Heroine Laya Kacha Badam Dance Video Goes Viral: తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ లయ ప్రస్తుతం అమెరికాలో సెటిలయ్యింది. స్వయంవరం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రేమించు, మిస్సమ్మ, హనుమాన్ జంక్షన్, స్వరాభిషేకం వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. చివరగా అమర్ అక్బర్ ఆంటోనీ సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన లయ మళ్లీ సినిమాలు చేయలేదు. చదవండి: నాగచైతన్యతో ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది : శ్రుతిహాసన్
కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇటీవలె డ్యాన్స్ వీడియోలతో సందడి చేసింది. తాజాగా సోషల్ మీడియా ట్రెండింగ్ సాంగ్ కచ్చా బాదం సాంగ్‌కి తన ఫ్రెండ్‌తో కలిసి స్టెప్పులేసింది. చీరకట్టులో ట్రెండీ స్టెప్పులేస్తూ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం లయ చేసిన ఈ డ్యాన్స్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. చదవండి: కాజల్ సరికొత్త రికార్డు.. థ్యాంక్యూ చెప్పిన చందమామ
Comments
Please login to add a commentAdd a comment