rakhi pournami
-
Raksha Bandhan 2023: సోదరుడికి ప్రేమతో...
అన్న గుండె ఆగిపోయిన క్షణాన చెల్లెలి గుండె ఆగిపోతుంది... అందుకే వెండితెరపై అన్నాచెల్లెలి అనుబంధం అనగానే వీరి ‘రక్త సంబంధం’ గుర్తుకు వస్తుంది. ఇంకా తెలుగు తెరపై అన్నా చెల్లెళ్ల అనుబంధంతో చాలా సినిమాలు వచ్చాయి.. ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలు చాలానే ఉన్నాయి. ఈ రాఖీ పండగ సందర్భంగా ఓ పది సినిమాల గురించి చెప్పుకుందాం.. రక్త సంబంధం (1962) ఎన్టీఆర్–సావిత్రి.. తెలుగు చిత్ర పరిశ్రమలో జంటగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ‘హిట్ పెయిర్’. అలాంటి హిట్ జోడీని అన్నా–చెల్లెలిగా చూపించే సాహసం చేసి, ‘రక్త సంబంధం’ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వి. మధుసూదనరావు. ఈ అన్నాచెల్లెలి అనుబంధానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎన్టీఆర్, కాంతారావు, సావిత్రి, దేవిక, సూర్యకాంతం ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘రక్త సంబంధం’. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘పాస మలర్’ సినిమాకి రీమేక్‌గా ‘రక్త సంబంధం’ రూ΄పొందింది. హీరో–హీరోయిన్లుగా అలరించిన ఎన్టీఆర్–సావిత్రిలు ‘రక్త సంబంధం’లో అన్నా, చెల్లెలు పాత్రల్లో జీవించారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో రాజు (ఎన్టీఆర్), రాధ (సావిత్రి) ఒకేసారి ్రపాణాలు వదలడం ప్రేక్షకుల చేత కన్నీళ్లు తెప్పిస్తుంది. మరణం కూడా విడదీయలేనంత అనుబంధం రాజు–రాధలది. అందుకే అన్నాచెల్లెళ్ల అనుబంధం అనగానే.. ముందుగా గుర్తుకు వచ్చేది ‘రక్త సంబంధం’ చిత్రమే. బంగారు గాజులు (1968) రాము (నాగేశ్వరరావు), రాధ (విజయనిర్మల) అన్నాచెల్లెళ్లు. చెల్లెలి చేతికి బంగారు గాజులు తొడగాలని రాము ఆశ పడతాడు. ఇందుకోసం డబ్బు కూడబెడుతుంటాడు. ఓ రైస్ మిల్లులో రాము డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. అయితే ఆ రైస్ మిల్లు యజమాని రావూజీ కన్ను రాధపై పడుతుంది. రాధను బలవంతం చేయబోతాడు రావూజీ. ఆ సమయంలో రాధ తప్పించుకుంటుంది. ఇదే సమయంలో రాము హంతకుడనే నిందను మోపి అతన్ని జైలుపాలు చేస్తాడు రావూజీ. చెల్లెలిని వెతుక్కునే క్రమంలో రాము హైదరాబాద్‌కి వచ్చి రాధను చూస్తాడు. కానీ రాధ గుర్తు పట్టదు. దీంతో రాము ఆశ్చర్యానికి గురవుతాడు. కానీ హైదరాబాద్‌లో కనిపించిన రాధను తన చెల్లెలిగానే భావిస్తాడు, ఏదో తెలియని ఆత్మీయతతో రామును కూడా రాధ అన్నయ్యలానే భావిస్తుంటుంది. అయితే ఇద్దరు రాధలు ఉన్నారని, ఈ ఇద్దరు కవలలని, అందుకే రాముని హైదరాబాద్‌లో ఉన్న రాధ గుర్తుపట్టలేక పోయిందన్నది ట్విస్ట్. ఈ ఇద్దరు చెల్లెళ్లకు బంగారు గాజులు తొడుగుతాడు రాము. నాగేశ్వరరావు, విజయనిర్మల ముఖ్య తారాగణంగా భారతి, పద్మనాభం, గీతాంజలి కీలక పాత్రల్లో నటించిన ‘బంగారు గాజులు’ సినిమాకు సీఎస్‌రావు దర్శకత్వం వహించారు. చెల్లెలి కాపురం (1971) రాము (శోభన్‌బాబు)కు చెల్లెలు (మణిమాల) అంటే చాలా ఇష్టం. చెల్లికి పెళ్లి చేయాలని డబ్బు సంపాదించడం కోసం పట్నంలో అడుగుపెట్టిన రాముకు అతని స్నేహితుడు శ్రీరామ్ (నాగభూషణం) తారసపడతాడు. స్వతహాగా రచయిత అయిన రాము తన రచనలతో డబ్బులు సంపాదించాలనుకుంటాడు. కానీ రాము ఆహార్యం చూసి, అతని రచనలను అచ్చు వేసేందుకు ప్రచురణ కర్తలెవరూ ముందుకు రారు. రాము విజ్ఞప్తి మేరకు అతని స్నేహితుడైన శ్రీరామ్.. రాము రచనలను తన రచనలుగా పబ్లిష్ చేయించుకుని, కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తాడు. ఈ క్రమంలోనే రాము చెల్లిని శ్రీరామ్ వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత రాము చెల్లిని ఎలాంటి కష్టాలు పెట్టాడు? ఆ కష్టాల నుంచి ఆమెను రాము, అతన్ని ప్రేమించే రాధ (వాణీ శ్రీ) ఎలా కాపాడారు? శ్రీరామ్ తన తప్పు తాను తెలుసుకునేలా రాధ ఏం చేసింది? అన్నదే కథ. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూ΄పొందింది. పల్నాటి పౌరుషం (1994) రెండు కుటుంబాల మధ్య జరిగే కథతో రూ΄పొందిన చిత్రం ‘పల్నాటి పౌరుషం’. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు (భీమినేని బ్రహ్మన్న), రాధిక (సీత) అన్నా చెల్లెలి పాత్రల్లో నటించారు. తనకెంతో ఇష్టమైన చెల్లిని (సీత) వేరే ఊర్లోని రాజారావ్ (చరణ్‌రాజ్)కి ఇచ్చి వివాహం జరిపిస్తాడు బ్రహ్మన్న. అయితే రాజారావ్ బామ్మర్ది సూరిబాబు (సురేశ్)కి బ్రహ్మన్న అంటే ఇష్టం ఉండదు. దీంతో కుట్రలతో ఇరు కుటుంబాల్లో కలహాలు తీసుకొస్తాడు సూరిబాబు. ఆ కలహాలకి తన భర్తే కారకుడని తెలుసుకున్న సూరిబాబు భార్య ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె మృతికి బావ బ్రహ్మన్నే కారణమని భావించి, అన్నని కలవొద్దని తన భార్య సీతకు ఆంక్ష విధిస్తాడు రాజారావ్. ఆ తర్వాత బ్రహ్మన్న, సీతలకు నిజం ఎలా తెలుస్తుంది? ఈ కుటుంబాలను కలపడంలో తర్వాతి తరం పాత్ర ఎంత... అన్నదే ‘పల్నాటి పౌరుషం’ కథాంశం. తమిళ హిట్ మూవీ ‘కిళక్కు సీమయిలే’కు రీమేక్ ఇది. హిట్లర్ (1997) మాధవరావు అలియాస్ హిట్లర్ (చిరంజీవి)కు ఐదుగురు శారద (అశ్వని), అనుపమ (మోహిని), లక్ష్మి (పద్మశ్రీ), గాయత్రి (గాయత్రి), సరస్వతి (మీనాకుమారి) చెల్లెళ్లు. మాధవరావు చిన్నతనంలోనే తల్లి మరణించడం, తండ్రి జైలుపాలు కావడంతో ఐదుగురి చెల్లెళ్ల బాధ్యత అతనిపైనే పడుతుంది. చాలా కష్టపడి, వారిని పెంచి, పెద్ద చేస్తాడు మాధవరావు. తన రెండో చెల్లి మోహిని ప్రేమను మాధవరావు సరిగా అర్థం చేసుకోకపోవడం, మొదటి చెల్లి శారద కాపురంలోని ఇబ్బందులు, సవతి తల్లి ఇద్దరు కూతుళ్లను చేరదీయడం వంటి కారణాలతో మాధవరావుకు, అతని చెల్లెళ్లకు మధ్య మనస్పర్థలు వస్తాయి. మరి.. మాధవరావుకు, అతని చెల్లెళ్లకు మధ్య ఉన్న అభి్రపాయభేదాలను బాలు (మోహిని భర్త, మాధవరావు మామయ్య కొడుకు రాజేంద్రప్రసాద్) ఎలా పరిష్కరిస్తాడు? మాధవరావు, అతని చెల్లెళ్లు తిరిగి ఎలా కలుస్తారు? ఇందులో బుజ్జి (రంభ) పాత్ర ఏమిటన్నదే ‘హిట్లర్’ కథాంశం. సిద్దిఖీ దర్శకత్వంలో రూ΄పొందిన మలయాళ హిట్ ఫిల్మ్ ‘హిట్లర్’కు తెలుగు రీమేక్ ‘హిట్లర్’లో చిరంజీవి హీరోగా నటించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. శివరామరాజు (2002) పూసపాటి శివరామరాజు (జగపతిబాబు), రామరాజు (వెంకట్), రుద్రరాజు (శివాజీ) అన్నదమ్ములు. ఈ ముగ్గురి అన్నదమ్ములకు ఏకైక చెల్లెలు స్వాతి (మోనికా). అయితే శివరామరాజు కుటుంబంపై పగ తీర్చుకోవడం కోసం శత్రువర్గం నాటకం ఆడి స్వాతిని తమ ఇంటి కోడలుగా చేసుకుంటుంది. ఈ పెళ్లి తర్వాత శివరామరాజు, రామరాజు, రుద్రరాజు తమ ఆస్తిని కోల్పోయి పేదవాళ్లు అయిపోతారు. తనవల్ల పేదరికంలో జీవిస్తున్న అన్నలను చూసి స్వాతి కుమిలిపోతుంటుంది. స్వాతిని అత్తింటి వేధింపుల నుంచి శివరామరాజు ఎలా కాపాడాడన్నదే చిత్రకథ. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో వి. సముద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అర్జున్ (2004) అర్జున్ (మహేశ్‌బాబు), మీనాక్షి (కీర్తి రెడ్డి) కవలలు. మీనాక్షి, ఉదయ్ (రాజా) ప్రేమించుకుంటారు. తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మీనాక్షికి ఉదయ్ ఓ లేఖ రాస్తాడు. ఈ లేఖను అర్జున్‌కు చూపిస్తుంది మీనాక్షి. దీంతో ఉదయ్ తల్లిదండ్రులు బాలానాయర్ (ప్రకాష్‌రాజ్), ఆండాళ్ (సరిత) అతనికి చేయాలనుకున్న అమ్మాయితో కాకుండా, మీనాక్షి తో వివాహం జరిగేలా చేస్తాడు అర్జున్. అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలో బాలానాయర్, ఆండాళ్లు కలిసి మీనాక్షిని చంపి, ఉదయ్‌కు మరో అమ్మాయితో వివాహం చేయాలనుకుంటున్నారనే ఆలోచనలో ఉన్నట్లుగా అర్జున్‌కు తెలుస్తుంది. అప్పుడు మీనాక్షిని రక్షించేందుకు సోదరుడిగా అర్జున్ ఏం చేశాడు? మధుర మీనాక్షి అమ్మవారి సాక్షిగా మీనాక్షిని ఎలా కాపాడుకున్నాడు– అన్నదే అర్జున్ కథ. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూ΄పొందింది. ‘పుట్టింటికి రా చెల్లి’ (2004) చిన్నతనంలోనే శివన్న (అర్జున్) తల్లి కన్నుమూస్తుంది. దీంతో చెల్లెలు లక్ష్మి (మధుమిత) ఆలనాపాలన శివన్నపై పడుతుంది. సేద్యం చేస్తూ చెల్లెల్ని చదివిస్తాడు శివన్న. తన చెల్లెలు ప్రేమించిన అజయ్ (శ్రీనాథ్)తోనే ఆమె వివాహం జరిపిస్తాడు. ఈ పెళ్లి ఇష్టం లేని అజయ్ కుటుంబ సభ్యులు లక్ష్మిని నిత్యం వేధిస్తుంటారు. అంతేకాదు.. ఎలాగైనా లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేసేందుకు ఓ పెద్ద నింద వేస్తారు. అది నమ్మిన అజయ్ గర్భవతిగా ఉన్న లక్ష్మిని పట్టించుకోడు. పుట్టింటికి రమ్మని శివన్న వచ్చి లక్ష్మిని వేడుకుంటాడు. నిందతో రాను.. నిప్పులా వస్తానని అన్నకు చెబుతుంది లక్ష్మి. ఆ తర్వాత లక్ష్మిపై పడ్డ నిందని శివన్న ఎలా చెరిగిపోయేలా చేశాడు– అనే కథాంశంతో ‘పుట్టింటికి రా చెల్లి’ సినిమా రూ΄పొందింది. అర్జున్, మీనా జంటగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రమిది. రాఖీ (2006) అల్లారుముద్దుగా పెరిగిన తన చెల్లి చావుకి కారణమైన ఆమె అత్తింటి వారిపై ఓ అన్నగా, తోడ పుట్టకపోయినా.. సమాజంలోని కొందరు యువతులపై దౌర్జన్యం చేసినవారిపై రాఖీ బ్రదర్‌గా రామకృష్ణ ఎలా పగ తీర్చుకున్నాడు? అనే కథాంశంతో ‘రాఖీ’ సినిమా రూ΄పొందింది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరోగా నటించారు. రామకృష్ణ అలియాస్ రాఖీ (ఎన్టీఆర్)కి చెల్లెలు గాయత్రి (మంజూష) అంటే అమితమైన ప్రేమ. ఐదు లక్షల కట్నం ఇచ్చి రవివర్మతో గాయత్రి వివాహం జరిపిస్తారు రాఖీ, కుటుంబ సభ్యులు. అయితే తన కొడుక్కి కోటి రూపాయల కట్నం వస్తుందని తెలుసుకొని మూడు నెలల గర్భవతి అయిన గాయత్రిని కిరోసిన్ పోసి చంపేస్తారు అత్తింటివారు. కానీ, వారు నిర్దోషులంటూ కోర్టులో కేసు కొట్టేస్తారు. దీంతో తన చెల్లిని చంపిన అత్తింటి వారందర్నీ కారుతో సహా పెట్రోల్ పోసి తగులబెడతాడు రాఖీ. తన చెల్లెలి కేసుకు వ్యతిరేకంగా వాదించిన లాయర్ని, దొంగ సాక్ష్యం ఇచ్చిన డాక్టర్ని, పోలీసు అధికారులని కూడా పెట్రోల్ పోసి తగులబెడతాడు. ఆ తర్వాత ఏ మహిళకు అన్యాయం జరిగినా అందుకు కారకులైన వారిని పెట్రోల్ పోసి తగులబెడుతుంటాడు. వరుస హత్యలు చేస్తున్న రాఖీని పోలీసులు పట్టుకున్నాక కోర్టు అతనికి శిక్ష విధించిందా? అన్నది ఈ చిత్ర కథాంశం. గోరింటాకు (2008) అశోక్ (రాజశేఖర్)కి చెల్లెలు లక్ష్మి (మీరా జాస్మిన్) అంటే పంచ్రపాణాలు. చిన్నతనంలోనే తల్లితండ్రులు చనిపోవడంతో అన్నీ తానై చెల్లెల్ని పెంచి పెద్ద చేస్తాడు అశోక్. చెల్లికి పెళ్లి అయ్యేవరకు తాను కూడా చేసుకోకూడదనుకుంటాడు. చెల్లెలు ప్రేమించిన అబ్బాయి ఆకాశ్‌కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే ఆకాశ్‌ని ఆస్తి కోసం అయినవాళ్లే మోసం చేసి, జైలుకి పంపిస్తారు. ఈ విషయాన్ని అన్నయ్యకి చెప్పి, సాయం అడుగుదామని ఇంటికి వచ్చిన లక్ష్మిని.. అశోక్ భార్య నందిని (ఆర్తి అగర్వాల్) అవమానించి పంపించేస్తుంది. భర్త జైలులో ఉండటం..అన్నయ్యను కలిసే అవకాశం లేకపోవడం.. పిల్లలు ఆకలితో అలమటిస్తుండడంతో.. ఏం చేయాలో పాలుపోని లక్ష్మి.. పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. విషయం తెలిసి లక్ష్మి భౌతిక కాయం వద్ద అశోక్ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ.. అక్కడే ్రపాణాలు విడవడం ప్రేక్షకులతో కన్నీరు పెట్టిస్తుంది. కన్నడ హిట్ ‘అన్న తంగి’కి రీమేక్‌గా వీఆర్ ప్రతాప్ దర్శకత్వంలో ఈ చిత్రం రూ΄పొందింది. కాగా, 2008 నుంచి ఇప్పటివరకు అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో పలు చిత్రాలు వచ్చాయి. ఇటీవల ‘భోళా శంకర్’లో చిరంజీవి, కీర్తీ సురేశ్, రెండేళ్ల క్రితం వచ్చిన ‘పెద్దన్న’లో రజనీకాంత్, కీర్తీ సురేశ్ అన్నాచెల్లెళ్లుగా నటించిన విషయం తెలిసిందే. రాఖీ స్పెషల్ -
TSRTC: రాఖీ స్పెషల్.. మహిళా ప్రయాణికులకు బంపరాఫర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో యువతులు, మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) గుడ్‌న్యూస్ చెప్పింది. రాఖీ పౌర్ణమికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు బంపరాఫర్ ప్రకటించింది. ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని పేర్కొంది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన మహిళలకు ఆకర్షణీయమైన రూ.5.50 లక్షల విలువగల బహుమతులు అందించి.. వారి పట్ల సంస్థకున్న గౌరవభావాన్ని ప్రకటించనుంది. ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురికి చొప్పున మొత్తం 33 మందికి బహుమతులను ఇవ్వనుంది. ప్రతీ రిజయన్‌లో లక్కీ డ్రా.. వివరాల ప్రకారం.. ఈ నెల 30, 31 తేదిల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్‌ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లలో వేయాలి. ఆ డ్రాప్ బాక్స్‌లను ఒక చోటికి చేర్చి.. ప్రతీ రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురి చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వట్టర్ వేదికగా..‘మహిళలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైంది. అత్యంత పవిత్రంగా ఈ పండుగను వారు జరుపుకుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి మరీ తమ సోదరులకు వారు రాఖీలు కడుతుంటారు. సోదరసోదరీమణుల ఆత్మీయత, అనురాగాలతో కూడిన ఈ పండుగ నాడు.. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది. ఈ నెల 30, 31 తేదిల్లో సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్ రాసి డ్రాప్ బాక్స్ లలో వాటిని వేయాలి. ప్రతి బస్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేసింది. మహిళా ప్రయాణికులందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొని విలువైన బహుమతులను గెలుచుకోవాలని సంస్థ కోరుతోంది. సెప్టెంబర్ 9లోగా లక్కీ డ్రాలు నిర్వహించి.. విజేతలకు బహుమతులను అందజేయడం జరుగుతుంది’ అని తెలిపారు. రాఖీ పౌర్ణమికి తమ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు #TSRTC శుభవార్త చెప్పింది. ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన మహిళలకు ఆకర్షణీయమైన రూ.5.50 లక్షల విలువగల బహుమతులు అందించి.. వారి పట్ల సంస్థకున్న గౌరవభావాన్ని… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 29, 2023 ఈ రాఖీ పౌర్ణమి లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని వారు సూచించారు. ఇది కూడా చదవండి: అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు: ఎమ్మెల్యే సీతక్క -
హీరోయిన్ లయ కూతుర్ని చూశారా? అచ్చుగుద్దినట్లుంది..
తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ లయ ప్రస్తుతం అమెరికాలో సెటిలయ్యింది. స్వయంవరం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రేమించు, మిస్సమ్మ, హనుమాన్ జంక్షన్, స్వరాభిషేకం వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. చివరగా అమర్ అక్బర్ ఆంటోనీ సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన లయ మళ్లీ సినిమాలు చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. డ్యాన్స్ సహా పలు సరదా వీడియోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా ఓ బ్యూటిఫుల్ వీడియోను లయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇందులో లయ కూతురు తన తమ్ముడికి రాఖీ కడుతుంది. అయితే కూతురు శ్లోకా అచ్చుగుద్దినట్లు లయలానే ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. (క్లిక్: ఆళ్ల సినిమాలు చూడొద్దంతే.. ఇప్పుడిదే నడుస్తోంది!) View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) -
విషాదం: అన్నయ్యల ఆశీర్వాదం తీసుకోకుండానే..
చోడవరం/సబ్బవరం(విశాఖపట్నం): సోదరులకు రాఖీ కట్టడానికి కన్నవారింటికి బయల్దేరిందామె.. మరికాసేపట్లో అన్నలిద్దరి ఆశీర్వాదం తీసుకోవాల్సివుండగా.. మృత్యువు ఇసుక లారీ రూపంలో ఎదురొచ్చింది. కొడుకుతో సహా ఆమెను కబళించింది. ఈ విషాదకర ఘటన చోడవరం మండలం దుడ్డుపాలెం జంక్షన్ సమీపంలో గురువారం ఉదయం జరిగింది. సబ్బవరం మండలం పెద యాతపాలెం గ్రామానికి చెందిన శరగడం సత్యవతి (34), తన కుమారుడు సుఖేష్‌రామ్ (18)తో కలిసి ఉదయం 8 గంటలకు తన కన్నవారి ఊరైన మునగపాక బయల్దేరారు. చదవండి: అన్నమయ్య జిల్లాలో దారుణం.. కోడలి తల నరికిన అత్త.. కారణం అదే? సుఖేష్ ద్విచక్ర వాహనం నడుపుతుండగా తల్లి సత్యవతి వెనుక కూర్చున్నారు. సబ్బవరం– వెంకన్నపాలెం రోడ్డులో దుడ్డుపాలెం జంక్షన్ సమీపంలోకి రాగానే ఎదురుగా వెంకన్నపాలెం వైపు నుంచి వస్తున్న ఇసుక లారీ ఆకస్మికంగా మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది. అతివేగంగా వస్తున్న ఇసుక లారీ బలంగా ఢీకొట్టడంతో మోటారు సైకిల్‌తోపాటు లారీ కూడా రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకుపోయాయి. మోటార్ సైకిల్‌పై వస్తున్న తల్లీకొడుకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఆనందం.. అంతలోనే విషాదం శరగడం సత్యవతి స్వగ్రామం మునగపాక. అక్కడ ఆమె సోదరులు ఉంటారు. వారికి రాఖీ కట్టి.. ఆ ఊళ్లో ఉన్న తన పొలంలో వరినాట్లు వేయాలని భావించిందామె. కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఆమెకు భర్త రాంబాబు, కుమార్తె కుందన ఉన్నారు. కన్నీరుమున్నీరవుతున్న వారిద్దరినీ ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఈ ఘటనతో సబ్బవరం మండలం పెద యాతపాలెం, మునగపాక గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చోడవరం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణం లారీని అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఖాళీగా వెళ్తున్న లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా అతి వేగంగా నడిపాడు. అంతేకాకుండా తాను వెళ్లే వైపు కాకుండా పూర్తిగా కుడివైపునకు ఒక్కసారిగా వచ్చి మోటారు సైకిల్‌ను ఢీకొట్టాడు. ఆ సమయంలో మరే వాహనం వచ్చినా వాటిని కూడా ఈ లారీ ఢీకొట్టి ఉండేదని అక్కడి వారు చెప్పారు. -
సమ గౌరవమే సరైన రక్ష
కుటుంబంలో ఆమె సమాన భాగస్వామి. పని ప్రదేశంలో ఆమె సమాన సహోద్యోగి. సమాజంలో ఆమె సమాన పౌరురాలు. అవకాశాలలో.. అధికారంలో.. అంతరిక్షంలో అన్నింటా ఆమెకు సమాన హక్కు ఉంది. పురుషులు గ్రహించ వలసింది ఇదే రక్షా బంధన్ సందర్భంలో. స్త్రీకి సాటి పురుషుల నుంచి ‘రక్ష’ ఇచ్చే బదులు అందరు పురుషులు స్త్రీల సమస్థానాన్ని స్వీకరిస్తే చాలు. అన్న స్థానం మంచిదే. సమ స్థానం గొప్పది. పురాణాల్లో ద్రౌపదికి కృష్ణుడు అన్నగా కనిపిస్తాడు. ద్రౌపదికి రక్షగా ఆయన నిలిచిన ఉదంతాలు అందరికీ తెలుసు. కౌరవసభలో జూదంలో ఓడిపోయిన పాండవులను మరింత అవమానించడానికి ద్రౌపది వస్త్రాపహరణానికి పురిగొల్పుతాడు దుర్యోధనుడు. దుశ్శాసనుడు అందుకు పూనుకుంటాడు. నిండు సభలో స్త్రీకి... ఒక రకంగా ఇంటి కోడలికి అవమానం జరగబోతుంది. ఆ సమయంలో ఒక అన్నగా ప్రత్యక్షమయ్యి ఆమెకు రక్షగా నిలుస్తాడు కృష్ణుడు. మగవారి గొడవలో స్త్రీలను లాగకూడదనే సంస్కారం కౌరవులకు ఉండి ఉంటే ద్రౌపదికి పరాభవం జరిగి ఉండేది కాదు. మగవారైన కౌరవుల నుంచి రక్షించడానికి మగవాడైన కృష్ణుడు ప్రత్యక్షం కావల్సిన అవసరమూ ఉండేది కాదు. అంటే? స్త్రీలను గౌరవించాలనే సంస్కారమే ప్రథమం. ఆ సంస్కారం ఉంటే స్త్రీలకు మగవారి నుంచి ఎటువంటి ఆపదా, ఇబ్బంది ఉండదు. వారికి రక్షగా నిలవాల్సిన అవసరమూ ఉండదు. చెల్లెలు బంగారు తల్లి. ఇంటి ఆడపిల్లంటే లక్ష్మి. తండ్రికి, అన్నకు, తమ్ముడికి కూడా ఆమె అంటే అంతులేని మమకారం. ఆమె పాదంలో ముల్లు దిగితే వారి కంట కన్నీరు పొంగుతుంది. ఆమె కోరింది ఇవ్వబుద్ధవుతుంది. ఆమెను ఇష్టాన్ని మన్నించాలనిపిస్తుంది. కాని ఇదంతా తమ ఇంటి ఆడపిల్ల విషయంలోనే. మరి పొరుగింటి, ఇరుగింటి, ఊళ్లో ఉన్న, ఆఫీసులో ఉన్న స్త్రీలు అందరూ ఇలా ప్రేమగా, ఆదరంగా చూడవలసిన వారే కదా. మన ఇంటి ఆడవాళ్లని మాత్రమే ఆదరంగా చూస్తాము ఇతర ఇళ్ల ఆడవాళ్లను చులకన చేస్తాము అనే భావన ఎందుకు? అలా ఎవరైనా తమ ఇంటి ఆడవాళ్లను చులకన చేస్తే ‘మేమున్నాం’ అని ఆ ఇంటి అన్నదమ్ములు ముందుకు రావడం ఎందుకు? అసలు ఒక స్త్రీని చులకన గా లేదా ఆధిపత్య భావనతో చూడవలసిన అవసరం ఏముంది? మీరు మేము రక్షగా నిలువదగ్గవారు అని చెప్పవలసిన అవసరం ఏమి? ‘భారతీయులందరూ సహోదరులు’ అని ప్రతిజ్ఞ చేసినట్టుగా ‘స్త్రీ పురుషులందరూ సమాన గౌరవానికి అర్హులు’ అని ప్రతిజ్ఞ చేసుకుంటే ‘రక్షాబంధనం’ అనే ‘రక్ష’కు గుర్తుగా కాక ఆత్మీయతకు, ఆదరణకు, అనురాగానికి, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ∙∙ ఆడపిల్ల చదువు విషయంలో, ఉద్యోగాన్ని ఎంచుకునే విషయంలో, జీవిత భాగస్వామిని కోరుకునే విషయంలో, ఆస్తి పంపకాలలో, ఇంటికి సంబంధించిన నిర్ణయాలను వ్యక్తం చేయడంలో ఎంత అవకాశం ఇస్తున్నారో ఎవరికి వారు చూసుకోవాలి. కావలసిన బట్టలు, నగలు కొనిపెట్టడమే అనురాగం, ఆత్మీయత కాదు. వారి ఆత్మవిశ్వాసానికి, వ్యక్తిత్వానికి చోటు కల్పించాలి. స్వయం సమృద్ధితో జీవితాన్ని నిర్మించుకునే శక్తి, స్వేచ్ఛ పొందేందుకు అడ్డు లేకుండా ఉండాలి. మద్దతుగా నిలవాలి. అది ఇంటికి సంబంధించినంత వరకూ సరైన రక్షా బంధనం అంటే. ఇక పని ప్రదేశాలలో మహిళా ఉద్యోగినుల ప్రతిభను గౌరవించాలి. వారికి ‘బాస్’లుగా ఎదిగే సామర్థ్యం ఉంటే వారి దగ్గర పని చేయడం ఇతర పురుష బాస్‌ల వద్ద పని చేయడంతో సమానంగానే భావించాలి. వారు ఇంటిని, పిల్లలను చూసుకుంటూ ఉద్యోగంలో కూడా తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న సంగతి అనుక్షణం గుర్తుంచుకోవాలి. పురుషుడు కేవలం ఉద్యోగం చేస్తే సరిపోతుంది. ఉద్యోగం చేయాలనుకునే స్త్రీ ఇల్లు కూడా చూసుకోవాలి. కనుక ఆఫీసులో వారే ఎక్కువ సమానం అవుతారు కాని తక్కువ సమానం కాదు. పురుష ఉద్యోగులతో పరస్పర సహకారం అందిస్తూ ఎలా పని చేస్తారో మహిళా ఉద్యోగులతో కూడా పరస్పర సహకారం అందిస్తూ పని చేస్తే అదే ఆఫీసు వరకు నిజమైన రక్షాబంధనం. సమాజంలో అనేక దొంతరల్లో ఇవాళ స్త్రీలు వికాస పథంలో పని చేస్తున్నారు. పురుషులకు అట్టి వారిని చూసినప్పుడు ప్రధానంగా ప్రశంసాపూర్వకంగా చూడాలి. నాయకులు, ఆటగాళ్ళు, కళాకారులు, అధికారులు అనంటే పురుషుల మాత్రమే కాదని, స్త్రీలు కూడా అని గొప్ప గొప్ప వ్యాపారవేత్తలుగా ఇవాళ స్త్రీలే ఫోర్బ్స్‌కు ఎక్కుతున్నారని గ్రహిస్తే వారిని స్ఫూర్తిగా తీసుకుని మన ఇంటి అమ్మాయికి వారిని ఆదర్శం చేయడమే సమాజానికి సంబంధించినంత వరకూ సరైన రక్షా బంధనం. పులితో పోరాడిన స్త్రీలు, బిడ్డను నడుముకు కట్టుకుని శత్రువులతో పోరాడిన స్త్రీలు మన దగ్గర కొదవ కాదు. వారు పరాక్రమవంతులు. వారే ఎవరికైనా రక్షగా నిలువగలరు. తమను తాము రక్షించుకోగలరు. వారు కోరేదల్లా తమ దారిన తాము నడవనివ్వమని. తమ ఎంపికల పట్ల ప్రజాస్వామికంగా ఉండమని. బాధ్యతల బంధాల బట్వాడాలో సమన్యాయం పాటించమని. తమను గౌరవిస్తూ తమ గౌరవం పొందే విధంగా పురుషులు ఉండాలని. తల్లీతండ్రి, భార్యా భర్త, అక్కా తమ్ముడు, స్త్రీ పురుషుడు, యువతీ యువకుడు... జీవన– సామాజిక చక్రాలలో స్త్రీలు పురుషులకు రక్షగా పురుషులు స్త్రీలకు రక్షగా సందర్భాన్ని బట్టి మారాల్సి ఉంటుంది. ఆ సందర్భాలను గుర్తించమని చెప్పేదే నిజమైన రక్షాబంధనం. ‘భారతీయులందరూ సహోదరులు’ అని ప్రతిజ్ఞ చేసినట్టుగా ‘స్త్రీ పురుషులందరూ సమాన గౌరవానికి అర్హులు’ అని ప్రతిజ్ఞ చేసుకుంటే ‘రక్షాబంధనం’ అనే ‘రక్ష’కు గుర్తుగా కాక ఆత్మీయతకు, ఆదరణకు, అనురాగానికి, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. -
నితిన్‌కి రాఖీ కట్టిన సింగర్ మంగ్లీ.. గిఫ్ట్ ఇచ్చిన హీరో
నితిన్, కృతీశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతోంది. తాజాగా నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా సింగర్ మంగ్లీ నితిన్‌తో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలను షేర్ చేసుకున్న నితిన్‌కు ఇంటర్వ్యూ చివర్లో మంగ్లీ రాఖీ కట్టింది. దీంతో నితిన్ ఆమెకు బ్యూటిఫుల్ గిఫ్ట్‌ను అందించారు. -
స్పృహ: పర్యావరణ రక్షాబంధన్
ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు? అని గట్టిగా అనుకోవచ్చు. అయితే ముంజేతి రాఖీకి అద్దం అక్కర లేకపోవచ్చుగానీ... అర్థం మాత్రం ఉంటుంది. బంధాల గురించి రాఖీ ఎన్నో మాటలు చెప్పకనే చెబుతుంది. ఇప్పుడది పర్యావరణహిత వచనాలు కూడా అందంగా చెబుతోంది. ‘మమ్మల్ని చల్లగా చూడు తల్లీ’ అంటూ చెట్లకు రాఖీ కట్టే ఆచారం ఉంది. ‘అయితే మనం చల్లగా ఉండాలంటే చెట్టు చల్లగా ఉండాలి. పర్యావరణం బాగుండాలి’ అంటున్నారు హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన మహిళలు. పైన్ చెట్ల పత్రాలతో ఎకో–ఫ్రెండ్లీ రాఖీలు తయారుచేస్తూ పర్యావరణహిత సందేశాన్ని ఊరూరు తీసుకువెళుతున్నారు.... పైన్ చెట్ల నుంచి నేల రాలిన పత్రాల వలన ఉపయోగం ఏమిటి? అనే ప్రశ్నకు ఉపయోగపడే సమాధానం ఒకప్పుడు ఒక్కటి కూడా వినిపించేది కాదు. ఇప్పుడు మాత్రం అలా కాదు. బోలెడు సమాధానాలు సిద్ధంగా ఉన్నాయి. హిమాచల్‌ప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిఫామ్స్ ప్రయోగాత్మకంగా 22 మంది మహిళలకు పైన్ పత్రాలతో రాఖీల తయారీ నేర్పించింది. ఆ తరువాత సిమ్లా, సోలన్ జిల్లాలో 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. దీనివల్ల పేద మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఒక కోణం అయితే, పర్యావరణానికి మేలు జరగడం మరో కోణం. ఎండిపోయిన పైన్ పత్రాల వల్ల అడవుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుండేవి. ఇప్పుడు ఆ ప్రమాదాల సంఖ్య చాలావరకు తగ్గింది. ‘గతంలో పైన్ పత్రాలపై దృష్టి ఉండేది కాదు. అయితే ఇప్పుడు అవి మాకు ఉపాధి కల్పించడంతోపాటు పర్యావరణ ప్రయోజన కార్యక్రమాల్లో భాగం అయ్యేలా చేస్తున్నాయి’ అంటుంది ప్రియదర్శిని కుమారి. రకరకాల మొక్కల విత్తనాలు కూర్చి ఈ రాఖీలను తయారు చేయడం ప్రత్యేకతగా నిలుస్తుంది. ‘హిమాచల్‌ప్రదేశ్ గ్రామీణప్రాంతాల్లో చిన్నస్థాయిలో అయినా ఉపాధి దొరకడం కష్టం అయ్యేది. ఈ రాఖీల తయారీ వల్ల ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. పర్యావరణానికి సంబంధించిన మంచి విషయాలను జనాలలో ప్రచారం చేయగలుగుతున్నాం’ అంటుంది 42 సంవత్సరాల హేమావతి. ట్రైనర్‌గా ఎంతోమందికి శిక్షణ ఇచ్చిన హేమావతి నెలకు ముప్పై వేలకు పైగా సంపాదిస్తుంది. ‘పర్యావరణ స్పృహ పెరిగిన తరువాత ఎకో–ఫ్రెండ్లీ రాఖీలకు డిమాండ్ పెరిగింది. రెగ్యులర్ రాఖీల కంటే భిన్నంగా ఉండడం కూడా వీటి డిమాండ్‌కు మరో కారణం’ అంటుంది నేహా. ఊరూరూ తిరిగి ఎకో–ఫ్రెండ్లీ రాఖీలను అమ్మడమే కాదు పర్యావరణ స్పృహకు సంబంధించిన అంశాలను ప్రజా బాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకు వెళుతున్నారు. ‘ఈ సంవత్సరం నా సోదరులకు ఎకో ఫ్రెండ్లీ రాఖీలు కట్టాలని నిర్ణయించుకున్నాను. నా స్నేహితులకు కూడా వీటి ప్రత్యేకతను తెలియజేయాలనుకుంటున్నాను’ అంటుంది కాలేజి స్టూడెంట్ శ్వేత. దిల్లీకి చెందిన తోరాని బ్రాండ్ రాఖీలు కూడా పర్యావరణ స్పృహతో తయారుచేయబడుతున్నాయి. పాత దుస్తులు, బట్టలతో తయారుచేసిన పాతబ్యాగులు... మొదలైన వాటిని ఉపయోగించి అందమైన రాఖీలు తయారు చేస్తున్నారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మంగళూరు(కర్నాటక)లోని ‘పేపర్‌సీడ్ కో’ అనే సామాజిక సంస్థ రకరకాల మొక్కల విత్తనాలను కూర్చి పర్యావరణహిత రాఖీలను తయారు చేస్తుంది. పండగ తరువాత చేతికి ఉన్న రాఖీలోని విత్తనాలు భూమిలోకి వెళ్లి పచ్చటి భవిష్యత్‌ను ఇస్తాయి. ఈ రాఖీల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులను ‘పేపర్‌సీడ్ విలేజి’ కోసం కేటాయిస్తున్నారు. ఇది మహిళలకు పర్యావరణహిత బొమ్మల తయారీలో శిక్షణ ఇచ్చే సంస్థ. ఎకో–ఫ్రెండ్లీ రాఖీల గురించి సామాజిక కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నారు. -
Sravana Masam: శ్రావణం శుభకరం.. ముఖ్యమైన తేదీలివే!
అనంతపురం కల్చరల్: ఈనెల 28న వచ్చే అమావాస్య రాకతో ఆషాఢమాసం ముగిసి శుక్రవారం నుంచి నోములు, వ్రతాలకు నెలవైన శ్రావణం మాసం రానుంది. శుభకార్యాలు మళ్లీ మొదలు కానుండడంతో మాసమంతటా ప్రతి ఇంటా శ్రావణ శోభతో అలరారే పండుగలు, సామూహిక వ్రతాలు సందడి చేయనున్నాయి. శ్రావణంలో భక్తిశ్రద్ధలతో ఆచరించే ప్రతి పండుగ వెనుక ఆధ్యాత్మిక కోణమే కాకుండా సామాజిక, వైజ్ఞానిక అంశాలెన్నో దాగున్నాయని పెద్దలు చెబుతారు. మానవ సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన శ్రావణ మాసం ఈనెల 29 నుంచి వచ్చే నెల 27 వరకు ఉంటుంది. ఇప్పటికే శ్రావణమాస పూజల కోసం జిల్లా వ్యాప్తంగా ఆలయాలు ప్రత్యేకంగా ముస్తాబవుతున్నాయి. ఈనెల తప్పితే మళ్లీ డిసెంబరు వరకు శుభముహూర్తాలు లేకపోవడంతో ఫంక్షన్ హాల్స్, కల్యాణమండపాలు బిజీగా మారనున్నాయి. మహిళలకు ప్రీతికరం శ్రావణ నోములు, వ్రతాలు భక్తితోనోచుకుంటే దీర్ఘ సుమంగళిగా ఉంటామన్న విశ్వాసముండడంతో మహిళలు ఈ మాసాన్ని అత్యంత ప్రీతికరంగా భావిస్తారు. పౌర్ణమి చంద్రుడు శ్రవణా నక్షత్రం మీద సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణం అని పేరొచ్చింది. అఖిలాంఢకోటి బ్రహ్మాండ నాయకుడైన వేంకటేశ్వరస్వామి ఇదే నక్షత్రంలో జన్మించినందున శ్రీవారి ఆలయాల్లో విశేష పూజలు జరుగుతాయి, ఆయన సతీమణి లక్ష్మీదేవి, సోదరి గౌరికి ఇదే మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ క్రమంలో పలు ఆలయాల్లో సామూహిక వ్రతాలు చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రావణంలో వచ్చే మంగళవారాలతో పాటూ శుక్రవారాలు, శనివారాలు ఆలయాలు ప్రత్యేక పూజలు, భక్తులతో కిటకిటలాడుతాయి. (చదవండి: 'మామ్పవర్ 360’.. కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన మహిళలను తిరిగి..) శ్రావణంలో వచ్చే పండుగలివే.. శ్రావణ మాసమంతటా పండుగల సందడితోనే సాగుతుంది. వచ్చే నెల 1న రానున్న నాగుల చవితితో పర్వదినాలు ఆరంభమవుతాయి. మరుసటి రోజుననే గరుడ పంచమిని జరుపుకుంటారు. 5న వరమాలక్ష్మీ వ్రతం, 12న రక్షాబంధనం (రాఖీ పౌర్ణిమ), 18, 19 తేదీల్లో వచ్చే శ్రీకృష్ణజన్మాష్టమితో పాటూ బలరామ జయంతి, హయగ్రీవ జయంతి, రాధాష్టమి పండుగలు వరుసగా ఆనందాలను తెచ్చేవే. మాసం చివరిరోజున కూడా పొలాల అమావాస్యను జరుపుకోవడం ఆనవాయితీ. వ్రతాలకు శ్రావణమాసాన్ని ఎంచుకోవడంలో ఆరోగ్యపరమైన కారణాలున్నాయని, ప్రత్యేక పూజలకు సన్నాహాలు చేస్తున్నట్లు వేదపండితులు చెబుతున్నారు. (చదవండి: ఈ మొక్కలు పెంచితే ఎంత డేంజరో తెలుసా?) -
మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్ ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ.. మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆడపడుచులు వారి సోదరులకి రాఖీ పండుగను పురస్కరించుకుని స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని సందర్భంలో తెలంగాణ టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్ సర్వీసుల ద్వారా అతి తక్కువ ధరలలో రాఖీలను పంపించుకోవచ్చని పేర్కొంది. చదవండి: ఇష్టారాజ్యంగా చికెన్ విక్రయాలు ఊరికో ధర..! టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్ సర్వీసులను డోర్ టు డోర్ డెలివరీ హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ లో డోర్ డెలివరీ సదుపాయం కల్పించింది. ఈ సందర్భంగా డిప్యూటీ రీజినల్ మేనేజర్ (సేల్స్ అండ్ గవర్నమెంట్) జి. జగన్, గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కి సంబంధించిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవల గురించి విస్తృత ప్రచారం చేశారు. మరింత సమాచారం కోసం 9154298858, 9154298829 ఈ నంబర్లలో సంప్రదించవచ్చని టీఎస్ఆర్టీసీ పేర్కొంది. -
రాఖీ స్పెషల్: సెలబ్రిటీల అన్నాచెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్లను చూశారా?
.. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shweta Singh kirti (SSK) (@shwetasinghkirti) View this post on Instagram A post shared by KTR (@ktrtrs) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Roja Selvamani (@rojaselvamani) View this post on Instagram A post shared by Varun Sandesh (@itsvarunsandesh) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by Hanshithareddy (@hanshithareddy) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by S (@shwetabachchan) View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) View this post on Instagram A post shared by Tusshar Kapoor (@tusshark89) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) -
నా కన్నా మా అన్నయ్యకే ఎక్కువ సపోర్ట్: దివి
బిగ్‌బాస్ సీజన్-4లో పాల్గొని సొట్టబుగ్గలతో కుర్రకారును ఫిదా చేసిన దివి వైద్య ప్రస్తుతం వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోంది. బిగ్‌బాస్ తర్వాతే తనకు గుర్తింపు వచ్చిందని ఇప్పుడు చిరంజీవితో కలిసి వేదాళం రీమేక్‌లో నటిస్తున్నట్లు పేర్కొంది. రాఖీ సందర్భంగా తన అన్నయ్యతో కలిసి సాక్షి. కామ్‌తో స్పెషల్‌గా ముచ్చటించిన దివి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. చదవండి : ప్రభాస్‌తో డేటింగ్‌కు వెళ్లాలనుంది : బిగ్‌బాస్ బ్యూటీ చిరు బర్త్‌డే సర్ప్రైజ్ వచ్చేసింది..‘భోళా శంకర్’గా మెగాస్టార్ -
ప్రధానికి.. బృందావన్ రాఖీ!
బీద, గొప్ప, స్థాయి భేదం లేనివే అనుబంధాలు. అందుకే సొంత అన్నయ్యలు, తమ్ముళ్లకేగాక.. అప్యాయత, అనురాగాలు పంచేవారు, కష్టాల్లో వెన్నంటి ఉండి ధైర్యం నూరిపోసేవారు, ఆపదలో ఆదుకునే ప్రతిఒక్కరినీ తమ సోదరులుగా భావించి రాఖీ కడుతుంటారు మన భారతీయ అడపడుచులు. వీర జవాన్ల నుంచి ప్రధాని మంత్రిదాకా అందరికీ రాఖీలు పంపుతూ సోదర సమానులపై తమకున్న ప్రేమను చాటిచెబుతుంటారు. ఇదే క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు చెందిన కొంతమంది వితంతువులు ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీలు పంపించారు. బృందావన్‌లోని ‘మా శారద’, రాధా తిల ఆశ్రమంలోని వయసుపైబడిన వితంతువులు ప్రధాని కోసం ప్రత్యేకంగా రంగురంగుల రాఖీలను రూపొందించారు. 251 రాఖీలను స్వయంగా తయారు చేసి, వాటిపై మోదీ ఫొటోనూ చిత్రీకరించారు. రాఖీలతోపాటు ‘ఆత్మనిర్భర్’, ‘స్టే సేఫ్’ అని మెసేజ్æ రాసిన ప్రత్యేకమైన మాస్కులు, స్వీట్లు పంపడం విశేషం. వీళ్లంతా మోదీని తమ సోదరుడిలా భావించి గత ఐదేళ్లుగా క్రమం తప్పకుండా రాఖీలు పంపిస్తున్నారు. గతేడాది బృందావన్‌కు చెందిన 103 ఏళ్ల వితంతు బామ్మ మోదీకి రాఖీ కట్టగా ఈ ఏడాది ఆ అవకాశం దక్కలేదు. దీంతో నలుగురు మహిళలతో మోదీకి రాఖీల బుట్టను పంపారు. -
నీ అనురాగం... ఎన్నో జన్మల పుణ్యఫలం
‘ఓ అన్నా... నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం’... ఈ పాట ప్రతి రాఖీ పండక్కీ వినిపిస్తుంది. ఇళ్లల్లో అన్నదమ్ములకు జరక్కపోయినా చెల్లెళ్లకు ముద్దు మురిపాలు జరుగుతాయి. తండ్రో లేకుంటే అన్నయ్యలో ఆమెను భుజాల మీదకు ఎక్కించుకుని ఆడిస్తారు. తల్లి కోపగించాలని చూసినా గారం చేసి వెనకేసుకు వస్తారు. తండ్రి, అన్నదమ్ముల ప్రేమ పొందిన చెల్లెలు తన జీవితంలో భర్తగా వచ్చే పురుషుడి నుంచి కూడా అలాంటి ప్రేమనే ఆశిస్తుంది. అక్కడ ఏదైనా లోటు జరిగితే అన్నదమ్ముల తోడ ఆ లోటును పూడ్చుకుందామని చూసుకుంటుంది. ఒకప్పటి కాలంలో ఆమె పురుషుల మీద ఆధారపడే స్త్రీ అయినా నేడు ఆర్థికంగా, వ్యక్తిత్వపరంగా స్వతంత్రతను, ఉనికిని చాటుతున్నా అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే అనురాగంలో ఎటువంటి మార్పూ ఉండదు. ఉండబోదు. వారు కలిసి పెరిగారు. కలసి బాల్యం పంచుకున్నారు. వారు ఒకరికొకరు తెలిసినట్టుగా మరొకరికి తెలియరు. అందుకే ఆపద వస్తే చెల్లెలు ‘అన్నా’ అంటుంది. అన్న ఉలికిపాటుకు గురైతే చెల్లెలు హాజరవుతుంది. మేనమామ, మేనత్తలుగా ఈ అన్నాచెల్లెళ్లు పిల్లలకు ప్రియ బంధువులవుతారు. అపురూపమైన మానవ బంధాల నిర్మాణం ఇది. చందురుని మించు అందమొలికించు ఎన్టీఆర్, సావిత్రి అన్నాచెల్లెళ్లా అని జనం అనుకున్నారుగాని వారిద్దరూ ‘రక్తసంబంధం’లో అన్నాచెల్లెళ్లుగా చిరకాలం గుర్తుండిపోయే నటనను ప్రదర్శించారు. ఆ అన్నకు చెల్లెలి కోసం సర్వస్వం వదులుకునేంత ప్రేమ. ఆ చెల్లెలికి ఆ అన్న కోసం ప్రాణమే ఇచ్చే పాశం. అబ్బ... ఆ అవినాభావ బంధం చాలా ఉద్వేగపూరితమైనది. ఇదే ఎన్.టి.ఆర్ ‘చిట్టిచెల్లెలు’లో వాణిశ్రీ కోసం ఏడ్చి ఏడ్చి మనకు ఏడుపు తెప్పిస్తాడు. ‘అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప’.. అన్నాచెల్లెళ్ల పాటల్లో కంటిపాప వంటి పాట. అక్కినేని ‘బంగారు గాజులు’లో విజయనిర్మలతో ఈ అనుబంధాన్ని గొప్పగా పండించాడు. ‘అన్నయ్య సన్నిధి... అదే నాకు పెన్నిధి’ పాటలో అన్నగా ఆయనను చూడాలి. శోభన్‌బాబు ‘చెల్లెలి కాపురం’ సినిమా చెల్లెలి సెంటిమెంట్ వల్లే హిట్. ఆయన నటించిన ‘శారద’ సినిమాలో శారదకు అన్నయ్యగా కైకాల సత్యనారాయణ నటించి విలన్ నుంచి పూర్తి స్థాయి కేరెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. ‘కానిస్టేబుల్ కూతురు’లో జగ్గయ్య, కృష్ణకుమారి అన్నాచెల్లెళ్లుగా నటించారు. చెల్లెల్ని ఆట పట్టిస్తూ జగ్గయ్య పి.బి.శ్రీనివాస్ గొంతుతో పాడే ‘చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా’ చాలా బాగుంటుంది. పగ–ప్రతీకారాల దశాబ్దం 1980లు వచ్చే సరికి తెలుగు సినిమాలో చెల్లెలి పాత్ర పరమ స్టీరియోటైప్‌గా మారింది. హీరోకు చెల్లెలు ఉంటే చాలు ఆమె విలన్ బాధలకు బలి అవనున్నదని ప్రేక్షకులకు తెలిసిపోయేది. ఈ పిచ్చి సినిమాల మధ్య కూడా ‘చట్టానికి కళ్లులేవు’లాంటి చిత్రాలు వచ్చాయి. ఇందులో అక్కగా లక్ష్మి, తమ్ముడిగా చిరంజీవి ఘర్షణతో కూడిన బంధంలో కనిపిస్తారు. ఎన్.టి.ఆర్ ‘డ్రైవర్ రాముడు’లో అంధురాలైన తన చెల్లి రోజా రమణితో ‘ఏమని వర్ణించను’ పాట పాడతాడు. తమిళం నుంచి బాపు రీమేక్ చేసిన ‘సీతమ్మ పెళ్లి’లో మోహన్‌బాబు బహుశా తన గొప్ప పెర్ఫార్మెన్స్లలో ఒకటిగా నటించాడు. ఇందులోనే ‘తల్లివైనా చెల్లివైనా’ పాట ఉంది. కొంచెం కాలం ముందుకు నడిస్తే చిరంజీవి తన ‘లంకేశ్వరుడు’లో చెల్లెలి సెంటిమెంట్‌ను చూపడానికి ప్రయత్నించాడు. ఆ సినిమా పని చేయకపోయినా నలుగురు చెల్లెళ్లతో ఆ తర్వాత నటించిన ‘హిట్లర్’ సెకండ్ ఇన్నింగ్స్‌ను చాన్స్ ఇచ్చింది. బాలకృష్ణ ‘ముద్దుల మావయ్య’ సినిమాలో ‘మావయ్య అన్న పిలుపు’ పాట పాడి పెద్ద ఎత్తున హిట్ కొట్టాడు. కృష్ణంరాజు, రాధిక అన్నాచెల్లెళ్లుగా నటించిన ‘పల్నాటి పౌరుషం’ గట్టి కథాంశమే అయినా అంతగా ఆడలేదు. పూర్ణిమ, శివకృష్ణలతో వచ్చిన పరుచూరి రచన ‘ఆడపడుచు’ పెద్ద హిట్ అయ్యింది. నీ పాదం మీద పుట్టుమచ్చనై... ఆ సమయంలోనే గద్దర్ రాసిన ‘మల్లెతీగకు పందిరివోలే’ పాట ‘ఒరేయ్ రిక్షా’ సూపర్‌హిట్ కావడానికి ముఖ్యకారణంగా మారింది. 1995లో వచ్చిన ఈ సినిమా ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా... తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’ అనే గొప్ప లైన్‌ను ఇచ్చింది. అయితే ఈ సమయంలోనే వచ్చిన ‘తొలిప్రేమ’ సినిమా చెల్లెలి పాత్రను చాలా కొత్తగా చూపించింది. ఇందులో పవన్‌కల్యాణ్, వాసుకి మధ్య సన్నివేశాలు గొప్పగా పండాయి. 2000 సంవత్సరం తర్వాత కాలం మారినా చెల్లెలి బంధం మారదు. సినిమాలూ ఆ కథను ఎంచుకోక మానలేదు. ‘పుట్టింటికిరా చెల్లి’ వంటి పాతవాసన వేసే టైటిల్ పెట్టి సినిమా తీస్తే సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. అర్జున్, స్వప్నమాధురి అద్భుతంగా నటించారు. మహేశ్‌బాబు ‘అర్జున్’లో అక్క కీర్తి రెడ్డిని కాపాడుకునే తమ్ముడిగా గొప్పగా నటించాడు. పవన్ కల్యాణ్ ‘అన్నవరం’ చెల్లెలి రక్షణకు వేట కొడవలి పట్టిన అన్నను చూపిస్తుంది. కృష్ణవంశీ ‘రాఖీ’ అనే టైటిల్ పెట్టి మరీ ప్రతి మగవాడు స్త్రీలను సోదరుడిలా చూసుకోవాలనే సందేశంతో హిట్ కొట్టాడు. జూనియర్ ఎన్.టి.ఆర్కు ఆ సమయంలో అవసరమైన హిట్ అది. ఇక రాజశేఖర్, మీరా జాస్మిన్ నటించిన ‘గోరింటాకు’ గొప్ప కరుణరసం పండించి అన్నాచెల్లెళ్ల బంధానికి తిరుగులేదని నిరూపించింది. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకునే ఈ రాఖీ పండగ నాడు ఆ సెంటిమెంట్‌ను పండిస్తూ తీసిన, నటించిన తెలుగు సినిమా వారికి కూడా శుభాకాంక్షలు చెబుదాం. చెల్లెలి క్షేమం కోరుకోని అన్న అన్న శ్రేయస్సు కాంక్షించని చెల్లెలు ఉండరు. తల్లిదండ్రులు ఉన్నా గతించినా తల్లి అంశ చెల్లిలో తండ్రి అంశ అన్నలో చూసుకుంటారు పరస్పరం అన్నాచెల్లెళ్లు. అది రక్తసంబంధం. యుగాలుగా ఏర్పడింది. యుగాంతం వరకూ ఉంటుంది. అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే భావోద్వేగాలు ఎన్నో సినిమా కథలయ్యాయి. పాటలయ్యాయి. అవుతూనే ఉంటాయి. రాఖీ సందర్భంగా కొన్నింటిని గుర్తు చేసే ప్రయత్నం ఇది. -
ఎలా బతకాలో తెలియడం లేదు – మీతూసింగ్
‘‘35 ఏళ్లలో నువ్వు లేని రాఖీ పండగ ఇదే. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఊహించలేదు కూడా’’ అన్నారు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి మీతూ సింగ్. సోమవారం రాఖీ పౌర్ణమి. సుశాంత్ ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. తమ్ముడు లేకుండా రాఖీ రోజు వస్తుందని నేను ఉహించలేదంటూ ఉద్వేగపూరిత లేఖను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు సుశాంత్ సోదరి మీతు. దాని సారాంశం ఈ విధంగా. ‘‘ఇవాళ మన రోజు. అక్కాతమ్ముళ్ల రోజు. 35 ఏళ్లలో నేను నీకు రాఖీ కట్టలేకపోవడం ఇదే మొదటి సారి. స్వీట్స్ తినిపించలేకపోవడం, నీ నుదుట మీద ముద్దు పెట్టలేకపోవడం, నిన్ను ఆప్యాయంగా హగ్ చేసుకోలేకపోవడం. నువ్వు పుట్టి మా అందరి జీవితాల్లోకి వెలుగు తీసుకొచ్చావు. సంతోషం నింపావు. కానీ మా అందర్నీ వదిలి దూరంగా వెళ్లిపోయావు. ఏదైనా సరే మనిద్దరం కలిసే నేర్చుకున్నాం. ఇప్పుడు నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నాకు తెలియడంలేదు. నువ్వే చెప్పు?’’ అని రాశారు మీతు. ఇక సుశాంత్ ఆత్మహత్య పై ప్రస్తుతం విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకిత పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘కొంత కాలంగా సుశాంత్ ఏదో ఒత్తిడికి లోనవుతున్నట్టు అనిపిస్తుందని తన అక్క నాతో చెప్పారు. అలాగే సుశాంత్ తన కుటుంబానికి కొంచెం దూరంగా ఉన్నట్టు నాకు తెలుసు’’ అని చెప్పుకొచ్చారు. అలాగే సుశాంత్ సింగ్ కేసు లో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మీద సుశాంత్ కుటుంబ సభ్యులు ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. -
రక్షాబంధన్: భార్య కూడా భర్తకు రక్ష కట్టవచ్చు!
రక్తసంబంధం ఉన్నా లేకున్నా...అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని పంచేది రాఖీ. అయితే రక్షాబంధన్ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లే కాదు భార్య కూడా భర్తకు రాఖీ కట్టవచ్చట. ఇంతకీ రాఖీ పౌర్ణమి వెనక ఉన్న చరిత్ర ఏంటి? ఏఏ రాష్ట్రల్లో ఈ పండుగని ఎలా జరుపుకుంటారు? తెలియాలంటే కింది వీడియోని వీక్షించండి. -
గుజరాత్లో బంగారు ‘మోదీ’ రాఖీలు!
సూరత్: రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశంలోని దుకాణాలన్నీ రాఖీలతో కళకళలాడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం రాఖీ పండుగ నేపథ్యంలో గుజరాత్‌లోని ఓ నగల షాపు 22 కేరట్ల బంగారంతో చేసిన రాఖీలను అమ్ముతోంది. ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ల ముఖ చిత్రాలను ముద్రించిన ఈ రాఖీలు ఒక్కొక్కటి రూ.30,000 నుంచి రూ.60,000 మధ్యలో లభ్యమవుతున్నాయి. ఈ విషయమై నగల షాపు యజమాని మాట్లాడుతూ.. రాఖీ పండుగ సందర్భంగా మోదీ, రూపానీ, ఆదిత్యనాథ్ ముఖ చిత్రాలతో 50 బంగారు రాఖీలను తయారుచేశామని తెలిపారు. వీటిలో 47 రాఖీలు ఇప్పటికే అమ్ముడైపోయాయని వెల్లడించారు. ఇలాంటి రాఖీలు కావాలంటూ తమ షాపుకు ఇంకా ఆర్డర్లు వస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. -
అక్కచెల్లెమ్మలందరూ చల్లంగా ఉండాలి: వైఎస్ జగన్
హైదరాబాద్: అన్నా-చెల్లెలి అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. ఆత్మీయతానుబంధాలను చాటే ఈ విశిష్టమైన పర్వదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన చెల్లెలు షర్మిల రాఖీ కట్టారు. తనకు వైఎస్ షర్మిల ఆత్మీయంగా రాఖీ కడుతున్న ఫొటోను వైఎస్ జగన్ తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు. అక్కచెల్లెమ్మలందరూ ఇప్పుడు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అంతకుముందు రాఖీపౌర్ణమి పండుగ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెలెళ్ల ప్రేమానుబంధాలను, పరస్పర అనురాగాన్ని చాటే రాఖీపౌర్ణమి ఒక విశిష్టమైన పండుగ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పర్వదినం మన ప్రజల్లో సోదరభావాన్ని, ఐక్యతను చాటాలని ఆకాక్షించారు. May all sisters be happy this day and always #RakshaBandhan pic.twitter.com/KV7VSHizmd — YS Jagan Mohan Reddy (@ysjagan) 7 August 2017 -
రాఖీపౌర్ణమి ఒక విశిష్టమైన పండుగ: వైఎస్ జగన్
హైదరాబాద్: అన్నా-చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీపౌర్ణమి పండుగ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెలెళ్ల ప్రేమానుబంధాలను, పరస్పర అనురాగాన్ని చాటే రాఖీపౌర్ణమి ఒక విశిష్టమైన పండుగ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పర్వదినం మన ప్రజల్లో సోదరభావాన్ని, ఐక్యతను చాటాలని ఆకాక్షించారు. -
రేపు గోదావరి బోర్డు సమావేశం
♦ రెండు రాష్ట్రాలకు లేఖలు పంపిన బోర్డు సభ్యకార్యదర్శి ♦ భేటీలో పట్టిసీమే ప్రధానాంశం! హైదరాబాద్: గోదావరి బోర్డు సమావేశం ఈ నెల 29న జరగనుంది. రాఖీపౌర్ణమిని పురస్కరించుకుని 29న గోదావరి బోర్డుకు సెలవు దినం అయినప్పటికీ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఉన్న దృష్ట్యా శనివారమే భేటీ నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు బోర్డు సభ్య కార్యదర్శి రామ్‌శరణ్ లేఖలు పంపారు. ప్రస్తుతం జరిగే సమావేశ ఎజెండాలో బోర్డుకు అధికారుల కేటాయింపు, కార్యాలయ నిర్వహణ ఖర్చులకు నిధుల అంశం వంటి ఏడు విషయాలను పొందుపరచగా, పట్టిసీమ ప్రాజెక్టు అంశంపైనే ప్రధానంగా చర్చ జరగనుందని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం 80 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తిగా అక్రమమని, రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఈప్రాజెక్టును చేపడుతోందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బోర్డుకు ఫిర్యాదు చేసింది. అపెక్స్ కౌన్సిల్ కానీ, బోర్డు అనుమతి కానీ లేకుండానే ప్రాజెక్టును చేపడుతోందని, రాష్ట్ర హక్కులకు భంగం కలిగేలా చేపడుతున్న ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరింది. ఇది ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84(3), 85(8)లకు వ్యతిరేకంగా ఉందని, గతంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల మధ్య జరిగిన ఒప్పందం మేరకు పోలవరం ప్రాజెక్టు నుంచి మాత్రమే 80 టీఎంసీల నీటిని మళ్లించాలని, అంతకుమించి నీటిని మళ్లిస్తే, ఆ నీటిని మూడు రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలని పేర్కొన్నా వాటన్నింటినీ ఉల్లంఘిస్తోందని రాష్ట్రం బోర్డుకు రాసిన లేఖలో తెలిపింది. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగమే అయితే 80 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాలకు ఉన్న 35 టీఎంసీల వాటాను కర్ణాటక, మహారాష్ట్రలు కృష్ణా జలాల్లో మినహాయించుకునే అవకాశం ఉంటుంది. మిగతా 45 టీఎంసీల వాటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినది కాగా ఆ నీటిని వాటాల మేరకు పంచుకుంటే తెలంగాణకు 19 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంటుందనేది రాష్ట్రం వాదనగా ఉంది. కానీ ఈ వాదనను ఏపీ కొట్టిపారేస్తోంది. ఈ అంశాన్ని బోర్డు ముందు పెట్టి అక్కడ ఏపీ చేసే వాదనను బట్టి ముందడుగు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.