Heroine laya
-
హీరోయిన్ లయ డ్యాన్స్ చూశారా? చీరకట్టులో ట్రెండీగా..
Heroine Laya Kacha Badam Dance Video Goes Viral: తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ లయ ప్రస్తుతం అమెరికాలో సెటిలయ్యింది. స్వయంవరం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రేమించు, మిస్సమ్మ, హనుమాన్ జంక్షన్, స్వరాభిషేకం వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. చివరగా అమర్ అక్బర్ ఆంటోనీ సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన లయ మళ్లీ సినిమాలు చేయలేదు. చదవండి: నాగచైతన్యతో ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది : శ్రుతిహాసన్ కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇటీవలె డ్యాన్స్ వీడియోలతో సందడి చేసింది. తాజాగా సోషల్ మీడియా ట్రెండింగ్ సాంగ్ కచ్చా బాదం సాంగ్‌కి తన ఫ్రెండ్‌తో కలిసి స్టెప్పులేసింది. చీరకట్టులో ట్రెండీ స్టెప్పులేస్తూ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం లయ చేసిన ఈ డ్యాన్స్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. చదవండి: కాజల్ సరికొత్త రికార్డు.. థ్యాంక్యూ చెప్పిన చందమామ View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) -
Viral Video: కూతురితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన హీరోయిన్ లయ
-
కూతురితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన హీరోయిన్ లయ
Actress Laya Dance With Her Daughter Video Viral: తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ లయ ప్రస్తుతం కాలిఫోర్నియాలో సెటిలయ్యింది. తాజాగా కూతురు శ్లోకాతో కలిసి డ్యాన్స్ స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్న శ్లోకా.. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో ఇలియానా చిన్నప్పటి క్యారెక్టర్లో నటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కాగా స్వయంవరం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె టాలీవుడ్లో టాప్ హీరోలందరిలోనూ కలిసి నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపు 60 సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్గా బిజీగా ఉన్న సమయంలోనే ఎన్నారై డాక్టర్‌ను పెళ్లి చేసుకొని కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్లోలో స్థిరపడింది. -
ప్రమాదం జరగలేదు, నేను క్షేమంగా ఉన్నా
టాలీవుడ్లో తెలుగమ్మాయిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లయ, అమెరికాలో ప్రమాదానికి గురైనట్టుగా వార్తలు గత 24 గంటలుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. లాస్ ఎంజిల్స్ నుంచి కాలిఫోర్నియా వెళ్లేదారిలో దారిలో ఈ ప్రమాదం జరిగినట్టుగా,ఈ ప్రమాదం నుంచి లయ చిన్నపాటి గాయాలతో భయటపడినట్టు, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను లయ ఖండించింది. తను బాగానే ఉన్నట్టుగా ఓ వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసిన లయ. తన క్షేమాన్ని కోరుకున్న వారందరికి కృతజ్ఞతలు తెలియజేసింది. స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన లయ నటిగా ఎన్నో అవార్డులు సాదించింది. గ్లామర్ రోల్స్ కన్న నటనకు అవకాశం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చిన లయ, ఎన్నారై డాక్టర్‌ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. అప్పటి నుంచి కాలిఫోర్నియాలోనే ఉంటూ అడపాదడపా సినిమా ఫంక్షన్లలో దర్శనమిస్తుంది.