TSRTC service
-
మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్ ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ.. మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆడపడుచులు వారి సోదరులకి రాఖీ పండుగను పురస్కరించుకుని స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని సందర్భంలో తెలంగాణ టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్ సర్వీసుల ద్వారా అతి తక్కువ ధరలలో రాఖీలను పంపించుకోవచ్చని పేర్కొంది. చదవండి: ఇష్టారాజ్యంగా చికెన్ విక్రయాలు ఊరికో ధర..! టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్ సర్వీసులను డోర్ టు డోర్ డెలివరీ హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ లో డోర్ డెలివరీ సదుపాయం కల్పించింది. ఈ సందర్భంగా డిప్యూటీ రీజినల్ మేనేజర్ (సేల్స్ అండ్ గవర్నమెంట్) జి. జగన్, గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కి సంబంధించిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవల గురించి విస్తృత ప్రచారం చేశారు. మరింత సమాచారం కోసం 9154298858, 9154298829 ఈ నంబర్లలో సంప్రదించవచ్చని టీఎస్ఆర్టీసీ పేర్కొంది. -
న్యూ ఇయర్: మందుబాబుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే మందుబాబుల కోసం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ పేర్కొంది. సిటీ శివారులో ఉన్న ఈవెంట్స్ జరిగే ప్రాంతాలకు బస్సు సర్వీసు సౌకర్యం కల్పించనుంది. ఈవెంట్స్ వెళ్లే వారికోసం రాత్రి 7.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు, తిరుగు ప్రయాణం అర్ధరాత్రి 12.30నుంచి మరుసటిరోజు తెల్లవారుజాము 3గంటల వరకు బస్సు సేవలు అందిచనుంది. 18 సీట్ల ఏసీ బస్సు వెళ్లి రావటానికి రూ.4 వేల ప్యాకేజీని ప్రకటించింది. ఒకరికి రూ.100 వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసి సూచించిన 15 ప్రాంతాల్లో బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. టీఎస్ఆర్టీసీ కొత్త సంవత్సరం కానుక కొత్త సంవత్సరం కానుకగా జనవరి1వ తేదీన తల్లిదండ్రులతో ప్రయాణించే 12 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. -
ఆర్టీసీని అనుచరులకు కట్టబెట్టేందుకే డ్రామాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని కేసీఆర్ తన అను చరులకు అప్పగించేందుకే ఈ డ్రామాలు అడుతున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. అందుకే చార్జీలు పెంచేందుకు సిద్ధమయ్యారన్నారు. గురువారం ఆమె ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌పై విమర్శలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రవాణా మంత్రిగా ఆర్టీసీని అభివృద్ధి పథంలో తీసుకుపోయిన అని దొరగారు చెప్పుకునేవారని ఎద్దేవా చేశారు. సీఎం పదవిలోకి వచ్చిన తర్వాత అదే ఆర్టీసీని నష్టాలబారి నుంచి గట్టెక్కించడం చేతకావడం లేదని మం డిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు పక్కన పెట్టి టీఆర్ఎస్, బీజేపీ బూతు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. ఆ పార్టీలను రాష్ట్రం నుంచి తరిమికొడితేనే రైతులకు న్యాయం జరుగుతుందని షర్మిల అన్నారు. -
అన్నీ ఇక్కట్లే.. పెంపు తప్పట్లే.. తెలంగాణలో భారీగా ఆర్టీసీ చార్జీల మోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలు పెం చేందుకు రంగం సిద్ధమైంది. భారీగా పెరిగిన డీజిల్ ధరలు, కరోనా కష్టాలు, భారీ నష్టాల నేపథ్యంలో భారీ మొత్తంలో చార్జీలు పెంచాలని ఆర్టీసీ ప్రతిపాదించింది. ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 25 పైసల చొప్పున, మిగతా కేటగిరీ బస్సుల్లో 30 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్వయంగా రవాణా మంత్రి పువ్వాడ అజయ్ ఈ వివరాలను ప్రకటించడం గమనార్హం. అన్ని అంశాలపై కసరత్తు చేసి.. కొద్దిరోజుల కింద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్టీసీ దుస్థితిపై చర్చించారు. చార్జీల పెంపు అనివార్య మన్న అభిప్రాయానికి వచ్చారు. సమావేశంలో సీఎం చేసిన సూచనల మేరకు మేరకు చార్జీలపై ఆర్టీసీ కసరత్తు మొదలుపెట్టింది. కేబినెట్ భేటీలో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో సీఎం ప్రకటించారు. మూడు రోజుల కింద కేబినెట్ భేటీ జరిగినా.. ఈ అంశంలో స్పష్టత ఇవ్వలేదు. తాజాగా కసరత్తు పూర్తిచేసిన ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదనలను సమర్పించింది. సీఎం కేసీఆర్ వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రతిపాదనలకు ఆమోదం వస్తే.. కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. వరుసగా నష్టాలు, సమస్యలతో.. సీఎం కేసీఆర్ 2015లో ఆర్టీసీ కార్మికులకు భారీగా 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. దానితో సంస్థపై వార్షికంగా ఏకంగా రూ.850 కోట్ల భారం పడింది. దానితో ఆ తర్వాతి ఏడాది 2016 జూన్‌లో ఆర్టీసీ చార్జీలను స్వల్పంగా సవరించింది. పల్లెవెలుగులో 30 కిలోమీటర్ల వరకు ఒక రూపాయి, ఆ తర్వాత స్టేజీకి రూ.2 చొప్పున చార్జీలు పెంచారు. సుమారు 5 శాతం ధరలు పెరిగాయి. మిగతా కేటగిరీ బస్సుల్లో 10 శాతం పెంచారు. దానితో సుమారు ఏటా రూ.350 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరింది. తర్వాత 2019 అక్టోబర్‌లో 53 రోజుల సుదీర్ఘ సమ్మె, ఆర్టీసీకి తీవ్ర నష్టాల నేపథ్యంలో చార్జీలు సవరించారు. ఆ ఏడాది డిసెంబర్లో సగటున కిలోమీటర్‌కు 20పైసల చొప్పున పెంచారు. దానితో ఆర్టీసీకి సాలీనా రూ.550 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరింది. వ్యతిరేకత లేదంటూ.. ఇటీవల ఆర్టీసీ అధికారులు సంస్థ పనితీరు, ఇతర అంశాలపై ప్రజల నుంచి ఆన్లైన్లో అభిప్రా యాలు సేకరించారు. అందులో బస్సు చార్జీల పెంపు అంశాన్ని కూడా ప్రస్తావించారు. మెరుగైన వసతులు కల్పించాలని, మరిన్ని బస్సులు తిప్పాలని, సర్వీసుల ఫ్రీక్వెన్సీ పెంచాలని కోరిన ప్రజలు.. చార్జీల పెంపు అంశంపై పెద్దగా అభ్యంతరాలు తెలపలేదని అధికారులు చెప్తున్నారు. సర్వేలో అభిప్రాయాలు వెల్లడించిన వారిలో.. కేవలం 4.3 శాతం మంది మాత్రమే చార్జీల పెంపును వ్యతిరేకించారని అంటున్నారు. భారం ఎక్కువే.. రెండేళ్ల కింద కిలోమీటర్‌కు 20 పైసలు పెంచినప్పుడు ప్రజలపై రూ.550 కోట్ల భారం పడింది. ప్రస్తుత ప్రతిపాదనల మేరకు రూ.685 కోట్లు భారం పడుతుందని అధికారులు చెప్తున్నారు. కానీ ఈ భారం రూ.850 కోట్లకుపైనే ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 2019లో 100 శాతం ఆక్యుపెన్సీ లెక్కన అంచనా వేశారని.. అందువల్ల వాస్తవంగా పడిన భారం రూ.450 కోట్లలోపేనని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఈసారి కేవలం 65 శాతం ఆక్యుపెన్సీ లెక్కనే అంచనా వేశారని వివరిస్తున్నాయి. ఇక గత రెండేళ్లలో 2 వేల వరకు బస్సులు తగ్గిపోవటంతో.. ఆ మేర అదనపు ఆదాయం తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్టీసీ చార్జీలు పెంచలేదు. ఆయన మరణం తర్వాత 2010 నుంచి 2014 వరకు వరుసగా నాలుగు సార్లు చార్జీలు పెంచారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఏడేళ్లలో చార్జీలు పెంచుతుండటం మూడోసారి కానుంది. డీజిల్ భారం.. కోవిడ్ నష్టాలతో.. కరోనా లాక్డౌన్లు, ప్రయాణాలు తగ్గిపోవడంతో ఆర్టీసీకి భారీగా నష్టాలు వచ్చాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.2,600 కోట్ల వరకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.1,440 కోట్ల మేర నష్టం వచ్చినట్టు ఆర్టీసీ చెప్తోంది. మరోవైపు డీజిల్ ధరలు పెరగటంతో.. సంస్థపై రోజుకు రూ.1.8 కోట్ల అదనపు భారం పడింది. ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు చార్జీలు పెంచా లని ఆర్టీసీ కొద్దినెలలుగా ప్రభుత్వాన్ని కోరుతోంది. దీనిపై ప్రతిపాదనలు ఇవ్వాలని కొద్దిరోజుల సీఎం సూచించడంతో.. కసరత్తు పూర్తిచేసి తాజాగా మంత్రి పువ్వాడ అజయ్‌కు అందజేసింది. ఆర్టీసీని గాడిన పెట్టేందుకే.. చార్జీల పెంపుపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ టికెట్ ఆదాయంపై ఆర్టీసీ మనుగడ ఉంది. కేంద్రం డీజిల్ ధరలు పెంచడంతో ఆర్టీసీపై తీవ్ర భారం పడింది. కరోనా కారణంగా నష్టాలు వస్తున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందాలంటే ఆర్టీసీ మెరుగుపడాలి. సంస్థ మనుగడ కోసం చార్జీలు పెంచక తప్పని పరిస్థితి. ఇటీవల ఆర్టీసీ నిర్వహించిన సర్వేలో కూడా చార్జీల పెంపుపై ప్రయాణికులు పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి సమర్పించి ఆయన అనుమతితో తర్వాతి చర్యలు తీసుకుంటాం. – మంత్రి పువ్వాడ భారీగానే మోత రవాణా మంత్రి చెప్పిన మేరకు చార్జీలు పెంచితే.. సగటున ఏటా రూ.685 కోట్ల ఆదాయం అదనంగా సమకూరనుంది. కానీ చార్జీల సవరణ, సమీప ధరలకు సర్దుబాటు వంటివాటితో రూ.850 కోట్లకుపైనే భారం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏడేళ్లలో మూడోసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆర్టీసీ చార్జీలు పెంచనుండటం ఇది మూడోసారి. మొదట 2016 జూన్‌లో స్వల్పంగా చార్జీలను సవరించారు. సగటున ఆర్డినరీ పల్లెవెలుగు బస్సుల్లో 5 శాతం, మిగతా కేటగిరీల్లో 10 శాతం చార్జీలు పెరిగాయి. తర్వాత 2019 డిసెంబర్లో అన్ని బస్సుల్లో సగటున కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున పెంచారు. ఈసారి పెంపు కాస్త ఎక్కువగా ఉండనుంది. సీఎం అనుమతి వచ్చాకే..! సాధారణంగా ఎప్పుడైనా సీఎం అనుమతి వచ్చాకే ఆర్టీసీ చార్జీల పెంపు వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు. కానీ ఈసారి సీఎంకు ప్రతిపాదనలు పంపాల్సి ఉందని చెప్తూనే.. మంత్రి అధికారికంగా వివరాలు వెల్లడించారు. చార్జీల పెంపుపై ప్రజలు ఎలా స్పందిస్తారు, వివిధ వర్గాల అభిప్రాయం ఏమిటన్నది తెలుసుకునేందుకే ఇలా చేశారన్న భావన వ్యక్తమవుతోంది. -
Sajjanar: ఓ ట్విటర్ పోస్టు.. ఆర్టీసీ చార్జీలు తగ్గించింది
సాక్షి, హైదరాబాద్: అసలే నష్టాలు.. అప్పులు, కోవిడ్ సమస్యతో అతలాకుతలం.. ఇలాంటి పరిస్థితిలో ప్రతి రూపాయి ఆర్టీసీకి కీలకమే. కానీ ఓ ప్రయాణికుడు ట్విట్టర్లో పెట్టిన పోస్టుకు స్పందించిన ఆర్టీసీ.. రోజూ లక్షల్లో ఆదాయాన్ని కోల్పోయేందుకు సిద్ధమైంది. గతంలో రౌండ్ ఆఫ్ పేరిట పెంచిన అదనపు వసూళ్లను తగ్గించుకుంది. ఇప్పుడు నష్టం ఎదురైనా.. ఆర్టీసీ ప్రతిష్ట మెరుగుపడి భవిష్యత్తులో సంస్థ వైపు ప్రయాణికులు మొగ్గుచూపుతారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. చిల్లర సమస్య పేరిట.. ఇటీవల ఓ ప్రయాణికుడు బెంగుళూరు బస్సు ఎక్కాడు. టికెట్‌పై వివరాలు చూసి కంగుతిన్నాడు. టికెట్ అసలు ధర రూ.841 అని.. కానీ చెల్లించాల్సిన మొత్తం రూ.850 అని ఉండటంతో కండక్టర్‌ను నిలదీశారు. అసలు ధరను మించి రూ.9 వసూలు చేయడం ఏమిటని, ఆ మొత్తం ఎటు పోతోందని ప్రశ్నిస్తూ.. ట్విటర్లో పోస్టు పెట్టారు. ఇది ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వరకు వెళ్లింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆయన దీనిపై స్పష్టత లేక.. అధికారులను వాకబు చేశారు. టికెట్ ధరలు సవరించినప్పుడు చిల్లర సమస్య రాకుండా రౌండ్ ఆఫ్ చేసే విధానం ఉందని, దాని ప్రకారమే ఆ రూ.9 వసూలు చేశామని పేర్కొన్నారు. ఇలా అదనంగా వసూలు చేయటం వల్ల ఆర్టీసీ ప్రతిష్ట తగ్గుతుందని భావించిన ఆయన.. వెంటనే ఈ రేట్లను సవరించాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అధికారులు.. ఎక్స్‌ప్రెస్, ఆపై కేటగిరీ బస్సుల్లో రౌండ్ ఆఫ్ సొమ్మును సవరించారు. దీని ప్రకారం.. గతంలో రూ.841 నుంచి రూ.850కి పెంచిన బెంగుళూరు టికెట్ ధరను.. ఇప్పుడు రూ.840కి మార్చారు. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కనీస చార్జీ రూ.15, దీనికి సెస్ రూపాయి కలిపితే రూ.16 అవుతుంది. దీనిని చిల్లర ఇబ్బందిపేరిట రూ.20గా రౌండ్ ఆఫ్ చేసి, వసూలు చేస్తూ వచ్చా రు. తాజాగా దీనిని రూ.15కు తగ్గించారు. ఇలా అన్నిస్థాయిల్లో మార్చారు. దీనివల్ల రోజూ సగటున రూ.10 లక్షల వరకు టికెట్ ఆదాయం తగ్గిపోవడానికి కారణమైనట్టు అధికారులు చెప్తున్నారు. లక్ష్యాన్ని మించి వసూళ్లు: కొద్దిరోజులుగా ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరుగుతోంది. అందుకు అనుగుణంగా టికెట్ ఆదాయం సమకూరుతోంది. గత సోమవారం ఆర్టీసీ రూ.12.89 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.13.99 కోట్లు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. -
లాక్డౌన్లకు స్వస్తి; బస్సుకు కళ
సాక్షి, హైదరాబాద్: ఒక్కో దేశంలోని మొత్తం కరోనా కేసుల కంటే ఎక్కువగా మన దేశంలో ఒక్క రోజులోనే నమోదవుతున్న నేపథ్యంలో జనంలో భయం తగ్గిపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తమ ప్రాంతానికి రావద్దంటూ ఇంతకాలం చేపట్టిన కరోనా నిరోధక చర్యలకు పూర్తిగా స్వస్తి పలికిన జనం క్రమంగా బయటకు వచ్చేస్తున్నారు. దీంతో మార్కెట్లు దాదాపు అన్నీ తెరుచుకుని పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. ఫలితంగా రవాణా అవసరం పెరిగి బస్సులు బిజీగా మారుతున్నాయి. ఇన్ని రోజులూ తక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో పరుగులు పెట్టిన ఆర్టీసీ బస్సులు క్రమంగా కళకళలాడుతున్నాయి. నిన్న, మొన్నటి వరకు 20 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ రేషియో క్రమంగా 50 శాతానికి చేరువవుతోంది. ప్రస్తుతం 43 నుంచి 46 శాతం మధ్య నమోదవుతోంది. దీంతో రోజువారీ టికెట్ ఆదాయం కూడా పెరిగింది. పది రోజుల క్రితం వరకు రోజువారీ ఆదాయం రూ.కోటి కంటే కాస్త ఎక్కువగా ఉండేది. ఇప్పుడది సగటున రూ.3.3 కోట్లుగా నమోదవుతోంది. దీంతో ఆర్టీసీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. స్వచ్ఛంద లాక్డౌన్లకు స్వస్తి పలకటంతో.. కొన్ని రోజుల క్రితం వరకు జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులు నమోదయ్యేవి. తర్వాత నగర శివారుగా ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా ఉండేవి. క్రమంగా ఈ ప్రాంతాల్లో తగ్గుదల కనిపిస్తోంది. గతంతో పోలిస్తే సగానికంటే తక్కువ కేసులు నమోదవుతున్నాయి. అదే సయమంలో ఇతర జిల్లాల్లో భారీగా పెరిగాయి. నెలరోజుల క్రితం వరకు రెండు, మూడు చొప్పున నమోదవుతూ ఉండే సిద్దిపేట లాంటి జిల్లాల్లో ఇప్పుడు నిత్యం వందకుపైగా రికార్డవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో నిత్యం 250 వరకు కేసులు నమోదవుతున్నాయి. జిల్లాల్లోని పట్టణాలకే పరిమితం కాకుండా పల్లెటూళ్లలో కూడా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో పల్లె ప్రజల్లో కూడా స్పష్టమైన మార్పు వచ్చింది. ఇటీవలి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాని ఊళ్లు వందల్లో ఉండేవి. అక్కడ స్వచ్ఛంద లాక్డౌన్ ఆంక్షలు విధించుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి జనం రాకుండా కట్టడి చేశారు. ఎవరైనా వస్తే వారు శివారులోని నిర్ధారిత ఇళ్లలో క్వారంటైన్ పూర్తి చేసుకోవాల్సి ఉండేది. అప్పట్లో మార్కెట్లను మూసేశారు కొన్ని పట్టణాల్లో కేసులు వెలుగుచూడటంతో 10–15 రోజులపాటు మార్కెట్లను మూసేశారు. కొన్ని రకాల దుకాణాలను మార్చి, మార్చి మూసేస్తూ వచ్చారు. దీంతో పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం జనానికి లేకుండా పోయింది. ఇక హైదరాబాద్‌ను దాదాపు చాలా గ్రామాలు నిషేధించినంత పనిచేశాయి. నగరానికి ఎవరైనా వెళ్తే తిరిగి గ్రామాల్లోకి ప్రవేశం ఉండదనే అనధికారిక హెచ్చరికలు అమల్లో ఉండేవి. దీంతో బస్సెక్కేవారి సంఖ్య తగ్గిపోయింది. కొన్ని ఊళ్లకు అసలు బస్సులనే రానీయలేదు. దీంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో బాగా పడిపోయింది. ఒక్కో బస్సులో ఐదారుగురికి మించని తరుణంలో డిపో మేనేజర్లు చాలా సర్వీసులను రద్దుచేసి 40 శాతం బస్సులనే తిప్పారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కేసుల సంఖ్య పెరుగుదలకు క్రమంగా జనం అలవాటుపడిపోతున్నారు. ఫలితం గా వారిలో మునుపటి భయం తగ్గినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక స్వచ్ఛంద లాక్డౌన్లు విధించకూడదంటూ అధికారులు కూడా హెచ్చరిస్తుండటంతో పరిస్థి తి మారింది. ఇప్పుడు అన్ని పట్టణాల్లో మార్కెట్లు తెరుచుకుంటున్నాయి. జనం రాకపోకలు సాధారణ స్థితికి చేరుతున్నాయి. దీంతో ఇంతకాలం డిపోలకే పరిమితమైన బస్సులను కూడా తిప్పటం ప్రారంభించారు. ఇప్పుడు 65% బస్సులు తిరుగుతున్నాయి. రోజురోజుకూ వాటి సంఖ్య పెరుగుతోంది. ఆక్యుపెన్సీ పెరుగుతుండటంతో సర్వీసులను అధికారులు క్రమంగా పునరుద్ధరిస్తున్నారు. -
మరోసారి చార్జీలు పెంచే అవకాశం
సాక్షి, హైదరాబాద్ : గత ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ దాదాపు రూ.928 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఈసారి అది రూ. వేయి కోట్లకు మించుతుందని అప్పట్లోనే అంచనా వేశారు. తాజాగా 52 రోజుల పాటు జరిగిన సమ్మె వల్ల పరిస్థితి అంతా అస్తవ్యస్తమై ఆ నష్టం రూ.1,200 కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. అధికారులు ఇదే విషయాన్ని ఇటీవల సీఎం కేసీఆర్‌కు కూడా తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా నష్టాలు ఈస్థాయిలో నమోదు కాలేదు. అప్పట్లో గరిష్టంగా రూ.718 కోట్లుగా నమోదయ్యాయి. ఇప్పుడు ఒక్క టీఆఎస్ఆర్టీసీ నష్టాలే రూ.1200 కోట్లకు చేరుకునే స్థితి ఉత్పన్నం కావటం ఆందోళన పరుస్తున్న విషయం. పెరిగిన టికెట్ల ధరలతో రూ.850 కోట్ల మేర ఆదాయం పెరగనుంది. సమ్మె వల్ల అదనపు నష్టం నమోదై ఉండకపోతే ఆర్టీసీ స్థితి మెరుగ్గా ఉండేది. ఇప్పుడు ఆశించిన అదనపు ఆదాయం వచ్చినా నష్టాలదే పైచేయి కానుంది. మరోసారి పెంచే యోచన ప్రస్తుత టికెట్ ధరల పెంపుతో ప్రయాణికులపై భారం పడనున్నప్పటికీ, ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మరోసారి కూడా చార్జీలు పెంచే అవకాశం ఉందనిపిస్తోంది. మరో 10 % మేర ధరలను సవరిస్తే నష్టాలను వీలైనంత మేర తగ్గించుకుని బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటుందని అధికారుల అంచనా. మరో ఏడాది తర్వాత ప్రభుత్వానికి చార్జీలు పెంపుపై ప్రతిపాదించాలని యోచిస్తున్నారు. ఆర్థిక పరిస్థితిపై అంచనాకు వచ్చినందునే... సాధారణంగా ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు అనగానే ఇటు ప్రజలతోపాటు అటు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు భగ్గుమనటం సహజం. ఈసారి ఆ స్థాయిలో నిరసనలు లేవు. సమ్మె వల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డ జనం, నిరసనల్లో ఆర్టీసీ కార్మికులు చెప్పిన మాటలతో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై ఓ అంచనాకొచ్చినట్టు కనిపిస్తోంది. బస్సు చార్జీలు పెంచితే తప్ప పరిస్థితి చక్కబడదన్న మాటలు ప్రభావం చూపినట్టు కనిపిస్తోంది. ఇక రాజకీయ పార్టీలు కొన్ని విమర్శలు చేసినా .. నిరసనల వరకు వెళ్లకపోవటం గమనార్హం. బస్సు చార్జీల పెంపు వల్ల ఇతర వస్తువుల ధరలు కూడా భగ్గుమంటాయన్న ఆందోళన జనంలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కూరగాయలను బస్సుల్లో తరలిస్తుంటారు. చార్జీల మోతతో వాటి ధరలు కూడా పెంచుతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
సిటీ బస్సు ఆదాయం రూ.324 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చార్జీల పెంపు ప్రభావం హైదరాబాద్‌పై భారీగానే పడనుంది. ప్రస్తుతం ఆర్టీసీకి వస్తున్న నష్టాల్లో సగం వాటా సిటీవే ఉంటున్నాయి. ఆ నష్టాలను వీలైనంత మేర తగ్గించేందుకు కసరత్తు మొదలైన తరుణంలో, చార్జీల పెంపు ఆర్టీసీకి బాగానే కలిసి రానుంది. కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచగా, శాతాల్లో అది 18.80 శాతంగా ఉండనుంది. కానీ సిటీ సర్వీసుల వరకు వచ్చేసరికి అది 23 శాతంగా ఉంటోంది. కిలోమీటర్ల లెక్క కాకుండా సిటీలో స్టాపుల ప్రాతిపదికగా ఛార్జీ ల పెంపు ఉంది. పైగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బ స్సులకు రూ.5గా ఉన్న కనిష్ట ఛార్జీని రూ.20కి పెంచారు. నగరంలో ఉన్న బస్సుల్లో వీటి సం ఖ్యే ఎక్కువగా ఉండటం, ప్రయాణికుల సం ఖ్య కూడా వీటిల్లోనే ఎక్కువగా ఉంటుండటం తో ఈ మార్పు కూడా కలిసి రానుంది. వెరసి.. తాజా రేట్ల సవరణతో సిటీ సర్వీసులకు సం బంధించి వార్షికంగా రూ.324 కోట్ల మేర ఆదా యం వస్తుందని అధికారులు అంచనా. సమ్మె ప్రారంభం కావటానికి ముందు నగరంలో టికె ట్ రూపంలో రోజువారీ ఆదాయం సగటున రూ.3.06 కోట్లుగా ఉంది. çసమ్మె నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ వాహనాలను ఆశ్రయించారు. ఇప్పుడు తిరిగి బస్సులు మొ దలైనందున వారంతా సిటీ బస్సుల్లోనే ఎక్కుతారని అంచనా. ఈ ఆదాయం అలాగే ఉంటే టికెట్ల ధరల సవరణ వల్ల నెలవారీ ఆదాయం రూ.27 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నెలకు సిటీలో రూ.45 కోట్ల మేర నష్టం వస్తోంది. తాజాగా సమకూరే అదనపు ఆదాయంతో ఆ నష్టం మొత్తాన్ని రూ.18 కోట్లకు తగ్గించే అవకాశం కనిపిస్తోంది. -
ఆర్టీసీ అందోళనలో బీజేపీ నేతలు పాల్గొంటారు
-
ఉధృతంగా ఆర్టీసీ సమ్మె..
-
ఆర్టీసీ సమ్మెపై విచారణ 15కు వాయిదా
-
తెలంగాణ ఆర్టీసీ సమ్మె
-
ప్రభుత్వ బెదిరింపులకు భయపడం
-
3వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె
-
విలీనం లేదు.. చర్చల్లేవ్.. లొంగే ప్రసక్తే లేదు..
