మళ్లీ ఎంట్రీ..! | Kajol Re-entry ..! | Sakshi
Sakshi News home page

మళ్లీ ఎంట్రీ..!

Published Mon, Oct 20 2014 12:21 AM | Last Updated on Wed, Apr 3 2019 7:03 PM

మళ్లీ ఎంట్రీ..! - Sakshi

మళ్లీ ఎంట్రీ..!

బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలతో మాంచి కిక్కిచ్చిన సుందరి కాజోల్ మళ్లీ తెరంగేట్రం చేస్తోందట. స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్‌ను పెళ్లాడి ఇండస్ట్రీకి దూరమైన ఈ ‘అమ్మ’డు... ఆ మధ్య షారూఖ్ ‘మై నేమ్ ఈజ్ ఖాన్’లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇన్నాళ్లూ కామ్‌గా ఉన్న కాజోల్... తాజాగా అజయ్ దేవ్‌గణ్ తీయబోయే సినిమాలో నటిస్తోందన్న వార్తలు బీ టౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది విడుదలైన మలయాళ మూవీ ‘హౌ ఓల్డార్ యూ’ను అజయ్ రీమేక్ చేస్తున్నాడు. కాజోల్‌కు కథ తెగ నచ్చిందట. సో... అప్పటి నుంచి నటించేస్తానంటూ హబ్బీకి సిగ్నల్స్ పంపేసిందీ తార.

అలాగైతే చెత్త సినిమాలే తీస్తుంటాం..
భారత్‌లో సినిమాలు రూపొందించే వారు అంతర్జాతీయు సినిమాలను చూస్తుండాలని, వాటిని చూసి నేర్చుకోకుంటే మనం చెత్త సినిమాలనే తీస్తుంటామని బాలీవుడ్ దర్శక-నిర్మాత విధు వినోద్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాశ్మీర్‌లోని ఒక కుగ్రామం నుంచి తాను వచ్చానని, చాలా కాలం కేవలం హిందీ సినిమాలు మాత్రమే చూస్తూ పెరిగానని చోప్రా చెప్పుకొచ్చాడు. ప్రపంచాన్ని పట్టించుకోకుండా వున సినిమాలనే మనం చూస్తుంటే, వుంచి సినిమాలను ఎలా తీయగలమని ప్రశ్నించాడు. దేశంలో ప్రాంతీయ భాషల్లోనూ మంచి సినిమాలు వస్తున్నాయని అన్నాడు.

ఐటమ్ నంబర్..!
తెలుగు తెరపై ‘ఆనందం’గా మెరిసి మురిసిన బెంగాలీ భామ కమలినీ ముఖర్జీ ఆ తరువాత ‘డల్’ అయింది. అవకాశాలు లేక రూటు మార్చిన ఈ సుందరి తాజాగా మలయాళంలో ఐటమ్ సాంగ్ ఒకటి చేస్తోందని కోలీవుడ్ టాక్. దర్శకుడు వైకాఖ్ తెరకెక్కిస్తున్న ‘కజిన్స్’ చిత్రంలో ఈ పాట ఫస్ట్ హాఫ్‌లో ఉంటుందట. కజిన్స్ జర్నీలో చంద్రగిరి చేరుకొంటారట. సో ఆ ప్రాంతాన్ని పరిచయం చేసే సాంగ్ ఇదని స్క్రిప్ట్ రైటర్ చెబుతున్నాడు. కొచ్చీలో చిత్రీకరించే ఈ పాటలో కమలినీతో పాటు 40 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement