Actress Laya Dancing With Her Daughter Video Goes Viral - Sakshi
Sakshi News home page

Laya Dance Video: కూతురితో కలిసి డ్యాన్స్‌ అదరగొట్టిన హీరోయిన్‌ లయ

Published Sat, Dec 25 2021 1:38 PM | Last Updated on Sat, Dec 25 2021 4:11 PM

Actress Laya Dance Video With Her Daughter Shloka Video Viral - Sakshi

Actress Laya Dance With Her Daughter Video Viral: తెలుగు ఇండస్ట్రీలో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్‌ లయ ప్రస్తుతం కాలిఫోర్నియాలో సెటిలయ్యింది. తాజాగా కూతురు శ్లోకాతో కలిసి డ్యాన్స్‌ స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  ప్రస్తుతం క్లాసికల్‌ డ్యాన్స్‌ నేర్చుకుంటున్న శ్లోకా.. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో ఇలియానా చిన్నప్పటి క్యారెక్టర్‌లో నటించిన సంగతి తెలిసిందే.

త్వరలోనే హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కాగా స్వయంవరం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె టాలీవుడ్‌లో టాప్‌ హీరోలందరిలోనూ కలిసి నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపు 60 సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే ఎన్నారై డాక్టర్‌ను పెళ్లి చేసుకొని  కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లోలో స్థిరపడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement