laya
-
నటి లయ థ్యాంక్స్ గివింగ్ పార్టీ.. ఫ్యామిలీతో కలిసి (ఫొటోలు)
-
బొర్రా గుహల్లో చిల్ అవుతున్న హీరోయిన్ లయ (ఫొటోలు)
-
అందాల తార, ఫ్యావరెట్ కలర్, బ్యూటిఫుల్ లుక్
-
పోలవరం దగ్గర నటి లయ సందడి (ఫొటోలు)
-
పండుగ కళ వచ్చేసింది: పింక్ సారీలో నటి లయ
-
Laya Gorty : నటి లయ బర్త్ డే సెలబ్రేషన్స్ బీచ్‌లో రొమాంటిక్‌గా.. ఫోటోలు చూశారా..? (ఫోటోలు)
-
టీనేజీలోనే హీరోయిన్.. 25 ఏళ్లకే పెళ్లి.. లయ గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
శివాజీ-లయ.. చాన్నాళ్ల తర్వాత మళ్లీ జంటగా
అప్పట్లో సినిమాలు చేసి పూర్తిగా టాలీవుడ్‌కి దూరమైపోయిన శివాజీ.. బిగ్‌బాస్ గత సీజన్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మధ్య ఓ వెబ్ సిరీస్‌తో నటుడిగా కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం తనే నిర్మాతగా మారి ఓ సినిమా చేస్తున్నాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కథతో తీస్తున్నారు. ఇందులో శివాజీకి జోడిగా లయ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం పూజతో లాంఛనంగా ప్రారంభమైంది.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?)హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి దిల్ రాజు, బోయపాటి శ్రీను, నిర్మాత బెక్కం వేణు గోపాల్ తదితరులు హాజరయ్యారు. ఇకపోతే ఈ సినిమాతో సుధీర్ శ్రీరామ్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.గతంలో శివాజీ, లయ జంటగా పలు తెలుగు సినిమాల్లో హీరోహీరోయిన్లుగా చేశారు. 'మిస్సమ్మ', 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'అదిరిందయ్యా చంద్రం' తదితర మూవీస్ ప్రేక్షకుల్ని అలరించాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఈ కాంబోలో సినిమా రావడం విశేషం. ఈ నెల 20 నుంచి షూటింగ్ ప్రారంభించబోతున్నారు. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తారు.(ఇదీ చదవండి: అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన హీరో మోహన్ లాల్!) -
వరలక్ష్మి వ్రతం పూజలో సీనియర్ హీరోయిన్ లయ (ఫోటోలు)
-
నాగార్జున సాగర్ వద్ద హీరోయిన్ లయ సందడి (ఫొటోలు)
-
అలాంటి వార్తలతో నాతో పాటు కుటుంబం మొత్తం బాధ పడింది: లయ
టాలీవుడ్లో తెలుగమ్మాయిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లయ. విజయవాడకు చెందిన లయ మొదటి సినిమా 'స్వయంవరం'తోనే పలు అవకాశాలను అందుకుని ఎన్నో అవార్డులు సాదించింది. గ్లామర్ రోల్స్ కన్న నటనకు అవకాశం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చిన లయ, ఎన్నారై శ్రీ గణేశన్ అనే డాక్టర్‌ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. అప్పటి నుంచి కాలిఫోర్నియాలోనే ఉంటూ అడపాదడపా సినిమా ఫంక్షన్లలో దర్శనమిస్తుంది.లయ హీరోయిన్గా పరిచయం అయి 25 ఏళ్లు అవుతుంది. తన మొదటి సినిమా స్వయంవరం చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యలో పాల్గొంది. సోషల్ మీడియాలో తన గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని వాపోయింది. వాస్తవంగా తాను సోషల్‌మీడియాకు కాస్త దూరంగా ఉంటాను. దీంతో అలాంటి వార్తలు వచ్చినప్పుడు కొందరు నిజంగానే నమ్మే అవకాశం ఉందని ఆమె తెలిపింది. తన ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేదని, కుటుంబాన్ని పోషించేందుకు టీ అమ్ముకుని బతుకుతున్నట్లు దారుణమైన వార్తలు రాశారని లయ బాధ పడింది. అవి చూసిన తన కుటుంబ సభ్యులు అందరూ చాలా బాధ పడ్డారని పేర్కొంది.తనకు నచ్చని సినిమా గురించి లయ ఇలా చెప్పారు.. 'నేను నటించిన స్వయంవరం వచ్చి ఇప్పటికి 25 ఏళ్లు అయింది. అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఒక సినిమా హిట్ అయిన తర్వాత సహజంగా ఏ హీరోయిన్ అయినా సరే భారీ సినిమానే ప్లాన్ చేస్తుంది. కానీ, నేను మాత్రం మా బాలాజీ అనే సినిమాలో విడో పాత్ర చేసి తప్పు చేశాననిపించింది. సినిమా బాగుంది. కానీ ఆ సమయంలో నేను చేయకుండా ఉండుంటే మరింత బాగుండేది. అలాంటి సినిమాలో మరో మూడు ఉన్నాయి. ఈరోజుల్లో ఉండే హీరోయిన్లు అయితే అలాంటి తప్పు చేయడం లేదు. చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. నా టైమ్ బాగుండటం వల్ల ఆ తర్వాత కూడా నాకు మంచి అవకాశాలు వచ్చాయి.' అని ఆమె తెలిపింది. చాలా ఏళ్ల తర్వాత లయ మళ్లీ వెండతెరపై కనిపించనున్నారు. నితిన్ నటిస్తున్న తమ్ముడు సినిమాలో ఆమె ఒక కీలకపాత్రలో కనిపించనుంది. అవకాశాలు వస్తే మరిన్ని సినిమాల్లో నటిస్తానని కూడా ఆమె చెప్పింది. View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) -
ఆ డైరెక్టర్ నన్ను చంపుతానని బెదిరించాడు.. నా వెంటే ఎయిర్‌పోర్టుకు..
హీరోయిన్ లయ.. అప్పట్లో యూత్‌కే కాదు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా ఫేవరెట్ హీరోయిన్. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసే ఈ అందాల రాశి సినిమాలకు దూరమై దాదాపు పద్దెనిమిదేళ్లవుతోంది. మధ్యలో 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' అనే సినిమాలో అమ్మవారి పాత్రలో కనిపించింది. తర్వాత సినిమాలవైపు కన్నెత్తి చూడలేదు. అమెరికాలో సెటిలైన ఈమె అక్కడ నాలుగేళ్లపాటు ఐటీ ఉద్యోగం చేసింది. తర్వాత అది వదిలేసి డ్యాన్స్ స్కూల్ పెట్టింది. కోవిడ్ తర్వాత దాన్ని కూడా మానేసి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండటం మొదలుపెట్టింది.అందుకే ఇండియాకు వచ్చేశాతాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె ఎన్నో విషయాల గురించి మాట్లాడింది. 'నేను అమెరికా వెళ్లిపోయాక నా గురించి లేనిపోనివి ప్రచారం చేశారు. రోడ్డున పడ్డానని, అడుక్కుతింటున్నానని, ఇంకా ఎన్నో వదంతులు సృష్టించారు. అవి గుర్తు చేసుకున్నప్పుడల్లా బాధేస్తుంది. ఇప్పుడు నేను ఇండియాకు రావడానికి ప్రధాన కారణం.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాను. నితిన్ 'తమ్ముడు' సినిమాలో నటిస్తున్నాను' అని చెప్పుకొచ్చింది.నన్ను ఫాలో అవుతూ..అలాగే తన చేదు అనుభవాన్ని వెల్లడిస్తూ.. 'ఒక పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డైరెక్టర్ నన్ను ఫాలో అయ్యాడు. బేగంపేటలో కారు పార్కింగ్ చేసే దగ్గరకు వచ్చి మీరు ఎలా వెళ్తారో చూస్తానని బెదిరించాడు. నేను ఎలాగోలా తప్పించుకుని ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయాను. కానీ ఆయన నన్ను ఫాలో అవుతూ అక్కడికీ వచ్చాడు. మీరు చంపుతానన్నా నేనేం చేయలేను.. ఇక్కడ ఎవరూ లేరు, మీ ఇష్టం చంపేయండన్నాను' అంటూ లయ ఆనాటి ఇబ్బందికర పరిస్థితిని గుర్తు చేసుకుంది. అయితే ఆ డైరెక్టర్ ఎవరన్నది మాత్రం బయటపెట్టలేదు.చదవండి: చేతికట్టు తొలగించి కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్ -
హీరోయిన్ లయతో పెళ్లి.. ఆ కారణం వల్లే ఆగిపోయింది: సాయి కిరణ్
నువ్వే కావాలి సినిమాతో హీరోగా అడుగుపెట్టన నటుడు సాయి కిరణ్. ఆ తర్వాత ప్రేమించు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గుప్పెడంత మనసు సీరియల్లో నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సాయి కిరణ్.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అంతే కాకుండా లయ, సాయి కిరణ్ జంటగా నటించిన ప్రేమించు మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో లయ బ్లైండ్ పాత్రలో నటించడంపై మాట్లాడారు. (ఇది చదవండి: కార్తి హీరోగా మొదటి సినిమా.. వివాదంపై సముద్రఖని ఆగ్రహం!) లయ పాత్రపై మాట్లాడుతూ.. 'లయ బ్లైండ్‌గా నటించేదుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు. ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేశారు. అందువల్లే ఈ సినిమా నేషనల్ అవార్డ్ వరకు వెళ్లింది. నీ జీవితాంతం ఈ సినిమా గుర్తుంటుందని రామానాయుడు అన్నారు. లయతో పెళ్లి విషయంపై మాట్లాడుతూ.. చూడడానికి జంట బాగుంది. పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మా తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ మా జాతకాలు కలవలేదు. అందువల్లే సెట్ అవ్వలేదు. మా మధ్య లవ్ అలాంటివేమీ లేవు. మేం కూడా కుదిరితే చేసుకుందామనుకున్నాం. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాం. ఆ తర్వాత ఇంద్రజిత్ అనే షో చేశాం. ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ ఎంత బాగుందో మూవీలో నటించాం. జాతకాలు నేను చాలా గట్టిగా నమ్ముతా. పేరేంట్స్ కూడా నమ్ముతారు. ఒకప్పుడు నమ్మేవాడిని కాదు. కానీ ఆ తర్వాత వాటి గురించి తెలుసుకున్నా.' అని అన్నారు. (ఇది చదవండి: స్టార్ కమెడియన్ మరణంతో అనాథగా మారిన ప్రియుడు.. చివరకు..) -
అమెరికాలో వరలక్ష్మి వ్రతం ఆచరించిన హీరోయిన్ లయ (ఫోటోలు)
-
అమెరికాలో లయ.. ఎలాంటి జాబ్ చేస్తుందో తెలుసా?
హీరోయిన్ లయ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. స్వయంవరం సినిమాతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా కనిపించింది లయ. ముఖ్యంగా కుటుంబ చిత్రాలకు పేరు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో దాదాపు పదేళ్లపాటు హీరోయిన్గా రాణించింది. అయితే ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకున్న లయ ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో సెటిలైంది. పెళ్లయ్యాక కూడా ఖాళీగా ఉండకుండా జాబ్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాజాగా తాను పనిచేస్తున్న కంపెనీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవీ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (ఇది చదవండి: యాంకర్ విష్ణుప్రియ.. ఇన్ని కష్టాలు పడిందా?) ఇటీవలే హైదరాబాద్ నుంచి అమెరికా తిరిగి వెళ్లిన లయ సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటూ సందడి చేస్తున్నారు. వెండితెరకు దూరమైన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. లయ ప్రస్తుతం అమెరికాలోని జోబి ఏవియేషన్ ఏరో స్పేస్ కంపెనీలో ఐటీ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో తెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్.. ఇప్పుడు జాబ్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) -
అమెరికాలో లయ చేసే జాబ్ ఇదే...
-
అమెరికాలో లయ ఏం జాబ్ చేస్తుందో తెలుసా?
హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్వయంవరం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మనోహరం, ప్రేమించు చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈ చిత్రాలకు గానూ వరుసగా మూడు నంది అవార్డులు అందుకున్న ఏకైన నటిగా లయ గుర్తింపు సంపాదించుకుంది. దాదాపు 13 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్గా రాణించిన ఆమె కెరీర్ పీక్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని నటనకు దూరమైంది. చదవండి: బర్త్‌డే రోజున చరణ్ ధరించిన ఈ షర్ట్ ధరెంతో తెలుసా? ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్న ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ రీల్స్ చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఇండియా వచ్చిన లయ వరుసగా ఇంటర్య్వూలు ఇస్తోంది. ఈ సందర్భంగా అమెరికాలో తను చేసే జాబ్, శాలరీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కాగా తాను 2006లో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిన లయ.. 2011 నుంచి ఐటీ సెక్టార్లో జాబ్ చేసినట్లు చెప్పింది. నాలుగేళ్లు ఫుల్ టైం వర్క్ చేశానని, ఇండియాలోని ప్రముఖ ఐటీ సంస్థకు చేసినట్లు తెలిపింది. చదవండి: అలీ రేజాతో రొమాంటిక్ సీన్‌పై ప్రశ్న.. నటి సనా షాకింగ్ రియాక్షన్ ఆ సమయంలో తన శాలరీ అన్ని ట్యాక్స్‌లు పోనూ 12000 డాలర్స్ అని చెప్పింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు నెలకు రూ. 960, 000. నాలుగేళ్లు ఐటీ సెక్టార్ చేసిన తాను 2017లో జాబ్ వదిలేసినంది. ఆ తర్వాత డాన్స్ స్కూల్ పెట్టానని, కోవిడ్ కారణంగా అది మానేసి సోషల్ మీడియాలో రీల్స్ చేయడం స్టార్ట్ చేశానంటూ చెప్పుకొచ్చింది. ఇక చాలా ఏళ్ల తర్వాత ఇండియా వచ్చిన లయ హైదరాబాద్ చాలా మారిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. న్యూయార్క్ సిటీ కంటే హైదరాబాదే చాలా బాగుందని వ్యాఖ్యానించింది. -
ఒకప్పటి నటి లయ.. ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫొటోలు)
-
‘స్వయంవరం’ ప్లాప్ అనుకున్నా.. ఎగ్జామ్ బంక్ కొట్టి మూవీకి వెళ్లా!: నటి లయ
హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్వయంవరం చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు గానూ నంది అవార్డు అందుకుంది. ఆ తర్వాత నటించిన మనోహరం, ప్రేమించు చిత్రాలకుగానూ ఆమెకు నంది అవార్డులు వరించాయి. అలా వరుసగా ఆమె మూడుసార్లు నంది అవార్డులు అందుకున్న ఏకైక నటిగా లయ గుర్తింపు పొందింది. దాదాపు 13 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్గా రాణించిన ఆమె కెరీర్ పీక్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని నటనకు దూరమైంది. చదవండి: ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న నటి, శరీరమంతా కమిలిపోయి.. ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్న ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన లేటెస్ట్ ఫొటోలతో పాటు రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇండియాకు వచ్చిన ఆమె ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్బంగా తనకు సంబంధించిన పలు ఆసక్తిర విషయాలను పంచుకుంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. స్వయంవరం మూవీ విశేషాలను పంచుకున్నారు. ‘ఆ మూవీ టైంలో నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న. మూవీ అయిపోయింది ఎగ్జామ్స్ వచ్చాయి. స్వయంవరం రిలీజ్ రోజు ఫిజిక్స్ ఎగ్జామ్. ఒకరోజు గ్యాప్ తర్వాత కెమిస్ట్రీ ఎగ్జామ్. నా ఫ్రెండ్ మూవీకి వెళ్దాం అంది. ఎగ్జామ్ పెట్టుకుని ఎలా వెళ్తాం.. చదవాలి కదా అన్నాను. దీంతో ఆమె ఈ సినిమా ఆడక వెళ్లిపోతే ఎలా? అంది. అవును కదా.. అందరు కొత్తవాళ్లే.. ఈ మూవీ ప్లాప్ అయితే సినిమాను తీసేస్తారు కదా అనుకున్నాం. ఎగ్జామ్ పోతే మళ్లీ రాసుకోవచ్చులే అని చదవకుండ మూవీకి వెళ్లిపోయాం’ అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: కొత్త జంట మనోజ్-మౌనికలపై మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్ ఆ తర్వాత చూస్తే ఈ మూవీ హిట్ అయ్యిందని, అసలు ఊహించలేదని చెప్పారు. అనంతరం మాట్లాడుతూ ప్రేమించు సినిమా తనకు ప్లస్ అయ్యిందన్నారు. మొదట అందరు తనని ఈ సినిమా చేయొద్దన్నారని, కానీ ఇందులో అంధురాలిగా తన పాత్రకు మంచి పేరు వచ్చిందన్నారు. ఇక తన కెరియర్లో ఈ సినిమా చేసి ఉండకపోతే బావుందని అనుకునే చిత్రం ఏదైన ఉందా? అంటే అది 'మా బాలాజీ' సినిమానే అన్నారు. ఎలాంటి సినిమాలను .. పాత్రలను ఒప్పుకోవాలనే విషయం తెలియకపోవడం వలన ఆ పొరపాటు జరిగిందన్నారు లయ. -
వేల కోట్లు ఆస్తులు.. కానీ అందులోనే: లయ
స్వయంవరం(1999) చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది లయ. తొలి సినిమాతోనే నంది అవార్డు గెలుచుకుంది. మనోహరం, ప్రేమించు సినిమాలకు సైతం వరుసగా నంది అవార్డులు అందుకుంది. దాదాపు 13 ఏళ్ల పాటు సినీరంగంలో స్టార్‌గా నటిగా పలువురు హీరోలతో నటించింది సీనియర్ నటించింది ఆమె. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో హల్చల్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన భర్త, పిల్లల గురించి చెప్పుకొచ్చారు. లయ మాట్లాడుతూ.. 'నా భర్త పేరు శ్రీ గణేశ్ గోర్తి. అమెరికాలో ఫేమస్ డాక్టర్. మాది అరెంజ్డ్ మ్యారేజ్. సినిమాల్లో నటించవద్దని ఆయన ఎప్పుడూ నాకు చెప్పలేదు. ఆయన తనకు అన్ని విషయాల్లో మద్దతుగా ఉంటారు. వైద్యవృత్తిలో ఎప్పుడు బిజీగా ఉంటారు. ఒక్కరే అన్ని చూసుకోగలరు. అమెరికాలోనే నేను కూడా ఐటీలో పనిచేశా. 2017 నుంచి బ్రేక్ తీసుకున్నా. ఇవన్నీ సంతోషం అనుకుంటా కానీ.. చిన్న చిన్న విషయాలే హ్యాపీగా అనిపిస్తాయి. డ్రాయింగ్ వేసినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. మేమిద్దరం కనిపిస్తే చూస్తే మీ సిస్టరా అని అడుగుతారు. బాబుకు 12 ఏళ్లు. నా కూతురు ఒక సినిమాలో చేస్తే బాగుంటుందనిపిస్తుంది. చైల్ట్ ఆర్టిస్ట్‌గా అమర్- అక్బర్- ఆంటోనీలో చేసింది. కానీ నేనెపుడూ ఎవరినీ అడగలేదు. నేనైతే ఇండస్ట్రీలో వెళ్లమని బలవంతం చేయను. నా పిల్లలిద్దరూ తెలుగు కూడా బాగా మాట్లాడతారు. ఇంగ్లీషులో మాట్లాడటం వచ్చాక తెలుగు మరిచిపోయారు. ' అని అన్నారు. పెళ్లి విషయంపై లయ మాట్లాడుతూ.. 'నేను 2005లో లాస్ ఎంజిల్స్ వెళ్లినప్పుడు మా మదర్ వాళ్ల కజిన్ ఉన్నారు. అక్కడ ఆంటీ పెళ్లి విషయం అడిగారు. మంచి మ్యాచ్ దొరికితే చేసుకుంటా అని చెప్పా. అప్పుడు ఆంటీ నిజంగానే వారికి చెప్పింది. ఆ తర్వాత ఇండియాకు వచ్చా. నాలుగు నెలల తర్వాత మళ్లీ ఫోన్ చేశారు. అప్పుడే ఫోన్ నంబర్స్ తీసుకుని మాట్లాడుకున్నాం. అలా మా పెళ్లి కుదిరింది.' అంటూ చెప్పుకొచ్చింది. -
అందుకే సినిమాలకు దూరమయ్యాను: లయ
స్వయంవరం(1999) చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది లయ. తొలి సినిమాకే నంది అవార్డు గెలుచుకుంది. మనోహరం, ప్రేమించు సినిమాలకు సైతం వరుసగా నంది అవార్డులు అందుకుంది. దాదాపు 13 ఏళ్ల పాటు సినీరంగంలో స్టార్‌గా వెలుగొందిన లయ పలువురు హీరోలతో నటించింది సీనియర్ నటి లయ.. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో హల్చల్ చేస్తోంది. తాజాగా ఆమె తన వ్యక్తిగత విషయాల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే నాకు మంచి పెళ్లి సంబంధం వచ్చింది. ఆయనెప్పుడూ సినిమాలు చేయొద్దనలేదు. కానీ ఎందుకో అలా జరిగిపోయింది. ఇప్పటికీ నా రీల్స్, ఫోటోలు అన్నీ ఆయనే తీస్తాడు. నా భర్త నన్ను అన్నిరకాలుగా సపోర్ట్ చేస్తాడు. ఆయన లేకుండా నేనేం చేయలేను. అయితే కష్టపడి ఇండస్ట్రీలో ఒక పొజిషన్‌కు వచ్చాక అన్నీ వదిలేసుకుని వెళ్లిపోవడమంటే చాలా కష్టం. నా కుటుంబాన్ని, సినిమాలను బ్యాలెన్స్ చేసుకోగలను. కానీ మా ఆయన యూఎస్‌లో ఉండటం వల్ల దూరం పెరిగింది. ఇండియాకు, అక్కడికి తరచూ ప్రయాణించడం కష్టం. అలా సినిమాలకూ దూరమయ్యాను' అని చెప్పుకొచ్చింది లయ. చదవండి: నయనతార, హన్సిక పెళ్లైపోయింది.. నెక్స్ట్ శింబు పెళ్లే.. క్లారిటీ ఏంటంటే? -
సమయం మారింది
ఓ గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి ప్రేమలో పడితే.. ఆ ఊరి దొర, గ్రామ ప్రజలు ఎలా వ్యతిరేకత కనబరిచారు అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘శరపంజరం’. టి. గణపతిరెడ్డి, మామిడి హరికృష్ణ సహకారంతో నవీన్ కుమార్ గట్టు, లయ జంటగా నవీన్ కుమార్ గట్టు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలోని రెండో పాట ‘రావయ్యా నందనా రాజా నందన..’ పాటను ప్రముఖ నటి విజయశాంతి విడుదల చేశారు. మల్లిక్ ఎంవీకే స్వరపరచిన ఈ పాటను జానపద కళాకారుడు గిద్దె రాంనర్సయ్య రాసి, పాడారు. విజయశాంతి మాట్లాడుతూ– ‘‘ఆనాడు దొరలు స్వార్థం కోసం ఆడవాళ్లని ఎలా వాడుకున్నారో తెలిసిన విషయమే. ఈనాటి దొర కూడా ఎలా చేస్తున్నాడో తెలిసిన విషయమే. సమయం మారింది కానీ వ్యక్తి మనస్తత్వం మారలేదనడానికి ఈ సినిమా ఒక నిదర్శనంగా నిలుస్తుంది’’ అన్నారు. -
హీరోయిన్ లయ కూతుర్ని చూశారా? అచ్చుగుద్దినట్లుంది..
తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ లయ ప్రస్తుతం అమెరికాలో సెటిలయ్యింది. స్వయంవరం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రేమించు, మిస్సమ్మ, హనుమాన్ జంక్షన్, స్వరాభిషేకం వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. చివరగా అమర్ అక్బర్ ఆంటోనీ సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన లయ మళ్లీ సినిమాలు చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. డ్యాన్స్ సహా పలు సరదా వీడియోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా ఓ బ్యూటిఫుల్ వీడియోను లయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇందులో లయ కూతురు తన తమ్ముడికి రాఖీ కడుతుంది. అయితే కూతురు శ్లోకా అచ్చుగుద్దినట్లు లయలానే ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. (క్లిక్: ఆళ్ల సినిమాలు చూడొద్దంతే.. ఇప్పుడిదే నడుస్తోంది!) View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) -
తెలుగమ్మాయిలు హీరోయిన్గా పనికిరారా? అని లయ ఏడ్చేసింది
హీరోయిజానికి ఫ్యాక్షనిజం యాడ్ చేస్తూ బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టిన డైరెక్టర్ వీవీ వినాయక్. తొలి సినిమా ఆదితోనే పవర్ఫుల్ హిట్ అందుకున్నాడాయన. ఆ వెంటనే బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి సినిమా తీసి మరో హిట్ కొట్టాడు. అయితే ఇందులో టబు పాత్రకు సౌందర్యను, దేవయాని పాత్రకు లయను అనుకున్నట్లు చెప్పాడు. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'టబు పాత్రకు సౌందర్యను అడిగాను. అయితే ఆమె ఓల్డ్ పాత్ర అప్పుడే వద్దని తిరస్కరించింది. టబును అడగ్గానే ఆమె ఒప్పేసుకుంది. దేవయాని పాత్రకు స్వయంవరం హీరోయిన్ లయను అడిగాను. ఆమె వెంటనే కళ్లనీళ్లు పెట్టుకుంది. చెల్లెలి పాత్రకే ఎందుకు అడుగుతారు? తెలుగమ్మాయిలు హీరోయిన్గా పని చేయరా? అని ఏడ్చేసింది. మీ ముఖం అమాయకత్వంగా ఉంది కాబట్టి ఈ రోల్ కోసం అడిగానని చెప్పాను. కానీ ఆమె మాత్రం ఎందుకండీ అలా చూస్తారు? హీరోయిన్గా ఎందుకివ్వరు? అని ప్రశ్నించింది. నేను సారీ చెప్పి వచ్చేశా. తర్వాత దేవయానిని అడగ్గానే ఒప్పుకుంది. సినిమాలో తల్లి, చెల్లెలి పాత్రలు సెలక్ట్ చేసుకోవడం చాలా కష్టం' అని చెప్పుకొచ్చాడు వినాయక్. చదవండి: నయనతారకు వాంతులు, ఎనీ గుడ్‌న్యూస్ అంటున్న ఫ్యాన్స్! చై టాటూకి, సమంతతో ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా? -
హీరోయిన్ లయ డ్యాన్స్ చూశారా? చీరకట్టులో ట్రెండీగా..
Heroine Laya Kacha Badam Dance Video Goes Viral: తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ లయ ప్రస్తుతం అమెరికాలో సెటిలయ్యింది. స్వయంవరం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రేమించు, మిస్సమ్మ, హనుమాన్ జంక్షన్, స్వరాభిషేకం వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. చివరగా అమర్ అక్బర్ ఆంటోనీ సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన లయ మళ్లీ సినిమాలు చేయలేదు. చదవండి: నాగచైతన్యతో ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది : శ్రుతిహాసన్ కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇటీవలె డ్యాన్స్ వీడియోలతో సందడి చేసింది. తాజాగా సోషల్ మీడియా ట్రెండింగ్ సాంగ్ కచ్చా బాదం సాంగ్‌కి తన ఫ్రెండ్‌తో కలిసి స్టెప్పులేసింది. చీరకట్టులో ట్రెండీ స్టెప్పులేస్తూ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం లయ చేసిన ఈ డ్యాన్స్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. చదవండి: కాజల్ సరికొత్త రికార్డు.. థ్యాంక్యూ చెప్పిన చందమామ View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty)