హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్వయంవరం చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు గానూ నంది అవార్డు అందుకుంది. ఆ తర్వాత నటించిన మనోహరం, ప్రేమించు చిత్రాలకుగానూ ఆమెకు నంది అవార్డులు వరించాయి. అలా వరుసగా ఆమె మూడుసార్లు నంది అవార్డులు అందుకున్న ఏకైక నటిగా లయ గుర్తింపు పొందింది. దాదాపు 13 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఆమె కెరీర్ పీక్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని నటనకు దూరమైంది.
చదవండి: ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న నటి, శరీరమంతా కమిలిపోయి..
ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్న ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన లేటెస్ట్ ఫొటోలతో పాటు రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇండియాకు వచ్చిన ఆమె ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్బంగా తనకు సంబంధించిన పలు ఆసక్తిర విషయాలను పంచుకుంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. స్వయంవరం మూవీ విశేషాలను పంచుకున్నారు. ‘ఆ మూవీ టైంలో నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న. మూవీ అయిపోయింది ఎగ్జామ్స్ వచ్చాయి.
స్వయంవరం రిలీజ్ రోజు ఫిజిక్స్ ఎగ్జామ్. ఒకరోజు గ్యాప్ తర్వాత కెమిస్ట్రీ ఎగ్జామ్. నా ఫ్రెండ్ మూవీకి వెళ్దాం అంది. ఎగ్జామ్ పెట్టుకుని ఎలా వెళ్తాం.. చదవాలి కదా అన్నాను. దీంతో ఆమె ఈ సినిమా ఆడక వెళ్లిపోతే ఎలా? అంది. అవును కదా.. అందరు కొత్తవాళ్లే.. ఈ మూవీ ప్లాప్ అయితే సినిమాను తీసేస్తారు కదా అనుకున్నాం. ఎగ్జామ్ పోతే మళ్లీ రాసుకోవచ్చులే అని చదవకుండ మూవీకి వెళ్లిపోయాం’ అంటూ చెప్పుకొచ్చింది.
చదవండి: కొత్త జంట మనోజ్-మౌనికలపై మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్
ఆ తర్వాత చూస్తే ఈ మూవీ హిట్ అయ్యిందని, అసలు ఊహించలేదని చెప్పారు. అనంతరం మాట్లాడుతూ ప్రేమించు సినిమా తనకు ప్లస్ అయ్యిందన్నారు. మొదట అందరు తనని ఈ సినిమా చేయొద్దన్నారని, కానీ ఇందులో అంధురాలిగా తన పాత్రకు మంచి పేరు వచ్చిందన్నారు. ఇక తన కెరియర్లో ఈ సినిమా చేసి ఉండకపోతే బావుందని అనుకునే చిత్రం ఏదైన ఉందా? అంటే అది 'మా బాలాజీ' సినిమానే అన్నారు. ఎలాంటి సినిమాలను .. పాత్రలను ఒప్పుకోవాలనే విషయం తెలియకపోవడం వలన ఆ పొరపాటు జరిగిందన్నారు లయ.
Comments
Please login to add a commentAdd a comment