
ప్రమాదం జరగలేదు, నేను క్షేమంగా ఉన్నా
టాలీవుడ్లో తెలుగమ్మాయిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లయ, అమెరికాలో ప్రమాదానికి గురైనట్టుగా వార్తలు గత 24 గంటలుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. లాస్ ఎంజిల్స్ నుంచి కాలిఫోర్నియా వెళ్లేదారిలో దారిలో ఈ ప్రమాదం జరిగినట్టుగా,ఈ ప్రమాదం నుంచి లయ చిన్నపాటి గాయాలతో భయటపడినట్టు, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను లయ ఖండించింది. తను బాగానే ఉన్నట్టుగా ఓ వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసిన లయ. తన క్షేమాన్ని కోరుకున్న వారందరికి కృతజ్ఞతలు తెలియజేసింది.
స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన లయ నటిగా ఎన్నో అవార్డులు సాదించింది. గ్లామర్ రోల్స్ కన్న నటనకు అవకాశం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చిన లయ, ఎన్నారై డాక్టర్ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. అప్పటి నుంచి కాలిఫోర్నియాలోనే ఉంటూ అడపాదడపా సినిమా ఫంక్షన్లలో దర్శనమిస్తుంది.