Kamalinee Mukherjee
-
Anand Movie: చిరంజీవి సినిమాతో పోటీ.. ఏడు నంది అవార్డులు సొంతం
ఓ మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ అంటే ఏంటో తెలియాలంటే 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఆనంద్’ను చూడాలి. ఇది ఓ మంచి కాఫీ లాంటి మూవీ. ఫీల్ గుడ్ మూవీస్ తీసే దర్శకుడిగా పేరున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన రెండో సినిమా. ఆత్మాభిమానం, ఇండిపెండెంట్ భావాలు కొంచెం ఎక్కువ గల ఓ యువతి తన లైఫ్‌లో ఎదుర్కొనే సవాళ్లు, లవ్, ఫ్రెండ్షిప్ వంటి వాటిని తెరకెక్కించిన విధానం కట్టిపడేస్తుంది. ముఖ్యంగా యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయిన సినిమా. వారి ఆలోచనలు, డ్రీమ్స్, ప్రాబ్లమ్స్ అన్నీ ఇందులో ప్రతిబింబిస్తాయి. హీరోగా రాజా, హీరోయిన్గా కమలినీ ముఖర్జీ అద్భుతంగా నటించారు.పరిణతి గల ప్రేమఈ మూవీలో లవ్ స్టోరీ చాలా నేచురల్‌గా, హానెస్టీగా ఉంటుంది. అన్ని సినిమాల్లోలా కాకుండా ఇద్దరు మెచ్యూర్డ్ యూత్ మధ్య లవ్‌ను అద్భుతంగా చూపించారు డైరెక్టర్. కేవలం కోటిన్నర బడ్జెట్‌తో ఎటువంటి భారీ కాస్టింగ్ లేకుండా సాదా సీదా స్టోరీతో రిలీజై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. శేఖర్ కమ్ముల తొలుత 2000లో ‘డాలర్ డ్రీమ్స్’ తీశారు. ఇది విమర్శకుల మెప్పు రూపొందింది. సెకండ్ మూవీ ‘ఆనంద్’ కోసం చాలా మంది నిర్మాతల్ని కలవగా ఎవరూ ఇంట్రస్ట్ చూపలేదు. చేసేది లేక నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ సాయం కోరగా ఆ సంస్థ కొంత ఇన్వెస్ట్ చేయడానికి అంగీకరించింది. తెలుగులో ఓ కమర్షియల్ మూవీకి ఇన్వెస్ట్ చేయడం ‘ఎన్ఎఫ్డీసీ’కి ఇదే తొలిసారి.పద్మారావ్ నగర్లోనే...ఆనంద్ స్టోరీని పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసినా ఆయన్ను ఎప్పుడూ సంప్రదించలేదని శేఖర్ కమ్ముల ఓ సందర్భంలో చెప్పారు. హీరోయిన్ గా తొలుత ఆసిన్, సదాను అనుకున్నారు. చివరికి రాజా, కమలినీ ముఖర్జీతో పూర్తి చేసేశారు. హైదరాబాదులో తానుండే పద్మారావ్ నగర్లోనే ఓ ఇంటి స్థలంలో దాదాపు సినిమా మొత్తం పూర్తి చేసేశారు డైరెక్టర్. కమలి పాత్రకి సింగర్ సునీతతో డబ్బింగ్ చెప్పించగా ఎంత సహజంగా వచ్చిందంటే అందుకు సునీతని కూడా అవార్డు వరించింది. శేఖర్ కమ్ముల హోవర్డ్ యూనివర్శిటీలో తన మాస్టర్స్ డిగ్రీ థీసిస్‌గా ఈ సినిమా స్క్రీన్ ప్లేనే సబ్మిట్ చేసారనే విషయం చాలా మందికి తెలియదు. ‘ఆనంద్’ సినిమాను తమిళంలో ‘నినైత్తాలే’ పేరుతో రీమేక్ చేశారు.ఫార్ములా సినిమాలకు భిన్నంగా...ఆనంద్ మూవీ, చిరంజీవి భారీ సినిమా ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ ఒకే రోజు రిలీజయ్యాయి. అయినా... ఆ పోటీకి నిలబడి ఇంచుమించు అంతే పేరు తెచ్చుకుంది ‘ఆనంద్’. ఫార్ములా సినిమాలకు భిన్నంగా తీసిన ఆనంద్ ఏడు నంది అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఇప్పటికీ చాలా మంది ఇష్టంగా చూస్తారు. మీరు ఇప్పటికీ చూడక΄ోతే కచ్చితంగా ఓ సారి చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
జల్సా లో ఇంపార్టెన్స్ లేని రోల్ ఇచ్చారు
-
హీరోయిన్ కమలిని ముఖర్జీ ఇలా మారిపోయిందేంటి? ఫోటోలు వైరల్
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తారలు సడెన్‌గా మాయమవుతుంటారు. కొన్నిసార్లు వాళ్లు ఎక్కడున్నారు? ఏం చేస్తుంటారు అన్నది కూడా తెలియదు. అలాంటి వాళ్లలో హీరోయిన్ కమలిని ముఖర్జీ కూడా ఒకరు. 2004లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఆనంద్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ భామ. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న కమిలిని ఆ తర్వాత ఆమె నటించిన గోదావరి, హ్యాపీడేస్, గమ్యం, జల్సా వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. చివరగా గోవిందుడు అందరివాడేలే చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత ఇంతవరకు ఆమె సినిమాల్లో నటించలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో కట్టిపడేసిన కమిలిని ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యింది. సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో బాగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా డల్లాస్‌లో జరిగిన ఓ ఈవెంట్లో కనిపించి సందడి చేసింది. ఈ ఫోటోలు బయటకు రావడంతో కమిలిని ముఖర్జీ లుక్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఏంటి ఇలా మారిపోయింది? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
కోలీవుడ్‌లో పులిమురుగన్
యాక్షన్, ఎడ్వెంచర్ కథా చిత్రంగా రూపొందిన మలయాళ చిత్రం పులిమురుగన్. అక్కడ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో కమలిని ముఖర్జీ కథానాయకిగా నటించారు. నమిత, జగపతిబాబు, లాల్, బాలా, వినూమోహన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, కథనాన్ని ఉదయకృష్ట అందించారు. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ములకపడం ఫిలింస్ పతాకంపై తోమిచన్ ములకపడం నిర్మించారు. చిన్న చిత్రాలకు చిరునామా మాలీవుడ్ అన్న పేరును తడిపేసి రూ.37 కోట్ల వ్యయంతో రూపొంది రూ.150 కోట్లు వసూలు చేసి మలయాళ చిత్రపరిశ్రమలో ఈ రెండు విషయాల్లోనూ రికార్డులు బద్దలు కొట్టిన తొలి చిత్రం పులిమురుగన్. అంతే కాదు మన్యంపులి పేరుతో తెలుగులోకి అనువాదమై అక్కడ మంచి విజయాన్ని అందుకున్న పులిమురుగన్ ఇప్పుడు ఇదే పేరుతో తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. మలయాళ చిత్ర నిర్మాతనే ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయనున్నారు. చిత్ర కథేంతంటే తన తండ్రిని తన కళ్ల ముందే చంపిన పులిని ఒక కుర్రాడు ఆ పులిని చంపి ప్రతీకారం తీర్చుకుంటాడు.అతను పెద్ద అయిన తరువాత కూడా పులుల నుంచి ఆ గ్రామాన్ని కాపాడడమే వృత్తిగా స్వీకరిస్తాడు. అతను పులులను ఎలా వేటాడతాడన్నదే చిత్ర కథనం అని చిత్ర వర్గాలు తెలిపారు. ఇందులో నాలుగు బీభత్సమైన పోరాట సన్నివేశాలు చోటుచేసుకుంటాయని చెప్పారు. చిత్ర చివరి ఘట్ట పోరాట దృశ్యాలను స్టంట్‌మాస్టర్ పీటర్హెయిన్స్ నేతృత్వంలో 96 రోజులు చిత్రీకరించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. దీనికి గోపిసుందర్ సంగీతాన్ని అందించారు. -
బాక్సాఫీస్ పులి
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కమలినీ ముఖర్జీ జంటగా జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘పులి మురుగన్’. వైశాఖ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో 100 కోట్ల పైగా వసూళ్లు సాధించింది. ఆ ఘనత సాధించిన తొలి మలయాళ చిత్రంగా రికార్డుల్లోకెక్కింది. శ్రీసరస్వతి ఫిల్మ్స్ అధినేత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి ‘మన్యం పులి’ పేరుతో నేడు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ- ‘‘కేరళ, వియత్నాం పరిసరాల్లో రెండేళ్లు షూటింగ్ జరుపుకున్న చిత్రమిది. పీటర్ హెయిన్స్ ఫైట్స్ హైలెట్. మోహన్‌లాల్, పులి కాంబినేషన్లో తీసిన ఫైట్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. పిల్లలతో పాటు పెద్దలకూ నచ్చే అంశాలున్నాయి. మలయాళంలోలానే తెలుగు వారు కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్. -
మలయాళం హిట్‌తో...
‘‘నేను తెలుగులో తొలిసారి డబ్ చేసిన ‘సింధూరపువ్వు’ హిట్ అయింది. ఆ తర్వాత చేసిన మరో డబ్బింగ్ చిత్రం ‘సాహసఘట్టం’ హిట్ అయింది. తాజాగా డబ్ చేస్తున్న ‘మన్యం పులి’తో మూడో హిట్ వస్తుందను కుంటున్నా’’ అని నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి అన్నారు. మోహన్‌లాల్, కమలినీ ముఖర్జీ జంటగా జగపతిబాబు ముఖ్య పాత్రలో వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘పులి మురుగన్’ను ‘మన్యం పులి’ పేరుతో కృష్ణారెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘‘మలయాళంలో వందకోట్లు కలెక్షన్స్ రాబట్టిన చిత్రమిది. తెలుగులో కూడా హిట్ సాధించాలి’’ అని సమర్పకుడు తొమిచన్ ముల్కపాదమ్ అన్నారు. హీరో నాగ అన్వేష్, హీరోయిన్ హెబ్బాపటేల్ పాల్గొన్నారు. -
గర్జించే పులి
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కమలినీ ముఖర్జీ జంటగా నటించిన తాజా మలయాళ చిత్రం ‘పులి మురుగన్’. వైశాఖ దర్శకత్వం వహించారు. జగపతిబాబు ముఖ్య పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లు రాబట్టి, సరికొత్త రికార్డు సృష్టించింది. శ్రీ సరస్వతి ఫిల్మ్స్ అధినేత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని ‘మన్యం పులి’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘కేరళ, వియత్నాం పరిసరాల్లో రెండేళ్లు షూటింగ్ జరుపుకున్న చిత్రమిది. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలెట్. ఇప్పటికే డబ్బింగ్, పాటల రికార్డింగ్ పూర్తయింది. ఈ నెల 25న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల వచ్చిన ‘జనతా గ్యారేజ్’ చిత్రంతో మోహన్‌లాల్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘మన్యం పులి’తో మరింతగా అలరిస్తారు’’ అన్నారు. -
పులితో పోరాటం
‘‘అటవీ సమీపంలోని ఓ గ్రామంలో నివసిస్తాడు అతను. వెదురు బొంగులు విక్రయిస్తుంటాడు. వెదురు బొంగుల కోసం అడవికి వెళ్లినప్పుడు పలు జంతువులతో ముఖ్యంగా పులులతో పోరాడాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నది ఆసక్తికరం’’ అని నిర్మాత ‘సింధూరపువ్వు కృష్ణారెడ్డి’ అన్నారు. మోహన్‌లాల్, కమలినీ ముఖర్జీ జంటగా జగపతిబాబు కీలక పాత్రలో వైశాఖ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పులి మురుగన్’. మలయాళంలో ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ‘మన్యం పులి’ పేరుతో కృష్ణారెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘సౌత్ ఇండియాలో ‘బాహుబలి’ తర్వాత ఆ రేంజ్లో హిట్ అయిన చిత్రం ‘పులి మురుగన్’. డబ్బింగ్, పాటల రికార్డింగ్ పూర్తయింది. నవంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
ఏమో మళ్లీ స్టేజీ ఎక్కవచ్చునేమో
చక్కని నటి కమలినీ ముఖర్జీ. తెలుగులో ఆనంద్ చిత్రంతో అందరినీ అలరించిన బ్యూటీ ఈమె. బహుభాషా నటిగా గుర్తింపు పొందినా ఎందు చేతనో క్రేజీ నాయకి స్థాయికి చేరుకోలేదు. ఇంతకు ముందు తమిళంలో వేట్టైయాడు విళైయాడు చిత్రంలో కమలహాసన్‌తో రొమాన్స్ చేసిన కమలిని ముఖర్జి.. చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఇరైవి చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులను పలకరించడానికి వచ్చారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది.ఈ సందర్భంగా కమలిని ముఖర్జీ తన అభిప్రాయాలను ఇలా వ్యక్తం చేశారు. వేట్టైయాడు విళైయాడు చిత్రంలో కమలహాసన్‌కు జంటగా చిన్న పాత్రనే పోషించినా నాకు తమిళ ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణ మరువలేనిది. నేను ఇక్కడ అధిక చిత్రాలు చేయకపోయినా ఇంకా గుర్తు పెట్టుకున్నారు. అలాంటి వైవిధ్యభరిత పాత్రల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇరైవి చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో కుటుంబం, ఉద్యోగం రెండింటిని మేనేజ్ చేసుకుంటూ జీవించే పాత్ర. ఇప్పటి వరకూ నేను నటించిన పాత్రలకు భిన్నమైనది. ఈ పాత్రతో మరోసారి తమిళ ప్రేక్షకులకు దగ్గరవుతాననే నమ్మకం ఉంది. భాష నాకు సమస్య కాదు. నాకు నచ్చిన హీరో ఎవరని అడుగుతున్నారు. నటనకే నేను అభిమానిని. తదుపరి చిత్రం ఏమిటన్నది ఇంకా నిర్ణయం కాలేదు. ప్రస్తుతం మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నాను. ఇక రచన,ప్రయాణం, పాకశాస్త్రం కళలపై ఆసక్తి చూపుతున్నాను. భవిష్యత్‌లో పలు కథలు రాస్తాను. నేను రంగస్థలంపై నటించాను. ఏమో మళ్లీ స్టేజీ ఎక్కవచ్చునేమో. -
మళ్లీ తెరపై... కమలిని
‘ఆనంద్’తర్వాత తెలుగు తెరపై దూసుకెళ్లిన కమలినీ ముఖర్జీ జోరు ఈ మధ్య తగ్గింది. ఇప్పటివరకూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి కమలిని దాదాపు పాతిక సినిమాల పైనే చేశారు. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు రాకపోవడం వల్లే కమలిని ఎక్కువగా సినిమాలు చేయడం లేదని ఊహించవచ్చు. ఈ నేపథ్యంలో ఆరేడేళ్ల విరామం తర్వాత తమిళంలో ఓ సినిమా అంగీకరించారామె. ‘పిజ్జా’తో మోస్ట్ వాంటెడ్ డెరైక్టర్ అయిన కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ కొత్త చిత్రం రూపొందనుంది. ఇందులో ఎస్.జె. సూర్య సరసన కమలిని జతకట్టనున్నారు. విజయ్ సేతుపతి, అంజలి తదితరులు నటించనున్న ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, కమలినివి కీలక పాత్రలట! దీనికి ‘ఇరవై’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. -
మళ్లీ ఎంట్రీ..!
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలతో మాంచి కిక్కిచ్చిన సుందరి కాజోల్ మళ్లీ తెరంగేట్రం చేస్తోందట. స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్‌ను పెళ్లాడి ఇండస్ట్రీకి దూరమైన ఈ ‘అమ్మ’డు... ఆ మధ్య షారూఖ్ ‘మై నేమ్ ఈజ్ ఖాన్’లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇన్నాళ్లూ కామ్‌గా ఉన్న కాజోల్... తాజాగా అజయ్ దేవ్‌గణ్ తీయబోయే సినిమాలో నటిస్తోందన్న వార్తలు బీ టౌన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది విడుదలైన మలయాళ మూవీ ‘హౌ ఓల్డార్ యూ’ను అజయ్ రీమేక్ చేస్తున్నాడు. కాజోల్కు కథ తెగ నచ్చిందట. సో... అప్పటి నుంచి నటించేస్తానంటూ హబ్బీకి సిగ్నల్స్ పంపేసిందీ తార. అలాగైతే చెత్త సినిమాలే తీస్తుంటాం.. భారత్‌లో సినిమాలు రూపొందించే వారు అంతర్జాతీయు సినిమాలను చూస్తుండాలని, వాటిని చూసి నేర్చుకోకుంటే మనం చెత్త సినిమాలనే తీస్తుంటామని బాలీవుడ్ దర్శక-నిర్మాత విధు వినోద్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాశ్మీర్‌లోని ఒక కుగ్రామం నుంచి తాను వచ్చానని, చాలా కాలం కేవలం హిందీ సినిమాలు మాత్రమే చూస్తూ పెరిగానని చోప్రా చెప్పుకొచ్చాడు. ప్రపంచాన్ని పట్టించుకోకుండా వున సినిమాలనే మనం చూస్తుంటే, వుంచి సినిమాలను ఎలా తీయగలమని ప్రశ్నించాడు. దేశంలో ప్రాంతీయ భాషల్లోనూ మంచి సినిమాలు వస్తున్నాయని అన్నాడు. ఐటమ్ నంబర్..! తెలుగు తెరపై ‘ఆనందం’గా మెరిసి మురిసిన బెంగాలీ భామ కమలినీ ముఖర్జీ ఆ తరువాత ‘డల్’ అయింది. అవకాశాలు లేక రూటు మార్చిన ఈ సుందరి తాజాగా మలయాళంలో ఐటమ్ సాంగ్ ఒకటి చేస్తోందని కోలీవుడ్ టాక్. దర్శకుడు వైకాఖ్ తెరకెక్కిస్తున్న ‘కజిన్స్’ చిత్రంలో ఈ పాట ఫస్ట్ హాఫ్‌లో ఉంటుందట. కజిన్స్ జర్నీలో చంద్రగిరి చేరుకొంటారట. సో ఆ ప్రాంతాన్ని పరిచయం చేసే సాంగ్ ఇదని స్క్రిప్ట్ రైటర్ చెబుతున్నాడు. కొచ్చీలో చిత్రీకరించే ఈ పాటలో కమలినీతో పాటు 40 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారు. -
కృష్ణవంశీని ఆకాశానికెత్తిన కమలినీ ముఖర్జీ
చెన్నై: 'ఆనంద్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బెంగాలీ భామ కమలినీ ముఖర్జీ దర్శకుడు కృష్ణవంశీని పొగడ్తలతో ఆకాశానికెత్తారు. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించేసుకుని, ఆ తరువాత 'గోదావరి' సినిమాతో మరింత దగ్గరైన కమలినీ తాజాగా 'గోవిందుడు అందరివాడేలే' సినిమాలో నటించింది. ఇటువంటి కుటుంబ కథా చిత్రంలో నటించినందుకు గర్వపడ్తున్నాననీ కమలినీ చెప్పారు. ఈ చిత్రంలో నటించడం ద్వారా గొప్ప అనుభూతి పొందినట్లు పేర్కొన్నారు. కుటుంబ సంబంధాలు, మనుషులలో భావోద్వేగాలు, వారి మనస్తత్వాలు తెలియజేయడంలో కృష్ణవంశీ దిట్ట అన్నారు. కృష్ణ వంశీ దర్శకత్వంలో రామ్‌చరణ్-కాజల్ జంటగా నటించిన 'గోవిందుడు అందరివాడేలే' ఈరోజు విడుదలైన సందర్భంగా కమలినీ ఈ సినిమా షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్నారు. చిత్ర యూనిట్ సభ్యులందరూ ఓ కుటుంబంలా కలిసిమెలిసి పనిచేసినట్లు చెప్పారు. తన కెరీర్లో దీర్ఘ కాలం 8 నెలలు షూటింగ్ చేసిన చిత్రం ఇదేనన్నారు. షూటింగ్ జరిగినంత కాలం చాలా ఆనందంగా గడిచిపోయినట్లు తెలిపారు. ఈ చిత్రం ఎన్నో మధురానుభూతులను మిగిల్చిందన్నారు. కృష్ణ వంశీ కెరీర్లో ఇది ఒక గొప్ప చిత్రంగా నిలుస్తుందన్నారు. కుటుంబ కథా చిత్రాలు నిర్మించడంలో ఆయనకు ఎంతో నైపుణ్యం ఉందని ప్రశంసించారు. తన కెరీర్లో నటించిన పాత్రలకు భిన్నమైన పాత్ర ఇందులో పోషించినట్లు చెప్పారు. ఇటువంటి పాత్ర తనతో చేయించినందుకు కృష్ణ వంశీకి కమలినీ కృతజ్ఞతలు తెలిపారు. **