వనపర్తి టౌన్: ఆర్టీసీకి సంక్రాంతి పండగ కలిసి వచ్చింది. వారం రోజులనుంచి వివిధ రూట్లలోబస్సులను నడిపిస్తుండటంతో మంచి ఆదాయం సమకూరింది. వరుసగా మూడ్రోజులనుంచైతే ఆర్టీసీ బస్టాండులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈనెల 10వ తేదీ నుంచి సాధారణ రోజులకంటే అదనంగా రూ.5లక్షల ఆదాయం వచ్చింది. ప్రతిరోజు 35వేల కి.మీ తిరిగే ఆర్టీసీ బస్సులు పండగ సందర్భంగా 39.40వేల కి.మీలు తిరుగుతన్నట్లు డీఎం రామయ్య తెలిపారు. అత్యధికంగా హైదరాబాద్ రూట్లో ప్రయాణికుల రాకపోకలు కనిపించాయి.
అవసరానికి తగ్గట్టుగానే మహబూబ్‌నగర్, కర్నూల్, ఇతర ప్రాంతాలకు బస్సులను అందుబాటులో ఉంచారు. వసల వెళ్లిన వారికోసం ముంబాయి, విజయవాడ ప్రాం తాలకు కూడా బస్సుల సంఖ్యను పెంచారు. పండగ ముగిసిన తర్వాత కూడా ఇదేస్థాయిలో బస్సులను నడిపిస్తామని డీఎం తెలిపారు. రోజుకు 43వేల మంది ప్రయాణికులు వనపర్తి నుంచి రాకపోకలు సాగించారని ఆర్టీసీ అధికారుల అంచనా. ఈనెల 11వ తేదీన రూ.15.6 లక్షలు సమకూరగా, 12వ తేదీన రూ.15.61 లక్షలు, 13న రూ.15.70 లక్షల ఆదాయం వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment