![Adoption Of Flexible Workspace By Corporates Rising - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/3/Flexible%20Workspace%20%20in%20india.jpg.webp?itok=dqezXv9x)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ ఇండియా సర్వే ప్రకారం.. 2025 నాటికి దాదాపు 56 శాతం కార్పొరేట్ కంపెనీలు తమ మొత్తం ఆఫీస్ స్థలంలో 10 శాతానికి పైగా ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ ఉండాలని భావిస్తున్నాయి.
ఏడాదిలో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌ను ఎక్కువగా ఉపయోగిస్తామని 47 శాతం కార్పొరేట్లు తెలిపారు. సామర్థ్యాలను మెరుగ్గా సద్వినియోగం చేయడంలో భాగంగా కన్సాలిడేషన్ పెరుగుతుందని 37 శాతం మంది అభిప్రాయపడ్డారు. నిపుణుల లభ్యత, మెరుగైన వసతుల కారణంగా కొన్ని కార్యకలాపాలను జనవరి–మార్చిలో ద్వితీయ శ్రేణి నగరాలకు మార్చినట్టు 13 శాతం మంది కార్పొరేట్లు తెలిపారు.
2021 డిసెంబర్ త్రైమాసికంలో ఇది 8 శాతం నమోదైంది. వచ్చే రెండేళ్లలో కార్యాలయ స్థలం మరింత అధికం అవుతుందని 75 శాతం మంది వెల్లడించారు. భారత కార్యాలయ విభాగంలో రికవరీ మెరుగ్గా ఉందని సీబీఆర్‌ఈ ఇండియా చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment