work place
-
ఆఫీస్‌లో తక్కువ స్థాయి పనైతే ఏం చేయాలి..?
‘‘అది నా పని కాదు’’.. అనే మాటను ఆఫీసులలో తరచు వింటుంటాం. తప్పేం లేదు. ఏ పని చేయటానికైతే ఉద్యోగంలో చేరామో ఆ పనే కదా చేయాలి! అయితే కొన్నిసార్లు మనకు మించిన పనినో, మనం చేస్తున్న పని కన్నా తక్కువ స్థాయి పనినో అత్యవసరంగా చేయవలసి వస్తుంది. అంటే.. పనే మనల్ని వెతుక్కుంటూ రావటం అన్నమాట. (మొదట్లో పని కోసం మనం వెతుక్కుంటూ వచ్చినట్లుగా). అప్పుడేం చేయాలి? ఏదైనా చెయ్యొచ్చు. మించిన పనైతే ‘‘బాబోయ్.. నా వల్ల అవుతుందా!’’ అని తప్పించుకోవచ్చు. తక్కువస్థాయి పనైతే ‘‘అది నా పని కాదు’’ అని ముఖం తిప్పేసుకోనూ వచ్చు. ఈ రెండూ కాకుండా... ‘‘ఎస్, ఐ కెన్’ అని ఏ పనికైనా ఉత్సాహంగా చేయందించవచ్చు. సినిమాల్లోకి రాకముందు పరిణీతి చోప్రా కూడా ఒక సాధారణ ఉద్యోగే. రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ, రాణి ముఖర్జీ వంటి సినీ సెలబ్రిటీలకు పీఆర్‌గా పని చేశారు. వారి షెడ్యూళ్లు చూసుకోవటం, ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయటం ఆమె పని. అయితే ఆ పనులు మాత్రమే చూసుకోలేదు పరిణీతి. అవసరం అయినప్పుడు, బాయ్స్ అందుబాటులో లేనప్పుడు అనుష్క శర్మ, రాణి ముఖర్జీ, దీపికా పడుకోన్, నీల్ నితిన్ ముఖేశ్‌లకు కాఫీలు కూడా అందించారట! ‘‘తప్పేముంది? మనం చేయగలిగిన పనే కదా!’’ అంటారు పరిణీతి.అక్టోబర్ 22 పరిణీతి పుట్టిన రోజు. ఆ సందర్భంగా రాజ్ షమానీకి ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో.. తన తొలినాళ్ల ఉద్యోగ బాధ్యతల్ని, అదనంగా వచ్చి పడిన పనులను తనెంత ఇష్టంగా నిర్వహించిందీ గుర్తు చేసుకున్నారు పరిణీతి. ‘‘అవసరమైనప్పుడు పనిలో స్థాయీ భేదాలు చూసుకోనక్కర్లేదని నా ఉద్దేశం..’’ అంటారు ప్రస్తుతం స్టార్ నటిగా వెలిగిపోతున్న పరిణీతి. -
భారత్‌లో బాధపడుతున్న ఉద్యోగులు ఎందరంటే..
భారత్‌లో వందలో 86 మంది ఉద్యోగులు కష్టపడుతూ, బాధపడుతూ పనిచేస్తున్నారని ‘గల్లుప్ 2024 స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ వర్క్‌ప్లేస్’ నివేదిక వెల్లడించింది. మిగతా 14 శాతం మంది వృత్తిపరంగా నిత్యం అభివృద్ధి చెందుతున్నట్లు భావిస్తున్నారని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో ఉన్న 34 శాతం ఉద్యోగులతో పోలిస్తే తక్కువ.గల్లుప్ 2024 స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ వర్క్‌ప్లేస్ నివేదిక రూపొందించేందుకు ఉద్యోగులను మూడు కేటగిరీలు(అభివృద్ధి చెందుతున్న, కష్టపడుతున్న, బాధపడుతున్న ఉద్యోగులు)గా విభజించినట్లు తెలిపారు. ప్రస్తుత వృత్తిజీవితంతోపాటు భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నవారిని అభివృద్ధి చెందుతున్నవారిగా పరిగణించారు. దీనికి విరుద్ధంగా వృత్తిలో ప్రతికూల వాతావరణాన్ని అనుభవిస్తున్నవారు, రోజువారీ ఒత్తిడి, ఆర్థిక ఆందోళనలను ఎదుర్కొంటున్నవారిని ‘కష్టపడుతున్న, బాధపడుతున్న’ కేటగిరీలోకి చేర్చారు.నివేదికలోని వివరాల ప్రకారం..భారత్‌లో 86 శాతం మంది ఉద్యోగులు కష్టపడుతూ, బాధపడుతూ పనిచేస్తున్నారు. 14 శాతం మంది వృత్తిపరంగా తాము నిత్యం అభివృద్ధి చెందుతున్నట్లు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో 34 శాతం ఉద్యోగులున్నారు. దక్షిణాసియాలో ఇలా అభివృద్ధి చెందుతున్న కేటగిరీలో 15 శాతం ఉద్యోగులున్నారు. నేపాల్ ఇది 22 శాతంగా ఉంది. శ్రీలంకలో అత్యధికంగా 62 శాతం, ఆఫ్ఘనిస్తాన్‌లో 58 శాతం ఉద్యోగులు రోజువారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇండియాలో ఇది 32 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా..? ప్రయాణబీమా తీసుకున్నారా..?ఇదిలాఉండగా, పనిఒత్తిడిని తగ్గించుకునేందుకు ఉద్యోగులు మంచి వ్యాపకాలను అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీ యాజమాన్యాలు టార్గెట్లు పూర్తి చేయాలనే ధోరణిలో ఉంటాయి. కాబట్టి ఉద్యోగులపై ఒత్తిడి సహజంగానే పెరుగుతుంది. దాన్ని తగ్గించుకునేందుకు ఇతర మంచి మార్గాలను ఎంచుకోవాలని చెబుతున్నారు. పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడం, వృత్తిపరంగా కొత్త కోర్సులు నేర్చుకోవడం..వంటివి పాటించాలని సూచిస్తున్నారు. -
ఇప్పటికీ పురుషులకే ఎక్కువ పదోన్నతులు..!
మహిళలకు పురుషులతో సమానంగా అన్నింటిలోనూ సమాన హక్కులు ఉండాలని పోరాటలు చేశారు. తాము పురుషులకు ఎందులోనూ తీసిపోం అని చాటి చెప్పినప్పటికీ స్త్రీలు ఇంకా పదోన్నోతుల్లో వెనుకబడే ఉన్నారు. మహిళలు కార్యాలయాల్లో అగ్రగామిగా ఉండాలనే కోరికి కలగానే మిగిలిందా? ఎందుకిలా? అంటే..ఔననే చెబుతున్నాయి అమెరికన్ సాంకేతిక అధికారి షెరిల్ శాండ్‌బర్గ్, లెర్న్ఇన్ డాట్ ఆర్గనైజేషన్, మిక్నిసే అండ్ కో సంయుక్తంగా నిర్వహించిన విమెన్ ఇన్ ది వర్క్ ప్లేస్ నివేదికలు. ఆ సర్వే ప్రకారం 2022లో పదోన్నతులు పొందిన ప్రతి వంద మంది పురుషుల్లో 87 మంది మహిళలు మాత్రమే ఆ ప్రోత్సాహాన్ని పొందారు. పురుషులతో సమానంగా ప్రమోషన్లు పొందాలని కోరినప్పటికీ అందులో వారు ఇంకా వెనుకబడే ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఈ గ్యాప్‌కి కారణం ఏంటంటే పని ప్రదేశాల్లో తమ సామర్థ్యాన్ని పురుషుల, స్త్రీలు ప్రూవ్ చేసుకునేదనే బట్టే ఉంటుంది. పురుషులు, స్త్రీలు తమ పనితీరుని చూపించుకోవాల్సి ఉంటుఒంది. మీకు (స్త్రీలు) మీరుగా మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోనట్లయితే వెనుకబడక తప్పదని శాండ్‌బర్గ్ సర్వే వెల్లడించింది. దీన్ని నల్లజాతీయుల పరంగా చూస్తే ఆ స్త్రీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రతి వంద మంది పురుషులకు కేవలం 54 మంది నల్లజాతీయులు పదోన్నతులు పొందుతున్నట్లు సర్వే తెలిపింది. 2021లో 96 మంది ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య కాస్త 2018, 2019 కనిపించిన 58 దగ్గరకు ఉంది. అమెరికాలో కార్పొరేట్ కంపెనీలు నల్లజాతీయులకు ఉద్యోగావకాశాలు హామీ ఇచ్చాయి కూడా. కాగా యూఎస్, కెనడాలలో సుమారు 276 కంపెనీలపై సర్వే చేయగా దాదాపు 33 సంస్థలు నుంచి 27 వేలకు పైగా ఉన్న ఉద్యోగుల్లో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ ప్రమోషన్లు పొంది లాభపడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. పురుషులు ఆన్సైట్లో ఉన్నప్పుడూ మహిళలు కంటే ఎక్కువ మెంటర్షిప్, స్పాన్సర్షిప్ పొందుతారని, వారు కొత్తవి తెలుసుకోవడంలో ఆసక్తి కనబరుస్తారని లెర్ని ఇన్ డాట్ ఆర్గనైజేషన్ సహ వ్యవస్థాపకుడు సీఈవో రేచెల్ థామస్ అన్నారు. అంతేగాదు పని వాతావరణంలో ఉద్యోగుల నైపుణ్యాలు వెలికితీసేలా మంచి శిక్షణ ఇవ్వడంతో పాటు వారి పనితీరును కూడా సమీక్షించాలి, ఎక్కడ తప్పు దొర్లుతుందో గమనించాలని అన్నారు. ఇక మెటా ఫ్లాట్‌ఫారమ్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శాండ్‌బర్గ్ మాట్లాడుతూ..మహిళలే పనితీరులో కాస్త నిర్లక్ష్యంగా ఉంటూ అసంతృప్తిగా పనిచేస్తున్నారని చెప్పడం దురదృష్టకరం. అయినా ఇలా ఉంటే మహిళలు వారు ఆశించిన లక్ష్యాన్ని ఎలా చేరుకొనగలరు అని ప్రశ్నిస్తోంది. సామర్థ్యాన్ని పెంచుకోకుండా పురుషులతో సమాన అవకాశాలు ఎక్కడ నుంచి వస్తాయని శాండ్‌బర్గ్ అన్నారు. మహమ్మారికి ముందు మహిళలు ప్రతిష్టాత్మకంగా ఉన్నారని 2019లో ఏకంగా 80% మంది మహిళలు ప్రమోషన్లు ఆశించినట్లు తెలిపారు. -
ఇలా కూడా నిద్రపోవచ్చా!..అబ్బా!.. వర్క్‌ప్లేస్‌లో కూడా..
సాధారణంగా పడుకుని నిద్రపోవడమే మనకు అలవాటు. కొంతమంది బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు, ఆఫీసుల్లోనూ కూర్చుని కూడా కునుకు తీస్తుంటారు. జపాన్‌లోని హొక్కాయిడో నగరానికి చెందిన కొయోజు ప్లైవుడ్ కార్పొరేషన్ అనే సంస్థ రూపొందించిన ఈ స్లీపింగ్ పాడ్స్‌లో నిలువునా నిలబడి కూడా కునుకు తీయవచ్చు. ‘గిరాఫెనాప్’ పేరుతో 8.4 అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో ఈ స్లీపింగ్ పాడ్స్‌ను రూపొందించారు. ఇది చూడటానికి పాతకాలం టెలిఫోన్ బూత్‌లా ఉన్నా, ఇందులో చాలా సౌకర్యాలే ఉంటాయి. ఇందులో కూర్చుని, డెస్క్‌పై పనిచేసుకోవచ్చు. నిలబడి కునుకు తీయాలనుకుంటే, ఇందులోని ఒక మీట నొక్కితే చాలు– కూర్చీ నిలువునా పైకి లేస్తుంది. ఇందులో తలవాల్చుకునేందుకు దిండు కూడా ఉంటుంది. మన ఎత్తుకు తగినట్లుగా దిండు ఎత్తును సవరించుకునే వెసులుబాటు కూడా ఉంది. పని ప్రదేశాల్లో నిద్రపోవడాన్ని అనుమతించే జపాన్‌లో ఇదొక కొత్త ఆకర్షణగా మారింది. (చదవండి: ఇంద్రభవనంలా ఉన్నా ఆ ప్యాలెస్ ఏంటో చూస్తే..షాకవ్వడం ఖాయం!) -
ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌కు డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ఇండియా సర్వే ప్రకారం.. 2025 నాటికి దాదాపు 56 శాతం కార్పొరేట్ కంపెనీలు తమ మొత్తం ఆఫీస్ స్థలంలో 10 శాతానికి పైగా ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ ఉండాలని భావిస్తున్నాయి. ఏడాదిలో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌ను ఎక్కువగా ఉపయోగిస్తామని 47 శాతం కార్పొరేట్లు తెలిపారు. సామర్థ్యాలను మెరుగ్గా సద్వినియోగం చేయడంలో భాగంగా కన్సాలిడేషన్ పెరుగుతుందని 37 శాతం మంది అభిప్రాయపడ్డారు. నిపుణుల లభ్యత, మెరుగైన వసతుల కారణంగా కొన్ని కార్యకలాపాలను జనవరి–మార్చిలో ద్వితీయ శ్రేణి నగరాలకు మార్చినట్టు 13 శాతం మంది కార్పొరేట్లు తెలిపారు. 2021 డిసెంబర్ త్రైమాసికంలో ఇది 8 శాతం నమోదైంది. వచ్చే రెండేళ్లలో కార్యాలయ స్థలం మరింత అధికం అవుతుందని 75 శాతం మంది వెల్లడించారు. భారత కార్యాలయ విభాగంలో రికవరీ మెరుగ్గా ఉందని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. -
పని ప్రదేశాల్లో వేధింపులు ఎక్కువే.. మహిళలపైనే అధికం!
ఐక్యరాజ్యసమితి: పని ప్రదేశాల్లో దిగువస్థాయి సిబ్బందికిపై హింస, వేధింపులు ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణంగా మారాయని ఓ సర్వేలో తేలింది. యువత, వలసదారులు, రోజువారీ వేతన జీవులు, ముఖ్యంగా మహిళలే ఇందుకు బాధితులుగా మారుతున్నారని వెల్లడైంది. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి చేపట్టిన మొట్టమొదటి సర్వే ఇది. ఐరాస అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్వో), లాయిడ్స్ రిజిస్టర్ ఫౌండేషన్, గాల్లప్ సంస్థ కలిసి గత ఏడాది చేపట్టిన ఈ సర్వే ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 121 దేశాల్లోని 75 వేల మంది సిబ్బందిపై సర్వే జరపగా 22% మందికి పైగా ఏదో ఒక రకమైన వేధింపులు, హింసకు గురవుతున్నట్లు తెలిపారని సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఒకరు పని ప్రదేశంలో ఏదో ఒకవిధమైన వేధింపులకు గురవుతున్నట్లు తెలపగా, 6.3% మంది భౌతిక, మానసిక, లైంగిక హింసను, వేధింపుల బారినపడ్డారు. 17.9% మంది మాత్రం ఉద్యోగం చేసుకునే చోట ఏదో ఒక రూపంలో వేధింపులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఉపాధి పొందే చోట భౌతికంగా హింస, వేధింపులను ఎదుర్కొంటున్నట్లు 8.5% మంది పేర్కొనగా వీరిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది ఉన్నారు. ‘పని ప్రదేశాల్లో వేధింపులు ప్రమాదకరమైన అంశం. దీనివల్ల వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు ఆదాయ నష్టం వాటిల్లి, వారి కెరీర్ దెబ్బతింటోంది’అని సర్వే అభిప్రాయపడింది. ప్రభావవంతమైన చట్టాలు, విధానాలను రూపొందించి ఈ సమస్యను పరిష్కరించవచ్చునని పేర్కొంది. ఇదీ చదవండి: ఇకపై సహజీవనం నేరమే.. ఆరు నెలల జైలు శిక్ష -
పని ప్రదేశంలో సరదాగా ఉండటంలో మనోళ్లే తోపులు!
ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉండదంటూ ఓ సినీ కవి ఎప్పుడో చెప్పాడు. కొత్తగా అదే విషయాన్ని లింక్డ్ఇన్ తేల్చి చెప్పింది. ఇందు కోసం ఇండియాతో పాటు వివిధ దేశాల్లో ఉన్న వృత్తి నిపుణుల నుంచి అభిప్రాయాలను సవివరంగా తీసుకుంది. వాటిని క్రోడీకరించి తాజాగా ఫలితాలు ప్రకటించింది. పని ప్రదేశాల్లో నవ్వుతూ జోకులేస్తూ తమ ఎమోషన్స్‌ని ప్రకటిస్తూ పని చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడతామంటూ ఇండియాలో 76 శాతం మంది ప్రొఫెషనల్స్ తేల్చి చెప్పారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఆడుతూ పాడుతూ పని చేయడాన్ని ఇంకా ఆస్వాదిస్తున్నట్టు 86 శాతం మంది తెలిపారు. ఇలా చేయడం వల్ల ప్రొడక్టివిటీ ఇంకా పెరుగుతున్నట్టు తాము గుర్తించామన్నారు. సరదగా జోకులేస్తూ ఫన్నీ ఎన్విరాన్మెంట్లో పని చేయడాన్ని ఇష్టపడటంలో ఇండియన్లు, ఇటాలియన్లు మిగిలిన దేశాలకు చెందిన ప్రొఫెషన్స్‌ని వెనక్కి నెట్టారు. పని ప్రదేశంలో సరదాగా ఉండటాన్ని ఇష్టపడుతున్నట్లు ఈ రెండు దేశాల్లో 38 శాతం మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. రోజుకు కనీసం ఒక్క జోకైనా పని ప్రదేశంలో వేస్తుంటమని వీరు చెబుతున్నారు. ఇండియా, ఇటాలియన్ తర్వాత జర్మన్ (36 శాతం), బ్రిట్స్ (34 శాతం), డచ్ (33 శాతం), ఫ్రెంచ్ (32 శాతం), ఆస్ట్రేలియా (29 శాతం)లు నిలిచాయి. ఇండియాలో కూడా దక్షిణ భారతదేశానికి చెందిన ప్రొఫెనల్స్ జోకులు పేల్చడంలో అందరికంటే ముందు వరుసలో ఉన్నారు. ఇక్కడి ఫ్రొఫెషనల్స్ నుంచి సేకరించిన అభిప్రాయం ప్రకారం వర్క్‌ప్లేస్‌లో కనీసం ఒక్క జోకైనా వేసే వారిలో దక్షిణ భారతీయులు 43 శాతం ఉన్నారు. తర్వాతి స్థానాల్లో పశ్చిమ, తూర్పు, ఉత్తర భారతీయులు ఉన్నారు. పని ప్రదేశంలో నార్త్ఈస్ట్కు చెందిన వారు చాలా సీరియస్‌గా ఉంటారని తేలింది. జోకులేయడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందనే భావనలో 71 శాతం మంది భారతీయ ప్రొఫెషనల్స్ ఉన్నారు. 56 శాతం మంది పని ప్రదేశాల్లో చతుర్లాడటాన్ని నాన్ ప్రొఫెషనల్ థింగ్‌గా పరిగణిస్తున్నట్టు లింక్ట్‌ఇన్ సర్వే చెబుతోంది. అయితే పని ప్రదేశంలో సరదాగా ఉండటాన్ని తప్పుగా చూడటం అనే అలవాటు మన సొసైటీలో ఎక్కువగా ఉందనే అభిప్రాయం ఎక్కువైంది. ముఖ్యంగా పురుషలతో పోల్చినప్పుడు మహిళలకు ఈ సమస్య ఎక్కువగా ఉంది. చదవండి: భవిష్యత్తులో ఎక్కువ ఉద్యోగాలు ‘గిగ్’లోనే లభిస్తాయట -
ఒళ్లంతా కనిపించేలా ఏంటా పచ్చబొట్లు ! ఇది కరెక్టేనా?
అన్ని రంగాల్లో మగవాళ్లతో సమానంగా మహిళలు రాణిస్తున్నా.. పూర్తి సమానత్వం ఇంకా రాలేదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇప్పటికీ కొన్ని విషయాల్లో పాత పద్దతులు పాటించడాన్నే సమర్థిస్తున్నారు. కొత్తగా ఎవరైనా ప్రయత్నిస్తే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఇలాంటి విమర్శలు, సూటిపోటీ మాటలతో ఇబ్బంది పడుతున్న ఓ బిజినెస్ విమన్ ఇటీవల వాటి నుంచి విముక్తి పొందింది. తన జీవితంలో ఎదురైన అనుభవాలను ఇటీవల ఆమె తన లింక్డ్ఇన్లో పంచుకుంది. ఆమెకు ఎదురైన అనుభవాలు, వర్క్‌ప్లేస్‌లో కల్చర్ తదితర అంశాలు ఇప్పుడు బిజినెస్ వరల్డ్‌లో చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలోని ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ మేనేజింగ్ కంపెనీల్లో ఒకటైన ఎవల్యూషన్ క్యాపిటల్ పార్టనర్ సంస్థలో జెస్సికా హాంజీ లియోనార్డ్ అనే మహిళ ఇటీవల భాగస్వామిగా చేరింది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన వివరాలను ఆ సంస్థ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఎంతో బెరుకుగా ఆమె వాళ్ల బాస్ రూమ్‌లోకి అడుగు పెట్టింది. టాటాల చుట్టే విమర్శలు జెస్సికా హాంజీ లియోనార్డ్‌కి పచ్చబొట్లు (టాటూస్) అంటే ఇష్టం. మణికట్టు నుంచి భుజాలు, మెడ వరకు అనేక డిజైన్లలో పచ్చబొట్లు వేయించుకుంది. అయితే బిజినెస్ ఎగ్జిక్యూటివ్ హోదాలో అలా పచ్చబొట్లు పొడిపించుకున్నందుకు ఆమెకు తోటి ఉద్యోగుల నుంచి ఛీత్కారాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా మహిళా ఉద్యోగులే ఆమె పట్ల కఠినమైన వ్యాఖ్యలు చేసేవారు. దీంతో ఆ పచ్చబొట్లు కనిపించకుండా ఆమె పొడుగు చేతులు ఉండే దుస్తులు ధరించాల్సి వచ్చేది. మెడ, చెవుల భాగంలో టాటూలు కనిపించకుండా హెయిర్‌స్టైల్‌ను మార్చుకునేది. ఇలాంటి చర్యలతో రణంగా సమ్మర్లో చాలా ఇబ్బందులు పడేది జెస్సికా. ఇంకా దాచలేను టాటూలు ఆమె పాలిట శత్రువులు కావడంతో అనేక కంపెనీలు మారుతూ వచ్చింది. తాజాగా ఎవల్యూషన్ క్యాపిటల్‌లో చేరింది. దీంతో వెబ్సైట్లో ఆమె ఫోటో, ఇతర వివరాలు వెల్లడించాల్సిన అవసరం వచ్చింది. కొత్త ఆఫీసులో టాటూలతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకుంది. అందుకే బాస్ గదిలోకి అడుగు పెట్టిన జెస్సికా.. భయంభయంగానే తన ఒంటిపై ఉన్న టాటూల సంగతి చెప్పింది. ఇంకా వాటిని దాచి పెడుతూ ఉండలేనంది. ఆఫిషియల్ వెబ్సైట్లో జాకెట్(కోట్)తో కూడిన ఫోటోను అప్లోడ్ చేస్తానని, తన పర్సనల్ లింక్డ్ఇన్లో స్లీవ్‌లెస్ డ్రెస్‌తో టాటూలు కనిపించేలా ఉన్న ఫోటో అప్లోడ్ చేస్తానంటూ రిక్వెస్ట్ చేసింది. బాస్ ఎలా రియాక్ట్ అవుతాడో అనే టెన్షన్‌తో ఆమెలో పెరిగిపోతోంది. లౌడ్ అండ్ ప్రౌడ్ జెస్సికా రిక్వెస్ట్‌ని విన్న వాళ్ల బాస్ సానుకూలంగా స్పందించారు. ఒక్క లింక్డ్ఇన్లోనే ఎందుకు తమ సంస్థకు సంబంధించిన అఫిషీయల్ వెబ్సైట్లో కూడా టాటూ కనిపించేలా ఉన్న ఫోటోనే అప్లోడ్ చేసుకోమన్నారు. ఈ విషయంలో గోప్యత అనవసరమని.. రెండు చోట్ల స్లీవ్‌లెస్‌తో టాటూలు కనిపించేలా ఫోటోలు అప్లోడ్ చేయ్ విత్ లౌడ్ అండ్ ప్రౌడ్ అంటూ పర్మిషన్ ఇచ్చాడు. పెర్ఫార్మెన్స్ ముఖ్యం నేను కోటు ధరించానా ? స్లీవ్‌లెస్‌లో ఉన్నానా ? నా ఒంటిపై టాటూలు ఉన్నాయా? అనేవి అప్రాధాన్య విషయాలు. నేను ఎలా పని చేస్తున్నాను. నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది. వృత్తి పట్ల అంకితభావంతో ఉన్నానా లేనా అనేవే పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇంత కాలం అలా జరగలేదు. నా వృత్తిగత జీవితంలో నా పెర్ఫార్మెన్స్ కంటే టాటూల మీదే ఎక్కువ చర్చ జరిగింది. దీంతో నాకెంతో ఇష్టమైన టాటూలు అంటేనే భయం వేసే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు నేను ఫ్రీ అయ్యాను. నా మీద ఉన్న ఒత్తిడి తొలగిపోయింది. ఇప్పుడు నేను రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాను అంటూ జెస్సికా లింక్డ్ఇన్లో రాసుకొచ్చింది. చదవండి: దేశంలో మహిళలకు ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్న సంస్థలు ఇవే -
వర్క్ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే!
German Court Rule Pass It Is Work Place Accident: ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి కారణంగా చాలా వరకు ఆఫీసులన్ని తమ ఉద్యోగులను వర్క్‌ప్రం హోంకి పరిమితం చేశాయి. అయితే ఈ మధ్య మళ్లీ కొంతకాలంగా ఉద్యోగులను ఆఫీసులకు రావాలంటూ బాస్‌లు ఆర్డర్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఈ ఒమిక్రాన్ వైరస్ దెబ్బకు చాలా వరకు విదేశాల్లోని కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం అంటూ ఇళ్ల నుంచే వర్క్ చేయండి అంటూ సూచించింది. దీంతో ఉద్యోగులంతా ఇళ్ల వద్ద నుంచే వర్క్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఈ వర్క్ ఫ్రం హొంలో ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నప్పుడు మీకు ఇంటి వద్ద ఏదైన అనుకోని ప్రమాదం జరిగితే భీమా వర్తించదంటున్నాయి కొన్ని ప్రైవేట్ సంస్థలు (చదవండి: గిరిజన సంప్రదాయ నృత్యంతో అలరించిన ప్రియాంక గాంధీ : వైరల్ వీడియో) అసలు విషయలోకెళ్లితే. ...జర్మనీలోని వ్యక్తి ఒక రోజు ఉదయమే లేచి సరాసరి వర్క్ చేయడానికి అని తన ఇంటిలోని ఆఫీస్ రూంకి వెళ్తుండగా మెట్టమీద నుంచి జారిపడిపోతాడు. దీంతో సదరు వ్యక్తికి వెన్నముకకు తీవ్రంగా గాయమవుతుంది. అయితే సదరు ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన భీమా సంస్థ ఆ వ్యక్తి ఇంటివద్ద నుంచి పనిచేస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది కాబట్టి కంపెనీకి సంబంధించిన బీమా పాలసీని క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదంటూ నిరాకరిస్తుంది. దీంతో అతను న్యాయం కావాలంటూ జర్మనీ ఫెడరల్ కోర్టులో సదరు కంపెనీకి సంబంధించిన భీమా సంస్థ పై పిటిషన్ దాఖలు చేస్తాడు. అయితే కోర్టు అతను ఉదయం ఇంటి కార్యాలయంలో పనిచేయడానికి వెళ్తున్నప్పుడు జరిగింది కాబట్టి పరిహారం పొందేందుకు అర్హుడంటూ కోర్టు తీర్పు ఇస్తుంది. ఈ మేరకు సదరు బీమా సంస్థ ఇంటి నుంచి కార్యాలయానికి వచ్చే మార్గంలో తప్ప ఇంటి వద్ద జరితే ప్రమాదాలకు వర్తించదు అంటూ వాదించడానికి ప్రయత్నిస్తుంది. అయితే కోర్టు ఆ వాదనను తోసిపుచ్చి అతను ఎక్కడ ఉన్న పనిచేయడానికి వెళ్తున్నప్పుడే జరిగింది కాబట్టి సదరు వ్యక్తికి బీమా వర్తిస్తుందంటూ తీర్పు ఇస్తుంది. (చదవండి: ఒంటెల అందాల పోటీలు.. రూ. 500 కోట్ల ప్రైజ్‌మనీ) -
ఆఫీసుకు హాయ్.. ఇంటికి బైబై.. కారణం ఇదే!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నుంచి కోలుకుంటున్న గ్రేటర్ ఐటీ రంగం.. ఉద్యోగుల పనివిధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. నూతనంగా హైబ్రీడ్ మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై దృష్టిసారించింది. తమ ఉద్యోగుల్లో సుమారు 70 శాతం మందిని కార్యాలయాలకు రప్పించడం.. ఇతరులను ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించడమే ఈ హైబ్రీడ్ మోడల్ లక్ష్యం. తాజా పరిస్థితుల్లో పలు కంపెనీలు అదనంగా ఆఫీస్ స్పేస్ కోసం అన్వేషిస్తున్నప్పటికీ.. సమీప భవిష్యత్‌లో హైబ్రీడ్ మోడల్ అమలుకే దాదాపు అన్ని కంపెనీలు మొగ్గుచూపుతాయని హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) వర్గాలు తెలిపాయి. ఛదవండి: నిపుణుల వేటలో టాప్ 5 కంపెనీలు.. మొదటి 9 నెలల కాలంలో.. ప్రధానంగా గ్రేటర్ పరిధిలో మెరుగైన మౌలిక వసతులు, మానవ వనరుల లభ్యత అందుబాటులో ఉండటంతో ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడ కొత్త స్టార్టప్ కంపెనీలు, ఐటీ కంపెనీలు అధికంగా ఆఫీస్ స్పేస్‌ను దక్కించుకుంటున్నాయని పేర్కొన్నాయి. భవిష్యత్‌లో కరోనా మళ్లీ విజృంభించినా.. సవాళ్లను ఎదుర్కొని ధీటుగా పనిచేసేలా తమ సంస్థలను హైబ్రీడ్ పనివిధానం వైపు మళ్లిస్తున్నాయన్నారు. ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఆయా సంస్థలు నిమగ్నమవడం విశేషం. ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు సైతం ఈ విధానాన్ని దృష్టిలో ఉంచుకొనే ఆఫీస్ స్పేస్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయని తెలిపాయి. దేశంలోని నగరాలతో పోలిస్తే అగ్రభాగం.. ఆఫీస్ స్పేస్ విషయంలో హైదరాబాద్ దేశంలోని పలు మెట్రో నగరాలతో పోలిస్తే అగ్రభాగాన నిలుస్తోంది. తాజాగా పూర్తిస్థాయిలో వినియోగానికి అనుకూలంగా ఉన్న ఆఫీస్ స్పేస్ లభ్యత నగరంలో 9 కోట్ల చదరపు అడుగుల మైలురాయిని అధిగమించినట్లు ప్రముఖ స్థిరాస్థి కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏషియా, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) సంయుక్త అధ్యయనంలో తేలడం విశేషం. ఐదేళ్లుగా నగరంలో ఆఫీస్ స్పేస్ రెట్టింపయినట్లు పేర్కొంది. ఐటీ, ఐటీ అనుంబంధ రంగాలు, లైఫ్‌సైన్సెస్, ఎల్రక్టానిక్స్ తదితర రంగాల కంపెనీలు పెద్ద ఎత్తున నగరంలో తమ కార్యాలయాలను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించింది. రాబోయే మూడేళ్లలో మరో 3 నుంచి 3.5 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్థలం నగరంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. కారణం ఇదే..! నగరంలో బడా, చిన్న ఐటీ కంపెనీలు ఏడాదిన్నరగా అవలంబిస్తున్న పూర్తి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలికి హైబ్రీడ్ విధానానికి శ్రీకారం చుట్టనున్నాయి. ఆయా కంపెనీల ఉద్యోగుల్లో 70 శాతం మందికి కోవిడ్ టీకా రెండు డోసులు పూర్తయ్యాయి. 95 శాతం మంది కనీసం ఒక డోసు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబరు నుంచి ఉద్యోగుల్ని క్రమంగా కార్యాలయాలకు రప్పించాలని ఆలోచిస్తున్నట్లు హైసియా ప్రతినిధులు తెలిపారు. కొన్ని కంపెనీల్లో ఇంటి నుంచి పని కారణంగా ఉత్పాదకత తగ్గడంతోపాటు కొందరు ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం బయటి ప్రాజెక్టులు చేపట్టడంతో అధిక సమయం వాటిపైనే వెచ్చిస్తున్నట్లు కంపెనీల దృష్టికి వచ్చిందని వారు పేర్కొంటున్నారు. ఉద్యోగుల్ని తిరిగి ఆఫీసుకు రప్పించడానికి ఇదే ప్రధాన కారణమని వారు పేర్కొనడం గమనార్హం. -
మహిళల కోసం.. నారీ స్ఫూర్తి వెబినార్
డాలస్: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మహిళల్లో స్ఫూర్తిని నింపేందుకు నారీ స్ఫూర్తి పేరుతో వెబినార్ నిర్వహించింది. తొలుతగా, వెబినార్‌లో రిపబ్లిక్ రాధారాణి వ్యాపార రంగంతో పాటు సేవారంగంలో తాను సాధించిన విజయాలను వివరించారు. తన వద్ద పనిచేసే ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి వారితో మమేకం కావడమే తన విజయమని రాధారాణి తెలిపారు. అలాగే మనం సంపాదించిన దానిలో సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలనే భావనతో అమ్మ ప్రేమాశ్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామన్నారు. ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీ స్టాలన్టస్ కంపెనీ నార్త్ అమెరికా అండ్ ఆసియా ఫసిపిక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మమత చామర్తి ఈ వెబినార్‌లో తన ప్రస్థానాన్ని వివరించారు. హైదరాబాద్ నుంచి ఉద్యోగం కోసం వచ్చిన మమత ఆటోమొబైల్ రంగంలో అత్యున్నత స్థానాలకు ఎదిగిన విధానాన్ని వివరించారు. తన శక్తిని మాత్రమే నమ్ముకుని ఆటోమొబైల్ కంపెనీలో చిరుద్యోగిగా మమత తన ప్రస్థానాన్ని ప్రారంభించినట్టు ఆమె తెలిపారు.ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని నేర్చుకుంటూ దానిని ఆటోమొబైల్ రంగంలో ఎలా వాడొచ్చనే దానిపై చేసిన కృషే తనను ఈ రోజు ఉన్నత స్థానంలో నిలిపాయని మమత చెప్పుకొచ్చారు. ఎప్పుడూ మనలోని అంతర్గత శక్తిని అభివృద్ధి చేసుకోవడం పైనే దృష్టి పెట్టాలని ఆమె ఈ వెబినార్‌లో పాల్గొన్న వనితలకు సూచించారు. ఏరంగంలోనైనా సమస్యలు, సవాళ్లు సహజమేనని.. వాటిని ఎదుర్కొవడానికి కావాల్సింది మానసిక శక్తే అనే విషయాన్నిగుర్తు పెట్టుకుని అడుగులు వేయాలని మమత తెలిపారు. సాధించాలనే కసి.. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వెయిట్ లిఫ్టర్ కగ్గా శిరోమణి కూడా ఈ వెబినార్‌లో పాల్గొన్నారు. కృషి.. పట్టుదల.. కఠోర సాధనతో శిరోమణి.. ఇప్పటివరకు వెయిట్ లిప్టింగ్లో 136 కు పైగా జాతీయ, అంతర్ జాతీయ పతకాలు సాధించినట్టు శిరోమణి తెలిపారు. ఆడపిల్లలకు ఇలాంటివి ఎందుకు అన్నవారే.. ఇప్పుడు శిరోమణిని చూడండిరా అంటున్నారని ఆమె అన్నారు. కరణం మల్లీశ్వరి స్ఫూర్తితో తాను వెయిట్ లిప్టింగ్ లో ముందుకు సాగుతున్నానన్నారు. కామన్ వెల్త్, ఒలింపిక్స్‌లో తన సత్తా చాటడమే తన ముందున్న లక్ష్యమని శిరోమణి అన్నారు. అయితే తనకు ఆర్థిక సహకారం అందించే స్పాన్సర్లు ఉంటే తనలక్ష్యం నేరవేర్చుకోవడం మరింత సులువు అవుతుందని శిరోమణి తెలిపారు. నాట్స్ నారీ స్ఫూర్తి వెబినార్ కు ప్రముఖ రంగస్థల కళాకారిణి రాజేశ్వరీ వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఈ వెబినార్ నిర్వహణలో నాట్స్ బోర్డ్ వైస్ ఛైర్మన్ అరుణ గంటి, నాట్స్ ఈసీ జాయింట్ సెక్రటరీ జ్యోతి వనం, విమెన్ ఎంపవర్మెంట్ ఛైర్ జయశ్రీ పెద్దిభొట్ల, ప్రొగ్రామ్ ఛైర్ లక్ష్మి బొజ్జ, చికాగో చాప్టర్ ఛైర్ ప్రసుధ, డాలస్ చాప్టర్ ఛైర్ దీప్తి సూర్యదేవర తదితరులు కీలక పాత్ర పోషించారు. ఆన్ లైన్ ద్వారా వందలాది మంది తెలుగు మహిళలు నారీ స్ఫూర్తి ని వీక్షించి స్ఫూర్తిని పొందారు. చివరగా, అరుణ గంటి, జ్యోతి వనం, జయశ్రీ, లక్మి , రాజేశ్వరీలు ఈ కార్యక్రంలో పాల్గొన్న రాధారాణి, మమత మరియు శిరోమణి లను తమ విలువైన సమయాన్ని, నాట్స్ కుటుంబానికి, తద్వారా యావత్ మహిళాలోకానికి తమ తమ అనుభవాలనుపంచి స్ఫూర్తిని నింపినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమం ఇంతగా విజయవంతం అవటానికి తమవంతు కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేశారు. వక్తలు, ప్రేక్షకులు కూడా నేటి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన రాజేశ్వరి ని అందరూ ప్రత్యేకంగా అభినందించారు. ఎంతో క్రీడాస్ఫూర్తితో, భారతదేశ జాతీయ పతాకాన్ని కామన్వెల్త్ , ఒలింపిక్స్ లో రెపరెపలాడించటానికి మనతోటి తెలుగమ్మాయికి ఆసరాగా ఉండటానికి నాట్స్ తనవంతు సాయంగా ఆన్ లైన్ ద్వారా ఫండ్ రైజ్ కూడా ఏర్పాటు చేసి సహాయం చేస్తోంది. భవిష్యత్తులో కూడా సమాజహితంగా ఉండే ప్రతి కార్యక్రమానికి తమ వంతు సాయం చేస్తామని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు శేఖర్ అన్నే తెలియచేస్తూ, నాట్స్ విమెన్ టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించారు -
బాస్కే సైబర్ వేధింపులు!
సాక్షి, సిటీబ్యూరో: వర్క్ ప్లేస్ హెరాస్‌మెంట్‌లో ఇదో కొత్త కోణం. సాధారణంగా తమ కింద పని చేసే మహిళల్ని వేధించే బాస్‌ల వ్యవహారాలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అయితే తన బాస్ అయిన ఓ మహిళను ఈ–మెయిల్స్ ద్వారా వేధించాడో ఉద్యోగి. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేశారు. బండ్లగూడకు చెందిన ఇ.లక్ష్మీకాంత్‌ను నిందితుడిగా గుర్తించి గురువారం అరెస్టు చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన ఇ.లక్ష్మీకాంత్ రాజేంద్రనగర్ సమీపంలోని బండ్లగూడలో స్థిరపడ్డాడు. వివాహితుడైన ఇతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. న్యూ బోయిన్పల్లి ప్రాంతంలో ఉన్న ఓ లేడీస్ గార్మెంట్స్ డిజైనింగ్ సంస్థలో పని చేస్తున్నాడు. ఈ సంస్థను అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ నిర్వహిస్తున్నారు. లక్ష్మీకాంత్ ‘యువర్ మై బెస్ట్ లవర్’ పేరుతో జీమెయిల్ ఖాతా తెరిచాడు. దీన్ని వినియోగించి కొన్నాళ్ళుగా తన యజమానికే ప్రేమ సందేశాలు పంపిస్తున్నాడు. ఇది పోకిరీల పనిగా భావించిన ఆమె విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే వ్యవహారం శృతిమించి కొన్ని రోజుల నుంచి అశ్లీల చిత్రాలను ఈ–మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఆమె సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ సీహెచ్ గంగాధర్ సాంకేతికంగా దర్యాప్తు చేశారు. ఈ–మెయిల్ ఐడీతో పాటు ఇతర అంశాల ఆధారంగా సదరు మహిళ వద్ద పని చేస్తున్న లక్ష్మీకాంతే నిందితుడిగా గుర్తించారు. గురువారం అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. ఆ మెయిల్స్‌ను నగరంలోని ఓ ఇంటర్నెట్ కేఫ్ నుంచి పంపినట్లు బయటపెట్టాడు. -
18 ఏళ్లుగా బొమ్మను వదలడం లేదు..!!
వాషింగ్టన్ : మానవ సంబంధాలు పలుచనవుతున్న పాశ్చాత్య సమాజంలో ఓ తండ్రీ కూతుళ్ల ప్రేమానుబంధం అందరికీ ముచ్చటగొల్పుతోంది. కూతురిపై అమితమైన ప్రేమ కురిపించే ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? 18 ఏళ్ల క్రితం ఆమె చెప్పిన మాటను రోజూ గుర్తు చేసుకుంటున్నాడు. రెండేళ్ల పాపాయిగా ఉన్నప్పుడు ఆమె ఇచ్చిన కానుకను ఆ తండ్రి ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాడు. ముద్దు ముద్దు మాటలతో తన కూతురు సమంత హోల్మ్స్ (20) ‘నేను లేనప్పుడు ఈ బొమ్మతో ఆడుకో డాడీ’ అంటూ తండ్రి పాట్ హోల్మ్స్కు ఇచ్చిన తాబేలు బొమ్మను అతను ప్రతి నిత్యం తన బ్యాగులో భద్రంగా దాచుకొని ఆఫీస్‌కి కూడా తీసుకెళ్తున్నాడు. సినిమాలు, షికార్లు, విహార యాత్రలు..ఇలా ఎక్కడికెళ్లినా కూతురిచ్చిన ఆ బొమ్మను మాత్రం వదలడు. కొడుకు జాక్, కూతురు సమంతలు తనకు దేవుడిచ్చిన వరం అంటూ పొంగిపోతున్నాడు పాట్. ‘మానవ విలువలు దిగజారకుండా ఉండాలంటే ప్రతి వ్యక్తికి ఒక కుటుంబం అంటూ ఉండాలి. అప్పుడే జీవితంలోని మంచి, చెడులు.. కష్ట నష్టాల విలువ తెలుస్తుంది’ అంటున్నాడు పాట్ హోల్మ్స్. తండ్రి తనపై కురిపించే ప్రేమలో సమంత తడిసి ముద్దవుతోంది. ‘ప్రతి సందర్భంలోనూ మేమంతా కలిసే ఉంటాం. ఏ చిన్న పండగయినా, విశేషమయినా కుటుంబంతో కలిసే జరుపుకుంటాం. నెలలో 30 రోజులుంటే దాదాపు 28 రోజులు కుటుంబం అంతా కలిసి డిన్నర్ చేస్తాం’ అంటూ సమంత తల్లిదండ్రులు, సోదరుడితో తన అనుబంధాన్ని వెల్లడించింది. -
కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం
కాలిఫోర్నియా : అగ్రరాజ్యం మరోసారి కాల్పులతో ఉలిక్కి పడింది. కాల్పుల ఘటనలో ఇద్దరు మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సౌత్ కాలిఫోర్నియా, నార్త్ లాంగ్ బీచ్‌లోని న్యాయ సిబ్బంది కార్యాలయాల సముదాయంలో శుక్రవారం మధ్యాహ్నాం ఈ ఘటన చోటు చేసుకుంది. లాంగ్ బీచ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండస్థుల ఆ భవనంలో న్యాయవాదుల కార్యాలయాలు ఉన్నాయి. మధ్యాహ్నాం సమయంలో ఓ వ్యక్తి తుపాకీతో లోపలికి వెళ్లి కాల్పులు జరపటంతో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది కూడా. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే స్వాట్ బృందం అక్కడికి చేరుకుంది. అయితే కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఇద్దరిని కాల్చాక తనని తాను కాల్పుచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొలుత కాల్పుల ఘటనపై ప్రకటించిన పోలీసులు.. తర్వాత సవరించుకుని హత్యగా ప్రకటించారు. నిందితుడు అక్కడే పని చేసే వ్యక్తిగా గుర్తించిన పోలీసులు.. పాత గొడవలతోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడు, బాధితుడి పేర్లు తెలియరాలేదు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందజేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Have been briefed on shooting in law offices in North Long Beach. Appears to be a workplace homicide. Both the shooter and a victim are dead. One other person was shot but is in hospital in stable condition. Our thoughts are with the victims and their families LBPD will update. — Robert Garcia (@RobertGarciaLB) December 30, 2017 -
ఆ గొడవల్లో పురుషులు, స్త్రీల స్పందనల్లో తేడా..
లండన్: ఉద్యోగ జీవితంలో బాస్‌తో, సహచరులతో గొడవలు పడే అలవాటు ఉందా. ఒకవేళ ఉంటే.. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. వర్క్ ప్లేస్‌లో గొడవల విషయంలో మహిళా ఉద్యోగులు, పురుష ఉద్యోగుల స్పందించే తీరు వేరు వేరుగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. వర్క్ ప్లేస్‌లో గొడవలు పడే పురుష ఉద్యోగులు ఆ ఉద్యోగాన్నే వదిలేయడానికి మొగ్గుచూపుతారని.. అదే మహిళలు మాత్రం కొన్నాళ్లు సిక్ లీవ్‌లో వెళ్లడం లేదా ఒత్తిడిని తగ్గించుకోవడానికి యాంటీ డిప్రెసెంట్స్‌ను వాడటం చేస్తుంటారని డెన్మార్క్‌కు చెందిన అర్హస్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే సుమారు 3000 మంది అభిప్రాయాలు తీసుకోగా.. వీరిలో ఏడు శాతం మంది తాము వర్క్‌ప్లేస్‌లో గొడవల బాధితులమే అని వెల్లడించారు. ఈ బాధితుల్లో 43 శాతం మంది పురుషులు ఉన్నారు. కాగా.. వర్క్ ప్లేస్‌లో గొడవలు పురుషుల ప్రమోషన్లు, జీతాలపై ప్రభావం చూపుతాయని పరిశోధనలో పాల్గొన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ముంజెర్గ్ ఎరిక్సన్ వెల్లడించారు. గొడవలతో పురుషులు సిక్ లీవ్‌లకు వెళ్లడం మాత్రం జరగదని ఆమె పేర్కొన్నారు. వర్క్‌ప్లేస్‌లో గొడవల మూలంగా కీలకమైన బాధ్యతలు కాకుండా అంతగా ప్రాధాన్యత లేని బాధ్యతలు ఉద్యోగులు పొందుతారని పరిశోధనలో గుర్తించారు. -
అమెరికాలో తగ్గుతున్న మహిళా ఉద్యోగులు
ఫ్రాన్స్: ఆర్థిక సహకారం, అభివృద్ధి సంఘం (ఓఈసీడీ) సభ్య దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ఆశ్చర్యంగా అమెరికాలో తగ్గిపోతోంది. 20 ఏళ్ల క్రితం, అంటే 1995లో మహిళలు ఉద్యోగాలు చేయడంలో అమెరికా జపాన్కన్నా ముందు ఉండగా ఇప్పుడు జపాన్ కన్నా వెనకబడి పోయింది. అమెరికా, డెన్మార్క్ మినహా ఓఈసీడీలోని 35 సభ్య దేశాల్లో ప్రధానంగా 2,000 సంవత్సరం నుంచే ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. 2000 నుంచి 2015 నాటికి మహిళల ఉద్యోగాల ఇండెక్స్‌లో అమెరికా ఆరు శాతం పాయింట్లు నష్టపోయి నేడు 63 శాతానికి చేరుకుంది. అదే జపాన్ 14 శాతం పాయింట్లు పుంజుకొని 65 శాతం పాయింట్లకు చేరుకొంది. ప్రస్తుతం అమెరికా కన్నా జపాన్‌లోనే మహిళలు ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్నారు. అమెరికాతోపాటు డెన్మార్క్‌లో కూడా ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య తగ్గిపోయినప్పటికీ 70 శాతం పాయింట్లతో ఇప్పటికీ ప్రపంచంలోకెల్లా డెన్మార్క్‌లోనే ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. డెన్మార్క్ తర్వాత స్థానాల్లో జర్మనీ, కెనడా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయి. ఈ విషయంలో ఫ్రాన్స్ వేగంగా పురోగమిస్తున్నప్పటికీ ఇప్పటికీ అది అమెరికాకన్నా వెనుకబడే ఉన్నది. 61శాతం పాయింట్లతో, అంటే రెండు శాతం పాయింట్లతో వెనకబడిన ఫ్రాన్స్, అమెరికాను అధిగమించడానికి ఎంతో కాలం పట్టదని ఓఈసీడీ విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడిస్తోంది. ఓఈసీడీలోని పలు దేశాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య నానాటికి పెరగడానికి కారణం ఆయా దేశాల్లో మహిళలను ప్రోత్సహించేందుకు ఇస్తున్న సౌకర్యాలు, రాయితీలే ప్రధాన కారణం. మాతృత్వంతోపాటు పితృత్వం సెలవులు ఇస్తుండడమే కాకుండా కొన్ని దేశాల్లో కొత్త దంపతులకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారు. చైల్డ్ కేర్ సెంటర్లకు సబ్సిడీలు కూడా ఇస్తున్నారు. అమెరికాలో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య క్రమంగా తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చైల్డ్‌కేర్ సెంటర్లు అక్కడ బాగా ఖరీదవడం ప్రధాన కారణం కాగా, ఉద్యోగులకు వేతనాలతో కూడా పేరెంట్స్ సెలవులు ఇవ్వకపోవడం, ద్రవ్యోల్బణం పెరగడం ఇతర కారణాలు. జపాన్‌లో తల్లిదండ్రులిద్దరూ 58 వారాలపాటు వేతనాలతో కూడిన సెలవులు తీసుకోవచ్చు. జర్మనీలో బాలింతలు 58 వారాలు, జర్మనీలో 58 వారాలు, కెనడాలో 52, డెన్మార్క్‌లో 50, ఫ్రాన్స్‌లో 42, బ్రిటన్‌లో 39 వారాలపాటు వేతనాలతో కూడిన సెలవులు తీసుకోవచ్చు. ఇక తండ్రులు ఫ్రాన్స్‌లో 28 వారాలు, జర్మనీలో తొమ్మిది, బ్రిటన్, డెన్మార్క్‌లో రెండు వారాలపాటు సెలవులు తీసుకోవచ్చు. అమెరికాలో చైల్డ్‌కేర్ సెంటర్లకు ఓ కుటుంబానికి వచ్చే ఆదాయంలో మూడోవంతు భాగాన్ని చెల్లించాల్సి వస్తోంది. తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలు వీటి ఖర్చును భరించలేక పోతున్నాయి. అందుకని ఎక్కువ మంది మహిళల ఇంటిపట్టున ఉండి పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకునేందుకు ఇష్టపడుతున్నారు. -
ఫేస్బుక్ బిజినెస్ యాప్ ఇక అందరికీ...
శాన్ ఫ్నాన్సిస్కో: సరికొత్త ఆవిష్కరణలతో యూజర్లను ఉత్సాహాన్నిస్తున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తన తాజా మొబైల్, బిజినెస్ యాప్ ను అధికారికంగా లాంచ్ చేసి ఇక ధరల యుధ్దానికి తెరలేపింది. 'ఫేస్ బుక్ ఎట్ వర్క్' అనే పేరుతో లాంచ్ చేసిన సర్వీసును వర్క్ ప్లేస్ పేరుతో ఇక అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక దీన్ని వ్యాపార వర్గాల వారందరూ వినియోగించకోవచ్చని మంగళవారం ప్రకటించింది.ఇంటర్నల్ మెయిల్స్, న్యూస్ లెటర్స్ లాంటి పాత టెక్నాలజీకు ప్రత్యామ్నాయంగా తమ యాప్ పనిచేస్తుందని ఫేస్ బుక్ వర్క్ ప్లేస్ గ్లోబల్ హెడ్ జూలియన్ కోడోర్ నియో తెలిపారు. దీని ద్వారా తోటి ఉద్యోగులతో కలిసి సమర్థవంతంగా పనిచేసుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి, పనిస్థలాల్లో ఉత్పాదకత పెంపుదలకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,000 పైగా సంస్థలు నుంచి వచ్చిన సానుకూల స్పందనతో, ఆయాప్ ను ఏ కంపెనీ లేదా సంస్థకు అందుబాటులో ఉంచడం చాలా సంతోషంగా ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ యాప్ ను ఐదు దేశాలలో భారతదేశం, అమెరికా, నార్వే, బ్రిటన్ మరియు ఫ్రాన్స్ లలో వాడుతున్నారని పేర్కొంది. వర్క్ ప్లేస్ యాప్ అన్ని కార్పొరేట్లకు , సంస్థలకు అందరికీ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. సంవత్సరకాలంగా ప్రయోగ దశలో ఉన్న ఈ యాప్ ను ఇపుడు అన్ని వ్యాపార వర్గాల వారికోసం అధికారికంగా లాంచ్ చేసింది. అయితే దీనికి సబ్ స్క్రిప్లన్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రకటనల ఆధారిత వర్క్ ప్లేస్ యాప్ కోసం వినియోగదారుడు ఒక డాలర్ నుంచి 3 డాలర్లు చెల్లించాలి. దీనిసహాయంతో రియల్ టైంలో లో ప్రపంచవ్యాప్తంగా సహోద్యోగితో చాట్ చేయవచ్చు ఒక గ్రూప్ లో మేథోమథనం కార్యక్రమం సృష్టించుకోవచ్చు...అలాగే ఫేస్ బుక్ లైవ్‌లో సీఈవో ప్రజెంటేషన్ కూడా చూడొచ్చని కంపెనీ వెల్లడించింది. .డానోన్, స్టార్‌బక్స్ మరియు బుకింగ్. కాంలాంటి వంటి పెద్ద బహుళజాతి కంపెనీలు, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఆక్స్ ఫాం, భారత్ లో ఎస్ బ్యాంక్ , సింగపూర్ ప్రభుత్వం సాంకేతిక ఏజెన్సీ లు ఈ యాప్ వాడుతున్నట్టు వివరించింది.