
లక్కీ స్టార్..!
కథానాయిక అనగానే కందిరీగ నడుము... ఆపై ఆకట్టుకునే రూపం... ఇవే కొలమానాలు ఒకప్పుడు. అలాంటి ఎరాలో కూడా బొద్దుగా ఉన్న తాను స్టార్‌గా ఎదిగానని మురిసిపోతోంది కాజోల్.
అందరూ స్లిమ్‌గా ఉన్న భామలు కావాలని డిమాండ్ చేస్తున్న సమయంలో... దర్శకుడు యాష్‌చోప్రా ఏ నాడూ బరువు తగ్గమని తన హీరోయిన్లను కోరలేదని గుర్తు చేసుకుందీ నటి. ‘ఎక్కువగా యాష్ చోప్రాతోనే పనిచేశా.
ఆ విషయంలో నేను చాలా లక్కీ’ అంటూ చెప్పుకొచ్చింది అలనాటి కలల రాణి కాజోల్. కథానాయికల బరువు గురించి మాట్లాడని ఒకేఒక్క బాలీవుడ్ డెరైక్టర్ యాష్‌చోప్రా ఒక్కడేనని రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో వెల్లడించింది.