-
ప్రభుత్వ చర్యలే సమ్మెకు వెళ్లేలా చేశాయి
-
రవాణాశాఖలో స్తంభించిన సేవలు
జిల్లా రవాణా శాఖ కార్యాలయం అస్తవ్యస్తంగా తయారైంది. సేవలు స్తంభించడంతో వివిధ పనులపై ఆఫీస్‌కు వచ్చిన ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోజూ తిరగలేక.. ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆర్టీఏలో ఇటీవలి వరకు ఏజెంట్ల హవా కొనసాగగా.. తాజాగా ఓ సంఘం నేత జోక్యంతో గందరగోళంగా మారింది . తమ మీదకు ఏం వస్తుందో.. ఏం జరుగుతుందోననే భయంతో పలువురు ఉద్యోగులు సెలవులపై వెళ్లారు. దీంతో వాహన రిజిస్ట్రేషన్లలో ఆటంకంతోపాటు లైసెన్స్‌ల జారీ కూడా తూతూమంత్రంగానే సాగుతోంది. ఫిట్నెస్, తనిఖీల వంటి పనులన్నీ స్తంభించాయి. సాక్షి, మెదక్: రవాణా శాఖలో ప్రస్తుతం ఆన్లైన్ ద్వారానే కార్యకలాపాలు సాగుతున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఇతరత్రా పనులు కావాలంటే ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇదంతా సులువు కాదు.. ఈ నేపథ్యంలో వాహనదారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న వారు వివిధ పనుల నిమిత్తం ఆర్టీఓ కార్యాలయానికి వచ్చే వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. మెదక్‌లో ఇటీవల వరకు ఏజెంట్ల హవా కొనసాగింది. వారు ఆడిందే ఆట.. పాడిందే పాట. ఎవరైనా సరే వారు చెప్పిన మొత్తం కట్టాల్సిందే. లేదంటే వారి పని ఒక అడుగు కూడా ముందుకు పడదు. ఉదాహరణకు ఫోర్ వీలర్ వాహన రిజిస్ట్రేషన్ డైరెక్ట్‌గా అయితే రూ.2 వేలు అవుతుంది. అదే ఏజెంట్ల వద్ద రూ.8 వేల వరకు అప్పజెప్పాల్సిందే. ఎలాంటి పత్రం లేకున్నా అధికారులతో కుమ్మక్కు కావడంతో ఫైల్ ముందుకు కదలడంతోపాటు చకచకా పని పూర్తవుతుంది. సదరు వాహన యజమాని డైరెక్ట్‌గా ఆర్టీఏ కార్యాలయానికి పోతే ఈ పత్రం లేదు.. అది కరెక్ట్‌గా లేదంటూ తిప్పి పంపడం మామూలు విషయం. వాహనదారులు ఏజెంట్లను ఆశ్రయించక తప్పని పరిస్థితి. ఈ క్రమంలో ఏజెంట్లు ఒక్కటై అధికారులు, సిబ్బందికో రేటు ఫిక్స్ చేసి ప్రజలను నిలువునా దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ సంఘం నేత బెదిరింపులతో.. మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఒక సంఘం నేతగా చెప్పుకొంటూ ప్రభుత్వ శాఖల అధికారులు, కాంట్రాక్టర్లను బ్లాక్‌మెయిలింగ్ చేసి డబ్బులు గుంజేవాడు. ఈ క్రమంలో సంఘం నుంచి అతడిని వెలివేశారు. ఆ తర్వాత ఆయన కన్ను రావాణా శాఖపై పడింది. మెదక్ ఆర్టీఓ కార్యాలయం వద్ద ఏజెంట్ల కార్యకలాపాలు.. వ్యవహారాలపై దృష్టి సారించారు. అందులో జరుగుతున్న అవినీతి, అధికారులు, సిబ్బందికి అందుతున్న ముడుపులపై రవాణా శాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు.. స్థానిక అధికారులు, సిబ్బందిపై ఇటీవల ఒత్తిడి పెంచడంతో వారు కలవరానికి గురయ్యారు. ఈ క్రమంలో సమస్య పరిష్కారానికి ఏదో ఒకటి చేయండని ఏజెంట్లకు అధికారులు సూచించారు. ఏజెంట్లందరూ సమావేశమై కొంత మొత్తాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆ తర్వాత సదరు సంఘం నాయకుడికి తమ ఆఫర్‌ను తెలపగా సరిపోదని, పెంచాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఈ పంచాయితీ తెగకపోవడంతో ఏజెంట్లు తమ దందాను నిలిపివేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎటుపోయి ఎటు వస్తుందోనన్న భయంతో ఆర్టీఓ కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు సెలవుల్లోకి వెళ్లారు. విధుల్లో డీటీఓ, క్లర్క్ మాత్రమే.. ఆర్టీఓ కార్యాలయానికి రోజుకు రిజిస్ట్రేషన్లు, లైసెన్స్‌లు, రెన్యూవల్స్, పేరు మార్పిడి వంటి వివిధ పనులకు వందలాది మంది వస్తుంటారు. ఆర్టీఓ కార్యాలయంలో డీటీఓ, ఇద్దరు ఎంవీఐలు, ఇద్దరు ఏఎంవీఐలు, ఒక ఏఓ, ఇద్దరు యూడీసీలు, ఇద్దరు జూనియర్ క్లర్క్స్ ఉండాలి. ప్రస్తుతం డీటీఓ, ఒక క్లర్క్ మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం సరిపోనూ సిబ్బంది లేకపోవడంతో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వాహనదారులు రోజుల తరబడి ఆర్టీఓ కార్యాలయానికి చక్కర్లు కొడుతూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణచార్జీ లు భారం కావడంతో ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొం టున్నారు. ప్రస్తుతం అంతంత మాత్రమే.. వాహన లైసెన్స్, రిజిస్ట్రేషన్లకు సంబంధించి రోజుకు సమారు 150 చొప్పున మొత్తం 300 స్లాట్లు బుక్ అవుతున్నాయి. పూర్తి స్థాయిలో వాహనదారులు రాకున్నా.. సుమారు 150 నుంచి 175 మంది వరకు వచ్చేవారు. వాటిని ఆర్టీఏ అధికారులు క్లియర్ చేసేవారు. ప్రస్తుతం 50 నుంచి 70 వరకు మాత్రమే క్లియర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రక్షాళన చేయాలి.. ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్లు, లైసెన్స్‌ల వంటి ప్రక్రియకు సంబంధించి సామాన్యులకు అవగాహన అంతంతే. పాత కాలం నాటి అధికారులు, సిబ్బందికి సైతం పూర్తి స్థాయిలో అవగాహన లేదు. ఈ క్రమంలో వాహనదారులతో పాటు ఆర్టీఓ అధికారులు ఏజెంట్లపై ఆధారపడాల్సి వస్తోంది. దళారుల నుంచి రోజువారీగా మామూళ్లు అందుతుండడంతో అవినీతికి అలవాటు పడ్డ అధికారులు ఏజెంట్ల వ్యవస్థ రద్దయినప్పటికీ వారి వైపే మొగ్గుచూపుతున్నారు. మెదక్‌లో ప్రస్తుతం ఏజెంట్లు రాకపోవడంతో సేవలు స్తంభించడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా కలెక్టర్, ఆ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రక్షాళన చేయాలని వాహనదారులు కోరుతున్నారు. తిప్పుకొంటున్నారు.. టాటా ఏస్ వాహన రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి వచ్చా. ఏజెంట్ దగ్గరికెళ్తే రూ.8 వేలు అడిగాడు. రూ.2 వేలకు అయ్యే పనికి అంత అడిగాడు. అన్ని డబ్బులు ఇచ్చే స్థోమత లేకపోవడంతో నేనే నేరుగా చేసుకునేందుకు సిద్ధమైన. అధికారులు ఇది లేదని.. అది లేదని అంటున్నారు. ప్రతి చిన్న పొరపాటును చూపుతూ తిప్పుకొంటున్నారు. వేరే వారు ఏజెంట్ నుంచి వస్తే.. ఏమీ చూడకుండానే ఓకే చేశారు. – నాగరాజు, కొంత్వాన్పల్లి -
ఆర్టీసీకి నకిలీ నోట్ల బెడద
ఇబ్రహీంపట్నం: ఆర్టీసీని నకిలీ నోట్ల బెడద వెంటాడుతోంది. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ బస్సుల్లో ఈ నోట్ల చలామణి ఎక్కువగా జరుగుతోంది. సంతరోజైన బుధవారం జనాల రద్దీ మార్కెట్లో ఎక్కువగా ఉంటుంది. బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసి ఉంటారు. ఇదే అదనుగా భావించి కేటుగాళ్లు కండక్టర్లకు నకిలీనోట్లు ఇస్తున్నారు. ప్రయాణికుల రద్దీతో నోట్లను సరిగా గమనించని కండక్టర్లు వారికి టికెట్లను ఇచ్చి తిరిగి చిల్లర డబ్బులను ఇస్తున్నారు. డ్యూటీ దిగి డిపోలోని క్యాష్ కౌంటర్లో డబ్బులను కండక్టర్లు ముట్టజెప్పి వెళ్తున్నారు. ఆ తర్వాత డిపో క్యాష్ క్లర్క్ డబ్బులను లెక్కించే క్రమంలో ఈ నకిలీ నోట్లు బయటపడుతున్నాయి. బుధ, గురువారల్లో ఈ నోట్ల అధికంగా వస్తున్నట్లు డిపో అధికారి ఒకరు తెలిపారు. ఒకే సిరీస్ నంబర్‌తో మూడు నాలుగు నోట్లు వచ్చినట్లు చెప్పారు. అదేవిధంగా రద్దీగా ఉండే పాన్‌షాపుల్లో కూడా ఈ నోట్లు వస్తున్నట్లు ఓ యాజమాని తెలిపారు. ఓరిజనల్ నోట్లను పోలీనట్లుగానే ఉండటంతో ఈ నోట్లను వెంటనే గుర్తించడం ఇబ్బందిగా మారింది. నకిలీనోట్లు వస్తున్నాయి ఆర్టీసీ బస్సుల్లో నకిలీ నోట్లు వస్తున్నాయి. రద్దీగా ఉండే బస్సుల్లోనే దుండగులు నకిలీ నోట్లను విడిపిస్తున్నారు. బుధ, గురువారల్లో ఇవి ఎక్కువ వస్తున్నాయి. క్యాష్ కౌంటింగ్ మిషన్‌కు కూడా ఈ నోట్లు చిక్కడం లేదు. బ్యాంకుకు వెళ్తే ఫెక్ నోట్ అంటూ చెబుతున్నారు. – యాదయ్య, ఆర్టీసీ డిపో క్లర్కు -
నష్టాలతో నడుస్తున్న టీఎస్ ఆర్టీసీ
-
ప్రగతి చక్రం !
సాక్షి, హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఆదాయ ఆర్జనలో వరంగల్ రీజియన్ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 11 రీజియన్లు ఉండగా.. ఒక్క వరంగల్ రీజియన్ మాత్రమే లాభాల్లో ఉండడం విశేషం. గత ఆర్థిక సంవత్సరంలోని సెప్టెంబర్ మాసం వరకు వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో అర్ధ సంవత్సరం సెప్టెంబర్ నాటికి రూ.18.62 కోట్ల లాభంతో ముందంజలో ఉంది. వరంగల్ రీజియన్ పరిధిలో నిత్యం 980 బస్సులు రోజుకు 3.80 లక్షల కిలో మీటర్లు దూరం తిరగడం ద్వారా రోజుకు రూ.కోటికి పైగా ఆదాయం సంపాదిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం అర్థ సంవత్సరం (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్) వరకు ఆర్టీసీ రూ.3 కోట్ల నష్టంలో ఉంది. దీన్ని అధిగమించడంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నాటికి రూ.18.62 కోట్ల లాభంతో రాష్ట్రంలోనే వరంగల్ రీజియన్ ఎవరికీ అందనంత దూరంలో పరుగులు పెడుతోంది. మహబూబాబాద్ మినహా అన్ని డిపోలు లాభాల్లోకి.. ఆర్టీసీ వరంగల్ రీజియన్ పరిధిలో తొమ్మిది డిపోలు ఉన్నాయి. ఒక్క మహబూబాబాద్ మినహా మిగతా ఎనిమిది డిపోలు లాభాల్లోకి వచ్చాయి. మహబూబాబాద్ డిపో గత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నాటికి రూ.3 కోట్ల నష్టంలో ఉండగా ఈ దఫా రూ.2.59 కోట్ల అధనపు ఆదాయాన్ని సంపాదించి నష్టాన్ని రూ.41 లక్షలకు తగ్గించుకుంది. తొర్రూరు, భూపాలపల్లి, నర్సంపేట, జనగామ, వరంగల్–1, పరకాల, వరంగల్–2, హన్మకొండ డిపోలు లాభాల బాటలో నడుస్తున్నాయి. తొర్రూరు డిపో రూ.90 లక్షల నష్టాల్లో నుంచి రూ.4.13 కోట్ల లాభాల్లోకి చేరుకుంది. వరంగల్–2 డిపో రూ.1.20 కోట్లు, భూపాలపల్లి డిపో రూ.3.4 కోట్ల లాభాల్లో ఉంది. వరంగల్–1 డిపో రూ.6.50 కోట్లు, వరంగల్–2 , నర్సంపేట డిపోలు రూ.1.3 కోట్ల చొప్పున, జనగామ డిపో రూ.1.5 కోట్లు, పరకాల డిపో రూ.50 లక్షలు, హన్మకొండ డిపో రూ.5 లక్షల లాభాల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో మన డివిజన్లే.. లాభాలకు సంబంధించి వరంగల్ రీజియన్‌లోని రెండు డివిజన్లు రాష్ట్రంలో తొలి రెండు స్థానాల్లో నిలవడం విశేషం. లాభాల్లో వరంగల్ రూరల్ డివిజన్ తొలిస్థానంలో నిలవగా.. వరంగల్ అర్బన్ డివిజన్ రెండో స్థానంలో ఉంది. వరంగల్ రూరల్ డివిజన్ గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నాటికి అర్ధ వార్షికోత్సవంలో రూ.6 కోట్ల నష్టం నుంచి రూ.9 కోట్ల లాభాల్లోకి వచ్చింది. వరంగల్ అర్బన్ రూ.4 కోట్ల నుంచి రూ.9 కోట్ల లాభాల్లోకి చేరుకుంది. వరంగల్ రూరల్ డివిజన్ రూ.కోట్ల నష్టాన్ని పూడ్చుకుని అదనంగా రూ.14 కోట్ల ఆదాయాన్ని రాబట్టుకుని రూ.9 కోట్ల లాభాలతో రాష్ట్రంలో అగ్రభాగంలో నిలిచింది. ముందంజలో ఏడు డిపోలు.. వరంగల్ రూరల్ డివిజన్ పరిధిలో పరకాల, నర్సంపేట, భూపాలపల్లి, మహబూబాబాద్, తొర్రూరు డిపోలున్నాయి. వరంగల్ అర్బన్ డివిజన్ పరిధిలో వరంగల్–1, వరంగల్–2, హన్మకొండ, జనగామ డిపోలున్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం సాధించే మొదటి పది డిపోలలో వరంగల్ రీజియన్‌కు చెందిన ఏడు డిపోలు ముందు భాగంలో ఉన్నాయి. తొర్రూరు డిపో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా.. భూపాలపల్లి డిపో ద్వితీయ స్థానంలో ఉంది. అ తర్వాత వరుసగా నర్సంపేట, జనగామ, వరంగల్–1, పరకాల, వరంగల్–2 డిపోలు ఉన్నాయి. సంస్కరణలు, సమష్టి కృషే కారణం వరంగల్ రీజినల్ మేనేజర్‌గా తోట సూర్యకిరణ్ వచ్చిన రెండేళ్ల కాలంలో రీజియన్‌లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. డ్రైవర్లకు గుర్తింపు తీసుకొచ్చేలా డ్రైవర్స్ డే నిర్వహించారు. కండక్టర్, డ్రైవర్ సమన్వయంగా ఉండేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అద్దె బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. అద్దె బస్సు యజమానులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తూ, అద్దె బస్సు డ్రైవర్లకు ప్రశంసపత్రాలు అందజేస్తూ ప్రోత్సహించారు. కార్మికులు, ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు ఇచ్చి ఉద్యోగ, కార్మిక వర్గాల్లో ఉత్సాహం నింపారు. ఉద్యోగులు, కార్మికులకు సకాలంలో ఇంక్రిమెంట్లు ఇస్తూ, అద్దె బస్సుల యజమానులకు సమయానికి చెల్లింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ రీజియన్‌లో కార్మికులు, ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పని చేసి లాభాల బాటలోకి తీసుకొచ్చారు. గత ఏడాది 40 వేల పాస్‌లు జారీ చేయగా ఈ ఏడాది 80 వేల విద్యార్థి పాస్‌లు జారీ చేసి విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులను ఆర్టీసీ బస్సులో ప్రయాణించేలా చేశారు. ప్రతి నెలా ఉద్యోగులు, కార్మికులు రిటైర్ అవుతున్నా.. కొత్తగా నియామకాలు చేపట్టకుండా.. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు, కార్మికులతో పని చేయించుకుంటూ రీజియన్‌ను లాభాల బాటల్లోకి తీసుకురావడంలో కృషి చేశారు. ఈ ఏడాది 320 కొత్త బస్సులను ప్రవేశ పెట్టారు. 180 ఆర్టీసీ సొంత బస్సులు కాగా.. 150 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకొచ్చారు. బెంగళూర్‌కు 3 నుంచి 5 బస్సులకు పెంచారు. దీంతో పాటు విశాఖపట్నం, మచిలీ పట్నం, శ్రీశైలానికి అదనంగా.. పుట్టపర్తికి కొత్తగా బస్సులు ప్రవేశ పెట్టారు. దీంతో పాటు అధికారులు, ఉద్యోగులు సమష్టిగా పని చేసి అతి పెద్ద విజయం సాధించారు. అందరికి ఆదర్శంగా నిలిచారు. -
ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం
యాదగిరిగుట్ట (ఆలేరు) : ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం సాధ్యమని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఉమ్మడి జిల్లా డిపో మేనేజర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీలో మెరుగైన సౌకర్యాలు కల్పిండానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని తెలిపారు. సురక్షిత ప్రయాణం ఆర్టీసీలోనేనని పతి ఒక్క ప్రయాణికుడికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత డిపో మేనేజర్లకు ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి మండలంలో జరిగే జనరల్ బాడీ సమావేశానికి డిపో మేనేజర్లు వెళ్లాలని ఆదేశించారు. ఆర్టీసీకి సీఎం కేసీఆర్‌రూ.1000కోట్ల బడ్జెట్ ఇచ్చారన్నారు. ఈ బడ్జెట్‌తో గతేడాది రూ.66కోట్లతో 1400బస్సులు, ఈ సారి రూ.75కోట్ల బడ్జెట్లో 1100బస్సులు కొత్తవి నడుపుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో 230 మినీ బస్సులు తిప్పుతున్నామని, ఇందులో వందకు పైగా ఎసీ బస్సులున్నాయని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు కూడా 8బస్సులు ఇచ్చినట్లు తెలిపారు. 97 డిపోల్లో 27వరకు లాభాలు వస్తున్నాయని, నష్టాల్లో ఉన్న 49 డిపోలను సగానికి పైగా లాభాలకు తీసుకువచ్చామని, పూర్తిగా నష్టాల్లో ఉన్న డిపోలను కూడా లాభాల బాటలోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. బస్సు, డ్రైవర్లకు ఇబ్బందికరంగా ఉన్న నిరుపేదలకు ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి..ఆ జిల్లాలో బస్సులు వేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలకు సేవలు అందించే పల్లె వెలుగు బస్సులు భారీగా నష్టాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోకు 34కొత్త బస్సులు కావాలని అడిగారు. యాదాద్రి నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సు సర్వీసులు వెళ్లడం సంతోషకరమన్నారు. యాదగిరిగుట్టకు మినీ బస్సులు వేయాలని మంత్రిని ఆమె కోరారు. సమావేశంలో రిజినల్ కో ఆర్డినేటర్ సువర్ణరెడ్డి, భువనగిరి ఆర్డీఓ భూపాల్‌రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ కాలే సుమలత, ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, ఆర్టీసీ ఓఎస్డీ కృష్ణకాంత్, నల్లగొండ, సూర్యాపేట డీవీఎంలు మధుసూదన్, ఎంఆర్‌సీరెడ్డి, డిపో మేనేజర్ రఘు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి స్వామివారిని దర్శించుకున్నారు. -
ఊరికి బస్సు సౌకర్యం కావాలని..
-
ఆర్టీసీకి పెరిగిన ఆదాయం
వనపర్తి టౌన్: ఆర్టీసీకి సంక్రాంతి పండగ కలిసి వచ్చింది. వారం రోజులనుంచి వివిధ రూట్లలోబస్సులను నడిపిస్తుండటంతో మంచి ఆదాయం సమకూరింది. వరుసగా మూడ్రోజులనుంచైతే ఆర్టీసీ బస్టాండులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈనెల 10వ తేదీ నుంచి సాధారణ రోజులకంటే అదనంగా రూ.5లక్షల ఆదాయం వచ్చింది. ప్రతిరోజు 35వేల కి.మీ తిరిగే ఆర్టీసీ బస్సులు పండగ సందర్భంగా 39.40వేల కి.మీలు తిరుగుతన్నట్లు డీఎం రామయ్య తెలిపారు. అత్యధికంగా హైదరాబాద్ రూట్లో ప్రయాణికుల రాకపోకలు కనిపించాయి. అవసరానికి తగ్గట్టుగానే మహబూబ్‌నగర్, కర్నూల్, ఇతర ప్రాంతాలకు బస్సులను అందుబాటులో ఉంచారు. వసల వెళ్లిన వారికోసం ముంబాయి, విజయవాడ ప్రాం తాలకు కూడా బస్సుల సంఖ్యను పెంచారు. పండగ ముగిసిన తర్వాత కూడా ఇదేస్థాయిలో బస్సులను నడిపిస్తామని డీఎం తెలిపారు. రోజుకు 43వేల మంది ప్రయాణికులు వనపర్తి నుంచి రాకపోకలు సాగించారని ఆర్టీసీ అధికారుల అంచనా. ఈనెల 11వ తేదీన రూ.15.6 లక్షలు సమకూరగా, 12వ తేదీన రూ.15.61 లక్షలు, 13న రూ.15.70 లక్షల ఆదాయం వచ్చింది. -
కస్సు‘బస్సు’!
సమీప బస్టాప్‌ల మధ్య ప్రయాణానికి నో ఎంట్రీ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కండక్టర్ల నిర్వాకం పైగా అవమానిస్తూ.. దింపేస్తూ.. ఇష్టారాజ్యంగా సిబ్బంది తీరు కండక్టర్ల తీరు చట్టవిరుద్ధమన్న ఆర్ఎం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంస్థను లాభాల బాట పట్టించేందుకు.. ‘చెయ్యి ఎత్తిన చోట బస్సు ఆపుతాం.. ప్రయాణికులు కోరిన చోట దింపుతాం’.. అనే నినాదాన్ని ఎత్తుకుంది ఆర్టీసీ. కానీ కొందరు కండక్టర్ల తీరు అందుకు భిన్నంగా ఉంది. తక్కువ దూరం ప్రయాణించే వారిని ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అనుమతించడం లేదు. పైగా గొడవపడుతున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ.. అవమానిస్తూ మధ్యలోనే బలవంతంగా దింపేస్తున్నారు. వృద్ధులు, మహిళలు, చంటిపిల్లలు ఉన్నారనే కనీస గౌరవం కూడా లేకుండా నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ఆర్టీసీ అద్దె బస్సుల్లో ఇలాంటి పరిస్థితి కన్పిస్తుంది. హైదరాబాద్ నుంచి బీదర్ వయా జహీరాబాద్ మార్గంలో ఆర్టీసీ బస్సుల్లో రోజుకు వేలాది మంది ప్రయాణిస్తుంటారు. సంగారెడ్డి వరకు హైదరాబాద్ సిటీతో కలిసి ఉండటంతో ఇక్కడి ఉద్యోగులు, వ్యాపారులు నిత్యం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తుంటారు. సిటీ నుంచి జిల్లా ప్రవేశంలోని రామచంద్రాపురం, పటాన్చెరు, సంగారెడ్డి సదాశివపేట, బుదేరా చౌరస్తా, కోహిర్ చౌరస్తా, జహీరాబాద్ తదితర చోట్ల ఎక్స్‌ప్రెస్ బస్ స్టాప్‌లు ఉన్నాయి. నిబంధనల ప్రకారమైతే ప్రయాణికులు పై బస్టాండ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. కానీ కండక్టర్లు ఆ నిబంధనలు పాటించడం లేదు. హైదరాబాద్ నుంచి రామచంద్రాపురం, పటాన్చెరు, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో దిగాలి అనుకునే వారిని బస్సుల్లో ఎక్కించుకోవడం లేదు. తెలియక బస్సు ఎక్కిన వారిని బలవంతంగా దింపేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారి పట్ల మొరటుగా ప్రవర్తిస్తున్నారు. సిటీ బస్సుల్లో రావాలని ఉచిత సలహా ఇస్తున్నారు. ఇటీవల ఇద్దరు పసి పిల్లలతో ఓ కుటుంబం ఎంజీబీఎస్‌లో జహీరాబాద్ డిపో బస్సు ఎక్కారు. బీహెచ్ఈఎల్ టికెట్ అడిగారు. సాధారణంగా కండక్టర్లు నాంపల్లి, లక్డీకాపూల్ ప్రాంతాలకు చేరుకున్న తరువాత టికెట్ ఇవ్వడం మొదలు పెడతారు. బీహెచ్ఈఎల్ వరకు టికెట్ అడిగిన కుటుంబానికి కండక్టర్ టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. దాదాపు కిలో మీటర్ దూరానికిపైగా వారితో గొడవపడి చివరకు ఖైరతాబాద్ చౌరస్తాలో బలవంతంగా దింపేశారు. తాజాగా శనివారం జహీరాబాద్‌కు డిపోకే చెందిన 1931 సరీస్ నంబర్ బస్సులో రఘురామయ్య అనే సీనియర్ సిటిజన్ ఎక్కాడు. బీహెచ్ఈఎల్ వరకు టికెట్ అడగ్గా కండక్టర్ నిరాకరించి, ఆయనతో గొడవకు దిగారు. వెనుక సిటీ బస్సులో రావాలంటూ ఆయన్ను ముందుకు తోసేందుకు ప్రయత్నించాడని బాధితుడు ‘సాక్షి’తో వాపోయారు. తాను సీనియర్ సిటిజన్ అని రఘురామయ్య చెప్పే ప్రయత్నం చేయగా.. వెటకారంగా మాట్లాడి మధ్యలోనే దింపేసినట్టు బాధితుడు పేర్కొన్నారు. ఇక జహీరాబాద్ నుంచి కోహిర్ చౌరస్తా, బుదేరా వరకు ప్రయాణించాలనుకున్న ప్రయాణికులకు కూడా ఇదే చేదు అనుభవం ఎదురవుతోంది. పల్లె వెలుగు బస్సుల్లో రావాలంటూ వారికి ఉచిత సలహాలిస్తున్నట్టు పలువురు బాధిత ప్రయాణికులు చెబుతున్నారు. సొంత నిర్ణయాలొద్దు.. ఆర్టీసీ కండక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రయాణికులు ఎక్కడైనా ఎక్కుతారు. ఇష్టం వచ్చిన చోట దిగుతారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించి, దగ్గరి స్టాప్‌లో దిగాలనుకునే వారిని ఎక్కించుకోవద్దనే నిబంధనలు ఏమీ లేవు. కండక్టర్లు సొంత నిర్ణయాలు తీసుకొని బలవంతంగా దింపేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం. ఎక్కడ ఆపినా ఎక్కించుకొని, కోరిన చోట దింపాలనేది ఆర్టీసీ పాలసీ. - టి.రఘునాథ్‌రావు, ఆర్ఎం, టీఎస్ ఆర్టీసీ మెదక్