Actress Laya Revealed The Reason For Quits Movies - Sakshi
Sakshi News home page

Actress Laya: కష్టపడి ఒక పొజిషన్‌కు వచ్చాక సినిమాలు వదిలేయడం అంటే కష్టం.. కానీ తప్పలేదు!

Published Sun, Feb 26 2023 9:49 PM | Last Updated on Mon, Feb 27 2023 4:38 PM

Actress Laya Reveals About Quit Movies - Sakshi

స్వయంవరం(1999) చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది లయ. తొలి సినిమాకే నంది అవార్డు గెలుచుకుంది. మనోహరం, ప్రేమించు సినిమాలకు సైతం వరుసగా నంది అవార్డులు అందుకుంది. దాదాపు 13 ఏళ్ల పాటు సినీరంగంలో స్టార్‌గా వెలుగొందిన లయ పలువురు హీరోలతో నటించింది సీనియర్‌ నటి లయ.. సోషల్‌ మీడియాలో ఫోటోలు, వీడియోలతో హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా ఆమె తన వ్యక్తిగత విషయాల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

'కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడే నాకు మంచి పెళ్లి సంబంధం వచ్చింది. ఆయనెప్పుడూ సినిమాలు చేయొద్దనలేదు. కానీ ఎందుకో అలా జరిగిపోయింది. ఇప్పటికీ నా రీల్స్‌, ఫోటోలు అన్నీ ఆయనే తీస్తాడు. నా భర్త నన్ను అన్నిరకాలుగా సపోర్ట్‌ చేస్తాడు. ఆయన లేకుండా నేనేం చేయలేను. అయితే కష్టపడి ఇండస్ట్రీలో ఒక పొజిషన్‌కు వచ్చాక అన్నీ వదిలేసుకుని వెళ్లిపోవడమంటే చాలా కష్టం. నా కుటుంబాన్ని, సినిమాలను బ్యాలెన్స్‌ చేసుకోగలను. కానీ మా ఆయన యూఎస్‌లో ఉండటం వల్ల దూరం పెరిగింది. ఇండియాకు, అక్కడికి తరచూ ప్రయాణించడం కష్టం. అలా సినిమాలకూ దూరమయ్యాను' అని చెప్పుకొచ్చింది లయ.

చదవండి: నయనతార, హన్సిక పెళ్లైపోయింది.. నెక్స్ట్‌ శింబు పెళ్లే.. క్లారిటీ ఏంటంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement