Actress Kamalinee Mukherjee Recent Look Shocks Netizens, Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Kamalinee Mukherjee : ఇండస్ట్రీని వదిలేసిన కమిలిని ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

Published Wed, Jan 11 2023 2:59 PM | Last Updated on Wed, Jan 11 2023 6:13 PM

Actress Kamalinee Mukherjee Recent Look Shocks Netizens Pics Go Viral - Sakshi

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తారలు సడెన్‌గా మాయమవుతుంటారు. కొన్నిసార్లు వాళ్లు ఎక్కడున్నారు? ఏం చేస్తుంటారు అన్నది కూడా తెలియదు. అలాంటి వాళ్లలో హీరోయిన్‌ కమలిని ముఖర్జీ కూడా ఒకరు. 2004లో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఆనంద్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ భామ.

మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న కమిలిని ఆ తర్వాత ఆమె నటించిన గోదావరి, హ్యాపీడేస్‌, గమ్యం, జల్సా వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. చివరగా గోవిందుడు అందరివాడేలే చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత ఇంతవరకు ఆమె సినిమాల్లో నటించలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో కట్టిపడేసిన కమిలిని ఇప్పుడు అమెరికాలో సెటిల్‌ అయ్యింది.

సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో బాగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా డల్లాస్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో కనిపించి సందడి చేసింది. ఈ ఫోటోలు బయటకు రావడంతో కమిలిని ముఖర్జీ లుక్‌ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఏంటి ఇలా మారిపోయింది? అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement