swayam varam
-
అలాంటి వార్తలతో నాతో పాటు కుటుంబం మొత్తం బాధ పడింది: లయ
టాలీవుడ్లో తెలుగమ్మాయిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లయ. విజయవాడకు చెందిన లయ మొదటి సినిమా 'స్వయంవరం'తోనే పలు అవకాశాలను అందుకుని ఎన్నో అవార్డులు సాదించింది. గ్లామర్ రోల్స్ కన్న నటనకు అవకాశం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చిన లయ, ఎన్నారై శ్రీ గణేశన్ అనే డాక్టర్‌ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. అప్పటి నుంచి కాలిఫోర్నియాలోనే ఉంటూ అడపాదడపా సినిమా ఫంక్షన్లలో దర్శనమిస్తుంది.లయ హీరోయిన్గా పరిచయం అయి 25 ఏళ్లు అవుతుంది. తన మొదటి సినిమా స్వయంవరం చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యలో పాల్గొంది. సోషల్ మీడియాలో తన గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని వాపోయింది. వాస్తవంగా తాను సోషల్‌మీడియాకు కాస్త దూరంగా ఉంటాను. దీంతో అలాంటి వార్తలు వచ్చినప్పుడు కొందరు నిజంగానే నమ్మే అవకాశం ఉందని ఆమె తెలిపింది. తన ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేదని, కుటుంబాన్ని పోషించేందుకు టీ అమ్ముకుని బతుకుతున్నట్లు దారుణమైన వార్తలు రాశారని లయ బాధ పడింది. అవి చూసిన తన కుటుంబ సభ్యులు అందరూ చాలా బాధ పడ్డారని పేర్కొంది.తనకు నచ్చని సినిమా గురించి లయ ఇలా చెప్పారు.. 'నేను నటించిన స్వయంవరం వచ్చి ఇప్పటికి 25 ఏళ్లు అయింది. అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఒక సినిమా హిట్ అయిన తర్వాత సహజంగా ఏ హీరోయిన్ అయినా సరే భారీ సినిమానే ప్లాన్ చేస్తుంది. కానీ, నేను మాత్రం మా బాలాజీ అనే సినిమాలో విడో పాత్ర చేసి తప్పు చేశాననిపించింది. సినిమా బాగుంది. కానీ ఆ సమయంలో నేను చేయకుండా ఉండుంటే మరింత బాగుండేది. అలాంటి సినిమాలో మరో మూడు ఉన్నాయి. ఈరోజుల్లో ఉండే హీరోయిన్లు అయితే అలాంటి తప్పు చేయడం లేదు. చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. నా టైమ్ బాగుండటం వల్ల ఆ తర్వాత కూడా నాకు మంచి అవకాశాలు వచ్చాయి.' అని ఆమె తెలిపింది. చాలా ఏళ్ల తర్వాత లయ మళ్లీ వెండతెరపై కనిపించనున్నారు. నితిన్ నటిస్తున్న తమ్ముడు సినిమాలో ఆమె ఒక కీలకపాత్రలో కనిపించనుంది. అవకాశాలు వస్తే మరిన్ని సినిమాల్లో నటిస్తానని కూడా ఆమె చెప్పింది. View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) -
అత్యంత రమణీయంగా గోమాత కళ్యాణం.. స్వయంవరంతో ఒక్కటాయెనె..
కాకినాడ రూరల్: కల్యాణం... కమనీయమంటారు పెద్దలు. పచ్చని పందిళ్లు.. ముత్యాల తలంబ్రాలు, వేద మంత్రాలు, భాజా భజంత్రీలు, కన్యాదానం, మాంగళ్యధారణ ఇలా... వివాహం ప్రతిఒక్కరి జీవితంలో కలకాలం గుర్తుండిపోతుంది. అయితే అన్నింటి కంటే భిన్నంగా సనాతన ధర్మం ప్రకారం లక్ష్మీదేవి స్వరూపం గోమాత కల్యాణం జరిగితే అది మధురానుభూతే. గోమాత సారణ కల్యాణోత్సవం ఆదివారం ఉదయం కాకినాడ రూరల్ రమణయ్యపేట ఏపీఎస్పీ బెటాలియన్ కల్యాణ మండపంలో అత్యంత వైభవంగా జరిగింది. తిరుమల ఆసుపత్రి వైద్యుడు గౌరీశేఖర్, రమాదేవి దంపతులు తమ పెంపుడు గోవు సారణకు స్వయంవరం ప్రకటించారు. దీంతో ఏలేశ్వరం మండలం లింగంపర్తి వద్ద కొండ తిమ్మాపురంలోని నాడీపతి గోశాల ఆవరణలోని 89 నందీశ్వరులు (గిత్తలు)ను తొలుత ఎంపిక చేశారు. వాటి నుంచి 24కు కుదించారు. మళ్లీ ఇందులో 16ను ఎంపిక చేయగా స్వయంవరంలో 10 గిత్తలు పాల్గొన్నాయి. ఇందులో ప్రపంచంలోనే అత్యంత పొట్టివైన పుంగనూరు గిత్తలు ఉండడం విశేషం. తిరుపతి, కంచి, తిరువణ్ణామలై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు తొలుత డాక్టర్ గౌరీశేఖర్, రమాదేవి దంపతులతో విఘ్నేశ్వర, గౌరీ పూజలు జరిపించారు. అనంతరం స్వయంవరం ప్రకటించగా భైరవ, కృష్ణుడు, రాముడు, లక్ష్మణుడు, యువరాజు నిద్రవర్మ, యువరాజు మహేంద్ర కన్నయ్య, బుద్ధుడు, మంగరాజు, ధర్మరాజు, షణ్ముఖ కన్నయ్య తదితర పేర్లతో పిలిచే నందీశ్వరులను ప్రవేశపెట్టారు. డాక్టర్ గౌరీశేఖర్ వధువు సారణను తీసుకువచ్చి స్వయంవరంలో నందులు వద్ద ఉంచగా వాటిని పరీక్షించి మధ్యలో ఉన్న షణ్ముఖ కన్నయ్యను ఎంపిక చేసుకుంది. షణ్ముఖ కన్నయ్య తరఫున తల్లిదండ్రులుగా పాకలపాటి నారాయణరాజు, సీతాదేవి వివాహ వేడుకను జరిపించారు. వరుడు కాళ్లను డాక్టరు గౌరీశేఖర్ దంపతులు కడిగి వివాహం జరిపించారు. అత్యంత రమణీయంగా జరిగిన వేడుకను భారీగా తరలివచ్చిన ప్రజలు తిలకించారు. గోమాత లక్ష్మీ స్వరూపం గోమాత లక్ష్మీ స్వరూపమని, ఎక్కడ గోపూజలు జరుగుతాయో అక్కడ సుభిక్షంగా ఉంటుందని పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యా«తి్మక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువు అన్నారు. ఈ వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గోమాత కల్యాణోత్సవం తలపెట్టిన డాక్టర్ గౌరీశేఖర్ దంపతులు అభినందనీయులన్నారు. నాడీపతి వైద్యుడు కృష్ణంరాజు మాట్లాడుతూ స్వయంవరం ద్వారా గోమాత కల్యాణోత్సవం అరుదు అన్నారు. డాక్టర్ గౌరీశేఖర్ మాట్లాడుతూ తాను సారణను దత్తత తీసుకుని కూతురుగా భావించి ఇప్పుడు కల్యాణోత్సవం జరిపించామన్నారు. ఏపీఎస్పీ అడిషనల్ కమాండెంట్ సీహెచ్ భద్రయ్య, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
గోమాతకు స్వయంవరం ప్రకటించిన వైద్యుడు
కాకినాడ రూరల్: ఈ చిత్రంలో కనిపిస్తున్న గో మాత పేరు సారణ. కాకినాడ రూరల్ రమణయ్యపేటలో ఏపీఎస్పీ ఎదురుగా తిరుమల ఆస్పత్రి వైద్యుడు గౌరీశేఖర్ గారాల పట్టి. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నా.. వారి కంటే ఎక్కువ ప్రేమను సారణపై చూపుతారు. సరిగ్గా 20 నెలల కిత్రం అనగా 2022జనవరి 22న సారణకు బారసాల, ఊయల వేడుకను శాస్తోక్తంగా నిర్వహించి సారణగా నామకరణం చేశారు. అప్పట్లో మీడియాలో గోమాతకు బారసాల పెద్ద వైరల్ అయ్యింది. ఇప్పుడు 21వ మాసంలోకి అడుగిడిన సారణకు వివాహ వయసు రావడంతో వైద్యులైన గౌరీశేఖర్, రమాదేవీ దంపతులు స్వయంవరం ప్రకటించారు. ఆదివారం ఉదయం 9గంటలకు నుంచి స్వయంవరం ప్రారంభం కానుంది. వివిధ ప్రాంతాలలోని నందీశ్వరులకు ఆహ్వానం పంపారు. ఏపీఎస్పీ ఫంక్షన్ హాలు వద్ద ఖాళీ స్థలంలో సుమారు 12 నందీశ్వరులను వరుసలో ఉంచగా వరమాలతో సారణ తనకు నచ్చిన నందీశ్వరుడిని ఎంపిక చేసుకోనుంది. తరువాత ఫంక్షన్ హాలులో వివాహ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం కంచి, తిరుపతి, తిరువణ్ణామలై నుంచి వేద పండితులు వస్తున్నారని, శాస్తోక్తంగా కల్యాణం జరుపుతారని డాక్టరు గౌరీశేఖర్ తెలిపారు. -
‘స్వయంవరం’ ప్లాప్ అనుకున్నా.. ఎగ్జామ్ బంక్ కొట్టి మూవీకి వెళ్లా!: నటి లయ
హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్వయంవరం చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు గానూ నంది అవార్డు అందుకుంది. ఆ తర్వాత నటించిన మనోహరం, ప్రేమించు చిత్రాలకుగానూ ఆమెకు నంది అవార్డులు వరించాయి. అలా వరుసగా ఆమె మూడుసార్లు నంది అవార్డులు అందుకున్న ఏకైక నటిగా లయ గుర్తింపు పొందింది. దాదాపు 13 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్గా రాణించిన ఆమె కెరీర్ పీక్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని నటనకు దూరమైంది. చదవండి: ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న నటి, శరీరమంతా కమిలిపోయి.. ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్న ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన లేటెస్ట్ ఫొటోలతో పాటు రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇండియాకు వచ్చిన ఆమె ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్బంగా తనకు సంబంధించిన పలు ఆసక్తిర విషయాలను పంచుకుంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. స్వయంవరం మూవీ విశేషాలను పంచుకున్నారు. ‘ఆ మూవీ టైంలో నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న. మూవీ అయిపోయింది ఎగ్జామ్స్ వచ్చాయి. స్వయంవరం రిలీజ్ రోజు ఫిజిక్స్ ఎగ్జామ్. ఒకరోజు గ్యాప్ తర్వాత కెమిస్ట్రీ ఎగ్జామ్. నా ఫ్రెండ్ మూవీకి వెళ్దాం అంది. ఎగ్జామ్ పెట్టుకుని ఎలా వెళ్తాం.. చదవాలి కదా అన్నాను. దీంతో ఆమె ఈ సినిమా ఆడక వెళ్లిపోతే ఎలా? అంది. అవును కదా.. అందరు కొత్తవాళ్లే.. ఈ మూవీ ప్లాప్ అయితే సినిమాను తీసేస్తారు కదా అనుకున్నాం. ఎగ్జామ్ పోతే మళ్లీ రాసుకోవచ్చులే అని చదవకుండ మూవీకి వెళ్లిపోయాం’ అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: కొత్త జంట మనోజ్-మౌనికలపై మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్ ఆ తర్వాత చూస్తే ఈ మూవీ హిట్ అయ్యిందని, అసలు ఊహించలేదని చెప్పారు. అనంతరం మాట్లాడుతూ ప్రేమించు సినిమా తనకు ప్లస్ అయ్యిందన్నారు. మొదట అందరు తనని ఈ సినిమా చేయొద్దన్నారని, కానీ ఇందులో అంధురాలిగా తన పాత్రకు మంచి పేరు వచ్చిందన్నారు. ఇక తన కెరియర్లో ఈ సినిమా చేసి ఉండకపోతే బావుందని అనుకునే చిత్రం ఏదైన ఉందా? అంటే అది 'మా బాలాజీ' సినిమానే అన్నారు. ఎలాంటి సినిమాలను .. పాత్రలను ఒప్పుకోవాలనే విషయం తెలియకపోవడం వలన ఆ పొరపాటు జరిగిందన్నారు లయ. -
కట్నం లేకుండా పెళ్లికి ఓకేనా? అయితే, ఈ వెబ్సైట్ చూడాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే వారి కోసం idontwantdowry.com సంస్థ ఈనెల 19న స్వయంవరం ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు జూమ్‌యాప్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆసక్తి ఉన్న వాళ్లు సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించాలని, మరిన్ని వివరాలకు 9885810100 నంబర్లో సంప్రదించాలని సూచించింది. (చదవండి: గతేడాది నుంచి ప్రేమించుకుంటున్న సునీత, శ్రీనివాస్.. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో..) -
నో డౌరీ.. హ్యాపీ జర్నీ!
‘వివాహం వ్యాపారం కాదు.. కట్నం దురాచారం’... శతాబ్దాలుగా మనం వింటున్న మాటలివి. కానీ కట్నం రాకాసి నానాటికీ పెరిగిపోతుందే తప్ప తగ్గడం లేదు. చట్టాలు తీసుకొచ్చినా పరిస్థితిలో మార్పు లేదు. సమాజంలో నాటుకుపోయిన ఈ విషబీజాన్ని పెకిలించేందుకు ఆలోచన తీరులో మార్పు అవసరం. దీనికి తోడ్పాటుగా దేశంలోనే తొలిసారిగా ప్రారంభమైంది ‘ఐ డోంట్ వాంట్ డౌరీ డాట్‌కామ్’ వెబ్సైట్. సామాజిక మార్పు కోసం సాంకేతిక అస్త్రంగా దీనిని రూపొందించారు నగరానికి చెందిన సత్యనరేశ్. సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): ‘కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలనుకునే వారికోసం 2006లో ఈ వెబ్సైట్ ప్రారంభమైంది. ఒక్కో కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా మ్యాట్రిమోనీలు ఉన్నాయి. కానీ కట్నం వద్దనుకునే వారికోసం మ్యారేజ్ సర్వీస్ లేకపోవడం గమనించి దీనిని ప్రారంభించాన’ని చెప్పారు సత్యనరేశ్. ‘మా దగ్గరికి వచ్చే వారు కట్నం అవసరం లేదని చెప్పినా... కులం విషయంలో మాత్రం చాలా పర్టిక్యులర్‌గా ఉంటున్నారు. కులాంతర వివాహాలపై వ్యతిరేకత నేపథ్యంలో ఇంటర్‌కాస్ట్ వెబ్‌పోర్టల్‌ని ప్రారంభించాలనే నిర్ణయాన్ని విరమించుకున్నాను. మా వెబ్సైట్లో ఇప్పటి వరకు 10వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 43 మందికి వివాహాలు జరిగాయి. ఇందుకు ప్రతి ఏటా స్వయంవరం నిర్వహిస్తున్నామ’ని పేర్కొన్నారు. మేమే ఉదాహరణ.. 2014 జూన్‌లో మా వివాహం జరిగింది. కట్నం తీసుకోవడమంటే నా దృష్టిలో అమ్ముడుపోవడమే. అలా నేను కాకూడదనే ఈ వెబ్సైట్లో రిజిస్ట్రర్ చేసుకొని స్వప్నను పెళ్లి చేసుకున్నాను. కట్నం ఇస్తేనే పెళ్లిళ్లు సజావుగా జరగుతాయని, కాపురం చక్కగా ఉంటుందనుకోవడం మూర్ఖత్వం. మేం మూడేళ్లుగా ఆనందంగా ఉన్నాం. కట్నం లేకున్నా దాంపత్య జీవితం ప్రశాంతంగా ఉంటుందనడానికి మేమే ఉదాహరణ. – సంతోష్ ఎందుకివ్వాలి? నేను చదువుకున్నాను. ఉద్యోగం చేస్తున్నాను. అమ్మాయిలు, అబ్బాయిలు సమానమే అయినప్పుడు కట్నం ఎందుకివ్వాలి? ఈ ఆలోచనతోనే వెబ్సైట్లో రిజిస్ట్రర్ చేసుకొని సంతోష్‌ని పెళ్లాడాను. ఎలాంటి కలతలు లేకుండా హ్యాపీగా సాగుతోంది మా జీవితం. – స్వప్న ఉద్యమం రావాలి.. ఈ దురాచారాన్ని రూపుమాపాలంలే ఉద్యమం రావాలి. అలాంటి ఉద్యమానికి ఈ వెబ్సైట్ ఒక ఉదాహరణ. సోషల్ మీడియా సహాయంతో సామాజిక మార్పు తీసుకొస్తామనే ఆలోచనతో ఈ సంస్థ ముందుకురావడం అభినందనీయం. సామాజిక మార్పులకు చాలా సమయం పడుతుంది. అయినా ప్రయత్నం మానకూడదు. అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. – రవిచంద్ర, సీనియర్ కౌన్సిల్ (హైకోర్ట్), ఐ డోంట్ వాంట్ డౌరీ (మెంటర్) 15న స్వయంవరం కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలనుకునే వారికోసం ఈనెల 15న బీఎం బిర్లా సెంటర్లో స్వయంవరం నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ వెబ్సైట్లో రిజిస్ట్రర్ చేసుకొని పాల్గొనొచ్చు. సమయం : ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వేదిక : భాస్కరా ఆడిటోరియం, బిర్లా సైన్స్ సెంటర్ ఫోన్ : 9885810100 వెబ్సైట్: www.idontwantdowry.com -
ప్రమాదం జరగలేదు, నేను క్షేమంగా ఉన్నా
-
ప్రమాదం జరగలేదు, నేను క్షేమంగా ఉన్నా
టాలీవుడ్లో తెలుగమ్మాయిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లయ, అమెరికాలో ప్రమాదానికి గురైనట్టుగా వార్తలు గత 24 గంటలుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. లాస్ ఎంజిల్స్ నుంచి కాలిఫోర్నియా వెళ్లేదారిలో దారిలో ఈ ప్రమాదం జరిగినట్టుగా,ఈ ప్రమాదం నుంచి లయ చిన్నపాటి గాయాలతో భయటపడినట్టు, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను లయ ఖండించింది. తను బాగానే ఉన్నట్టుగా ఓ వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసిన లయ. తన క్షేమాన్ని కోరుకున్న వారందరికి కృతజ్ఞతలు తెలియజేసింది. స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన లయ నటిగా ఎన్నో అవార్డులు సాదించింది. గ్లామర్ రోల్స్ కన్న నటనకు అవకాశం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చిన లయ, ఎన్నారై డాక్టర్‌ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. అప్పటి నుంచి కాలిఫోర్నియాలోనే ఉంటూ అడపాదడపా సినిమా ఫంక్షన్లలో దర్శనమిస్తుంది.