SLIM: జాబిల్లిపై మళ్లీ నిద్రలోకి జపాన్‌ ‘స్లిమ్‌’ ల్యాండర్‌ | Japan Moon Lander Went To Sleep Again After Surviving Lunar Night, Know Details Inside - Sakshi
Sakshi News home page

Japan Moon Lander: జాబిల్లిపై మళ్లీ నిద్రలోకి జపాన్‌ ‘స్లిమ్‌’ ల్యాండర్‌

Published Sat, Mar 2 2024 9:15 AM | Last Updated on Sat, Mar 2 2024 9:48 AM

Japan Moon Lander Went To Sleep Again - Sakshi

టోక్యో: చందమామ మీద రాత్రి వేళల్లో ఉండే అసాధారణ చలిని తట్టుకుని రెండు వారాల తర్వాత మేల్కొని చరిత్ర సృష్టించిన జపాన్‌ మూన్‌ ల్యాండర్‌ స్లిమ్‌(స్మార్ట్‌ ల్యాండర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేటింగ్‌ మూన్‌) నిద్రలోకి జారకుంది. జపాన్‌ కాలమానం ప్రకారం శుక్రవారం(మార్చ్‌1)వ తేదీన ఉదయం మూడు గంటలకు స్లిమ్‌ నిద్రలోకి వెళ్లింది. ఈ విషయాన్ని జపాన్‌ ఎయిరోస్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఏజెన్సీ(జాక్సా) ఎక్స్‌(ట్విటర్‌)లో వెల్లడించింది.

రెండు వారాల తర్వాత చంద్రుని మీద మళ్లీ సూర్యుడు ఉదయించాక స్లిమ్‌ను పనిచేయించడానికి ప్రయత్నిస్తామని జాక్సా తెలిపింది. అయితే జాబిల్లి మీద ఉన్న అసాధారణ ఉష్ణోగ్రతల మార్పుల వల్ల స్లిమ్‌ మళ్లీ పనిచేసేందుకు అవకాశాలు తక్కువేనని పేర్కొంది. స్లిమ్‌ను కచ్చితమైన ల్యాండింగ్‌ జోన్‌ టార్గెట్‌ టెక్నాలజీతో డిజైన్‌ చేసినందున దీనిని మూన్‌ స్నైపర్‌గా కూడా పిలిచారు.

చంద్రునిపై ల్యాండర్లను సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన దేశాల్లో భారత్‌ తర్వాత జపాన్‌ ఐదో దేశంగా చరిత్రకెక్కింది. కాగా, అమెరికా అంతరిక‌్ష పరిశోధన కేంద్రం నాసా, ప్రైవేట్‌ కంపెనీ ఐఎమ్‌ సంయుక్తంగా చంద్రునిపైకి పంపిన ఒడిస్సియస్‌ గురువారం(ఫిబ్రవరి 29) చంద్రుని నుంచి ఆఖరి చిత్రాన్ని పంపింది. పవర్‌ బ్యాంకుల్లోని ఇంధనం ఖాళీ అవడంతో ఒడిస్సియస్‌ ల్యాండ్‌ అయిన వారం రోజుల తర్వాత శాశ్వత నిద్రలోకి జారుకుంది.  చంద్రుని మీద ఒక్క రాత్రి పూర్తవ్వాలంటే భూమి మీద రెండు వారాలు గడవాలి. 

ఇదీ చదవండి.. టెక్సాస్‌లో విజృంభిస్తున్న కార్చిచ్చు.. భారీగా నష్టం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement