Slim
-
జపాన్ వనితలా స్లిమ్‌గా ఉండాలంటే..! ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ప్రస్తుతం మనదేశంలో చాలమంది టీనేజర్లు అధిక బరువుతో బాధపడుతున్నారు. ప్రతి పదిమందిలో ఐదుగురు అధిక బరువు సమస్యతో బాధపుతున్నారంటే..పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. అయితే జపాన్, కొరియా లాంటి దేశాల్లో అమ్మాయిలు బొమ్మల్లా, భలే అందంగా ఉంటారు. పెళ్లి అయ్యిందో లేదో కూడా చెప్పలేం అంత స్లిమ్‌గా యవ్వనంగా కనిపిస్తారు. మరీ వాళ్లు అంతలా ఉండేందుకు గల ఫిటెనెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.ఏం చేయాలంటే..జపాన్ వాళ్లు నాజుగ్గా ఉండేందకు కఠినమైన ఆహార నియమావళిని ఫాలో అవుతారట. ఇది వారికి ఆరోగ్యంగా ఉండేదుకే గాక దీర్ఘాయువుతో ఉండటానికి ఉపయోగపడుతుందట. వాళ్లు కడుపు నిండుగా అస్సలు తినరట. భోజనం చేసేటప్పుడు ఉదర ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తింటారట. కేలం 80 శాతమే తిని మిగతా భాగం సాఫీగా అరిగిపోయేందుక వీలుగా ఖాళీగా ఉంచుతారట. అందువల్ల జీర్ణ సమస్యలు ఉండువు, బానపొట్టలా రాదు కూడా. అలాగే వాళ్లు ఫుడ్ ప్లేట్లు చిన్నవే ఎంచుకుంటారట. ఇలా చేస్తే ఆహారం ప్లేటు నిండుగా ఉన్న ఫీల్ తోపాటు ఎక్కువ తింటున్నాం అనే అనుభుతి కలగడంతో తక్కువగానే తింటామని వారి నమ్మకం. అలాగే రెండోసారి వేసుకుని తినడానికి ఆలోచిస్తారట. నచ్చిందని గమ్మున వేసుకుని తినేయరట. అదీగాక భోజనం చేసేటప్పుడూ మొబైల్స్, టీవీ, కంప్యూటర్లు చూస్తు అస్సలు తినరు. భోజనంపై ధ్యాస ఉంచి తినడానికి ప్రాధాన్యత ఇస్తారట. అలాగే నమిలినమిలి మైండ్‌ఫుల్‌నెస్‌తో తింటారట. ఇలా చేయడం వల్ల మంచిగా ఆహారం జీర్ణమవ్వడమే గాక అధిక బరువు వంటి సమస్యలను ఎదుర్కొనరు. పైగా నాజుగ్గా అందంగా ఉంటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరీ..!.(చదవండి: 'లైట్‌హౌస్ పేరెంటింగ్': పిల్లలు ప్రయోజకులయ్యేందుకు ది బెస్ట్!) -
స్లిమ్‌గా మారిన నటి విద్యాబాలన్..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. కొన్నాళ్లు కాస్తా బొద్దుగా తయారయ్యి..సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలారోజుల తర్వాత బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నటించిన చందు ఛాంపియన్ మూవీ ప్రదర్శనకు హాజరైన విద్యాబాలన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా ఆమె లుక్ అంతా మారిపోవడంతో..ఇంతలా స్లిమ్గానా అంటూ.. అందరి చూపులు ఆమెపైనే. చెప్పాలంటే ఈ కార్యక్రమంలో విద్యాబాలన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అక్కడంతా విద్య నాజుగ్గా మారడమే హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమంలో విద్య సోదరి కుమారుడు కూడా వచ్చాడు. ఆమె బ్లాక్ డ్రస్‌లో ఓ రేంజ్ స్టన్నింగ్ లుక్‌తో కనిపించింది. గోల్డెన్ కలర్ చెవుపోగులు, లైట్ మేకప్‌తో గ్లామరస్‌గా ఉంది. అంతేగాదు ఫిట్‌గా ఉండాలని కోరుకునేవారికి స్ఫూర్తిగా ఉంది విద్య. మల్లెతీగలా కనిసిప్తున్న ఈ బ్యూటీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటని ఆరాతీస్తున్నారు. అయితే విద్య అంతలా స్లిమ్ అవ్వడానికి ఎలాంటి వర్కౌట్లు చేసిందంటే..ప్రతి రోజు వ్యాయమం చేసే అవకాశం లేకపోయిన కనీసం రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్ వంటివి చేయడంకూల్డ్రింగ్స్, అధిక చక్కెర గల పళ్ల రసాలతో సహా టీ, కాఫీలకు దూరంగా ఉండటంరోజంతా హైడ్రేషన్‌గా ఉండేలా నీళ్లు బాగా తాగేదని, ఇది ఆకలిని కంట్రోల్ చేసేందుకు ఉపకరించిందని వ్యక్తిగత ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. అలాగే రోజుకి ఏడు నుంచి తొమ్మిది గంటలు మంచిగా నిద్రపోవడం. నాణ్యమైన నిద్ర ఉంటే ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది.ప్రతి ముద్ద ఆస్వాదిస్తూ తినడం వంటివి చేయాలి. దీనివల్ల ఆకలి అదుపులో ఉంటుంది. టీవీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లుకు దూరంగా ఉండటం వంటివి చేస్తే..ఎవ్వరైనా..ఇట్టే బరువు తగ్గిపోతారని నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ట్రై చెయ్యండి.(చదవండి: చేపను పోలిన భవనం..ఎక్కడుందంటే..?) -
SLIM: జాబిల్లిపై మళ్లీ నిద్రలోకి జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్
టోక్యో: చందమామ మీద రాత్రి వేళల్లో ఉండే అసాధారణ చలిని తట్టుకుని రెండు వారాల తర్వాత మేల్కొని చరిత్ర సృష్టించిన జపాన్ మూన్ ల్యాండర్ స్లిమ్(స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్) నిద్రలోకి జారకుంది. జపాన్ కాలమానం ప్రకారం శుక్రవారం(మార్చ్1)వ తేదీన ఉదయం మూడు గంటలకు స్లిమ్ నిద్రలోకి వెళ్లింది. ఈ విషయాన్ని జపాన్ ఎయిరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ(జాక్సా) ఎక్స్(ట్విటర్)లో వెల్లడించింది. రెండు వారాల తర్వాత చంద్రుని మీద మళ్లీ సూర్యుడు ఉదయించాక స్లిమ్‌ను పనిచేయించడానికి ప్రయత్నిస్తామని జాక్సా తెలిపింది. అయితే జాబిల్లి మీద ఉన్న అసాధారణ ఉష్ణోగ్రతల మార్పుల వల్ల స్లిమ్ మళ్లీ పనిచేసేందుకు అవకాశాలు తక్కువేనని పేర్కొంది. స్లిమ్‌ను కచ్చితమైన ల్యాండింగ్ జోన్ టార్గెట్ టెక్నాలజీతో డిజైన్ చేసినందున దీనిని మూన్ స్నైపర్‌గా కూడా పిలిచారు. చంద్రునిపై ల్యాండర్లను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాల్లో భారత్ తర్వాత జపాన్ ఐదో దేశంగా చరిత్రకెక్కింది. కాగా, అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా, ప్రైవేట్ కంపెనీ ఐఎమ్ సంయుక్తంగా చంద్రునిపైకి పంపిన ఒడిస్సియస్ గురువారం(ఫిబ్రవరి 29) చంద్రుని నుంచి ఆఖరి చిత్రాన్ని పంపింది. పవర్ బ్యాంకుల్లోని ఇంధనం ఖాళీ అవడంతో ఒడిస్సియస్ ల్యాండ్ అయిన వారం రోజుల తర్వాత శాశ్వత నిద్రలోకి జారుకుంది. చంద్రుని మీద ఒక్క రాత్రి పూర్తవ్వాలంటే భూమి మీద రెండు వారాలు గడవాలి. 3/1午前3時過ぎ(日本標準時)にしおりクレータは日没を迎え、SLIMは再び休眠に入りました。厳しい温度サイクルを繰り返すことになるため故障確率は上がりますが、次回の日照(3月下旬)でもSLIMは再び運用を試行する予定です。#JAXA #SLIM #たのしむーん 2/29 23:00過ぎ 航法カメラによる周辺画像 pic.twitter.com/xutv56uSU9 — 小型月着陸実証機SLIM (@SLIM_JAXA) March 1, 2024 ఇదీ చదవండి.. టెక్సాస్‌లో విజృంభిస్తున్న కార్చిచ్చు.. భారీగా నష్టం -
మెరుపు తీగలా మారిపోయిన ఓప్రా విన్ఫ్రే!
ఓప్రా విన్ఫ్రే ప్రపంచ ప్రసిద్ధి చెందిన టీవీ వ్యాఖ్యాత. ఆమె టీవీ షో ది ఓప్రా టాక్ షో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఈ షో ఆమెకు గ్లోబల్ సెలబ్రెటీ స్టేటస్ హోదా తెచ్చిపెట్టింది. ఆమె కూడా గత కొంతకాలం ఒబెసిటీ సమస్యలు ఎదుర్కొన్నారు. అధిక బరువుతో ట్రోలింగ్ గురయ్యారు. ఏమైందో ఏమో కొన్నాళ్ల వరకు కనిపించకుండా పోయి సడెన్‌గా స్లిమ్‌గా మారిపోయి అలానాటి ఓప్రాని తలిపించేలా మారిపోయింది. ఇప్పుడు ఫిట్‌నెస్‌పై ఛాలెంజ్‌లు విసురుతు ఎలా బరువు తగ్గించుకోవాలో అందరికీ పాఠాలు చెప్పేస్తోంది. 70 ఏళ్ల విన్ఫ్రే గత కొన్ని దశాబ్దాలుగా భారీ కాయంతో ఇబ్బందు ఎదర్కొంది. చాలామంది ముఖం మీద లావుగా ఉన్నారని అనడం, ట్రోలింగ్ వంటి వాటితో విసుగుపోయింది. అదీగాక 2021లో మోకాలి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఇక ఆమెకు బోలెడెంత్ రెస్ట్ దొరికింది. ఇకం అంతే ఇదే సమయం అనుకుని బరువు తగ్గే విషయంపై దృష్టి పెట్టింది. పూర్తిగా బాడీ ఫిట్‌నెస్‌పై దృష్టి కేంద్రీకరించినట్లు స్వయంగా ఆమె వెల్లడించింది. ఆకలిని నియంత్రించుకునేలా వైద్యుల సూచనలతో కొన్ని రకాల మందులు వాడుతున్నట్లు కూడా వెల్లడించింది. మంచి ఫిటనెస్ నిపుణుల సాయంతో మంచిగా డైట్‌ని ఫాలో అయి బరువు తగ్గినట్లు వెల్లడించారు. ఇప్పుడు తనకెంతో హాయిగా ఉందని ఆనందంగా చెబుతుంది. భారీ కాయం నుంచి నాకిప్పటికీ విముక్తి లభించింది. అందుకోసం ఆమె ప్రతి రోజు ఐదు నుంచి మూడు మైల్లు వాకింగ్, వారాంతరాల్లో 10 మేళ్లకు పైగా నడవటం, రోజుకు గాలన్ నీరు తాగటం వంటివి తీసుకున్నట్లు తెలిపింది. ఎలాగైన తాను తగ్గాలని గట్టిగా సంకల్పించుకుని ఇన్ఫ్ల్యూయెన్షియల్ పర్సనాలిటీగా ఆవిర్భవించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఐతే ఆమె వైద్యపరంగా బరువు తగ్గేందుకు ఎలాంటి మందులు వాడిందనేది వెల్లడించకపోయినా వైద్యుల సూచనల ప్రకారం డైట్ ఫాలో అయ్యి తగ్గానని పరోక్షంగా చెప్పింది. ఒకనొక దశలో ఎంత సంకల్పశక్తి ఉన్న బరువు తగ్గడం కష్టం అనిపించింది కానీ కఠినమైన ఫిట్నెస్ ఫాలో అయ్యి నిపుణుల సలహాలు తీసుకుంటే పెద్దకష్టమేమి కాదని అంటోంది. ఇప్పుడామె బాగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారికి ఆదర్శంగా నిలవడమేగాక ఎలా బరువు తగ్గాలో సలహాలు కూడా ఇచ్చేస్తోంది. బరువు తగ్గాలనుకుంగే ఏజ్‌తో సంబంధం లేదని కూడా ఫ్రూవ్ చేసింది ఓప్రా విన్ఫ్రే. (చదవండి: ఫ్లూ జ్వరంలా ఉందని తేలిగ్గా తీసుకుంది..కట్ చేస్తే అంతలోనే..) -
ఈ చైర్లో కూర్చొంటే..దెబ్బకు బెల్లీ ఫ్యాట్ మాయం!
శరీరంలో ఏ భాగం పెరిగినా.. తగ్గినా పెద్దగా తేడా ఉండదు కానీ పొట్ట, నడుము దగ్గర కొవ్వు చేరితే మాత్రం మొత్తం శరీరాకృతే మారిపోతుంది. అందుకే మొదట పొట్ట తగ్గించుకోవాలి అనుకునేవారు.. ఇలాంటి బ్యాలెన్స్ చైర్‌ని ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ వ్యాయామ పరికరం.. నడుము, తొడభాగాలను తగ్గించడంతో పాటు ఉదర కండరాలను దృఢంగా మారుస్తుంది. దీనిపై కూర్చున్నప్పుడు అటూ ఇటూ ఒరిగేందుకు వీలుగా రూపొందింది ఇది. దీని కింద అమర్చుకోవడానికి ఒక గుండ్రటి రింగ్ కూడా లభిస్తుంది. అలాగే ఇరువైపులా సపోర్టింగ్ కోసం హ్యాండిల్స్ ఉంటాయి. నిజానికి ఆ హ్యాండిల్స్ లేకుండా కూడా ఇందులో కూర్చుని బాలెన్స్ చేసుకోవచ్చు. ఈ చైర్లో కూర్చుని.. ప్రతిరోజూ వ్యాయామం చేసినట్లయితే.. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. శరీర సౌష్టవాన్ని సంరక్షించుకోవచ్చు. ఈ చైర్స్ మార్కెట్లో రెడ్, బ్లాక్, బ్లూ, పింక్, ఆరెంజ్ వంటి రంగుల్లో దొరుకుతున్నాయి. ధర 152 డాలర్లు. అంటే 12,647 రూపాయలు. (చదవండి: ఇంట్లోనే ఈజీగా మసాజ్ చేయించుకోవచ్చు ఇలా..!) -
స్లిమ్‌గా కనిపించాలని ఆ మాత్రలు వేసుకుంది!..అంతే ఆమె..
స్లిమ్‌గా, నాజుగ్గా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందులో తప్పులేదు. కానీ అందుకోసం అనుసరించే పద్ధతులు ఆరోగ్యకరమైన రీతిలో ఉంటే పర్లేదు. షార్ట్‌కట్‌లో త్వరితగితన తగ్గాలని రకరకాల ట్రీట్మెంట్లు, మందులు జోలికి వెళ్తే మాత్రం లేనిపోని సమస్యలు తలెత్తడమే గాక ఒక్కోసారి అదే మీ ప్రాణాలు కోల్పోయే స్థితికి తీసుకోస్తాయి కూడా. అందుకు ఈ ఉదంతమే ఉదహరణ. కూతురు పెళ్లిలో చక్కగా స్లిమ్‌గా కనిపించాలనుకోవడమే శాపమై ప్రాణాలను కోల్పోయేలా చేసింది. ఈ విషాధ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఆస్ట్రేలియాకు చెందిన 56 ఏళ్ల ట్రిష్ వెబ్‌స్టర్ మహిళ తన కూతురు పెళ్లిలో స్లిమ్‌గా కనిపించాలనుకుంది. అందుకోసం వైద్యులను సంప్రదించి మరీ ఓజెంపిక్ మాత్రలను వాడటం ప్రారంభించింది. ఆ మ్రాతలను వాడిన ఐదు నెలల్లోనే ఏకంగా 15 కిలోల బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బరవు తగ్గుతుందనుకునే లోపు ఉన్నటుండి హఠాత్తుగా ఓ రోజు కుప్పకూలి చనిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెకు సీఆర్పీ చేసి.. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది. దీన్ని ప్రధానంగా టైప్-2 మధుమేహానికి ఉపయోగిస్తారు. చర్మం కింద ఇంజెక్షన్‌గా ఉపయోగిస్తారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానకి సమర్థవంతంగా ఉంటుందని పేషెంట్లకు ఈ మాత్రను సూచిస్తుంటారు. అదే ఆమెకు శాపమై జీర్ణశయాంతర వ్యాధికి దారితీసి చనిపోయినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. బరువు తగ్గేందుకు ఉపయోగిస్తారా? ఈ ఓజెంపిక్ మాత్రను బరువు తగ్గించడానికి ప్రసిద్ధ ఔషధంగా ఉపయోగిస్తారు. సహజ హర్మోన్ జీఎల్పీ-1ను ప్రేరిపించి బరువు కోల్పోయేలా చేస్తుంది. ఇది కడుపు, ప్రేగుల్లోకి ఆహారం వెళ్లడాన్ని నెమ్మదిస్తుంది. ఈ ట్యాబ్లెట్ వేసుకున్నవాళ్లకు ఎక్కువసేపు పొట్ట ఫిల్ అయ్యి ఉన్న అనుభూతి కలుగుతుంది. దీంతో ఆటోమేటిక్‌గా ఎక్కువ ఆహారం తీసుకోలేరు. దీని వల్ల కొందరిలో తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తినట్లు పలు కేసుల్లో వెలడైంది కూడా. చాలామంది వైద్యులు దీన్ని సిఫార్సు చేసేందుకు మొగ్గు చూపడం లేదని సమాచారం. ఇక్కడ ఈ మహిళ బరువు తగ్గాలనే ఉద్దేశంతో అదే పనిగా ఈ మాత్రలను కొన్ని నెలలుగా వేసుకోవడంతో తీవ్ర అస్వస్థతకు దారితీసి మరణానికి కారణమైంది. ఆమె చనిపోయే టైంలో ఆమె నోటి నుంచి ఒక విధమైన గోధుమ రంగులో నురుగ వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ మాత్ర అధికంగా వాడితే ఇలియస్ అనే పరిస్థితికి దారితీసి ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు ఓజెంపిక్ దుష్ప్రభావాలు ఇతర మందులు మాదిరిగానే ఇది కూడా కొన్ని రకాల దుష్ప్రభావాలను చూపిస్తుంది. అవేంటంటే.. మలబద్ధకం అతిసారం వికారం పొత్తి కడుపు నొప్పి వాంతులు,వికారం ప్యాంక్రియాటైటిస్ లేదా ప్యాంక్రియాస్‌లో మంట థైరాయిడ్ క్యాన్సర్ డయాబెటిక్ రెటినోపతి, కళ్లకు హాని కలిగిస్తుంది హైపోగ్లైసీమిక్ లేదా తక్కువ రక్త చక్కెర పిత్తాశయ వ్యాధి పిత్తాశయ రాళ్లు, మీ పిత్తాశయం వాపు అలర్జీలు తదితర సమస్యలు ఉత్ఫన్నమైతే తక్షణమే ఆరోగ్య నిపుణుడిని సంప్రదించమని వైద్యులు సూచిస్తున్నారు (చదవండి: రోజూ ఒక కప్పు 'టీ' తాగితే.. మధుమేహం ఉండదు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
స్లిమ్‌గా హీరోయిన్ ప్రియమణి.. షాకవుతున్న నెటిజన్లు (ఫోటోలు)
-
స్లిమ్, జీరోసైజ్ మోజులో ప్రాణాల మీదకు
‘నేడు ప్రపంచంలో ఎంతోమంది మహిళలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆహారం దొరకక కాదు. కచ్చితమైన శరీర కొలతల చట్రంలో ఇమడటానికి’ అనే విషయాన్ని మిరాసోల్ ఈటింగ్ డిజార్డర్ రికవరీ సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచంలో దాదాపు 69 మిలియన్ల మంది మహిళలు సమాజం విధించిన కొలతల చట్రంలో తమ శరీరాన్ని ఉంచడానికి పొట్ట మాడ్చుకుంటున్నారని, ఫలితంగా వారు అనొరెక్సియా వంటి ప్రమాదకర ఆరోగ్యసమస్యల బారినపడుతున్నారని తమ నివేదికల ద్వారా తెలియజేసింది. ఇటీవల బాలీవుడ్ నటి శ్వేతా తివారి షూటింగ్ జరుగుతున్న సమయంలో సృహ తప్పిపడిపోయి, ఆసుపత్రిలో చేరింది. కొన్ని రోజుల్లోనే ఏకంగా పది కేజీల బరువు తగ్గిన శ్వేత తాను తీసుకున్న ఆహార నియమాల వల్లే ఆసుపత్రి పాలైందని తెలుస్తుంది. సాధారణంగా పురుషుడు అంటే శారీరకంగా దృఢంగా ఉంటాడు. స్త్రీ అంటే సున్నితంగా, సన్నగా ఉంటుంది అనేది సర్వత్రా అందరిలోనూ ఉన్న ఆలోచన. అమ్మాయిలు నాజూకుగానే ఉండాలనే విషయంలో స్లిమ్, జీరోసైజ్, కచ్చితమైన శరీర కొలతల కోసం చేసే ప్రయోగాలు వారి ప్రాణాల మీదకు తెస్తూనే ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ... జీరోసైజ్ ఫిగర్, పర్ఫెక్ట్ ఫిగర్, అమ్మాయి శరీరం వంపులుగా ఉండాలి, బండగా ఉంటే బాగుండదు.. వంటి బాడీ ఇమేజ్ కామెంట్లు సోషల్ మీడియా ద్వారా మన ఇంటి డైనింగ్ టేబుల్ నుంచి టాయిలెట్ వరకు చేరుకుంటున్నాయి. ఇటీవల 40 ఏళ్ల శ్వేత తివారీ తన ఫొటోషూట్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. ఆమె గతంలో కన్నా చాలా సన్నగా, కొత్త స్టైల్లో కనిపించింది. ఇలా నాజూకు బొమ్మలా కనిపించే ‘గ్లామర్ డాల్స్’ ఎంతోమంది నేటి అమ్మాయిలకు ‘సన్న’బడాలనే విషయంలో ప్రేరణగా నిలుస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే చిత్రాల్లో మరింత స్లిమ్‌గా కనిపించాలనే తాపత్రయం సన్నగా మారడానికి ప్రయోగాలు చేసే దిశగా మళ్లిస్తుందన్నది నిజం. తమ ‘జీరో సైజ్’ ఫొటోలకు ఎన్ని లైక్‌లు, షేర్లు వస్తే అంత గొప్పగా భావించేవారూ ఎక్కువయ్యారు. వయసును దాచడానికి కూడా ‘సన్న’బడటం ఒక ప్రామాణికంగా మారింది. ‘కచ్చితమైన కొలతల్లో ఉండాలనే భారం ఎంతో మంది అతివల మీద మోయలేనంతగా పెరిగిపోయింది. ఫలితంగా నవ్వడం, ఆడటం, తినడం, తాగడం వంటివి కూడా కేలరీలలో లెక్కించడం ప్రారంభిస్తున్నారు. చివరకు ప్రమాదకరమైన వ్యాధులకు లోనవుతున్నారు’ అంటున్నారు మానసిక నిపుణులు. ఆ అవగాహన అగమ్యం ఒకప్పుడు సినిమా రంగానికే పరిమితమైన గ్లామర్ ఈ నవ లోకంలో చాలా మంది యువతను చుట్టుముట్టేసింది. అందుకు తగినట్టుగానే డిజిటల్ మీడియా అందించిన రెక్కలతో యువత కొత్తగా విహరిస్తోంది. బాలీవుడ్ నటి రిచా చద్దా ఒక ప్రదర్శనలో అందం గురించి మాట్లాడుతూ ‘నేను గతంలో అందం ప్రమాణాలలో ఎంతగా మునిగిపోయానంటే, తిన్న ఆహారం వాంతులు చేసుకోవడమే దినచర్యగా ఉండేది. చాలా కాలం తర్వాత కోలుకోగలిగాను’ అని వివరించింది. ప్రిన్సెస్ డయానా కూడా ఈ సమస్యతో బాధపడిందని, అనొరెక్సియా వ్యాధికి గురైందని బ్రిటీష్ కుటుంబ జీవిత ఆధారంగా ‘ది క్రౌన్’ సీరిస్‌లో తెలియజేశారు. చాలా మంది సినీతారలు తాము తీసుకునే ఆహారంలో వారి శరీరానికి తగినట్టు పోషకాహారనిపుణుల సూచనలు పాటిస్తుంటారు. అవేమీ తెలియని దిగువ, మధ్యతరగతి మగువలు ‘సన్న’గా ఉండాలంటే తినే తిండి సగానికి పైగా తగ్గించేయాలనుకుంటున్నారు. ఇక బులీమియా అనే సమస్యకు లోనయినవారు ఆకలికి తట్టుకోలేక తిన్నా, ఆ తిన్నదానిని బలవంతంగా వాంతి చేసుకోవడానికి గంటలు గంటలు టాయిలెట్లలో గడుపుతుంటారు. ఫలితంగా బలహీనత, రక్తహీనత, రుతుక్రమ సమస్యలు, రకరకాల ఆందోళనలతో గడుపుతూ చివరకు డిప్రెషన్ బారిన పడే అవకాశమూ ఉంది. నివేదికల్లో స్పష్టం ఈటింగ్ డిజార్డర్స్‌పై పనిచేస్తున్న మిరాసోల్ అనే అంతర్జాతీయ సంస్థ నివేదిక ప్రకారం 43 మిలియన్ల మంది మహిళలు తాము తీసుకునే ఆహారం చాలా తక్కువగా ఉండాలనుకుంటున్నారు. 26 మిలియన్ల మహిళలు తమ శరీర ఆకృతిని ఏవిధంగానైనా కాపాడుకోవాలి అనుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 69 మిలియన్ల మంది మహిళలు తమ శరీరం ఒక కొలతల చట్రంలో ఉంచడానికి ఆకలితో ఉంటున్నారు. ప్రపంచంలో పురుషుల్లో కేవలం 0.3 శాతం మందిలోనే రక్తహీనత ఉంటే, ఇది మహిళల్లో ఒక శాతం ఉంది. 15 నుంచి 24 ఏళ్ల వయసు వారిలో ఈ ప్రభావం అధికంగా ఉందనే విషయాలను కూడా ఈ సంస్థ స్పష్టం చేసింది. ‘చిన్న వయస్సు నుండే మహిళలు సన్నగా, కొలతల ప్రకారంగా ఉన్న చిత్రాలలోని మహిళలను చూసి, అదే స్థిరమైన శరీర ఇమేజీగా మనస్సుల్లో ముద్రించుకుంటున్నారు. ఈ ప్రక్రియ వల్ల చాలా సార్లు స్వీయహింసకు గురవుతున్నారు. అమ్మాయిల్లో ‘జీరో సైజ్’ సమస్య పెరుగుతున్న ఈ కాలంలో వారిని ఆ ప్రభావం నుంచి బయట పడేయడానికి కుటుంబసభ్యులు, మిత్రుల సాయం తప్పనిసరి. పోషకాహార నిపుణులు, మానసిక నిపుణుల సాయంతో ‘కొలతల్లో ఇమిడిపోవాల’నే ఆలోచనను అధిగమించవచ్చు’ అంటున్నారు నిపుణులు. -
వన్‌ప్లస్ కొత్త టీవీలు ఎంత సన్నగా ఉంటాయంటే..
సాక్షి, న్యూఢిల్లీ: వన్‌ప్లస్ తీసుకురానున్న టీవీలపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. తాజాగా వన్‌ప్లస్ టీవీలు తదుపరి సిరీస్ వన్‌ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్ కంటే సన్నగా ఉండబోతున్నాయని వన్‌ప్లస్ సీఈఓ పీట్ లా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అసలు వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు అంటేనే స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ కి పెట్టింది పేరు. మరి ఇక వన్‌ప్లస్ టీవీలు ఇంకెంత సన్నగా ఉంటాయో అన్న ఆసక్తి నెలకొంది. తమ రానున్న టీవీల్లో అల్ట్రా-సన్నని డిజైన్ ఉంటుందని, డిజైన్, యూజర్ ఎక్స్పీరియన్స్ అనే రెండు కీలక అంశాలపై దృష్టి సారించినున్నట్లు సీఈఓ వెల్లడించారు. కేవలం 6.9 మి.మీ మందంతో తీసుకు రాబోతున్నామని ఆండ్రాయిడ్ సెంట్రల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు ఫ్లాగ్షిప్ క్యూ1 టెలివిజన్ కంటే తక్కువగా అందుబాటు ధరలో 20 వేల రూపాయలకు అందించనున్నామని చెప్పారు. ఈ కొత్త టెలివిజన్ సెట్లు జూలై 2 న ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. కొత్త స్మార్ట్ టీవీలో 95 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో సన్నని బెజెల్స్ ఫీచర్, కొత్తం సౌండ్ సిస్టం, స్పీకర్లు 90 డిగ్రీల కోణంలో రొటేట్ అయ్యేలా రూపొందించామని తెలిపారు. సినిమాటిక్ డిస్ప్లే, డాల్బీ విజన్, నెట్‌ఫ్లిక్స్ యాప్ లాంటి ఫీచర్లను హైలైట్ చేస్తూ గత వారమే పీట్ లా ట్వీట్ చేశారు. వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ ధర, లభ్యత వన్‌ప్లస్ టీవీలు 32, 43-అంగుళాల వేరియంట్లలో విడుదల కానున్నాయి. ప్రారంభ ధర 20 వేల రూపాయలు. ప్రస్తుతం, కొత్త వన్‌ప్లస్ టీవీలు అమెజాన్ ఇండియాలో ప్రీ-బుకింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. అలాగే ప్రీ-బుక్ చేసే వినియోగదారులకు బీమా సంస్థ అకో నుండి రెండేళ్లపాటు వారంటీ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. కాగా 2019లో స్మార్ట్ టీవీ పరిశ్రమలోకి ప్రవేశించిన వన్‌ప్లస్ క్యూ 1 సిరీస్ టీవీ ప్రారంభ ధర 69,900 రూపాయలు. With a 95% screen-to-body ratio, we're pushing the boundaries of your TV experience. Literally. #SmarterTV pic.twitter.com/gulLxbVvHE — Pete Lau (@PeteLau) June 24, 2020 -
స్లిమ్‌గా..హ్యాండ్సమ్గా..
సాగర్‌నగర్ (విశాఖపట్నం): ‘స్మార్ట్‌సిటీలో సిటిజనుల లైఫ్సై్టల్స్ మారుతున్నాయి. నడివయస్కులు సైతం ఫిట్నెస్ కావాలని కోరుకుంటున్నారు. అందానికి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఉపాధికి ఉన్నత స్థాయి ఎదుగుదలకూ ఫిట్నెస్,హ్యాండ్సమ్గా ఉండటం కీలకమే. విమానం మోసినా..తాము మోయలేమంటూ ఓవర్ వెయిట్ కారణాన్ని చూపుతూ కొంతకాలం క్రితం ఎయిర్ ఇండియా 125 మంది క్యాబిన్‌క్రూ సిబ్బందిని తొలగించింది. అలాంటి ప్రొఫెషన్స్‌లో ఊబకాయం ఉపాధికే ఎసరు పెడుతోంది. ఆ స్థాయిలో కాకపోయినా ఫిట్లెస్గా ఉండటం అనేది జాబ్ కెరీర్‌ను కూడా ఒడిదుడుకులకు గురి చేస్తోంది’.దీంతో విశాఖ కార్పొరేట్ కంపెనీల్లో జాబ్ కావాలంటే నైతిక విలువలతోపాటు, లైఫ్‌సై్టల్, ఫిట్నెస్ కాస్త అవసరమని సూచిస్తున్నాయి. నగరంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న రేష్మా 13 కేజీల బరువు తగ్గారు. హెల్తీ ఫైమ్ అనే వెయిట్ లాస్ యాప్‌తో నాలుగు నెలల్లో తగ్గించుకున్న బరువుతో తన ఉద్యోగ బాధ్యతలు మరింత చురుగ్గా నిర్వర్తించగలుగుతున్నారు. పైకి ప్రకటించినప్పటికీ పలు కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులు ఫిట్‌గా ఉండడాన్ని ఖచ్చితంగా కోరుకుంటున్నాయి. తద్వారా కంపెనీ ప్రొఫైల్ మెరుగుపడటంతోపాటు ఉద్యోగుల పనితీరు సైతం పదునెక్కుతుందని భావిస్తున్నాయి అని రేష్మా చెప్పారు. క్రమశిక్షణకు శరీరమే సూచిక ఫిట్నెస్ లేకపోవడం శరీరంపై క్రమశిక్షణ లేకపోవడంగా కంపెనీల అధిపతులు, కార్పొరేట్ సర్కిల్స్ భావిస్తున్నాయి. తనపై తాను శ్రద్ధ చూపలేని వ్యక్తులు కంపెనీ ఎదుగుదలపై కూడా చూపలేరని ఈ వర్గాలు నమ్ముతున్నాయి. ‘ఉద్యోగంలో చేరినప్పుడు చాలా ఫిట్‌గా ఉండి ఆ తర్వాత ఒబెసిటీ బాధితులుగా మారిన వారు కెరీర్‌పరంగా ఎదుగుదలకు నోచుకోకపోవడం నేను గమనించా’ అని ఐటీ సెజ్‌లోని ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగి సౌజన్య చెప్పారు. నగరంలో పెరుగుతున్న వ్యాయామశాలలు అందం, ఆరోగ్యం, శరీరాకతికి నేటి యువతరం అత్యంత ప్రాధాన్యత పొందడానికి నగరంలో జిమ్ సెంటర్లు విస్తరిస్తున్నాయి. ఫిట్‌గా తయారవ్వాలనే తలంపుతో సూర్యుడు ఉదయించక ముందే యువతీ,యువకులు జిమ్ సెంటర్ల వద్ద వాలిపోతున్నారు. అత్యాధునిక పరికరాలతో చెమటలు పట్టేంత వరకు కుస్తీలు పడుతున్నారు. వీరి ఆసక్తికి తగ్గట్టుగా జిమ్ సెంటర్లు, అటు పురుషులకు, ఇటు మహిళలకు శిక్షణలు ఇచ్చే సెంటర్లు ఆకట్టుకుంటున్నాయి. విశాలాక్షినగర్, సాగర్‌నగర్, ద్వారకానగర్, ఎంవీపీకాలనీ, సీతమ్మధార, దొండపర్తి తదితర ప్రాంతాల్లో కార్పొరేట్ జిమ్‌లు దర్శనమిస్తున్నాయి. ఇవి కాకుండా వుడా ఏర్పాటు చేసిన హెల్త్ ఎనారీ, ఆర్కేబీచ్ వంటి ప్రాంతాల్లో ఫిట్నెస్ కోసం వ్యాయామం చేస్తున్నారు. ఈ ఫుడ్ తీసుకుంటే మంచిది స్లిమ్‌గా తయారవ్వాలంటే ముఖ్యంగా పొట్టను తగ్గించాలి. సిక్స్‌ప్యాక్ కావాలనుకునే వారు, ఫిజికల్ ఫిట్నెస్ కోసం తపించే వారు ఆహారం విషయంలో కొద్ది జాగ్రత్తలు పాటించాలి. ఉదయం జిమ్‌కు బయలుదేరే ముందు తేనే, నిమ్మరసం తీసుకోవడం వల్ల కొవ్వు ఏర్పడదు. వ్యాయామం పూర్తయ్యాక ఉడకబెట్టిన గుడ్డు, గ్లాసు పాలు తీసుకోవాలి. ఆర్థికస్తోమతను బట్టి డ్రైఫ్రూట్స్ తీసుకుంటే మరీ మంచిది. –మ«ధ్యాహ్నం భోజనంలో కూరగాయలతోపాటు, సాంబార్, పెరుగు ఉండేలా చూసుకోవాలి. రాత్రి భోజనంగా చపాతి తీసుకోవడం శ్రేయస్కరం. ఆలుగడ్డ, నెయ్యి,పెరుగు,అరటిపండు, తీసుకుంటే బాగుంటుంది. వారంలో ఒక్కసారైనా చికెన్ లేదా చేపలను ఆహారంగా తీసుకోవాలి. ఫిట్‌నెస్‌కు యోగా నగరంలో వయసు, హోదాలతో నిమిత్తం లేకుండా యోగాపై ఆసక్తి చూపుతున్నారు. కార్పొరేట్ ఉద్యోగులు, ఉన్నతస్థాయి నిరుద్యోగులు, ఉద్యోగులు సైతం యోగాసనాలతో సంతప్తి చెందుతున్నారు. తమ శరీరా ఆకతులను, ఆరోగ్యకరంతో ఫిట్నెస్గా కన్పించాలని తపన ఎక్కువగా కన్పిస్తుంది. అందుకు వారికి అందుబాటులో ఉన్న యోగా, జిమ్ ఇతర వ్యాయామశాలలకు పరుగులు దీస్తున్నారు. ముఖ్యంగా యోగాతోనే మంచి ఫిట్నెస్, ఆరోగ్యం లభిస్తోంది. –సింధుసాయి, విశాలాక్షినగర్, అంతర్జాతీయ యోగాకారుడు -
సన్నబడ్డ స్వీటీ!
చక్కనమ్మ ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. బొద్దుగా ఉన్నా, ముద్దుగానే అనిపిస్తుంటుంది. స్లిమ్‌గా ఉన్నా స్వీట్‌గా అనిపిస్తుంది. అందుకు నిదర్శనంగా అనుష్కను చెప్పొచ్చు. ‘సైజ్ జీరో’కి ముందు స్లిమ్‌గా ఉన్న అనుష్క అందర్నీ ఆకట్టుకుంటే, ఆ చిత్రంలో బొద్దుగా కనిపించి కూడా ఆకట్టుకున్నారు. ఆ సినిమా తర్వాత బరువు తగ్గే పనిలో పడ్డారామె. నాన్‌స్టాప్‌గా కసరత్తులు చేసిన స్వీటీ (అనుష్క ముద్దు పేరు) ఎట్టకేలకు సన్నబడ్డారు. ‘నేను సన్నబడ్డానోచ్’ అని అనుష్క చెప్పకపోయినా.. ఫేస్బుక్లో ఆమె పెట్టిన ఓ ఫొటో ఆ విషయాన్ని తెలియజేసింది. షూటింగ్‌కి కాస్త గ్యాప్ దొరకడంతో అనుష్క తన సొంతూరు బెంగళూరు వెళ్లారు. అక్కడ తన అన్నయ్యతో కలిసి దిగిన ఫొటోను ఫేస్బుక్లో పెట్టారు అనుష్క. ఆ ఫొటో చూస్తే ముద్దుగుమ్మ మునుపటిలా ఉన్నట్లు తెలుస్తోంది కదూ. -
స్లిమ్‌గా తయారు కావాలంటే..?
న్యూయార్క్: మీరు స్లిమ్‌గా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ప్రతి రోజు మంచి నీళ్లను కాస్త ఎక్కువగా తాగండి. దీనివల్ల శరీరంలో చక్కటి మార్పులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. సుగర్, ఉప్పు, కొవ్వు పదార్థాలను తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. పరిశోధకుల బృందం అమెరికాలో 18,300 మందిని పరీక్షించింది. వీరు ప్రతి రోజు ఒక శాతం అదనంగా మంచి నీళ్లు తీసుకోవడం మంచి ప్రభావం కనిపించింది. ప్రతి రోజు ఒకటి, రెండు లేదా మూడు కప్పుల నీళ్లు అదనంగా తీసుకోవడం వల్ల 68 నుంచి 205 కేలరీల భోజనం, 78 నుంచి 235 గ్రాముల ఉప్పు తీసుకోవాల్సిన అవసరం లేకపోయిందని గుర్తించారు. మునుపటితో పోలిస్తే స్లిమ్ గా మారారు. అంతేగాక, చదువు, శరీర బరువుపైనా ప్రభావం చూపినట్టు వెల్లడించారు. -
ఆ ఇంజక్షన్లకి నేను దూరం!
థర్టీ ప్లస్ తర్వాత ఎవరైనా సరే లావైపోతారు. అప్పటివరకూ మెరిసే చర్మం ఆ తర్వాత తన వైభవాన్ని మెల్ల మెల్లగా కోల్పోతూ ఉంటుంది. ముఖ్యంగా వద్దు వద్దన్నా లేడీస్‌కి ఒళ్లొచ్చేస్తుందంటుంటారు. అలాగే, చర్మం, జుత్తు కూడా పాడవుతాయని అంటుంటారు. కానీ, కేర్ తీసుకుంటే థర్టీస్‌లోనే కాదు ఫార్టీస్, ఫిఫ్టీస్.. ఏ వయసులో అయినా స్లిమ్‌గా, అందంగా ఉండొచ్చంటున్నారు కరీనా కపూర్. ఆమె చెప్పిన కొన్ని టిప్స్... * ఇలా చేస్తే బాగుంటుంది అని నేనెవరికీ సలహాలివ్వను. ఉచిత సలహాలు ఎవరైనా ఇస్తారు. అందుకే సలహాలివ్వడానికి బదులు నేనేం చేస్తానో చెబుతాను. వీలు కుదిరితే వాటిని ఫాలో కావొచ్చు. * నేను యోగా చేస్తాను. వారంలో కనీసం ఐదు రోజులైనా యెగా చేయకపోతే నాకదోలా ఉంటుంది. ప్రతి రోజూ గంటసేపు చేస్తాను. వంద సూర్య నమస్కారాలు చేస్తాను. అన్ని చేయగలరా అనుకోవద్దు. మొదట్లో అన్నేసి అంటే కష్టమే. ప్రాక్టీస్ చేయగా చేయగా చేయగలుగుతాం. * సెక్లింగ్ కంపల్సరీ. కార్డియో ఎక్సర్సైజ్ తప్పకుండా చేస్తాను. మన శరీర తత్వానికి ఏ ఎక్సర్సైజ్ అయితే బాగుంటుందో తెలుసుకుని చేయడం మంచిది. * ఒకప్పుడు నేను బాగా మాంసాహారం తీసుకునేదాన్ని. ఆ తర్వాత శాకాహారిగా మారిపోయాను. అప్పట్నుంచీ నా ఆరోగ్యం ఇంకా బాగుంటోంది. * నా డైలీ డైట్ గురించి చెప్పాలంటే... నూనె లేకుండా తయారు చేసిన ఉప్మా లేక పరోటాలు తింటాను. లేకపోతే ఇడ్లీలు తీసుకుంటాను. లంచ్‌కి బ్రౌన్ రైస్, రోటీ, పప్పు, కూరగాయలు తింటాను. రాత్రి సూప్, ఉడకబెట్టిన కూరగాయలు తింటాను. రోజు మొత్తంలో అప్పుడప్పుడు ఫ్రూట్స్ తింటాను. * మేం రకరకాల వాతావరణాల్లో షూటింగ్స్ చేస్తాం కాబట్టి జుత్తు త్వరగా పాడైపోతుంది. అందుకే నెలకోసారి తలకు ఆయిల్ మసాజ్ చేయించుకుంటాను. ఆలివ్, కాస్టర్, కోకోనట్, ఆల్మండ్ ఆయిల్స్‌తో చేసే ఈ మసాజ్ కారణంగా జుత్తు కుదుళ్లు బలపడతాయి. సినిమాల్లో క్యారెక్టర్స్‌కి అనుగుణంగా హెయిర్ స్టయిల్ చేసుకుంటాను. విడిగా మాత్రం ప్రయోగాలు చేయను. జస్ట్ పోనీటెయిల్ వేసుకుంటాను. * నాది డ్రై స్కిన్. అందుకని మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడతాను. నెలకోసారి న్యాచురల్ ఆయిల్స్‌తో బాడీ మసాజ్ చేయించుకుంటాను. మసాజ్ అంటే అదేదో కాని పనిలా కొంతమంది భావిస్తారు. అది చేయించుకోవడంవల్ల బాడీ రిలాక్స్ అవుతుంది. కొత్త ఉత్సాహం వస్తుంది. * గోరువెచ్చని నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకి నేను మినిమమ్ ఆరు గ్లాసుల హాట్ వాటర్ తాగుతాను. దీనివల్ల డెజైషన్ బాగుంటుంది. జీర్ణ క్రియ బాగా పని చేస్తే దాదాపు ఆరోగ్యంగా ఉన్నట్లే. * వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడుతుంది. వాటిని పోగొట్టుకోవడానికి ‘బొటాక్స్ ఇంజక్షన్’ చేయించుకుంటుంటారు. నేను దానికి వ్యతిరేకిని. అలాగే, జుత్తు క్రమం క్రమంగా గ్రేగా మారిపోతుంది. అయినా ఫర్వాలేదని సరిపెట్టుకుంటాను. బయటికి మనం ఎంత అందంగా ఉన్నామన్నది కాదు.. ‘ఇన్నర్ పీస్’ ముఖ్యం. మన మనసు ఎంత ఆనందంగా ఉంటే శారీరకంగా మనం అంత అందంగా ఉన్నట్లు లెక్క. సినిమా పరిశ్రమలో కరీనాకు ఉన్న అత్యంత ఆప్తమిత్రుల్లో అమృతా అరోరా ఒకరు. ఈ ఇద్దరూ వీలు కుదిరినప్పుడల్లా యోగా క్లాసెస్‌లో కలుస్తుంటారు. కలిసి యోగా చేయడంతో పాటు జిమ్ కూడా చేస్తుంటారు. -
స్థూలకాయంతో బాధపడ్డా!
స్థూలకాయంతో చాలా చింతించాను. అవకాశాలకు దూరం అయ్యాను. బరువు తగ్గడానికి చేయని ప్రయత్నం లేదు. అయినా ప్రయోజనం లేకపోయింది. చాలా మనస్తాపానికి గురయ్యాను. అలాంటిది 90 కేజీల వరకు బరువు కలిగిన నేను ఇప్పుడు 20 కేజీలు తగ్గాను అన్నారు నటి నమిత. ఈ బ్యూటీకి యూత్‌లో ఉన్నత క్రేజ్ ఏ హీరోయిన్‌కు ఉండదనడం అతిశయోక్తి కాదు. మచ్చాన్ (బావలు) అని ఒక్క ఫ్లయింగ్ కిస్ ఇస్తే చాలు కుర్రకారు గుండెలు గుల్లలైపోతాయి. అలాంటి నమిత వెండితెరకు దూరం అయి చాలా కాలమే అయ్యింది. కారణం విపరీతంగా పెరిగిన ఆమె బరువే. అయితే తాజాగా నమిత అభిమానులకు శుభవార్త ఏమిటంటే నాటి నమితలా నాజుగ్గా తయారై తెరపైకి త్వరలోనే రానున్నారు. దీని గురించి ఈ బ్యూటీ తెలుపుతూ స్థూలకాయంతో చాలా అవస్థలు పడ్డాను. తగ్గడానికి చేయని ప్రయత్నం లేదు. అలా విసిగి వేసారి పోయిన తరుణంలో సాక్షి వెల్నస్ గురించి నిర్మాత సురేష్ కామాక్షి తెలుసుకున్నా. నమ్మకం లేకపోయినా బరువు తగ్గడానికి ఎన్నో విధాలుగా పెద్ద పోరాటమే చేశాను. మరోసారి ప్రయత్నిస్తే పోయేదేముందని సాక్షి వెల్నెస్కు వెళ్లాను. అక్కడ తొలి ప్రయత్నంగా కిలోన్నర బరువు తగ్గాను. కాస్త నమ్మకం కలిగింది. వారి శిక్షణ కారణంగా ఇప్పుడు 20 కిలోల బరువు తగ్గి స్లిమ్‌గా తయారయ్యాను. మళ్లీ నటిస్తారా? అని అడుగుతున్నారు. నటించడానికే ఇంత నాజుగ్గా తయారైంది ప్రస్తుతం కథలు వింటున్నాను. త్వరలోనే కొత్త చిత్రం గురించి వెల్లడిస్తాను. యాక్షన్ కథా చిత్రాల్లో నటించాలని ఆశగా ఉంది. అలాగే రాజకీయరంగ ప్రవేశం గురించిన ఆలోచన ఉంది. చాలా పార్టీల వారు ఆహ్వానిస్తున్నారు. అయితే ఏ పార్టీలో చేరుతారన్నది ఇప్పుడు చెప్పలేనని నమిత పేర్కొన్నారు. -
స్లిమ్‌గా మారిన రవితేజ డబుల్ కిక్ ఇస్తాడా ?
-
బొద్దుగా ఉంటే ముద్దు కాదా?
పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్‌కి ప్రపంచవ్యాప్తంగా బోల్డంత మంది అభిమానులున్నారు. మెరుపు తీగలా కనిపించే బ్రిట్నీ ఒకప్పుడు బొద్దుగా ఉండేవారు. ఇలా ఉంటే ముద్దుగా ఉండదనుకున్నారు. వ్యాయామాలూ, డైట్లతో తగ్గాలంటే కొన్ని నెలలు పడుతుంది. అదే, లైపో సక్షన్ అయితే ఈజీగా తగ్గేయొచ్చు కదా. అందుకే, ఆమె లైపో చేయించుకోవాలనుకున్నారు. ఎనిమిదేళ్ల క్రితం ఆమె లైపో చేయించుకున్నారనే వార్త హాలీవుడ్లో ప్రచారమైంది. బ్రిట్నీ అవతారం ఆ ప్రచారానికి ఊతమిచ్చింది. నిన్న మొన్నటిదాకా బొద్దుగా కనిపించిన ఆమె హఠాత్తుగా స్లిమ్ సుందరి అయిపోయారు. -
బెబో బరువు అలా తగ్గిందా?!
గాసిప్ జీరో సైజు అందాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ ప్రేక్షకులకు రుచి చూపించిన ఘనత కరీనాది. మొదట్లో కాస్త బొద్దుగా ఉండేది కానీ... ఆ తర్వాత తగ్గి తగ్గి తీగలా తయారయ్యింది. నాటి నుంచి నేటి వరకూ ఆ ఫిగర్‌ని అలా మెయింటెయిన్ చేస్తూనే వచ్చింది. ఆమె నాజూకు అందాల వెనుక రహస్యం తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అదిగో... ఆ ఆసక్తినే క్యాష్ చేసుకోవాలని చూసింది ఓ మందుల కంపెనీ. ఇటీవల ఓ వెబ్సైట్లో ఒక యాడ్ ప్రత్యక్షమయ్యింది. కరీనా స్లిమ్నెస్కి కారణం తామేనంటూ ఓ మందుల కంపెనీ గొప్పలు పోయింది. తాము ఒక పిల్ తయారు చేశామని, అది వేసుకునే కరీనా పదమూడు కిలోలు తగ్గిందని ఆ యాడ్ సారాంశం. అది చూసి అవాక్కయిన కరీనా... తన అందానికి కారణం మందులు కాదని, తన అలవాట్లు, వర్కవుట్లేనని తేల్చి చెప్పింది. తన అనుమతి లేకుండా తన పేరు వాడుకున్నందకు ఆ కంపెనీ మీద కేసు వేయడానికి సిద్ధపడుతోంది! -
లక్కీ స్టార్..!
కథానాయిక అనగానే కందిరీగ నడుము... ఆపై ఆకట్టుకునే రూపం... ఇవే కొలమానాలు ఒకప్పుడు. అలాంటి ఎరాలో కూడా బొద్దుగా ఉన్న తాను స్టార్‌గా ఎదిగానని మురిసిపోతోంది కాజోల్. అందరూ స్లిమ్‌గా ఉన్న భామలు కావాలని డిమాండ్ చేస్తున్న సమయంలో... దర్శకుడు యాష్‌చోప్రా ఏ నాడూ బరువు తగ్గమని తన హీరోయిన్లను కోరలేదని గుర్తు చేసుకుందీ నటి. ‘ఎక్కువగా యాష్ చోప్రాతోనే పనిచేశా. ఆ విషయంలో నేను చాలా లక్కీ’ అంటూ చెప్పుకొచ్చింది అలనాటి కలల రాణి కాజోల్. కథానాయికల బరువు గురించి మాట్లాడని ఒకేఒక్క బాలీవుడ్ డెరైక్టర్ యాష్‌చోప్రా ఒక్కడేనని రీసెంట్గా ఓ ఈవెంట్లో వెల్లడించింది. -
చీర కొంటున్నారా?
ఏ చీర కట్టుకున్నా బాగుంటుంది అని సరిపెట్టుకోవడం కాదు. ఏ చీరలో బాగుంటాం, శరీరాకృతికి, మేని రంగుకు ఎలాంటివి నప్పుతాయి అనేది తెలుసుంటే ఎంపిక పర్ఫెక్ట్ అని కితాబులు కొట్టేస్తారు. లావుగా ఉన్నవారు బాగా గంజిపెట్టినట్టున్న కాటన్ చీరలు కట్టుకుంటే మరింత లావుగా కనిపిస్తారు వయసు పైబడిన వారు పెద్ద పెద్ద ప్రింట్లు ఉన్న చీరలను ఎంచుకోకపోవడమే మంచిది ఎత్తు తక్కువ ఉన్నవారు పెద్ద పెద్ద ప్రింట్లు ఉన్న చీరలు కట్టుకుంటే మరింత పొట్టిగా కనిపిస్తారు పొడవుగా ఉన్నవారు పెద్ద అంచున్న చీర కట్టుకుంటే బాగుంటారు లావుగా ఉన్నవారు ముదురు రంగుల చీరలు ధరిస్తే చూడటానికి స్లిమ్‌గానూ, అందంగానూ కనిపిస్తారు. -
చెక్కినట్టున్న నడుం.. ఇంకా చిక్కిస్తానంటూ..!!
-
సన్నబడ్ద బొద్దుగుమ్మ...
-
స్లిమ్ కావాలని జిమ్కెళ్తున్న బొద్దుగుమ్మ
-
స్లిమ్‌గా మారిన బొద్దుగుమ్మ