Heroine Laya Shares Her IT Engineer Job Photos In America Company, Goes Viral - Sakshi
Sakshi News home page

Laya America Job Photos: అప్పట్లో హీరోయిన్‌గా అలరించి.. ఇప్పుడేమో ఇంజినీర్‌గా!

Apr 26 2023 5:09 PM | Updated on Apr 26 2023 6:39 PM

Heroine Laya Shares Her IT Engineer Job Photos In America Company  - Sakshi

హీరోయిన్ లయ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. స్వయంవరం సినిమాతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా కనిపించింది లయ. ముఖ్యంగా  కుటుంబ చిత్రాలకు పేరు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో దాదాపు ప‌దేళ్ల‌పాటు హీరోయిన్‌గా రాణించింది.

అయితే ఓ బిజినెస్‌ మ్యాన్‌ను పెళ్లి చేసుకున్న లయ ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో సెటిలైంది. పెళ్లయ్యాక కూడా ఖాళీగా ఉండకుండా జాబ్‌ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాజాగా తాను పనిచేస్తున్న కంపెనీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవీ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

(ఇది చదవండి: యాంకర్‌ విష్ణుప్రియ.. ఇన్ని కష్టాలు పడిందా?)

ఇటీవలే హైదరాబాద్‌  నుంచి అమెరికా తిరిగి వెళ్లిన లయ సోషల్‌ మీడియాలో టచ్‌లో ఉంటూ సందడి చేస్తున్నారు. వెండితెరకు దూరమైన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. లయ ప్రస్తుతం అమెరికాలోని జోబి ఏవియేషన్‌ ఏరో స్పేస్ కంపెనీలో ఐటీ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో తెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్.. ఇప్పుడు జాబ్‌ చేస్తూ ఫుల్‌ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement