
సాక్షి, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ.. మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆడపడుచులు వారి సోదరులకి రాఖీ పండుగను పురస్కరించుకుని స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని సందర్భంలో తెలంగాణ టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్ సర్వీసుల ద్వారా అతి తక్కువ ధరలలో రాఖీలను పంపించుకోవచ్చని పేర్కొంది.
చదవండి: ఇష్టారాజ్యంగా చికెన్ విక్రయాలు ఊరికో ధర..!
టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్ సర్వీసులను డోర్ టు డోర్ డెలివరీ హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ లో డోర్ డెలివరీ సదుపాయం కల్పించింది. ఈ సందర్భంగా డిప్యూటీ రీజినల్ మేనేజర్ (సేల్స్ అండ్ గవర్నమెంట్) జి. జగన్, గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కి సంబంధించిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవల గురించి విస్తృత ప్రచారం చేశారు. మరింత సమాచారం కోసం 9154298858, 9154298829 ఈ నంబర్లలో సంప్రదించవచ్చని టీఎస్‌ఆర్టీసీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment