Actress Laya Shares Happy Moments From Raksha Bandhan Celebration With Their Children - Sakshi
Sakshi News home page

Actress Laya: హీరోయిన్‌ లయ కూతుర్ని చూశారా? అచ్చుగుద్దినట్లుంది..

Published Sat, Aug 13 2022 12:15 PM | Last Updated on Sat, Aug 13 2022 12:53 PM

Actress Laya Shares Her Children Rakha Bandhan Moments - Sakshi

తెలుగు ఇండస్ట్రీలో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్‌ లయ ప్రస్తుతం అమెరికాలో సెటిలయ్యింది. స్వయంవరం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రేమించు, మిస్స‌మ్మ‌, హ‌నుమాన్ జంక్ష‌న్‌, స్వ‌రాభిషేకం వంటి ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. చివ‌ర‌గా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరిసిన లయ మళ్లీ సినిమాలు చేయలేదు.

కానీ సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. డ్యాన్స్‌ సహా పలు సరదా వీడియోలను షేర్‌ చేస్తుంటుంది. తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా ఓ బ్యూటిఫుల్‌ వీడియోను లయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇందులో లయ కూతురు తన తమ్ముడికి రాఖీ కడుతుంది. అయితే కూతురు శ్లోకా అచ్చుగుద్దినట్లు లయలానే ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. (క్లిక్: ఆళ్ల సినిమాలు చూడొద్దంతే.. ఇప్పుడిదే నడుస్తోంది!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement