 80 వేల చ.అ. ఆఫీస్ స్పే స్ అందుబాటులోకి రాగా.. ఈ ఏడాది హె చ్1 నాటికి 53 లక్షల చ.అ. స్థలం నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం నగరంలో చ.మీ. ఆఫీస్ స్పేస్ అద్దె రూ.63.7గా ఉంది. -
దేశంలోనే.. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఇళ్ల ధరలు తక్కువే!
ముంబై: ముంబై అధిక ఖర్చుతో కూడుకున్న మెట్రోగా, హైదరాబాద్‌ను చౌకగా ప్రవాస భారతీయులు భావిస్తున్నారు. జీవన వ్యయాలు, నివాసానికి అయ్యే వ్యయాలను పరిగణనలోకి తీసుకుని ముంబైకి ఈ రేటింగ్ ఇచ్చారు. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉంది. అంతర్జాతీయంగా చూస్తే మాత్రం ముంబై, ఢిల్లీ వ్యయాల పరంగా ఆకర్షణీయంగా ఉన్నట్టు ‘మెర్సర్స్ 2022 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే’లో తెలిసింది. అంతర్జాతీయంగా చూస్తే ముంబై ర్యాంకు 127. ఢిల్లీ 155, చెన్నై 177, బెంగళూరు 178, హైదరాబాద్ 192వ స్థానంలో ఉన్నాయి. పుణె 201, కోల్‌కతా 203 ర్యాంకుల్లో ఉన్నాయి. ఈ పట్టణాల్లో నివాస, జీవన వ్యయాలు చౌకగా ఉన్నాయని ప్రవాసులు భావిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయంగా హాంగ్‌కాంగ్ అత్యంత ఖర్చుతో కూడుకున్న నగరంగా నిలిచింది. ఆ తర్వాత జ్యురిచ్, జెనీవా, స్విట్జర్లాండ్‌లోని బాసెల్, బెర్న్, ఇజ్రాయెల్ టెల్ అవీవ్, అమెరికాలోని న్యూయార్క్, సింగపూర్, టోక్యో, బీజింగ్ నగరాలు అధిక వ్యయాలతో అగ్రస్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో మెర్సర్స్ ఈ సర్వే నిర్వహించింది. 200కు పైగా కమోడిటీల ధరలు, ఇళ్లు, రవాణా, ఆహారం, వస్త్రాలు, ఇంట్లోని వస్తువులు, వినోదానికి చేసే ఖర్చు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 227 పట్టణాలను ర్యాంకుల్లోకి తీసుకుంది. హైదరాబాద్ అనుకూలతలు ప్రముఖ బహుళజాతి కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముంబైని అత్యంత అనుకూల నగరంగా భావిస్తున్నాయి. అదే సమయంలో తక్కువ వ్యయాలు ఉండే హైదరాబాద్, చెన్నై, పుణె పట్ల కూడా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ముంబైలో అధిక వ్యయాలు ఉండడంతో.. హైదరాబాద్, చెన్నై, పుణె నగరాలు తక్కువ వ్యయాలతో ఆకర్షణీయమైన మెట్రోలుగా సర్వే పేర్కొంది. కోల్‌కతాలో జీవన వ్యయాలు తక్కువగా ఉన్నాయి. పాలు, బ్రెడ్, కూరగాయలు, పండ్లను ధరలను పరిగణనలోకి ఈ ర్యాంకులను నిర్ణయించారు. ఢిల్లీ, ముంబైలో మాత్రం వీటి ధరలు అధికంగా ఉన్నాయి. ముంబైలో అధిక వ్యయాలు ఉంటే, చెన్నై, హైదరాబాద్‌లో తక్కువగా ఉన్నాయి. సినిమా చూడాలంటే ముంబైలో చాలా ఖర్చు చేయాలి. హైదరాబాద్‌లో సినిమా చూసేందుకు చేసే ఖర్చు తక్కువ. ఇళ్ల ధరలు తక్కువ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోకి హైదరాబాద్, ఇళ్ల ధరల పరంగా చౌకగా ఉన్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. కానీ, జీవన వ్యయాలు, నివాస వ్యయాలు (ఇళ్ల అద్దెలు/ధరలు) కలిపి చూస్తే పుణె, కోల్‌కతా కంటే హైదరాబాద్ వెనుక ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో ఇళ్ల అద్దెలు దేశంలోనే అత్యంత ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ జీవన వ్యయాలు చాలా ఎక్కువ ఖర్చుతో కూడినవిగా సర్వే పేర్కొంది. చదవండి👉 తెలంగాణ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్, ఆ ప్రాంతంలోని ఇళ్లకు భారీ డిమాండ్! -
రూ.34,615 కోట్ల బ్యాంక్ స్కాం,ఎవరీ సుధాకర్ శెట్టి!
న్యూఢిల్లీ: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) రూ.34,615 కోట్ల బడా బ్యాంకింగ్ మోసం కేసుపై జరుగుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణలో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. అత్యున్నత స్థాయి వర్గాల కథనం ప్రకారం, రూ. 14,683 కోట్ల డీహెచ్ఎఫ్ఎల్ నిధుల ’మళ్లింపు’లో తొమ్మిది రియల్టీ సంస్థల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కీలక విచారణ జరుగుతోంది. అప్పటి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్, వ్యాపారవేత్త సుధాకర్ శెట్టిల నియంత్రణలో ఉన్న ఈ తొమ్మిది రియల్ ఎస్టేట్ సంస్థలు తమ బాస్‌ల ఆర్థిక ప్రయోజనాల కోసం అక్రమ మార్గాలను అనుసరించాయని సీబీఐ పేర్కొంది. తొమ్మిదిలో ఐదు సుధాకర్ శెట్టివే... తొమ్మిది రియల్టీ సంస్థల్లో ఐదు వ్యాపారవేత్త సుధాకర్ శెట్టి నియంత్రణలోనివి కావడం గమనార్హం. కంపెనీలు తీసుకున్న రుణాలు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ల ఆదేశాల మేరకు దారిమళ్లినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. 2010–2018 మధ్య కాలంలో రూ. 42,871 కోట్ల మేర రుణాలను మంజూరు చేసిన 17 బ్యాంకుల కన్సార్టియంకు నేతృత్వం వహిస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నుండి వచ్చిన ఫిర్యాదుపై జూన్ 20వ తేదీన కేసు నమోదయ్యింది. కేసు నమోదయిన తర్వాత సీబీఐకి చెందిన దాదాపు 50 మందికిపైగా అధికారుల బృందం బుధవారం ముంబైలోని 12 ప్రాంగణాల్లో విస్తృత సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. డీహెచ్ఎఫ్ఎల్ మొత్తం కుంభకోణం రూ.34,615 కోట్లుగా సీబీఐ అధికారులు తెలిపారు. దీనిప్రకారం, ఇంత స్థాయిలో బ్యాంకింగ్ మోసం కేసుపై సీబీఐ విచారణ జరగడం ఇదే తొలిసారి. వాధ్వాన్ ద్వయం ఇతరులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడి, వాస్తవాలను తప్పుగా చూపించి దాచిపెట్టారని, నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడ్డారని బ్యాంక్ తన ఫిర్యాదులో పేర్కొంది. మే 2019 నుండి రుణం తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్ కావడం ద్వారా కన్సార్టియంను రూ. 34,614 కోట్ల మేర మోసగించడానికి కుట్ర జరిగిందని వివరించింది. -
రియల్ ఢమాల్..హైదరాబాద్‌లో అమ్ముడవ్వని ఇళ్లు! అసలు కారణమిదే!
సాక్షి, సిటీబ్యూరో: స్థిరాస్తి రంగం మందగించింది. రెండేళ్లుగా ఊపు మీద ఉన్న రియల్టీ.. ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. ముఖ్యంగా ఐటీ, రీజినల్ రింగ్ రోడ్డు పేర భారీగా సాగిన భూముల అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. కరోనా మహమ్మారి కారణంగా ఏడాది పాటు స్థిరాస్తి రంగం స్తబ్ధుగా ఉన్నా.. ఆ తర్వాత గణనీయంగా పుంజుకుంది. మునుపెన్నడూ లేని రీతిలో స్థలాల అమ్మకాలు సాగిపోయాయి. ఇతర వ్యాపార రంగాలు కుదేల్ కావడంతో పెట్టుబడికి రియల్టీ రంగమే మంచిదనే భావనతో సామాన్య, మధ్యతరగతి మొదలు కార్పొరేట్ సంస్థలు భూముల వైపు కన్నేశాయి. దీంతో భూముల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. సాధారణ ప్రజలకు అందనంత దూరంలో ప్లాట్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలో రియల్ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగింది. ఈ క్రమంలో.. కరోనా ప్రభావం, రష్యా– ఉక్రెయిన్ యుద్ధం మొదలు, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం, నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల, రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కడం, రిజిస్ట్రేషన్ ధరల పెంపు తదితర కారణాలు స్థిరాస్తి రంగంలో ఒడిదొడుకులకు కారణంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి మరో రెండేళ్ల వరకు ఉండే అవకాశం లేకపోలేదని రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు. శివార్లలో రయ్ రయ్.. కరోనా నేర్పిన చేదు అనుభవాల దృష్ట్యా చాలా మంది నగర శివార్లలో సొంతింటి వైపు మొగ్గు చూపారు. దీంతో శివార్లలో ధరలు ఆకాశాన్నంటాయి. భూములమ్ముకున్న రైతులు ప్రాంతీయ రహదారి అలైన్మెంట్ పరిసర ప్రాంతాల్లో తమ పెట్టుబడులను మళ్లించారు. ఇదే అదనుగా ఆయా ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారులు భూముల విలువలను నాలుగైదు రెట్లు పెంచేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో కొనుగోలుదారులు వేచిచూసే ధోరణిని అవలంబిస్తుండటంతో యజమానులు లబోదిబోమంటున్నారు. అగ్రిమెంట్ గడువు ముగుస్తున్నా.. కొనే వారు రాకపోవడంతో కొన్న రేట్లకే అమ్మేందుకు ముందుకు వస్తున్నారు. అయినా, ఆసక్తి చూపించకపోవటంతో ఆకాశం వైపు చూస్తున్నారు. ఎన్నికల మూడ్.. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో డెవలపర్లు, పెట్టుబడిదారుల్లో ఎన్నికల మూడ్ వచ్చేసింది. కొంతమంది డెవలపర్లకు స్థానిక రాజకీయ నాయకులతో ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగా నిధులను ఏర్పాటు చేస్తుంటారు. దీంతో ఆయా డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభించడం కంటే చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లను విక్రయించడం మీదే దృష్టిసారిస్తున్నారు. దీంతో బల్క్ ల్యాండ్స్ కొనుగోళ్లు తగ్గాయని ఓ డెవలపర్ తెలిపారు. అందుకే బల్క్ ల్యాండ్ డీల్స్ పూర్తిగా క్షీణించాయని చెప్పారు. నిన్న కిటకిట.. నేడు కటకట నిన్నమొన్నటి వరకు పశ్చిమ హైదరాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కిటకిటలాడాయి. ఎప్పుడైతే 111 జీవోను ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అప్పట్నుంచి రిజిస్ట్రేషన్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు రాష్ట్రంలో నెలకొన్ని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల వాతావరణంలోకి పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు వెళ్లిపోయారు. దీంతో ఈ ప్రాంతాలలో రిజిస్ట్రేషన్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయని గండిపేట సబ్ రిజిస్ట్రార్ సహదేవ్ తెలిపారు. 111 జీవోపై ఎలాంటి అంక్షలు ఉంటాయనే స్పష్టత కోసం కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు. ఇక్కడ రూ.కోటి పెట్టి అపార్ట్మెంట్ కొనేబదులు.. కొంచెం దూరం వెళ్లి అదే ధరకు విల్లా కొనుగోలు చేయవచ్చనే అభిప్రాయం కస్టమర్లలో ఏర్పడింది. మార్చిలో 1,513 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగగా.. ఏప్రిల్‌లో 1,247, మేలో 1,234 అయ్యాయని తెలిపారు. -
హైదరాబాద్‌లో తిరుగులేని రికార్ట్! ఒక్కరోజులోనే 1,125 సయూక్ ఫ్లాట్ల అమ్మకాలు!
ప్రముఖ నిర్మాణ సంస్థ మైహోం అరుదైన ఫీట్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రియల్టీ సెక్టార్లో ఇంత వరకు ఏ సంస్థకు సాధ్యం కానీ రికార్డును క్రియేట్ చేసింది. ఈ సంస్థ నూతనంగా ప్రారంభించిన మైహోం సయూక్ ప్రాజెక్ట్‌లో కనీవినీ ఎగురని స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. అమ్మకాలు ఆరంభమైన 24 గంటల వ్యవధిలోనే 1,125 ప్లాట్స్ బుక్ అయ్యాయి. వీటి విలువ రూ.1800 కోట్లు ఉంటుందని మైహోం సంస్థ తెలిపింది. తన రికార్డులు తానే రియల్టీలో మైంహోంకి ప్రత్యేక స్థానం ఉంది. 2016లో ఈ గ్రూపు నుంచి మైహోం అవతార్ ప్రాజెక్టును ప్రారంభిచారు. ఆ రోజుల్లో కేవలం 24 గంటల్లోనే వెయ్యికి పైగా ప్లాట్స్ బుక్ అవడం రికార్డుగా నిలిచింది. గడిచిన ఆరేళ్లుగా ఇదే సింగిల్ డే హయ్యస్ట్ బుకింగ్స్ రికార్డుగా కొనసాగుతోంది. తాజాగా సయూక్ 1,125 బుక్సింగ్స్‌తో అవతార్‌ను అధిగమించింది. రియల్టీలో తాను నెలకొల్పిన రికార్డులను తానే బ్రేక్ చేసింది మైహోం. నమ్మకానికి మరో పేరైన హైహోం ప్రారంభించిన ప్రాజెక్టులో ప్లాట్లు సొంతం చేసుకునేందుకు ప్రజలు పోటీ పడటంతో ఈ రికార్డు సాధ్యమైంది. లగ్జరీకి కొత్త నిర్వచనం టీఎస్ రేరా నుంచి అన్ని అనుమతులు తీసుకుని మైహోం, ప్రతిమ గ్రూపులు సంయుక్తగా 25.37 ఎకరాల విస్తీర్ణంలో సయూక్ ప్రాజెక్టును చేపడుతున్నాయి. ప్రీమియం లైఫ్‌స్టైల్ అపార్ట్మెంట్లను దశల వారీగా నిర్మిస్తూ టౌన్షిప్ స్థాయిలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. ప్రాజెక్ట్ సయూక్‌లో 2 బీహెచ్‌కే, 2.5 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇవి 1355 చదరపు అడుగుల నుంచి 2262 చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మాణం జరుపుకోబోతున్నాయి. మొత్తంగా 40 అంతస్థులతో నిర్మితమవుతున్న సయూక్‌లో లక్ష చదరపు అడుగుల క్లబ్ హౌజ్‌తో పాటు ఇతర లగ్జరీ సౌకర్యాలు కల్పించబోతున్నారు. మొత్తం 12 టవర్లలుగా నిర్మాణం జరుపుకుంటున్న సయూక్‌లో ప్రస్తుతం 6 టవర్లకు సంబంధించి బుకింగ్స్ మొదలయ్యాయి. ఒక్కసారి ఈ ప్రాజెక్టు పూర్తయితే లగ్జరీ లివింగ్ విత్ వాక్ టూ వర్క్ కల్చర్‌కి సరికొత్త నిర్వచనం ఇవ్వగలదు. వారి నమ్మకం వల్లే కష్టమర్లకు మా మీద ఉన్న అంచంచలమైన నమ్మకానికి ప్రతిరూపమే ఈ రికార్డు స్థాయి బుకింగ్స్‌కి కారణమని మైహోం గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ జూపల్లి శ్యామ్‌రావు అన్నారు. తొలి రోజు రికార్డు స్థాయి అమ్మకాల పట్ల సంతోషంగా ఉందని చెబుతూనే.. ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన గడువులోగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలో నిర్మించిన ఇళ్లను కష్టమర్లకు అందిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు తెలిపారు శ్యామ్‌రావు. అదే విధంగా మైహోం చైర్మన్ డాక్టర్ రామేశ్వర్రావు, ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్న ప్రతిమా గ్రూపు చైర్మన్ ఎం శ్రీనివాస్‌రావులతో పాటు మైహోం కస్టమర్లకు, ఎంతో శ్రమించి పని చేస్తున్న తమ సంస్థ ఉద్యోగులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. (అడ్వర్టోరియల్) -
వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉద్యోగులు, రాకెట్ వేగంతో పెరుగుతున్న ఇళ్ల ధరలు!
ప్రపంచ దేశాల్లో ఆయా రంగాలకు చెందిన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి విధులు నిర్వహిస్తున్నారు. కోవిడ్ కారణంగా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించడంతో ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై పడింది. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో హౌసింగ్ మార్కెట్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్ (ఎన్‌బీఈఆర్) ప్రకారం.. 2019 నుంచి నవంబర్ 2021 వరకు సేకరించిన డేటాలో 42.8శాతం మంది అమెరికన్ ఉద్యోగులు పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ వర్క్ ఫ్రమ్ నుంచే పనిచేస్తున్నారు. అదే సమయంలో శాస్వతంగా ఇంటి వద్ద నుంచి పనిచేయడం కనిపిస్తోంది. అయితే అదే (2019-2021) సమయంలో అమెరికాలో రికార్డ్ స్థాయిలో ఇళ్ల రేట్లు పెరిగాయి. వేగంగా ఇళ్ల రేట్లు 23.8శాతం పెరగడంతో ఇళ్లకు భారీ ఎత్తున డిమాండ్ ఏర్పడింది. డిమాండ్ తో ఇళ్ల ధరలు, ఇళ్ల రెంట్లు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయి. రెడ్ ఫిన్ ఏం చెబుతుంది రెడ్ ఫిన్ డేటా సైతం అమెరికా వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఫిభ్రవరిలో ఆన్లైన్లో 32.3శాతం మంది తాము ఉంటున్న ప్లేస్ నుంచి మరో ప్లేస్‌కు మారేందుకు కొత్త ఇళ్లకోసం వెతికారని నివేదించింది. వారి సంఖ్య 2019లో 26శాతం ఉండగా 2021 తొలి క్యూ1లో వారి సంఖ్య 31.5శాతానికి పెరిగింది. ఇక ఇళ్లు షిప్ట్ అయ్యే వారిలో అమెరికాలో మియామి,ఫియోనిక్స్ తో పాటు పలు ప్రాంతాల ప్రజలు రీలొకేట్ అయినట్లు రెడ్‌ఫిన్ తన నివేదికలో ప్రస్తావించింది. -
తక్కువ ధరకే ప్రభుత్వ ఫ్లాట్లు,రాజీవ్ స్వగృహ ఇళ్ల కోసం ఎగబడుతున్న జనం!
తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ ఇళ్లను సేల్కు పెట్టింది. గతంలో కట్టిన ఇళ్లను అమ్మేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. తక్కువ ధరకే ఫ్లాట్లు అమ్మకానికి రావడంతో.. వాటిని సొంతం చేసుకునేందుకు కొనుగోలు దారులు పోటీపడుతున్నారు. ప్రభుత్వ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం..బండ్లగుడాతో పాటు పోచారంలోని రాజీవ్ స్వగృహ ప్లాట్ల అమ్మకానికి ఈనెల11న హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఫ్లాట్ల అమ్మకపు నోటిఫికేషన్‌కు ఊహించని రీతిలో రెస్సాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లాట్ల ధర తక్కువ కావడంతో మే 12నుంచి ప్రారంభమైన అప్లికేషన్ల రిజిస్ట్రేషన్లు మే 23 వరకు 3వేల ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు 14వేల మంది అప్లయ్ చేశారు. ఈ అప్లికేషన్ల సంఖ్య 20రోజుల్లో 30వేలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 3,271 ఫ్లాట్లు హైదరాబాద్ బండ్లగూడలో 1501 ఫ్లాట్లు, గట్కేసర్ సమీపంలో ఉన్న పోచారంలో 1470 ఫ్లాట్లను అమ్మకానికి పెట్టింది.వచ్చే నెల 14వ తేదీన గడువు ముగుస్తుండడంతో ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు భారీ ఎత్తున అప్లయ్ చేస్తున్నారు. లాటరీ సిస్టమ్‌లో స్వగృహ ఫ్లాట్లను అమ్మకానికి పెట్టిన ప్రభుత్వం..లాటరీ ద్వారా వివిధ ఫ్లాట్ల స్కైర్ ఫీట్ విలువ ఎంతనేది ఫైనల్ చేయనుంది. ఇందుకోసం ఒక వ్యక్తి రూ.1000 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉండగా..లాటరీలో కార్నర్ ఫ్లాట్ల కొనుగోలు దారుల కుటుంబ సభ్యులు, వారి బంధువులతో పాటు ఉద్యోగులు సైతం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.కాగా పెండింగ్‌లో ఫ్లాట్ల పనులను త్వరగా పూర్తి చేసి రీసేల్ పెట్టే అవకాశం ఉందని, అదృష్టం ఉంటే రీసేల్‌లో సైతం ఫ్లాట్లను సొంతం చేసుకోవచ్చు. స్వగృహా ఫ్లాట్లును ఎక్కడ ఎక్కువగా కొంటున్నారంటే ఓఆర్ఆర్, నాగోల్ మెట్రోస్టేషన్, సిటీ దగ్గర్లో ఉండడంతో పోచారం కంటే బండ్లగూడ స్వగృహలో ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు మక్కువ చూపుతున్నారు. కాబట్టే 14వేల అప్లికేషన్లలో 12వేల మంది బండ్లగూడ ఫ్లాట్లపై మక్కువ చూపుతుంటే కేవలం 2వేల మంది మాత్రమే పోచారం ఫ్లాట్లను సొంతం చేసుకునేందుకు అప్లికేషన్లు పెట్టుకున్నారు. బండ్లగూడా స్వగృహా ఫ్లాట్లు ఎన్నంటే మే 23 వరకు బండ్లగూడాలో 345..3బీహెచ్‌కే డీలెక్స్ ఫ్లాట్లను, 444..3బీహెచ్‌కే ఫ్లాట్లను,712..2బీహెచ్‌కే స్వగృహా ఫ్లాట్ల కోసం అప్లికేషన్లు వచ్చాయి. పోచారం స్వగృహా ఫ్లాట్లు ఎన్నంటే మే 23 వరకు పోచారంలో 91..3బీహెచ్‌కే డీలెక్స్ ఫ్లాట్లు, 53..3బీహెచ్‌కే ఫ్లాట్లు, 884..2బీహెచ్‌కే ఫ్లాట్లు, 442..1బీహెచ్‌కే ఫ్లాట్ల కోసం అప్లికేషన్లు వచ్చాయి. -
పిల్లల కోసం అదిరిపోయే లగ్జరీ ఇళ్లు..హైదరాబాద్‌లో ఎక్కడో తెలుసా!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్ కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఆర్క్ గ్రూప్ మరో సరికొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. పిల్లలలో మానసిక, శారీరక ఎదుగుదలకు దోహదపడేలా వెంచర్ డిజైన్‌ను రూపొందించింది. ఇంటర్నేషనల్ స్కూల్స్, ఆసుపత్రులు, షాపింగ్ కేంద్రాలకు నిలయంగా ఉన్న బాచుపల్లిలో సంయక్ పేరిట ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. 1.9 ఎకరాలలో రానున్న ఈ ప్రాజెక్ట్‌లో రెండు టవర్లు, ఒక్కోటి పదంతస్తుల్లో ఉంటుంది. మొత్తం 160 ఫ్లాట్లుంటాయి. 1,315 నుంచి 1,760 చ.అ. మధ్య 2, 2.5, 3 బీహెచ్‌కే విస్తీర్ణాలుంటాయి. 7,250 చ.అ. విస్తీర్ణంలో నాలుగు అంతస్తులలో క్లబ్‌హౌస్ ఉంటుంది. ఈ సందర్భంగా ఆర్క్ గ్రూప్ సీఎండీ గుమ్మి రాంరెడ్డి మాట్లాడుతూ.. నాణ్యత, భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. కామన్ ఏరియాలలో సౌర శక్తితో నడిచే ఉత్పత్తులను వినియోగించాం. ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ స్టేషన్లు, విద్యుత్‌ను ఆదా చేసే లైటెనింగ్ ఫిక్చర్లను అందుబాటులో ఉంచామని’ వివరించారు. సంయక్ ప్రాజెక్ట్‌కు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గోల్డ్ రేటింగ్ పొందిందని తెలిపారు. పిల్లలు వైట్ పేపర్లాంటోళ్లు.. అనంతరం సీఈఓ గుమ్మి మేఘన మాట్లాడుతూ.. వైట్ పేపర్‌పై అందమైన కళాకృతులను తీర్చిదిద్దాలంటే అందమైన క్రెయాన్స్ లేదా రంగులు ఉండాలి. అలాగే చిన్నతనం నుంచే పిల్లలలో మానసిక ఎదుగుదలకు అనుమైన సదుపాయాలు, మౌలిక వసతులను కల్పిస్తే అద్బుతాలు సృష్టిస్తారని తెలిపారు. అలాగే చిన్నారుల రక్షణ కోసం అన్ని రకాల సాంకేతిక భద్రతా ఏర్పాట్లుంటాయి. స్విమ్మింగ్ పూల్ అలారం, సేఫ్టీ ఎలక్ట్రిక్ సాకెట్, రౌండ్ కార్నర్ వాల్స్, గేమింగ్ ల్యాండ్ స్కేప్, కిడ్స్ ప్లే సెంటర్, కిడ్స్ అవుట్డోర్ జిమ్, బెడ్రూమ్, బాత్రూమ్లలో సెన్సార్లు, వినైల్ ఫ్లోర్ వంటివి ఏర్పాట్లుంటాయని వివరించారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్లంబింగ్ పిక్చర్స్ వంటి వసతులు కూడా ఉంటాయి. చదవండి: హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు..ఎక్కువగా ఇళ్లు కొంటున్న ప్రాంతాలివే! -
ఈ హైవేలో ఎకరం ధర రూ.1.5కోట్లు..!
సాక్షి, హైదరాబాద్: ఇండిపెండెంట్ రియల్ ఎస్టేట్ అడ్వైజరీ అనరాక్ గ్రూప్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లోని భల్లబ్ఘడ్-సోహ్నా హైవేలో 41 ఎకరాల డీల్‌ను క్లోజ్ చేసింది. ఈ స్థలంలో పార్ధోస్ లాజిస్టిక్స్ 10 లక్షల చదరపు అడుగులు (చ.అ.) విస్తీర్ణంలో గ్రేడ్-ఏ వేర్హౌస్ను అభివృద్ధి చేయనుంది. ప్రస్తుతం ఈ హైవేలో ఎకరం ధర రూ.1.4 నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఉంది. ఈ సందర్భంగా అనరాక్ క్యాపిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అక్షయ్ ఉదయ్ మాట్లాడుతూ.. ఢిల్లీకి చెందిన పెట్టుబడిదారుల బృందం నుంచి సేకరించిన రూ.200 కోట్ల పెట్టుబడులతో 18 నెలల్లో వేర్హౌస్ను డెవలప్ చేయనున్నారని తెలిపారు. భల్లబ్ఘడ్-సోహ్నా హైవే గత రెండేళ్లలో గిడ్డంగుల మార్కెట్‌గా అభివృద్ధి చెందిందన్నారు. చదవండి: ఛాఛా!! ఆ పిచ్చిపని చేయకపోతే మరో వెయ్యికోట్లు సంపాదించే వాడిని: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా -
పెరిగిపోతున్న అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య, హైదరాబాద్‌లో ఎన్ని గృహాలు ఉన్నాయంటే!
సాక్షి, హైదరాబాద్: దేశంలో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) పెరిగింది. 2021 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నాటికి ఇన్వెంటరీ 4% మేర పెరిగిందని ప్రాప్‌టైగర్.కామ్ సర్వేలో తేలింది. గతేడాది మార్చి నాటికి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 7,05,344 గృహాల ఇన్వెంటరీ ఉండగా..ఈ ఏడాది మార్చి నాటికి 7,35,852కి పెరిగిందని తెలిపింది. ఇన్వెంటరీ అత్యధికంగా ముంబైలో 35% ఉండగా.. పుణేలో 16% మేర ఉన్నాయి. కాగా.. గృహాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో గతేడాది ఇన్వెంటరీ విక్రయానికి 47 నెలల సమయం పట్టగా.. ఈ ఏడాది మార్చి ఇన్వెంటరీకి 42 నెలల సమయం పడుతుంది. నగరాల వారీగా అమ్ముడుపోకుండా ఉన్న గృహాల సంఖ్యను చూస్తే.. హైదరాబాద్‌లో 73,651 యూనిట్లున్నాయి. వీటి విక్రయానికి 42 నెలల సమయం పడుతుంది. అహ్మదాబాద్‌లో 62,602 గృహాలు, బెంగళూరులో 66,151, చెన్నైలో 34,059, ఢిల్లీ–ఎన్సీఆర్లో 1,01,404, కోల్‌కతాలో 23,850, ముంబైలో 2,55,814 గృహాల ఇన్వెంటరీ ఉంది. చదవండి: లబోదిబో! హైదరాబాద్‌లో ఇళ్లు అమ్ముడుపోని ప్రాంతాలివే! -
దేశంలోనే అత్యంత సంపన్నులు! తెలుగులో రియల్ ఎస్టేట్ కింగ్‌లు ఎవరంటే!
న్యూఢిల్లీ: డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. రూ.61,220 కోట్ల సంపద ఆయనకు ఉన్నట్టు ‘గ్రోహ్ హరూన్ ఇండియా రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్’ ఐదో ఎడిషన్ తెలిపింది. మాక్రోటెక్ డెవలపర్స్ (లోధా) ప్రమోటర్ ఎంపీ లోధా రూ.52,970 కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. రియల్టీలోని టాప్ 100 సంపన్నుల వివరాలతో ఈ నివేదిక రూపొందించింది. రియల్టీ వ్యాపారాల్లో వాటాల ఆధారంగా 2021 డిసెంబర్ 31 నాటికి ఉన్న వివరాలను పరిగణనలోకి తీసుకుంది. టాప్ –10లో వీరు.. ►డీఎల్ఎఫ్ రాజీవ్ సింగ్ సంపద 2021లో 68% పెరిగింది. ► ఎంపీ లోధా, ఆయన కుటుంబ సభ్యుల సంపద 20 శాతం పెరిగింది. ► కే రహేజా కార్ప్‌నకు చెందిన చంద్రు రహేజా, ఆయన కుటుంబ సభ్యుల సంపద రూ.26,290 కోట్లుగా ఉంది. వీరు 3వ స్థానంలో ఉన్నారు. ► ఎంబసీ గ్రూపు ప్రమోటర్ జితేంద్ర విర్వాణి రూ.23,620 కోట్లతో 4వ స్థానంలో నిలిచారు. ►ఒబెరాయ్ రియల్టీ అధినేత వికాస్ ఒబెరాయ్ రూ.22,780 కోట్లు, నిరంజన్ హిరనందాని (హిరనందన్ కమ్యూనిటీస్) రూ.22,250 కోట్లు, బసంత్ బన్సాల్ అండ్ ఫ్యామిలీ (ఎం3ఎం ఇండియా) రూ.17,250 కోట్లతో వరుసగా తర్వాతి స్థానాలో ఉన్నారు. ►రాజా బగ్మానే (బగ్మానే డెవలపర్స్) రూ.16,730 కోట్లు, జి.అమరేందర్ రెడ్డి, ఆయన కుటుంబం రూ.15,000 కోట్లు, రున్వా ల్ డెవలపర్స్‌కు చెందిన సుభాష్ రున్వాల్ అండ్ ఫ్యామిలీ రూ.11,400 కోట్లతో ఈ జాబితాలో టాప్–10లో చోటు సంపాదించుకున్నారు. ►14 పట్టణాల నుంచి 71 కంపెనీలకు చెందిన 100 మంది ఈ జాబితాలో ఉన్నారు. ►జాబితాలోని 81 శాతం మంది సంపద 2021లో పెరిగింది. 13% మంది సంపద తగ్గింది. కొత్తగా 13 మంది జాబితాలోకి వచ్చారు. తెలుగులో రియల్టీ కుబేరులు ఎవరంటే -
హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఇళ్లు, హైదరాబాద్‌లో రియల్ బూమ్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త జోష్ మొదలైంది. కరోనా తర్వాతి నుంచి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న లేదా ఏడాదిలోపు నిర్మాణం పూర్తయ్యే గృహాల కొనుగోళ్లకు మక్కువ చూపిన కొనుగోలుదారులు.. క్రమంగా కొత్త గృహాల వైపు మళ్లారు. లాంచింగ్ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరహా ట్రెండ్‌లో భాగ్యనగరంలోనే ఎక్కువగా ఉంది. దీంతో గతేడాది నగరంలో 25,410 యూనిట్లు అమ్ముడుపోగా.. ఇందులో 55 శాతం ఇళ్లు కొత్తగా ప్రారంభమైనవే. తుది గృహ కొనుగోలుదారులతో పాటు పెట్టుబడిదారులలో విశ్వాసం పెరగడమే లాంచింగ్ ప్రాజెక్ట్స్‌లో విక్రయాల వృద్ధికి కారణమని అనరాక్ నివేదిక వెల్లడించింది. తాత్కాలికంగా విరామం వచ్చిన కొత్త గృహాలకు డిమాండ్ మళ్లీ పుంజుకుంది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో గతేడాది 2.37 లక్షల యూనిట్లు అమ్ముడుపోగా.. ఇందులో 34 శాతం కొత్తగా ప్రారంభమైన ఇళ్లే. 2020లో ఈ తరహా గణాంకాలు పరిశీలిస్తే.. 1.38 లక్షల యూనిట్లు అమ్ముడుపోగా.. కొత్త గృహాల వాటా 28 శాతంగా ఉంది. అలాగే 2019లో 2.61 లక్షల ఇళ్లు విక్రయం కాగా.. వీటి వాటా 26 శాతంగా ఉంది. ఈ తరహా విక్రయాలు అత్యధికంగా హైదరాబాద్‌లోనే జరిగాయి. గతేడాది నగరంలో 25,410 యూనిట్లు సేల్ కాగా.. 55 శాతం కొత్త గృహాలే అమ్ముడుపోయాయి. అలాగే 2019లో 16,590 ఇళ్లు విక్రయం కాగా వీటి వాటా 28 శాతంగా ఉంది. అత్యల్పంగా ముంబైలో 2021లో 76,400 యూనిట్లు అమ్ముడుపోగా.. కొత్త గృహాల వాటా 26 శాతంగా ఉంది. ఈ ట్రెండ్ మంచిదేనా? గత 3–4 ఏళ్లలో నివాస సముదాయాలలో పెట్టుబడుల నుంచి నిష్క్రమించిన ఇన్వెస్టర్లు.. వాణిజ్యం, రిటైల్, గిడ్డంగుల వంటి ఇతర విభాగాలలో పెట్టుబడులపై దృష్టిసారించారు. వారంతా తిరిగి రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్లపై ఫోకస్ పెట్టారు. ఇదే సమయంలో లిస్టెడ్, బ్రాండెడ్ డెవలపర్లు భారీ స్థాయిలో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తున్నారు. దీంతో గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 2.37 లక్షల యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. గడువులోగా నిర్మాణం పూర్తి చేయగల సామర్థ్యం ఉన్న డెవలపర్ల ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో 2015లో 41:59గా ఉండే బ్రాండెడ్–నాన్ బ్రాండెడ్ డెవలపర్ల విక్రయాల నిష్పత్తి.. 2021 నాటికి 58:42కి పెరిగింది. గృహ విభాగంలోకి పెట్టుబడిదారులు చేరడం విక్రయాల పరంగా శుభపరిణామమే అయినా తుది కొనుగోలుదారులు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. ఎందుకంటే ఇన్వెస్టర్లు చేరిన చోట ధరలు వేగంగా పెరుగుతాయని చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. ఇతర నగరాల్లో.. గతేడాది ముంబైలో 76,400 గృహాలు అమ్ముడుపోగా.. కొత్త గృహాల వాటా 26 శాతంగా ఉంది. అలాగే ఎన్సీఆర్లో 40,050 ఇళ్లు విక్రయం కాగా వీటి వాటా 30 శాతం, చెన్నైలో 12,530 గృహాలు సేలవగా లాంచింగ్ యూనిట్ల వాటా 34 శాతం, కోల్‌కతాలో 13,080 ఇళ్లు అమ్ముడుపోగా.. వీటి వాటా 34 శాతం, బెంగళూరులో 33,080 యూనిట్లు విక్రయం కాగా.. కొత్త ఇళ్ల వాటా 35 శాతం, పుణేలో 35,980 ఇళ్లు అమ్ముడు పోగా.. లాంచింగ్ యూనిట్ల విక్రయాల వాటా 39 శాతంగా ఉంది. చదవండి: మీరు కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త!! -
రంగారెడ్డి జిల్లాలో మళ్లీ ఊపందుకున్న రియల్ రంగం
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలో రియల్ రంగం మళ్లీ ఊపందుకుంది. కోవిడ్ ఉధృతి, వరుస లాక్డౌన్ల కారణంగా కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న రియల్ వ్యాపారం క్రమంగా పుంజుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఆగస్టు 31 వరకు జిల్లాలో జరిగిన రిజి్రస్టేషన్లు, వాటి ద్వారా ప్రభుత్వానికి సమకూరిన ఆదాయాన్ని పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతుంది. ఈ ఐదు మాసాల్లో 95,049 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, భూ క్రయవిక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.1,088 కోట్ల ఆదాయం సమకూరింది. అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక భూ క్రయవిక్రయాలు జరిగిన జిల్లాల్లో రంగారెడ్డే టాప్‌లో ఉండటం గమనార్హం. ఆ తర్వాత స్థానంలో మేడ్చల్ ఉంది. కోవిడ్‌లోనూ పెట్టుబడుల వరద ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ అనుబంధ రంగాలపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపింది. అనేక సంస్థలు సంక్షోభంలో కూరుకుపోయాయి. లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధి అవకాశాలను కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఈ క్లిష్ట సమయంలోనూ రంగారెడ్డి జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులు వెల్లువెత్తాయి. తక్కువ ధరకే కావాల్సినంత భూమిని ప్రభుత్వం సేకరించి ఇస్తుండటం, ప్రత్యేక పారిశ్రామిక వాడల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, 24 గంటల కరెంట్ సరఫరా, సబ్సిడీ, పన్నుల నుంచి మినహాయింపు, రక్షణ పరంగా ఈ ప్రాంతం అనుకూలంగా ఉండటంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. టాటా, పీ అండ్ జీ, విప్రో, పోకర్ణ గ్రానైట్స్, ప్రీమియర్ ఎనర్జీస్, చిర్పాల్ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఇటీవల ముందుకు వచ్చాయి. గతంలో వ్యవసాయ భూములు ఎస్ఆర్ఓ కార్యాలయాల్లో జరుగుతుండేవి. ప్రస్తుతం ధరణి రాకతో తహసీల్దార్ కార్యాలయాల్లోనూ భూముల రిజి్రస్టేషన్ల ప్రక్రియ సులభతరమైంది. భూముల ధరలను కూడా ఇటీవల ప్రభుత్వం సవరించింది. స్టాంప్ డ్యూటీని 6 నుంచి 7.5 శాతానికి పెంచింది. ఫలితంగా 2019తో పోలిస్తే ఈ సారి రిజి్రస్టేషన్ డాక్యుమెంట్ల సంఖ్య తగ్గినా.. స్టాంప్‌డ్యూటీ పెంపుతో ప్రభుత్వానికి ఆదాయం రెట్టింపు స్థాయిలో రావడం విశేషం. మచ్చుకు కొన్ని సంస్థలు జిల్లాలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా ఔటర్ రింగ్‌రోడ్డు ఉండటం పారిశ్రామిక వేత్తలకు కలసి వచి్చంది. మౌలిక సదుపాయాలతో పాటు మానవ వనరులు కూడా చాలా తక్కువ ధరకే లభిస్తుండటంతో ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు కూడా జిల్లాపై దృష్టి సారించాయి. అంతర్జాతీయ కంపెనీలకు సమీపంలో ఆకర్షణీయంగా రియల్ వెంచర్లు చేసి క్రయవిక్రయాలు జరిపిస్తున్నారు. ఫలితంగా జిల్లాలోని రైతుల భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు రావడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు భారీగా కాసులు వచ్చి చేరుతున్నాయి. ► ప్రముఖ బహుళజాతి కంపెనీ అమేజాన్ కందుకూరు మండలం మీర్ఖాన్పేట్, షాబాద్, చందనవెల్లి, యాచారంలోని మేడిపల్లిలో డాటా సెంటర్లను ఇప్పటికే ఏర్పాటు చేసింది. ► ఇబ్రహీంపట్నం సమీపంలో 19,333 ఎకరాల్లో రూ.64 వేల కోట్ల వ్యయంతో ఫార్మాసిటీ వస్తుంది. దీని ద్వారా 1.70 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ►శంకర్పల్లి కొడకల్ వద్ద రూ.800 కోట్లతో మేధా ఆధ్వర్యంలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటవుతోంది. ►అబ్ధుల్లాపూర్‌మెట్ బాటసింగారంలో రూ.35 కోట్ల వ్యయంతో 40 ఎకరాల్లో, ఇబ్రహీంపట్నంలోని మంగల్‌పల్లిలో 22 ఎకరాల్లో రూ.20 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. ►ఇప్పటి వరకు టీఎస్ఐపాస్ కింద రూ.19,0028 కోట్ల పెట్టుబడితో 892 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటిలో 2.92 లక్షల మందికి ఉపాధి లభించింది. మరో రూ.3,971 కోట్ల పెట్టుబడి తో 11 భారీ పరిశ్రమలు రాబోతున్నాయి. వీటి ద్వారా 7,460 మందికి ఉపాధి లభించనుంచనుంది. -
రియల్ ఎస్టేట్ రంగంలోకి 1,000 కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో(క్యూ1) హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ రియల్ ఎస్టేట్ రంగంలోకి 143 మిలియన్ డాలర్లు(రూ.1,000 కోట్లు), నివాస విభాగంలోకి 11 (రూ.80 కోట్లు) మిలియన్ డాలర్ల ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఎన్సీఆర్ నగరాల్లో 3.15 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగగా.. మన నగరంలో 18 లక్షల చ.అ. రెండు ప్రధాన ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది. 2011 జనవరి నుంచి 2021 మార్చి మధ్య కాలంలో హైదరాబాద్ రియల్టీలోకి 16 డీల్స్ ద్వారా 2,866 మిలియన్ డాలర్ల పీఈ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. 2021 క్యూ1లో దేశవ్యాప్తంగా 19 డీల్స్ ద్వారా డెట్, ఈక్విటీ రూపంలో 3,241 మిలియన్ డాలర్ల పీఈ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇందులో 71 శాతం ఆఫీస్ స్పేస్‌లోకి, 15 శాతం రిటైల్, 7 శాతం నివాసం, 7 శాతం గిడ్డంగుల విభాగంలోకి పెట్టుబడులు వచ్చాయి. 2020 క్యూ1లో దేశీయ రియల్టీలోకి 199 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అంటే ఏడాదిలో 16 రెట్లు ఎక్కువ. విలువల పరంగా చూస్తే.. 2021 క్యూ1 పీఈ పెట్టుబడులు గతేడాదిలో 80 శాతం, అంతకుక్రితం సంవత్సరంలో 48 శాతంగా ఉన్నాయి. ఈ క్యూ1లో రెసిడెన్షియల్లో 7 డీల్స్ ద్వారా 234 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ రాగా.. ఆఫీస్ స్పేస్‌లోకి 6 డీల్స్ ద్వారా 2,148, రిటైల్‌లో ఒక్క డీల్‌తో 484, వేర్‌హౌస్‌లో 4 డీల్స్ ద్వారా 216 మిలియన్ డాలర్ల లావాదేవీలు జరిగాయి. క్యూ1లో వచ్చిన పెట్టుబడులను దేశాల వారీగా చూస్తే.. కెనడా నుంచి అత్యధికంగా 915 మిలియన్ డాలర్లు, అమెరికా నుంచి 830, సింగపూర్ నుంచి 341, మన దేశం నుంచి 62 మిలియన్ డాలర్లు వచ్చాయి. -
బెంగళూరు వైపు ఎన్నారైల చూపు.. ఎందుకంటే..
సాక్షి, బెంగళూరు: నివాస యోగ్యమైన బెంగళూరు నగరం వైపు ఎన్నారై (ప్రవాస భారతీయులు) చూపు మళ్లింది. నివాసాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. విలావవంతంగా ఉండే ఇళ్లంటే ప్రవాసులు మక్కువ చూపుతున్నారు. పెద్ద పెద్ద భవనాలు, మూడు లేదా నాలుగు పడకల ఇండిపెండెంట్ ఇళ్ల కొనుగోలుకు పోటీ నెలకొంది. వేసవి కాలంలోనూ చల్లగా ఉంటుందని పేరుండడంతో ఉద్యాననగరికి క్యూ పెరుగుతోందని పలు రియాల్టీ సంస్థల సర్వేల్లో వెల్లడైంది. దేశానికి వస్తున్న ఎన్నారైలలో అత్యధికమంది బెంగళూరులోనే నివాసానికి మొగ్గు చూపుతున్నారట. వసతులే ముఖ్యం సుమారు 17 ఏళ్ల పాటు విదేశాల్లో ఉద్యోగాలు చేసి తిరిగి స్వదేశానికి తిరిగొచ్చే వారిని ఎన్నారైలుగా పిలుస్తారు. అయితే వారు సొంతూరి కంటే అధిక వసతులు కూడిన సిలికాన్ సిటీలో స్థిర నివాసానికి సరే అంటున్నట్లు తెలుస్తోంది. తాము ఉండడానికి 3 – 4 పడకల గదుల ఇళ్లను, బాడుగలకు ఇచ్చి ఆదాయం పొందడానికి డబుల్‌బెడ్ రూం ఇళ్ల కొనుగోలుపై ఆసక్తి చూపుతారు. రెండో స్థానంలో పూణె బెంగళూరు తర్వాత నివాసానికి ప్రవాసాలు పూణెను ఎంచుకున్నారు. రూపాయి విలువ క్రమక్రమంగా తగ్గిపోతున్న కారణంగా డాలర్లకు, పౌండ్లకు ఎక్కువ రూపాయలు వస్తున్నాయి. దీంతో ఎన్నారైలు భారత్‌లో ఆస్తులు కొనడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఎన్నారైలలో 73 శాతం మంది సగటున రూ.2.5 కోట్లతో ఇల్లు కొనడానికి సిద్ధంగా ఉన్నట్లు సర్వేలు పేర్కొన్నాయి. కరోనాకు ముందు ఇది 41 శాతంగా ఉండేది. బెంగళూరులో ఎక్కడెక్కడ సర్జాపుర రోడ్డు, ఎలక్ట్రానిక్ సిటీ, బన్నేరుఘట్ట రోడ్డు, వైట్ ఫీల్డ్, నెలమంగల, కనకపుర రోడ్డు, మైసూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో ఎన్నారైలు ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పూర్తిగా కట్టిన ఇళ్లంటేనే ఓకే అంటున్నారు. చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పెరిగాయ్ కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్బీఐ షాక్ -
రియల్టీ రంగానికి స్టీల్ షాక్
కోల్‌కతా, సాక్షి: కోవిడ్-19 నేపథ్యంలో గత కొద్ది నెలలుగా నీరసించిన దేశీ రియల్టీ రంగం తాజాగా స్టీల్ ధరలతో డీలా పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అన్‌లాక్ తదుపరి ఇటీవలే నెమ్మదిగా పుంజుకుంటున్న రియల్టీ రంగం ప్రస్తుతం స్టీల్ ధరల పెరుగుదల కారణంగా ఒత్తిడిలో పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా నిర్మాణ రంగంలో వినియోగించే స్టీల్ ధరలు ఇటీవల భారీగా పెరిగినట్లు తెలియజేశారు. అయితే హౌసింగ్ రంగానికి కేంద్ర ప్రభుత్వమిస్తున్న ప్రోత్సాహకాలు, తీసుకుంటున్న చర్యలకుతోడు.. చౌక వడ్డీ రేట్ల ఫలితంగా ఇటీవల రెసిడెన్షియల్ విభాగం నిలదొక్కుకుంటున్నట్లు వివరించారు. (రూ. 51,500- రూ. 70,600 దాటేశాయ్ ) రూ. 45,000కు కోవిడ్-19కు ముందు ధరలతో పోలిస్తే ఇటీవల స్టీల్ ప్రొడక్టుల ధరలు 30-40 శాతం పెరిగినట్లు రియల్టీ రంగ వర్గాలు వెల్లడించాయి. నిర్మాణ రంగంలో అత్యధికంగా వినియోగించే టీఎంటీ బార్స్ ధరలు కొన్ని మార్కెట్లలో టన్నుకి రూ. 45,000ను తాకినట్లు తెలియజేశాయి. దీంతో రియల్టీ రంగ కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు బెంగాల్ పీర్లెస్ హౌసింగ్ డెవలప్మెంట్ కంపెనీ సీఈవో కేతన్ సేన్‌గుప్తా పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే రియల్టీ రంగం రికవరీ సాధిస్తున్నందున పెరిగిన వ్యయాలను కొనుగోలుదారులకు బదిలీ చేసేందుకు అవకాశంలేదని తెలియజేశారు. స్టీల్ ప్రొడక్టుల ధరల పెరుగుదల కారణంగా కంపెనీల స్థూల మార్జిన్లు 4-6 శాతం మధ్య క్షీణించే అవకాశమున్నట్లు క్రెడాయ్ బెంగాల్ అధ్యక్షుడు నందు బెలానీ అంచనా వేశారు. (బ్యాంకింగ్ వ్యవస్థలోకి పోస్టాఫీస్ బ్యాంక్) హౌసింగ్ భేష్ ప్రస్తుతం హౌసింగ్ విభాగంలో మాత్రమే డిమాండ్ బలపడుతున్నట్లు నందు తెలియజేశారు. వాణిజ్య, పారిశ్రామిక రియల్టీ విభాగంలో పరిస్థితులింకా కుదుటపడలేదని పేర్కొన్నారు. అధిక వ్యయాల కారణంగా బిల్డర్లు కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు వెనుకంజ వేసే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. కాగా.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో ఎలాంటి కొత్త ప్రాజెక్టులకూ శ్రీకారం చుట్టలేదని సేన్‌గుప్తా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో పరిస్థితులను సమీక్షించాక ఒక నిర్ణయానికి రాగలమని తెలియజేశారు. -
రియల్టీకి లక్ష కోట్ల నష్టం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటివరకు దేశీయ రియల్టీ రంగానికి కరోనా వైరస్ కలిగించిన నష్టం అక్షరాలా లక్ష కోట్లు. రోజు రోజుకూ ఈ లాస్ మరింత పెరుగుతుందని ప్రాపర్టీ డెవలపర్లు, కన్సల్టెంట్లు అభిప్రాయపడ్డారు. దేశీయ రియల్టీ ఎదుర్కొంటున్న కరోనా ప్రభావాన్ని అధిగమించడానికి, నష్టాలను తగ్గించడానికి ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాలని క్రెడాయ్, నరెడ్కో సంఘాలు కేంద్రాన్ని కోరాయి. వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉద్యోగ అవకాశాల రంగం రియల్ ఎస్టేట్. లాక్డౌన్ నేపథ్యంలో నగదు కొరత తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ రంగంలోనూ ఉద్యోగుల తొలగింపు, వేతనాల తగ్గింపు వంటివి తప్పవని క్రెడాయ్ నేషనల్ చైర్మన్ జక్షయ్ షా తెలిపారు. లాక్డౌన్ కొనసాగే కాలాన్ని బట్టి తొలగింపు నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. 25 శాతం తొలగింపులు.. అమ్మకాల క్షీణతతో కంపెనీలు చేసే మొదటి నిర్ణయం వేతనాల తగ్గింపే. లిక్విడిటీ కొరత కారణంగా డెవలపర్లు రుణాల చెల్లింపులు చేయడంలో డిఫాల్ట్ అవుతారు. ఫలితంగా కంపెనీలు దివాళ తీస్తాయి. దీంతో ఉద్యోగుల తొలగింపులు తప్పవని నరెడ్కో అధ్యక్షుడు నిరంజన్ హిర్‌నందానీ తెలిపారు. ప్రభుత్వం రియల్టీ రంగానికి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తే.. కంపెనీలు దివాలా తీయడం, ఉద్యోగాలు కోల్పోవటం వంటివి జరగవని తెలిపారు. లాక్డౌన్ కంటే ముందు శ్రామిక శక్తిలో ఉద్యోగుల తొలగింపు 15 శాతంగా ఉంటే.. ప్రస్తుతమిది 25 శాతానికి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు. -
దివాలా చర్యల్లో రూ.4.6 లక్షల కోట్ల గృహ ప్రాజెక్టులు: జేఎల్ఎల్
ముంబై: రియల్ ఎస్టేట్ మార్కెట్లో మందగమనం, నిధుల లభ్యత సమస్యలతో 66 బిలియన్ డాలర్ల విలువైన (రూ.4.6 లక్షల కోట్లు) నివాసిత గృహ ప్రాజెక్టులు దివాలా చర్యలను ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని స్థిరాస్థి కన్సల్టెన్సీ జేఎల్ఎల్ తెలిపింది. ఎన్నో కారణాలతో 4.52 లక్షల యూనిట్లు గడువు దాటిపోయినా పూర్తి కాకుండా కొనసాగుతున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో నివాసిత రియల్ ఎస్టేట్ విభాగంలోనే సమస్యలను ఎదుర్కొంటున్న ఆస్తులు (స్ట్రెస్డ్ అసెట్స్) ఎక్కువగా ఉన్నాయి. ఆలస్యమైన, నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో 4.54 లక్షల యూనిట్లు గడువు దాటినా కానీ పూర్తి కాకుండా ఉన్నాయి’’ అని జేఎల్ఎల్ తెలిపింది. వీటిల్లో కొన్ని ఇప్పటికే దివాలా చర్యల పరిధిలో ఉన్నాయని, వీటి విలువ 66 బిలియన్ డాలర్లుగా ఉంటుందని పేర్కొంది. -
నివాస గృహ మార్కెట్‌కు పూర్వవైభవం!
భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో గత కొన్నేళ్లల్లో వృద్ధి నెమ్మదించింది. రెరా, జీఎస్టీ వంటివి రియల్ ఎస్టేట్ రంగం కొలుకోవడానికి కీలకమైన అంశాలు. రెరా, జీఎస్టీ అమలు చేసిన తర్వాత దేశంలోని 8 ప్రధాన పట్టణాల్లో 2018లో గృహాల అమ్మకాల్లో 6 శాతం వృద్ధి అంచనాలు వెలువడ్డాయి. 2017తో పోలిస్తే 2018లో 75 శాతం కొత్త ప్రాజెక్టుల్లో అమ్మకాలు జరగ్గా, అమ్ముడు కాని ప్రాజెక్టులు 11 శాతానికి తగ్గాయి. ప్రస్తుతం, గృహ, వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో వృద్ధి కనిపిస్తోంది. దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి ట్రిలియ¯Œ డాలర్లుగా ఉండొచ్చని ఒక అంచనా. ఈ రంగం సానుకూలంగా మారడానికి కారణమైన అంశాలను పరిశీలిస్తే...రవి నారాయణసెక్యూర్డ్ అసెట్స్ హెడ్,ఐసీఐసీఐ బ్యాంకు రెరా, జీఎస్టీ 2016లో రెరా చట్టం, 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చింది. ఇవి రియల్ ఎస్టేట్ రంగంలో పెనుమార్పులకు నాంది పలికాయి. ఈ నిర్మాణాత్మక సంస్కరణలు నియంత్రణ విధానాన్ని బలోపేతం చేశాయి. అంతేకాకుండా మార్కెట్ స్థిరీకరణకు ఉపయోగపడ్డాయి. దీంతో స్థిరమైన వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు ఇవి తోడ్పడ్డాయి. కొనుగోలుదారులకు సాధికారత కల్పించడం ద్వారా గృహాలకు డిమాండ్ గణనీయంగా వృద్ధి చెందడంలో రెరా సహాయపడింది. తద్వారా ఈ రంగంలో సీరియస్‌గా పనిచేసే సంస్థలు ముందు నిలవడంలో సాయపడుతుంది. సమయానికి ప్రాజెక్టు పూర్తి అవుతుందన్న భరోసాతోపాటు వినియోగదారుల్లో ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఇప్పటికీ ఈ పరిశ్రమ మార్పుల దశలో ఉండగా, దీర్ఘకాలంలో మాత్రం బాగా వృద్ధి చెందనుంది. జీఎస్టీ సైతం ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ పునరుద్ధరణలో అతి కీలకమైన పాత్ర పోషిస్తోంది. పారదర్శకత, జవాబుదారీతనం, సరళీకృత పన్నుల విధానం సాధ్యమవుతాయి. 2019 ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ రేట్ల తగ్గింపు అమల్లోకి వచ్చింది. ఇది ఈ రంగానికి మరింత ఊతమివ్వడంతోపాటు గృహాలకు డిమాండ్‌ను సైతం పెంచుతుంది. ప్రీమియం గృహ విభాగంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఇప్పుడు జీఎస్టీ 5 శాతంగా ఉంది. గతంలో ఇది 12 శాతంగా ఉండేది. అందుబాటు ధరల గృహాలకు ఇది 8 శాతం నుంచి 1 శాతానికి తగ్గింది. జీఎస్టీ కౌన్సిల్ ఇప్పుడు ఇ¯Œ పుట్ ట్యాక్స్ క్రెడిట్ సిస్టమ్‌ను అమలు చేస్తుండడం వల్ల కొనుగోలుదారుల సెంటిమెంట్ గణనీయంగా పెరగనుంది. అందుబాటులో గృహ విభాగం నిర్మాణాత్మక సంస్కరణలతోపాటు ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్ల కొనుగోలుదారులు ముందుకు రావడంతో ఈ రంగంలో రికవరీ సాధ్యమయింది. స్టాండర్డ్ డిడక్ష¯Œ రూ.40వేల నుంచి రూ.50వేలకు పెరగడం, రూ.5 లక్షల్లోపు ఆదాయం కలిగిన వారికి పూర్తి పన్ను రాయితీ, మౌలిక వసతులు, కనెక్టివిటీ అన్నవి మెరుగైన పెట్టుబడులకు కారణమయ్యాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌లో నివాసిత ప్రాజెక్టుల విభాగం వృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి అందరికీ ఇళ్లు అన్న లక్ష్యమే కారణం. అందుబాటు ధరల గృహ వినియోగదారులు రానున్న కాలంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి తోడ్పడనున్నారు. మధ్య తరగతికి ప్రయోజనాలు అందుబాటులో గృహ విభాగంలో ఇప్పటికే పెట్టుబడులు కూడా పెరిగాయి. 2018లో నూతన సరఫరాలో ఇది 41 శాతంగా ఉంది. ప్రభుత్వం ఇప్పుడు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకాన్ని 2020 మార్చి వరకు పొడిగించింది. దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలు (ఈడబ్ల్యూఎస్), అల్పాదాయ వర్గాలు (ఎల్ఐజీ), మధ్యతరగతి వర్గాల (ఎంఐజీ) వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా వడ్డీ రాయితీలు అందిస్తున్నారు. 2019 ఏప్రిల్ నాటికి 4.45 లక్షల కుటుంబాలకు రూ.10వేల కోట్ల రాయితీని క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ద్వారా అందించారు. గృహ రుణ రాయితీలు, స్వల్ప జీఎస్టీ ధరల నుంచి అధిక శాతం కొనుగోలుదారులు ప్రయోజనం పొందుతున్నారు. స్టూడెంట్ హౌసింగ్ వంటి నూతన అస్సెట్ క్లాసెస్ పెరుగుతుండడంతో నివాసిత రియల్ ఎస్టేట్ మార్కెట్ కోలుకునేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.