సాధారణంగా పడుకుని నిద్రపోవడమే మనకు అలవాటు. కొంతమంది బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు, ఆఫీసుల్లోనూ కూర్చుని కూడా కునుకు తీస్తుంటారు. జపాన్‌లోని హొక్కాయిడో నగరానికి చెందిన కొయోజు ప్లైవుడ్ కార్పొరేషన్ అనే సంస్థ రూపొందించిన ఈ స్లీపింగ్ పాడ్స్‌లో నిలువునా నిలబడి కూడా కునుకు తీయవచ్చు. ‘గిరాఫెనాప్’ పేరుతో 8.4 అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో ఈ స్లీపింగ్ పాడ్స్‌ను రూపొందించారు.
ఇది చూడటానికి పాతకాలం టెలిఫోన్ బూత్‌లా ఉన్నా, ఇందులో చాలా సౌకర్యాలే ఉంటాయి. ఇందులో కూర్చుని, డెస్క్‌పై పనిచేసుకోవచ్చు. నిలబడి కునుకు తీయాలనుకుంటే, ఇందులోని ఒక మీట నొక్కితే చాలు– కూర్చీ నిలువునా పైకి లేస్తుంది. ఇందులో తలవాల్చుకునేందుకు దిండు కూడా ఉంటుంది. మన ఎత్తుకు తగినట్లుగా దిండు ఎత్తును సవరించుకునే వెసులుబాటు కూడా ఉంది. పని ప్రదేశాల్లో నిద్రపోవడాన్ని అనుమతించే జపాన్‌లో ఇదొక కొత్త ఆకర్షణగా మారింది.
(చదవండి: ఇంద్రభవనంలా ఉన్నా ఆ ప్యాలెస్ ఏంటో చూస్తే..షాకవ్వడం ఖాయం!)
Comments
Please login to add a commentAdd a comment